breaking news
ramprasad reddy
-
ఒంటిమిట్టలోనూ అరాచకమే...!
ఎలాగైనా గెలవాలన్న కుతంత్రం... అడ్డదారులను ఎంచుకుని రాద్ధాంతం... అధికారాన్ని ఆయుధంగా చేసుకుని స్వైరవిహారం... యథేచ్ఛగా అక్రమం... ఇదీ కూటమి ప్రభుత్వం ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చేసిన అరాచకీయం..! ఇందుకోసం సాక్షాత్తు రాష్ట్ర మంత్రి హోదాలోని వ్యక్తే బరితెగించారు. ఈ తతంగమంతా కళ్లెదుటే జరుగుతున్నా ఏమీ చూడనట్లు అధికారులు, పోలీసు యంత్రాంగం మౌనంంగా ఉంది. సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అనుచరగణంతో హల్చల్ చేశారు. దౌర్జన్యకాండకు తెరలేపారు. మంత్రిని చూడగానే టీడీపీ శ్రేణులు, వారివెంట వచ్చిన రౌడీ మూకలు రెచ్చిపోయాయి. బూత్‌లలోకి ప్రవేశించి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులకు దిగాయి. బూత్‌ల నుంచి బయటకు ఈడ్చి వేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇదంతా మంత్రి సమక్షంలోనే జరిగింది. ఆయన బూత్‌లలోకి వెళ్తుండడాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ, అధికార బలం దానికి పోలీసుల పూర్తి సహకారం తోడవడంతో ఏమీ చేయలేకపోయారు. ఒంటిమిట్టలో ఉదయం 9.30 వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇలాగైతే టీడీపీకి ఓటమి తప్పదని మంత్రి భావించారు. ఒంటిమిట్ట జెడ్పీ హైస్కూల్లోని బూత్‌లోకి ప్రవేశించి వైఎస్సార్సీపీ ఏజెంట్‌ను స్వయంగా లేపి బయటికి పంపారు. మంత్రి అనుచరులు మిగిలినవారినీ పంపించేస్తూ టీడీపీ ఏజెంట్లను మాత్రమే కూర్చోబెట్టారు. చిన్నకొత్తపల్లె గ్రామంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా 300 మందితో వచ్చి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన గ్రామస్తుడు, వైఎస్సార్సీపీ కార్యకర్త వల్లెపు సుబ్బయ్యపై మంత్రి దాడి చేయించారు. పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యారు. మండలంలోని 30 కేంద్రాల్లో మంత్రి అనుచరులు దగ్గరుండి ఓట్లు వేసుకున్నారని స్థానికులు తెలిపారు.మంటపంపల్లెలో చెలరేగిన పచ్చమూకఒంటిమిట్ట నుంచి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మంటపంపల్లె వెళ్లగా టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు తోసేశాయి. ఇది తెలిసి వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నేతలు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నేతలు పులి సునీల్‌కుమార్, షఫీ నేరుగా మంటపంపల్లె చేరుకున్నారు. గట్టిగా నినాదాలు చేస్తూ మంత్రిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఇది చూసి చేసేదేమీ లేక మంత్రి వెళ్లిపోయారు. కానీ, అప్పటికే బూత్‌లో దొంగ ఓట్ల పరంపర కొనసాగింది. ఇలా మంత్రి వెళుతున్న ప్రతి చోటికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లి అడ్డుకున్నారు. ఇదంతా జరుగుతున్న తరుణంలోనే వైఎస్సార్సీపీ నేతలందరినీ పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేతలను వదిలివేయడంతో వారు రిగ్గింగ్ కొనసాగించారు.రాళ్లు రువ్విన టీడీపీ బ్యాచ్చిన్నకొత్తపల్లె బూత్‌లో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లపై మంత్రి సమక్షంలోనే పిడిగుద్దులు గుద్దుతూ తన్నుతూ బయటకు తోసేశారు. టీడీపీ మూకలు రాళ్లు వేయడంతో ఏజెంట్‌కు గాయాలయ్యాయి. అక్కడి మహిళలు కూడా మంత్రి తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు మరోసారి వచ్చి మంత్రిని అడ్డుకున్నారు. దీంతో బూత్‌లోపల ఉన్న మంత్రి వెళ్లిపోయారు. భారీగా పోలీసులు ఉన్నా బూత్ లోపల ఏం జరుగుతుందో తెలియనట్లు ఉండిపోయారు.వైఎస్సార్సీపీ నేతల అరెస్టు.. గృహ నిర్బంధంఒంటిమిట్ట మండలంలో మధ్యాహ్నం వరకు మంత్రి హల్చల్ కొనసాగగా ఏమీ చేయని పోలీసులు... జడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఫాంహౌస్ వద్ద ఉన్న రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా తదితరులను అరెస్టు చేసి కడపకు తరలించడం గమనార్హం. ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డిలను అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.ఒంటిమిట్టలో పోలింగ్ సాయంత్రం వరకు టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగింది. ఒకపక్క మంత్రి, మరో పక్క రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలు, దాడులకు దిగాయి. పచ్చ నేతలు పదేపదే భారీగా బూత్‌లలోకి వెళ్తున్నా పోలీసులు అభ్యంతరం తెలపలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం దగ్గరకు రానీయకుండా ఏకపక్షంగా వ్యవహరించారు.రీపోలింగ్ నిర్వహించాలి: వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిఒంటిమిట్ట మండలంలో టీడీపీ నేతల కనుసన్నల్లో రిగ్గింగ్ జరిగిందని, రీ పోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓబులమ్మను కలిసి విన్నవించారు. రాయచోటి, రాజంపేట నుంచి టీడీపీ రౌడీ మూకలుఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో రాయచోటి, రాజంపేట నుంచి వందల సంఖ్యలో వచ్చిన టీడీపీ రౌడీ మూకలు, బౌన్సర్లు పేట్రేగిపోయారు. బూత్‌లలోకి చొరబడి వైఎస్సార్సీపీ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఉదయం వరకు సాఫీగా సాగిన పోలింగ్.. ఓటర్ల నుంచి స్లిప్పులను కూడా లాక్కున్న వీరి అలజడి, దౌర్జన్యంతో ఉద్రిక్తంగా మారింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు టీడీపీ రౌడీల అండతో దొంగఓట్లు, రిగ్గింగ్ యథేచ్ఛగా సాగింది. ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు.మంత్రి బూత్‌లలో తిష్ట వేయగా శ్రేణులు రిగ్గింగ్ కొనసాగించాయి. పోలీసులు మాత్రం సెల్ఫోన్లు చూసుకుంటూ కొందరు, కాలక్షేపానికి విజిల్స్ వేస్తూ కొందరు పోలీసులు ఉండిపోయారు. మండలం అంతా పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడచూసినా టీడీపీ నేతలకు పోలీసులు రెడ్ కార్పెట్ పరిచారు. సాయంత్రం వరకు కాన్వాయ్‌లో తిరుగుతున్నా ఎవరూ అడ్డుకోలేదు. వైఎస్సార్సీపీ నేతలకు మాత్రం ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ సమీప ప్రాంతాలకు రానివ్వలేదు. ఎన్నికల కమిషన్ దృష్టిసారించి పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పోలింగ్‌లో అక్రమాలు బట్టబయలు అవుతాయి. కాగా, వైఎస్సార్సీపీ గ్రామ స్థాయి నేతలను మంగళవారం ఉదయమే స్టేషన్‌కు తీసుకెళ్లారు. కీలక నేతలు వచ్చి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికిముందు కూడా పోలింగ్ బూత్‌ల వద్ద నాయకులు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్తవారు వచ్చి మా ఓటు వేశారుఎవరో కొత్తవారు వచ్చి బూత్‌లలో కలిసిపోయి, మా ఓట్లు వేసేశారు. ఇదేంటి అని నిలదీసిన వైఎస్సార్సీపీ ఏజెంట్ వల్లెపు సుబ్బయ్యను మంత్రి మండిపల్లి ముందే బయటకు లాగి, విచక్షణారహితంగా కొట్టారు. – రాయచోటి వరలక్ష్మీ, చిన్నకొత్తపల్లె, ఒంటిమిట్టఇలాంటి గూండాగిరి ఎన్నడూ చూడలేదుఒంటిమిట్ట చరిత్రలో ఇలాంటి గూండాగిరి ఎన్నడూ వినలేదు చూడలేదు. మండలంలో ఎప్పుడూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు ఎవరో మంత్రి అట.. ఆయన పోయిన ప్రతి బూత్‌లో బయటకు వస్తూనే గొడవలు జరిగాయి. ఇంత దౌర్జన్యంగా ఎన్నికలు జరిపితే ఏమి, లేకుంటే ఏమి.? – వల్లెపు నాగజ్యోతి, చిన్నకొత్తపల్లె, ఒంటిమిట్ట -
పోలింగ్ బూత్‌ల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి దౌర్జన్యం
-
అసలు ఓటర్ల బదులు దొంగ ఓట్లు వేస్తున్న TDP గూండాలు
-
ఒంటిమిట్టలో మంత్రి వీరంగం.. పోలింగ్ బూత్‌లో బూతు పురాణం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చిన్న కొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. మంత్రి సమక్షంలోనే వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై టీడీపీ నేతలు చేయి చేసుకున్నారు. ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై బెదిరిరింపులకు పాల్పడుతూ.. రెచ్చిపోతున్నారు. కర్రలతో కొడుతున్నారంటూ ఓటర్లు వాపోతున్నారు. ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు.మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. బూతు పురాణం అందుకున్నారు. పక్క జిల్లా నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. అసలు ఒంటిమిట్టకు సంబంధం లేకపోయినా కానీ మంత్రి హడావుడి చేశారు. మంత్రి వచ్చి.. పొలింగ్ బుత్లలో దౌర్జన్యం చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోలేదు.ఓటర్లను ప్రలోభపెట్టేలా.. ఒంటిమిట్ల పోలింగ్ బూత్‌లోకి మంత్రి వెళ్లారు, మరో వైపు, జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైఎస్ ఛైర్మన్ దొంగ ఓటు వేశారు. నల్లపురెడ్డి బూత్ క్యూలైన్లో నిలబడి వైఎస్ ఛైర్మన్ దొంగ ఓటు వేశారు. మరో బూత్ క్యూలైన్లో వేంపల్లికి చెందిన దొంగ ఓటరు ఓటు వేశారు. క్యూ లైన్లో జమ్మలమడుగు వాసులను వైఎస్సార్సీపీ శ్రేణులు గుర్తించాయి. -
టీడీపీలో విభేదాలు.. దర్జాగా దోపిడీ
రాజంపేట: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు గుప్పుమన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రాజంపేట టీడీపీ ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జినైన తనకు మంత్రి అస్సలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బాలసుబ్రమణ్యం సోమవారం విరుచుకుపడ్డారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తన వైఖరితో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.ఇసుక, మట్టి దోపిడీలో.. ఎర్రచందనం అక్రమ రవాణాలో, బదిలీలకు సిఫారసు లేఖలను అమ్ముకుంటూ మంత్రి పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం గుండ్లపల్లెలో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం ఏమన్నారంటే..ఇసుక అక్రమ రవాణాలో మంత్రికి వాటాలు..కేవీ పల్లెలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తుంటే సుండుపల్లెలో పోలీసులకు అడ్డుకునే హక్కులేనప్పుడు, రాయచోటి మండలంలో అనుంపల్లె మట్టి ఎత్తితే, దానిని అక్రమంగా సుండుపల్లె మండలంలో దించుకోవచ్చా? రాజంపేట మండలంలోని ఆర్.బుడుగుంటపల్లె ఇసుక రీచ్ ప్రారంభోత్సవానికి రాజంపేట ఇన్చార్జిగా ఉన్న నన్ను పిలవలేదు. మంత్రికి ఇసుకలో వాటా ఉందని కలెక్టరేట్లో చర్చించుకుంటున్నారు. అలాగే, అధికారుల బదిలీలకు సంబంధించి మంత్రి తన సిఫార్సు లేఖలను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. మంచి పోస్టుకు రూ.5 లక్షలు, గ్రామస్థాయి పోస్టుకైతే రూ.30వేలు వసూలుచేస్తున్నారు. మట్టి అక్రమ రవాణాపై కలెక్టర్ ప్రేక్షకపాత్ర..అలాగే, సుండుపల్లె మండలం తిమ్మసముద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తుంటే నేను, మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్ కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఆయన తెలియనట్లు వ్యవహరించారు. తహసీల్దారును కలెక్టరు మొక్కుబడిగా మందలించారుగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనుంపల్లె నుంచి మట్టి తోలుతుంటే తనకు సంబంధంలేదని తహసీల్దారు చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న వారిని అడ్డుకుంటాం.నా సభలకు అధికారులను అడ్డుకుంటున్నారు..మరోవైపు.. నేను పాల్గొంటున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ సభలకు అధికారులను రానివ్వకుండా సమన్వయకర్తగా నియమితులైన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లె గ్రామ పెద్దలకు ఫోన్‌చేసి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరగకూడదని చెప్పాడు. కానీ, గ్రామస్తులు జిల్లా అధ్యక్షుడి మాట లెక్కచేయకుండా ఈ సభ నిర్వహించారు. వాస్తవానికి.. రాంగోపాల్‌రెడ్డి సీఎం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు నియమించిన వ్యక్తి కాదు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా.సభ్యత సంస్కారం లేనివారిని పదవుల్లో పెట్టుకోవడంవల్లే పార్టీకి నష్టం జరుగుతోంది. ఇక మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వైఎస్సార్సీపీలోని తన బంధువులకు వత్తాసు పలుకుతూ వారికి పనులు చేసిపెడుతున్నాడు. రాయచోటిలో టీడీపీ సీనియర్లందరూ కలిసి పనిచేస్తేనే రాంప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారన్న విషయం ఆయన మర్చిపోయారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఆశయాలకు మంత్రి తూట్లు పొడుస్తున్నారు. రవాణాశాఖలో ఆయన లీలలు, బాగోతాలు పత్రికల్లో వస్తున్నాయి. -
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
అన్నమయ్య జిల్లా: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలరోజులు కాకముందే అధికారులపై దాదాగిరి చేస్తున్నారు టీడీపీ పెద్దలు.ఈరోజు(జూలై 1వ తేదీ) పెన్షన్ల పంపిణీలో భాగంగా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ భార్య హరితారెడ్డి.. అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీకి పోలీసుల కాన్వాయ్ కావాలంటూ హుకుం జారీ చేశారు. అంతే కాకుండా ఎస్ఐ రమేష్ ఆలస్యంగా వచ్చాడంటూ చిందులు తొక్కారు. తాను కాన్ఫరెన్స్‌లో ఉన్నానని ఎస్ఐ రమేష్ చెప్పినప్పటికీ సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చూడండి పోలీసులపై దౌర్జన్యం ఈవిడ గారు మంత్రి లేదా MLA అనుకునేరు .. కాదు కాదు రాయచోటి MLA రాం ప్రసాద్ రెడ్డి గారి భార్య గారు నాడు అధికారుల ఆత్మగౌరవాన్ని జగన్ కాపాడాడు .. నేడు అధికారులని బానిసలుగా చూస్తున్న తెలుగుదేశం కూటమి#SaveAPFromTDP #APNeedsYSJaganAgain pic.twitter.com/CeRyKLhD38— 𝑺𝒂𝒕𝒉𝒊𝒔𝒉(𝒀𝑺𝑱𝒂𝒈𝒂𝒏 𝑲𝒂 𝑷𝒂𝒓𝒊𝒗𝒂𝒓) (@SathishWithYSJ) July 1, 2024 -
కాంట్రాక్టు పనులిస్తాం రండహో..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏం సుబ్బాడ్డీ యాడికి పోతాండావ్.. రమేశన్న కాడికిపో చెక్ డ్యాం కావాలని ఆర్జీ ఈపో... సీఎం వచ్చాండాడు చేయిచ్చాడు... ఓ రామిరెడ్డన్న ఈమధ్య కన్పించడం లేదే... అటుమన్నాడు రచ్చబండ పెడ్తాండారు కదా... ఏదన్నా పని చూసుకోపో.. చేయిచ్చారు. ఎంతకాలమని ఊరికే తిరుగుతాంటావ్...హలో లక్ష్యుమయ్యా! మీ ఊర్లో చెరువు కట్ట తెగిపోయిందంటా కదా... ఊర్లో జనంతో సంతకాలు చేయించుకోనిరా..సీఎంకు చెప్పి పనిచేయిస్తాం...అదేందన్నా మేమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదా...పార్టీలతో పనేముంది లక్షుమయ్య నువ్వు నాచేతికి ఆర్జీ తెచ్చియ్యి... ఆపని నీకు మంజూరయ్యేలా చూసుకునే బాధ్యత నాది’..ఇటీవల కాలంలో రాయచోటి నియోజకవర్గంలో నిత్యం చోటుచేసుకుంటున్న సంభాషణ ఇది. నియోజకవర్గ నాయకులు మొదలుకొని వారి అనుచరుల దాకా గ్రామస్థాయి నాయకులతో ప్రతిరోజు ఇలా మాట్లాడటం దినచర్యగా మారింది. ప్రస్తుతం ఈ పరిణామం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈనెల 25న సోమవారం రాయచోటిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని వర్గ సమీకరణ చేసేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి ఇరువురు ఎవరికివారు తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. ముఖ్యమంత్రి తమ నాయకున్నే రచ్చబండ సభ నిర్వహణ ఏర్పాట్లను చూడమన్నారు, మీకేం కావాలో ముందే చెప్పండి. ప్రతిపాదనల్లో ఆ పనులు చేర్చుతారంటూ ముందుగా మాజీ ఎమ్మెల్యే రమేష్ అనుచరులు తెరపైకి వచ్చారు. ఈ పరిణామంతో తాము వెనుకబడి పోతామని భావించిన రాంప్రసాద్ అనుచరులు కూడా ఎవ్వరికి ఏం కావాలో చెప్పండంటూ పనులు రూపొందించే ప్రక్రియలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఒకరిపై మరొకరు ఫిర్యాదులు సైతం చేసుకోవడం తెలిసిందే. మునిసిపాలిటీకే రూ.4కోట్లతో ప్రతిపాదనలు.. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి ఒక్క రాయచోటి మున్సిపాలిటికే వివిధ పనుల నిమిత్తం రూ.4 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. రిటైర్డు ఇంజనీర్లచే పనులు రూపొందిస్తూ ఎవ్వరికి వారు విడివిడిగా జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మండలాల వారిగా ఎవ్వరి కోర్కెల జాబితాను వారు తయారుచేస్తున్నట్లు సమాచారం. గ్రామస్థాయి నాయకుల విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని మరీ తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా చెరువుల మరమ్మతులు, చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేసినట్లు సమాచారం. ఇలా ఇరువురి నాయకుల కోర్కెలు తీర్చాలంటే సుమారు రూ.25కోట్లు వెచ్చించాల్సి వస్తోందని సమాచారం. ప్రతిపాదనలు పంపే పనులు మంజూరైనా, కాకపోయినా ముందుజాగ్రత్తగా రిజర్వు చేసుకోవడమే మంచిదనే ఉద్దేశంలో నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ సమీకరణలో భాగంగానే... రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎవ్వరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి పర్యటనను సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీ పడుతున్నట్లు స్పష్టమవుతోంది. రచ్చబండలో పనులు చేజిక్కినా, చేజిక్కక పోయినా ‘మేము మీకు, మీ గ్రామానికి అవసరమైన పనులు చేయించాలనుకున్నాం’, అని చెప్పుకునేందుకు ఆరాట పడుతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టులు దక్కితే మా సిఫార్సు వల్లేనని, దక్కకపోతే ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు యోగ్యంగా ఉంటుందని ఎవరి ఎత్తుగడల్లో వారు ఉన్నట్లు సమాచారం. గతంలో ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాయచోటికి ఇండోర్ స్టేడియం ఏర్పాటు, రోడ్డు విస్తరణ పనులకు హామీ ఇచ్చారు. దానిని అమలు చేయడంలో స్థానిక నాయకులు కానీ, సీఎం కానీ ఏమాత్రం చొరవ చూపలేదన్న విషయం జగమెరిగిన సత్యం. అయినప్పటికీ ఇరువురు నాయకులు కూడా భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకొని సరికొత్త జాబితా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇరువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడేందుకే సుముఖంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే చురుగ్గా పావులు కదుపుతూనే అధికారంలో ఉండగా పనులు చక్కబెట్టుకోవాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకే కాంట్రాక్టు పనుల పేరుతో గ్రామస్థాయి నాయకులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని పలువురు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా కూడా గ్రామీణులను ప్రోత్సహించడం వెనుక అసలు కారణం ఇదేనని పరిశీలకులు భావిస్తున్నారు.