సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రాయచోటి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు శనివారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడి చేశారు. ఇంటిపైకి దూసుకొచ్చిన 20–30 మంది దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేయడంతో విజయభాస్కర్ తలకు, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మాజీ సీఎం జగన్‌పై మంత్రి చేసిన వ్యాఖ్యలపై విజయభాస్కర్ విడుదల చేసిన మీడియా నోట్‌తో ఆగ్రహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు విజయభాస్కర్ ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయనను మునిసిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, రామపూరం జడ్పిటిసి వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు ఇతర నాయకులు పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


