సాక్షి, తాడేపల్లి: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మ విశ్వాసానికి, దృఢ సంకల్పానికి ఏ వైకల్యం అడ్డుకాదు. పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తూ.. ప్రతి రంగంలోనూ నూతన శిఖరాలను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

ఆత్మ విశ్వాసానికి, దృఢ సంకల్పానికి ఏ వైకల్యం అడ్డుకాదు. పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తూ, ప్రతి రంగంలోనూ నూతన శిఖరాలను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 3, 2025


