breaking news
Chandrababu Naidu government
-
17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట
-
మీలాంటి దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడాలని ఆ అప్పన్న స్వామిని వేడుకుంటున్నా
-
గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం
-
భావ ప్రకటన స్వేచ్ఛను బంధిస్తారా?
పత్రికా స్వేచ్ఛకు సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రత్యేకించి ప్రస్తావించక పోయినప్పటికీ, 19(1)(ఎ) అధికరణం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను పొందుపరిచారు. తద్వారా పాత్రికేయులు, రచ యితలు, కవులు, కళాకారులు, సృజనాత్మక నిపుణులు తమ భావా లను నిర్ద్వంద్వంగా స్పష్టం చేసే హక్కులు పొందారు. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తున్నప్పటికీ సహేతుకమైన విమర్శ లను సాదరంగా ఆహ్వానించాల్సిందే. అర్థవంతమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనం వహించాలి. పత్రికలు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధిగా నిలబడాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేర వేయాలి. మీడియా ప్రచురించిన వార్తల్లో వాస్తవాలను గ్రహించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పాలనలో దిద్దుబాట్లకు శ్రీకారం చుట్టాలి. అంతేగానీ తాము చేసేదంతా మంచేననీ, దాన్నెవరూ ప్రశ్నించకూడదనీ ప్రభుత్వాలు భావిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన విస్తుగొలిపేలా ఉంది. ‘ఫలానా ప్రమోషన్లలో అవినీతి జరిగిందని’ ఎవరో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘సాక్షి’ పత్రిక రాసిన వార్త మీద పోలీసులు కేసు నమోదు చేయడం; ఎడిటర్, రిపోర్టర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి పోలీసు స్టేషన్లో ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి సహేతుకమైన సంకేతం. ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం నిర్ద్వంద్వంగా నియంతృత్వ పోకడే. ప్రతిష్ఠాత్మక ‘ఇండియా టుడే’ మీడియా గ్రూపు కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సైతం ఈ చర్యల పట్ల ధర్మాగ్రహం వ్యక్తం చేశారంటే సమస్య తీవ్రత ఎంతటిదో అర్థమ వుతుంది. ‘పీ4 పథకం ముఖ్య నేత పిచ్చికి పరాకాష్ట’ అనీ, ‘ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులే’ననీ రాసిన పత్రిక మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే సదరు పత్రిక రాసి నవి వాస్తవాలని ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనా? మరెందుకు కొన్ని పత్రికల పట్ల పక్షపాత వైఖరి?నిస్సందేహంగా మీడియాకు ‘లక్ష్మణ రేఖ‘ అవసరమే. అయితే ఇది స్వీయ నియంత్రణ రేఖ కావాలే కానీ, భావప్రకటన కుత్తుక మీద కత్తిలా ఉండకూడదు. మీడియాను బందిఖానాలో ఉంచాలను కుంటే రౌడీలు రాజ్యమేలతారు. అది మరింత ప్రమాదకరం!– ప్రొ‘‘ పీటా బాబీవర్ధన్జర్నలిజం విభాగ పూర్వాధిపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
ప్రజల గొంతు వినిపించకూడదా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలన్న తపన, ఆలోచన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఏ కోశానా∙లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. అందుకే మనకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నుంచి వారంలోనే ఐదుగురు మనవైపు వచ్చి కూర్చున్నారు. అలా ఇంకొందరిని లాక్కుని, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేద్దామని చాలా మంది సలహా ఇస్తే నేను వద్దన్నాను. విపక్షం గొంతు వినాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఆ మేరకు వారికి అవకాశాలు ఇచ్చాం. సభలో వారు చెప్పింది విన్నాం. కానీ, ఈ రోజు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుంటోంది’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. అన్న సందేహం ప్రజలకు కలుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వంపై ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఎత్తిచూపారు. ఈ సమయంలో శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మనకు తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని స్పష్టం చేశారు. మొత్తం సభ్యులతో కలిపి కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే ఇచ్చే అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు అవసరమైన సమగ్ర సమాచారం సిద్ధంగా ఉన్నప్పటికీ, మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే.. సభకు హాజరుకావడం లేదని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వారే డబుల్ యాక్షన్ చేయాలనుకుంటున్నారు⇒ అసెంబ్లీలో అధికార పక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోంది. ‘నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా’ అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని ఏడిపించేది ఈ ప్రభుత్వమే. మళ్లీ వారు ఏడుస్తున్నారని, వారి తరఫున తామే ఏడుస్తామంటూ డబుల్ రోల్ ప్లే చేస్తామంటోంది ఈ ప్రభుత్వమే. ఇలా రెండు వైపులా యాక్షన్ చేస్తోంది. నిజం చెప్పాలంటే వారు ఏడ్చినట్లు నటించినంత మాత్రాన ప్రజల్లో సానుభూతి రాదు. విపక్షంగా మనం ప్రజా సమస్యలు లేవనెత్తితేనే అందులో నిజాయితీ ఉంటుంది.⇒ నాడు చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదు. ఆయన్ను ఎవరూ ఏమీ అనకున్నా.. బయటకు వెళ్లి ఏడ్చాడు. నేను రికార్డులన్నీ చూశాను. మన సభ్యులు ఎవరూ ఏమీ అనలేదు. అయినా అబద్ధాలు చెప్పి, సభకు రాలేదు. అదే మనం జాయింట్ సెషన్లో గవర్నర్ అడ్రస్ సమయంలో అటెండ్ అయ్యాం. ఏటా అలా వెళ్తున్నాం. గవర్నర్ ఎదుట మన సమస్య ప్రస్తావించి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాం.⇒ అసెంబ్లీలో ప్రజల గొంతు వినపడాలనే తపన ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే మనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని అనుకుంటోంది. ఇటీవల నేను ప్రెస్మీట్లో మూడు అంశాలపై గంటన్నర మాట్లాడాను. అలా మనకు అసెంబ్లీలో కూడా అవకాశం ఇస్తేనే, ప్రజా సమస్యలు ప్రస్తావించగలం. అలా కాకుండా మనల్ని ప్రతిపక్షంగా గుర్తించకుండా, ఒక ఎమ్మెల్యే మాదిరిగా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఇస్తే ఏం మాట్లాడగలం?⇒ నిజానికి సభలో ఉన్నవి నాలుగే నాలుగు పార్టీలు. అందులో మూడు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అధికారంలో ఉన్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక పార్టీ మనది విపక్షం. కానీ దాన్ని గుర్తించబోమని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే సభలో ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి. అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్మీట్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం ⇒ రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏడు త్త్రెమాసికాలు పెండింగ్. మొత్తం ఏడు క్వార్టర్లు.. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయి ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చింది రూ.900 కోట్లే.⇒ వసతి దీవెన గత ఏడాది రెండు దఫాలు, ఈ ఏడాది మరో దఫా పెండింగ్ ఉంది. ఈ పథకం కింద మరో రూ.2,200 కోట్లు బకాయి పడ్డారు. అలా ఈ రెండు పథకాలకే రూ.6,200 కోట్లు బకాయి పడ్డారు. కాలేజీలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నాశనం అయ్యింది. ట్యాబులిచ్చే కార్యక్రమం ఆగిపోయింది. సీబీఎస్ఈని రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ ఎగిరిపోయింది. స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఆగిపోయాయి. పిల్లలకు ఇచ్చే చిక్కీలు కూడా ఆపేశారు.⇒ వైద్య రంగం పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉంది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఆరోగ్య శ్రీకి రూ.3,500 కోట్లకు పైగా బకాయి పడ్డారు. దీంతో ఈ పథకం కింద వైద్యం చేయలేమని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టేస్తున్నారు. ఆరోగ్య ఆసరా కింద రూ.600 కోట్లు బకాయి పడ్డారు.⇒ మన ప్రభుత్వంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఏడు కాలేజీలు పూర్తి చేశాం. మనం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ పనులు మొదలుపెట్టాం. దాని వల్ల అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలందుతాయి. నిరుపేద పిల్లలకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.⇒ రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మొత్తం బ్లాక్ మార్కెట్. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మన ప్రభుత్వం హయాంలో మార్కెట్లో జోక్యం చేసుకుని రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు. ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలకుగాను కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. ఎక్కడికక్కడ దోపిడీ.. నీకింత.. నాకింతశాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యవస్థల్లో ఇంత లంచాలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి వసూళ్లు చేస్తున్నారు. పెదబాబుకు ఇంత, చిన బాబుకు ఇంత అని పంచుతున్నారు. లిక్కర్‌ను ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇసుక ఎక్కడా ఉచితంగా లభించడం లేదు. ఇంకా లేటరైట్, క్వార్ట్జ్, సిలికా.. దేన్నీ వదిలి పెట్టడం లేదు. చివరకు ఫ్లైయాష్ కూడా అమ్మేసుకుంటున్నారు.అన్నింటా విఫలమైనా నిస్సిగ్గుగా సూపర్ హిట్ సభఈ ప్రభుత్వం అన్నింటా దారుణంగా విఫలమైనా.. ఇటీవల సూపర్ సిక్స్.. సూపర్ హిట్ పేరుతో కార్యక్రమం చేశారు. ఆ సభ సందర్భంగా ఇచ్చిన అడ్వర్టయిజ్మెంట్ను, ఎన్నికల నాటి యాడ్‌తో పోల్చి చూస్తే పూర్తిగా మారిపోయింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు. 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్ రూ.4 వేలు ఈ ప్రకటనలో లేవు. పథకాలు కూడా మారిపోయాయి.వీటన్నింటిపై గట్టిగా నిలదీయండిమనకు కౌన్సిల్లో మంచి బలం ఉంది. రాజకీయంగా ఎదగడానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు ఇది మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమే. మరో అసెంబ్లీ సెషన్ తర్వాత.. చూస్తుండగానే మరో ఏడాది గడుస్తుంది. కాబట్టి, మీరు కౌన్సిల్లో గట్టిగా నిలబడండి. గట్టిగా మాట్లాడండి. ప్రజా సమస్యలు లేవనెత్తండి. ప్రభుత్వాన్ని కింది అంశాలపై నిలదీయండి.⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వైఫల్యం⇒ రీ వెరిఫికేషన్ పేరిట దివ్యాంగులకు ఇబ్బందులు.. పెన్షన్ కోతలు.⇒ ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు⇒ యూరియా సహా ఎరువుల కొరత, రైతుల అగచాట్లు⇒ పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం⇒ రైతుల ఆత్మహత్యలు⇒ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ⇒ పేదలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు లాక్కోవడం⇒ ఆరోగ్య శ్రీ బంద్.⇒ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ⇒ ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతి, దోపిడీ⇒ ఉద్యోగస్తుల సమస్యలు, డీఏలు, పీఆర్సీలు, ఐఆర్, సరెండర్ లీవ్స్ తదితర బకాయిలు, వారిపై వేధింపులు⇒ పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో ప్రజాస్వామ్యం ఖూనీ⇒ అమరావతిలో తొలి విడత రైతులకు ఏమీ చేయకుండానే రెండో విడత ల్యాండ్ పూలింగ్⇒ అసైన్డ్ అన్న పదం తొలగింపు.. మళ్లీ బినామీల పేర్లతో కొనుగోలు⇒ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం⇒ 15 నెలల్లోనే రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల బాదుడురాష్ట్ర ఆదాయానికి దారుణంగా గండిరాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. అదంతా అధికార పార్టీ నేతల జేబుల్లోకి పోతోంది. ఇసుక అమ్మకం ద్వారా మన హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాగా, ఇప్పుడు అది రావడం లేదు. మద్యం ఆదాయం మన హయాంలో ప్రభుత్వానికి వచ్చేది. కానీ, ఇప్పుడేం జరుగుతోంది? వీళ్లే బెల్టు షాప్‌లు పెట్టించి, ఎక్కువ రేట్లకు అమ్మి అంతా జేబుల్లో వేసుకుంటున్నారు. హార్బర్లలో వాళ్లే పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు. మండలిలో మనకు మంచి బలం ఉంది కాబట్టి ప్రజల కోసం గట్టిగా పోరాటం చేయాలి.మెడికల్ కాలేజీలను కాపాడుకోవాలిమెడికల్ కాలేజీలు అనేవి తరతరాల ఆస్తి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. పైగా అందులో ఫీజులు దారుణంగా ఏకంగా ఏటా రూ.57 లక్షలకు పెంచేస్తున్నారు. ఆ కాలేజీలు తన అత్తగారి సొత్తు అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మేస్తున్నారు. అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలి. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషించాలి. చంద్రబాబు తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడు. -
Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం
-
మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? : వైఎస్ జగన్
-
Auto Drivers: ఎందుకు మేమంటే అంత చులకన చంద్రబాబుపై డ్రైవర్లు ఫైర్
-
Merugu Nagarjuna: మీకు చేతకాక కలెక్టర్లపై నిందలా.. పవన్ కళ్యాణ్,లోకేష్ ఎక్కడ?
-
ఎనీ టైం మందు (ATM).. రికార్డు సృష్టించిన చంద్రం
-
హైకోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా అమరావతిలో DSC వేడుకలు
-
అప్పులు చేయడంలో దేశంలో ఆగ్రగామిగా ఆంధ్రప్రదేశ్
-
ఇసుక మాఫియాకు.. ఏడుగురు బలి
రాష్ట్రంలో కూటమి నేతల అరాచకంలో మరో కోణమిది.. 15 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తోంది.. నదులు, వాగులు, వంకలను చెరబట్టి రేయింబవళ్లు నిబంధనలకు విరుద్దంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక.. ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను చంపేసే స్థాయికి చేరింది.. 30–40 టన్నుల లోడ్‌తో అతి వేగంగా వెళ్తున్న టిప్పర్లు మృత్యు శకటాలుగా మారాయి.. ఇసుక గుంతల్లో పడి కొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు.. అయినా ఏమాత్రం స్పందించని సర్కారు పెద్దలు మీకింత–మాకింత అంటూ బేరసారాల్లో బిజీగా ఉండటం విషాదకరం. సంగం: సగం జీవితం కూడా చూడని ఆ ఏడుగురికీ అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి.. సాయంత్రానికల్లా ఇంటికొస్తామని పిల్లలకు చెప్పి వెళ్లిన వారు అటునుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. ఇసుక మాఫియా తప్పునకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ నేత ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో అతివేగంగా ఎదురుగా వచ్చి కారును ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. అనధికారికంగా పడమటి కంభంపాడు వద్ద నిర్వహిస్తున్న క్వారీ నుంచి సంగం మండలానికి చెందిన టీడీపీ నేతకు చెందిన టిప్పర్ ఇసుక లోడ్‌తో నెల్లూరు వైపు రాంగ్ రూట్లో బయలు దేరింది. అదే సమయంలో నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వస్తున్న కారును పెరమన వద్ద అతివేగంతో ఎదురుగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తాళ్లూరి శ్రీనివాసులు (40), తాళ్లూరి రాధ (36), ఇందుకూరుపేటకు చెందిన చల్లగుండ శ్రీనివాసులు (40), చల్లగుండ్ల లక్ష్మి (34), శేషం సారమ్మ (40), శేషం వెంగయ్య (38), కారు డ్రైవర్ కత్తి బ్రహ్మయ్య (24) కారులోనే మృతి చెందారు. టిప్పర్ అతి వేగంగా కారును ఢీకొనడంతో వీరి శరీరాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఘటనలో మృతి చెందిన వారంతా బంధువులే. తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ భార్యాభర్తలు. వీరు నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేటలో సాయి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. వీరి వద్ద కత్తి బ్రహ్మయ్య పని చేస్తున్నారు. చల్లగుండ్ల శ్రీనివాసులు, చల్లగుండ్ల లక్ష్మి భార్యాభర్తలు. శేషం సారమ్మ, శేషం వెంగయ్య వదినా మరుదులు. మృతి చెందిన తాళ్లూరు రాధ.. చల్లగుండ్ల లక్ష్మికి, శేషం వెంగయ్యకు చెల్లెలు. పరామర్శకు వెళ్తూ.. తాళ్లూరు రాధ, చల్లగుండ్ల లక్ష్మి, శేషం వెంగయ్యల చిన్న చెల్లెలు భర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆత్మకూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని పరామర్శించేందుకు తాళ్లూరు శ్రీనివాసులు తన కారులో వీరందరినీ తీసుకుని వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. తన వద్ద పనిచేసే కత్తి బ్రహ్మయ్యను కారు డ్రైవింగ్ కోసం తీసుకు రావడంతో అతడు కూడా మత్యువాత పడ్డాడు. అతి కష్టం మీద మృతదేహాల వెలికితీత సుమారు 40 టన్నుల ఇసుక ఉన్న 12 టైర్ల టిప్పర్.. రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకు రావడంతో కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురూ క్షణాల్లో చనిపోయారు. వారి మృతదేహాలు సైతం చిద్రమయ్యాయి. వెలికి తీసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద విషయం తెలుసుకుని సంగం సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య, ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్, సంగం సర్కిల్లోని పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు సగ భాగం పూర్తిగా టిప్పర్ ఇంజిన్లోకి వెళ్లడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు రెండు క్రేన్లు, ఒక జేసీబీ, కట్టర్‌ను వినియోగించాల్సి వచ్చింది. ఘటన స్థలాన్ని ఆర్డీఓ భూమిరెడ్డి పావని, ఎంవీఐ రాములు పరిశీలించారు. బుధవారం రాత్రి జిల్లా ఎస్పీ అజిత ఏజెండ్ల ఘటన స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్ లొంగిపోయాడని మీడియాకు వెల్లడించారు. ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నదీ, లేనిదీ విచారిస్తామని చెప్పారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్నది ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కాదని, నకిలీ అని విశ్వసనీయ సమాచారం.మృతుల్లో తాళ్లూరు శ్రీనివాసులు, తాళ్లూరు రాధ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఇటీవల మృతి చెందడంతో ఆ బాధను దిగమింగుతూ కుమారుడిపై ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. తల్లిదండ్రుల మృతితో కుమారుడు ఏకాకిగా మిగిలిపోయాడు. చల్లగొండ్ల శ్రీనివాసులు, చల్లగొండ్ల లక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు ఇప్పుడు అనాథలుగా మిగిలిపోయారు. శేషం సారమ్మ, శేషం బాలవెంగయ్యల కుటుంబాల్లో తీవ్ర విషాధం నెలకొంది. శేషం బాలవెంగయ్య బేల్దారి పనులు చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరా కరువైంది.ఇసుక మాఫియా తీరుపై వైఎస్ జగన్ మండిపాటు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఇసుక మాఫియా వల్ల చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉచిత ఇసుక ముసుగులో సాగిస్తున్న దందాను ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ‘నెల్లూరు’లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.టిప్పర్ ఓనర్ మంత్రి ఆనం అనుచరుడేఏడుగురు మరణానికి కారణమైన టిప్పర్ (ఏపీ39డబ్ల్యూహెచ్1695) మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏఎస్ పేట మండలం చిరమనకు చెందిన కాటం రెడ్డి రవీంద్రారెడ్డిదిగా గుర్తించారు. ఇసుక టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. అతివేగంతో వస్తూ అదుపు చేయలేక కారును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారును ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ టిప్పర్ దిగి పారిపోయాడు. తెలుగుదేశం పార్టీ నేత టిప్పర్ కావడంతో కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. -
అనంతపురం సభలో సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై విశ్వేశ్వర్ రెడ్డి కౌంటర్..
-
ప్రతి పేదవాడికి కావాల్సిందే విద్య, వైద్యం.. వాటినే చంద్రబాబు గంగలో కలిపేశారు
-
విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
Jogi Ramesh: TDP నేతల అక్రమ బూడిద - తరలింపునకు వ్యతిరేకంగా ధర్నా
-
మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చేసిన కూటమి ప్రభుత్వం
-
ఉల్లి, టమోటా రైతుల దీనస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన
-
DSC పోస్టుల భర్తీలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ
-
కర్నూలు జిల్లాలో రైతులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధర
-
Pattikonda:పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇబ్బందులు పడుతున్న రైతులు
-
ఆది నుంచి దగా
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చేసింది. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడ్డ అభ్యర్థులకు అసంబద్ధ నిబంధనలు, నిర్ణయాలతో మెరిట్‌ను పట్టించుకోకుండా అన్యాయం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. నోటిఫికేషన్లో కూటమి ప్రభుత్వం పోస్టుల ప్రాధాన్యం మెలిక పెట్టి అభ్యర్థుల ప్రతిభను మంటగలిపే ప్రయత్నం చేసింది. దీనిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.దాదాపు ఏడాదిన్నరగా జరుగుతున్న డీఎస్సీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా తప్పులు చేయడం చూస్తుంటే కాలయాపన కోసమే ఇలా చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గతేడాది జూన్ 12న తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేసి 16,347 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రకటించిన 6,100 పోస్టులకు ఇవి అదనం అని అభ్యర్థులు భావించగా, ఆ వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత అనేక డ్రామాలు నడిపి నోటిఫికేషన్‌ను ఆలస్యం చేసి అభ్యర్థుల్లో గందరగోళం నింపింది. రెండు రోజుల క్రితం ఫలితాలు ప్రకటించే దాకా ఇదే గందరగోళం కొనసాగించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ విధానాలపైనే అనుమానాలు కలుగుతున్నాయి.తప్పుడు లెక్కలు.. భర్తీ ప్రక్రియలో సాగదీతలు⇒ ‘మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అంటూ ఎన్నికల వరకు నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉన్నవి 16,347 పోస్టులే అన్నారు. కానీ సమాచార హక్కు చట్టం కింద విద్యా శాఖ ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్‌లో 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంగీకరించారు.⇒ గతేడాది డిసెంబర్ నాటికే డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అనేక కారణాలతో వాయిదాలు వేసి దాదాపు 11 నెలల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 19న డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు.అభ్యర్థుల అర్హత మార్కుల పెంపుతో ఆందోళన⇒ మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. ఇలా కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే లక్షలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది.⇒ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు టీచర్లుగా పని చేస్తున్న వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వలేదు. పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది.ప్రశ్నల్లో తప్పులున్నాసరిచేయకుండానే ఎంపిక⇒ డీఎస్సీ ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లినా విద్యా శాఖ సరిచేయలేదు. అభ్యర్థులు సరైన సమాధానాలు గుర్తించినా రెస్పాన్స్ షీట్లలో జవాబులు గుర్తించినట్టు లేకపోవడంతో ఖంగుతిన్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినా 60 నుంచి 20 ప్రశ్నలకు అసలు సమాధానాలు గుర్తించనట్టుగా నమోదైంది.⇒ అభ్యర్థులు గుర్తించిన జవాబుకు ఖాళీ చూపడం, లేదా చుక్కలు నమోదవడం, జవాబు మారిపోవడం (జంబ్లింగ్)తో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ప్రకటించిన ఫైనల్ ‘కీ’లో అనేక లోపాలను అభ్యర్థులు గుర్తించారు. వాటికి ఆధారాలను సైతం విద్యా శాఖకు పంపించారు. కానీ ఆయా అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియలేదు.⇒ ఆపై మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్‌లు పంపి సరి్టఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్‌ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్ పంపడం గమనార్హం.కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’⇒ ఒకే కేటగిరీకి చెందిన వారిలో వెనక ఉన్న వారికి తొలుత లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో పాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులు రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం.⇒ ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)ల ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాసవలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు. ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలేదు’ అంటున్న వారు వేలల్లో జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు⇒ డీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సరి్టఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించారు.⇒ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమరి్పంచారు. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు.⇒ దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కల్పోయారు. ఇలా డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అడుగడుగునా కుట్ర పూరితంగానే వ్యవహరించింది.⇒ కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డీఎస్సీపై 104 వరకు కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ దరఖాస్తు సమయంలోనే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్నప్పటికీ, అర్హత సాధించాక నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం లేకుండా చేయడం సరికాదని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తూ సోమవారం హడావుడిగా తుది ఫలితాలను ప్రకటించేసింది. ఆపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లగా చుక్కెదురైంది. దీన్ని బట్టి ప్రభుత్వం ప్రతి దశలోనూ కుట్ర పూరితంగానే వ్యవహరించిందని స్పష్టమవుతోంది. -
సీఎం సార్.. ఇదిగో ప్రూఫ్ జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు
-
లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు
-
పాడేరు మెడికల్ సీట్లు చంద్రబాబు తీసుకొచ్చారా.. ? పెద్ద అబద్ధం: అప్పలరాజు
-
కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో బట్టబయలైన చంద్రబాబు విరాళాల విధానం
-
Urea Shortage: చంద్రబాబు పాలనా వైఫల్యాలు బట్టబయలు
-
ఏపీలో అధ్వాన్నంగా హోంశాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖలు
-
మెడికల్ కాలేజీలపై చంద్రబాబుకుట్రను బయటపెట్టిన ఎమ్మెల్యే దాసరి సుధ
-
Pothina Mahesh: నీకు చేతనైతే జగన్ కంటే ఎక్కువ చేసి చూపించు
-
తప్పును కలెక్టర్లపై తోసి చేతులెత్తేసిన బాబు
-
AP: మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రం నుంచి ఔట్!
సాక్షి, అమరావతి: అటు కేంద్రంలోనూ అధికారంలో కొనసాగుతూ కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి.. రాష్ట్రానికి కొత్తగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రాజెక్టులను తీసుకురాకపోగా గత ప్రభుత్వ కృషితో వచ్చిన వాటిని సైతం వెళ్లగొట్టేలా వ్యవహరిస్తుండటంపై పారిశ్రామిక వర్గాల్లో విభ్రాంతి వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు మూతపడుతున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్రానికి వచ్చిన ఓ భారీ పీఎస్‌యూ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం ని్రష్కియాపరత్వంతో చాప చుట్టేసే పనిలో ఉంది. కీలకమైన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో, మిధానీ కలసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ స్థాపించేలా వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. పలు కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024–25 వార్షిక నివేదికలో ఈ విషయం నాల్కో స్పష్టంగా పేర్కొంది. అంటే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే మంగళం పలకబోతున్నారని, రా్ష్ట్రం నుంచి ఒక భారీ ప్రాజెక్టును తరిమేస్తున్నారని అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న కూటమి నేతలు దీనిపై నోరు విప్పక పోవడం పట్ల ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంత్రులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు చేజారిపోతున్నా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలపైనే మోజు.. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థలపై ఉన్న మోజు ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండదని పలు సందర్భాల్లో రుజువైంది. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నా నోరు తెరవడం లేదు. పైగా ఈ యూనిట్ మూసివేతకు సహకరించే విధంగా ఓ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో అనకాపల్లి వద్ద భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయిస్తూ దానికి సొంత ఇనుప గనులు కేటాయించాలని స్వయంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా కేంద్రాన్ని కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంతో పోరాడి చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద 600 ఎకరాల్లో ఎనీ్టపీసీ, బీహెచ్ఈఎల్తో రూ.6,000 కోట్లతో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్‌ను తీసుకురాగా విభజన అనంతరం టీడీపీ హయాంలో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. శరవేగంగా అన్ని అనుమతులు..నెల్లూరులో హైఎండ్ అల్యూమినియం కంపెనీ ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేగంగా అడుగులు వేసింది. నాల్కో, మిధానీ కలసి 2019 ఆగస్టులో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ (యూఏడీఎన్ఎల్) పేరిట భాగస్వామ్య కంపెనీనీ ఏర్పాటు చేశాయి. 2020 అక్టోబర్‌లో నెల్లూరు జిల్లా బీవీపాలెం వద్ద 110 ఎకరాలు భూమిని కేటాయించిన గత ప్రభుత్వం భూసేకరణలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను సైతం వేగంగా పరిష్కరించింది. దీంతో 2021 జూలైలో ఉత్కర్ష కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అత్యవసరమైన పర్యావరణ అనుమతులు సైతం 2021 జూలైలో వచ్చేశాయి. నాల్కో సీఎండీ శ్రీధర్పాత్ర, మిధానీ ఎండీ సంజయ్‌కుమార్ 2022 ఏప్రిల్‌లో నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలసి ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. -
ఆగిన ఆరోగ్యశ్రీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన నెట్వర్క్ ఆస్పత్రులు మరోసారి సమ్మెబాట పట్టాయి. బకాయిలు చెల్లించమని ఎన్నిసార్లు ప్రాధేయపడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ కింద ఉచిత ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను నిలిపేశాయి. సేవల్ని నిలిపేసినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ).. ఆరోగ్యశ్రీ సీఈవో దినేష్‌కుమార్‌కు లేఖ రాసింది. ప్రభుత్వం రూ.వేలకోట్ల బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ఉచిత ఓపీ, ఇన్వెస్టిగేషన్ సేవలను అందించలేమని ఆ లేఖలో స్పష్టం చేశారు.రూ.2,500 కోట్లకు పైగా బకాయిల విడుదల కోసం ఒకటిన్నర సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నామని తెలిపారు. తీవ్రమైన ఆcక సంక్షోభంలో ఉన్నప్పటికీ నిధులు విడుదలవుతాయనే ఆశతో సేవలు నెట్టుకొచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో విజ్ఞప్తులు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సోమవారం నుంచే ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ సేవలను ఆపేసినట్లు తెలిపారు.పదే పదే సమ్మెబాటచంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు పదేపదే సమ్మెబాట పడుతున్నాయి. ఆరోగ్యశ్రీని నిర్థిర్యం చేసి బీమా విధానం ప్రవేశపెట్టడం కోసం ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు, పథకం అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గతేడాదిలో ఒకసారి, ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. ఏప్రిల్ నెలలో సమ్మెలోకి వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబు ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినా బకాయిలు క్లియర్ అవ్వలేదు.దీంతో ఈ ఏడాదిలో మూడోసారి ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. వాస్తవానికి గతేడాది నుంచే చాలా ఆస్పత్రులు అనధికారికంగా ఐపీ సేవలను కూడా ఆపేశాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల కోసం వెళితే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో ఉచిత సేవలు అందించబోమని చెప్పేస్తున్నాయి. రూ.200 కోట్లకుపైగా బిల్లులు నిలిచిపోవడంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా ఆపేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యం బారినపడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి చికిత్స చేయించుకుంటే, మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారు. -
Rachamallu Siva: చంద్రబాబు చాలా థాంక్స్.. ఎందుకంటే?
-
Urea: మనం ఫెయిల్.. ఒప్పేసుకున్న చంద్రబాబు
-
CM చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ లేఖ
-
కూటమి వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది: భూమన కరుణాకర్ రెడ్డి
-
బాబు గారి పీపీపీ.. బినామీలకే ప్రాపర్టీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం పీపీపీకి ఇస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీట్లలో ఒక్కో సీటుకు ఏడాదికి ఏకంగా రూ.57.50 లక్షల చొప్పున ఫీజు వసూలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంత భారీగా ఫీజులు నిర్ణయించడం వెనుక రేపటి టెండర్లలో పోటీ పెంచి.. మీకింత–నాకింత పేరుతో భారీగా కమీషన్లు దండుకునే కుట్ర దాగి ఉందని వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఈ సీట్లకు రూ.20 లక్షల చొప్పునే ఫీజు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఏకంగా ఒక్కో సీటుపై అదనంగా ఏటా రూ.37.50 లక్షలు పెంచడం అంటే దోపిడీ ఏ స్థాయిలో ఉండనుందో ఇట్టే స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలల్లో మెరుగైన నిర్వహణ కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే తక్కువ ఫీజులను ఖరారు చేసింది. అప్పట్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రస్తుత కూటమి పార్టీలు తీవ్రంగా తప్పు పట్టాయి. ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ అయితే, తాము అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఆ విధానం రద్దు చేయకపోగా, ఏకంగా కళాశాలలనే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి.. విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకోండని వారికి లైసెన్స్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 10 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌కు కట్టబెట్టడానికి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రూ.కోట్ల విలువ చేసే ఈ కళాశాలల భూములను ఎకరం రూ.వందకే లీజుకు ఇవ్వడంతోపాటు, కళాశాలలు, బోధనాస్పత్రిపై 66 ఏళ్లు హక్కులు కల్పించడంతోపాటు వైద్య సేవలకు ఫీజులు వసూలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రైవేట్ కళాశాల కంటే ఫీజు ఎక్కువ⇒ ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాకు రూ.39.60 లక్షల ఫీజు ఉంది. నీట్లో రాణించినప్పటికీ డిమాండ్‌కు తగ్గ ఎంబీబీఎస్ సీట్లు లేక ఏటా రాష్ట్రంలో వందల సంఖ్యలో విద్యార్థులు నష్టపోతున్నారు. దీంతో పిల్లలను ఎలాగైనా వైద్య విద్య చదివించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు రూ.లక్షల్లో ఖర్చు పెట్టి విదేశాలకు పంపుతున్నారు. ఇలా వెళ్లే విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించే సమయంలో, అనంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు, మ«ద్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ఎన్ఆర్ఐ కోటా ఫీజును కొత్త కళాశాలల్లో రూ.20 లక్షలుగా గత ప్రభుత్వం ఖరారు చేసింది. ⇒ దీంతో అప్పటి వరకు ప్రైవేట్‌లో సంపన్న కుటుంబాలకే పరిమితం అయిన ఎన్ఆర్ఐ కోటా సీట్లు మధ్య తరగతి పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చినట్లైంది. అయితే ఇప్పుడు ఆ ఫీజును ఏకంగా మరో రూ.37.50 లక్షల మేర పెంచి మొత్తంగా రూ.57.50 లక్షలు చేసి.. పెట్టుబడిదారులకు భారీ లాభం చేకూర్చాలని ప్రభుత్వం చూస్తోంది. ⇒ సర్కారు నిర్ణయం కారణంగా ప్రైవేట్ కళాశాలలతో పోల్చినా పీపీపీ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ.17.9 లక్షలు అధికంగా ఉండటం గమనార్హం. ఇలా ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ వైద్య కళాశాలల కంటే అధికంగా ఫీజులు వసూలు చేసుకునే హక్కులు ప్రైవేట్ వ్యక్తులకు కల్పిస్తూ పైకి మాత్రం పీపీపీతో విద్యార్థులకు ఎటువంటి నష్టం వాటిల్లదంటూ చంద్రబాబు మోసానికి పాల్పడుతున్నారు. దండుకుందాం రండి.. మాకింత.. మీకింత!⇒ సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజల సంపదను కొల్లగొట్టే పనిలో పడ్డారు. ప్రభుత్వాస్తులను కారుచౌకగా అస్మదీయులకు కట్టబెట్టడమే కాకుండా, తద్వారా వ్యాపారం చేసి వారిని మరింత సంపన్నులుగా తీర్చిదిద్దే కుట్రకు తెరలేపారు. ఇందుకు పీపీపీ విధానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా పీపీపీ పేరిట దోపిడీ కార్యక్రమాలకు తెరతీశారు. ఇందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణే కళ్లెదుట కనిపిస్తున్న సాక్ష్యం. ⇒ చంద్రబాబు ఒత్తిడి మేరకు రూపొందించిన ప్రతిపాదనల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటును ఏటా రూ.57.50 లక్షలకు పెంచడమే కాకుండా.. ఇక్కడ పెట్టుబడి పెడితే విద్యార్థుల నుంచి ఎంబీబీఎస్‌లో ఇతర కోటా సీట్లు, పీజీ, నర్సింగ్, ఇతర వైద్య విద్యా కోర్సుల ఫీజులతోపాటు, ఆస్పత్రుల్లో వైద్య సేవలు, డయాగ్నోస్టిక్స్, మందులకు చార్జీల రూపంలో మరింత ఆదాయం వస్తుందని వైద్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయడం విస్తుగొలుపుతోంది.విద్యార్థులపై భారం లేదంటూనే మోసం⇒ మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో నిర్వహణ వల్ల విద్యార్థులపై ఎటువంటి భారం ఉండదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవన్నీ బూటకపు ప్రకటనలేనని అధికారుల ప్రతిపాదనల ద్వారా తేటతెల్లం అవుతోంది. ⇒ సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పీపీపీ ప్రాజెక్టుల్లో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు ఎక్కువ మేలు తలపెట్టేలా చూస్తుంది. కానీ, స్వతహాగా నయా పెత్తందారు అయిన చంద్రబాబు మాత్రం అస్మదీయులకు భారీ లబ్ధి చేకూరేలా రెడ్ కార్పెట్ వేస్తున్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టడమే కాక, వైద్య విద్య వ్యాపారం రూపంలో అస్మదీయులు భారీగా ఆర్జించడానికి మార్గం సుగమం చేస్తున్నారు.⇒ పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి ఏకంగా రూ.అరకోటికి పైగా వసూలు చేసుకోవడానికి పేటెంట్ ఇచ్చేస్తున్నారు. -
Kona Raghupathi: పేదలకు అందించాల్సిన విద్య, వైద్యాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నారు
-
పార్టీలో చేరిన తిరుపతిలోని 36వ డివిజన్ కు చెందిన మైనారిటీలు
-
చంద్రబాబు లీక్స్ అమరావతి ఒక మున్సిపాలిటీ..!
-
తిరుమల తొక్కిసలాట బాధ్యుడు! రీ పోస్టింగ్ వెనుకాల మతలబ్ ఏంటి?
-
పచ్చి అబద్ధం.. పచ్చ కుతంత్రం
సాక్షి, అమరావతి: టీడీపీ కరపత్రిక, నిత్యం అసత్యాలు కొంగొత్తగా వల్లించే విష పుత్రిక ‘ఈనాడు’ మరోసారి బరితెగించింది. దశాబ్దాలుగా తనకు అలవాటైన రీతిలో ఉషోదయాన్నే అవాస్తవ సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరి తెగించింది. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారానికి తెగబడింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితాలోనే లేని వైఎస్ జగన్‌ను.. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా(ఏ–1) పేర్కొంటూ ఓ అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పాత్రికేయ విలువలను మరోసారి దిగజార్చింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు డైరెక్షన్లో డైవర్షన్ రాజకీయానికి పాల్పడింది. నిస్సిగ్గుగా ‘ఈనాడు’ తప్పుడు రాతలుచంద్రబాబు కుట్రలో భాగంగా ఈనాడు 2010–11 నాటి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును ఉద్దేశ పూర్వకంగా తెరపైకి తీసుకువచ్చింది. ఆ కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన నిందితుడు (ఏ1) అంటూ ప్రముఖంగా ప్రచురించింది. ఈ కేసులో ఏ–7గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ తరఫున సునీల్ రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని.. విదేశాలకు అక్రమంగా నిధులు తరలించారని కూడా అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచురించింది. కనీసం అటువంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలని కూడా యత్నించ లేదు. కనీసం ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిశీలించినా అసలు వాస్తవాలు వెల్లడవుతాయి. కేవలం చంద్రబాబు చెప్పినట్టు వైఎస్ జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు పత్రిక అవేమీ పట్టించుకోలేదు. అసత్య సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. అయితే ‘ఈనాడు’ ప్రచురించిందంతా వాస్తవం అని అమాయకంగా నమ్మేందుకు ఇవి 1995 వైస్రాయ్ హోటల్ కుట్ర నాటి రోజులు కావు. ఈనాడు పత్రిక బండారం ఎప్పుడో బట్టబయలైంది.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో వైఎస్ జగన్‌కు సంబంధమే లేదు 2010–11లో సీబీఐ నమోదు చేసిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ కేసులో ఆయన ప్రధాన నిందితుడు కాదు కదా.. సాధారణ నిందితుడు కూడా కాదు. అసలు ఆ కేసులో నిందితుల జాబితాలో వైఎస్ జగన్ పేరు లేనే లేదు. ఆయనపై సీబీఐ ఆ కేసు నమోదు చేయనే లేదు. 14 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితా ఇదే.. ఇందులో వైఎస్ జగన్ పేరు లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితులు వీరే..బీపీ ఆచార్య (ఏ1), ఎమ్మార్ ప్రాపర్టీస్ (ఏ2), ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్ (ఏ3), ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ (ఏ4), స్టైలిష్ హోల్మెస్ అండ్ రియల్ ఎస్టేట్స్ (ఏ5), కోనేరు రాజేంద్ర ప్రసాద్ (ఏ6), నర్రెడ్డి సునీల్ రెడ్డి (ఏ7), జీవీ విజయ్ రాఘవ్ (ఏ8), శ్రీకాంత్ జోషి (ఏ9), బోల్డర్ హిల్స్ లీషూర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ10), ఎల్వీ సుబ్రహ్మణ్యం (ఏ11), విశ్వేశ్వరరావు (ఏ12), మధు కోనేరు (ఏ13), టి.రంగారావు(ఏ14) నిందితులుగా ఉన్నారు. వీరిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, మధు కోనేరులపై అభియోగాలను న్యాయస్థానం ఇప్పటికే కొట్టి వేసింది. కేసు విచారణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 19న న్యాయస్థానంలో తదుపరి విచారణ ఉంది. దీన్నిబట్టి ఈ కేసులో నిందితుల జాబితాలో ఎక్కడా లేనప్పటికీ వైఎస్ జగన్‌ను ఏ1గా పేర్కొంటూ ఈనాడు కుట్ర పూరితంగానే అవాస్తవ కథనాన్ని ప్రచురించిందని స్పష్టమవుతోంది.బాబు డైరెక్షన్లోనే ‘ఈనాడు’ యాక్షన్⇒ చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈనాడు అసత్య కథనాన్ని ప్రచురించింది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తగానే మద్యం విధానంపై అక్రమ కేసు పేరిట సిట్ రంగంలోకి దిగుతుంది.. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తుంది.. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తోక పత్రికలు వెంటనే రంకెలు వేస్తాయి. మోకాలికీ బోడి గుండుకు ముడి పెడుతూ అసత్య కథనాలు ప్రచురిస్తాయి.⇒ ఈ కేసులో సిట్ ఎవర్ని అరెస్టు చేయనుందో ముందే లీకులు ఇస్తుంది. ఆ వెంటనే ఆయనే ఈ కేసులో అత్యంత కీలకం అంటూ ఈనాడు, ఇతర తోక పత్రికలు కథనాలు ప్రచురిస్తాయి. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు అని పేర్కొంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అనిల్ రెడ్డి.. ఇలా వీరందరిపై ఎల్లో మీడియా బురదజల్లడమే పనిగా పెట్టుకుంటుంది. ⇒ ఆ జాబితాలో తాజాగా చేరిన పేరు సునీల్ రెడ్డి. న్యాయవాది, చిన్న వ్యాపారస్తుడైన ఆయన వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా వక్రభాష్యం చెబుతున్నాయి. ఆయన గత పదేళ్లలో వైఎస్ జగన్‌ను కలిసిందే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా విజయవాడకు గానీ, అమరావతికి గానీ వచ్చిందే లేదు. కానీ ఆయన వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడంటూ ఉద్దేశ పూరక్వంగా దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డికి సొంతంగా కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఎంతో మంది వృత్తి నిపుణులు పని చేస్తున్నారు. వైఎస్ జగన్ తమ వ్యాపారాలను వారి ద్వారా నిర్వహిస్తారు. అంతే గానీ, సిట్ చెప్పినట్టుగా ఇతరులెవరితోనో వ్యవహారాలు నిర్వహించాల్సిన అవసరం ఆయనకు ఏమాత్రం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపేందుకే సిట్, ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తున్నాయన్నది సుస్పష్టం. ⇒ మద్యం అక్రమ కేసులో అక్రమంగా అరెస్టు అయిన నిందితుల బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ ఇదే కుట్రను అమలు చేస్తున్నారు. ఎవరు ఆఫ్రికా దేశాల్లోనో మరెక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నా.. ఈ అక్రమ కేసుకు ముడి పెడుతున్నారు. అవన్నీ అక్రమ పెట్టుబడులే అంటూ బురద జల్లుతున్నారు.చంద్రబాబు, రామోజీ కుటుంబ ట్రేడ్ మార్క్ కుట్ర⇒ పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా చంద్రబాబు– ఈనాడు వ్యవహారం సాగుతోంది. తమ రాజకీయ స్వార్థం, ఆర్థిక దోపిడీ కోసం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తూ.. రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతూ కుట్రలకు పాల్పడేందుకు చంద్రబాబు, రామోజీ కుటుంబ మార్కు కుతంత్రం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ఆ క్విడ్ ప్రోకో కుట్రల్లో చంద్రబాబు, రామోజీ కుటుంబాలే లబ్ధిదారులు అన్నది బహిరంగ రహస్యం.⇒ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో చంద్రబాబు సీఎం అయిన వైస్రాయ్ హోటల్ కుట్రలో ఈనాడు పత్రిక ప్రధాన భాగస్వామి. 1995లో సీఎంగా ఉన్న ఎన్టీరామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా కథనాలతో దుష్ప్రచారం చేసి పాత్రికేయ విలువలకు పాతరేసింది. ⇒ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రామోజీ కుటుంబ అక్రమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు పూర్తిగా సహకరించారు. ఎన్టీ రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించారు. రామోజీ ఫిల్మ్ సిటీ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేశారు. టీడీపీ ప్రభుత్వ అండతోనే రామోజీ రావు కుటుంబం రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను చెరబట్టి ఫిల్మ్ సిటీ నిర్మించింది. ⇒ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిటర్స్ వేల కోట్ల రూపాయాల అక్రమ డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. క్విడ్ ప్రో కో కుట్రలో భాగస్వాములు అంటే చంద్రబాబు, రామోజీ కుటుంబాలే అన్నది బహిరంగ రహస్యం. కానీ తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడు పత్రిక ద్వారా దుష్ప్రచారం చేయడం చంద్రబాబు, రామోజీ కుటుంబాల మార్కు కుతంత్రం. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ జగన్‌ను ఆ కేసులో ప్రధాన నిందితుడు అని ఈనాడు పత్రిక ప్రచురించిన అసత్య కథనమే అందుకు తాజా తార్కాణం. -
ప్రజారోగ్యం లూటీ!
వీళ్లు పాలకులేనా? భారత రాజ్యాంగం స్ఫూర్తితో ఎన్నికైన ప్రజా ప్రతినిధులేనా? ఇంతటి విశృంఖల అవినీతి గతంలో ఎప్పుడైనా ఉన్నదా? గజ్జెల మల్లారెడ్డి పద్యాన్ని కొద్దిగా మార్చి ‘తెలుగు నాట అవినీతి తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ స్కీము లేక డేంజర్‌గా మారింద’ని చదువుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పాలక కూటమి పల్లకీని మోసే డ్యూటీలో ఉన్న యెల్లో బోయీలు కూడా అవినీతి ప్రవాహంపై మాట్లాడక తప్పని దురవస్థ దాపు రించింది. కాకపోతే వారి ఎజెండా వేరు. వారికో డైవర్షన్ స్కీమున్నది. అవినీతి హెడ్‌క్వార్టర్స్‌పై ముసుగు కప్పి ప్రవహిస్తున్న మురుగంతా క్షేత్రస్థాయి, ద్వితీయ శ్రేణి నేతల మురికేనని చెప్పాలి. అదే చెబుతున్నారు. ‘ఎమ్మెల్యే సారూ... తగ్గాలి మీరు’ అనే పతాక శీర్షికలతో అవినీతి కథనాల సీరియల్స్ నడుపు తున్నారు. మంత్రుల పీఏలు, ఓఎస్డీలు తెగబడుతున్నారని రాస్తున్నారు. ప్రతి పనికీ రేటు పెట్టి వసూలు చేస్తున్నారని స్థానిక నేతలపై వాపోతున్నారు.జడలు విరబోసుకొని నడివీధుల్లో నర్తిస్తున్న అవినీతి భూతాన్ని దాచిపెట్టలేరు గనుక డైవర్షన్ వ్యూహాలపై తెలివి తేటల్ని ఖర్చు చేస్తున్నారు. సాధారణ పరిపాలన శ్రుతి తప్పితే అధికారుల తప్పు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే పోలీసుల తప్పు. ఇదీ, యెల్లో మీడియా వరుస. అదునులోగా రైతుకు అందవలసిన యూరియా ఎరువును కూడా అవినీతి భూతం పరపర నమిలేస్తుంటే గద్దె మీదనున్న పెద్దలకు ఏ పాపం తెలియదని యెల్లో బోయీలు నమ్మబలుకుతున్నారు. ఇతరుల ఖాతాల్లో పడేయడానికి వీలు కాని ముఖ్య భాగోతాలను మాత్రం అభివృద్ధి కోణంలో ఆవిష్కరిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టడంలో అవినీతి లేదట! అభివృద్ధికి అదే అర్థమట! జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి భూసేకరణ చేసి నిర్మాణాలు ప్రారంభించారు. ఆయన హయాంలోనే ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయి.ఎన్నికలు ముగిసిన వెంటనే పాడేరు కాలేజీ కూడా ప్రారంభమైంది. దాంతోపాటు అనుమతులొచ్చిన పులివెందుల కాలేజీకి మాత్రం బాబు అడ్డు చక్రం వేశారు. అడ్డుకోవడానికి అసలు కారణం, ఇప్పుడు తేటతెల్లమైంది. పులివెందుల కాలేజీతోపాటు పది కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీన్ని ప్రైవేటీకరణ అనగూడదని సర్కార్ వాదిస్తున్నది. పిల్లి కాదు మార్జాలమట! ఈ మార్జాలం మర్మమేమిటో తెలుసుకోవాలంటే ప్రభుత్వం తరఫున ఏపీఎమ్ఎస్ఐడీసీ తయారుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొంతమేరకు ఉపయోగపడుతుంది. ఈ పది మెడి కల్ కాలేజీల్లో అసలు పనులేమీ జరగలేదనీ, కేవలం పునాదు ల్లోనే అవి ఆగిపోయాయని మంత్రులు, ముఖ్యమంత్రి వాదిస్తుండటాన్ని మనం చూస్తున్నాము.పులివెందుల కాలేజీని తీసుకుంటే అక్కడ ఇప్పటికే 418 కోట్ల 20 లక్షల రూపాయలను నిర్మాణం కోసం ఖర్చుపెట్టినట్టు ఆ పీపీటీలో ప్రభుత్వం అంగీకరించింది. క్యాంపస్ విస్తీర్ణం 47.58 ఎకరాలని అందులో పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉన్న కాలంలోనే అక్కడ ఎకరా రెండు కోట్ల దాకా ఉన్నదని సమాచారం. మెడికల్ కాలేజీ, అనుబంధ ఆస్పత్రి పని చేయడం ప్రారంభిస్తే ఈ భూమి ధర శరవేగంగా పెరిగే అవకా శముంటుంది. దీన్ని ఏటా ఎకరాకు 100 రూపాయల చొప్పున 66 ఏళ్లపాటు లీజుకు ఇస్తారు. అంటే పులివెందుల కాలేజీ లీజుకు తీసుకునేవారు ఏడాదికి 4,758 రూపాయలు చెల్లిస్తే చాలు.వందకోట్ల విలువైన (ప్రస్తుత ధర) భూమితోపాటు 420 కోట్లతో చేసిన నిర్మాణం 66 ఏళ్లపాటు వారికి సొంతమవుతుంది. ఈ కాలేజీకి కేటాయించిన 150 అండర్గ్రాడ్యుయేట్ సీట్లలో 50 శాతం మేనేజ్మెంట్ కోటా కింద కేటాయిస్తారు. 15 శాతం ఆలిండియా సీట్లు పోను 35 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.జగన్మోహన్రెడ్డి సర్కార్ ప్రభుత్వరంగంలో ప్రారంభించిన కాలేజీల్లో సగం సీట్లను కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద పెట్టింది. అప్పటి ప్రతిపక్షం దీనిపై గగ్గోలు పెట్టి తాము అధికారంలోకి వస్తే ఆ కోటా ఎత్తివేస్తామని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ప్రైవేట్ యాజమాన్యంలో అది కుదరదు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుతోపాటు దొడ్డిదారి డొనేషన్లు, డొంకదారి వసూళ్లు చాలా ఉంటాయన్న సంగతి మనకు అనుభవంలో ఉన్న విషయమే. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పులివెందుల కాలేజీని ఉదాహరణగా తీసుకున్నప్పటికీ మిగిలిన 9 కాలేజీల పరిస్థితి ఇంతే. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆదోని కాలేజీకి సేకరించిన స్థలం 58.44 ఎకరాలు. అక్కడ ఇప్పుడే ఎకరా 5 కోట్లు ధర పలుకుతున్నది. నిర్మాణం కూడా 70 శాతం పూర్తయింది. మదనపల్లె కాలేజీ స్థలం 95.5 ఎకరాలు. నిర్మాణం 30 శాతం పూర్తయింది. మిగిలిన కాలేజీలు కూడా 50 ఎకరాలకు తగ్గకుండా ఉన్నాయి. ఒకసారి కాలేజీ, ఆస్పత్రి పనిచేయడం ప్రారంభమైతే ఆ స్థలాల ధరలు అనూహ్యంగా పెరుగుతాయి.మరో ముఖ్యమైన అంశం – కాలేజీలకు అనుబంధంగా ఏర్పడే ఆస్పత్రులు! 650 పడకల ఆస్పత్రులను ప్రతిపాది స్తున్నారు. ఇందులో 30 శాతం పడకలకు ప్రైవేట్ మేనేజ్మెంట్ తన ఇష్టప్రకారం డబ్బులు వసూలు చేసుకోవచ్చు. మిగిలిన 70 శాతం పడకలపై మాత్రం నియంత్రణ ఉంటుంది. ప్రైవేట్ యాజమాన్యాలు ఈ నియంత్రణలను ఏమేరకు పాటిస్తాయన్నది తెలియంది కాదు. తెల్ల రేషన్ కార్డులున్న వారికి 5 శాతం ఉచిత వైద్యాన్ని రిజర్వు చేయాలన్న నిబంధనను కార్పొరేట్ ఆస్పత్రులు ఏమేరకు పట్టించుకుంటున్నాయో తెలిసిన సంగతే! అదే ప్రభుత్వరంగంలో ఉన్నట్లయితే ఇన్‌పేషెంట్లతో పాటు ఔట్ పేషెంట్లు కూడా ఉచిత ఉన్నతస్థాయి వైద్య సౌకర్యాలను పొందే అవకాశం ఉండేది. డబ్బులేని కారణంగా వైద్యవిద్యకు దూరమ వుతున్న ఆసక్తి గల విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావడం, పేద–మధ్యతరగతి ప్రజలకు చేరువలోనే ఉచితంగా స్పెషలిస్టు వైద్య సేవలను అందించడమనే జంట లక్ష్యాల సాధన కోసం జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ప్రారంభించింది. ఆ ఆశయాన్ని తుంగలో తొక్కుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అందులో 10 కాలే జీలను ప్రైవేట్ రంగానికి కట్టబెడుతున్నది. వేల కోట్ల విలువ చేయబోయే ఆ స్థలాలను కారుచౌకగా ఏటా రూ. 5 వేలకే కట్టబెట్టడం వెనుక స్కామ్ కాకపోతే మరే కారణం ఉంటుంది? లక్షలాదిమంది పేద మధ్యతరగతుల ప్రజలను ఉన్నత స్థాయి ఉచిత వైద్యానికి దూరం చేస్తూ, వేలాదిమంది విద్యార్థులూ, వారి తల్లిదండ్రుల డాక్టర్ చదువు కలలను భగ్నం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు మెడికల్ కాలేజీలకు, పది ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రైవేట్‌రంగంలో అనుమతించినప్పుడు చంద్రబాబు చేసిన యాగీ, యెల్లో మీడియా పెట్టిన అల్లరి అప్పటివాళ్లకు గుర్తుండే ఉంటుంది. నాటి ముఖ్యమంత్రి జనార్దన్‌రెడ్డికి ‘ధనార్జనరెడ్డి’ అనే నామకరణం కూడా బాబు ముఠా చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే నిర్మించి ప్రైవేట్‌కు అప్పగిస్తున్న వ్యవహారాన్ని ఏమనాలి? ఈ ముఖ్యమంత్రికి ఏమని నామకరణం చేయాలి?ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ బాగుండదని, ప్రైవేట్ యాజమాన్యమైతే సమర్థంగా ఉంటుందనే ఒక డొల్ల వాదనను కూడా ఈ ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్వహణ తీరుపై ఇప్పటికే మనకు పలు అనుభవాలున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు దినసరి కూలీలను పేషెంట్ల రూపంలో పడుకో బెట్టడం, అద్దెకు తెచ్చిన వారికి డాక్టర్ల వేషాలు వేసి చూపించడం మీడియాలో చాలాసార్లు రిపోర్టయింది. సౌకర్యాలు లేక, సమర్థులైన సిబ్బంది లేక ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్థాయి అథమస్థాయిలో ఉన్నదనే అధ్యయనాలు కూడా వచ్చాయి. వైద్యరంగంలో ప్రైవేట్ నిర్వాకం ఎట్లా ఉంటుందో తాజా ఉదాహరణను ఒకదాన్ని చెప్పుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో రక్తపరీక్షలు సరిగ్గా జరగడం లేదని, 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ఆ విభాగాన్ని మెడాల్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఒక్కో పరీక్షకు 235 రూపాయలు సంస్థకు చెల్లించారు. 2016 నవంబర్ ఒక్క మాసంలోనే 53 వేల డెంగీ కేసులు నమోదైనట్టు లెక్క రాసి మెడాల్ బిల్లులు క్లెయిమ్ చేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో 7 వేల కేసులే నమోదైనట్టు చివరకు అంగీకరించవలసి వచ్చింది. ఈ రకమైన తప్పుడు లెక్కలతో మూడేళ్లలోనే 360 కోట్ల ప్రజాధనాన్ని ఆ సంస్థ లూటీ చేసింది. పైవారికి కమీషన్లు సమర్పిస్తున్నామన్న బరితెగింపుతో ఇటువంటి ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మనకు కొత్త కాదు. పేదలకు అపర సంజీవనిగా భాసిల్లుతున్న ‘ఆరోగ్యశ్రీ’ని కూడా ఓ ప్రైవేట్ బీమా కంపెనీ చేతిలో పెడు తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎక్కడ ఫెయిలైంది? బీమా కంపెనీ ఏరకంగా అంతకంటే మెరుగు? కాదేదీ కమీషన్లకనర్హమా? మానవీయ కోణంలో చూడవలసిన ప్రజారోగ్యాన్ని కూడా కమీషన్ల కోణంలో చూసే దుఃస్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పడకేశాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఎటో వెళ్ళిపోయాడు. 108, 104 సర్వీసులు కునారిల్లు తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం కుప్పకూలింది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వాల ప్రాథమిక విధి. పౌరులందరికీ ఉచితంగానే విద్య, వైద్యాలను అందజేయడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యంగా నాగరిక ప్రపంచమంతా గుర్తించింది. కానీ, మనం మాత్రం విద్య, వైద్యాలను కొనుక్కోవాలనే అనాగరిక వ్యవస్థలోకి, రాజ్యాంగ విరుద్ధ పాలనలోకి జారిపోవడం మన అజ్ఞానమా... అమాయకత్వమా... ప్రశ్నించుకోవాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్
-
RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
-
ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్
-
చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే
-
ఎరువుల్లేవ్.. యాతన భరించలేకున్నాం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎరువుల కోసం రైతులు ఆందోళన చేయడం చూశాం... కానీ, ఎరువుల కొరత కారణంగా తాము నరకం చూస్తున్నామంటూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ) ఏకంగా కలెక్టరేట్‌ను ముట్టడించారు. అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో కావడం గమనార్హం. గురువారం పగటి వేళ విధులు నిర్వహించిన వీరు... రాత్రి కలెక్టరేట్‌కు వచ్చి ఆందోళన చేశారు. రాత్రి 10 దాటే వరకు నిరసన కొనసాగగా.. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వారితో చర్చలు జరిపారు. కాగా, అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు రణస్థలం వరకు, అటు భామిని నుంచి ఇటు శ్రీకాకుళం వరకు జిల్లావ్యాప్తంగా 400 మంది వ్యవసాయ, ఉద్యాన సహాయకులు తరలివచ్చారు.వీరిలో సగంపైగా మహిళా ఉద్యోగులే. ‘‘నరసన్నపేటలో ఓ టీడీపీ నేత డబ్బులివ్వకుండా 50 బస్తాలు పక్కనపెట్టాలని డిమాండ్ చేశాడు. కుదరదని చెబితే చంటి పాప ఉన్న నన్ను సుదూర ప్రాంతానికి డిప్యూటేషన్‌పై వేశారు’’ అని లావణ్య వాపోయారు. ఎరువుల కొరతకు తోడు, రాజకీయ ఒత్తిళ్లతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురవుతున్నామని కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. యూరియా లేక రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నామని, నానా దుర్భాషలాడుతున్నారని, భౌతిక దాడులకు దిగే పరిస్థితులున్నాయని వాపోయారు.కార్యాలయంలోనే ఉన్న కలెక్టర్‌కు... సంబంధిత యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ బయటకు వచ్చి ఉద్యోగులతో మాట్లాడారు. ఎరువుల పంపిణీ నుంచి తమను మినహాయించి, శాఖ విధులు అప్పగించేలా చూడాలని వీఏఏలు కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో వ్యవసాయ, ఉద్యానవన అసిస్టెంట్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 100 బస్తాల యూరియాకు 150 ఫోన్లు100 బస్తాల యూరియా వస్తే 150 పర్యవేక్షక ఫోన్లు, తమకంటే తమకు ఇవ్వాలని 150 మంది ఒత్తిడి చేస్తున్నారని వీఏఏలు వాపోయారు. నాయకుల సూచనల మేరకు తప్పులు జరిగితే చిరుద్యోగులైన తాము బలి అవుతున్నామని తెలిపారు. ఇలాంటి సమస్యలు క్షేత్ర స్థాయిలో అనేకం ఉన్నాయని, అధికారులకు తెలిసినా, పరిష్కారం చూపడం లేదని తెలిపారు. వ్యవసాయ సహాయకుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పలుచోట్ల యూరియా ఇతర ఎరువులను రాజకీయ నాయకులు పట్టుకెళ్లగా, ఆ ఆర్థిక భారం వీఏఏలపై పడిందని తెలిపారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలుసని, క్షేత్రస్థాయి ఉద్యోగులపై భారం వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, అ«ధికార ఒత్తిళ్లతో ఉద్యోగులు అనారోగ్యం పాలవుతున్నారని, నిబంధనల ప్రకారం వీఏఏలకు సంబంధం లేని పనులు అప్పజెప్పి టార్గెట్లు విధించి మనస్తాపానికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు. -
యూరియా దొరక్కపోతే చచ్చిపోతా
వజ్రపుకొత్తూరు రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలకు అవసరమైన సమయంలో యూరియా కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. యూరియా కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిన ఓ రైతు సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నారు. యూరియా దొరక్కపోతే చచ్చిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం గణపతి అనే రైతు ఆవేదన ఇలా ఉంది. ‘గణపతి అనే నేను ఆటో నడపలేక నాలుగు ఆవులను కొనుక్కున్నా. మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. ఓ వైపు నీరు సరిపడా లేకపోయినా ఇంజిన్లు పెట్టుకొని బాధలు పడుతున్నాం.మరో వైపు యూరియా దొరకడం లేదు. గోల్మాల్ చేసేస్తున్నారు. ఎరువు కావాలంటే 1బి కావాలంటున్నారు. కౌలు రైతులకు 1బి, పాసు పుస్తకాలు ఇవ్వడం లేదు. సచివాలయాల్లో సిబ్బంది ఉండటం లేదు. రైతులకు దొరకని యూరియా బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.700 పైచిలుకుతో దొరుకుతోంది. మొన్నే మా ఫ్రెండ్ బ్లాక్ మార్కెట్లో రూ.750తో కొనుక్కొచ్చాడు. ఆర్బీకేల్లో యూరియా ఎందుకు దొరకడం లేదు? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యూరియా కోసం ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. కూటమి పాలనలో చాలా ఇబ్బంది పడుతున్నాం.ఆటో వాళ్ల బతుకులు బాగో లేవు. రైతుల బతుకులూ అంతే. చదువుకున్న పిల్లలకు బతుకుదెరువు లేదు. డాక్టర్ కోర్సు చదవాలనుకున్న విద్యార్థులకు బతుకులు లేవు.. ఇలాగైతే ఎలా? ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఏమైనా అడిగితే అరెస్టులు.. తన్నండ్రా అని కూటమి నాయకులు అంటున్నారు. యూరియా దొరక్క.. ఎరువులు దొరక్క రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే.. ఏం చేయాలో చెప్పండి సార్.. ఎలా వ్యవసాయం చేయాలి.. బతకాలా, ఎండ్రీను తాగి సావాలా.. పరిష్కారం చెప్పండి సార్. యూరియా దొరక్కపోతే వారంలో చచ్చిపోవాలనుకుంటున్నా..’ అని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పురుగుల మందు డబ్బా చూపిస్తూ ఈ రైతు వ్యక్తం చేసిన ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Ravindranath Reddy: ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడమే బాబు విజనరీ
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: అమర్నాథ్
-
మోసాలు, అబద్ధాలతో.. అట్టర్‌ఫ్లాప్ సినిమాకు 'బలవంతపు విజయోత్సవాలా'?: వైఎస్ జగన్
ఈ రోజు (బుధవారం) ఈనాడులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెలనెలా రూ.1500.. ఏడాదికి రూ.18 వేలు హామీ మాయమైంది. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఎగిరిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలకు.. ఇప్పుడిచ్చిన ప్రకటనలకు పొంతనే లేదు. చంద్రబాబు మాదిరిగా కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ప్రపంచంలో మరొకరు ఉంటారా? వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా, ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం, అగచాట్లు పడటం చూశారా? ఇప్పుడే ఎందుకిలా జరుగుతోంది? అప్పుడు, ఇప్పుడు అదే ముఖ్యమంత్రి పదవే. అప్పుడున్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు. కానీ అప్పుడు ఈ దుస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు సీఎంగా జగన్ ఉన్నాడు. జగన్ అనే వ్యక్తికి రైతులు కష్టాలు పడకూడదు అనే తపన, తాపత్రయం ఉంది. రైతులకు మంచి చేయాలి అనే ఆలోచనలు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. అదే అప్పటికీ, ఇప్పటికీ తేడా. –మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్.. సినిమా అట్టర్ ఫ్లాప్ అని ప్రజలందరికీ అర్థమైంది. ఇలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాకు అనంతపురంలో బలవంతపు విజయోత్సవాలు చేస్తున్నారు’ అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక వైపు దారుణమైన పాలన సాగిస్తూ, మరో వైపు మోసం చేస్తూ హామీలన్నీ ఎగ్గొడుతున్నారంటూ ఎత్తిచూపారు. కళ్లార్పకుండా జంకు బొంకు లేకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు అత్యంత నేర్పరి అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలు, పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్టుగా చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో బలవంతపు సంబరాలు చేసుకుంటున్నారని ఏకి పారేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై ‘ఈనాడు’లో ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ (ప్రకటన)ను.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా బుధవారం సంచికలో ఇచ్చిన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూపిస్తూ.. వాటిలో ఎగ్గొట్టిన హామీలను ఎత్తిచూపుతూ.. చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతారో, ఏ స్థాయిలో మోసం చేస్తారో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమేనంటూ తూర్పారబట్టారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోలు, ఆ హామీల అమలు వల్ల ఒనగూరే ప్రయోజనంపై ఇంటింటికీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇచ్చిన బాండ్లను, ఇప్పుడు ఆ హామీల అమలు తీరును ఎత్తిచూపుతూ చంద్రబాబు మోసాలను సాక్ష్యాధారాలతో వివరించారు. సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ఆరోగ్యశ్రీకి మంగళం పాడటం.. యూరియా, ఇతర ఎరువులు దొరక్క రైతుల కష్టాలు.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక పోవడం, ఉచిత పంటల బీమాను ఎగ్గొట్టడంపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా నాణేనికి ఒక వైపు మాత్రమే చెబుతోందని.. మరో వైపు ఏం జరుగుతోందో ప్రజలకు వివరించడానికే మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రపంచంలో చంద్రబాబులా అబద్ధాలు చెప్పగలిగే నైపుణ్యం ఎవరికైనా ఉందా?⇒ చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో, ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్పై ఎన్నికలకు ముందు 2024 మే 9న ఈనాడులో ఇచ్చిన ప్రకటనలో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి.. స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం, ప్రతి ఇంటికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ఆ ప్రకటనలో ప్రచారం చేశారు. ⇒ ఈ రోజు (బుధవారం) అదే ఈనాడులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెలనెలా రూ.1500.. ఏడాదికి రూ.18 వేలు హామీ మాయమైంది. ఆ స్థానంలోకి 204 అన్న క్యాంటీన్లు వచ్చాయి. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఎగిరిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలకు.. ఇప్పుడిచ్చిన ప్రకటనలకు పొంతనే లేదు. చంద్రబాబు మాదిరిగా కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ప్రపంచంలో మరొకరు ఉంటారా? అన్న క్యాంటీన్లు సూపర్ సిక్స్ హామీల్లో గతంలో ఇచ్చినట్టు మనం అనుకోవాలట! ⇒ ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల ప్రకటనతో మోసం చేయడమే కాకుండా ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. ప్రతి ఫోన్‌కు మెసేజ్ పంపించారు. అందులో ముందుగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో బటన్ నొక్కితే ఆ కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాల వల్ల ఒనగూరే ప్రయోజనం ఎంత అన్నది వస్తుంది. మెహరాజ్ బేగం షేక్‌కు ఇచ్చిన బాండుకు సంబంధించి బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీలో మీ నమోదు సంఖ్య ఇది.. మీ సంక్షేమ వివరాలకు బటన్ నొక్కండి.. అని ఉంది. మెహరాజ్ బేగం షేక్ యూనిక్ కోడ్.. వయసు, లింగం, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యుల వివరాలు వచ్చాయి. వారికి ఆడబిడ్డ నిధి కింద రూ.1,500.. అంటే ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నందున ఏటా రూ.36 వేలు, తల్లికి వందనం రూ.15 వేలు చొప్పున ఇద్దరికి రూ.30 వేలు, అన్నదాత సుఖీభవ కింద రైతులు లేరు కాబట్టి సున్నా.. యువగళం కింద ఎవరూ లేరు కాబట్టి సున్నా.. అని పెట్టారు. మొత్తంగా ఆ కుటుంబంలో రూ.3.33 లక్షలు లబ్ధి పొందేందుకు అర్హత సాధించారని.. 2024 జూన్ నుంచి ఈ మొత్తం వారి అకౌంట్లలో జమ చేయడం ప్రారంభమవుతుందని గ్యారంటీ ఇస్తూ.. వాటిని త్రికరణశుద్ధిగా అమలు చేస్తామని ప్రమాణం చేస్తూ బాబు సంతకం చేసి మరీ ఇచ్చారు. ఇలా ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ⇒ టీడీపీ, జనసేన కూటమి సంయుక్తంగా ఓ వైపు చంద్రబాబు ఫొటో.. మరో వైపు పవన్ కళ్యాణ్ ఫొటో ముద్రించిన బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో కూటమి నేతలు ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ⇒ టీడీపీ కూటమి నేతలు ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లలు కన్పిస్తే నీకు రూ.15 వేలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు కనపడితే నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు.. చిన్నపిల్లల అమ్మమ్మలు కనిపిస్తే మీ వయసు 50 ఏళ్లు కాబట్టి మీకు రూ.48 వేలు, 20 ఏళ్ల పిల్లోడు బయటకొస్తే నీకు రూ.36 వేలు, రైతు కనిపిస్తే పీఎం కిసాన్ కింద ఇచ్చేది కాక అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇస్తూ బాండ్లు ఇచ్చారు. ఇంటిలో ఎవరు కనపడితే వాళ్లకు ప్రతి ఒక్కరికీ బాండ్లు చూపించి మోసం చేశారు.నాడు చంద్రబాబు ఏమన్నారో వినండి⇒ ‘ఒకటే హామీ ఇస్తున్నా. జగన్మోహన్రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా’ ⇒ ‘రైతులకు సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇస్తాం. దీనిని టీడీపీలో నిర్ణయించాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్‌లు లేవు. పూర్తిగా మా ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత మాది’. ⇒ ‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని.. సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే.. ఒక్కటే చెప్పండి.. మా చంద్రన్న చెప్పాడు.. నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వు ఏమీ అడగడానికి వీలులేదు. ఇది చంద్రన్న నాకిచ్చిన హక్కు అని గట్టిగా చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు’. ⇒ ‘నా ఆడ బిడ్డల కష్టాలు చూసి ఆలోచించా. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఆలోచించా. మీ ఖర్చులు పెరిగాయి. దుర్మార్గుడు దీపం ఆర్పేస్తున్నాడు. అందుకే మళ్లీ దీపం వెలిగిస్తా. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా’. ⇒ ‘ప్రతి ఒక్క మహిళను మహా శక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలని నా ఆలోచన. అందుకే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 నేరుగా మీ అకౌంట్లో వేస్తాం’. ⇒ ‘ఇప్పుడు హామీ ఇస్తున్నా.. ఏపీలోని యువతను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాం. ఇక్కడికి పరిశ్రమలు తెస్తాం. ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత టీడీపీది. అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం. ఎంత తమ్ముళ్లూ.. ఎంత.. రూ.3 వేలు ఇస్తాం’.చంద్రబాబూ.. ఇవన్నీ మోసాలు కావా?⇒ ఈ రోజు (బుధవారం) అనంతపురంలో సూపర్‌హిట్ పేరుతో సభ పెట్టావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను.. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా? ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ పడ్డావు. ఇది మోసం కాదా? ⇒ నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడ్డావు. అవి ఇవ్వక పోవడం మోసం కాదా? అది నీ సూపర్‌సిక్స్ హామీ కాదా? ⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా? పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈ నెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. ⇒ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా బస్సుల్లో ఫ్రీ (ఉచితం) అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతివ్వడం మోసం కాదా?⇒ ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ (ఉచితం) అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గాను, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా? ⇒ పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?⇒ తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి కోతలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏడాదికి రూ.15 వేలు ఇస్తానన్నావు. తొలి ఏడాది రూ.15 వేలు ఎగ్గొట్టావు. రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టావు. మిగిలిన వారికి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా? ⇒ గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యా దీవెన, వసతి దీవెన, పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ రద్దు చేశావు. ఇది మోసం కాదా?యథేచ్ఛగా దోపిడీతో సంపద పెంచుకుంటున్న చంద్రబాబు ముఠా⇒ ఇసుకతో పాటు లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కళ్లెదుటే దోచుకుంటోంది. ప్రతి గ్రామంలోనూ బెల్ట్‌షాపులు వెలిశాయి. అనధికారిక పర్మిట్ రూములు నడుస్తున్నాయి. అక్కడ ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ , లేటరైట్ ఇలా అన్ని వనరులను మింగేస్తూ చంద్రబాబు ముఠా సొంత సంపదను పెంచుకుంటోంది. ⇒ అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. నిజానికి చదరపు అడుగు రూ.4500తో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలలో ఫైవ్ స్టార్ వసతులతో లగ్జరీ నిర్మాణాలు చేయొచ్చు. కానీ.. రాజధాని అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.పది వేలు వెచ్చిస్తూ దోచుకుంటున్నారు. ⇒ ఇంకా శనక్కాయలు, పప్పు బెల్లాలకు ఇష్టం వచ్చినట్లుగా లూలూ ఉల్లూ.. ఉర్సా బర్సా.. అంటూ ఇష్టం వచ్చినోళ్లకు చంద్రబాబు భూములు పంచి పెడుతున్నారు. కుడి, ఎడమల దోపిడీ సాగిస్తున్నారు. రాష్ట్రంలో దోపిడీకి పరాకాష్ట 17 మెడికల్ కాలేజీలను స్కామ్‌లకు పాల్పడుతూ అమ్మేయడం. ఒకవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతోంటే.. మరోవైపు చంద్రబాబు ఆదాయం, ఆయన అనుయాయుల సంపద పెరుగుతోంది. చంద్రబాబు ముఠా దోచేస్తోంది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది.రికార్డు స్థాయిలో అప్పు.. అది ఎవరి జేబులోకి వెళ్తోంది? ⇒ 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇది ఎవరి జేబులోకి పోతోంది? ఈ స్థాయిలో అప్పు చేసిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలోనే లేవు. ⇒ 2014లో రాష్ట్రం విడిపోయే నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన, ఇవ్వని అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం రూ.1,40,717 కోట్లు.. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఆ అప్పు ఏకంగా రూ.3,90,247 కోట్లకు చేరింది. అంటే 2014–19 మధ్య రూ.2,49,350 కోట్ల అప్పు చేశారు. ఏటా అప్పుల్లో వార్షిక సగటు వృద్ధి రేటు (సీఏజీఆర్) 22.63 శాతం.⇒ మా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, గత ఏడాది మేము దిగిపోయే నాటికి ఆ మొత్తం రూ.7,21,918 కోట్లకు చేరుకుంది. అంటే మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. ఏటా అప్పుల సగటు పెరుగుదల (సీఏజీఆర్) 13.57 శాతం మాత్రమే.⇒ మా ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో మేము చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. అంటే మేము ఐదేళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం చంద్రబాబు కేవలం ఈ 15 నెలల్లోనే చేశారు. ⇒ రికార్డు స్థాయిలో అప్పు చేసినా, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ⇒ మా ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. మరి అప్పుగా తెచ్చిన రూ.1,91,361 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో చంద్రబాబు ముఠా జేబులోకి వెళ్లాయి. -
కూటమి సర్కారు బరితెగింపు
జనం పక్షాన నిలిచిన కలంపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కత్తిగట్టింది. గత పదిహేను నెలల పాలనలో వరస కుంభకోణాలూ, వంచనలూ తప్ప చేసిందేమీ లేదని బట్టబయలవుతున్నకొద్దీ దిక్కుతోచక ‘సాక్షి’పైనా, ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిపైనా అక్రమ కేసులతో రెచ్చిపోతోంది. రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన బాధ్యతను పక్కనబెట్టి రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మారుస్తోంది. పత్రికలపై కక్షగట్టడంలో ప్రభుత్వ నైచ్యం హద్దులు దాటింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే వెనువెంటనే కేసులు రిజిస్టర్ చేయాలంటూ కూటమి సర్కారు మౌఖిక ఆదేశాలిచ్చిందంటున్నారు. అందులో భాగంగానే సోమవారం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయానికొచ్చి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు అందజేశారు. గత మే నెలలోనే కూటమి ప్రభుత్వం ఈ అరాచకానికి నాంది పలికింది. విజయవాడలో ధనంజయరెడ్డి ఇంట్లోకి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తప్పుడు సాకులతో అక్రమంగా చొరబడి,‘మద్యం కేసు నిందితులు మీ ఇంట్లో ఉన్నారేమో తెలుసుకోవటానికి వచ్చామంటూ మూడు గంటలపాటు హడావుడి సృష్టించింది. తలుపులు మూసి, సోదాలు చేసి, దౌర్జన్యంతో ఫోన్ లాక్కొనే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వాస్తవాలను ఏ మాత్రం సహించే స్థితిలో లేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆఖరుకు వార్తలను, వ్యాఖ్యలను కవర్ చేసినా కూడా ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెడుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లోని వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇలా కక్షగట్టింది. అసలే స్కాంలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడిదాకో ఎందుకు... 2015 మొదలుకొని 2019 వరకూ అధికారం వెలగబెట్టినప్పుడు ఏటా రూ. 1,300 కోట్ల చొప్పున అయిదేళ్లలో ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర గండికొట్టిన ఘనుడాయన. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. కాగ్ ఆధ్వర్యంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నిశితంగా గమనించి బట్ట బయలు చేసిన చేదు నిజం. దీన్నంతటిని వెలుగులోకి తెస్తున్నందునే ‘సాక్షి’పై సర్కారు వారి అక్కసు. ఇదొక్కటే కాదు... అక్రమ మార్గాల్లో అధికారాన్ని చెరబట్టింది మొదలు కూటమి పెద్దలు చేయని అరాచకం లేదు. ఇసుక దోపిడీ, భూకబ్జాలు, పేరూ ఊరూ లేని సంస్థలకు విలువైన భూముల్ని కారు చౌకగా కట్టబెట్టడాలూ, మహిళలపై అఘాయిత్యాలూ.... ఒకటేమిటి, కూటమి సర్కారు చేస్తున్న సమస్త అరాచకాలనూ ‘సాక్షి’ బయట పెడుతోంది. అందుకే తప్పుడు కేసులు బనాయించి నోరుమూయించాలని చూస్తోంది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నిత్యం రాజకీయ చైతన్యంతో తొణికిసలాడే ప్రాంతం. ఇలాంటిచోట ఎంతకైనా బరితెగించి పాలిద్దామని, నిజాలు బయటపెడుతున్నవారి నోరు నొక్కుదామని చూడటం తెలివితక్కువతనం. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా మీడియా పైనా, ఎడిటర్లపైనా ఈ స్థాయిలో కక్ష తీర్చుకున్న దాఖలాలు లేవు. గతంలో ‘సాక్షి’ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ మూకలు దాడులు చేశాయి. ఈమధ్య పోలీసులే ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇటీవల విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలోకి అర్ధరాత్రి చొరబడి అరాచకం సృష్టించారు. ఇప్పుడిక వార్త ప్రచురించటాన్ని కూడా నేరంగా పరిగణించి నోటీసులు జారీ చేయటం, అక్రమ కేసులు బనాయించటం మొదలైందన్నమాట! ఒక పార్టీ నాయకుడు నిర్వహించిన మీడియా సమావేశం వివరాలు ప్రచురించటం నేరమెలా అవుతుందో సర్కారు చెప్పగలదా?మన రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగం. పత్రికా స్వేచ్ఛ అంటే సమాచారాన్ని తెలుసుకోవటానికి ప్రజలకుండే హక్కు.దీన్ని కాలరాయాలని చూస్తే ప్రజాస్వామ్య శక్తులు సహించవు. ‘సాక్షి’ గొంతు నొక్కితే తమ అరాచకాలను ప్రశ్నించేవారుండరని కూటమి ప్రభుత్వం కలలుగంటోంది.అందుకే నోటీసులతో, తప్పుడు కేసులతో బెదిరిస్తోంది. పాలకుల అక్రమాలనూ, అన్యాయాలనూ, అరాచకాలనూ బట్టబయలు చేయటం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం ‘సాక్షి’ కర్తవ్యం. పాలకుల చవకబారు ఎత్తుగడలకు భయపడి దీన్నుంచి వైదొలగే ప్రశ్నే లేదు. -
YS జగన్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పు చంద్రబాబు
-
బాబు ఇచ్చేది ఇది.. ఉల్లి రైతులపై.. బాబు దెబ్బ
-
అనంతపురంలో కూటమి సభ అట్టర్ ఫ్లాప్
-
YS Jagan: ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయడం లేదు
-
రైతుల ధర్నాను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది: కాకాణి
-
ట్రాక్టర్లలో విద్యార్ధుల తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
-
సంపద సృష్టి అంటే.. నీ ఆస్తులు పెంచుకోవడం కాదు!
-
అన్నదాత పోరు @పుట్టపర్తి
-
అన్నదాత పోరు @సూళ్లూరుపేట
-
'అన్నీ చేశామని డబ్బా కొట్టుకుంటారు..! బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్
-
ప్రజల, ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలకు,బెల్లానికి అమ్ముతున్నాడు
-
YSRCP పిలుపుతో భారీగా తరలివచ్చిన రైతులు
-
యూరియా కొరత, రైతు సమస్యలపై YSRCP పోరుబాట
-
మీ ప్రభుత్వంలో ఎంత,మా ప్రభుత్వంలో ఎంత.. బాబుకి సతీష్ రెడ్డి ఛాలంజ్..
-
RK Roja: చంద్రబాబు, అచ్చెన్నాయుడు కొంచమైనా సిగ్గు పడండయ్యా..
-
కాడి వదిలి రోడ్డెక్కి..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగానే ‘వ్యవసాయాన్ని దండగ’గా మార్చేస్తున్నారు! పొలం పనుల్లో కోలాహలంగా కనిపించాల్సిన రైతన్నలు రోడ్డెక్కి ఆక్రోశిస్తున్నారు! పంట కాపాడుకునేందుకు నోరు విప్పి ఎరువులు అడుగుతుంటే సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు! టీడీపీ కూటమి సర్కారు పాలనలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి రైతులు పండించిన పంటలకు భద్రత లేకుండా చేశారు. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. విత్తు నుంచి విక్రయం వరకు ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాల్లో కోత పెట్టి అందకుండా చేశారు. అదునులో యూరియా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక్క కట్ట కోసం తిండి తిప్పలు మానుకుని క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి కలి్పంచారు. ధాన్యం నుంచి టమాటా వరకు, మిరప నుంచి మామిడి, బత్తాయి వరకు కనీసం మద్దతు ధర దక్కకపోవడంతో అన్నదాతలు హతాశులయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కొనేవారు లేక.. అప్పులు తీర్చే దారి లేక.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతుంటే కావాలనే నాటకాలు ఆడుతున్నారంటూ ప్రభుత్వ పెద్దలు నిస్సిగ్గుగా ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో.. యూరియా దొరక్క, మద్దతు ధర కరువై అల్లాడుతున్న అన్నదాతలకు వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తోంది. రైతన్నలతో కలసి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అన్నదాత పోరు’లో పెద్ద ఎత్తున పాల్గొని సత్తా చాటేందుకు సిద్ధమైయింది. ఆంక్షలతో ‘కట్ట’డి.. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు దారి మళ్లించడంతో ప్రస్తుతం యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. అదునులో యూరియా అందక వరి, మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కట్ట.. అరకట్ట అంటూ రేషన్ సరుకుల మాదిరిగా విదిలిస్తుండటంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల చేతిలో దోపిడికీ గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో రెట్టింపు ధరలకు అమ్ముతుంటే కొరడా ఝళిపించాల్సిన సర్కారు కళ్లుమూసుకుంది.ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదు..గడిచిన ఏడాదిగా ధాన్యం మొదలు టమాటా వరకు, మిర్చి నుంచి పొగాకు దాకా ఏ పంట చూసినా మార్కెట్లో గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా దక్కక, పెట్టుబడి ఖర్చులు కూడా రాక అన్నదాతలు అల్లాడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్‌తో వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మద్దతు ధర దక్కక పోవడంతో గడిచిన ఏడాదిలో రైతులకు రూ.50 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన 15 నెలల్లో దాదాపు 250 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకుండా పోయింది. వరి, మిరప, మామిడి రైతులను ముంచినట్లే ఉల్లి రైతులనూ కూటమి ప్రభుత్వం మంచేస్తోంది. ధర లేక మిరప రైతులు గగ్గోలు పెడితే క్వింటా రూ.11,781 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పి చివరికి మొండిచేయి చూపింది. తోతాపురి మామిడిని కిలో రూ.12 చొప్పున తామే కొంటామని చెప్పిన ప్రభుత్వం చివరికి రూ.4 సబ్సిడీ రూపంలో అందిస్తామని నమ్మబలికి మోసం చేసింది. అదే రీతిలో ఉల్లి క్వింటాల్ రూ.1,200 చొప్పున కొంటామని మభ్యపుచ్చి కొనుగోళ్ల ప్రక్రియను మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేసింది. తాజాగా మార్కెట్–మద్దతు ధరలకు మధ్య వ్యత్యాసం మొత్తాన్ని జమ చేస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డులో మూడో వంతు సరుకును నాణ్యత లేదనే సాకుతో తిరస్కరిస్తుండగా మిగిలిన ఉల్లిని క్వింటా రూ.100–600కి మించి వ్యాపారులు కొనడం లేదు. ఏలూరు డీసీఎంఎస్ వద్ద ఎరువుల కోసం బారులు తీరిన రైతులు ఎటుచూసినా రైతుల ఆందోళనలు, ఆక్రందనలే..గిట్టుబాటు ధర లేక బత్తాయి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు పలికిన బత్తాయి ప్రస్తుతం అధఃపాతాళానికి పడిపోయింది. పులివెందుల మార్కెట్లో గిట్టుబాటు ధర లేక సోమవారం రైతులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వాలిటీ ఉన్న బత్తాయికి వేలం పాట నిర్వహించగా, గరిష్టంగా 5 శాతం కాయలకు టన్ను రూ.14,200 పలుకగా, నాణ్యత లేని కాయను రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య మాత్రమే కొనుగోలు చేశారు. అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కాస్త క్వాలిటీ బాగున్న 5–10 శాతం కాయలకు టన్ను రూ.16,500 లభించగా నాణ్యత లేదనే సాకుతో మిగిలిన పంటకు సగటున రూ.6 వేల నుంచి రూ.7 వేల మధ్య లభించింది. గతంలో ఎప్పుడూ ఇంత కనిష్ట స్థాయికి ధరలు పడిపోలేదని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ బత్తాయి రైతులు గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు టమాటా రైతులు సైతం మద్దతు ధర లేక పంటను చేలల్లోనే పశువులకు మేతగా వదిలేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.కృష్ణా జిల్లా కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు 15 నెలల్లో రూ.23,584 కోట్లు ఎగ్గొట్టారు..! అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాస్తవంగా ఏటా రూ.10,716 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.21,432 కోట్లు జమ చేయాల్సి ఉండగా, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. పీఎం కిసాన్తో కలిపి రూ.26 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది తొలివిడతగా రూ.5 వేల చొప్పున రూ.2,342.92 కోట్లతో సరిపెట్టారు. మరొక పక్క 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.930 కోట్ల మేర రైతుల వాటా ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో.. ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు. ఇక 2024–25 ఖరీఫ్‌లో 833.92 కోట్లు, రబీలో రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయకపోవడంతో రైతులకు రూ.2 వేల కోట్లకుపైగా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో యూరియా కోసం క్యూ కట్టిన రైతులు ఇంకోవైపు కరువు ప్రభావంతో పంటలు దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. పంట నష్ట పరిహారం కింద 4.50 లక్షల మంది రైతులకు మరో రూ.650 కోట్లు ఎగ్టొట్టారు. ఇలా ఏడాదిలో అన్నదాతా సుఖీభవ, పంటలబీమా, పంట నష్టపరిహారం, కరువు సాయం, సున్నా వడ్డీ రాయితీ బకాయిలు వెరసి మొత్తం దాదాపు రూ.23,584 కోట్లకుపైగా చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టింది! అయితే.. మద్దతు ధర లేక రైతులు నష్టపోయిన మొత్తానికి అంతే లేదు. -
TJR Sudhakar: బాబు హయాంలో నీళ్లు దొరకవు.. మద్యం ఏరులై పారుతుంది
-
లోకేష్ నువ్వొక విద్యాశాఖ మంత్రివా..? తండ్రి కొడుకులకు ఇచ్చిపడేసిన AISF లీడర్
-
ప్రతీ ఆటో డ్రైవర్ కు 30 వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్
-
ముస్లిం, మైనార్టీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: ఖాదర్ బాషా
-
Chilli Farmers: YSR జిల్లా పులివెందుల మార్కెట్ యార్డు వద్ద టెన్షన్
-
ప్రైవేట్ మార్కెట్ లో లిక్విడ్ కొంటేనే యూరియా రైతులు ఆ లిక్విడ్ తాగే స్థితికి వచ్చారు
-
Jogi Ramesh: అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవడం చేతకాక పనికిరాని మాటలు
-
కోర్టు కళ్లుగప్పి కుప్పి గంతులు!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయవాడ/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): మద్యం విధానంపై అక్రమ కేసులో ఆది నుంచీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వస్తున్న కూటమి సర్కారు కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా బరి తెగింపు ధోరణితో ప్రవర్తించడం న్యాయవర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రిటైర్డ్ అధికారులు కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ వారు జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు విఫల యత్నాలు చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ వారిని విడుదల చేయకుండా విజయవాడ జిల్లా జైలు వద్ద ఆదివారం ఉదయం మూడు గంటల పాటు హై డ్రామా నడిపింది.ఉదయం 6 గంటలకే రావాల్సిన జైలర్‌ను 9 గంటల వరకు రానివ్వకుండా చేసి ప్రభుత్వ పెద్దలు తెరచాటు కుతంత్రాలకు పాల్పడ్డారు. దొంగ కేసుల్లో ఇరికించి బయటకు రాకుండా చేసే కుట్రలకు మరింత పదును పెట్టారు. అయితే న్యాయవాదులు జైలు ఎదుట ధర్నాకు దిగటం.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం కావడం.. అప్రజాస్వామిక పోకడలపై అన్ని వర్గాలు ప్రశి్నస్తుండటంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం హడావుడిగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి వారు జైలు నుంచి విడుదల కాకుండా ఉండేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించింది.అందుకు జైలు అధికారులు సహకరిస్తూ ఉద్దేశపూర్వకంగానే విడుదలలో తీవ్ర జాప్యం చేశారు. మచిలీపట్నం నుంచి జైలు సూపరింటెండెంట్ బస్సులో వస్తున్నారంటూ కొద్దిసేపు ఈ నాటకాన్ని రక్తి కట్టించగా.. తీరా ఆయన వచ్చాక కూడా విడుదల చేయకుండా ఆలస్యం చేశారు. అయితే ఆ కుట్రలేవీ ఫలించకపోవడంతో ఏసీబీ కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎట్టకేలకు ఉదయం 9.30 గంటల సమయంలో ఆ ముగ్గురూ జైలు నుంచి విడుదలయ్యారు. గోవిందప్ప తదితరులకు ఏసీబీ కోర్టు శనివారం సాయంత్రం డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కృష్ణమోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది విష్ణువర్ధన్ సకాలంలో పూచీకత్తులను కోర్టుకు సమరి్పంచారు. ఈ నేపథ్యంలో రిలీజ్ ఆర్డర్‌ని జైలుకు పంపాలని ఆయన కోరగా ఏసీబీ కోర్టులోని ఓ అధికారి ఇందుకు ససేమీరా అన్నారు.దీంతో విష్ణువర్ధన్ ఈ విషయాన్ని న్యాయాధికారి భాస్కరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. రిలీజ్ ఆర్డర్‌ను కోర్టు అమీనా ద్వారా జైలు అధికారులకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సదరు కోర్టు ఉద్యోగి మాత్రం మొండికేశారు. మిగిలిన ఇద్దరి పూచీకత్తులు సమరి్పస్తేనే మొత్తం ముగ్గురి రిలీజ్ ఆర్డర్లను జైలుకు పంపుతానని ఆ అధికారి స్పష్టం చేశారు. ఏకంగా న్యాయాధికారి ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా ఆ అధికారి సమయం ముగిసిపోయేంత వరకు తాత్సారం చేశారు. దీంతో కృష్ణమోహన్‌రెడ్డి శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇదంతా స్పష్టంగా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురూ జైలు నుంచి విడుదలైతే హైకోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదని భావించిన ప్రభుత్వ పెద్దలు తెర వెనుక ఏసీబీ కోర్టు ఉద్యోగి ద్వారా ఈ తతంగం నడిపించినట్లు చర్చ జరుగుతోంది. ప్లాన్ ‘బీ’ కూడా బెడిసికొట్టడంతో... ఏసీబీ కోర్టు ఉద్యోగి ద్వారా మొదటి ప్లాన్‌ను అమలు చేసిన ప్రభుత్వ పెద్దలు రెండో ప్లాన్‌లో భాగంగా శనివారం రాత్రి 9.30 గంటలకు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచి్చన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసి అత్యవసర విచారణను కోరింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల మేరకు గోవిందప్ప తదితరులు ఆదివారం విడుదల కానుండటంతో దాన్ని అడ్డుకునేందుకు హౌస్ మోషన్ అస్త్రాన్ని ప్రయోగించింది.దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టును కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ హౌస్ మోషన్ పిటిషన్ల గురించి హైకోర్టు రిజిష్ట్రార్ (జుడీషియల్) ఫోన్ ద్వారా ప్రధాన న్యాయమూర్తి (సీజే) దృష్టికి తెచ్చారు. అయితే ఈ వ్యాజ్యాలపై ఇప్పటికప్పుడు అంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని భావించిన ప్రధాన న్యాయమూర్తి అనుమతిని నిరాకరించారు. వీటిని సోమవారం అనుబంధ కేసుల విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. కోర్టు కేసుల విచారణ జాబితా శుక్రవారం సాయంత్రమే సిద్ధమైపోయినప్పటికీ, అత్యవసరం దృష్ట్యా ఆ వ్యాజ్యాలను అనుబంధ జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై సోమవారం విచారణ జరపనున్నారు. హౌస్‌మోషన్ అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించడంతో బాలాజీ గోవిందప్ప తదితరులను జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వ పెద్దల రెండో ప్లాన్ కూడా బెడిసికొట్టింది. ఎప్పుడైతే హైకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించిందో ఇక అప్పుడు జైలు అధికారులు చేసేదేమీ లేక ఏసీబీ కోర్టు తీర్పు మేరకు గోవిందప్ప తదితరులను జైలు నుంచి విడుదల చేశారు. ఈ ప్రభుత్వానికి న్యాయం, చట్టం అంటే గౌరవం లేదు: ధనుంజయరెడ్డి కోర్టు ఆదేశాలన్నా ఈ ప్రభుత్వానికి లెక్క లేదని.. న్యాయం, చట్టం అంటే ఏమాత్రం గౌరవం లేదని అనంతరం ధనుంజయరెడ్డి పేర్కొన్నారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఉద్దేశపూర్వకంగానే విడుదలలో జాప్యం చేశారని చెప్పారు.జైలు ఎదుట న్యాయవాదులు,నేతల బైఠాయింపు..వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణకుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, పార్టీ నేతలు, న్యాయవాదులు ఉదయం ఆరు గంటల నుంచే పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని నిరీక్షించారు. కోర్టు బెయిల్ ఇచ్చినా 15 గంటల పాటు జైలులోనే నిర్బంధించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలు గడిచిపోతున్నా విడుదల చేయకపోవడంతో జైలు సూపరింటెండెంట్ తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. జైళ్ల శాఖ డీఐజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైలు అధికారుల తీరుపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు విష్ణువర్థన్, పి.నిర్మల్ రాజేష్ తీవ్ర నిరసన తెలిపారు. 15 గంటలు అక్రమంగా జైల్లో ఉంచారు ముగ్గురికీ శనివారం సాయంత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరు గంటలలోపే జైలు వద్దకు వచ్చాం. ఆదివారం ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామన్నారు. విడుదల చేయకుండా అధికారులు కావాలనే తాత్సారం చేశారు. 15 గంటలకు పైగా ముగ్గురిని జైలులో అక్రమంగా ఉంచారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. – చంద్రగిరి విష్ణువర్థన్, పి.నిర్మల్ రాజేష్, న్యాయవాదులు కోర్టు ఉత్తర్వుల ధిక్కరణే ఏసీబీ కోర్టు ముగ్గురికీ బెయిల్ మంజూరు చేసింది. జైలు అధికారులకు శనివారం సాయంత్రమే మెయిల్ ద్వారా, నేరుగా అందజేసింది. ఫోన్లో జైలు సూపరింటెండెంట్‌ను సంప్రదించినా సకాలంలో విడుదల చేయకుండా జాప్యం చేశారు. ఇది పూర్తిగా కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కిందకే వస్తుంది. జైలు నియమావళి ప్రకారం బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం లోపల ఉంచినా అక్రమ నిర్బంధమే అవుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తించారు. – టి.నాగార్జునరెడ్డి, న్యాయవాది పస లేని అక్రమ కేసు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కోర్టులంటే లెక్కలేదు. ఆ ముగ్గురూ జైలు నుంచి బయటకు రాకుండా లంచ్ మోషన్ దాఖలు చేసేందుకే విడుదలలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. కోర్టు ఉత్తర్వులను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే లేని లిక్కర్ స్కామ్‌ను ఉన్నట్లుగా చిత్రీకరించి అక్రమంగా జైల్లో పెట్టారు. చార్జ్ïÙట్ అంతా తప్పుల తడక. ముగ్గురికీ బెయిల్ రావడంతో ఈ అక్రమ కేసులో పసలేదని ప్రభుత్వం భయపడుతోంది. చంద్రబాబు చెప్పినట్లుగా సిట్ అధికారులు కథలు అల్లుతున్నారు. న్యాయవాదులు సైతం ఆందోళన చేయాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపురించింది. గతంలో వంశీపై బనాయించిన కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. – అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత -
ఆంధ్రరాష్ట్రం.. స్కామ్‌లమయం.. ‘భూం’ చేద్దాం..!
వీటికి అదనంగా ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్యాపిటల్ సబ్సిడీతో పాటు 100 శాతం నాలా మినహాయింపు, విద్యుత్, నీరు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఆ కంపెనీలకు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఏపీఐఐసీ నుంచి భూములు పొందిన ఈ సంస్థలు పార్కులను అభివృద్ధి చేసి మార్కెట్ రేటుకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటాయి.సాక్షి, అమరావతి: సర్కారు భూమిని ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే తిరిగి ఖజానాకే ఆదాయం సమకూరుతుంది! భావి తరాలకు విలువైన సంపద అందుతుంది. ఆ ఆస్తి భద్రంగానూ ఉంటుంది. అందుకు ‘ఏపీఐఐసీ’ లాంటి ప్రభుత్వ సంస్థలే భేషుగ్గా ఉన్నాయి! కానీ చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు తమకు కావాల్సిన వారికి భూములను పప్పు బెల్లాలు, శనక్కాయల మాదిరిగా పందేరం చేస్తోంది.. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు పంచి పెడుతోంది. రాష్ట్రంలో భూ కేటాయింపులను స్కామ్లమయంగా మార్చేసింది! నిన్న.. ఊరూ పేరు లేని ‘ఉర్సా’ నుంచి నేడు.. మూతబడ్డ కంపెనీలకు భూములను కట్టబెట్టడం దాకా ఇదే తంతు! ముడుపులు మూటగట్టే వారికి అప్పనంగా పంచిపెట్టడం కూటమి సర్కారు అవినీతి, దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు ఏది చెబితే అది వేదవాక్కుగా భావించి అమలు చేస్తారని పేరున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీపార్థసారథి డైరెక్టర్‌గా ఉన్న ‘ఇఫ్కో కిసాన్ సెజ్’కు నెల్లూరులో ఏకంగా 2,776.23 ఎకరాలు కేటాయించడం భూ సంతర్పణలకు పరాకాష్ట!! అలాగే.. ‘స్కైరూట్’ కంపెనీకి చిత్తూరు జిల్లా రౌతుసురమాలలో 300 ఎకరాలను ధారాదత్తం చేశారు. సీఎం చంద్రబాబుతో లక్ష్మీ పార్థసారధి టెండర్లు లేకుండానే వేలాది ఎకరాలురాష్ట్రంలో ఏపీఐఐసీకి చెందిన వేలాది ఎకరాలు పచ్చ నేతలకు ఫలహారంగా మారుతున్నాయి! ప్రైవేట్ ఇండ్రస్ట్రియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే పేరిట ఇప్పటికే 5,221 ఎకరాలను కట్టబెట్టడానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరోపక్క అసలు ఎటువంటి టెండర్లే లేకుండా తమకు కావాల్సిన వారికి 4,246.30 ఎకరాలు కట్టబెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేతన్ పరేఖ్ స్టాక్ స్కామ్‌లో భాగంగా హెచ్‌ఎఫ్‌సీఎల్‌కు సెబీ షోకాజు నోటీస్ జారీ చేసినట్టు తెలిపే భాగం అంతేకాదు.. ఈ భూములను అభివృద్ధి చేసినందుకుగాను ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు క్యాపిటల్ సబ్సిడీతో పాటు 100 శాతం నాలా మినహాయింపు, విద్యుత్, నీరు లాంటి ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఆ కంపెనీలకు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇలా ఏపీఐఐసీ నుంచి భూములు పొందిన ఈ సంస్థలు పార్కులను అభివృద్ధి చేసి మార్కెట్ రేటుకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటాయి.ఇఫ్కో కిసాన్ సెజ్‌కు 2,776.23 ఎకరాలునెల్లూరులో పలు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసిన ఏపీఐఐసీని కాదని.. ఏకంగా 2,776.23 ఎకరాలను పారిశ్రామిక పార్కు అభివృద్ధి పేరుతో ఇఫ్కో కిసాన్ సెజ్‌కు కూటమి సర్కారు కేటాయించింది. సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా వ్యవహరించే మాజీ ఐఏఎస్ అధికారి దేవరకొండ లక్ష్మీపార్థసారధి భాస్కర్ ఈ కంపెనీ డైరెక్టర్లలో ఉన్నారు. 2014–19లోనూ, ఇప్పుడు తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో టీడీపీ సర్కారులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ డైరెక్టరుగా వ్యవహరించిన లక్ష్మీ పార్థసారధి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీకి ఎంత దగ్గర అంటే.. ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ స్థాపించిన ఆంధ్రా షుగర్స్‌లో కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తమ చేతిలో మనిషిలా ఉండే పార్థసారధి ఇఫ్కో కిసాన్ సెజ్‌లో డైరెక్టర్‌గా ఉండటంతో రూ.వేల కోట్ల విలువైన భూములను ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబెడుతూ ప్రభుత్వ పెద్దలు ఉత్తర్వులు ఇచ్చేశారు.కుంభకోణంలో ఒక వెలుగు వెలిగిన కంపెనీకి..2001లో దేశ స్టాక్ మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపిన కేతన్ ఫరేఖ్ కుంభకోణం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ స్కామ్‌లో ప్రధానంగా హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ (హెచ్ఎఫ్సీఎల్) పేరు మారు మోగింది. 1998–2001 మధ్య మానిప్యులేషన్ చేయడం ద్వారా హెచ్ఎఫ్సీఎల్ ధరను భారీగా పెంచేసి కేతన్ పరేఖ్ భారీ లాభాలు గడించాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ కంపెనీ ప్రస్తుతం టెలికమ్యూనికేషన్స్ రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వరాహ ఆక్వా ఫామ్స్ మూసివేసినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కాపీ ఇప్పుడు అటువంటి కంపెనీ రక్షణ రంగంలో పెట్టుబడులు పెడుతుందంటూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో 1,000 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని చూస్తుంటే భూ కేటాయింపులపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవంగా మడకశిర వద్ద షెల్స్, టీఎన్టీ ఫిల్లింగ్, మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ తయారీ కోసం మీడియా మాట్రిక్స్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్‌కు ఎకరా రూ.7 లక్షలు చొప్పున 671 ఎకరాలను కేటాయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాము ఉత్పత్తి ప్రారంభించడానికి న్యాయపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల ఈ భూమిని హెచ్‌ఎఫ్‌సీఎల్‌కు బదలాయించాలంటూ ఆ కంపెనీ కోరింది. దీన్ని ఆమోదిస్తూ, మీడియా మాట్రిక్స్‌కు చేసిన భూ కేటాయింపులు రద్దు చేసి వాటిని హెచ్ఎఫ్ఎసీఎల్కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పేరిట అడ్డగోలుగా కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తున్నారనేందుకు ఇది నిదర్శనమని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. కనీసం కంపెనీల పుట్టు పూర్వోత్రాలు పరిశీలించకుండా, న్యాయ సలహాలు తీసుకోకుండా విలువైన భూములను అడ్డగోలుగా కేటాయించడం ఏమిటని విస్తుపోతున్నారు.రమాదేవికి 13.70 ఎకరాలుఇక మహిళా పారిశ్రామికవేత్తనంటూ టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రచారం చేసుకునే ‘ఎలీప్’ రమాదేవికి ఇప్పటికే అనకాపల్లిలో 31 ఎకరాల భూమి కేటాయించగా తాజాగా కుప్పంలో 13.70 ఎకరాలను అప్పగించారు.సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో రమాదేవి మూసేసిన కంపెనీకి 93 ఎకరాలు..విశాఖకు చెందిన వరాహ ఆక్వా ఫామ్స్ 1994లో ఏర్పాటు కాగా ఈ కంపెనీని ప్రస్తుతం మూసివేసినట్లు (స్ట్రైక్ ఆఫ్ ) కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్ డేటా పరిశీలిస్తే తెలుస్తోంది. ఆక్వా రంగంలో ఉన్న కంపెనీ.. అందులోనూ మూతపడిన కంపెనీకి నక్కపల్లిలో బల్క్‌డ్రగ్ పార్కు పక్కనే ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి పేరుతో 93 ఎకరాలను కేటాయించడం గమనార్హం. ఈ కంపెనీ గురించి విశాఖతోపాటు ఆక్వా రంగ ప్రముఖలను ఆరా తీయగా ఇప్పటి వరకు ఆ పేరు ఎప్పుడూ వినలేదన్న సమాధానం వచ్చింది. అలాగే ముంబైకి చెందిన ‘జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్’కు పెందుర్తి వద్ద ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి పేరిటి 63.37 ఎకరాలను కేటాయించారు. -
యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందట.. బాబుపై పేర్ని కిట్టు సెటైర్లే సెటైర్లు
-
నీ ఉచిత సలహాలు ఎవడికి కావాలి.. బాబుపై సజ్జల ఫైర్
-
Students: ఛీ.. ఏం పాపం చేశామని.. నీలాంటి సీఎం దొరికాడు!
-
పేదల కోసం జగన్ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే..!
-
బాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే.. 30 మంది మరణానికి కారణం
-
పేదలు, రైతులపై ఎందుకింత కక్ష..! బాబును ఏకిపారేసిన వెంకట రామిరెడ్డి
-
Vidadala Rajini: మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తే.. మేం వచ్చాక వెనక్కి లాగుతాం
-
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌కు అప్పగిస్తే పేదలు ఎలా చదుకోవాలి
-
జగన్ మెడికల్ కాలేజీలు తెస్తే.. బాబు నాశనం చేస్తున్నారు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గోపిరెడ్డి సంచలన విషయాలు
-
Kiliveti Sanjeevaiah: RBK లు పెట్టి రైతులకు ఎలాంటి కష్టం రానివ్వలేదు..
-
కర్నూలులో ఆటో డ్రైవర్ల భారీ నిరసన..
-
Sajjala Ramakrishna: విజయమ్మ విషయంలో లోకేష్ రాజకీయం..!
-
రైతుల నోట్లో మట్టి.. సిగ్గుపడండి సీఎం, డిప్యూటీ సీఎంకు ఇచ్చిపడేసిన RK రోజా
-
జగన్ తోనే అభివృద్ధి నిజం ఒప్పుకున్న బాబు
-
Katasani Rambhupal: రైతులు ఎదురు తిరిగితే ఏం అవుతుంది బాబుకి తెలియాలి
-
AP: మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్మేందుకు కుట్ర
-
ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదు ఎంపీ మిథున్ రెడ్డి నాతో ఏం చెప్పారంటే..
-
Amarnath: 5 సంవత్సరాల పరిపాలన ముందు.. నీ 30 సంవత్సరాల అనుభవం జీరో
-
Lakshmi Parvathi: వెన్నుపోటుకు 30 సంవత్సరాలు... అందుకే ఈ సంబరాలు
-
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
‘ఈ రోజు రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకునే దిక్కు లేదు. సూపర్ సిక్స్ హామీలంటూ అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతోంది..’ – పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్ ‘2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. ఆ తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ 27వేల మెజార్టీతో గెలిస్తే ఆ తర్వాత కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైఎస్సార్సీపీ 35వేల మెజార్టీతో గెలిచింది’ – వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేకనే ఓటు వేసుకునే స్వేచ్ఛను ప్రజలకు టీడీపీ కల్పించడం లేదని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అది మరోసారి స్పష్టమైందని చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతల అరాచకాలు.. ఓటర్లను అడ్డుకుని టీడీపీ గూండాలు బెదిరింపులకు పాల్పడటాన్ని ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం పులివెందుల నుంచి అంబకపల్లె వెళ్తూ నల్లపురెడ్డిపల్లె వద్ద తన కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులను కలిశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అధికార టీడీపీ గూండాల దౌర్జన్యంతో ఓటు వేయలేకపోయిన నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు పోలింగ్ రోజు అక్కడ నెలకొన్న దారుణమైన పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. అధికార పక్ష నేతల అరాచకాలను కళ్లకు కడుతూ గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఇలాగే చేశారు.. ఆ తర్వాత టీడీపీ కొట్టుకుపోయింది..‘ఆ రోజు.. నల్లపురెడ్డిపల్లెలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలకు ఓట్లు వేసుకునే స్వేచ్ఛ లేకుండా చేసి పోలీసులను వాడుకుని టీడీపీ గూండాలు ఎలా జులుం చేశారో, ఏ రకంగా అన్యాయం చేశారో గ్రామంలో ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న పరిస్థితుల్లో... నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మీ జగన్ రుణపడి ఉంటాడు. మీ ఆప్యాయత, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.గతంలో 2019 ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. ఆ తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ 27వేల మెజార్టీతో గెలిస్తే ఆ తర్వాత కొట్టుకుపోయింది. అదే నంద్యాలలో వైఎస్సార్సీపీ 35 వేల మెజార్టీతో గెలిచింది. అన్యాయం చేసినా, దౌర్జన్యం చేసినా దేవుడు అన్నీ చూస్తాడు. టీడీపీకి గట్టిగా బుద్ధి చెబుతాడు. ఈ రోజు రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకునే దిక్కు లేదు. సూపర్ సిక్స్ హామీలంటూ అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతోంది’ అంబకపల్లె చెరువు వద్ద జలహారతి.. వైఎస్సార్సీపీ కృషితో అంబకపల్లెకు కృష్ణా జలాలు చేరుకున్న నేపథ్యంలో అక్కడి చెరువు వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ జలహారతి ఇచ్చారు. ‘పాడా’ నిధుల ద్వారా అంబకపల్లె గంగమ్మ కుంటకు రూ.1.4 కోట్లతో 14 ఎకరాల భూసేకరణ చేపట్టి కొత్త చెరువును నిర్మించారు. పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో రూ.2.50 కోట్లు వెచ్చించి హిరోజ్‌పురం వద్ద భారీ సంపు ఏర్పాటు చేసి 4.5 కి.మీ. మేర అంబకపల్లె చెరువుకు పైపులైన్ ఏర్పాటు చేయించారు. ఫలితంగా అంబకపల్లె చెరువుకు కృష్ణా నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తంచేశారు.అక్కడకు వచ్చిన వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రహదారిపై పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. క్రేన్ సహాయంతో వైఎస్ జగన్‌కు భారీ గజమాల వేశారు. బాణాసంచా కాలుస్తూ డప్పుల దరువుతో గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరి అభిమాన నేతకు స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. కృష్ణా జలాల మ్యాప్‌ను వైఎస్ జగన్ పరిశీలించి చెరువు శిలాఫలకాన్ని ప్రారంభించారు. తరలివచ్చిన పులివెందుల పల్లెలు.. 47 కి.మీ. ప్రయాణానికి 6 గంటలుఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ నుంచి అంబకపల్లెకు వైఎస్ జగన్ వస్తున్నట్లు తెలియడంతో ఆ మార్గంలోని పులివెందుల పల్లెలన్నీ రోడ్డుపైకి వచ్చి ఆయన కోసం వేచి చూశాయి. వీరన్నగట్టుపల్లెతో మొదలు పెడితే కుమ్మరాంపల్లె, చింతరాంపల్లె, వేంపల్లె, నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్నగారిపల్లె, అయ్యవారిపల్లె, గొందిపల్లె, వి.కొత్తపల్లె, వేముల, భూమయ్యగారిపల్లె, వేల్పుల, బెస్తవారిపల్లె, కె.వెలమవారిపల్లె, నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె తదితర గ్రామాల ప్రజలంతా సమీపంలోని రోడ్డుపైకి వచ్చి నిరీక్షించారు.దారి పొడవునా గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ అందరినీ ఉత్సాహపరుస్తూ జగన్ ముందుకు కదిలారు. 47 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 6గంటలు పట్టడం గమనార్హం. ఇడుపులపాయ నుంచి ఉ.9గంటలకు బయలుదేరిన వైఎస్ జగన్ అంబకపల్లెకు చేరుకునేందుకు సా.3 గంటలైంది. -
అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు
సాక్షి, అమరావతి: అప్పుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు రికార్డు స్థాయి వృద్ధి సాధిస్తోంది. రాష్ట్ర ప్రజలపై నెల నెలా భారీగా అప్పుల భారాన్ని మోపుతూ సంపద సృష్టిలో తిరోగమనంలో వెళుతోంది. హామీలను ఎగ్గొడుతూ బడ్జెట్ లోపల, బయట అప్పులు చేయడంలో మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. తాజాగా మంగళవారం రూ.5,000 కోట్లు అప్పు చేయడం ద్వారా బడ్జెట్ లోపల, బయట చేసిన చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.2,09,085 కోట్లకు చేరాయి. 15 నెలల పాలనలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. తాగునీటి ప్రాజెక్టులు, ఏపీఐఐసీ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేయడం ఈ విజనరీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.బడ్జెట్ అప్పులే రూ.1,33,702 కోట్లు...ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 7.63 శాతం వడ్డీకి రూ.5,000 కోట్లు రుణం సమీకరించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల రాష్ట్ర అప్పులే ఏకంగా రూ.1,33,702 కోట్లకు ఎగబాకాయి. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.44,383 కోట్లు అప్పులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ జలజీవన్ నీటి సరఫరా సంస్థ ఏర్పాటు చేసి రూ.10,000 కోట్లు అప్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ ఆస్తులను తాకట్టు పెట్టేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి రూ.7,500 కోట్లు అప్పులు చేయడానికి జీవో జారీ చేసింది. ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా రూ.5,473 కోట్లు అప్పులు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇవి కాకుండా బడ్జెట్ బయట మరిన్ని అప్పులను ప్రభుత్వం ఇప్పటికే చేసేసింది. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్ధ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ఇలా బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడ బిడ్డ నిధి అమలు చేయకుండా ఎగనామం పెట్టారు.ప్రజలను తప్పుదోవ పట్టించి..అధికారం చేపట్టి ఏడాదిన్నర కూడా కాకుండానే చంద్రబాబు సర్కారు రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా అటు ఆస్తులు సమకూర్చలేదు.. ఇటు హామీలను నెరవేర్చలేదు. గత ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేయగా రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేస్తున్నారంటూ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ప్రజలను తప్పుదోవ పట్టించింది. తాను అప్పులు చేయకుండా సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు తీరా సీఎం అయ్యాక నెల నెలా అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. -
ఏ పంటకూ ‘మద్దతు’ లేదు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మంగళవారం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళ్లపల్లె వద్ద ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వంలో పంటలకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం తమను ఆదుకుందని, ఇప్పుడు పంటలకు రేటు లభించక అప్పుల పాలవుతున్నామంటూ రైతులు వాపోయారు. వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణం కళ్లు తెరిచి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... హెరిటేజ్‌లో కిలో రూ.35.. రైతులకు ఇస్తున్నది రూ.6 ‘ఈ రోజు చీనీ రేటు క్వింటాలు రూ.12వేల నుంచి రూ.6వేలకు పతనమైనా కొనుగోలు చేసే నాథుడు లేడు. ఇందులో కూడా పదికి రెండున్నర టన్నులు సూట్ కింద కమీషన్ వసూలు చేస్తున్నారు. అదే వైఎస్సార్సీపీ హయాంలో క్వింటాల్ కనీసం రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు రేటుతో రైతులు అమ్ముకున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉల్లి క్వింటాల్ కనీసం రూ.4 వేలనుంచి రూ.12 వేలు చొప్పున అమ్ముడుపోయింది. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటాకు గ్రేడ్ బాగుంటే రూ.600 నుంచి రూ.800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. లేదంటే క్వింటాలు రూ.300 నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే సగటున క్వింటాలుకు నాలుగైదు వందలు కూడా రేటు రావడం లేదు. ఉల్లి పండించిన రైతులకు కనీసం కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల నుంచి కనీసం రూ.2,500 చొప్పున ఉల్లి కొనుగోళ్లు చేపట్టాలి. ప్రభుత్వమే ఈ పంటను బయటి రాష్ట్రాలకు గానీ రైతుబజార్ల ద్వారా గానీ విక్రయించేలా చూడాలి. ఇదే ఉల్లిని హెరిటేజ్‌లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. కానీ ఇక్కడ రైతుకు ఇచ్చేది కేవలం రూ.6 మాత్రమే. రైతులకు కేజీ రూ.25 చొప్పున చెల్లించి చంద్రబాబు తమ లాభాలను కొద్దిగా తగ్గించుకున్నా కూడా రూ.35కి అమ్ముకోవచ్చు కదా? హెరిటేజ్‌లో లాభాలు తగ్గకూడదు.. చంద్రబాబు వ్యాపారాలు జరగాలి.. ఇదీ పరిస్థితి! అరటి దుస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.3వేలకు కూడా కొనేవారు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలకు రైతులు అమ్ముకున్నారు. యూరియా కూడా అందించలేకపోతున్నారు వైఎస్సార్సీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్‌లో విక్రయాలు జరిగిన పరిస్థితి లేదు. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నాం. కమీషన్లు, బ్లాక్‌లో అమ్ముకోవడం అనే ప్రసక్తే లేకుండా చేశాం. ఈ రోజు యూరియాకు కమీషన్లు తీసుకుని బ్లాక్‌లో రైతులకు విక్రయిస్తున్నారు. కనీసం రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న పురుగుమందులు కొనుగోలు చేయాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పీఎస్సీఏలకు ఎందుకు యూరియా కోటా ఇవ్వడం లేదు? మా హయాంలో రూ.265కి యూరియా బస్తా లభించేది. తమ గ్రామంలోనే రైతన్నలు యూరియాను కొనుగోలు చేసేవారు. సొసైటీలు, ఆర్బీకేలు వారికి అందుబాటులో ఉంటూ పనిచేశాయి. నేడు సొసైటీలు, ఆర్బీకేలు లేవు. వాటి ద్వారా సరఫరా చేస్తే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు రావని బ్లాక్ మార్కెట్‌ను దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. ఉల్లి, చీని, అరటి, మినుము.. ఇలా ఏ పంట చూసినా రేటు లేని పరిస్థితిలో ఇవాళ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం చూస్తే.. అన్నదాతా సుఖీభవ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్లకుగానూ చంద్రబాబు ఒక్కో రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉన్నా, ఇంతవరకు ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. మా హయాంలో రైతులకు ఇచ్చిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టేసింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, నరేన్ రామాంజులరెడ్డి, సంబటూరు ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
అడ్డదారి పదవి కోసం ఔరంగజేబు నీతి
-
రైతుకు పీకల్లోతు నష్టం.. నీ హెరిటేజ్ కి మాత్రం కోట్లలో లాభం..
-
TJR Sudhakar: ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
-
ఆడబిడ్డ ఏడుపు మీకు కనిపించట్లేదా ? సుగాలి ప్రీతి కేసుపై ఎక్కడ?
-
Vellampalli Srinivas: వరద బాధితుల పై లాఠీ ఛార్జ్ చేసిన ఘనత మీదే..
-
నిరుద్యోగంలో మూడో స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం భారీ అప్పులతోపాటు నిరుద్యోగంలోనూ దూసుకుపోతోంది! దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచినట్లు లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 29 ఏళ్ల లోపు యువతీ యువకుల్లో నిరుద్యోగిత 21.0 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో నిరుద్యోగ యువత కేవలం 14.6 శాతమే ఉండగా, రాష్ట్రంలో అంతకు మించి ఉండటం గమనార్హం. ఏపీలో నిరుద్యోగ యువకులు 17.9 శాతం కాగా.. యువతులు 28.5 శాతం. అదే జాతీయ స్థాయిలో నిరుద్యోగ యువకులు 14.1 శాతం, యువతులు 16.0 శాతంగా ఉంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 19.9 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 23.1 శాతంగా ఉంది. భృతి ఎగ్గొట్టారు... జాబులూ లేవునిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానంటూ మాట మార్చేశారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగిత పెరిగిపోతోంది. ఇదే విషయం లేబర్ ఫోర్స్ సర్వేలో వెల్లడైంది. -
పైసా మే ప్రమోషన్!
సాక్షి, అమరావతి: ‘రాజ్యలక్ష్మిని మాత్రమే ప్రసన్నం చేసుకుంటే సరిపోదు.. ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి’ ఇదీ పోలీసు శాఖలో బిగ్ బాస్ తాజా ఉవాచ. అదీ అదనపు ఎస్పీ పదోన్నతి కోసం నిరీక్షిస్తున్న డీఎస్పీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విస్మయ పరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు శాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోందనడానికి తాజా ఉదంతమే నిదర్శనం.కాంట్రాక్టు పనుల్లో భారీ కమీషన్లు కొల్లగొట్టడం.. భూ సెటిల్మెంట్లు, అక్రమ కేసులతో వేధింపులు, వ్యాపార పారిశ్రామికవేత్తల నుంచి బలవంతపు వసూళ్లతో పోలీసు శాఖ హడలెత్తిస్తోంది. కాగా పోలీసు బాస్‌ల అవినీతికి పోలీసు అధికారులే బాధితులుగా మారడం తాజా పరిణామం. ముడుపులు ముట్టే వరకు డీఎస్పీ స్థాయి నుంచి అదనపు ఎస్పీగా పదోన్నతులు కల్పించకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తుండటం విభ్రాంతికరం. ప్యానల్ గడువు ముగిసినా స్పందనే లేదు ⇒ రాష్ట్రంలో డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీల పదోన్నతుల కల్పన పెండింగులో ఉంది. అందుకోసం ప్యానల్ జాబితాను ఖరారు చేసి నెలలు గడుస్తున్నా పద్నోన్నతులు కల్పించడం లేదు. ఆ ప్యానల్ గడువు ఆగస్టు 31తో ముగిసింది. దీంతో మళ్లీ కొత్తగా ప్యానల్‌ను రూపొందించాలి. ఈ లోగా పదోన్నతుల జాబితాలో ఉన్న కొందరు అధికారులు రిటైరైపోతారు. ఆగస్టు 31న కొంత మంది రిటైర్ అయ్యారు. ⇒ అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని ఆ ప్యానల్లో ఉన్న అధికారులు హోం మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. పోలీసు బిగ్‌బాస్‌కు పదే పదే విజ్ఞప్తి చేశారు. అదిగో చూస్తాం.. ఇదిగో చూస్తాం.. అంటూ కాలయాపనే తప్ప ఫలితం లేదు. ⇒ ఈ నేపథ్యంలో అసలు విషయం చల్లగా చెప్పారు. ‘రాజ్యలక్ష్మినే కాదు.. ధన లక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి’ అనే మాట పోలీసు ప్రధాన కార్యాలయంలో హల్చల్ చేసింది. ‘ప్రభుత్వ పెద్దలు చాలా చెబుతారు.. వారేమీ ఊరికే పోస్టింగు ఇవ్వలేదు కదా..’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించడం ద్వారా అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దాంతో ముడుపుల కోసమే తమ పదోన్నతుల ఫైల్‌ను క్లియర్ చేయడం లేదని డీఎస్పీలు గుర్తించారు. ⇒ అంతా చర్చించుకుని తాము ఇవ్వాలని నిర్ణయించిన ఏకమొత్తం గురించి సమాచారం చేరవేశారు. బిగ్‌బాస్ అంచనాల్లో అది కేవలం 10 శాతమేనని ఆయన కార్యాలయ వర్గాలు చెప్పడంతో డీఎస్పీలు విస్తుపోయారు. రెండంకెల మార్కు దాటాల్సిందేనని రూ.కోట్లలో లెక్క చెప్పడంతో డీఎస్పీల నోట మాట రాలేదని సమాచారం. ఆ డీల్ కుదరకే ఆగస్టు 31తో ప్యానల్ గడువు ముగిసినా అదనపు ఎస్పీల పదోన్నతుల గురించి పట్టించుకోలేదని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతు కష్టాలు
-
చంద్రబాబు బతుకంతా మోసమే అంటూ వైఎస్ జగన్ ట్వీట్
-
ని‘వేదన’లే..! డబ్బులు గుంజుతున్న అధికార పార్టీ నేతలు
బాపట్ల జిల్లా చీరాల ఈపూరుపాలేనికి చెందిన పిట్టు నాగేశ్వరమ్మ, పిట్టు వెంకట్రావులకు సర్వే నెంబర్ 746–2లో 1.55 ఎకరాలు, సర్వే నెంబర్ 746–3లో 1.46 ఎకరాల భూమి ఉంది. కొనుగోలు ద్వారా సంక్రమించిన ఈ భూమిని ప్రభుత్వం ఇటీవల జీరో (ఎవరికీ చెందనిది) ఖాతాలో చేర్చడంతో తహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇంతకాలం సక్రమంగానే ఉన్న తమ భూమి రికార్డులు మార్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అవసరానికి అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పాపిశెట్టిపల్లిలో టీడీపీ నేతల అండదండలతో గ్రామ కంఠం భూములను ఆక్రమించడంపై గ్రామస్థులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకు తమపై దౌర్జన్యానికి తెగబడుతున్నారని, తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఈనాం భూమిగా నమోదుతో.. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం గొండుపాలెం గ్రామం సర్వే నెంబర్లు 340/1, 340/2, 3లో మొత్తం 82 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. రీ సర్వే తర్వాత ఎల్పీఎం నెంబర్లు ఇచ్చినప్పుడు 340/2, 3 సర్వే నెంబర్లలో ఉన్న రెండు సెంట్ల భూమిని సర్వీస్ ఈనాంగా తప్పుగా నమోదు చేశారు. దీంతో మొత్తం భూమంతా సర్వీస్ ఈనాంగా రికార్డుల్లో నమోదు కావడంతో ఫ్రీ హోల్డ్ చేసినట్లు చూపారు. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ భూములన్నింటినీ కూటమి ప్రభుత్వం 22 ఏ జాబితాలో పెట్టేసింది. దీంతో భూ యజమాని అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ఫ్రీహోల్డ్‌గా తప్పుగా పేర్కొన్న 2 సెంట్లను మినహాయించి మిగిలిన 80 సెంట్ల జిరాయితీ భూమిని ఆంక్షల జాబితా నుంచి తొలగించాలని ఏడాదిగా బాధిత రైతు వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ, స్థానిక ఎమ్మెల్యేకు దీనిపై ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కాలేదు. పీజీఆర్ఆర్ఎస్లో అర్జీ పెట్టుకున్నా స్పందన లేదు. ఫ్రీహోల్డ్ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ దీనిపై ఏమీ చేయలేమని సీసీఎల్ఏ అధికారులు చేతులెత్తేశారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు స్వయంగా తమ ఫిర్యాదును తీసుకున్నారంటే ఇక ఆ సమస్య కచ్చితంగా పరిష్కారమైనట్లేనని అర్జీదారులు కొండంత భరోసా పెట్టుకుంటారు! మరి అవే బుట్టదాఖలవుతున్నాయంటే ఇక సామాన్యుల గోడు తీర్చెదెవరు? రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలు, టీడీపీ నేతల ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో ప్రభుత్వ పెద్దలే ముఖం చాటేస్తే ఇక బాధితులకు న్యాయం చేసేదెవరు? రాష్ట్రంలో భూములకు సంబంధించిన ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వెల్లువలా వస్తున్న అర్జీలపై ఆరా తీయకుండానే పరిష్కరించేసినట్లు ప్రభుత్వం ప్రకటించుకోవడంపై బాధితులు నివ్వెరపోతున్నారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్లలో భూములకు సంబంధించి లక్షలాది ఫిర్యాదులు వస్తున్నా ఒక్కటీ పరిష్కారానికి నోచుకోవడంలేదు. భూ సమస్య అంటేనే అధికారులు దాన్నో పెద్ద భూతంగా, సివిల్ పంచాయితీగా చూస్తుండడంతో భూ యజమానులు దిక్కు తోచక దళారుల బారిన పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బ్రోకర్ల అవతారం ఎత్తి పనులు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్నారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కరించే సమస్యలను సైతం రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. నియోజకవర్గ ఎమ్మెల్యేనో, అధికార పార్టీ నేతలో పురమాయిస్తే గానీ వినతిపత్రాలు సైతం తీసుకోవడంలేదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లు సహా అన్ని కార్యాలయాల్లో జరుగుతున్న గ్రీవెన్స్ డే (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) కేవలం మొక్కుబడి తంతుగా ముగుస్తోంది. అధికారులంతా విందు భోజనానికి వచ్చినట్లు కూర్చుని రశీదులు ఇప్పిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత సమస్య పరిష్కారమైపోయినట్లు బాధితులకు మెసేజ్‌లు రావడంతో విస్తుపోతున్నారు. వాస్తవానికి సమస్య అలాగే ఉంటోంది. అధికారులు మాత్రం అది ముగిసిపోయినట్లు నివేదిక ఇచ్చేస్తున్నారు. దీంతో బాధితులు ఎప్పటి మాదిరిగానే కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ సమస్యలు పరిష్కారం కాని రైతులు, భూ యజమానులు, బాధితులు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. రికార్డుల్లో తప్పులు.. రైతులకు శాపాలు పలు చోట్ల భూమి ఒకరి పేరు మీద ఉంటే పట్టాదారు పాస్‌బుక్ ఇతరుల పేరు మీద రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పట్టాదారుల పేర్లలో తప్పులు, సర్వే లేదా ఎల్పీఎం నెంబర్లలో తప్పులు, భూమి స్వభావంలో తప్పులు లాంటి వాటికైతే లెక్కే లేదు. జాయింట్ ఎల్పీఎంల సమస్య ఇటీవల తీవ్రం కావడంతో సబ్ డివిజన్ల ద్వారా చక్కదిద్దకుండా సబ్ డివిజన్ చేసుకుంటే చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.50 నుంచి రూ.550కి ప్రభుత్వం పెంచేసింది. డబ్బులు కట్టకపోతే సబ్ డివిజన్ జరగడంలేదు. ఇలా రెవెన్యూలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చేయడంలేదు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద తమ ఆవేదనను వెల్లడిస్తున్న చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం పాపిశెట్టిపల్లి గ్రామస్తులు సీఎం స్వయంగా తీసుకున్నా అంతే..!‘పీజీఆర్ఎస్’కు వచ్చే ఫిర్యాదుల్లో 80 శాతం భూ సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబే చాలాసార్లు వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో వారంలో రెండు మూడు రోజులు బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకుంటుండగా అందులో 70 నుంచి 80 శాతం భూముల సమస్యలే ఉంటున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రెవెన్యూ శాఖ మంత్రి, ఇతర మంత్రులు తీసుకున్న వినతిపత్రాలు సైతం పరిష్కారానికి నోచుకోవడంలేదు. కొద్దిరోజుల క్రితం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించి ఐదు వేల వినతులు వచ్చినట్లు ప్రకటించారు. కానీ అందులో పది శాతం కూడా పరిష్కారం కాలేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కుప్పలు తెప్పలుగా వస్తున్న అర్జీలను చూసి సీఎం వాటిని తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వస్తానని చెప్పి రాకుండా ముఖం చాటేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12 లక్షలు అర్జీలు అందగా అందులో మెజారిటీ రెవెన్యూ శాఖకు సంబంధించినవే. భూముల సమస్యల్లో దాదాపు అన్నింటినీ పరిష్కరించేసినట్లు ఇటీవల రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే అంతకుముందు 15 రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రంగా పక్షం రోజుల్లోనే అవన్నీ పరిష్కారమైపోయినట్లు ప్రకటించేశారు. తిరగలేక విసిగిపోయాఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో 131/1ఏ, 132/ 2ఏ సర్వే నంబర్లలో నాకు 3.04 ఎకరాల భూమి ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసు పుస్తకాలున్నాయి. నా భూమిలో 0.44 సెంట్లను ఇతరులు ఆక్రమించుకుని కంచె వేశారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఆరు సార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయా. – మేడా సత్యనారాయణ70 ఏళ్ల వయసులో నాకేంటీ తిప్పలు 1993లో ప్రభుత్వం 40 సెంట్ల భూమిని నా భార్య కొల్లి చిట్టమ్మ పేరుతో ఇచ్చింది. నా భార్య చనిపోవడంతో ఆ భూమికి నా పేరుతో పాస్‌బుక్ ఇవ్వాలని కాళ్లరిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్లో రెండుసార్లు అర్జీ ఇచ్చా. 70 ఏళ్ల వయసులో తిప్పలు పడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. – కొల్లి ప్రకాశం, నాగంపల్లి, సీతానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లాకాళ్లు అరిగేలా తిరుగుతున్నా.. నాకు ఐదు ఎకరాల పొలం ఉండగా 2.47 ఎకరాలను రజని అనే వ్యక్తికి విక్రయించా. అనంతరం అతడి నుంచి దాన్ని కొనుగోలు చేసిన పాండు మొత్తం భూమి తనదేనంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. నాకు న్యాయం చేయమని భూమి పత్రాలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా. సర్వే చేయాలని మొర పెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోవడం పోలేదు. – రామచంద్రనాయుడు, ఊటుకూరు గ్రామం, రాజంపేట -
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల ఆందోళన
-
25 ఏళ్ళగా టీడీపీలో ఉండి ఈ రోజు YSRCP లో చేరడానికి ప్రధాన కారణం ఇదే
-
మద్యం అక్రమ కేసులో సిట్ పనితనంపై ACB కోర్టు అభ్యంతరం
-
దొడ్డి దారిన టీడీపీలోకి ఎంట్రీ.... ఆ తర్వాత జరిగింది ఇదే..
-
బార్ల లైసెన్సులో.. సర్కారు దొంగాట
సాక్షి, అమరావతి: ‘బార్ల లైసెన్సులకు మేం దరఖాస్తు చేయం.. ఇతరులను చేయనివ్వం’ ఇదీ టీడీపీ సిండికేట్ రాష్ట్రంలో ప్రస్తుతం సాగిస్తున్న హైడ్రామా. ఇందులో మతలబు ఏంటంటే.. మద్యం విక్రయాల ద్వారా భారీ లాభాలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలే ఈ పన్నాగం రచిస్తున్నారు. దరఖాస్తులు దాఖలు కాలేదు కాబట్టి లాభాల మార్జిన్‌ను “సిండికేట్’ కోరినంతగా పెంచేందుకు తలొగ్గాల్సి వచి్చందని వారు పకడ్బందీగా ఆడుతున్న దొంగాట ఇది.టీడీపీ ముఠా రక్తికట్టిస్తున్న బార్ల లైసెన్సుల నాటకం గూడుపుఠాణీ ఏమిటంటే.. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేందుకు ఇంకా 24 గంటలు మాత్రమే గడువు ఉంది. కానీ, సోమవారం నాటి పరిస్థితి ఏమిటంటే.. దాదాపు 2,300 దరఖాస్తుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ వాటిలో కేవలం 72 బార్లకే దరఖాస్తులు దాఖలయ్యాయి.వీటిలో కూడా కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలైన బార్లు కేవలం 45 మాత్రమే. కనీసం నాలుగు దరఖాస్తులు వచి్చన బార్లకే లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామని ప్రభుత్వ బార్ల పాలసీ ప్రకటించింది. అంటే.. 840 బార్లలో లాటరీ ద్వారా లైసెన్సు ఇచ్చేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నవి కేవలం 45 బార్లే. మరోవైపు.. దరఖాస్తుల దాఖలుకు మంగళవారంటీడీపీ గూండాలు, పోలీసులతో బెదిరింపులుఇంత తక్కువగా దరఖాస్తులు దాఖలు కావడం వెనుక టీడీపీ మద్యం సిండికేట్ వ్యూహాత్మక ఎత్తుగడ దాగుంది. బార్ల దరఖాస్తుల కోసం అయితే ఏకంగా 2,300 మంది రిజి్రస్టేషన్ చేసుకున్నప్పటికీ.. వీరిలో తమ సిండికేట్ కాని వారిని టీడీపీ నేతలు గుర్తిస్తున్నారు. దరఖాస్తు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ గూండాలు, పోలీసు అధికారులతో వారిని బెదిరిస్తున్నారు.పోనీ.. టీడీపీ సిండికేట్ సభ్యులు అయినా ఒక్కో బార్‌కు కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు చేశారా అంటే అదీ లేదు. ఎందుకంటే.. అడ్డగోలు లాభాలు కొల్లగొట్టేలా బార్ పాలసీలో మార్పులు చేయాలన్నదే వీరి అసలు పన్నాగం. ఇందుకోసం రెండు నెలలుగా సిండికేట్–ప్రభుత్వ పెద్దల మధ్య మంతనాలు సాగాయి.పచ్చముఠా పన్నాగం ఇదీ..ఇక సిండికేట్‌కు అనుకూలంగా బార్ విధానంలో ముందే మార్పులు చేస్తే తమ దోపిడీ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే.. తగినంత మంది దరఖాస్తు చేయలేదు కాబట్టి బార్ల యజమానులకు లాభాల మారిŠజ్న్ పెంచుతున్నాం అన్నట్లుగా ప్రజల్ని నమ్మించాలన్నది అసలు తంత్రం. అలాగే, 840 బార్లలో కనీసం 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు కాబట్టి సిండికేట్ దోపిడీకి వీలుగా ఇలా బార్ విధానంలో మార్పులు చేయాలన్నది పచ్చముఠా పన్నాగం.మార్జిన్ ఎక్కువ వచ్చేలా ‘ఇన్వాయిస్’ ధర తగ్గింపు..ప్రస్తుతం బార్లకు 105 శాతం ఇన్వాయిస్ ధరకు మద్యం సరఫరా చేస్తున్నారు. అంటే.. ఒక మద్యం బాటిల్ ఎంఆర్పీ రూ.100 అనుకుంటే, ఆ బాటిల్‌ను రూ.105 చొప్పున ఇన్వాయిస్ ధరకు బార్లకు సరఫరా చేస్తున్నారు. ఈ బాటిల్‌ను బార్ల యజమానులు రూ.120కు వినియోదారులకు విక్రయిస్తున్నారు. తద్వారా బార్ల యజమానులకు ఒక్కో బాటిల్‌పై రూ.15 మార్జిన్ వస్తోంది. అయితే, ఈ మార్జిన్‌ను వీలైనంత ఎక్కువగా పెంచి వారికి మరింత మేలు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం బార్లకు సరఫరా చేసే ఇన్వాయిస్ ధర తగ్గించాలని ఎత్తులు వేస్తోంది.అంటే.. 105 శాతంగా ఉన్న ఇన్వాయిస్ ధరను 90 శాతంగా నిర్ణయించాలని బావిస్తోంది. తద్వారా రూ.100 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిల్‌ను రూ.90కే బెవరేజెస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. ఆ బాటిల్‌ను ఎంతకు విక్రయించాలన్నది మాత్రం ప్రభుత్వం కచి్చతంగా చెప్పదు. బార్ల యజమానులు మాత్రం యథావిథిగా రూ.120కే విక్రయిస్తారు. అంటే.. ఒక్కో బాటిల్‌పై వారికి రూ.30 చొప్పున లాభం వస్తుంది. ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఒక్కో బాటిల్‌పై రూ.15 చొప్పున చిల్లు పడుతుంది. దీనినిబట్టి టీడీపీ మద్యం సిండికేట్‌కు అడ్డగోలుగా లాభాలు వచ్చేలా చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడమే చంద్రబాబు ప్రభుత్వ ఎత్తుగడ అన్నది స్పష్టమవుతోంది.నాడూ ఇదే పన్నాగంతో దోపిడీ..2015లో కూడా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును చీకటి జీవోలతో రద్దుచేసి ఏడాదికి రూ.1,300 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. ప్రివిలేజ్ ఫీజు తగ్గించాలని మద్యం దుకాణాలు, బార్ల యజమానుల నుంచి విజ్ఞప్తి వచ్చినట్లు కథ నడిపించి.. అందుకే అది రద్దు చేసినట్లు బిల్డప్ ఇచ్చింది.అది కూడా కేబినెట్‌ను బురిడీ కొట్టించి రెండు చీకటి జీవోలు జారీచేసి ఆ ఫీజు రద్దు చేసేసింది. ఇప్పుడు కూడా అదే రీతిలో ఇన్వాయిస్ ధరను తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. అదే సమయంలో టీడీపీ సిండికేట్‌కు జేబులు నింపేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.బార్ల లైసెన్స్ ఫీజులకూ కోత?బార్ల లైసెన్స్ ఫీజు కూడా భారీగా తగ్గించాలని ఈ సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.75 లక్షల కేటగిరీ ఫీజును రూ.40 లక్షలకు.. రూ.55 లక్షల కేటగిరీ ఫీజును రూ.30 లక్షలకు, రూ.35 లక్షల కేటగిరీ ఫీజును రూ.20 లక్షలకు తగ్గించేలా పావులు కదుపుతోంది. -
చంద్రబాబు ఖద్దర్ షర్ట్ విప్పి చూస్తే... TJR సుధాకర్ బాబు షాకింగ్ నిజాలు
-
ఎన్టీఆర్ ను, ఆయన మాతృమూర్తిని దూషించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
-
Puttaparthi: ఈ బతుకు ఇంకెందుకు.. ఏదైనా విషం ఇచ్చి వికలాంగులను చంపేయండి
-
Eluru: దేశంలో అత్యంత చెడ్డ ప్రభుత్వం మీకు నమ్మి ఓట్లు వేస్తే..
-
20 ఏళ్లుగా వస్తున్న పెన్షన్ ను ఇప్పుడెందుకు కట్ చేసారు
-
ఎంతకాలం మాటలతో పరిపాలన చేస్తారు.. వడ్డే శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు
-
బాబు ముఠా బార్ల దందా
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది. టీడీపీ సిండికేట్ కూడా చివరి వరకు దరఖాస్తులు చేయకుండా పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. తద్వారా దరఖాస్తులు రావడం లేదనే సాకు చూపించి బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, రాయితీలు దక్కించుకోవాలని సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఈ తతంగం మొత్తం సాగుతుండటం గమనార్హం. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఈ నెల 26వ తేదీ చివరి రోజు. ఇప్పటికి వారం రోజులు అయినా సరే 840 బార్లకు కేవలం 32 దరఖాస్తులే దాఖలయ్యాయి. కనీసం నాలుగు దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు ఉంది. అయినా సరే దరఖాస్తులు ఇంత తక్కువగా దాఖలు కావడం వెనుక గూడుపుఠాని జరుగుతోందని ఇట్టే స్పష్టమవుతోంది. ఎవరైనా దరఖాస్తు చేస్తే ఖబడ్డార్.. బార్లకు ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక టీడీపీ సిండికేట్ దందా దాగుంది. బెదిరింపులు, దౌర్జన్యాలతో హడలెత్తించి ప్రైవేటు మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న కుట్రనే ఇక్కడా పునరావృతం చేస్తోంది. వాస్తవానికి బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసేందుకు ఇప్పటి వరకు దాదాపు 2 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కానీ వారిలో ఏడు రోజుల్లో కేవలం 32 మంది మాత్రమే దరఖాస్తు చేయడం గమనార్హం. తమ సిండికేట్ సభ్యులు కాకుండా ఇతరులెవరైనా బార్లకు దరఖాస్తులు చేస్తే అంతు చూస్తామని కూటమి ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను టీడీపీ సిండికేట్ సేకరించి వడపోస్తోంది. వారిలో తమ సిండికేట్ సభ్యులు కాని వారిని బెదిరించి బెంబేలెత్తిస్తోంది. ఏకంగా డీఎïస్పీ, సీఐ స్థాయి అధికారులు వారిని పిలిపించి మరీ బెదిరిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ‘ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆయనకు ఇష్టం లేకుండా బార్ లైసెన్స్ కోసం ఎందుకు అప్లై చేయడం? లాటరీలో లైసెన్స్ వచ్చినా బార్ బిజినెస్ చేసుకోనివ్వరు. ఎందుకు అనవసర గొడవలు’ అని పోలీసు అధికారులే హెచ్చరిస్తున్నారు. ‘మీరు బార్ పెట్టుకోవడానికి ఎవరూ భవనాన్ని గానీ, ఖాళీ స్థలాన్ని గానీ లీజుకు ఇవ్వరు.. ఇవ్వాలని అనుకున్నా ఎమ్మెల్యే ఇవ్వనివ్వరు. మీ సొంత భవనంలో పెట్టుకున్నా ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడు పడితే అప్పుడు రైడింగ్లు చేస్తారు. బిజినెస్ జరగనివ్వరు’ అని కూడా అసలు విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. మరో వైపు టీడీపీ గూండాలు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు దరఖాస్తు చేయడానికి భయపడుతున్నారు. నేడు, రేపు సిండికేట్ సభ్యులే దాఖలు చేసే ఎత్తుగడచివరి రెండు రోజుల్లో టీడీపీ సిండికేట్ ఎంపిక చేసిన వారే దరఖాస్తులు దాఖలు చేసేలా స్కెచ్ వేశారు. కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చే బార్లకే లైసెన్సుల కేటాయింపు కోసం లాటరీ నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ ప్రకారం టీడీపీ సిండికేట్ సభ్యుల తరఫునే నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలు చేసేలా పన్నాగం పన్నారు. ఈ నాలుగు దరఖాస్తుల ప్రక్రియ అంతా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నమ్మించేందుకు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో అదనంగా మరో ఇద్దరు ముగ్గురితో కూడా దరఖాస్తు చేయిస్తారు. వారు కూడా టీడీపీ సిండికేట్ వర్గీయులే అయ్యుండేలా గూడు పుఠాణి సాగిస్తున్నారు. ఫలితంగా లాటరీ ద్వారా సిండికేట్‌కే బార్ల లైసెన్సులు దక్కించుకునేలా పక్కాగా స్కెచ్ వేశారు.మరింత అడ్డగోలు దోపిడీకి స్కెచ్ బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, మరింత లాభం మార్జిన్ దక్కించుకోవాలని కూడా సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రస్తుత బార్ల విధానం పట్ల వ్యాపారులు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదని నమ్మించేందుకు కూడా తక్కువ దరఖాస్తులు దాఖలు అయ్యేలా కథ నడిపిస్తున్నారు. ఇప్పటికే రోజుకు ఏకంగా 14 గంటలు బార్లు తెరచి ఉంచేలా, లైసెన్స్ దక్కిన తర్వాత రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేలా, ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేలా, ఇతరత్రా సడలింపులు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. అయినా సరే మరింత అడ్డగోలు దోపిడీపై సిండికేట్ గురి పెట్టింది. బార్ల యజమానులను ప్రోత్సహించాలనే సాకుతో లాభాల మార్జిన్ మరింత పెంచేలా, పన్నులు తగ్గించేలా ఒత్తిడి తేవాలన్నది లక్ష్యం. దరఖాస్తుదారుల నుంచి ఆ డిమాండ్ రాగానే వెంటనే ఆమోదించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని సమాచారం. బార్ల యజమానులతో ముందుగా ఇండెంట్ పెట్టించి.. ప్రభుత్వమే తన డబ్బుతో మద్యం కొనుగోలు చేసేలా స్కెచ్ వేశారు. ఇందులోనే పెద్ద కుంభకోణం దాగి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా జరగలేదు.బాబు రాజ్యం.. మద్యం దోపిడీ భోజ్యం⇒ చంద్రబాబు ప్రభుత్వం అంటేనే టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ రాజ్యం అని మరోసారి కూటమి ప్రభుత్వం రుజువు చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం సాగించిన మద్యం దోపిడీకి మించిన స్థాయిలో ఈసారి మహా దోపిడీకి బరితెగిస్తోంది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మద్యం విధానం ముసుగులో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ⇒ 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతిగానీ, కేబినెట్ ఆమోదం గానీ లేకుండానే 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు 216, 217 జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు నాలుగేళ్లలో ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ⇒ 4,840 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు మరో 4,840 పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు, బార్లు అన్నీ టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే (మిగతా ఆరింటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి) అనుమతినిచ్చింది. అంతే కాకుండా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా నాటి టీడీపీ ప్రభుత్వమే. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి మరో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది.⇒ మొత్తం మీద 2014–19లో రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1), (డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై ఉన్నారు.⇒ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అంతకు మించి మద్యం దోపిడీకి బరితెగించింది. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిన ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చింది. మొత్తం 3,736 మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. ఇక 840 బార్లు కూడా తమ సిండికేట్‌కే కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ నమ్మబలికిన టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసిందని తూర్పారబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు కూటమి సర్కార్ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే.. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య అప్పటి విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీ లు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీలక రంగాల్లో మూల ధన వ్యయం బాగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గుతోందని.. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, అప్పులు పెరగకుండా చూస్తామని గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు హామీ ఇచ్చాయి.⇒ కానీ.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాది (2023–24)తో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04 శాతం పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 12.02 శాతం ఉంటే, ప్రభుత్వ సొంత ఆదాయం అత్యల్పంగా 3.08 శాతం వృద్ధికే ఎందుకు పరిమితమైంది? ⇒ గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచి్చన ఆదాయాన్ని (సీఎజీఆర్) పరిగణనలోకి తీసుకుంటే అది కేవలం 2.39 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి అది కనీసం 10 శాతం ఉండాల్సి ఉంది. ⇒ మరో అత్యంత ఆందోళకర అంశం రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడం. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పులో 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలను పునరాలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ విధానాల వల్ల తీవ్ర అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా దగండి పడింది. -
సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ
యూరియా విషయంలో ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే, గ్రామాల్లో కళ్లకు కనిపిస్తున్నది మరొకటి. మొన్నటి దాకా తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల ఆందోళనలు చూసి మాట మార్చారు. అక్రమంగా ఎలా తరలి వెళుతోందని.. అలా తరలి పోయిన యూరియా నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకోండంటూ హూంకరిస్తున్నారు. దౌర్జన్యంగా, లోపాయికారిగా, అక్రమంగా యూరియా నిల్వలను తమ గోదాములకు తరలించుకు పోయింది కూటమి పార్టీల నేతలే. మరి వారి వద్ద నుంచి నిజంగా ఒక్కటంటే ఒక్క బస్తా అయినా అధికారులు స్వా«దీనం చేసుకోగలిగారా? ‘ముఖ్యమంత్రి సీరియస్..’ అని ఎల్లో మీడియాలో డ్రామా వార్తలు మినహా ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. సర్కారు నిర్వాకంతో ఊరూరా చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్‌కు సరిపడా నిల్వలున్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ చేస్తున్న ప్రకటనలకు.. వాస్తల పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వ.. ఇప్పుడు ఆర్బీకేలను ఇంకా పతనావస్థకు తీసుకెళ్తూ.. ఇక్కడికి రావాల్సిన యూరియా స్టాకును అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్‌కు మళ్లించేందుకు అధికార పార్టీల నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు వ్యాపారులతో కమీషన్లు తీసుకుని అధిక ధరలతో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకోసం మార్కెట్లో యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. యూరియా దొరకడం గగనంగా మారడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చిన స్టాక్‌ను వచ్చినట్లు టీడీపీ నేతలు దారి మళ్లించిన విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా.. చర్యలు తప్పవంటూ ఎల్లో మీడియా వేదికగా సీరియస్ అయినట్లు డ్రామాలతో రైతులను మభ్యపెడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)తో పాటు రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా సరఫరాను పెంచాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోందని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు మార్క్‌ఫెడ్–ప్రైవేటు వ్యాపారులకు ఇప్పటివరకు ఉన్న 50ః50 నిష్పత్తిలో జరుపుతున్న ఎరువుల కేటాయింపులను ఇక నుంచి 70ః30 నిష్పత్తిలో కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఆచరణకు నోచుకోలేదు. స్టాకు లేక మూతపడిన సొసైటీలు అధిక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీరు దిగిన మెట్ట పంటలతో పాటు ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియా అత్యవసరం. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు అదును దాటకముందే యూరియా బూస్టర్ డోస్ వెయ్యాలి. కానీ.. ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మార్క్‌ఫెడ్ వద్ద చాలినంత స్థాయిలో యూరియా నిల్వల్లేని కారణంగా ఆర్‌ఎస్‌కేలతో పాటు మెజార్టీ సొసైటీలు శనివారం మూసివేశారు. నో స్టాక్ బోర్డులు పెట్టకపోయినప్పటికీ యూరియా నిల్వల్లేని కారణంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొసైటీలను మూయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కొద్దిపాటి నిల్వలున్న సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కన్పిస్తున్నాయి. 80 శాతం ప్రైవేట్ డీలర్ల వద్దే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 11.84 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా, దాంట్లో అత్యధికంగా యూరియా 4.89 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 4.08 లక్షల టన్నులు, డీఏపీ 1.53 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 76 వేల టన్నులు, ఎంవోపీ 57 వేల టన్నులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు, డీఏపీ 84 వేల టన్నులు మాత్రమే ఉంది. 17 జిల్లాల్లో యూరియా, 11 జిల్లాల్లో డీఏపీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న నిల్వల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు డీలర్ల వద్దే ఉన్నాయి. సొసైటీలు, ఆర్ఎస్కేల్లో అరకొరగా ఉండడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.400 చొప్పున, డీఏపీ రూ.1,400 నుంచి రూ.1550 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ సీజన్లో యూరియాతో పాటు ఎరువులు అధికంగా వాడేస్తున్నారంటూ ప్రభుత్వం తమను తప్పుపడుతుండడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. బస్తా కూడా పట్టుకోలేని టాస్క్‌ఫోర్స్ బృందాలు రైతుల ముసుగులో సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి, బ్లాక్‌లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వ్యవసాయేతర అవసరాలతో పాటు సరిహద్దు జిల్లాలు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న యూరియాను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్సు బృందాలు మొక్కుబడి తనిఖీలకే పరిమితమయ్యాయి. టీడీపీ నేతల గోదాముల జోలికి మాత్రం పోవడం లేదని స్పష్టమవుతోంది. అధికార టీడీపీ నేతల గోదాములను తనిఖీ చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసిన యూరియా నిల్వలను ఒక్క చోట అయినా వెలికి తీశారా అని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని ఊళ్లలో అదే దుస్థితి ⇒ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి వచ్చిన 266 బస్తాల యూరియాను గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలే పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. మిగిలిన స్టాక్‌ను స్థానిక టీడీపీ నాయకుడు రూ.430 చొప్పున అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీఏసీఎస్‌లు, ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పెడన మండలం నందమూరు విశాల సహకార పరపతి సంఘం వద్దకు అన్నదాతలు భారీగా తరలి రావడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. గన్నవరంలో ఓ ఫెర్టిలైజర్ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ కొత్తగా పెట్టిన నిబంధనల మేరకు అన్నదాతలు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్, కౌలుకార్డు వెంట తీసుకుని వచ్చారు. ⇒ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద శనివారం రైతులు పడిగాపులు కాశారు. ఇక్కడ కేవలం 120 బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వైవీ పద్మావతి, వ్యవసాయ శాఖ ఏఓను నిలదీసి ఎరువుల షాప్ షట్టర్ దించేశారు. దీంతో పంపిణీ వాయిదా పడింది. ⇒ అనకాపల్లి జిల్లా మునగపాకలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎరువుల నిల్వలు ఏమయ్యాయో చెప్పాలని రైతులు నిలదీశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు ఒడిశాకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు. స్థానికంగా యూరియా కొనాలంటే అదనంగా జింకు, ఇతర మందులు కొనుగోలు చేయాలంటూ డీలర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు. ⇒ కాకినాడ జిల్లా సామర్లకోటలోని నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీకి టోకెన్లు పంపిణీ చేస్తుండగా తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది టోకెన్లు పంపిణీ నిలిపి వేశారు. ⇒ ఏలూరు జిల్లాలో యూరియా కొరతే లేదని కలెక్టర్ ప్రకటించారు. అయితే కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న శనివారపుపేట కోఆపరేటివ్ సొసైటీకి శనివారం సిబ్బంది తాళాలు వేశారు. టీడీపీ అనుచరులకే యూరియా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలోని టీడీపీ నాయకులు వీఏఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) లేకుండానే దౌర్జన్యంగా ఆర్ఎస్కే తలుపులు తీసి తమ అనుచర వర్గానికి యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఆర్‌ఎస్‌కేకు వచ్చిన 450 యూరియా బస్తాల పంపిణీని శనివారం చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ బత్తుల జ్యోతీశ్వరరావు ఆర్‌ఎస్‌కేకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. అప్పటికే 70 శాతం మేర యూరియా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారు. ఎరువుల అడ్డగోలు పంపిణీపై ఏం చర్యలు తీసుకుంటారని వీఏఏ ఎం.కుసుమను సర్పంచ్ ప్రశ్నించారు.గోదాం వద్దకు వెళ్తుంటే తమ్మినేని అరెస్ట్ శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద నుంచి ఎరువులు పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో శనివారం కుమారుడు చిరంజీవి నాగ్‌తో కలిసి అక్కడికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వాహనాన్ని అడ్డుకుని వెనుదిరగాలని కోరారు. తమ్మినేని వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ముందుకు కదలనీయలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా జీపు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావుతో మాట్లాడుతూ జిల్లాకు ఎన్ని బస్తాల ఎరువులు వచ్చాయి, ఎన్ని ఇచ్చారని ప్రశ్నించగా ఆయన కాకి లెక్కలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలైనా ఎరువులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. బహిరంగ మార్కెట్లోనూ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో ప్రజా పోరాటం చేస్తామని ప్రకటించారు.వ్యవసాయం చేయలేం ప్రస్తుతం వరి పంటకు పొటాష్, యూరియా చాలా అవసరం. పొటాష్‌ను పెద్దాపురంలో బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి కొనుగోలు చేశాను. కానీ యూరియా లభించడం లేదు. సొసైటీ వద్ద రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇలాగైతే ఎలా? – గుణ్ణం వీర్రాజు, రైతు, సామర్లకోట -
పరిపాలన మహాపతనం!
‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా బయటకొస్తున్నది. ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.‘ధిక్కారముల్ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్ హోటల్లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్ వారి ఛానల్లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్ జీఎమ్‌గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్‌రెడ్డి అనే సీనియర్ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్‌గా వచ్చే మంత్రి ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి తన రూమ్‌తోపాటు ఇంకో అనుబంధ రూమ్‌ను కూడా మెయిన్‌టెయిన్ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్‌కు సంబంధించిన పెరోల్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్’ అంటాము. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్ విషయంలో ఉంటుందా?మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న. చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్‌ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్ రూమ్‌లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్ బెల్ట్ షాపుల్లో 20 శాతం, లైసెన్స్డ్ షాపుల్లో 5 శాతం, పర్మిట్ రూమ్‌లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసంవాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్ సిక్స్’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే. ‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్‌పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్‌ను అందజేసే థర్మల్ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్ ఫర్నేస్‌కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఐఏఎస్ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలుచంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్మోహన్రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాంగ్రెస్ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్ – బాబుల మధ్యన హాట్‌లైన్ లేదంటే నమ్మశక్యమా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చంద్రబాబు మోసాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు
-
ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది కూటమికి నేతలకు అంబటి వార్నింగ్
-
Disabled People: కొంచెం కూడా కనికరం లేదా బాబు?
-
Merugu Nagarjuna: తొలగించిన వికలాంగుల పెన్షన్‌ను వెంటనే పునరుద్దరించాలి
-
Botsa: బాబు వస్తే వికలాంగులు చావాల్సిందేనా?
-
తరిమి తరిమి కొడతారు... వడ్డే శోభనాద్రీశ్వరరావు వార్నింగ్
-
చంద్రబాబు పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరు.. వికలాంగుల పింఛన్ల కోత
-
డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ), వేతన సవరణ (పీఆర్సీ) బకాయిలను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రెజరీస్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పిటిషనర్ సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కరువు భత్యం, వేతన సవరణ బకాయిలను చెల్లించలేదన్నారు. కొత్త పెన్షన్ స్కీం ప్రకారం 90 శాతం బకాయిలను నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉందన్నారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని పదవీ విరమణ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన పలు ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
పింఛన్లు కకావికలం!
పింఛన్ ఆగింది.. ప్రాణం పోయింది కృష్ణా జిల్లా పెదపూడికి చెందిన మేడం లక్ష్మి(53) ఒంటరి మహిళ పింఛన్ పొందేది. కంటి చూపు మందగించడం, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు 2024 ఏప్రిల్ నుంచి దివ్యాంగ పింఛన్ వస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించిన రీ వెరిఫికేషన్‌లో ఆమెను అనర్హురాలిగా తేల్చారు. సచివాలయ సిబ్బంది సోమవారం ఆమెకు నోటీసు ఇవ్వడంతో ఆందోళనకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ ఆరోగ్యం దెబ్బతిందని.. పింఛన్ డబ్బులతోనే మందులు కొనుక్కునేవాళ్లమని లక్ష్మి తల్లి బాలమ్మ కన్నీటిపర్యంతమైంది.అన్యాయంగా తనకు వైకల్య శాతం తగ్గించారని ఓ దివ్యాంగుడు తిరుపతి జిల్లా వాకాడులో మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి ధర్నాకు దిగారు. వాకాడు మండలం దుగ్గరాజపట్నం అరుందీతయ వాడలోని నిరుపేద కుటుంబానికి చెందిన పట్టపు వెంకటసుబ్బయ్య 2018లో చెట్టుపై నుంచి కిందపడిపోవడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. ఏడేళ్లుగా బాధితుడు మంచానికే పరిమితమయ్యాడు. 2019లో వైద్యులు పరీక్షలు చేసి 86 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం ధృవీకరణ పత్రం ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో తిరుపతిలో నిర్వహించిన సదరం క్యాంపులోనూ దీన్ని నిర్థారించారు. తాజాగా రీ వెరిఫికేషన్‌లో ఏకంగా 45 శాతానికి తగ్గించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారంటూ బాధితుడు ధర్నాకు దిగాడు.సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: అవ్వాతాతలు అందుకుంటున్న పింఛన్లను ఎడాపెడా కత్తిరిస్తున్న చంద్రబాబు సర్కారు అనైతికంగా వ్యవహరించేందుకూ వెనుకాడటం లేదు! కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటినే ఏరిపారేస్తోంది! కనీసం దివ్యాంగుల పట్ల కూడా దయ చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 2024 ఎన్నికల ముందు నాటికి 66.34 లక్షల మందికిపైగా పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటివద్దే పారదర్శకంగా వలంటీర్ల ద్వారా అందించగా.. టీడీపీ కూటమి సర్కారు ఇప్పుడు వీటిని కేవలం 62.19 లక్షలకే పరిమితం చేసింది. ఏడాదిలో ఏకంగా దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లను ఎగరగొట్టింది! ఇప్పటికే పండుటాకులకు పింఛన్లు తొలగించి అవస్థలకు గురి చేస్తున్న కూటమి సర్కారు.. తాజాగా దివ్యాంగులను టార్గెట్‌గా చేసుకుని ఎడాపెడా కోతలు పెడుతోంది. మళ్లీ మళ్లీ సదరం సర్టిఫికెట్లు తేవాలంటూ, వైద్య పరీక్షలు, వైకల్య శాతం కుదింపుతో ముప్పు తిప్పలు పెడుతోంది. 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా నెలనెలా అందే పింఛన్నే నమ్ముకుని బతుకుతున్న దివ్యాంగులను చంద్రబాబు సర్కారు నిర్దయగా రోడ్డుకీడ్చేసింది! ఇన్నాళ్లూ నిబ్బరంగా తీసుకుంటున్న పింఛన్‌కు ఇకపై మీరు అనర్హులంటూ గత వారం పది రోజులుగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న నోటీసులతో పింఛన్‌దారులు కకావికలం అవుతున్నారు! నిశ్చేషు్టలై ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఆవేదనతో తల్లడిల్లి ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సర్కారు మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని పెన్షన్లు కోల్పోతున్న దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. తమ వైకల్యాన్ని నిర్ధారిస్తూ గతంలో వైద్యులే ధ్రువీకరించి సర్టిఫికెట్లు జారీ చేస్తే ఇప్పుడీ కోతలు ఏమిటని ఆక్రోశిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైనే తాజాగా పింఛను నోటీసులు జారీ అయ్యాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.అప్పీలు చేయాలంటే అగచాట్లే.. దివ్యాంగ సర్టిఫికెట్ (సదరం) కలిగి ఉండి గత పదేళ్లకు పైగా పింఛను పొందుతున్న వారికి తాజా పరీక్షల్లో అనర్హులంటూ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వినికిడి లోపం ఉన్న వారికి సైతం వైకల్యం లేదని అనర్హత పేరుతో నోటీసులు జారీ కావడంపై నివ్వెరపోతున్నారు. నోటీసులు అందుకున్న పింఛనుదారులు అభ్యంతరాలు తెలియజేసే ప్రక్రియను అత్యంత క్లిష్టతరంగా మార్చారు. దివ్యాంగ శాతంపై అభ్యంతరం ఉన్నవారు కొత్త సదరం సర్టిఫికెట్లను సంబంధిత ఏరియా వైద్యశాల నుంచి లేదంటే గ్రామ, వార్డు సచివాలయం నుంచి పొంది ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎండీపీవో తిరిగి వైద్య పరీక్షలకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం నిరీ్ణత తేదీలో మళ్లీ వైద్య పరీక్షలకు హాజరవ్వాలి. ఎంపీడీవో నిర్దేశించిన తేదీన, ఆయన సూచించిన ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. శరీర అవయవాలు అన్నీ బాగున్న వ్యక్తులకే ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బంది. అలాంటిది దివ్యాంగులు రోజులు, నెలల తరబడి మండలాఫీసులు, ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. సెప్టెంబరు 1వతేదీ నుంచి పింఛన్ నిలిపివేస్తున్నట్లు ఈ నెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు నోటీసులు అందాయి. నోటీసు అందుకున్న వారు తమ అర్హతను నిరూపించుకొని పింఛన్ కాపాడుకునేందుకు ప్రభుత్వం కనీసం 15 రోజులు గడువు కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలానికి చెందిన 34 ఏళ్ల మద్దులూరి నాగరాజు చిన్నతనంలో ప్రమాదవశాత్తూ పూరి గుడిసె దగ్ధమైన ఘటనలో సగానికిపైగా శరీరం, ఒక కన్ను పూర్తిగా కాలిపోయింది. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్న ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. 15 ఏళ్లుగా దివ్యాంగుల పింఛన్ పొందుతుండగా కూటమి సర్కారు నాగరాజును అనర్హుడిగా ప్రకటించి పెన్షన్ తొలగించింది. ఈ బాలుడికీ అర్హత లేదట!అనంతపురంలోని ప్రభాకర్ స్ట్రీట్‌లో ఉంటున్న వేలూరు ధీరజ్ వెంకట్నాథ్ పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఈ బాలుడికి తల్లిదండ్రులే సపర్యలు చేయాలి. ఈ నెల 14న ధీరజ్‌కు పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసులు రావడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇంత కన్నా దారుణం మరెక్కడా ఉండదని ఆక్రోశిస్తున్నారు.పక్షవాతమున్నా పింఛన్ తొలగింపు..నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన జి.గులాంబాషాకు రోడ్డు ప్రమాదంలో నడుం విరిగింది. పక్షవాతం బారిన పడటంతో 72 శాతం వైకల్యం ఉందని నిర్ధారిస్తూ 2019లో నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు శాశ్వత ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆయనకు దివ్యాంగుల పింఛన్ మంజూరైంది. ఇటీవల రీ వెరిఫికేషన్‌లో గులాంబాషాకు 40 శాతంలోపే వైకల్యం ఉందంటూ పింఛన్ తొలగిస్తూ అధికారులు నోటీసు ఇచ్చారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గులాంబాషా మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కలవారు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాలకు తరలించారు. ⇒ గుంటూరు జిల్లాలో దివ్యాంగ పింఛన్లు 23,459 ఉండగా 2,489 మందిని అనర్హులుగా పేర్కొంటూ నోటీసులిచ్చారు. 472 మందికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద రూ.15 వేలు చెల్లిస్తుండగా వాటిని దివ్యాంగ పెన్షన్లుగా మార్చి రూ.6 వేలకు కుదించారు. 388 మంది దివ్యాంగ పెన్షన్ కింద రూ.6 వేలు పొందుతుండగా ఓల్డ్ ఏజ్ కిందకు మార్చి రూ.4 వేలకు పరిమితం చేశారు. ⇒ పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో 2024 మార్చి నాటికి 2,83,119 మందికి పింఛన్లు అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో దివ్యాంగులకు 35,096 పింఛన్లు అందజేస్తుండగా వారిలో 3,300 మందికి వివిధ కారణాలతో తొలగించారు. రీ అసెస్మెంట్లో 40 శాతం కంటే తక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నందున తొలగించినట్లు డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి పేర్కొన్నారు. ⇒ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 32 వేల దివ్యాంగ పింఛన్లు ఉండగా మరోసారి ధ్రువీకరించాలంటూ రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. ఆగస్టులో జిల్లావ్యాప్తంగా 4,215 దివ్యాంగ పింఛన్లను తొలగించారు. ఇవి కాకుండా 597 హెల్త్ పింఛన్లు (మంచానికే పరిమితమైనవారు), 1,611 వృద్ధాప్య పింఛన్లు నిలిపివేసినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ⇒ ప్రకాశం జిల్లావ్యాప్తంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్ తీసుకుంటున్న వారు 33,310 మంది ఉన్నారు. రీ వెరిఫికేషన్‌లో ఇప్పటివరకు 30 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు 9 వేల మంది దివ్యాంగులకు అనర్హులంటూ నోటీసులు అందాయి. 85 నుంచి 90 శాతం అంగవైకల్యంతో ఇప్పటి వరకు పింఛను పొందుతుంటే రీ వెరిఫికేషన్‌లో సాధారణ వైకల్యం మాత్రమే ఉందని, పింఛన్‌కు అనర్హులని నోటీసులిచ్చారు. దీంతో సోమవారం ఒంగోలులో ‘మీ కోసం’ కార్యక్రమానికి నోటీసులతో దివ్యాంగులు పోటెత్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9,601 మంది దివ్యాంగులకు పింఛన్ నిలిపివేసేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వికలాంగులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మంచానికే పరిమితమైన వారిని జాబితా నుంచి తొలగించారు. కలెక్టర్, ఎంపీడీవో, సర్వజనాసుపత్రి, మున్సిపల్ కార్యాలయాల వద్ద వికలాంగులు మంగళవారం రోజంతా పడిగాపులు కాశారు. శ్రీసత్యసాయి జిల్లా అగళి, బత్తలపల్లి, తాడిమర్రి, హిందూపురం, అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్లు, పామిడి తదితర ప్రాంతాల్లో బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు అర్హత ఉన్నప్పటికీ ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీశారు. ⇒ అన్నమయ్య జిల్లాలో దివ్యాంగుల పెన్షన్లు 29 వేలు ఉండగా 4 వేలకుపైగా పెన్షన్లు అనర్హుల జాబితాలో చేర్చారు. ⇒ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం దివ్యాంగ పెన్షన్లు 27,302 ఉండగా రీవెరిఫికేషన్ పేరుతో 10,205 పెన్షన్లు నిలిచిపోయాయి. ⇒ కృష్ణా జిల్లాలో 33,173 దివ్యాంగ పింఛన్లు ఉండగా వేల సంఖ్యలో నోటీసులు జారీ అయ్యాయి. అర్హులై పించన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కృష్ణాజిల్లా కార్యదర్శి ఎన్ఎస్ నారాయణ చెప్పారు. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 3,211 మంది దివ్యాంగులకు పింఛన్లు రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ⇒ బాపట్ల జిల్లాలో 24,660 దివ్యాంగ పింఛన్లు ఉండగా రీ వెరిఫికేషన్ పేరుతో 3,829 పింఛన్లను తొలగించేందుకు అధికారులు నోటీసులు అందజేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఈ నెల 18న ధర్నా చేస్తున్న దివ్యాంగులు కూర్చోలేడు.. లేవలేడు...మాట్లాడలేడు.. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం దాదంవారిపల్లెకు చెందిన ఎన్.జయరామిరెడ్డి నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధ పడుతున్నాడు. కనీసం కాలు, చేతులు కూడా కదిలించలేడు. మాట కూడా పడిపోయింది. మలమూత్రాలకు కూడా ఎత్తుకుని వెళ్లాలి. ఇంత దీనస్థితిలో ఉన్న ఆయన దివ్యాంగ పింఛన్‌ను రీ వెరిఫికేషన్ పేరుతో రూ.15 వేల నుంచి తొలగించి రూ.6 వేలకు మార్చారు. గతంలో 90 శాతం వైకల్యం ఉందని సదరం సర్టిఫికెట్ జారీ కాగా ఇప్పుడు 75 శాతానికే పరిమితం చేశారు. నిరక్షరాస్యుడైన ఆయన.. చదవగలడు, రాయగలడు, బరువులు ఎత్తగలడు అని వైక్యలం సర్టిఫికెట్లో నమోదు చేయడం గమనార్హం. కోతలకే రీ వెరిఫికేషన్ వైఎస్ జగన్ పాలనలో దివ్యాంగుల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించారు. ఏ ఒక్కరి పెన్షన్ తొలగించలేదు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. 100 శాతం వైకల్యం ఉన్న వారిని సైతం రీ వెరిఫికేషన్ పేరుతో వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు పిలిíపించి అమానుషంగా వ్యవహరిస్తున్నారు. పెన్షన్లలో కోత వేసేందుకే రీ వెరిఫికేషన్. నెలవారీ అవసరాలు తీర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – పూర్ణకంటి బాబురావు, దివ్యాంగుడు , వేమవరం జగ్గయ్యపేటఎలా బతకాలి? నాకు యాక్సిడెంట్లో కాలు విరిగింది. డాక్టర్లు పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. గత ఆరేళ్లుగా పింఛను అందుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. మా కుటుంబం ఎలా బతకాలి? అప్పలనాయుడు, కొవ్వలి గ్రామం, ఏలూరు జిల్లా ⇒ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 32,101 దివ్యాంగ పింఛన్లున్నాయి. వీరిలో కదలలేని స్థితిలో ఉండేవారు 16,934 మంది కాగా దృష్టి లోపం ఉన్నవారు 4,036 మంది, వినికిడి లోపం ఉన్నవారు 3,992 మంది, మానసిక వైకల్యం ఉన్నవారు 3,751 మంది, మానసిక అనారోగ్యం బాధితులు 1,277 మంది, బహుళ వైకల్యం ఉన్నవారు 2,111 మంది ఉన్నారు. ఇప్పటివరకు సర్వేలో 24,213 మంది వివరాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోనసీమ జిల్లాలో 2,899 పింఛన్లను రద్దు చేశారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు 27,193 మంది ఉండగా 13,690 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. 1,289 మందిని వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు. ⇒ కాకినాడ జిల్లాలో 35 వేల మంది దివ్యాంగులు ఉండగా 24,000 మందికి పరీక్షలు నిర్వహించారు. 4,300 దివ్యాంగ పింఛన్లు తొలగించారు. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్లు కోల్పోయిన దివ్యాంగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. డోన్, మద్దికెర, తుగ్గలి తదితర మండలాల్లో దివ్యాంగులు మండల పరిషత్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేశారు. 10,050 దివ్యాంగ పింఛన్లను తొలగిస్తూ నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం. ⇒ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న 12,523 మందికి నోటీసులు జారీచేసి తొలగించడంతో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నారు. ఇటీవల బంగారుపాళ్యం మండల కేంద్రంలో ధర్నాకు దిగి రాకపోకలను నిలిపివేశారు. ఈనెల 18వ తేదీన చిత్తూరు కలెక్టరేట్లో వందలాది మంది దివ్యాంగులు బైఠాయించారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో 2.50 లక్షలకు పైగా పెన్షన్లు ఉండగా దివ్యాంగుల పింఛన్లు 40 వేలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 7,182 మంది దివ్యాంగులను అనర్హులుగా ప్రకటించారు. ⇒ విశాఖ జిల్లాలో మొత్తం 1,60,778 మంది పింఛన్లు పొందుతుండగా దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారు 21,306 మంది ఉన్నారు. ప్రస్తుతం 1,178 మంది దివ్యాంగులకు పింఛన్లు నిలుపుదల చేశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగ పింఛన్‌దారులు 31,502 మంది ఉండగా 29,055 మందికి నోటీసులిచ్చారు. ఆగస్టులో 1,458 దివ్యాంగ పింఛన్లు తొలగించారు. ⇒ విజయనగరం జిల్లాలో 36,412 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతుండగా ప్రస్తుతం 6,770 పెన్షన్లు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ⇒ పార్వతీపురం మన్యం జిల్లాలో దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్న వారు 16,750 మంది ఉండగా పునఃపరిశీలన తర్వాత 2,781 మంది అనర్హులని తేల్చారు. దీంతో రెండు జిల్లాల్లో బాధితులు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ⇒ అనకాపల్లి జిల్లాలో 30,688 మంది దివ్యాంగుల పెన్షన్లు పొందుతుండగా 3,339 మంది పెన్షన్లను తొలగించారు. 799 మంది దివ్యాంగులకు వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే జిల్లాలో 10,136 మంది వృద్ధాప్య పెన్షన్లను తొలగించింది. -
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు
-
పోలీస్ ‘తిరుగుబాటు’
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ వేధింపులపై పోలీసు అధికారులు తిరుగుబావుటా ఎగురవేశారు. రాష్ట చరిత్రలో తొలిసారిగా... వందమందికి పైగా అధికారులు ఒకేసారి బహిరంగంగా గళం వినిపించారు. పోస్టింగులు ఇవ్వకుండా సాధిస్తుండడంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. ఏడాదికిపైగా జీతాలు లేవు... కుటుంబాలను ఎలా పోషించేదని నిలదీశారు. పైగా... ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు అంటూ వేధింపులను మరింత తీవ్రం చేయడంపై మండిపడ్డారు.అసలు పోస్టింగులే లేవు... ఇక మా కుటుంబాలు ఎక్కడ ఉండాలి? మేం బయోమెట్రిక్ హాజరు ఎలా వేయాలి? అని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు ప్రధాన కార్యాలయంలోనే జరగడం గమనార్హం. దీంతో క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు అధికారులు కూడా నిరసన స్వరం వినిపించేంతగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మరోసారి స్పష్టమైంది. యావత్ పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది ఈ ఉదంతం. ఇంతకూ ఏం జరిగిందంటే...?తీరు మార్చుకోకపోగా.. మరింత దారుణంగాచంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 24 మంది ఐపీఎస్ అధికారులతో సహా 199 మంది పోలీసు అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధింపులకు తెరతీసింది. ఈ తీరుపై జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం తీరు మార్చుకోలేదు. ఏడాదికి పైగా సమయం నుంచి పోలీసు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇది చాలదన్నట్లుగా... అదనపు ఎస్పీ నుంచి సీఐ స్థాయి వరకు పోస్టింగులు లేకుండా వెయిటింగ్లో ఉన్న వందమందికి పైగా అధికారులను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. పోస్టింగుల విషయం తేలుస్తారని ఆశతో వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. రిసెప్షన్ వద్ద చెప్పిన ప్రకారం ఆ అధికారులు అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డిని కలిశారు. వెయిటింగ్లో ఉన్నవారంతా రోజూ ఉదయం, సాయంత్రం డీజీపీ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలని మధుసూదన్‌రెడ్డి చెప్పారు. డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా ఈ మేరకు ఆదేశించినట్లు తెలిపారు. ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరంఅదనపు డీజీ చెప్పిన సమాచారంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు. శాఖలో ఎన్నడూ లేని రీతిలో... ఆవేశం, ఆవేదన కలగలిపి నిరసన స్వరం బలంగా వినిపించారు. ‘‘డీజీపీ అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి తండ్రివంటివారు. ఏడాది పైగా మాకు పోస్టింగులు లేవని, జీతాలు ఇవ్వడం లేదనే విషయం ఆయనకు తెలియదా? వందలమంది పోలీసు అధికారులు కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు? పిల్లల చదువులు, ఇతర బాధ్యతలు ఎలా నిర్వరిస్తున్నారు? అని డీజీపీ ఏనాడైనా ఆలోచించారా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వేధింపులు చాలవన్నట్టు ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు వేయాలని చెప్పడం ఏమిటని ధ్వజమెత్తారు. ఎక్కడ ఉండాలి..?‘‘కుటుంబాలన్నీ మేం ఏడాది క్రితం పనిచేసిన పట్టణాలు, నగరాల్లో ఉండిపోయాయి. పోస్టింగ్ లేకుండా మేం కుటుంబాలతో సహా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలి...? డీజీపీ కార్యాలయానికి రోజూ ఉదయం, సాయంత్రం ఎలా వచ్చేది?’’ అని సూటిగా పోలీసు అధికారులు ప్రశ్నించారు. ‘‘పోస్టింగులు ఇవ్వండి. ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తాం. ఉదయం, సాయంత్రం ఏమిటీ...? రోజుకు పదిసార్లు బయోమెట్రిక్ వేయమన్నా వేస్తాం’’ అని స్పష్టం చేశారు. అంతేగానీ, పోస్టింగులు లేకుండా జీతాలు ఇవ్వకుండా రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ వేయమని చెప్పడం అమానవీయం అని వాపోయారు.⇒ పోలీసు అధికారుల ఆగ్రహం చూసి అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి అవాక్కయ్యారు. అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో తప్పుబట్టే అంశం ఏదీ లేకపోవడంతో ఆయన వారిని ఏమీ అనలేకపోయారు. వారి ఆవేదన పట్ల తనకూ సానుభూతి ఉందని చెప్పినట్టు సమాచారం. డీజీపీ గుప్తా ఆదేశాలనే తాను చేరవేశానని అన్నారు. సమస్యను డీజీపీతోనే చర్చించాలని సూచించారు.తన మాటను నెగ్గించుకునేందుకే...‘‘వెయిటింగ్లో ఉన్నా పోస్టింగే’’ అనే తన మాటను నెగ్గించుకునేందుకే డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తాజా ఎత్తుగడ వేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెయిటింగ్లో ఉన్న అధికారులు రోజూ ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించినట్లు సమాచారం. కానీ, అనూహ్యంగా అధికారులు పూర్తిగా ఎదురు తిరగడంతో పోలీస్ బాస్‌లకు నోట మాట రాలేదు. కాగా, ఈ పరిణామం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల రెడ్‌బుక్ కుట్ర, అందుకు వత్తాసు పలుకుతున్న పోలీసు బాస్‌ల తీరుతో తమ డిపార్ట్మెంట్ ఆత్మగౌరవం దెబ్బతింటోందని పోలీసు వర్గాలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.పోస్టింగులపై హామీ ఇవ్వని డీజీపీఅదనపు డీజీ మధుసూదన్‌రెడ్డిని కలిసిన అనంతరం పోలీసు అధికారులు కొందరు జట్టుగా, మరికొందరు విడివిడిగా డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తా వద్దకు వెళ్లినట్లు సమాచారం. సమస్యలను ఆయనకు కూడా వివరించినట్లు తెలిసింది. పోస్టింగులపై డీజీపీ వారికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. కాగా, అధికారులకు ఏడాదికి పైగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడాన్ని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఇటీవల సమర్థించుకోవడం పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. ‘‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉండడం కూడా పోస్టింగే. వీఆర్ అన్నది శాంక్షన్డ్ పోస్టే’’ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై పోలీసు అధికారులు తీవ్రంగా స్పందించారు. ‘‘...మరి వీఆర్‌లో ఉన్న పోలీసు అధికారులకు నెలనెలా జీతాలు ఇస్తున్నారా? ఏడాదిగా జీతాలివ్వకుండా పోస్టింగ్‌లో ఉన్నట్టే అని ఎలా ప్రకటిస్తారు’’? అని ప్రశ్నించారు. -
బార్లు.. ఇక బార్లా
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ సాగిస్తున్న అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం బార్ల తలుపులు బార్లా తెరచింది. రాష్ట్రంలో బార్లు తెరిచి ఉంచే వేళలను మరో రెండు గంటలపాటు పెంచింది. అంటే అనధికారికంగా మరో నాలుగు గంటలు బార్లు తెరచి ఉంచినా పట్టించుకోబోమని స్పష్టమైన సంకేతం ఇచి్చంది. మరోవైపు టీడీపీ సిండికేట్‌కు బార్లు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు రెస్టారెంట్ నిబంధనలను సడలించింది.దరఖాస్తు చేసేనాటికి రెస్టారెంట్ లేకపోయినా పర్వాలేదని నిబంధనల్లో పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గం తీర్మానాన్ని అనుసరించి సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త బార్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 840 బార్ల లైసెన్సుల జారీకి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్‌కుమార్ మంగళగిరిలో సోమవారం మీడియా సమావేశంలో నూతన బార్ విధానాలను వెల్లడించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ..ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వం పొడిగించింది. అంటే 24 గంటల్లో 14 గంటలపాటు బార్లు తెరచి ఉంటాయి. తద్వారా ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు బార్లు బార్లా తెరిచే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేశాయి. ⇒ కల్లు గీత కుటుంబాలకు కేటాయించిన 10 శాతం బార్లకు లైసెన్సు ఫీజు 50శాతం తక్కువగా నిర్ణయించారు. ⇒ మూడేళ్లపాటు బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు సోమవారం నుంచి ఈ నెల 26 సాయంత్రం 5గంటల వరకు స్వీకరిస్తారు. నేరుగా గానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.5లక్షలు. ⇒ ఇప్పటివరకు రెస్టారెంట్ ఉన్నవారే బార్ల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలో టీడీపీ కూటమి ప్రభుత్వం సడలింపునిచ్చింది. బార్ లైసెన్సు పొందిన తరువాత 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 28న లాటరీ విధానంలో బార్ల లైసెన్సులు కేటాయిస్తారు. ⇒ పట్టణాలు, నగరాల్లో జనాభా ప్రాతిపదికన బార్ల లైసెన్సు ఫీజు నిర్ణయించారు. 50 వేల జనాభా ఉన్న పట్టణాలకు రూ.35 లక్షలు, జనాభా 50 వేలు నుంచి 5 లక్షలలోపు ఉంటే రూ.55 లక్షలు, జనాభా 55 లక్షలు పైబడి ఉంటే రూ.75 లక్షలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ⇒ ఇప్పటివరకు లైసెన్స్ ఫీజును ఒకేసారి చెల్లించాలనే నిబంధన ఉంది. ఆ నిబంధనను సడలిస్తూ ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. -
Ambati: అమరావతిలో కొన్ని వేల ఎకరాలు చెరువుల మారిపోయాయి..
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి కుట్రలు చేస్తోంది: అమర్నాథ్
-
Kethireddy: చంద్రబాబు భ్రమరావతిలో మరికొద్ది రోజుల్లో పులస చేప
-
ఇది చెరువు అనుకోకండి వర్షాలకు పొలాలలో వరద... చంద్రబాబు చేతకానితనం వల్ల
-
బాబు సర్కారు బడ్జెట్ అప్పు లే ఏకంగా రూ.48,354.02 కోట్లు
-
ఐటీ ముసుగులో భూములు ‘లిఫ్ట్’!
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వమైనా ఓ కంపెనీకి ఉదారంగా భూములివ్వాలంటే ముందుగా దాని ట్రాక్ రికార్డు చూస్తుంది! కంపెనీ శక్తి, సామర్థ్యాలు ఏమిటి? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? రాష్ట్రానికి పారదర్శకంగా ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూస్తుంది. అంతటా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుంది. కానీ ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా పప్పు బెల్లాల మాదిరిగా భూముల పందేరానికి టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది. ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. ఎన్ని ఎకరాల భూమి అయినా సరే కేవలం 99 పైసలకే ఇస్తాం...! ఐటీ పేరుతో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకోండి..! ఆ తరువాత మార్కెట్ ధరకు అమ్మేసుకోండి..! అంటూ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పేరుతో విలువైన భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నామంటూ పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సన్నాహాలు చేశారు. తొలుత ఒకటి రెండు ప్రముఖ కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి కనీసం పాలసీ కూడా సిద్ధం కాకముందే విశాఖలో 99 పైసలకే భూములను కట్టబెట్టారు. ఈ క్రమంలో ఊరూ పేరు లేని ఉర్సాకు కారుచౌకగా భూములను కట్టబెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఉలిక్కిపడి ‘లిఫ్ట్’ పేరుతో ఓ పాలసీని తీసుకొచ్చారు. ఉర్సా లాంటి వందలాది సత్తాలేని కంపెనీలను సృష్టించి తమకు కావాల్సిన వారికి భూములు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అసలు టెక్నాలజీతో సంబంధం లేని కంపెనీలకు భూములను ధారాదత్తం చేస్తున్నారు! తొలుత విశాఖలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించి ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా భూములను కేటాయించనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నామినల్ రేటు అంటే 99 పైసలు..ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఇప్పటికే ఏపీ ఐటీ అండ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ 2024–29 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయించడం కోసం ప్రత్యేకంగా ‘లిఫ్ట్’ పాలసీని తెరపైకి తెచ్చింది. ముందుగా ఐటీ లేదా జీసీసీతో అభివృద్ధి చేసే వాణిజ్య సముదాయంలో 20 శాతం కొనుగోలు లేదా లీజుకు తీసుకునేలా ఒప్పందం చేసుకుంటే చాలు.. అడిగినంత భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టనుంది. మిగిలిన 80 శాతంలో 30 శాతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, జీసీసీలకు ఇస్తే చాలు 50 శాతం భూమిని వాటికి నచ్చినట్లుగా విక్రయించుకోవచ్చని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘నామినల్ రేటు అంటే 99 పైసలు..’’ అని అందులో పేర్కొనడం గమనార్హం.ప్రత్యేకంగా ‘ఫార్చూన్ 500 యూరప్’ ఎందుకు?ఐటీ, ఐటీఈఎస్, జీసీసీలకు 99 పైసలకే భూమి ఇస్తామంటూనే ‘‘ఫార్చూన్ 500 యూరోప్’’ను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిలో నాన్ ఐటీ కంపెనీలే ఉన్నాయి. టెక్నాలజీతో ఏమాత్రం సంబంధంలేని యూరోప్ ఫార్చూన్ 500 ఇండెక్స్‌ను ఎంపిక చేసుకోవడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ ఇండెక్స్‌లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్‌కు చెందిన 36కిపైగా కంపెనీలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫార్చూన్ 500 యూరోప్ తేవడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.డెవలపర్స్ ముసుగులో ‘రియల్’ వ్యాపారంఐటీ పార్కు డెవలపర్స్, జీసీసీ డెవలపర్స్‌కు కూడా ఈ పాలసీ కింద 99 పైసలకే భూమిని కేటాయిస్తారు. జీసీసీ డెవలపర్స్ కనీసం ఒక ఎకరా భూమిలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఫార్చూన్, ఫోర్బ్స్ కంపెనీల్లో ఒక దానిని యాంకర్ కంపెనీగా ఎంపిక చేసుకొని అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం తీసుకునే విధంగా ఒప్పందం చేసుకోవాలి. ఎకరాకు కనీసం 500 మందికి ఉపాధి కల్పించాలి. ఇలా అభివృద్ధి చేసిన భూమిలో కనీసం 50 శాతం భూమిని ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, జీసీసీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు . అదే ఐటీ పార్కు డెవలపర్స్ అయితే ఎకరాకు 1,00,000 చదరపు అడుగులు చొప్పున కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే ఐటీ డెవలపర్స్‌కు కనీసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తారు. -
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్
సాక్షి,విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టు కోలేకపోతుంది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగకుండా కాపాడుతామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 32 విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను పిలిచిన స్టీల్ యాజమాన్యం.. సెప్టెంబర్ 9వ తేదీ టెండర్ల దాఖలకు ఆఖరి తేదీ విధించింది.ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) విధానంలో1)టీపీపీ, 2) ఎస్ ఎం ఎస్-1&2, 3)ఎంఎంఎస్ఎం, 4)ఎస్బిఎం, 5)డబ్ల్యూఆర్ఎం-1&2, 6) మాదారం మైన్స్, 7) రోల్షాప్అండ్ రిపేర్ షాప్ -1&2, 8) సిఎంఎస్, 9) ఫౌండ్రీ, 10)ఎస్టీఎం, 11)ఈఎన్ఎండి, 12) బ్లాస్ట్ ఫర్నిస్-1,2&3లను ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్లను పిలిచింది. -
బాబు మార్కు కనికట్టు!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ధర ఎక్కువన్నారు.. పాతికేళ్ల పాటు వ్యవసాయ అవసరాలకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తెస్తుంటే వద్దన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత తక్కువ ధరకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల మినహాయింపుతో విద్యుత్ తీసుకుంటా మంటే అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం చేశారు.. కానీ, అదే కూటమి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక యూనిట్ విద్యుత్‌కు రూ.3.20 చొప్పున చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో పిలిచిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం కోసం పంపేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సన్నాహాలు చేస్తున్నాయి. మరి ఈ పాలకులను ఏమనాలి? రెండు నాల్కల ధోరణి అనాలా? అవకాశవాదం అనాలా? ప్రజలను తప్పుదారి పట్టించే మోసగాళ్లు అనాలా? అధిక ధర ముసుగులో కమీషన్లు కొట్టేసే కేటుగాళ్లు అనాలా?సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనిట్ సోలార్ విద్యుత్ రూ.2.49కే వస్తోందంటే నానా యాగీ చేసిన ఇదే కూటమి.. అధికారంలోకి రాగానే యూనిట్ విద్యుత్‌ను రూ.3.20 చొప్పున ప్రైవేటు సంస్థల నుంచి కొనేందుకు సిద్ధమైపోయింది. తమకొక న్యాయం.. ఎదుటి వాళ్లకు మరో న్యాయం అని నిస్సిగ్గుగా చెబుతూ బరితెగించింది. రాష్ట్రంలో దాదాపు 19 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉంటే, వీటిలో 3 లక్షల సర్వీసులకు సరిపోయేలా కుసుమ్ పథకం కింద 3,325 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం గల మినీ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 1,185.80 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈ ఏడాది మార్చిలో సర్కిళ్ల వారీగా టెండర్లు పిలిచాయి. యూనిట్‌కు కనిష్ఠంగా రూ.3.19 గరిష్ఠంగా రూ.3.60 ధరను గుత్తేదారులు కోట్ చేశారు. తాజాగా ఈ టెండర్ల ధరలను కూడా ఖరారు చేశారు. దాని ప్రకారం.. యూనిట్‌కు రూ.3.19 నుంచి రూ.3.20 మధ్య ఇవ్వనున్నారు. ఎకోరాన్ కంపెనీకి యూనిట్‌కు రూ.3.18, వృద్ధిమాన్ సంస్థకు యూనిట్‌కు రూ.3.19, భవ్య కంపెనీకి రూ.3.20 చొప్పున టెండర్లను ఖరారు చేసేందుకు రంగం సిద్ధమైంది. నిజానికి వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా అందించేందుకు గత ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ఇంకా అమలులోనే ఉంది. దాని ప్రకారం ఇంతకంటే తక్కువ ధరకు సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ దానిని కాదని, పొలాల వద్ద మినీ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి సౌర విద్యుత్ బహిరంగ మార్కెట్లో ఇంత కన్నా తక్కువ ధరకే వస్తోంది. అప్పనంగా 5,983.5 ఎకరాలు ధారాదత్తంమినీ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రైవేటు సంస్థలకు టెండర్లు అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలోని 9 సర్కిళ్లలో 610 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కం టెండర్లు పిలిచింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు సర్కిళ్ల పరిధిలో ప్రాజెక్టుల ఏర్పాటుకు 3,055 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఈ డిస్కం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోని 4 సర్కిళ్లలో 355.50 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు 1,842 ఎకరాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 220.30 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదించగా, దీని కోసం 1,086.5 ఎకరాలు గుర్తించారు. మొత్తంగా 5,983.5 ఎకరాలను సిద్ధం చేశారు. మిగులు ఉండగా కొత్తవి ఎందుకు?రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రిడ్ గరిష్ట డిమాండ్ 13 వేల మెగావాట్లు మించి లేదు. అది కూడా వేసవి వంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రమే. మిగతా ఏడాదంతా 10 వేల మెగావాట్లలోపే విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. భవిష్యత్ అవసరాల కోసం, డిమాండ్ భారీగా పెరిగినా ఇబ్బంది లేకుండా ఉండేందుకంటూ ఇప్పటికే డిస్కంలు 23 వేల మెగావాట్లకు పీపీఏలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాల నుంచి ప్రస్తుతం సుమారు 14 వేల మెగావాట్ల విద్యుత్ సమకూరుతోంది. అంటే డిమాండ్‌కు అవసరమైన విద్యుత్ కంటే ఎక్కువగానే విద్యుత్ అందుబాటులో ఉంది. దీంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తిని అనేకసార్లు నిలిపివేయాల్సి వస్తోంది. ఇలాంటి మిగులు విద్యుత్ పరిస్థితులు రాష్ట్రంలో ఉండగా, ఇంకా అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది కూటమి ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల డిస్కంలపై ఆర్థికంగా చాలా భారం పడే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.అధికారం చేతికి రాగానే దోపిడీ⇒ చంద్రబాబు అధికారంలోకి రాగానే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పట్టాలెక్కించడానికి ఉపక్రమించారు. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన యూనిట్ రూ.4.60 చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ 400 మెగావాట్ల పునరుత్పాదక (పవన–సౌర హైబ్రీడ్) విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి, వాటి నుంచి పాతికేళ్ల పాటు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్‌ను విక్రయించేలా ఏర్పాటు చేశారు.⇒ వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గతంలో చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్న పీపీఏల వల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని గుర్తించి, వాటిని పునఃపరిశీలించాలని భావించింది. ఆ క్రమంలోనే యాక్సిస్ పీపీఏలను పక్కన పెట్టింది. కానీ మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పట్టాలెక్కించారు చంద్రబాబు. తాను సగంలో ఆపేసిన దానిని ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో మార్కెట్లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ, రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ⇒ భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్ ధరలు తగ్గుతాయని, కావున సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి యూనిట్ రూ.2.49తో సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడం భారమని వాదించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మినీ సోలార్ ప్రాజెక్టుల పేరుతో రూ.3.20తో యూనిట్ కొనుగోలుకు సిద్ధమైపోయింది.సబ్సిడీ ఎగ్గొట్టే కుట్రమినీ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వెనుక ప్రస్తుతం రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా సమస్య వచ్చి, ఆ సంస్థలు ఎదురు తిరిగితే రైతులకు ఈ కేంద్రాల నుంచి విద్యుత్ లభించకపోవచ్చు. అప్పుడు వారికి విద్యుత్ ఎలా అందిస్తారనే ప్రశ్నకు సమాధానం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల కోసం డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లు అందించింది. అదే టీడీపీ గత హయాంలో 2014–19 మధ్య ఐదేళ్లకు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. పైగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. చంద్రబాబు గత అయిదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా, జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 వ్యవసాయ ఫీడర్ల ద్వారా 9 గంటలు పగటి పూట విద్యుత్ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామర్థ్యాన్ని గత ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు వాటి వద్దనే టీడీపీ ప్రభుత్వం సోలార్ ప్లాంట్లు పెట్టిస్తామంటోంది. ఇదంతా వ్యవసాయానికి ఇప్పుడు ఇస్తున్న దాదాపు రూ.12 వేల కోట్ల సబ్సిడీని ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‘సెకీ’ ఒప్పందంపై ఎన్నో కుట్రలు ⇒ రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేయడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) నుంచి 17 వేల మిలియన్ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వంలో ఒప్పందం జరిగింది. అది కూడా అత్యంత చవకగా.. యూనిట్ రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్‌ను తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన సెకీ నుంచే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా యూనిట్ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ రూ.2.49కే ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది. ⇒ సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని చెప్పింది. సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సైతం ఆదేశాలిచ్చింది. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) కూడా స్పష్టం చేసింది.⇒ చివరికి ‘సెకీ’, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉంది. అయినప్పటికీ గత ప్రభుత్వంపై బుదరజల్లి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు వేశారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్, ఎల్లో మీడియా సెకీ ఒప్పందంపై విషం గక్కాయి. సెకీ ఒప్పందాన్ని ఓ అవినీతి భూతంగా చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేశాయి. అసత్య కథనాలు, అబద్ధ ప్రచారాలతో రైతులకు సైతం ఉచిత విద్యుత్‌ను దూరం చేయాలని ప్రయత్నించాయి. ⇒ ఈ కుట్రలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పటాపంచలు చేసింది. సెకీ ఒప్పందం సక్రమమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే బాబు ప్రభుత్వం అదే సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.20 చొప్పున చెల్లించి కొంటున్నారంటే దాని వెనుక ఎంతటి అవినీతి దాగుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. -
చంద్రబాబు సర్కార్ పాపం.. పోలవరానికి శాపం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణానికి వీలుగా గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి నిర్మించిన ఎగువ కాఫర్ డ్యామ్ తాజాగా కుంగిపోయింది. వాస్తవానికి దీనిపై భారీ వాహనాల రాకపోకలకు అనుమతించకూడదు. కానీ.. బట్రెస్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులకు అవసరమైన మట్టి, రాళ్లు, కంకర, సిమెంటును భారీ వాహనాల్లో ఎగువ కాఫర్ డ్యామ్ మీదుగానే సరఫరా చేస్తున్నారు.ఇందుకోసం కాఫర్ డ్యామ్‌ల మధ్య ప్రత్యేకంగా దారిని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌దే. కానీ.. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చి, కమీషన్లు వసూలు చేసుకోవడానికి ఎగువ కాఫర్ డ్యామ్ మీదుగానే భారీ వాహనాల్లో వాటిని సరఫరా చేయడానికి సర్కార్ అనుమతించింది. ఆ భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రకంపనలు, ఒత్తిడి వల్ల ఎగువ కాఫర్ డ్యామ్ 10 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతున దిగువకు కుంగి పోయింది.శుక్రవారం ఉదయం దీన్ని గమనించిన అధికారులు గుట్టుచప్పుడు కాకుండా రాళ్లు, మట్టి వేసి పూడ్చివేశారు. మళ్లీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చేశారు. ఈ పనులను పోలవరం ఎస్ఈ రామచంద్రరావు, ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యామ్ భద్రతపై చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధి లోపం మరోసారి బహిర్గతమైందని సాగునీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. కమీషన్ల కక్కుర్తి వల్లే సీపేజీ ⇒ గోదావరికి 2017లో వరద ప్రవాహం ముగిశాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లను 2018 జూన్ నాటికి అప్పటి చంద్రబాబు సర్కార్ పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ నిర్మించే ప్రదేశంలో కమీషన్ల కక్కుర్తితో ఇసుక సాంద్రతను తప్పుగా లెక్కించి.. 40 మీటర్ల లోతుతో నిర్మించాల్సిన జెట్ గ్రౌటింగ్ వాల్‌ను 20 మీటర్ల లోతుతో నిర్మించింది. ⇒ గోదావరి ప్రవాహం ప్రభావం జెట్ గ్రౌటింగ్ వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో 2018లో గోదావరి వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య కోతకు గురై దెబ్బతింది. 20 మీటర్ల లోతుతో నిర్మించిన జెట్ గ్రౌటింగ్ వాల్ పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించి.. 2019 మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. ⇒ దీనివల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో భారీ ఎత్తున సీపేజీ (లీకేజీ) సమస్య ఉత్పన్నమైందని, ఇది ఎగువ కాఫర్ డ్యామ్ భద్రతను ప్రశ్నార్థకం చేసిందని స్పష్టం చేసింది. ఎగువ కాఫర్ డ్యామ్ భద్రతకు బట్రెస్ డ్యామ్‌ను నిర్మించాలని సూచించింది. దాంతో రూ.వందల కోట్లు వెచ్చించి బట్రెస్ డ్యామ్‌ను నిర్మించాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.వెంటాడుతున్న పాపాలు ⇒ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో కేంద్రమే పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించాలి. కానీ.. కమీషన్ల కక్కుర్తితో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. 2016 సెప్టెంబర్ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పటి చంద్రబాబు సర్కార్ దక్కించుకుంది. ⇒ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) సూచించిన విధానాన్ని తుంగలో తొక్కి.. కమీషన్లు వచ్చే పనులనే చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ గ్యాప్–2 పునాది డయా ఫ్రం వాల్‌ను నిర్మించింది. ⇒ దీంతో 2017, 2018 గోదావరి వరదల ఉధృతికి డయా ఫ్రం వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయలేక.. ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి, 2019 ఫిబ్రవరి నాటికి చేతులెత్తేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో వదిలేసిన ఖాళీలు అంటే 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద 800 మీటర్లకు కుదించుకుపోయి ప్రవహించడం వల్ల వరద ఉధృతి మరింత పెరిగి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది.⇒ 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. చంద్రబాబు సర్కార్ తప్పిదాలను సరిదిద్ది.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించింది. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీలను పూర్తి చేసి.. ఎడమ కాలువలో కీలకమైన నిర్మాణాలను పూర్తి చేసి.. కేంద్రంతో చర్చించి నిధుల సమస్యను పరిష్కరించింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పోలవరం ప్రాజెక్టుకు జీవంపోసింది. ⇒ చంద్రబాబు సర్కార్ 2016–18 మధ్య కమీషన్ల కక్కుర్తితో చారిత్రక తప్పిదాలకు పాల్పడకపోయి ఉంటే 2023 నాటికే వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.