మేడం గారి తొలి హామీ.. సంతకు వెళ్లింది..! | Chandrababu Naidu government negligence On Tribal Students Health | Sakshi
Sakshi News home page

మేడం గారి తొలి హామీ.. సంతకు వెళ్లింది..!

Feb 11 2026 12:42 PM | Updated on Feb 11 2026 12:56 PM

Chandrababu Naidu government negligence On Tribal Students Health

రెండేళ్లు కావస్తున్నా ఆచరణకురాని సంధ్యారాణి హామీ 

పిట్టల్లా రాలుతున్న గిరిజన విద్యార్థులు 

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజానీకం మండిపాటు 

‘గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. జ్వరాల బారిన పడిన పిల్లలకు తక్షణమే వైద్య సేవలు అందించేలా ఏఎన్‌ఎమ్‌లను నియమిస్తాం. నెలవారీగా వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తాం. అనారోగ్యంతో ఏ విద్యార్థి మరణానికి గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తొలి సంతకం చేస్తున్నాను’.  
– మంత్రి గుమ్మిడి సంధ్యారాణి  

 పార్వతీపురం మన్యం జిల్లా:  చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గిరిజన విద్యార్థులకు ఆరోగ్య భద్రత కరువైంది. వారికి చిన్నపాటి సమస్య వచ్చినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. దీంతో జ్వరం వచ్చినా, జలుబు చేసినా వారు మృత్యువుతో పోరాడుతూ విగతజీవులుగా మారుతున్న దుస్థితి గిరిజన ఆశ్రమ పాఠశాలు, కళాశాలల్లో కొనసాగుతోంది. 

ఏఎన్‌ఎమ్‌లను నియమిస్తాం.. 
ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు/ కళాశాలల వసతి గృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా ‘ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తానంటూ’ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘ మొదటి సంతకం’ చేశారు. దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఆ సంతకం ఆచరణకు నోచుకోవడం లేదు. ఫలితంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు సకాలంలో వైద్యసేవలు అందక ఆస్పత్రుల పాలవుతున్నారు. కొందరు మరణిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల మరణాల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గిరిజనులు వక్కానిస్తున్నారు.    

ఏడాదిన్నర కాలంలో కురుపాం నియోజకవర్గంలోని విద్యాలయాల్లో మృతిచెందిన విద్యార్థుల వివరాలు..

గుమ్మలక్ష్మీపురం మండలంలో.. 

  • 2024 జూలై 21న వామాసీ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి మండంగి గౌతమ్‌(9) మలేరియాతో బాధపడుతూ మృతిచెందాడు.

  • 2024 అక్టోబర్‌ 2న పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మల అవంతి(13) రక్తహీనత, తీవ్ర జ్వరంతో బాధపడుతూ పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

  • 2024 డిసెంబర్‌ 17న దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పత్తిక దినే‹Ù(14) పచ్చకామర్లు, రక్తహీనత, కిడ్నీ సంబంధి వ్యాధులతో బాధపడుతూ మరణించాడు.

  • 2025 డిసెంబర్‌ 14న దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న టి.అవిష్‌ అనారోగ్యంతో మృతిచెందాడు.

  • 2026 జనవరి 7న రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మక రూప శ్వాసతీసుకోవడం, బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది.

  • కురుపాం మండలంలో...
    2024 నవంబర్‌ 6న కురుపాం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల(బాలురు)లో నాలుగో తరగతి చదువుతున్న నిమ్మక నితిన్‌(9) అనారోగ్యం బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

  •  2025 సెపె్టంబర్‌ 26న కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి పచ్చకామెర్లతో బాధపడుతూ మృతి చెందింది. 

  • 2025 సెపె్టంబర్‌ 30న కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యారి్థని తోయక కల్పన పచ్చకామర్లెతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్‌లో మృతిచెందింది.

  • జియ్యమ్మవలసలో... 
     2024 నవంబర్‌ 6న రావాడ రామభద్రాపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలో 7వ తరగతి చదివిన నిమ్మక జీవన్‌ కుమార్‌(12) అనారోగ్యంతో మృతిచెందాడు. నెల రోజుల వ్యవధిలో ఇదే ఆశ్రమ పాఠశాలకు చెందిన టెన్త్‌ విద్యార్థి బి.ఈశ్వరరావు కూడా అనారోగ్యంతో మృతిచెందాడు.

    కొమరాడలో... 
    2 2024 సెపె్టంబర్‌ 17న కొమరాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదివిన కె.శారద అనారోగ్యంతో మృతిచెందింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement