హెరిటేజ్ పెరుగులో పెరుగు లేదట..! | Adulterated Curd Being Manufactured at Heritage | Sakshi
Sakshi News home page

హెరిటేజ్ పెరుగులో పెరుగు లేదట..!

Feb 11 2026 12:11 PM | Updated on Feb 11 2026 1:11 PM

Adulterated Curd Being Manufactured at Heritage

ప్రపంచంలో తానే అత్యంత నీతిమంతుడినని.. తాను పుట్టిన తర్వాతే లోకంలో పద్ధతి నీతి నిజాయితీ ధర్మం అని ఉద్భవించాయని చెప్పే చంద్రబాబు తాను నిర్వహించే హెరిటేజ్ పెరుగులో పెరుగు లేకుండానే కేవలం కల్తి ఉత్పత్తులను మార్కెట్లోకి పంపించి కోట్లు కొల్లగొడుతున్నారు. శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడినట్లు ప్రపంచంలో అందరికీ నీతులు చెప్పే చంద్రబాబు ఆయన సారధ్యంలోని హెరిటేజ్ కల్తీ ఉత్పత్తులని అమ్ముతూ దొరికిపోయింది. 

పెరుగు అంటూ విక్రయిస్తున్న ఆ ప్యాకెట్లలో అసలు పెరిగే లేదని గురుగాంలో ఏకంగా కేసు నమోదయింది. వివిధ స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో అది మొత్తం కల్తీ అని తేలడంతో ఏకంగా లక్ష రూపాయలు పెనాల్టీ సైతం విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీంతో దెబ్బకు దెయ్యం జడుస్తుంది అన్నట్లుగా హెరిటేజ్ సంస్థ దారికి వచ్చింది. ఈ క్రమంలో సంస్థ ఒక ప్రకటన చేసింది.  హెరిటేజ్ సంస్థపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.  . తమ ఉత్పత్తుల తయారీలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తామన్నారు. తమకు వెన్న శాతం తగ్గించే ఉద్దేశమే లేదన్నారు. ఇదే తరుణంలో అసలు హెరిటేజ్ పెరుగుకు సంబంధించి శాంపిల్స్ సేకరించే ప్రక్రియ సరిగా లేదంటూ ఎదురుదాడి చేసింది.

అయితే హెరిటేజ్‌ ఉత్పత్తులకు సంబంధించిన నమూనాలను సేకరింంచే సమయంలో సరైన పద్ధతి పాటించలేదన్నారు.. ఆ మొత్తం ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. 'నిర్దేశిత ప్రమాణాల కంటే ఎస్‌ఎన్‌ఎఫ్‌ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు ల్యాబ్‌ నివేదికలో తేలింది. దీంతో అసలు ఆ నమూనాల సేకరణ ప్రక్రియ సరిగా లేదని బుకాయిస్తోంది.

మరి తిరుపతి లడ్డూకు ఈ నిబంధనలు వర్తించవా
హెరిటేజ్ ఉత్పత్తులకు సంబంధించి నమూనాలు సేకరించే క్రమంలో  నిబంధనలు పాటించలేదని, థర్డ్ పార్టీ సమక్షంలో నమూనాలు తీయలేదని అంటూ ప్రభుత్వ సంస్థలను వాటి పనితీరును తప్పుపట్టిన హెరిటేజ్ దాని యజమాని చంద్రబాబు తిరుపతి లడ్డు విషయంలో మాత్రం తమకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తిరుపతి లడ్డు కోసం వినియోగించే నెయ్యిని కల్తీ చేశారంటూ అవాస్తవాలు ప్రచారం చేసిన చంద్రబాబు నా నమూనాలు సేకరించే విషయంలో ప్రమాణాలు పాటించారా లేదా చెప్పడం లేదు. 

బోలె బాబా డైరీ నుంచి వచ్చే నెయ్యి నమూనాలను థర్డ్ పార్టీ సమక్షంలో సేకరించారా లేదా. .. నెయ్యి నమూనాలను  ని ట్యాంకర్ల నుంచి నేరుగా సేకరించారా ? లూజ్ నెయ్యిని  వేరే పాత్రలోకి తీసుకుని దాన్ని ల్యాబ్ పరీక్షలకు పంపారా అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. తాము బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి తమకు ఇబ్బంది వచ్చినపుడు నీతులు చెప్పడం పద్ధతి కాదని ప్రజలు అంటున్నారు. ఎదుటివారిపై అభాండాలు వేసేటపుడు వెనకా ముందూ చూడని చంద్రబాబు తనవరకు వచ్చేసరికి అందరూ నిబంధనలు పాటించాలని రోదిస్తున్నారు.

తిరుమల లడ్డుకోసం వాడే నేతి కి సంబంధించి నామూనాలు థర్డ్ పార్టీ సమక్షంలో తీసారా లేదా.. నేతి నాణ్యతను నిర్ధారించే పరీక్షలు సరిగానే చేశారా లేదా అనేది తేల్చకుండానే బురద చెల్లుతున్న చంద్రబాబు తన హెరిటేజ్ పెరుగు విషయానికి వచ్చేసరికి రూల్స్..నిబంధనలు అంటూ ఆక్రందనలు చేస్తున్నారు. నీవరకు వచ్చేసరికి ఒక రూల్.. మిగతావారికి ఇంకో రూల్ ఎలా బాబూ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement