‘గవర్నర్‌ ప్రసంగంలో అన్ని అబద్దాలే.. ప్రజా వ్యతిరేకం’ | AP Assembly Budget Session 2026 Day 1 Begins Today Live Updates, Governor Abdul Nazeer To Address Both Houses | Sakshi
Sakshi News home page

‘గవర్నర్‌ ప్రసంగంలో అన్ని అబద్దాలే.. ప్రజా వ్యతిరేకం’

Feb 11 2026 9:27 AM | Updated on Feb 11 2026 3:24 PM

AP Assembly Session 1st Day Live Updates

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌.. 

శాసనమండలి మీడియా పాయింట్

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్‌..

  • గవర్నర్ ప్రసంగం పూర్తిగా నిరుత్సాహ పరిచింది
  • గత బడ్జెట్‌లో చెప్పించిన మాదిరిగానే ఈ బడ్జెట్ లోనూ అబద్ధాలు చెప్పించారు
  • రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరం
  • 3.2 లక్షల కోట్లు అప్పులు చేసి ఎవరికిచ్చారు?.
  • అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేశారు
  • ఏపీలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోంది
  • గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇంత చెత్తగా పాలన సాగలేదు
  • వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో సంక్షేమ పాలన అందించారు
  • కానీ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది లేదు
  • కూటమి నేతలు మహిళలను వంచిస్తున్నారు
  • మహిళా సాధికారత కొరవడింది
  • రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి
  • విద్యా ప్రమాణాలు పడిపోవడం వల్ల ఆరు లక్షల మంది బడికి దూరమయ్యారు
  • ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నారు
  • ప్రభుత్వ భూములను కారుచౌకగా తమ మనుషులకు దోచిపెడుతున్నారు
  • గీతం సంస్థకు వేల కోట్ల భూములు కట్టబెడుతున్నారు
  • సంక్షేమ హాస్టల్స్ లో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు
  • రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ ఎందుకు గవర్నర్‌తో చదివించ లేదు
  • ప్రజల తరపున ప్రశ్నిస్తామనే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు
  • ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలపై మేం పోరాటం కొనసాగిస్తాం
  • చంద్రబాబు, లోకేష్, పవన్ పాలనా వైఫల్యాలను ఎండగడతాం.


ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కామెంట్స్‌..

  • సభలో గవర్నర్ మాట్లాడిందంతా ప్రజా వ్యతిరేక ప్రసంగం
  • ఈ ప్రభుత్వంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు
  • వాస్తవాలను పక్కన పెట్టి గవర్నర్‌తో అసత్యాలు చదివించారు
  • ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు
  • ఉద్యోగులపై ఈ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది
  • ప్రభుత్వం తెచ్చే ఒత్తిడితో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు
  • ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోంది
  • వాలంటీర్లకు హామీలిచ్చి ఈరోజు రోడ్డున పడేశారు
  • నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు మాటతప్పారు
  • ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పి యువతను మోసం చేశారు
  • దేశంలోనే గవర్నెన్స్ లో ఏపీ అట్టడుగు స్థానంలో ఉంది
  • ఏపీలో శాంతి భద్రతలు లోపించాయి. 
అసెంబ్లీలో గవర్నర్ అబద్దాలు.. MLC కల్పలత రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్‌..

  • రాష్ట్రంలో మూడు పార్టీలు ఒకవైపు ఉంటే వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన ఉంది
  • ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావాలి
  • కానీ ప్రజల గొంతు వినిపించకుండా మూడు పార్టీలు అడ్డుపడుతున్నాయి
  • దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోంది
  • ఏపీలో మాత్రం లోకేష్ రాజ్యాంగం నడుస్తోంది
  • లోకేష్ రాజ్యాంగంలో శాంతి భద్రతలు క్షీణించాయి
  • మాజీ మంత్రుల ఇళ్ల పై దాడులు చేస్తున్నారు
  • మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారు
  • ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్ధానాన్ని కూడా నెరవేర్చడం లేదు
  • ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదువుతున్నారు
  • తన ప్రసంగంలో చదువుతున్నది వాస్తవమా కాదా అని కూడా గవర్నర్ చూడటం లేదు
  • నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది
  • సంక్షేమం, అభివృద్ధి లేదు
  • ఈ రాష్ట్రంలో నడుస్తోంది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం
  • మూడు పార్టీల నేతలు పందికొక్కుల్లా మారి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కామెంట్స్‌..

  • రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ
  • మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కు
  • టీడీపీ తెలుగు దొంగల పార్టీగా మారి దోచుకుంటోంది
  • టీడీపీ దేవుళ్లను మోసం చేసే పార్టీగా మారింది
  • పచ్చ పార్టీ గూండాలు మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేస్తున్నారు
  • గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఏనాడైనా ఇలా జరిగిందా?.
  • 175 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలు సభలో ఎవరు వినిపిస్తారు
  • వైఎస్‌ జగన్‌కు సభలో మాట్లాడే హక్కు కావాలి
  • ఈ ప్రభుత్వం నియంత పోకడలు అనుసరిస్తోంది
  • పీఏసీ ఛైర్మైన్‌ను కొట్టేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు
  • ఏపీలో 3.2 లక్షల కోట్లు అప్పులు చేశారు
  • విద్యార్ధులకు ఫీజు బకాయిలు చెల్లించలేదు
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే హోదా ఇవ్వడం లేదు  
  • ప్రతిపక్షహోదా వైఎస్సార్‌సీపీ హక్కు
  • ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదు
  • మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేనప్పుడు టీడీపీ ఆ పాత్ర పోషిస్తుందా?
  • ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కామెంట్స్‌..
  • గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలు పుట్ట
  • గవర్నర్ తోనూ అబద్ధాలను పలికించారు
  • పీఏసీ మీరే తీసుకున్నారు
  • ప్రతిపక్ష హోదా ఇవ్వరు
  • ఇక ప్రజల ఆకాంక్షలను సభలో చర్చించేవారు ఎవరు?.
  • అప్పు చేసిన 3.2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి
  • ఈ 20 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?.
  • మూడేళ్లు ఇదేవిధంగా పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు
  • మూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే
  • విశాఖలో భూములు కబ్జా చేశామని చెప్పుకోవడానికి టీడీపీఈ ఎంపీకి సిగ్గులేదా?.  
  • కౌన్సిల్‌లో ఈ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతాం

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్‌ కామెంట్స్‌..

  • తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారు
  • లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది
  • లడ్డూ అంశాన్ని డైవర్షన్ చేయడం కోసం మాజీ మంత్రులపై దాడులు చేస్తున్నారు
  • చంద్రబాబు ఇప్పటికైనా ఇలాంటి చర్యలను మానుకోవాలి
  • మీరు చేసే దుర్మార్గాలకు త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెబుతారు

ఎమ్మెల్సీ  ఇసాక్ బాషా కామెంట్స్‌..

  • గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ అమలు చేశారని చెప్పారు
  • సూపర్ సిక్స్ ఎక్కడ అమలు చేశారో సమాధానం చెప్పాలి
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు
  • హత్యాయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్
  • బాధితులకు రిమాండ్ వేయడమేనా మీ పాలన
  • రాయలసీమకు మీ వల్ల అన్యాయం జరుగుతోంది 
  • రాబోయే బడ్జెట్ ఎంత నిస్సారంగా ఉంటుందో అర్ధమైపోయింది

 

👉ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. 

 👉 ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యులు వాకౌట్‌.

వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన..

  • అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆందోళన.
  • గవర్నర్ ప్రసంగిస్తుండగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
  • ఏపీలో శాంతిభద్రతలు కాపాడాలని నినాదాలు.
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ సభ్యుల నినాదాలు.
  • ‍ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌. 
  • సభ్యుల హక్కులను కాపాడాలని నినాదాలు.
  • నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌
  • మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌.
  • వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళన, నినాదాల మధ్యే కొనసాగుతున్న గవర్నర్‌ ప్రసంగం. 

     

 

👉  ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ 
 👉 ప్రారంభమైన ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు

 👉  14న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం
 👉  నెలరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం 
 👉  వైస్సార్సీపీకి ప్రజల పక్షాన నిలుస్తోంది: అప్పిరెడ్డి

 👉  ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించకుండా చేయాలని ప్రభుత్వం కుట్రపన్నుతుంది
 👉  వైస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి: లేళ్ల అప్పిరెడ్డి
 👉  ప్రధాన  ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని  వైఎస్సార్సీపీ  నేతల డిమాండ్.

👉 ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో  అసెంబ్లీ పరిసరాల్లో వైఎస్ జగన్ నిరసన ప్రదర్శన చేపడుతున్నారు.

👉వైఎస్ జగన్ కొద్ది సేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు.  మరికాసేపట్లో అసెంబ్లీ సెషన్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి సమావేశాల్లో పాల్గొననున్నారు.

👉నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమవేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హాజరు కానున్నారు. అలాగే, అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరు కానున్నారు. 

👉వెలగపూడి­లోని అసెంబ్లీ హాలులో ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభను వాయిదా వేసి బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాలపై చర్చించాలనే విషయాలు ఖరారు చేయనున్నారు.

👉14న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మార్చి 12 వరకూ సమావేశాలు జరుగుతా­యని ఇప్పటికే స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మొత్తం 19 పని దినాల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో చర్చించి దీనికి ఆమోదం తెలపనున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement