పెదకాకాని శివాలయం పాలకమండలి నియామకం | - | Sakshi
Sakshi News home page

పెదకాకాని శివాలయం పాలకమండలి నియామకం

Feb 11 2026 7:43 AM | Updated on Feb 11 2026 7:43 AM

పెదకాకాని శివాలయం పాలకమండలి నియామకం

పెదకాకాని శివాలయం పాలకమండలి నియామకం

పెదకాకాని శివాలయం పాలకమండలి నియామకం పెదకాకాని: పెదకాకానిలోని శ్రీమల్లేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల తర్వాత పాలకమండలి నియామకానికి శ్రీకారం చుట్టారు. పాలకవర్గంలో మొత్తం 13 మందిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోవాల్సి ఉంది. ● పాలకవర్గ సభ్యులుగా చేబ్రోలు వెంకట భాస్కర పున్నారావు, కంభంపాటి వెంకయ్య, క్రోసూరు పూర్ణచంద్రరావు, కొమ్మూరి మల్లికార్జునరావు, బైరపనేని ధనలక్ష్మి, కొండా లత, ధూపాటి శివశంకరరావు, వడ్లమూడి సువర్ణలక్ష్మి, ఉల్లం రాజేశ్వరి, బండారు మల్లేశ్వరి, వరికూటి వీరసుధాకర్‌, బాణావత్‌ మంగమ్మ, పాముదుర్తి నాగలక్ష్మి తదితరులను నియమించారు. ● ఎక్స్‌అఫిషియో సభ్యుడుగా ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముగిసిన భారత్‌ రంగ్‌ అంతర్జాతీయ నాటక సంబరాలు ● దయా ప్రకాష్‌ సింహ రచనలో ఆయుష్‌ త్రిపాఠి దర్శకత్వంలో ఆఫ్‌ స్టేజ్‌ ఆర్ట్‌ గ్రూపు ప్రదర్శించిన ఓన్స్‌ ఇన్‌ ఇండియా నాటకం అలరించింది. 22 శతాబ్దాల నాటి మౌర్య సామ్రాజ్యం పతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. గ్రీకు సంస్కృతి మౌర్య వైభవాల కలయికగా ఈ కథ సాగింది. జాతీయ భద్రత విషయంలో హింసా, అహింసల మధ్య నైతిక సంఘర్షణను చర్చించింది. హాకీ సెంట్రల్‌ ప్యానెల్‌ సభ్యుడిగా హర్షవర్ధన్‌ నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించాలి ఇద్దరు చిన్నారులతో మహిళ అదృశ్యం

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌) : నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, వేదిక (తెలుగు నాటక పరిషత్‌ సంఘం) సంయుక్తంగా మార్కెట్‌ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న భారత రంగ్‌ మహోత్సవ్‌ ● అంతర్జాతీయ నాటకోత్సవం మంగళవారంతో ముగిశాయి. ఈసందర్భంగా జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. అనంతరం గుంటూరు నగర వీధుల్లో భారీగా కళాకారుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు హాజరయ్యారు.

గుంటూరు వెస్ట్‌ ( క్రీడలు) : హాకీ ఆంధ్రప్రదేశ్‌ గౌరవ జనరల్‌ సెక్రటరీగా ఉన్న గంధం హర్షవర్ధన్‌ను ఎఫ్‌ఐహెచ్‌–ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ హాకీ సెంట్రల్‌ ప్యానెల్‌ సభ్యునిగా నియమించారని సీనియర్‌ హాకీ క్రీడాకారుడు కె.క్రాంతి కుమార్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ను స్థానిక తమ కార్యాలయంలో ఘనంగా సత్కరించామన్నారు. జిల్లాలో తమతోపాటు హాకీని ప్రారంభించిన ఆయన జాతీయ జట్టుతోపాటు పలు టోర్నమెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారన్నారు. దీంతోపాటు అంతర్జాతీయ హాకీ రిఫరీగానూ కొనసాగుతున్నారన్నారు. జాతీయ క్రీడైన హాకీకి పట్టణంలో ఇప్పటి వరకు మైదానం లేకపోవడంతో హర్షవర్ధన్‌ దీనిని ఏర్పాటు చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు నివ్వడం సంతోషకరమన్నారు. ఈ నియామకం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. హర్షవర్ధన్‌ సతీమణి సత్తె గీత కూడా డబుల్‌ ఒలింపియన్‌ అని పేర్కొన్నారు. సీనియర్‌ హాకీ క్రీడాకారులు ఇఏ. రాజ శేఖర్‌, జి. మాణిక్యాలరావు, సుభాని, జి.ప్రసన్న కుమార్‌లు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారన్నారు.

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌): వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజన, వసతి సౌకర్యాలు కల్పించేలా సంక్షేమ శాఖ అధికారులు నిబద్ధతతో బాధ్యతగా విధులు నిర్వహించాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశించారు. మంగళవారం గుంటూరు వైద్య కళాశాల ఎదుట ఉన్న ఏపీఎన్జీవో కల్యాణ మండపంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ డైరెక్టర్‌ మల్లికార్జున, ఎక్స్‌ అఫీషియల్‌ సెక్రటరీ సత్యన్నారాయణ, ప్రాంతీయ జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, వసతి గృహా సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వనతి గృహాల నిర్వహణ, రాబోయే టెన్‌న్త్‌ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనపై గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, వెస్ట్‌ గోదావరి, ప్రకాశం, మార్కాపురం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల వసతి గృహా సంక్షేమ అధికారులతో జిల్లాల వారీగా, వసతి గృహాల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి పరీక్షల్లో సీ గ్రేడ్‌ లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మంగళగిరి టౌన్‌ : ఓ వివాహిత ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైన ఘటన మంగళగిరి మండలం యర్రబాలెంలో మంగళవారం చోటు చేసుకుంది.తిరుపతికి చెందిన బోయ నానికి లక్ష్మి అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా యర్రబాలెంలో నివాసముంటున్నారు. భర్త నాని డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తన ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement