టీటీడీకి రూ.10 లక్షలు విరాళం | - | Sakshi
Sakshi News home page

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Feb 11 2026 7:43 AM | Updated on Feb 11 2026 7:43 AM

టీటీడ

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం ఐదు, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి గ్రంథాలయంలో తనిఖీలు విద్యార్థి జమీర్‌బాషాను అభినందించిన జిల్లా కలెక్టర్‌ శ్రీ సీతారామ గానసభ సంగీత ఉత్సవాలు ఆరంభం

తిరుమల:గుంటూరుకు చెందిన ఎన్‌.సుధా రాణి టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

విజయపురిసౌత్‌: స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ వాణి రాణి మంగళవారం తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు http://apgpcet.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7569333798 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.

రేపల్లె: పట్టణంలో ని శాఖా గ్రంథాలయాన్ని ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ సభ్యురాలు మగతాల పద్మజ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పత్రికా విభాగం, పుస్తక విభాగం, రిజిస్టర్‌లు, రికార్డులు, శిక్షణ ఫౌండేషన్‌ కంప్యూటర్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు. పట్టణంలోని చంద్రమౌళి పార్కులో గ్రంథాలయానికి సంబంధించిన 15 సెంట్ల భూమిలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నరసరావుపేట:జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించిన మున్సిపల్‌ బాయ్స్‌ హైస్కూల్‌ విద్యార్థి షేక్‌ జమీర్‌బాషాను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్‌కు పిలిపించి అభినందనలు తెలియచేశారు. విద్యార్థి తల్లితండ్రులు, డీఈవో రామారావు, ప్రధానోపాధ్యాయులు టి.రవికాంత్‌ను సైతం అభినందించారు. జమీర్‌బాషా జిల్లాకే కాకుండా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘పరీక్షలపై చర్చ’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో విద్యార్థిని మాత్రమే ఎంపిక చేయగా, ఏపీ నుంచి నరసరావుపేట మున్సిపల్‌ బాయ్స్‌ హైస్కూల్‌కు చెందిన జమీర్‌బాషా ఎంపికయ్యారు. ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడి తన ప్రతిభను చాటుకున్నారు. జమీర్‌బాషాకు ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ విజయరామరాజు శుభాకాంక్షలు తెలియచేశారు.

తెనాలి:పట్టణానికి చెందిన సంగీత సంస్థ శ్రీ సీతారామ గానసభ శాసీ్త్రయ సంగీత ఉత్సవా లు మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఆరంభించారు. తొలుత త్యాగరాజస్వామి, గానసభ వ్యవస్థాపకులు నారుమంచి సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు పిరాట్ల నారాయణమూర్తి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగీత ఉత్సవాన్ని ప్రారంభించారు. మొదట రోజు విజయవాడకు చెందిన కుమారి మల్లాది సింధు రాజేశ్వరి సంగీత కచేరి హృద్యంగా సాగింది. వాగ్దేవి కీర్తనలను ఆలపించారు. వయొలిన్‌పై మీద విజయవాడకు చెందిన అంబటిపూడి కామాక్షి, మృదంగంపై విజయవాడకు చెందిన మాస్టర్‌ మల్లాది శివానంద ఎస్‌.ఎస్‌.వి వాయి ద్య సహకారం అందించారు. గానసభ అధ్యక్షులు పిరాట్ల రమణి పర్యవేక్షించారు.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 1
1/1

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement