దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Feb 11 2026 7:43 AM | Updated on Feb 11 2026 7:43 AM

దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

మార్చి 8న ప్రవేశ పరీక్ష

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ–2026 క్యాలెండర్‌ సంవత్సరం ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను దూర విద్య కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వంకాయలపాటి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెండేళ్ల కాలపరిమితితో ఉండే (ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం దూర విద్య కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మార్చి 8న ఏఎన్‌యూ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఏపీ ఐసెట్‌ 2025లో ర్యాంక్‌ పొందిన అభ్యర్థులు నేరుగా కోర్సులలో ప్రవేశం పొందవచ్చని వెల్లడించారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎనన్‌యూ) సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తెలిపారు. అలానే 2026 క్యాలెండర్‌ సంవత్సరానికి సెమిస్టర్‌ విధానంలో యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ), డెబ్‌ (డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో) 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 25వ తేదీతో ముగియనుందన్నారు. అన్ని వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌ సైట్‌ నుంచి లేదంటే ఫోన్‌ నంబర్స్‌ను 0863–2346222, 98484 77441 సంప్రదించవచ్చుని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement