breaking news
Guntur District Latest News
-
అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సమన్వయంతో బుధవారం గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో అంతార్జాతీయ సంకేత భాషా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం ఉద్దేశ్యం సానుభూతి తెలియచేసే రోజుగా కాకుండా వారికి హక్కులను అందించే ఒక అవకాశంగా భావించాలన్నారు. వినలేని, మాట్లాడలేని వారు ఉపయోగించే సంకేత భాషను ప్రత్యామ్నాయ పద్ధతిగా కాకుండా సంకేత భాష, సంపూర్ణమైన భాషగా పరిగణించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వైకల్యాన్ని పదేపదే గుర్తు చేయకుండా వారికున్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట రమణప్ప, సమగ్ర శిక్షా అభియాన్ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ సాయి, టీజేపీఎస్ కాలేజీ ప్రిన్సిపాల్ శాస్త్రి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ డెఫ్ అసోసియేషన్ గుంటూరు ప్యానెల్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుంటూరు రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఏటుకూరులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏటుకూరు గ్రామం శ్రీగణేష్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద సర్వీసు రోడ్డులో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి వయస్సు 36 సంవత్సరాలు ఉంటాయి, తెల్లని చొక్క ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు నల్లపాడు పోలీసు స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. -
వర్షంలోనూ జీజీహెచ్ వైద్య సిబ్బంది నిరసన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో కాంట్రాక్టు సిబ్బంది బుధవారం వర్షంలోనూ లెక్కచేయకుండా తమ నిరసన తెలిపారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని మౌనంగా కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు తెలిపారు. గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో బుధవారం ఎల్ నినో నేపథ్యం లో రబీ 2026–27 పంటల ప్రణాళిక కార్యచరణ సమావేశంను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ మాట్లాడుతు క్షేత్రస్థాయిలో ప్రస్తుత యదార్థ పరిస్థితులను అంచనావేసి ఎల్ నినో నేపథ్యంలో రబీ 2026–27 పంటల ప్రణాళిక కార్యచరణ చేయాలని సూచించారు. ఖరీఫ్‌లో పంట వేయని విస్తీర్ణం, రబీలో సాధారణ పంట విస్తీర్ణంను దృష్టిలోఉంచుకొని ఆచరించగలిగిన సలహాలు, కొలవదగిన, పరిమాణాత్మక ఫలితాలను సాధించే దిశగా ప్రణాళికా రచన చేయాలని నిర్దేశించారు. నీటి బడ్జెటింగ్, నేలలో తేమ సూచిక, మార్కెట్ డిమాండ్ ఈ సారి చలికాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు వంటి అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుని వ్యూహరచన చేయాలన్నారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి. సుమతి జిల్లాల వారిగా ప్రస్తుత పంట విస్తీర్ణం, వర్షపాతం, రబీలో విత్తుకోడానికి సిద్ధంగా ఉన్న విస్తీర్ణం వంటి అంశాలతో పాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను వివరించారు. వాసర్ ల్యాబ్స్‌కు చెందిన డాక్టర్ ఎన్డీఆర్కె శర్మ మాట్లాడుతూ ప్రణాళిక రచనలో అవసరమైన మండల స్థాయిలో వర్షపాతం, పంటలసాగువిస్తీర్ణం వంటి సమాచారాన్ని విశ్వవిద్యాలయం అందిస్తామన్నారు. సమావేశంలో విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.రామచంద్రరావు, వ్యవసాయశాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, వివిధ వ్యవసాయ వాతావరణ మండలాల సహ పరిశోధన సంచాలకులు, వివిధ పరిశోధన శాస్త్రవేత్తలు, విస్తరణ శాస్త్రవేత్తలు అనుభవజ్ఞులైన విశ్రాంత శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖకు కన్సల్టెన్సీ ఏజెన్సీలైన వాసర్ ల్యాబ్స్, అగ్రివాచ్ డెలాయిట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. లక్ష్మీపురం: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలనకు రాష్ట్రంలో 13 కేంద్రాలు ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు చంద్రమౌళినగర్లో ఆయన నివాసంలో బుధవారం మాట్లాడారు. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఐడీ అధికారుల ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, అయితే గతంలో బాధితులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండేందుకు పాత జిల్లాల ప్రాతిపదికన 13 కేంద్రాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బాధితులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని, తద్వారా వారిపై ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. కర్ణాటకలో కూడా సుమారు 8.50 లక్షల మంది బాధితులు ఉన్నారని, అక్కడ కూడా 4 కేంద్రాలకు బదులు 6 కేంద్రాలు, తెలంగాణలో 3 కేంద్రాలఉ బదులు 5 కేంద్రాలు, ఒడిశాలో 2కు బదులు 4 కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆయా రాష్ట్రాల్లోని బాధితులకు సౌలభ్యంగా ఉంటుందని సూచించారు. న్యాయపర సమస్యలు తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక కోర్టు వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. బాధితులకు చివరి పైసా వచ్చే వరకు అసోసియేషన్ వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎటు చూసినా ముసురు
గుంటూరు● జిల్లా వ్యాప్తంగా మోస్తరు వానలు ● నేడూ భారీ వర్షం పడే అవకాశం ఉందని అధికారుల ప్రకటన7మంగళగిరిలో రోడ్డుపైకి చేరిన వాననీరువానలోనే మొక్కజొన్న కంకులు విక్రయిస్తున్న దృశ్యం మంగళగిరిలో కురుస్తున్న వర్షంఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.3726 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర రూ.11,500, మోడల్ ధర రూ.9,600 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 535.80 అడుగులకు చేరింది. ఇది 179.6902 టీఎంసీలకు సమానం. -
ఏఎన్‌యూ దూరవిద్య ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ (పెదకాకాని): ఏఎన్‌యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన ఈ పరీక్ష నిర్వహించిన సంగతి విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 14 కేంద్రాలలో జరిగిన పరీక్షలో ఎంబీఏకు 684 మంది, ఎంసీఏకు 97 మంది అర్హత సాధించారని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్‌లు తెలిపారు. ప్రవేశాలు పొందేందుకు సెప్టెంబరు 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఏపీ ఐసెట్ 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా అడ్మిషన్లు పొందవచ్చన్నారు. వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, దూరవిద్య కేంద్రం పరీక్షల విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణవేణి, సూపరింటెండెంట్ జవ్వాజి శ్రీనివాసరావు, ఐసీటీ డివిజన్ డైరెక్టర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్ తనిఖీ
మంగళగిరి టౌన్: మాదకద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ‘మిషన్ మోడ్’లో పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌షా సూచించినట్లు ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహించిన 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్(ఎ.ఎన్.టి.ఎఫ్) చీఫ్స్ కాన్ఫరెన్స్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ ఆకే రవికృష్ణ పాల్గొన్నట్లు ఏపీ ఈగల్ రాష్ట్ర కార్యాలయం నుంచి బుధవారం వివరాలు వెల్లడించారు. డ్రగ్స్ నియంత్రణ, నివారణ, ఎన్ఫోర్స్మెంట్, యువత రక్షణ, పునరావాసం, ఆధునిక సాంకేతిక వినియోగంపై ఆకే రవికృష్ణ సదస్సులో వివరించారు. డ్రోన్లతో గంజాయి సాగుపై నిఘా, మెడికల్ షాపులపై నిఘా ఉంచి తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. తాడేపల్లి రూరల్: బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ కనబరుస్తున్న వినుకొండ ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి దేవళ్ల సాయి కుమార్‌ను మంత్రి ఎస్.సవిత అభినందించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మార్కాపురంలో నిర్వహించిన 11వ ఏపీ స్టేట్ సబ్‌జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సాయి కుమార్ బెస్ట్ ప్లేయర్ అవార్డుతో పాటు థర్డ్ ప్లేస్ సాధించాడు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయి కుమార్, కోచ్ జూనా నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ వై.రమేశ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 3 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో జరిగే జాతీయ సబ్‌జూనియర్స్ పోటీల్లో ఏపీ తరఫున పాల్గొంటున్నట్లు సాయి కుమార్ వివరించాడు. ఈ సందర్భంగా మంత్రి సవిత సాయి కుమార్‌కు కొత్త దుస్తులు అందజేసి సత్కరించారు. నరసరావుపేట: వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి పేర్కొన్నారు. వినుకొండ రోడ్డులోని వీవీఆర్ మండలంలో బుధవారం సాయంత్రం పల్నాడు సర్కిల్‌పై ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతిక నష్టాలను, ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. వందశాతం రెవెన్యూ వసూళ్లను సాధించాలని కోరారు. విద్యుత్ చౌర్యం జరగకుండా ప్రతి ఇంటికి మీటరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్, మాచర్ల, నర్సరావుపేట ఈఈలు, టెక్నికల్ ఈఈలు, ఆపరేషన్ ఏఈలు హాజరయ్యారు. దుగ్గిరాల: కృష్ణా పశ్చిమ డెల్టాకు 3,007 క్యూసెక్కులు విడుదల చేశారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కు 126 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 759 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 403, పశ్చిమ కాలువకు 154, నిజాంపట్నం కాలువకు 250, కొమ్మమూరు కాలువకు 960 క్యూసెక్కులు వదులుతున్నారు. -
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
గుంటూరు మెడికల్: పరిశుభ్రత ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని ఏపీపీసీబీ గుంటూరు జిల్లా పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నగరంలోని సుమేధ హైస్కూల్లో బుధవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పర్యావరణ ఇంజనీర్ ఎం.డి.నజీనా బేగం పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. సుమేధ హైస్కూల్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ రెడ్డి, ఐటీసీ ఎం.ఎస్.కె.ఫినిష్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ శైలజ, పర్యావరణ విద్యా కోఆర్డినేటర్ డి.తిరుపతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇదేమి కర్మ ‘బాబూ’..!
పట్నం బజారు: ప్రతి సారీ ఇదే ఇబ్బంది.. సీఎం చంద్రబాబు పర్యటన అంటేనే ప్రయాణికులు ముప్పతిప్పలు పడాల్సి వస్తోంది.. అసలే అంతంతమాత్రంగా ఉంటున్న ఆర్టీసీ బస్సులు.. దీనికి తగ్గట్లు ఎడతెరిపి లేనివర్షం.. దీంతో ప్రయాణికులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితిని ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. సాధారణ ప్రయాణీకులకు సీఎం సభలు అంటే శాపంగా మారుతోంది. బుధవారం తుళ్లూరు సమీపంలోని అబ్బురాజువారిపాలెంలో జరిగిన ఓ కంటి ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు రీజియన్ పరిధిలోని గుంటూరు డిపో–1, డిపో–2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల నుంచి సుమారు 70 ఆర్టీసీ బస్సులను తరలించినట్లు సమాచారం. బస్సుల కోసం పడిగాపులు.. ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులను కార్యక్రమానికి తరలించడంతో సాధారణ సర్వీసుల సంఖ్య తగ్గిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, కూలీలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు నిత్యం ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడే వారు, గంటల కొద్ది బస్సుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి తగ్గట్లు ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆర్టీసీ బస్టాండ్ కనీసం నిల్చునేందుకు కూడా ఖాళీ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సివచ్చింది. ‘సీఎం కార్యక్రమం ఎక్కడ జరిగినా బస్సులను తరలిస్తారని కార్యక్రమం ఒకచోట జరుగుతుంటే ఇబ్బందులు మాత్రం మాకు ఎందుకంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● భారీ సంఖ్యలో బస్సులను కార్యక్రమానికి తరలించినప్పటికీ, దీనిపై సంబంధిత ఆర్టీసీ అధికారుల నుంచి అధికారిక వివరణ అందలేదు. ఎన్ని బస్సులను ఏ ప్రాతిపదికన కేటాయించారు? సాధారణ సర్వీసులపై ప్రభావం పడుతుందని ముందుగానే గుర్తించారా? ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేశారా? అనే ప్రశ్నలకు అధికారులు ఇప్పటివరకు స్పష్టత కూడా ఇవ్వలేదు. సీఎం కార్యక్రమానికి బస్సులు.. జనాలకు తిప్పలు అబ్బురాజుపాలెం సీఎం కార్యక్రమానికి గుంటూరు రీజియన్ పరిధి నుంచి 70 బస్సుల వరకు కేటాయింపు బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షణ -
రాజధానిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన
తాడికొండ: ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) సంయుక్త ప్రతినిధుల బృందం రాజధానిలో మూడు రోజులపాటు పర్యటన నిమిత్తం విచ్చేసింది. ఈ పర్యటనలో భాగంగా చేపట్టిన నాలుగో జాయింట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ మిషన్‌లో భాగంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు రాజధానిలో ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఏజీఐసీఎల్ అధికారులతో బ్యాంక్ ప్రతినిధుల బృందం పలు సమావేశాలు నిర్వహించనుంది. ఈ పర్యటనలో భాగంగా అమరావతిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు పురోగతి, నిర్దేశించిన లక్ష్యాలు, ఆయా కార్యక్రమాల ఫలితాలు, నిధుల వినియోగం, భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై ప్రతినిధుల బృందం సమీక్ష నిర్వహించనుంది. తొలి రోజు బుధవారం రాయపూడిలోని ఏపీ సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఆర్డీయే కమిషనర్ వి.విజయ రామరాజు, ఏడీసీఎల్ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారథి, అదనపు కమిషనర్లు ఎ.సూర్యసాయి ప్రవీణ్ చంద్, కొల్లాబత్తుల కార్తిక్, టి.రాహుల్ కుమార్ రెడ్డి, అభిషేక్ కుమార్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. తొలి రోజు జరిగిన సమావేశాలలో రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కార్యక్రమాల అమలుకు సంబంధించిన సంస్థాగత వ్యవస్థ, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ రీజియన్(ఐసీఆర్) ప్లాట్‌ఫామ్, అర్బన్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్, ప్రస్తుత, భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన సమన్వయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఏజీఐసీఎల్ అధికారులు అమరావతిలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల అమలు పురోగతికి సంబంధించిన వివరాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులకు ప్రజంటేషన్ ద్వారా వివరించారు. -
వీవీఐటీయూలో లింక్డ్ ఇన్ లెర్నింగ్ ప్రారంభం
పెదకాకాని: విద్యార్థులకు ప్రపంచస్థాయి ఆధునిక, సాంకేతిక నైపుణ్యాలు అందించే దిశగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్, ఈ–లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ ఇన్ లెర్నింగ్‌తో వీవీఐటీ విశ్వవిద్యాలయం కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రొ–చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండల పరిధిలోని నంబూరు వీవీఐటీలో నిర్వహించిన కోర్సుల ప్రారంభ కార్యక్రమంలో లింక్డ్ ఇన్ సౌత్ అండ్ వెస్ట్ రీజనల్ హెడ్ చింతా కృష్ణారెడ్డి, సౌత్ రీజనల్ అకౌంట్ డైరెక్టర్ సాక్షి రహేజా, ఐయూసీఈఈ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కృష్ణ వేదుల, చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొ–ఛాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు లింక్డ్ ఇన్ లెర్నింగ్‌లోని వేలాది సర్టిఫైడ్ కోర్సులను ఉచితంగా పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైనన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాలలో అంతర్జాతీయ నిపుణులు రూపొందించిన కోర్సులు లింక్డ్ఇన్ లెర్నింగ్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థులు పూర్తి చేసిన ప్రతి కోర్సుకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సర్టిఫికేట్ లభిస్తుందని, ఇది వారి ప్రొఫైల్‌కు అదనపు బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. మారుతున్న పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా భారీ వేతనాలతో బహుళ జాతీయ సంస్థలలో ఉద్యోగాలు (నియామకాలు) పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వీవీఐటీ రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్్స డైరెక్టర్ మామిళ్లపల్లి శ్రీకృష్ణ, లింక్డ్ ఇన్ లెర్నింగ్ సెంటర్ సమన్వయకర్త డాక్టర్ నూతలపాటి అశోక్ పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని కేజీబీ విద్యాలయాల సంస్థ రాష్ట్ర కార్యదర్శి డి.దేవానందరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని కేజీబీవీల ప్రిన్సిపాల్స్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా దేవానంద్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన, తల్లిదండ్రులకు దూరమైన విద్యార్థినులు కేజీబీవీల్లో చదువుతున్నారని, వారికి నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని అందించడంలో ప్రిన్సిపాల్స్, వార్డెన్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి హాస్టల్‌కు అవసరమైన నిత్యావసర సరుకులను ప్రతి నెల మొదటి వారంలో పంపుతామని, విద్యార్థినుల పెరుగుదల, అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉండాలన్నారు. భద్రత విషయంలో రాజీ పడవద్దని, ప్రతి హాస్టల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయించాలన్నారు. పల్నాడు సమగ్రశిక్ష ఏపీసీ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ అన్ని కేజీబీవీ హాస్టల్ బిల్డింగ్స్ పూర్తి వినియోగంలోకి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జీసీడీవో పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. తాడికొండ: వినాయక ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనం సందర్భంగా బుధవారం నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.11.50 లక్షలు పలికింది. దొండపాడు డీడీసీ యూత్ ఆధ్వర్యంలో 15వ సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. 25 కేజీల లడ్డూను కొమ్మినేని కిరణ్ రూ.11,50,116లకు దక్కించుకున్నారు. -
నగరంలోనే నత్తనడక
నెహ్రూనగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఫొటోల పరిశీలన, ఆమోదం విషయంలో గుంటూరు జిల్లా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నగర నియోజకవర్గమైన గుంటూరు పశ్చిమ పరిధిలో అధికారులు తీవ్ర ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన పూర్తి చేసి పంపించినా, ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) స్థాయిలో నిర్ణయాలు తీసుకోకుండా వేలాది దరఖాస్తులను పెండింగ్‌లో పడేశారు. ఒక్క వెస్ట్‌లోనే 20 శాతానికి పైగా పెండింగ్! జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు మొత్తం 38,054 దరఖాస్తులు ఈఆర్ఓల పరిశీలనలో పెండింగ్‌లో ఉండగా, ఇందులో సగానికి పైగా ఒక్క గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. గుంటూరు నగరం పరిధిలోని ఈ రెండు నియోజకవర్గాల్లోనే కలిపి దాదాపు 26,878 దరఖాస్తులు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో చురుగ్గా.. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఈఆర్ఓ పెండెన్సీ చాలా తక్కువగా ఉంది. ఓటరు జాబితా ప్రక్షాళన, సరిదిద్దే ప్రక్రియలో ఈ స్థాయిలో జాప్యం జరగడంపై స్థానికంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన ఓటర్ల మార్పులు – చేర్పులు, సరైన ఫొటోల నమోదును సకాలంలో ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రజలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
చేనేత సహకార సంఘాలను ఆదుకోవాలి
మంగళగిరి టౌన్: రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, పరిపాలనా సమస్యలను తక్షణమే పరిష్కరించి, వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళగిరి నగర పరిధిలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహనరావులను కలసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. మంగళగిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రతినిధి సాంబశివరావును కలసి కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధమైన పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్, పావలా వడ్డీ, అమ్మకాలపై రిబేట్ తదితర పథకాల కింద రావాల్సిన సుమారు రూ.127.86 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏపీకో నుంచి కొనుగోలు చేసిన చేనేత వస్త్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.90.53 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. చేనేత రంగ అభివృద్ధి, పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కమిటీ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, రామనాథం పూర్ణచంద్రరావు, కాసుల రవికుమార్, బండారి మస్తాన్, డోకిపర్తి రామారావు, కౌతవరపు వెంకటేశ్వరరావు, గోలి రవికుమార్, భీమిశెట్టి బాలతీడేరు, అవ్వారు సుబ్రహ్మణ్యం, ఊట్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
మమ అనిపింఛన్..!
నెహ్రూనగర్: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు, అర్హుల పరిశీలన ప్రక్రియ అర్హులైన పేదలకు శాపంగా మారింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, దరఖాస్తు చేసుకునేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చి చేతులు దులుపుకొందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ కొద్ది సమయంలో అతికష్టమ్మీద అధికారుల చుట్టూ తిరిగి సర్టిఫికెట్లు తెచ్చుకుని, సమర్పించిన అర్జీలను సైతం అధికారులు ఏదో ఒక కొర్రి పెట్టి తిరస్కరిస్తున్నారని లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పరిశీలనలో అధికార పార్టీ నేతల పెత్తనం నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలు చెప్పినవారి దరఖాస్తులను మాత్రమే ముందుకు కదిలిస్తూ, అర్హులైన పేదల దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. నగరంలో మరీ దారుణం గుంటూరు నగరంలో పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నగరంలో మొత్తం 16,482 దరఖాస్తులు ఉండగా, కేవలం 41.79 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 9,594 దరఖాస్తులు పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి. అలాగే పొన్నూరు అర్బన్‌లో 33 శాతానికి పైగా, మంగళగిరి – తాడేపల్లిలో 30 శాతానికి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా మొత్తం మీద ఇంకా 15,155 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత కూడా పేదలకు పింఛన్లు దక్కకుండా అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మకై ్క కొర్రీలు వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెండింగ్‌లో ఉన్న 15,155 దరఖాస్తులను సక్రమంగా పరిష్కరిస్తారో..లేక ఏదో ఒక సాకు చూపి తిరస్కరిస్తారో అని భయాందోళనలో లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం దరఖాస్తులు: 57,539 పరిశీలన పూర్తయినవి: 42,384 (73.66శాతం) ఇంకా పెండింగ్‌లో ఉన్నవి: 15,155 ఆమోదించినవి: 37,142 తిరస్కరించినవి: 5,242 గుంటూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 57,539 దరఖాస్తులు పరిశీలనకు రాగా, 22వ తేదీ నాటికి ఇందులో ఇప్పటివరకు ఏకంగా 5,242 దరఖాస్తులను తిరస్కరించడం గమనార్హం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పింఛన్ల తిరస్కరణ అధికంగా ఉంది. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోనే అత్యధికంగా 1,118 దరఖాస్తులను పక్కన పెట్టగా, తెనాలి అర్బన్‌లో 991 దరఖాస్తులను తిరస్కరించారు. అర్హత ఉన్నప్పటికీ ఏదో ఒక వంకతో నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగుల అర్జీలను తొలగించారని బాధితులు వాపోతున్నారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు
లక్ష్మీపురం: డీఎస్సీలో జరిగిన అక్రమాల్ని నిలదీస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్నారనే అక్కసుతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అదుపులో తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్లితే....డీఎస్సీ అక్రమాల్సిన నిలదీస్తూ నిరసన వ్యక్తం చేసిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకుడు, గుంటూరు మాజీ కార్పొరేటర్ ఆచారిని, అలాగే గుంటూరు స్తంభాలగరువుకు చెందిన చల్లా శివ కోటిలతో పాటు 22వ డివిజన్ అధ్యక్షుడు గేదెల రమేష్‌లను నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని కృష్ణాజిల్లా మాచవరం పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారులు, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో విచారించారు. వీరి ముగ్గురిలో గేదెల రమేష్ విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమానికి హాజరు కాలేదని, కాకాని పోలీస్ స్టేషన్ వరకు రావడం జరిగిందని దర్యాప్తులో తేలడంతో వదిలేశారు. మిగిలిన ఇద్దరిని మాచవరం పోలీసులు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ బృందం సమక్షంలో కస్టడీలోకి తీసుకుంటున్నట్లు సంతకాలు చేయించుకుని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హాజరుకాని వారిని సైతం.. ఇదిలా ఉంటే నిరసన కార్యక్రమానికి హాజరు కాని వారిని కూడా మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా పలువురు వైఎస్సార్ సీపీ నేతల కోసం నగరంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో పాటు ఎస్.సందీప్, ప్రేమ్‌కుమార్ యాదవ్ అనే వారితో పాటు మరి కొంతమంది పై సుధాబత్తుల సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు 221, 223, 285, 127(2),132, 189(3),109(1)బిఎన్ఎస్,3 (2)(వి) సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, పీఓఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. తాడేపల్లిలో కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌ను, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు న్యాయవాది బోడపాటి కిషోర్‌కుమార్‌ను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగాా గుంటూరు చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులను సైతం విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అదుపులో తీసుకుని స్టేషన్లకు తరలిస్తున్నారు. భయాందోళనకు గురిచేసే యత్నం.. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి, వారిని, వారి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ నిరసనలో పాల్గొనని వారిని సైతం అదుపులోకి తీసుకుంటుండడం చర్చనీయంశంగా మారింది. -
టెట్ మెటీరియల్ వెంటనే విడుదల చేయాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే స్పెషల్ టెట్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్టడీ మెటీరియల్ వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో పీడీఎఫ్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావుకు మద్దతుగా ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టెట్ పరీక్ష ఫీజు చెల్లింపుకు ఒక్కరోజే గడువు ఉందని, పరీక్షకు సైతం 15 రోజులే వ్యవధి ఉన్న దృష్ట్యా స్టడీ మెటీరియల్ విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. టెట్ రద్దు కోసం ఉద్యమం చేసిన సందర్భంలో ప్రభుత్వం మెటీరియల్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సమయం మించిపోయాక ఇచ్చినా ఉపయోగం లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్, గుంటూరు ప్రాంతీయ కేంద్ర బాధ్యులు షేక్ రెహమాన్, బి.నరసింహారావు, శ్రీనివాస్ కార్తీక్, రమేష్, ఎం. నరసింహారావు, రత్నకుమార్ పాల్గొన్నారు. -
సినీసంగీత ఆణిముత్యం మాధవపెద్ది
24న ‘కిన్నెర–బాలు పురస్కారం’ ప్రదానంతెనాలి: మాధవపెద్ది సురేష్... ప్రముఖ సినీ సంగీత దర్శకుడు. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అరవై సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. తన సంగీత మాధుర్యంతో ప్రేక్షకులను ‘బృందావనం’లో విహరింపజేసి, ‘భైరవద్వీపం’లో పరవశుల్ని చేశారు. పదికాలాలు నిలిచే సంగీతం అందించటమే కాదు... వందకు పైగా ప్రైవేటు ఆల్బమ్‌లు విడుదల చేశారు. అన్నమాచార్య కీర్తనలు సరేసరి! దేశవిదేశాల్లో వందలాది సంగీత కచేరీలు చేశారు. ఈ నెల 20వ తేదీన ఒంగోలులో అక్కినేని కళాపరిషత్చే అక్కినేని అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడి రవీంద్రభారతిలో ఈ నెల 24న జరిగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరో వర్ధంతి సభలో ‘కిన్నెర–బాలు పురస్కారం’ స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మాధవపెద్ది సురేష్ సంగీత ప్రస్థానం... తనదైన ముద్ర తెలుగు సినిమారంగంలో మాధవపెద్ది వంశీయులు పలువురు తమదైన ముద్ర వేశారు. నటనలో అభినవ దుర్యోధనుడు మాధవపెద్ది వెంకట్రామయ్య, ‘మాయాబజార్’ సృష్టికర్త గోఖలే, ‘వివాహ భోజనంబు’ రుచి చూపించిన గాయకుడు సత్యం, సౌండ్ ఇంజినీరు/నటుడు శివరామ్, ‘దీక్ష’ హీరో రామ్‌గోపాల్, బాలకృష్ణకు తొలి సినిమా నుంచి ‘దానవీరశూర కర్ణ’ వరకు పాటలు పాడిన రమేష్ మాధవపెద్ది వారేనని తెలిసిందే. ఆ వారసుల్లో ఒకరు సురేష్. పూర్తి పేరు మాధవపెద్ది నాగసాయి సురేష్‌చంద్ర. సొంతూరు పొన్నూరు సమీపంలోని బ్రాహ్మణకోడూరు. 1951 సెప్టెంబరు 8న జన్మించారు. తండ్రి నాగేశ్వరరావు డాల్డా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేశారు. తల్లి వసుంధరాదేవి. కళాదర్శకుడు గోఖలే, గాయకుడు సత్యం ఇద్దరూ నాగేశ్వరరావు సోదరులే. సురేష్ అన్నయ్య గాయకుడు రమేష్. ఆ ఘనత ఆయనదే... తండ్రి ఉద్యోగం కారణంగా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివిన సురేష్‌కు, జంధ్యాల, ఎంవీ రఘు, తోటపల్లి సాయినాథ్, తోటపల్లి మధు, సుత్తి వీరభద్రరావు సహాధ్యాయులు. చదువు పూర్తయ్యాక స్నేహితులంతా సినిమాలు చేస్తున్నారు. అన్నయ్య రమేష్ కచేరీలు చేస్తూ ప్లేబ్యాక్ సింగర్ అయ్యారు. కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో డబుల్ డిప్లొమా చేశారు. ‘తాతమ్మ కల’, ‘వేములవాడ భీమకవి’, ‘రామ్‌రహీం’, ‘దానవీరశూర కర్ణ’ తదితర సినిమాల్లో పాడారు. మహమ్మద్ రఫీతో కలిసి తెలుగులో పాడిన ఏకై క సింగర్ ఘనత కూడా రమేష్‌దే. బీఏ తర్వాత అన్నయ్య సూచనపైనే సురేష్ ఎకార్డియన్ ప్లేయర్‌గా సాధన చేశారు. కొంతకాలం బ్యాంకులో ఉద్యోగం చేశారు. వేసవి సెలవుల్లో కుటుంబమంతా చైన్నెలో నెలరోజులు గడిపేవారు. ఇల్లంతా సినిమా సందడి ఉండేది. సంగీత దర్శకుడు టి.చలపతిరావు రమేష్, సురేష్లిద్దరినీ సినీరంగానికి పరిచయం చేశారు. చంద్రమోహన్, లక్ష్మి జంటగా కె.హేమాంబరధరరావు 1974లో తీసిన ‘పరివర్తన’ సినిమాకు ఎకార్డియన్ ప్లేయర్‌గా చేశారు సురేష్. తర్వాత కీబోర్డు ప్లేయర్‌గా వివిధ భాషల్లో 1,300 సినిమాలకు పనిచేశారు. కాలేజీ మిత్రుడైన జంధ్యాల సినీదర్శకుడయ్యారు. ఆయనే సురేష్‌కు సంగీత దర్శకత్వ అవకాశం కల్పించారు. ‘హై హై నాయకా’ సినిమాకు ‘ఇది సరిగమలెరుగని రాగం’ అనే పాటను 1988 ఆగస్టు 21న ఏవీఎం రికార్డింగ్ థియేటర్లో రికార్డు చేశారు. బుల్లితెరపైనా... చేతిలో ఏడెనిమిది సినిమాలు చేస్తుండగానే 1997లో టీవీ రంగంలోకి ప్రవేశించారు సురేష్. పలు సీరియల్స్‌కు సంగీత సహకారం అందించారు. మరోవైపు స్టేజ్ షోలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ వంశం నుంచి అయిదో తరం సినిమాల్లోకి వచ్చిందని సురేష్ ‘సాక్షి’తో చెప్పారు. సురేష్ కుమార్తె నాగలక్ష్మి కుమారుడు శ్యామ్‌సుందర్ బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు. ‘మార్గళి తింగళ్’ అనే తమిళ సినిమాతో రెండేళ్ల క్రితం సినీరంగానికి పరిచయమయ్యాడు. మరో తెలుగు సినిమా విడుదల కావాల్సి ఉండగా, ఇంకో రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నాడని తెలియజేశారు. అక్కడి నుంచి అవకాశాలు వరుసబెట్టాయి. ‘భృందావనం’, ‘ఆవిడే శ్యామల’, ‘భైరవద్వీపం’, ‘మాతో పెట్టుకోకు’, ‘శ్రీకృష్ణార్జున విజయం’, మల్లెమాల బాలతారలతో తీసిన ‘రామాయణం’, రాజేంద్రప్రసాద్ ‘మేడమ్’, సూపర్‌స్టార్ కృష్ణ ‘పుట్టింటి గౌరవం’ తదితర 60 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. అన్నీ సంగీత దర్శకుడిగా సురేష్‌ను ఒక్కొక్క మెట్టు ఎదిగేలా చేశాయి. ‘భైరవద్వీపం’ సినిమాకు పట్టుబట్టి ‘శ్రీతుంబుర నారద నాదామృతం’ పాటను ప్రత్యేకంగా నెలరోజులపాటు కూర్చుని స్వరపరచారు. ఎస్పీ బాలు అద్భుతంగా పాడారు. ఈ పాటతో అగ్రశ్రేణి సంగీత దర్శకుల జాబితాలో చేరారు. పెండ్యాల, ఇళయరాజా, హిందీ సంగీత దర్శకులు నౌషాద్, లక్ష్మీకాంత్–ప్యారేలాల్ వంటి మూడు తరాల సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. సురేష్ సంగీత దర్శకత్వం వహించిన ‘భార్గవ్’ సినిమాకు ఏఆర్ రెహమాన్ కీబోర్డు ప్లేయర్‌గా చేశారు. -
వైఎస్సార్సీపీ నాయకురాలి అరెస్టుకు విఫలయత్నం
తెనాలి: మెగా డీఎస్సీలో అక్రమాలపై విజయవాడలోని ‘శాప్’ కార్యాలయం ఎదుట భారీ ధర్నాతో శాంతియుతంగా నిరసన తెలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. అరెస్టులు చేస్తున్నారు. ఆ ధర్నాలో పాల్గొన్న తెనాలి నాయకులపైనా కేసులు నమోదు చేశారు. పార్టీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కొంగర రాగమంజరిని అరెస్టు చేసేందుకు మాచవరం పోలీసులు తెనాలిలో సోమవారం అర్ధరాత్రి తర్వాత హడావుడి చేశారు. మాచవరం పోలీసులు, తెనాలి వన్‌టౌన్ పోలీసులు కలిసి అరెస్టు చేసేందుకు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో రాగమంజరి నివాసానికి వెళ్లారు. విషయం తెలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మైలా విజయ్‌నాయుడు, మరో న్యాయవాది చింకా సురేష్ చంద్రయాదవ్‌లు అక్కడకు చేరుకున్నారు. ముందస్తుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అరెస్టుకు సంబంధించిన కేసు వివరాలు, నోటీసు తదితర అంశాలపై నిలదీశారు. కొంతసేపు తర్జనభర్జన అనంతరం పోలీసులు తిరిగివె వెళ్లిపోయారు. రాగమంజరి చౌదరి అరెస్టు యత్నం వ్యవహారంపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు కేసులు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్టులకు ప్రయత్నించడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే కక్షకట్టి అక్రమంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని రాగమంజరి ఆరోపించారు. -
సభాసుపాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్‌గా పాల్గొనే ముఖ్యమైన కార్యక్రమం.. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అంతా హాజరైన వేళ.. అయితే సభలో జనం అంతంతమాత్రమే.. సుదీర్ఘ ప్రసంగాలు వినే ఓపిక లేక వారు సైతం వెళ్లిపోతున్న పరిస్థితి. వీటన్నింటిని గమనించిన అధికారులు పరువు కాపాడుకునేందుకు నిర్బంధమే ఆయుధంగా ఎంచుకున్నారు. ఇంకేం సభ జరుగుతున్న వేదిక ముఖ ద్వారానికి తలుపులు బిగించి, తాళాలు వేశారు. దీంతో గంటలు గంటలు లోపల కూర్చోలేక.. బయటకు రాలేక డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చిన్న పిల్లలతో సహా వచ్చిన మహిళలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం వర్చువల్‌గా పాల్గొన్న సభ ఏర్పాట్లను సైతం సరిగా నిర్వహించలేని అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెహ్రూనగర్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ కార్యక్రమానికి జనం కరువవడంతో అధికారులు అడ్డదారులు తొక్కారు. వచ్చిన కొద్దిపాటి డ్వాక్రా మహిళలు, ఆర్పీలు సైతం బయటకు వెళ్లిపోకుండా ఏకంగా ప్రాంగణం గేట్లు మూసివేసి నిర్బంధించిన అమానవీయ ఘటన మంగళవారం గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రూ.527 కోట్లతో చేపట్టనున్న పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ముఖ్యమంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఈ సభకు భారీగా జనాన్ని తరలించాలని మెప్మా సీఓలు, సీఎంఎంలు, ఉపా సెల్ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. పరువు కాపాడుకునేందుకు జీఎంసీ, సచివాలయ ఉద్యోగులను హడావుడిగా రప్పించి కూర్చోబెట్టారు. పిల్లలతో వెళ్లి బతిమాలినా కనికరించని వైనం మరోవైపు సభకు అరకొరగా వచ్చిన డ్వాక్రా మహిళలు, ఆర్పీలు బయటకు వెళ్లిపోతుండటంతో అధికారులకు చెమటలు పట్టాయి. దీంతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి విజ్ఞాన మందిరం ప్రధాన ద్వారాలు, చుట్టూ ఉన్న గేట్లను దగ్గరుండి మూయించేశారు. ‘చంటిపిల్లలతో వచ్చాం.. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు.. ఇబ్బందిగా ఉంది.. దయచేసి బయటకు పంపండి‘ అని మహిళలు వేడుకున్నా అధికారులు కనికరించలేదు. సీఎం కార్యక్రమం పూర్తయ్యే వరకు ఒక్కరినీ బయటకు పోనిచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో సిబ్బంది, అధికారుల తీరుపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలను తమపై రుద్ది, ఇలా గదుల్లో బంధించి వేధిస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు సిబ్బందికి, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. సీఎం కార్యక్రమానికి జనం రాకపోవడంతో అధికారుల దౌర్జన్యం నెహ్రూనగర్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగంగా గుంటూరు జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రూ.527 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సభలో కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మహమ్మద్ నజీర్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) ద్వారా జిల్లాలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌కు రూ.250 కోట్లు, గుంటూరు నగరపాలక సంస్థకు రూ.205 కోట్లు, తెనాలి మున్సిపాలిటీకి రూ.44 కోట్లు, పొన్నూరు మున్సిపాలిటీకి రూ.28 కోట్లు కేటాయించారు. నగరంలో రోడ్లపై వేలాడుతున్న కేబుళ్ల సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మోడల్ రోడ్డును ఎంపిక చేసి ‘అండర్ గ్రౌండ్ డక్ట్స్’ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
పాటలు పాడి వైద్య సిబ్బంది వినూత్న నిరసన
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రభుత్వం తమ న్యామమైన డిమాండ్లు పరిశీలించాలని కోరుతూ జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిలబడి పాటలు పాడి మంగళవారం వినూత్న తరహాలో నిరసన గళం వినిపించారు. చుక్కల్లోకి ఎక్కినాయి రెగ్యులర్ పోస్టులు... ఎప్పటికీ కాంట్రాక్ట్ వారికి అందనంతగా.... నిన్ను గెలిపించింది మా ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తావని , కాపాడు చంద్రన్న, కాపాడు పవనన్న, కాటికి పోయే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగాలేనా.... కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలంటూ పేరడీ సాంగ్‌ను ఆలపించారు. వినూత్న నిరసనలో కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సులు రమాదేవి, రేణుక, నూరి, పద్మావతి, లక్ష్మీ కుమారి, వాసు, ఫార్మాశిస్టులు నాగుల మీర, శ్రావణి, పావని, చంద్రకళ, ల్యాబ్ టెక్నీషియన్లు చారి, ఖాసిం, శైలజ, మోహన్, సుధశ్రీ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆగమ, వైదిక సంప్రదాయాలను అనుసరించి ఆలయ అర్చకులు, వేద పండితులు మంగళవారం పలు విశేష క్రతువులను నిర్వహించారు. ఉదయం అగ్నిమధనం, పంచగవ్యారాధన, పంచగవ్యప్రాశన, పంచాగ్ని ప్రణయనం, ఉక్తహోమాలు నిర్వహించారు. అనంతరం పవిత్రములతో స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించి మంగళహారతి సమర్పించారు. సాయంత్రం నిత్యహోమం, దిక్సూక్త హోమం, నవగ్రహ హోమం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రసాద గోష్ఠి, న్యాసం కార్యక్రమాలు జరిగాయి. రాత్రి పవిత్రముల శయనాధివాసం నిర్వహించడంతో మంగళవారం నాటి పవిత్రోత్సవ కార్యక్రమాలు ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్రోత్సవ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రానున్న దసరా, దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. -
లలిత హాస్పిటల్‌కు రెండు పురస్కారాలు
గుంటూరు మెడికల్: గుంటూరు లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ – ఆంధ్రప్రదేశ్ 2026లో రెండు పురస్కారాలు లభించాయి. విజయవాడలో నిర్వహించిన 8వ ఎడిషన్ టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో లలిత ఆసుపత్రి వైద్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందజేశారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, వందకుపైగా డాక్టర్లతో, 40 క్లినికల్ స్పెషాలిటీస్, పూర్తి డయాగ్నోస్టిక్స్‌తో ప్రైమరీ నుంచి అడ్వాన్స్డ్ కేర్ వరకు రోగులకు లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ చికిత్స అందిస్తోంది. ట్రీట్మెంట్తోపాటుగా అకడమిక్ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ కార్యక్రమాలతో లీడింగ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని ప్రముఖ నటుడు సోనూసూద్ చేతుల మీదుగా ఆసుపత్రి సీఈఓ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనురాగ్ పోలవరపు స్వీకరించారు. అత్యవసర వైద్య సేవల్లో అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ‘ఎక్సలెన్స్ ఇన్ ఎమర్జెన్సీ కేర్’ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఎమర్జెన్సీ మెడికల్ స్పెషలిస్ట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ షుకూర్ అందుకున్నారు. ఈ సందర్భంగా లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.వి. రాఘవ శర్మ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమష్టి కృషికి లభించిన గుర్తింపు ఇదన్నారు. వారిని అభినందించారు. -
ఉమ్మడి జెడ్పీ పాలన సమాప్తం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గ పదవీ కాలం ఈనెల 24న ముగియనుంది. ఇందుకు ఒక్కరోజు ముందుగా మండల పరిషత్ చైర్మన్లు, సభ్యుల పదవీ కాలం బుధవారం ముగుస్తోంది. దాదాపు 62 ఏళ్లుగా ఉమ్మడిగా కొనసాగిన గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ నూతన జిల్లాల ఆవిర్భావంతో మూడుగా విడిపోయింది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం ముగిసిన మరుసటి రోజు నుంచే పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 2021లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో వైఎస్సార్ సీపీ అత్యధిక మెజార్టీతో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌ను కై వసం చేసుకుంది. ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కానుండటంతో గుంటూరు నుంచి విడిపోయిన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా జెడ్పీలను ఏర్పాటు చేస్తూ ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా ప్రజా పరిషత్ ఉత్తర్వులు విడుదల చేసింది. ఉద్యోగుల విభజనపై కసరత్తు పల్నాడు, బాపట్ల జిల్లాలు విడిపోగా మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం ఈనెల 24న ముగియనుండగా, మరుసటి రోజు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్‌ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని జెడ్పీలకు అవసరమైన ఉద్యోగుల విభజనపైనా కసరత్తు జరుగుతోంది. కాగా కొత్త జిల్లాల జెడ్పీలకు సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తాత్కాలికంగా జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆయా జిల్లా కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తరువాత గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. -
బార్లో మహిళా వెయిటర్‌తో వాగ్వాదం
తాడేపల్లి రూరల్: ఉండవల్లి సెంటర్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణ తీవ్ర చర్చకు దారితీసింది. మద్యం సరఫరాలో జాప్యంపై మహిళా వెయిటర్, మద్యం సేవిస్తున్న యువకుల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు దాడికి దారితీసినట్లు సమాచారం. బార్ నిర్వాహకులు పోలీసులకు చెందిన ఫైబర్ లాఠీలతో యువకులపై దాడి చేశారు. ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అర్ధరాత్రి సమయంలో ఉండవల్లి సెంటర్లోని శ్రీనివాస బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. మద్యం సేవించిన అనంతరం బిల్లు చెల్లించి బయటకు వెళ్లే సమయంలో మరో స్నేహితుడు వస్తున్నట్లు సమాచారం అందడంతో తిరిగి మద్యం ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. మద్యం తీసుకురావడంలో జాప్యం జరగడంతో యువకులు మహిళా వెయిటర్‌ను ప్రశ్నించడంతోపాటు ఆమైపెకి చెప్పు తీసినట్లు తెలిసింది. దూషణలు.. ఘర్షణ... మద్యం సరఫరాలో ఆలస్యంపై మొదలైన మాటామాటా క్రమంగా తీవ్ర వాగ్వాదానికి దారితీసిందని చెబుతున్నారు. ఇరువర్గాల మధ్య పరస్పరం దూషణలు జరిగాయని సమాచారం. దీంతో మహిళా వెయిటర్ జరిగిన విషయాన్ని బార్ నిర్వాహకులకు చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. అనంతరం బార్ నిర్వాహకులు గేట్లు మూసివేసి యువకులతో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళా వెయిటర్ కూడా యువకులపై దాడికి పాల్పడినట్లు వారు ఆరోపిస్తున్నారు. పోలీసు లాఠీలతోనే దాడి?... ఇక్కడే అసలు వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. బార్ యజమాని అక్కడ ఉన్న పోలీసులకు చెందిన ఫైబర్ లాఠీని తీసుకుని యువకులపై దాడి చేసినట్లు బాధితుల తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఆ లాఠీ విరిగిపోయిన అనంతరం అక్కడ విధుల్లో ఉన్న పోలీసు వద్ద నుంచి మరో లాఠీ తీసుకుని దాడి కొనసాగించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై యువకుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బార్లో గొడవ జరిగితే నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి పోలీసుల లాఠీలతోనే యువకులను కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్టేషన్లోనూ వేడెక్కిన వాతావరణం... ఘటనపై ఇరు వర్గాలు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. అక్కడకు వచ్చిన యువకుల బంధువులు బార్ నిర్వాహకుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. బార్లో గొడవలు జరగడం కొత్తేమీ కాదని, అందుకు మద్యం సేవించిన వారిని విచక్షణారహితంగా కొట్టడం ఏమిటని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. గొడవను అదుపు చేయాల్సిన పోలీసులు లాఠీని బార్ నిర్వాహకులకు ఎలా అందించారంటూ వారు నిలదీసినట్లు సమాచారం. తాడేపల్లి పోలీసులు తమ పోలీస్‌స్టేషన్‌లో లాఠీలు లేవని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై స్పష్టత రావాల్సి ఉంది. -
పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన
గుంటూరు మెడికల్: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి, గుంటూరు ప్రాంతీయ కార్యాలయం పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎస్‌కేబీఎం మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల సక్రమ నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, తడి–పొడి వ్యర్థాలను వేరు చేయడం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించారు. జిల్లా పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ద్వారా పరిశుభ్రతను ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక బాధ్యతగా, అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌కేబీఎం మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఖాజావలి, ఐటీసీ ఎంఎస్కే ఫినిష్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ కె.నారాయణ, పర్యావరణ విద్యా కోఆర్డినేటర్ బి.తిరుపతిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏఎన్‌యూ (పెదకాకాని): ఏఎన్‌యూలో సాంసంగ్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో డేటా ప్రో కంప్యూటర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ తౌసిఫ్ అహ్మద్ తెలిపారు. ఏఎన్‌యూలో 70 రోజులు పాటు నిర్వహించే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం మాట్లాడుతూ విద్యార్థులు ఇందులో నైపుణ్యాలను మెరుగుపరచుకొని భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలను అందుపుచ్చుకోవాలన్నారు. డేటా ప్రో డీజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సాంసంగ్ నుంచి రూ.లక్ష నగదు బహుమతి అందిస్తారని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ లింగరాజు, అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.గోపీకృష్ణ, డాక్టర్ డి.చంద్రమౌళి, సీఎస్సీ కో ఆర్డినేటర్లు డాక్టర్ కె చైతన్య, యు.సతీష్ కుమార్, డేటా ప్రో ప్రోగ్రాం మేనేజర్ ఉమామహేశ్వరరావు, ట్రైనర్ బి. నిస్సి పాల్గొన్నారు. -
ఖాకీల గూండాగిరి
మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026శాంతి ర్యాలీపైగొప్ప సంఘసంస్కర్త గురజాడ గుంటూరు ఎడ్యుకేషన్: దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గురజాడ అప్పారావు సమాజంలో మార్పులు తెచ్చి గొప్ప సంస్కర్తగా నిలిచారని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో ప్రముఖ కవి, రచయిత, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించిన హెనీ క్రిస్టినా మాట్లాడుతూ.. గురజాడ తెలుగు సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలు, సమాజ సంస్కరణకు ఆయన చేసిన కృషి మరువలేనివన్నారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే మహోన్నత సందేశం ద్వారా సమాజంలో మానవతా విలువలు, సామాజిక బాధ్యతలపై స్పృహ కల్పించారన్నారు. ఏఓ శామ్యూల్ పాల్, ఉద్యోగులు రత్నబాబు, మల్లేశ్వరరావు, శ్రీనివాస్, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాకుమాను బజార్లో ఏర్పాటు చేసిన పందిరిలోని గణనాథుడి 51 కిలోల లడ్డూ వేలం ఆదివారం రాత్రి నిర్వహించారు. వేలంపాటలో గుర్రపుసాల సిద్ధార్థ్ రూ.9,30,116లకు లడ్డూను దక్కించుకున్నాడు. కాకుమాను బజార్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన పందిరిలోని లడ్డూను వేలంలో దక్కించుకున్న సిద్ధార్థ్ గృహానికి మేళతాళాలలో తీసుకవెళ్లారు. కాగా, పందిరిలో పూజలందుకున్న భారీ గణనాఽథుడిని సోమవారం రాత్రి నిమజ్జనానికి తరలిస్తున్నారు. పెదకాకాని: పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం భక్తులచే విశేషమైన సహస్ర మోదక గణపతి హోమం నిర్వహించనున్నట్లు ఆలయ డీసీ గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 23వ తేదీన వినాయక స్వామివారి నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం జరిగే సహస్ర మోదక గణపతి హోమంలో భక్తులు రూ.2,500 చెల్లించి పూజా కార్యక్రమంలో నేరుగా పాల్గొనవచ్చన్నారు. మద్యం షాపుల రెన్యువల్ గడువు పెంపు నరసరావుపేట టౌన్: మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తుకు మరో రెండు రోజులు సమయం పొడిగించినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మణికంఠ తెలిపారు. సోమవారం నరసరావుపేటలోని ఎకై ్సజ్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలో 142 మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్‌కు నోటిఫికేషన్ ఇవ్వగా సోమవారం చివరి రోజు 112 దుకాణాలకు నిర్వాహకులు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇక 23 మద్యం దుకాణాలకు రెన్యువల్ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మరో రెండు రోజులు గడువు పెంచిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బాలుడిపై అఘాయిత్యం సాక్షిటాస్క్‌ఫోర్స్: మండల కేంద్రానికి సమీప గ్రామంలో ఆరేళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆరేళ్ల బాలుడు ఇంట్లో ఆడుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంట్లో బాలుడు ఏడుస్తుండగా తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన విషయాన్ని బాలుడు చెప్పాడు. ఘటనపై బాలుడి తల్లిదండ్రులు ముప్పాళ్ళ పోలీసులను ఆశ్రయించారు. పెదకాకాని/మంగళగిరి రూరల్: డీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు విజయవాడ శాప్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు సోమవారం గుంటూరు జిల్లా నుంచి పలువురు నాయకులు బయలుదేరారు. ఈక్రమంలో ఒక పథకం ప్రకారం ముందుగానే కాజ టోల్గేట్ వద్దకు పోలీసులు పెద్దఎత్తున చేరుకున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో శాప్ కార్యాలయానికి వెళుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబులతో పాటు 27 మందిని అదుపులోకి తీసుకుని పెదకాకాని పోలీసుస్టేషన్లో నిర్బంధించారు. నేతల ప్రయాణిస్తున్న కార్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం శాప్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం ముగిసినట్లు సమాచారం రావడంతో 31 మందికి 41 నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. పోలీసుల లాఠీలు టీడీపీ గూండాల చేతిలోనా? డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విజయవాడ శాప్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమానికి బయలు దేరి వెళుతుంటే అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి నిర్భందించడం కూటమి బరితెగింపునకు నిదర్శమన్నారు. పోలీసు వ్యవస్థను నారా లోకేష్ దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై అప్పటికే శాప్ కార్యాలయానికి చేరుకున్న కూటమి నాయకులు, కార్యకర్తలు పోలీసుల వద్ద నుంచి లాఠీలు లాక్కొని దాడులు చేస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖామంత్రి రాజీనామా చేస్తే కనీస రాజకీయ పరిజ్ఞానం లేని నారా లోకేష్ టీడీపీ గూండాలచే దాడులు చేయిస్తూ దుష్ట సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో దొడ్డి దారిన ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా టీడీపీ గూండాలతో దాడులు చేయిస్తున్న లోకేష్ అక్రమాలు, దాడులపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డీఎస్సీలో అక్రమాలు చేసేందుకే కొత్త జీఓలు తీసుకువచ్చారన్నారు. నియామకాలు పూర్తి కాగానే ఆ జోవోను రద్దు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు, గుంటూరు, తాడికొండ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ నాయకులు, అనుబంధ విభాగాలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే కోడిగుడ్లతో, కర్రలతో దాడులు, అడ్డగింతలు, అరెస్టులు చేస్తారా అని వైఎస్సార్ సీపీ తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్‌బాబు) ధ్వజమెత్తారు. 3 లక్షల మందికి పైగా నిరుద్యోగులు డీఎస్సీ పరీక్ష రాస్తే విద్యాశాఖామంత్రి నారా లోకేష్ స్పోర్ట్స్ కోటా సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతుంటే కాజా టోల్గేట్ వద్ద వాహనాలను అడ్డుకుని భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. పోలీసుస్టేషన్‌కు తరలించి నిర్బంధించడం దారుణం. ప్రజా ప్రతినిధులు అనే గౌరవం కూడా లేకుండా ఈడ్చిపారేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కుప్పకూలే వరకూ అన్యాయాలు, అక్రమాలపై వైఎస్సార్ సీపీ పోరాడుతూనే ఉంటుందని బాలవజ్రబాబు స్పష్టం చేశారు. కొల్లూరు: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలకు దిగింది. పోలీసులను ఎక్కడికక్కడ కాపాలాగా పెట్టి విజయవాడ వెళుతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను అడ్డగించి నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులతో అడ్డగింపజేశారు. సోమవారం కొల్లూరు కరకట్టపై ఎస్ఐ కిశోర్‌బాబు నేతృత్వంలో పోలీసులు తెల్లవారుజాము నుంచి మొహరించారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల నుంచి విజయవాడ శాప్ కార్యాలయం వద్దకు తరలివెళ్లే వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అడ్డగించేందుకు పికెటింగ్ నిర్వహించారు. కొల్లూరు నుంచి చిలుమూరు వరకు కరకట్ట మార్గాన్ని డేగ కళ్లతో పర్యవేక్షించిన పోలీసులు రేపల్లె నియోజకవర్గం నగరం ప్రాంతం నుంచి నిరసన కార్యక్రమానికి తరలివెళుతున్న సుమారు 20 మందికి పైగా వైఎస్సార్ సీపీ శ్రేణులను ఈపూరు వద్ద అడ్డగించారు. విజయవాడ తరలివెళ్లకుండా వైఎస్సార్ సీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని వేమూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. రెన్యువల్‌కు ‘సిండికేట్’ ససేమిరా! నెహ్రూనగర్: రాష్ట్రంలో మద్యం దుకాణాలను సిండికేట్లు అయిన పాత వారికే కట్టబెట్టేలా ప్రభుత్వం పన్నిన వ్యూహం క్షేత్రస్థాయిలో తీవ్ర ఎదురుదెబ్బ తింటోంది. నూతన ఎకై ్సజ్ పాలసీ కింద ప్రస్తుత లైసెన్సీలకే షాపులను పునరుద్ధరించుకునే అవకాశం కల్పించినప్పటికీ, సిండికేట్ వ్యాపారుల నుంచి తీవ్ర నిరాసక్తత వ్యక్తమవుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సిండికేట్‌గా ఏర్పడి అధికశాతం మద్యం దుకాణాలను చేజిక్కించుకున్న వ్యాపారులు, కూటమి నేతలు ఇప్పుడు రెన్యువల్స్ కోసం వెనకడుగు వేస్తుండటంతో అధికార యంత్రాంగం తీవ్ర ఇరకాటంలో పడింది. సగానికి పైగా షాపులకే పరిమితం! ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా మొత్తం 402 మద్యం షాపులు ఉండగా, ఈ నెల 21వ తేదీ నాటికి కేవలం 254 దుకాణాలు మాత్రమే రెన్యువల్ అయ్యాయి. రూ.కోట్లకు చేరిన ఫీజుల భారం రెన్యువల్ ప్రక్రియకు వ్యాపారులు దూరంగా ఉండటానికి ప్రభుత్వం పెంచిన అదనపు ఫీజుల మోతే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో ఉన్న లైసెన్స్ రుసుములతో పోలిస్తే ప్రస్తుత భారం తడిసిమోపెడవుతోంది స్పందన లేక గడువు పొడిగింపు.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న మద్యం దుకాణాల రెన్యువల్ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం తొలుత 21వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే గడువు ఇచ్చింది. అయితే, ఉమ్మడి జిల్లాలోని అన్ని దుకాణాలు రెన్యువల్ అవుతాయని ఆశించిన ప్రభుత్వానికి క్షేత్రస్థాయి ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఆశించిన స్థాయిలో రెన్యువల్స్ కాకపోవడంతో చేసేదేమీ లేక గడువును ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన షాపులను కూడా ఎలాగైనా రెన్యువల్ చేయించాలంటూ ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తుంది. దీంతో పాత లైసెన్సీలను బెదిరించో లేదా బుజ్జగించో ఒప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డీఎస్సీ– 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరితే కూటమి ప్రభుత్వానికి భయమెందుకో అర్ధం కావడం లేదని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరుబాటను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆంక్షలను ప్రయోగించిందన్నారు. మరోవైపు శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ చేపట్టే వరకూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. డీఎస్సీ స్కామ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలు ప్రతిరోజు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తప్పులను, అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే ఎదురు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. శాప్ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారన్నారు. శాప్ కార్యాలయంలోకి కూటమి గూండాలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ రెడ్‌బుక్ రాజ్యాంగం పరిధిలో పనిచేస్తుందన్నారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని నూరిఫాతిమా డిమాండ్ చేశారు. బాపట్ల: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలంటూ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద సోమ వారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని పోలీసులు బాప ట్ల మండలం చుండూరుపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు బయలుదేరిన కోన రఘుపతిని పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కోన రఘుపతి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తినందుకే తమను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యవిరుద్ధమన్నారు. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీ ఆధారాలతో చూపుతున్న వాటికి బదులు చెప్పలేక నిరసనలను అడ్డుకోవటమే ప్రధాన అజెండాగా సర్కారు ముందుకుపోతోందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా విజయవాడ వెళ్లకుండా అడ్డుకోవటంతో బాపట్ల–గుంటూరు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసు వాహనంలో ఆయనను బాపట్ల తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు. తాడేపల్లి రూరల్: డీఎస్సీ కుంభకోణంపై విజయవాడలోని శాప్ కార్యాలయం వద్దకు నిరసనకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ తాడేపల్లి, మంగళగిరి నేతలను పోలీసులు సోమవారం ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుకున్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై నిరసన తెలిపేందుకు పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తన కార్యకర్తలతో కలిసి విజయవాడ శాప్ కార్యాలయానికి బయలుదేరారు. దీంతో పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద వారిని అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ధర్నాను అడ్డుకోవడం సరికాదని వేమారెడ్డి పోలీసులతో అన్నారు. కొద్దిసేపు పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
ఉద్యోగాల పేర్లతో మోసగించారని ఫిర్యాదులు
● పీజీఆర్ఎస్కు అర్జీల వెల్లువ ● ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో లక్షలు కాజేశారని బాధితులు వాపోయారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును జిల్లా ఎస్పీ పరిశీలించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు సీతారాం, బెల్లం శ్రీనివాసరావు ఫిర్యాదులు స్వీకరించగా, 215 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఫిర్యాదిదారులకు అన్నదానం చేశారు. సమస్య అలకిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్ విశదలలో నాలుగు ఎకరాల పొలం ఉంది. అయితే పొలం విషయంలో ఓ వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు వ్యక్తి కొంత మందిని ఇంటి వద్దకు తీసుకువచ్చి గలాటా స్పష్టించాడు. అంతేగాక ఇష్టానుసారంగా బూతులతో ధూషించారు. పొలంలో వేప, ఇతరత్రా చెట్లు నాటేందుకు వెళ్తే అక్కడ అడ్డుపడి నానాయాగీ చేశారు. దీనిపై గతంలో రెండుసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదు. వృద్ధాప్యంలో ఇబ్బందులకు గురవుతున్నా. న్యాయం చేయగలరు. – కళ్ళం శేషమ్మ, శ్యామలానగర్ ఒకటో వీధి తెలిసిన వ్యక్తులు జిల్లా కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు. దీంతో గతేడాది జూన్‌లో వారికి లక్షన్నర చెల్లించా. అయితే ఉద్యోగ విషయామై అడిగితే కాలయాపన చేస్తున్నారు. కనీసం చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలలుగా మొబైల్ నంబర్ బ్లాక్ చేశారు. న్యాయం చేయగలరు. – షేక్.షఫీ, మంగళదాస్‌నగర్. గతనెల్లో నా భర్త వెంకన్నను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలో కీలకంగా వ్యవహరించిన మహిళ పేరుని కేసులో నమోదు చేయలేదు. సదరు మహిళ ఆ రోజు రాత్రి, ఉదయం రెక్కీ నిర్వహించింది. నా భర్త కళ్లల్లో కారం చల్లి, మెడపై కత్తితో దాడికి పాల్పడింది. అయితే ఇప్పటి వరకు ఆమె పేరుని కేసులో చేర్చలేదు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి ఆమె పేరుని ఎఫ్ఐఆర్లో నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. – పి.వెంకటమ్మ, కేవీపీకాలనీ గతేడాది వికాస్‌నగర్‌లో ఉంటున్న తెలిసిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం. నా భార్యను నల్సార్ లా కళాశాలలో క్లర్క్‌గా చేర్పిస్తానని నమ్మించాడు. రూ.20 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అతడికి రెండుసార్లుగా రూ.10 లక్షలు అడ్వాన్స్ చెల్లించా. దీంతో ఆఫర్ లెటర్ ఇచ్చి ఓ ప్రైవేటు కంపెనీలో అడ్మిన్‌గా గుర్తింపుకార్డు జారీ చేశాడు. మంగళగిరిలో కంపెనీ కార్యాలయం చూయించి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, సదరు కంపెనీ ప్రతినిధులతో దిగిన ఫొటోలను చూయించి నమ్మించాడు. ఉద్యోగంలో ఎప్పుడు చేరాలనేది దాటవేశాడు. దీంతో అనుమానం వచ్చి డబ్బులు అడగా, రూ.6 లక్షలు చెల్లించి మిగతా రూ.4 లక్షలు చెల్లించలేదు. డబ్బులు అడిగితే నాపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నాడు. ఆ కేసులు తొలగించేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. – భానుకుమార్, బాలాజీనగర్ -
కారకులైన పోలీసులపై చర్యలేవీ!
దళిత యువకుడి మృతికి నగరంపాలెం: దళిత యువకుడు చీకటి గోపి మృతికి పోలీసులే కారణమని మొదట్నుంచి చెబుతున్నామని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన దళిత యువకుడు చీకటి గోపి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ గోపి భార్య, కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు, రెండు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గోపి మృతిపై జిల్లా ఎస్పీతో చర్చించారు. గోపి మృతిపై కుటుంబ సభ్యుల ఆవేదన, ఘటనా స్థలంలో గోపితోపాటు ఉన్న గోపికృష్ణ వాంగ్మూలం, రెండు రాష్ట్రాల మాల, మాదిగ వర్గాల న్యాయవాదుల నిజనిర్ధారణతో కూడిన నివేదికను జిల్లా ఎస్పీకి సమర్పించారు. గోపి మృతిపై సిట్ ఏర్పాటుకు అంగీకారం.. అనంతరం ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మీడియాతో మాట్లాడుతూ చీకటి గోపి మృతిపై సిట్ ఏర్పాటుకు అంగీకరించినట్లు చెప్పారు. దీనికి జిల్లా ఏఎస్పీ(ఎల్/ఓ) రవికుమార్ నేతృత్వం వహించనున్నారని పేర్కొన్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టపరంగా, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోపీ చనిపోయిన దగ్గర్నుంచి దళిత, బహుజన ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు అనేక పోరాటాలు చేశాయని గుర్తు చేశారు. చీకటి గోపి మృతిపై ఆధారాలు సమీకరించుకుంటూ ముందుకెళ్తుంటే, మరోవైపు పోలీసులు ఆధారాలను కనుమరుగు చేసే ప్రయత్నాలు పోలీసులు చేసిన ముందుకెళ్లామని చెప్పారు. తాడికొండ పీఎస్ సీఐపై వచ్చిన ఆరోపణలపై ఆ స్థాయి పోలీస్ అధికారి అయిన మేడికొండూరు పీఎస్ సీఐ మధుసూదనరావుతో విచారణ చేయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఐ మధుసూదనరావు విచారణలో కొన్ని తప్పులు బయటపడ్డాయని చెప్పారు. ఆ తప్పులను ఆధారంగా చేసుకుని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ ప్రకటన ఎందుకు చేశారని మండిపడ్డారు. గోపి మృతిపై నెలకొన్న అనుమానాలపై త్వరలో ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని మందకృష్ణ చెప్పారు. ఇప్పటి వరకు తాడికొండ పీఎస్ సీఐ ఉమేష్‌ను వీఆర్‌కు లేదా సస్పెండ్ చేయలేదని మండిపడ్డారు. సాయికృష్ణ మృతి చెందిన పోలీసులను జైళ్లల్లో పెట్టారని, ఒక దళిత యువకుడు లాకప్‌డెత్ అయితే కనీసం సీఐను వీఆర్‌కు లేదా సస్పెండ్ చేయకపోవడం ఏంటని అన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి 30 మంది న్యాయవాదులు చీకటి గోపి మృతిపై లాకప్‌డెత్, సహజ మరణామా అనేది పర్యటించి వివరాలు సేకరించామని మాదిగ లాయర్ల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు వీరదాసు వెంకటరత్నం అన్నారు. పొన్నెకల్లులోని గోపి కుటుంబం, మాల/మాదిగ పల్లెల్లో వివరాలు, స్థానిక ప్రాథమిక హెల్త్ కేంద్రం అధికార సిబ్బందితో ఫోన్లో సంప్రదించామని అన్నారు. గోపి లాకప్‌డెత్‌కు కారణమైన సీఐ ఉమేష్ వద్ద వివరాలు తీసుకున్నామని చెప్పారు. గతనెల 25 ఉదయం నుంచి 27వ తేదీ మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించారని పేర్కొన్నారు. నెల్లూరు రాజా వచ్చి పోలీసులను కలిసిన తర్వాత విచక్షణారహితంగా చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయకుమార్, ఎంజే విద్యాసాగర్, బత్తుల వీరాస్వామి పాల్గొన్నారు. సిట్ ఏర్పాటుకు అంగీకరించిన పోలీసులు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎస్పీకి వినతిపత్రం అందించిన దళిత ప్రజా బహుజన సంఘాల నాయకులు -
నకిలీ సేవా టికెట్ కేసులో నిందితుడి అరెస్ట్
● గుంటూరుకు చెందిన రాజేష్ అరెస్టు ● రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని గతంలోనే చీటింగ్ కేసు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ప్రత్యేక సేవా టికెట్ల పేరిట నకిలీ టికెట్‌ను రూపొందించి విక్రయించిన సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ కృష్ణప్రసన్న తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. గుంటూరుకు చెందిన వంగల రాజేష్, నకిలీ పత్రాలు తయారు చేసి విక్రయిస్తుంటాడు. హైదరాబాద్‌లో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిసిన వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో నిందితుడు. గతంలో హైదరాబాద్‌లో కేసు నమోదయింది. దసరా ఉత్సవాల ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్ కావాలని కావలికి చెందిన భక్తురాలు, రాజేష్‌తో రూ.3,500కు ఒప్పందం కుదుర్చుకుంది. నిందితుడు ఆన్లైన్లో నమూనా టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని, మొబైల్ ఎడిటింగ్ యాప్‌ను ఉపయోగించి భక్తురాలి పేరు, తేదీలతో నకిలీ టికెట్ తయారు చేసి ఆమెకు పంపాడు. అయితే టికెట్‌పై దేవస్థాన ధ్రువీకరణ క్యూఆర్ కోడ్, అధికారి సంతకం లేకపోవడాన్ని గుర్తించి వెంటనే దేవస్థానం అధికారులకు టికెట్‌ను పంపారు. ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై సీపీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడి జాడను టెక్నికల్ ఎనాలసిస్ ద్వారా తెలుసుకుని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భక్తులు దసరా ఉత్సవాల సేవా, దర్శన టికెట్లను దేవస్థాన అధికారిక కౌంటర్లు, వెబ్సైట్ ద్వారానే కొనుగోలు చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయిన టికెట్లు, అనధికార వ్యక్తుల నుంచి టికెట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. అనుమానాస్పద టికెట్లు, ఆఫర్లు కనిపిస్తే వెంటనే దేవస్థాన అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమావేశంలో ఏసీపీ భానుప్రకాష్‌రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. మంగళగిరి రూరల్: డబ్ల్యూఏపీఎల్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. అమరావతి ఈ చాంపియన్న్స్తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసింది. పుష్పిత 54, కెప్టెన్ హేన్రిట్టా పెరీరా 37 పరుగులతో రాణించారు. లక్ష్య ఛేదనలో అమరావతి 143 పరుగులకు ఆలౌటైంది. కాండ్రేగుల దేవిక 63 పరుగులతో పోరాడినా ఫలితం దక్కలేదు. గోదావరి బౌలర్లలో హారిక 3, శ్రీష్టి శేఖర్ నాలుగు ఓవర్లు 2 వికెట్లు తీసి 12 పరుగులు ఇచ్చి కట్టుదిట్టమైన బౌలింగ్ తో గోదావరి గోల్డెన్ ఈగల్స్ విజయం లో కీలక పాత్ర పోషించటంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం నాణ్యతతో కూడినదై ఉండాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ ఎంతోదూరం నుంచి వ్యయప్రయాసలకు ఓర్చి ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో అర్జీలను అందజేస్తుంటారని, వారి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్నారు. అధికారులు అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనంతరం వచ్చిన 410 అర్జీలను డీఆర్వో షేక్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ డేవిడ్, డ్వామా పీడీ శంకర్, డీఈఓ సలీం బాషా, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, అధికారులు పరిశీలించారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నా కుమార్తె నూర్ బాషా రంజాన్‌బీ ప్రాణాలు కోల్పోయింది. వైద్యులిద్దరూ సెల్‌ఫోన్ చూసుకుంటూ ఇష్టానుసారంగా సర్జరీ చేశారు. ప్రజల ప్రాణాలంటేవారికి లెక్కలేదు. వైద్యులకు సరైన శిక్ష విధించడంతోపాటు మా కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మనవి... – మృతురాలి తల్లి అల్లాబీ, సిరిపురం పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి పారిశ్రామికవేత్త నూకల వేణు మృతి తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు(68) మృతిచెందారు. గతేడాది అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స తీసుకుని, తెనాలి వచ్చిన వేణుగోపాలరావు చెకప్ కోసమని ఇటీవల అక్కడకు వెళ్లారు. అక్కడ భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎన్ఆర్కే టెక్స్టైల్స్ చైర్మన్‌గా పారిశ్రామికరంగంలో కొనసాగుతున్న వేణుగోపాలరావు, పట్టణంలో గుప్తా కాలేజి కరస్పాండెంట్‌గా ఉన్నారు. తన తండ్రి నూకల రామకోటేశ్వరరావు పేరిట బోసురోడ్డులో కళ్యాణ కళాసదనం ఉంది. బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షునిగా సుదీర్ఘకాలంగా ఉన్న వేణుగోపాలరావు, ఆ దేవస్థానం అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి ఆలయం, పలు కళ్యాణమండపాలను నిర్మించి, ఆర్యవైశ్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికా నుంచి ఆయన భౌతికకాయాన్ని స్వస్థలం తెనాలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
లంచం ఇవ్వాల్సిందే..
టీడీపీ నేతకు కష్టాలు● ఖాళీ స్థలానికి పన్ను వేసేందుకు రూ.30 వేలు డిమాండ్ ● గొట్టాల రోడ్డు బాధితుడి ఆవేదనతో జీఎంసీ అవినీతి బట్టబయలు ● ‘పై అధికారులకు ఇవ్వాలి’ అంటూ దర్జాగా డిమాండ్ చేస్తున్న సిబ్బంది ● లంచాల మత్తులో మునిగిపోయిన రెవెన్యూ విభాగం నెహ్రూనగర్: అధికారానికే దిక్కులేదు. కూటమి నేతలను పీడిస్తున్నారు. పనులు కావాలంటే పైసాలు పడాల్సిందే. ఇదీ గుంటూరు నగర కార్పొరేషన్లో తీరు. నిబంధనల ప్రకారం కార్పొరేషన్‌కు పన్ను కడతామని దరఖాస్తు చేసుకున్నా, అధికారులు మాత్రం ‘ముందు మా జేబులు నింపితేనే మీ స్థలానికి పన్ను వేస్తాం’ అంటూ నిస్సిగ్గుగా డిమాండ్ చేయండంతో టీడీపీ నేత ఒకరు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అధికారానికి కనికరం లేదు! గొట్టాల రోడ్డు, జామియా నగర్ మదర్సా సమీపంలో ఉన్న 218 గజాల ఖాళీ స్థలానికి వీఎల్టీ(ఖాళీ స్థలం పన్ను) అసెస్మెంట్ కోసం బట్టా ప్రసాద్ అనే వ్యక్తి సచివాలయాన్ని ఆశ్రయించారు. అయితే, 17వ వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ ఏకంగా రూ.30 వేలు ఇస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పారు. తాను అధికార టీడీపీలో నాయకుడినని, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పక్కన తిరుగుతానని నిబంధనల ప్రకారం పని చేయాలని ఎంత బతిమాలినా సదరు ఉద్యోగి కనికరించలేదు. ‘నువ్వు ఏ పార్టీ నేతవైతే మాకేంటి? పై అధికారులకు వాటాలు ఇవ్వాలి.. ట్యాక్స్ వేయాలంటే లంచం కట్టాల్సిందే’ అంటూ తగ్గలేదు. సొంత పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ సిబ్బంది వేధింపులు భరించలేక సదరు నాయకుడు సోమవారం జీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఇక సామాన్యుల పరిస్థితేంటి.. అధికార పార్టీకి చెందిన నాయకుడి వద్దే ఇంత దర్జాగా రూ.30 వేలు డిమాండ్ చేశారంటే.. ఎలాంటి పలుకుబడి లేని సామాన్య, మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం ఏ స్థాయిలో పీడిస్తున్నారో ఊహించుకోవచ్చు. ఇళ్ల నిర్మాణ అనుమతులు, ట్యాప్ కనెక్షన్లు, ఖాళీ స్థలాల పన్నుల కోసం జీఎంసీ, సచివాలయాల చుట్టూ తిరిగే సాధారణ పౌరులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత ముట్టజెప్పకపోతే ఫైళ్లను నెలల తరబడి తొక్కిపెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు.. నగరంలో అధికారిక లెక్కల ప్రకారమే 10,110 ఖాళీ స్థలాలకు రూ.121.39 కోట్ల డిమాండ్ ఉండగా, కేవలం రూ.84 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. వేల సంఖ్యలో ఉన్న స్థలాలను పన్ను పరిధిలోకి తెస్తే కార్పొరేషనన్కు వందల కోట్ల ఆదాయం వస్తుంది. కానీ రెవెన్యూ అధికారులు, అడ్మిన్ సెక్రటరీలు ఖాళీ స్థలాల యజమానులతో కుమ్మకై ్క.. పన్ను వేయకుండా వదిలేసేందుకు వేల నుంచి లక్షల్లో లంచాలు దండుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పైగా ఎవరైనా నేరుగా వచ్చి పన్ను వేయమన్నా లంచాలు అడుగుతున్నారు. ఈ కమీషన్ల దందా కింది స్థాయి నుంచి పై అధికారుల దాకా చేరుతుండటంతోనే.. ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా రాజీ ప్రయత్నాలు చేసి రెవెన్యూ సిబ్బందిని కాపాడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. -
ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయవచ్చు
మానసిక ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు, వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం, అపాయింట్మెంట్స్ మర్చిపోవటం, జ్ఙాపకశక్తిని కోల్పోవటం వ్యాధిగ్రస్తుల్లో కనిపిస్తాయి. పసి పిల్లవాడికి ఏవిధంగా స్నానం చేయమని చెప్పాలో అదేవిధంగా అల్జీమర్స్ వ్యాధి గ్రస్తులకు ప్రతి ఒక్క విషయం గుర్తుచేయాలి. వ్యాధి రాకుండా ముందస్తు చర్యలో భాగంగా పుస్తకాలు చదవాలి. చెస్ ఆడటం, పజిల్స్ ఆడటం, మ్యూజికల్ వస్తువులు ప్లే చేయటం, పౌష్టికాహారం తీసుకోవాలి. మందు, సిగిరెట్లు మానివేయాలి. సామాజిక బంధాలు పెంచుకోవాలి. ప్రాథమిక దశలోనే వ్యాధి లక్షణాలను గుర్తించి వైద్యం చేయటం ద్వారా వ్యాధిని నివారించవచ్చు. – డాక్టర్ పమిడిముక్కల విజయ, వరల్డ్ స్ట్రోక్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ -
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ మంగళగిరి రూరల్: యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా నశాముక్త్ యువ–వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. మంగళగిరి మండలం బేతపూడిలోని అమృత యూనివర్సిటీలో ఆదివారం రాష్ట్రీయ సంకల్ప సమారోహ్ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ నిశాముక్త్ భారత్ కోసం ఇచ్చిన పిలుపులో మనం భాగస్వాములు కావాలన్నారు. మీ సమీపంలో గాని, మీ క్యాంపస్లోగాని ఎవరైనా డ్రగ్స్ వాడినట్లయితే వారి గురించి ఈగల్ కార్యాలయానికి, 1972 కాల్ సెంటర్ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటామంటూ విద్యార్ధులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేసి, సంతకాల సేకరణ నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ సి కె జయశంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ విజయేంద్ర, వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్కుమారి, ఈగల్ ఆపరేషన్ ఎస్పీ మహేశ్వరరాజు, అడ్మిన్ ఎస్పీ స్వరూపరాణి, డీఎస్పీలు సింగయ్య, త్రినాథ్, గుంటూరు ఈగల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ రవీంద్ర, మంగళగిరి రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వెంకట్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
వాణిజ్య, పారిశ్రామిక రంగాల బలోపేతమే లక్ష్యం
● సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్లో వక్తలు ● అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సమాఖ్య గ్లోబల్ 2026 గ్లోబల్ బిజినెస్ మీట్ తాడేపల్లి రూరల్: వాణిజ్యం, పరిశ్రమలు, వ్యాపారోద్యమాన్ని ప్రోత్సహించడంతోపాటు సహకారం, నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా వ్యాపార రంగాన్ని బలోపేతం చేయడమే సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ లక్ష్యమని సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్, కార్యక్రమ నిర్వాహకుడు ఏవీ రత్నం తెలిపారు. ఆదివారం తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్, విశ్వ సమాఖ్య పటేల్ ఎంటర్టైనర్ నెట్వర్క్, అఖిలభారత తెలగ బలిజ కాపు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సమాఖ్య 2026–గ్లోబల్ బిజినెస్ మీట్‌ను నిర్వహించారు. ఏవీ రత్నం మాట్లాడుతూ సమాఖ్య వెనుక దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌లు మాట్లాడారు. యువ పారిశ్రామికవేత్తలకు నిరంతర మద్దతు అందించడం, ఆర్థిక సంస్థలతో అనుసంధానం చేయడం, అంతర్జాతీయ చాంబర్ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ మార్కెట్‌ను నిర్మించడం వంటి లక్ష్యాలతో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బొమ్మదేవర సుబ్బారావు, మండలి రామకృష్ణ, ఈవెంట్‌కు ఉచితంగా ఫంక్షన్ హాల్‌ను ఇచ్చిన గోపు నాగరాజేష్, కాసర్ల ఫణి వంశీ, అక్కయ్య నాయుడు, మండలి రాజేష్‌లను ఏవీ రత్నం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ ఏవీ రత్నం, రిటైర్డ్ ఐఆర్ఎస్ పీవీ రావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ పార్థసారథి, బూరగడ్డ వ్యాస్, అమ్మిశెట్టి వాసు, బాడిత శంకర్, కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్ధన్ పాల్గొన్నారు. -
జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు
పక్షవాతం వచ్చిన వారికి మతిమరుపు వస్తుంది. ఇంట్లో ఎవరైనా వ్యాధి బాధితులు ఉంటే ఇతర సభ్యులు ముందస్తుగా అవగాహన కల్గి ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవటం చాలా మంచిది. అల్జీమర్స్ వ్యాధి గ్రస్తులకు గుంటూరు జీజీహెచ్‌లో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. ఓపీ విభాగంలో ప్రతి శనివారం ప్రత్యేకంగా మెమరీక్లీనిక్ను ఓపీలో ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేడు అత్యాధునిక వైద్య పద్థతులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, ప్రిన్సిపాల్, గుంటూరు వైద్య కళాశాల. -
కుష్ఠు సర్వేకు ఓటీపీ కష్టాలు
ప్రత్తిపాడు: కుష్ఠు వ్యాధి సర్వేకు ఓటీపీ నిబంధన ప్రతిబంధకంగా మారింది. గతంలో లేని విధంగా సర్వేకు ఓటీపీని తప్పనిసరి చేయడంతో ఎల్సీడీసీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఓటీపీలు చెప్పేందుకు ప్రజలు సుముఖత వ్యక్తం చేయకపోతుండటంతో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కుష్ఠు వ్యాధి రోగులను గుర్తించేందుకు వైద్య ఆరోగ్యశాఖ లెప్రసీ కేస్ డీటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ) సర్వే నిర్వహిస్తుంది. జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్త, ఒక మేల్ వలంటీర్ ఇంటింటికీ వెళ్లి ‘కుష్ఠు వ్యాధిగ్రస్తులను, అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించే కార్యక్రమం’ చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి మొదలైన ఈ సర్వేకు ప్రభుత్వ నిబంధనలు, సాంకేతిక సమస్యలు ఆటంకంగా మారడంతో నత్తనడకన సాగుతుంది. ఓటీపీలు చెప్పేందుకు విముఖత.. సర్వేలో భాగంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లిన సమయంలో ఏఎన్ఎంలు ‘ఏఎన్ఎం ఏపీహెల్త్యాప్’లో ఎన్ఎల్ఈపీ ఏపీలో కుటుంబంలోని సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఆ సమయంలో సభ్యుల ఫోన్ నంబర్లకు ఓటీపీలు వస్తున్నాయి. ఆ ఓటీపీలను యాప్‌లో నమోదు చేస్తేనే సర్వే పూర్తి అవుతుంది. అయితే కుటుంబ సభ్యులు ఓటీపీలు చెప్పేందుకు విముఖత చూపుతున్నారు. దానికి తోడు నెల రోజుల కిందట చేసిన సర్వేకు ఓటీపీలు చెప్పించుకుని, మళ్లీ ఇప్పుడు ఓటీపీలంటారేంటని, ఇదే పనా అంటూ సిబ్బందిపై నిష్టూర్చుతుండటంతో ఆరోగ్య సిబ్బంది కాళ్లకు పని చెప్పి వెనుదిరగాల్సి వస్తుంది. కాగా, ఒక పక్క ప్రభుత్వమే కాల్స్ చేసి ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని చెబుతుంటే, మీరొచ్చి ఓటీపీలు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తుండటంతో వారి వద్ద సమాధానం కూడా కరువు అవుతోంది. జిల్లాలో ఇలా.. జిల్లాలో మొత్తం 22,45,023 మంది జనాభా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు దాదాపు కేవలం 17,274 మందిని మాత్రమే సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేశారు. అంటే 0.77 శాతం మాత్రమే అధికారికంగా సర్వే జరిగిందన్న మాట. వీరిలో 101 మందికి కుష్ఠు అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించి పరీక్షించగా, ఇద్దరికి కుష్ఠు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కాగా, జిల్లాలో 568 మంది ఏఎన్ఎంలు ఉండగా, వారిలో 391 మంది ఆన్లైన్ నమోదు ప్రారంభించారు. 197 మంది నేటికీ ఆన్లైన్ వర్క్ ప్రారంభించలేదు. కాగా, ఆశా కార్యకర్తలు జిల్లాలో 1,170 మంది సర్వే చేస్తున్నారు. కాగా, ఆఫ్‌లైన్‌లో అయితే 7,60,719 మందిని సర్వే చేయగా, అందులో 717 మందికి కుష్ఠు అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించి పరీక్షించగా, ఏడుగురికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారించి చికిత్స చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు.. ఈ నేపథ్యంలో సర్వేకు వెళ్లిన సిబ్బందికి క్షేత్ర స్థాయిలో బోలెడు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఓటీపీలు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్లకు వస్తుండటం, ఆ ఫోన్ నంబర్లు ఇంట్లో లేకపోవడం, కొంతమంది వద్ద ప్రస్తుతం ఆ నంబర్లు అసలు వినియోగంలో లేకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు. ఇంకొందరు ఓటీపీలు వచ్చినా, మేము మీకు ఎందుకు చెప్పాలంటూ సిబ్బందిపై రివర్స్ అవుతుండటంతో, ఇంటి వరకూ వెళ్లినా ఓటీపీ దగ్గరే ప్రక్రియ నిలిచిపోతుంది. దీంతో సర్వే ముందుకు సాగక, ఆన్లైన్లో ప్రోగ్రెస్ పూర్‌గా కనిపిస్తుండటం, ఆఫ్‌లైన్‌లో చేసినా ప్రోగ్రెస్లోకి రాకపోవడంతో ఉన్నతాధికారులతో మాటలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినతి పత్రాలిచ్చినా.. సమస్య తీవ్రత నేపథ్యంలో ఓటీపీతో అయితే సర్వే చేయడం కష్టమని, ఓటీపీ నిబంధనను మినహాయించాలని కోరుతూ ఇటీవల మెడికల్ ఆఫీసర్ల మొదలుకుని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వరకూ ఏఎన్ఎంలు అందరికీ వినతి పత్రాలిచ్చారు. అయినప్పటికీ సమస్య నేటి వరకు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సర్వేకు ఇచ్చిన పద్నాలుగు రోజుల గడువులో ఎనిమిది రోజులు పూర్తవడం, ఇక ఆరు రోజులే మిగిలి ఉండటంతో ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. అన్ని గ్రామాల్లో సర్వే జరుగుతుంది. ఓటీపీల వల్ల కొంత ఆన్లైన్ నమోదు ప్రక్రియలో జాప్యం అవుతోంది. కానీ, ఆఫ్‌లైన్‌లో వేగంగా సర్వే చేస్తున్నారు. గడువును మరికొంత సమయం పొడిగించే అవకాశం ఉంది. ప్రజలకు సానుకూలంగా నచ్చజెప్పి ఓటీపీలు తీసుకోమని చెబుతున్నాం. సర్వేలో వ్యాధి నిర్ధారణ అయిన వారికి వెంటనే చికిత్స మొదలు పెడుతున్నాం. – జె. బసవయ్య, డీపీఎంవో, జిల్లా లెప్రసీ కార్యాలయం -
అల్జీమర్స్.. బహుపరాక్!
గుంటూరు మెడికల్: వయస్సు పెరుగుతున్న కొద్ది మతిమరుపు రావటం సహజంగా జరుగుతుంది. దీనినే అల్జీమర్స్ వ్యాధి అంటారు. ప్రతి మూడు సెకన్లకు ఒకరు వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఈ మతిమరుపు వ్యాధిబారిన పడే వారిసంఖ్య అధికంగాఉండేది. నేడు మనదేశంలో కూడా మతిమరుపు బాధితుల సంఖ్య పెరిగిపోయింది. ఆధునిక జీవనశైలి వల్ల యువతలో కూడా వ్యాధి పెరిగిపోవటం ఆందోళనకరమైన అంశమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దేశంలో సుమారు 8.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. బాధితుల సంఖ్య 2030 నాటికి రెట్టింపు అయ్యే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వయస్సు 60 దాటిన వారిలో 7.4శాతం మంది వ్యాధి బాధితులు ఉన్నారు. ఇంటినుంచిబయలుదేరిన వ్యక్తి కొంతదూరం వెళ్ళాక ఇంటి అడ్రస్ మర్చిపోవటం, తన పేరు కూడా రోగి మర్చిపోయే స్థితికి చేరుకోవటం ఈ జబ్బు లక్షణం. జబ్బు సోకిన వారికి సహాయకులుగా ఉండేవారికి అవగాహన కల్పించటం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1994 నుంచి ఏటా సెప్టెంబర్ 21న అల్జీమర్స్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి ’అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రతిరోజూ 30 మందికి చికిత్స.. అల్జీమర్స్ వ్యాధికి చికిత్స కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మంది మానసిక వైద్యనిపుణులు, 15 మంది న్యూరాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు వారంలో ఇరువురు లేదా ముగ్గురు వ్యాధి బాధితులు చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌కు ప్రతివారం ఇరువురు కొత్తగా వ్యాధి సోకినవారు, పదిమంది పాతరోగులు వ్యాధితో బాధపడుతూ ప్రతిరోజూ చికిత్స కోసం వస్తున్నారు. ప్రతి శనివారం న్యూరాలజీ ఓపీ విభాగంలో అల్జీమర్స్ వ్యాధి బాధితుల కోసం ప్రత్యేకంగా ఓపీ వైద్యసేవలు అందిస్తున్నారు. రోజువారి పనులు మరిచిపోతారు వ్యాధి గ్రస్తులు రోజు వారీ కార్యక్రమాలు మర్చిపోతారు. స్నానం చేయటం, బ్రష్ చేయటం, తిండితినటం కూడా మర్చిపోతారు. వస్తువులను ఎక్కడో పెట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరో దొంగిలించినట్లుగా అనుమానించటం, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పటం, వస్తువుల పేర్లు మర్చిపోవటం, వాటిని ఏ విధంగా వినియోగించాలో, ఎందునిమిత్తం వినియోగించాలో అనే అంశాలను సైతం మర్చిపోవటం రోగిలో కనిపిస్తాయి. ఇంటికి తాళాలు వేయటం, కూరలో ఉప్పువేయటం, పాలల్లో తోడు వేయటం వంటివి మర్చిపోవటం వ్యాధి గ్రస్తుల్లో కనిపిస్తాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వ్యాధి సోకిన వారు తమ పేరు మర్చిపోతారు. ఒకేచోట కూర్చుని వీడియోగేమ్స్, టీవీలు చూస్తూ ఉండటం, అతిగా మద్యం సేవించటం, శారీరక, మానసిక వ్యాయామం లేకపోవటం, అధికకొవ్వు ఉన్న మాంసం తినటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. బంధువుల, కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోతారు. పేర్లు మర్చిపోవటంతోపాటుగా వారిని గుర్తించటం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎక్కువగా 60 సంవత్సరాలు దాటిన వారిలో వస్తోంది. నేడు 45 ఏళ్ల వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది. -
సమగ్ర అభివృద్ధి సాధించాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: అమరావతి రాజధాని పరిధిలోని మంగళగిరి ఐటీ పార్క్, ఎయిమ్స్ వంటి సంస్థలతోపాటు జిల్లాలోని గుంటూరు, తెనాలి మునిసిపాలిటీలు, ఎంఎస్ఎంఈ రంగాలను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన ‘సిటీ ఎకనామిక్ రీజియన్’ నమూనాలో సమగ్ర అభివృద్ధి సాధించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని ఎస్ఆర్ శంకరన్ మినీ కార్యాలయంలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో మిర్చి, పసుపు వంటి పంటల ముడి ఎగుమతులకే పరిమితం కాకుండా, స్థానికంగానే ఫుడ్ ప్రాసెసింగ్, గ్రేడింగ్, విలువల పెంపు యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. కృష్ణా నదీ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని విస్తరించాలని సూచించారు. వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సాధించేందుకు పటిష్ట ప్రాజెక్ట్ డీపీఆర్‌లు సిద్ధం చేయాలన్నారు. వచ్చే నెలలో విజయవాడలో జరగనున్న ప్రాంతీయ సదస్సు లక్ష్యంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఓ పి.శేషశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, ఏపీఐఐసీ జీఎం నరసింహారావు, అధికారులు పాల్గొన్నారు. -
డబ్ల్యూఏపీఎల్ విజేత అమరావతి ఈ చాంపియన్స్
మంగళగిరి రూరల్: మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ అమరావతి ఈ చాంపియన్స్ టీంకు రాయలసీమ జెన్ స్టార్స్ మధ్య జరిగింది. మ్యాచ్‌లో ‘అమరావతి ఈ చాంపియన్స్’ ఏడు వికెట్ల తేడాతో రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమరావతి ఈ చాంపియన్స్ టీం 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. రంగలక్ష్మి 50, అనూష 46, కాట్రగడ్డ దీక్ష 48 పరుగులతో రాణించారు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జెన్ స్టార్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. అమరావతి బౌలర్లలో సాయి పూజిత 4, కాండ్రేగుల దేవిక 2 వికెట్లు పడగొట్టారు. 22 బంతుల్లో 48 పరుగులు చేసిన కాట్రగడ్డ దీక్షకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో సోమ వారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం అకల్మష హోమం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనారాధన, అఖండ దీపారాధన, ఋత్విగ్వరణం, నవ కుంభారోపణ కార్యక్రమాలు జరుగుతాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాలు, గ్రామోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకోవాలని దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ కోరారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సెంటర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలను ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమిటీ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్), పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అధినేత, ఏఆర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్ళం సుబ్బారెడ్డి, వైఎస్సార్ అండ్ కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు కళ్లం రాజశేఖరరెడ్డి, కళ్లం చంద్రశేఖరరెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తాడేపల్లి పట్టణానికి చెందిన పమిడిమళ్ల వెంకటరామిరెడ్డి మనువడు నాగనితిన్ రెడ్డి అందజేసిన 36 కేజీల లడ్డూ వేలంపాట నిర్వహించారు. కళ్లం సుబ్బారెడ్డి రూ.6.35 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. లడ్డూను కమిటీ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆయనకు అందజేశారు. నిమజ్జన కార్యక్రమం సంప్రదాయంగా మహిళలతో కోలాటం, కేరళ డప్పులతో ఉత్సాహంగా సాగింది. తొలుత దాదాపు ఆరువేల మందికి అన్నదానం నిర్వహించారు. ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశ పరీక్ష ఆదివారం సజావుగా సాగిందని కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ప్రొ.దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలలో 822 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా, 782 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. 22వ తేదీన సాయంత్రం ఫలితాలను విడుదల చేస్తామన్నారు. వర్సిటీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.కృష్ణవేణి, సూపరింటెండెంట్ జె శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో సగటు వర్షపాతం 11.40 మి.మీటర్లు
నగరంపాలెం: జిల్లాలోని పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ పక్రియను సీఐలు చేపట్టారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయవద్దని రౌడీషీటర్లకు సూచించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని అన్నారు. చెడు స్నేహాలు, అసాంఘిక కార్యకలాపాలు, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రజల ప్రశాంతతకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని స్పష్టంచేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉంటూ, సమాజంలో ప్రశాంతంగా జీవించే రౌడీషీటర్లకు పోలీసుల పక్షాన సహకారం అందిస్తామని చెప్పారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్ర ప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్, గుంటూరు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన ప్రథమ షార్ట్ కోర్స్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్– 2026 పోటీలను స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, కోశాధికారి ఖండే కాంతారావు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 64 మంది బాల బాలికలు పాల్గొన్నారన్నారు. పోటీలలో అద్భుత ప్రదర్శన చూపిన బాల బాలికలను వచ్చే నెల 26 నుంచి30వ తేదీ వరకు అహ్మదాబాద్ లో జరిగే ప్రథమ షార్ట్ కోర్స్ సీనియర్ జాతీయ స్థాయి ఈత పోటీలలో పాల్గొంటారన్నారు. అనంతరం చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.మోహన్ వెంకట రామ్, అధ్యక్షులు డాక్టర్ ఓబుల్ రెడ్డి, కోశాధికారి రమేష్, జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రాయపాటి రామ నరసింహారావు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణం, ఆత్మకూరు ఇప్పటం రోడ్డులో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం వద్ద శనివారం రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి 125 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. స్థానిక మహిళలు భక్తిశ్రద్ధలతో వివిధ రకాల ప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేసి, గణనాథుడికి సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు కార్యక్రమంలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులకు వివిధ రకాల ఆటల పోటీలను కూడా నిర్వహించారు. పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. ఉత్సవ ప్రాంగణంలో భక్తులు, స్థానికులు సందడి చేశారు. -
ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ప్రారంభం
మంగళగిరి టౌన్: మంగళగిరి టిప్పర్ల బజారులోని అంజుమన్ షాదీఖానాలో గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధి ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంటు–2026 ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 220 మంది క్రీడాకారులు హాజరవడం విశేషం. ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున గుంటూరు జిల్లా చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ సహకారంతో ఎన్ఆర్ఎం చెస్ అకాడమీ ఈ టోర్నమెంట్ నిర్వహించింది. ముఖ్యఅతిథిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోనేరు అశోక్ హాజరవడమేకాకుండా టోర్నమెంట్లో పాల్గొనగా... టోర్నమెంట్ డైరెక్టర్లు నందం రామ్మోహనరావు, కోవిలకారు శివరామ్ బాబాజీ (కృష్ణ), కోచ్ ఎస్ కె.ఖాసిం, సీనియర్ ప్లేయర్ జి.ప్రసాద్, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ జీవీ కుమార్ పాల్గొన్నారు. తొలి ఎత్తు శాస్త్రి బామ్ యాజమాన్య ప్రతినిధి రామనాథం వీరభద్రరావు, కోనేరు అశోక్ లు వేసి పోటీలను ప్రారంభించారు. మొత్తం ఏడు రౌండ్లలో పోటీలు జరగ్గా... ముగ్గురు ప్లేయర్స్ కి 6.5 వంతున పాయింట్లు రాగా ఈ టోర్నమెంట్ లో వారు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రథమ స్థానం గుంటూరుకు చెందిన ఎ.హరిసూర్యనారాయణ సాధించగా, ద్వితీయస్థానం గుంటూరుకు చెందిన చిన్నం వైష్ణవి, తృతీయ స్థానం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తాళ్ల నిశ్చల్ పొందారు. బహుమతి ప్రదానోత్సవానికి అతిథులుగా మంగళగిరి రోటరీ క్లబ్ తరఫున రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ గాజుల శ్రీనివాసరావు, కోశాధికారి చనుమోలు గోపాల్, శాస్త్రి బామ్ ప్రతినిధి రామనాథం వీరభద్రరావు, జక్కా నాగ వెంకట గోపాలరావులు హాజరయ్యారు. ప్రథమ బహుమతి రూ.6,100 నగదు, ట్రోఫీ, ద్వితీయ బహుమతి రూ.4,100 నగదు, ట్రోఫీ, తృతీయ బహుమతి రూ.3,100, ట్రోఫీ ఇతర బహుమతులు అందజేశారు. మంగళగిరి రోటరీ క్లబ్, శాస్త్రిబామ్, కోదండరామ ఆయుర్వేదిక్ నిలయం యూవీకే రామమోహనరావు, జక్కా నాగ వెంకట గోపాలరావు, పాండురంగా హార్డ్ వేర్ అండ్ ప్లేవుడ్, రవితేజ ట్రేడర్స్ సంయుక్తంగా ఐదు జిల్లాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌కు స్పాన్సర్స్ గా వ్యవహరించాయి. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన ఆర్బిటర్లను నిర్వాహకులు సత్కరించారు. -
జీఎంసీని కై వసం చేసుకుందాం
గుంటూరు ఎడ్యుకేషన్: మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ గెలుపు జెండా ఎగురవేద్దామని పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని 76 డివిజన్లలోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలపై పార్టీ కార్యకర్తలతో ఆదివారం అమరావతి రోడ్డులోని ‘ఎ’ కన్వెన్షన్‌లో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి ప్రసంగించారు. టీడీపీ మోసాలను ప్రజలకు వివరించి, వైఎస్సార్సీపీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్, నాయకులు మండేపూడి పురుషోత్తం, ఎం. వెంకటప్పారెడ్డి, పోలూరి వెంకట్‌రెడ్డి, నల్లమోతు రూత్‌రాణి, పార్టీ జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ దగా తీరును ప్రజలకు వివరించాలి వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2021లో గుంటూరు నగరపాలక సంస్థను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అంతకుమించిన స్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలుపు కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేద్దామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం తప్పుడు హామీలతో ప్రజలను మోసగించిన తీరు ఒకవైపు, గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు మరోవైపు సాక్ష్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో వీటిపై ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గతంలో నగరంలో 57 డివిజన్లకుగాను 46 డివిజన్లను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో 76 డివిజన్లలోనూ గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్లో మనదే బలం రాజ్యసభ మాజీ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్లో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని తెలిపారు. అక్కడి ముఖ్య నాయకుల బలాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను పార్టీ ఎంపిక చేస్తుందని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికలకు సమగ్ర వ్యూహంతో ముందుకెళదామని అన్నారు. అధికారం లేదనే భయం వద్దు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీకి అధికారం లేదనే భయం వద్దని, అధికారానికి దూరమైనా ప్రజలకు దగ్గరగా ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు స్థాపించిన పార్టీ అని మరువరాదన్నారు. ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ కార్యక్రమాలతో వారికి నేరుగా లబ్ధి చేకూర్చారని అన్నారు. ప్రస్తుత సమావేశం ఎన్నికల సమరానికి పునాది కావాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. గుంటూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకునేందుకు కార్యోన్ముఖులు కావాలన్నారు. పోటీ చేస్తే గెలుపు ఖాయం పార్టీ గుంటూరు పార్లమెంటు జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసే వారందరూ కార్పొరేటర్లుగా గెలుస్తారని అన్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరకు ప్రజలు వెళ్లడం లేదని, వైఎస్సార్సీపీ నేతల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకొంటున్నారని పేర్కొన్నారు. అంబటి ఇంటిపై దాడి అనంతరం ఆయన్ను పరామర్శించేందుకు గుంటూరు వచ్చిన వైఎస్ జగన్‌కు రెండున్నర లక్షల మంది ప్రజలు స్వాగతం పలికారని గుర్తుచేశారు. ప్రజలకు కనీసం సురక్షితమైన తాగునీరు ఇవ్వలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్లతో కుమ్మకై ్క బియ్యం మాఫియా నడుపుతూ రూ. వేల కోట్లు ఆర్జించారని ఆరోపించారు. రెండో కీలక కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాం ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ పాలనలో గుంటూరు కార్పొరేషన్‌లోని ఒక్కో డివిజన్లో రూ.50 కోట్ల మేరకు అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో రెండో కీలక కార్పొరేషన్‌గా గుంటూరును వైఎస్ జగన్ తీర్చిదిద్దారని, నాటి పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ.. గతంలో అభ్యర్థుల జాబితా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చేదని, ప్రస్తుతం స్థానికంగా జాబితా సిద్ధం చేసి పైకి పంపుతామని చెప్పారు. గతంలో గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ జెండాతో కార్పొరేటర్లుగా గెలిచిన వారు పార్టీని వీడి వెళ్లినా, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. కార్యకర్తల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్పొరేషన్ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా తీసుకుని ముందుకెళదామని తెలిపారు. వచ్చే జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలు కార్యకర్తల ద్వారానే ప్రజలకు అందుతాయని అన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల ఆన్లైన్ క్యాంపెయిన్
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్తంగా ఆన్లైన్లో సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించింది. ఇందులో భాగంగా గుంటూరు నగరంపాలెంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మెయిన్ బ్రాంచి వద్ద ఆదివారం బ్యాంకు అధికారులు, ఉద్యోగులు తమ నిరసన తెలిపారు. యూఎఫ్‌బీయూ నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించినట్లు తెలిపారు. వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐబీఏతో 123వ జాయింట్ నోట్‌పై సంతకాలు జరిగి చాలాకాలం గడిచినా ఐదు రోజుల పని దినాలపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. శనివారం సెలవు ఇస్తే రోజువారీ పని వేళలను 40 నిమిషాలు పెంచేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నోటిఫై చేయాలని కోరారు. ప్రధానంగా పెన్షన్, కుటుంబ పెన్షన్ సవరణ, పెన్షనర్లకు ఐబీ వర్తింపజేయడం వంటి అంశాలపై కూడా యూఎఫ్‌బీయూ పోరాటం చేస్తోందని తెలిపారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 28, 29, 30 తేదీల్లో వరుసగా మూడు రోజులపాటు మహా సమ్మెను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకు యూనియన్ల నాయకులు కేఆర్వీ జయకుమార్, కె.కోటిరెడ్డి, వి.నరేంద్రకుమార్, పీఎస్ రంగసాయి, ఎం.పావని, సుధీర్, వెంకట్, కళ్యాణ్, మురళీకృష్ణ, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీనరసింహస్వామి ఆలయం ద్వారాలు మూసివేత
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆలయ మరమ్మతు పనుల నేపథ్యంలో భక్తులకు దర్శన మార్గంలో మార్పులు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ మరమ్మతుల్లో భాగంగా శ్రీ కృష్ణదేవరాయ ముఖమండపం తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 21, 2026 నుంచి 20 రోజుల పాటు ఆలయంలోని తూర్పు, ఉత్తర ద్వారాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు దక్షిణ గాలి గోపురం మార్గం ద్వారా దర్శనం చేసుకోవాలని సూచించారు. మరమ్మతు పనుల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. లక్ష్మీపురం: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌ను బెదిరించి రూ.3.32 లక్షలు నగదు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న వ్యక్తి పై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లికార్జున పేటకు చెందిన దేవరపల్లి రాజేష్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జూలై 22న గుర్తుతెలియని వ్యక్తి రాజేష్‌కు ఫోన్ చేసి తాను బాపట్ల ఎస్ఐగా పరిచయం చేసుకొన్నారు. రాజేష్‌పై సోషల్ మీడియా ద్వారా ఒక ఫిర్యాదు వచ్చినట్లు ఆ విషయమై రాజేష్‌ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు బాధితుడుని బెదిరించడంతో బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. ఈ వ్యవహారం అయి జూలై 22 నుంచి 31వ తేదీ లోపు పలు దఫాలు గా రూ.3.32 లక్షలు వరకు గుర్తు తెలియని వ్యక్తి ఖాతాలోకి బెదిరించడంతో బదిలీ చేశాడు. బాధితుడుకి అనుమానం కలిగి విచారించగా బెదిరించి తన వద్ద డబ్బు కాజేశారని దీన్ని సైబర్ క్రైంగా గ్రహించాడు. దీంతో బాధితుడు రాజేష్ అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్తిపాడు: ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా ఐదుగురు గాయాలపాలైన ఘటన పాత మద్రాస్ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం ప్రత్తిపాడు నుంచి ప్రయాణీకులను ఎక్కించుకుని గుంటూరు వెళ్తున్న సర్వీస్ ఆటో గుంటూరు– పర్చూరు ఓల్డ్ మద్రాస్ రోడ్డులో ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెం సమీపంలో అదుపుతప్పి పక్కనున్న పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంకు చెందిన షేక్ జాన్ వలి, ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంకు చెందిన కొమ్మిశెట్టి అంజయ్య, కొండేపాడుకు చెందిన దాసరి జక్రయ్య , ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నరుగా పని చేస్తున్న మట్టుపల్లి సునీతలతో పాటు ఆటో నడుపుతున్న వంగిపురం గ్రామానికి చెందిన కె. కోటేశ్వరరావుకు గాయాలయ్యాయి. స్థానికులు108కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని కాలువలోని ముళ్ల పొదల్లో పాడి ఉన్న క్షతగాత్రులను108 ఈఎంటీలు తీవ్రంగా శ్రమించి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. కాగా వీరిలో సునీత, అంజయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. -
గుంటూరులో చరిత్ర తిరగరాద్దాం
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం డబ్బు, అధికారం, పోలీసు వ్యవస్థ ఉన్నాయనే ధీమాతో ఉందన్నారు. అయినా వైఎస్సార్ సీపీ భయపడే ప్రసక్తే లేదన్నారు. గుంటూరులో చరిత్ర తిరగరాద్దామని పిలుపునిచ్చారు. అమరావతిలో జరుగుతున్న దోపిడీకి, ముస్తఫా అక్రమ అరెస్టుకు, తనతోపాటు అప్పిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాటం చేసి కూటమిని ఘోరంగా ఓటమి పాలుచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యం కావాలన్నారు. సమర్థులకు సీట్లు ఇస్తామని చెప్పారు. పార్టీ గెలుపు కోసం ఐక్యతతో ముందుకెళదామని పేర్కొన్నారు. -
మహిళల టీ–20 టోర్నీ ప్రారంభం
● ఏసీఏ క్రికెట్ స్టేడియంలో డబ్ల్యూఏపీఎల్‌ను ప్రారంభించిన నారా బ్రాహ్మణి ● డబ్ల్యూఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన బ్రాహ్మణి, మిథాలిరాజ్ మంగళగిరి రూరల్: మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్(డబ్ల్యూఎపిఎల్) టీ–20 క్రికెట్ తొలి సీజన్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకలకు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారా బ్రాహ్మణి, డబ్ల్యూఏపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న భారత మహిళా క్రికెటర్ మిథాలిరాజ్ సంయుక్తంగా డబ్ల్యూఎపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. రాయలసీమ జెన్స్టార్ విజేత శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్ జుట్టు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టుకు మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్ జట్టు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయలసీమ జెన్ స్టార్ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి గోదావరి గోల్డెన్ ఈగల్ జట్టును 116 పరుగులు చేశారు. వీరిలో కెప్టెన్ హెన్రీట్టా పెరీరా 63 పరుగులు, గుండుపల్లి ఉద్విత 30 పరుగులతో రాణించారు. రాయలసీమ జెన్ స్టార్‌లో బి అనూష మూడు వికెట్లు పద్మజ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన రాయలసీమ జెన్ స్టార్ జట్టు మూడు వికెట్లు నష్టానికి 120 పరుగులు చేసి విజయం సాధించింది రాయలసీమ జెన్ స్టార్ లో ఓపెనర్లు సీత సాయి 33 పరుగులు శుభశ్రీ 23 పరుగులు చేశారు. బౌలింగ్లోను బ్యాటింగ్లోను పద్మజా రాణించింది. రెండవ మ్యాచ్ అమరావతి చాంపియన్స్‌కు వైజాగ్ ఫైర్ బర్డ్స్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. అమరావతి చాంపియన్స్ జట్టు విజయం సాధించింది. ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌బాబు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, ఏసీఏ కోశాధికారి డి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై నిగ్గు తేల్చాల్సిందే
గుంటూరు ఎడ్యుకేషన్ : మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు సీబీఐ విచారణతోనే వెలుగులోకి వస్తాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ఈనెల 21న విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట చేపడుతున్న నిరసన దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో అంబటి రాంబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ సాక్ష్యాలను ప్రభుత్వం ముందు ఉంచినా చలనం లేదని, పైగా అక్రమాలు జరగలేదని చంద్రబాబు, లోకేష్ బుకాయిస్తున్నారని అన్నారు. ఉద్యోగం పొందిన అభ్యర్థులు సైతం తమకు ఉద్యోగం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని చెప్పే పరిస్థితి ఉందన్నారు. దీక్షకు గుంటూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాలని అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తెనాలి, పొన్నూరు, తాడికొండ. ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), బలసాని కిరణ్‌కుమార్‌లు పిలుపునిచ్చారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో రోజుకో అక్రమం బయటకు వస్తూ, అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు న్యాయవిచారణ జరపడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారుల చేత పొంతన లేని విధంగా మాట్లాడిస్తున్నారని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాం రసూల్, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిశీలకుడు ఈదా సాంబిరెడ్డి పాల్గొన్నారు. రేపు విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు వైఎస్సార్ సీపీ పిలుపు గుంటూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం -
సమానత్వంతో కూడిన స్వేచ్ఛ అవసరం
ఏఎన్‌యూ(పెదకాకాని): సమానత్వం లేని స్వేచ్ఛ ద్వారా కేవలం ధనవంతులు, శక్తివంతులు మాత్రమే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం న్యాయ విభాగం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న న్యాయ కళాశాలు విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించుకుని రాణించాలని పిలుపునిచ్చారు. సుమారు 80 సంవత్సరాల స్వతంత్య్ర భారతంలో ఇప్పటికీ కులాలు, మతాలపరంగా దేశం విడిపోయి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో అంబేడ్కర్ పేర్కొన్న సౌభ్రాతృత్వాన్ని సాధించగలిగిన నాడే రాజ్యాంగంలో పేర్కొన్న పీఠికకు పరమార్థం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సభకు న్యాయ విభాగాధిపతి ప్రొఫెసర్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులుగా తాము విద్యార్థుల అవసరం నిమిత్తం తమ అనుభవాన్ని పంచేందుకు అవసరమైన సెమినార్లకు వీలైతే సెమిస్టర్ తరగతులకు కూడా హాజరు కావాలని సూచించారు. వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధర్ రావు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలతో పాటు న్యాయ రంగంలో కూడా తీసుకొస్తున్న పరిణామ క్రమాన్ని అలాగే విద్యార్థులకు దాని యొక్క భవిష్యత్ ప్రయోజనాలను వివరించారు. విశ్రాంత వీసీ ప్రొఫెసర్ హరిగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జస్టిస్ లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుమారు 6 సంవత్సరాల పాటు ఎన్నో కేసులలో సాహసోపేతమైన ధైర్యవంతమైన తీర్పులను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావును ఏఎన్‌యూ గౌరవ విశిష్ట న్యాయశాస్త్ర ఆచార్యులుగా నియమిస్తున్నట్లు వీసీ ప్రకటించారు. కార్యక్రమంలో న్యాయవిభాగంలో ఏర్పాటు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సురేష్ కుమార్ తన వంతు సహాయంగా 25 వేల రూపాయలని ప్రకటించి విభాగంలో న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టార్ ఆర్.శివరామ ప్రసాద్, రిజిస్ట్రార్ జి.సింహాచలం, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ ఎస్.ప్రభాకరన్, తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్ సభ్యులు జి.మోహన్ కృష్ణణ్, పూర్వ విద్యార్థి విభాగం అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదులు ఎర్రగొర్ల ఠాగూర్ యాదవ్, ఏఎన్‌యూ న్యాయ దిన్ ఫ్యాకల్టీ సిహెచ్ సుధాకర్ బాబు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ ఎ.గురవయ్య పాల్గొన్నారు. -
ఎగవేతకే ఐపీ టోపీ!
గుంటూరుఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● 14 రోజుల గడువుతో రూ.కోట్ల వ్యాపారం ● డబ్బులు రాకపోతే దిక్కేది? ● వరుస ఐపీలతో దిగుమతి వ్యాపారుల్లో గుబులు ● అడ్డగోలుగా ఎగుమతి, దిగుమతి లైసెన్స్‌లు ● రెండున్నరేళ్లలో రూ.వంద కోట్లకుపైగా ఐపీలు ● చివరకు రైతుపైనా ప్రభావం పడే ప్రమాదం 7విజయపురి సౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 534.90 అడుగులకు చేరింది. ఇది 177.8698 టీఎంసీలకు సమానం. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర రూ.11,300, మోడల్ ధర రూ.9,500 వరకు పలికింది. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,506 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గుంటూరు మిర్చి యార్డులో కోట్లాది రూపాయల విలువైన మిర్చి సరుకు రోజూ చేతులు మారుతోంది. రైతులు తీసుకొచ్చిన సరుకును ఎగుమతి వ్యాపారులకు దిగుమతి వ్యాపారులు విక్రయించడం ద్వారా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అయితే రూ.కోట్ల విలువైన సరుకు చేతులు మారుతున్నా.. దానికి తగిన ఆర్థిక భద్రత మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సరుకు తీసుకున్న ఎగుమతి వ్యాపారికి తర్వాత చెల్లింపులకు 14 రోజుల వరకు గడువు ఉండటం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. -
కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోవాలి
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధి ఇయాన్ కౌలీ చేబ్రోలు: విద్యార్థులు కమ్యూనికేషన్ నైపుణ్యాలను సమర్థంగా వినియోగించుకునేలా అభ్యసించాలని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్ మల్టీ– లెవల్ టెస్టింగ్ ప్రొడక్ట్ మేనేజర్ ఇయాన్ కౌలీ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలోని కేంబ్రిడ్జ్ ఆథరైజ్డ్ ఎగ్జామ్ సెంటర్– ఐఎన్269 ఆధ్వర్యంలో ‘అస్సెసింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్: బియాండ్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ టెస్టింగ్’ అనే అంశంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇయాన్ కౌలీ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచంలో విద్య, ఉపాధి, అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. భాషా పరిజ్ఞానంతో పాటు వాస్తవ జీవిత పరిస్థితుల్లో వ్యక్తి తన ఆలోచనలను ఎంత స్పష్టంగా, సమర్థంగా వ్యక్తీకరించగలడన్నది కూడా ముఖ్యమన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల భవిష్యత్ అవకాశాలను విస్తరించడంలో ఆంగ్ల భాష, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతో కీలకమన్నారు. -
ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్‌కు జట్టు ఎంపిక
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి లోని కెవికె గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో హాకీ ఇండియా 10వ ఎస్ఎన్బీపీ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్–2026 (అండర్ 16) బాలుర కోసం సామ్రాట్ హాకీ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఎంపిక ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఎంపిక ట్రయల్స్‌కు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 75 మంది యువ హాకీక్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి సామ్రాట్ హాకీ అకాడమీ జట్టులో స్థానం పొందారు. రిటైర్డ్ పీడీ దాసరి కోటేశ్వరరావు,ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్స్ జి.రవి, పి.పవన్ కుమార్, నేషనల్ హాకీ అంపైర్ డి సురేష్, నేషనల్ హాకీ ప్లేయర్ పి ప్రసన్నకుమార్‌లు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 1 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న హాకీ ఇండియా 10వ ఎస్ఎన్బీపీ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్–2026 లో సామ్రాట్ హాకీ అకాడమీ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపిక ట్రయల్స్ అనంతరం మొత్తం 40 మంది క్రీడాకారులను కోచింగ్ క్యాంపునకు ఎంపిక చేశారు. -
ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు కావాలి
డీఆర్వో షేక్ ఖాజావలి గుంటూరు వెస్ట్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయపార్టీల ప్రతినిధులతో స్థానిక కలెక్టరేట్లోని వీసీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుని పదవీ కాలం 2027 మార్చి 29వ తేదీన ముగుస్తుందన్నారు. ఈనెల 28న ఉపాధ్యాయ ఓటరు నమోదు కార్యక్రమానికి బహిరంగ నోటీస్ విడుదల చేస్తామన్నారు. నవంబరు 6వ తేదీ వరకు ఓటరు నమోదుకు ఫారం–19 స్వీకరణ జరుగుతుందని చెప్పారు. నవంబరు 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల, డిసెంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 25వ తేదీ నాటికి అభ్యంతరాల పరిష్కారం జరుగుతుందని వివరించారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల జరుగుతుందని చెప్పారు. సర్‌లో పెండింగ్ చాలా తక్కువ డీఆర్వో మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (సర్) కింద 1,68,220 నోటీసులు జారీ చేయగా, 1,094 మాత్రమే విచారణ పెండింగ్‌లో ఉందన్నారు. ఫారం–6 12,044, ఫారం–7 2,047, ఫారం–8 9,085 దరఖాస్తులు అందాయన్నారు. బుక్ ఏ కాల్ కింద రాష్ట్రంలో అత్యధికంగా వచ్చిన కాల్స్‌లో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. సమావేశంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, తెనాలి ఆర్డీఓ కె.శ్రీరమణి, ఈఆర్ఓలు ఐ.కిషోర్, పద్మావతి, గంగరాజు, ముఖ్య టౌన్ ప్లానింగ్ అధికారి రాంబాబు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి వై.పిచ్చిరెడ్డి, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి వాసు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి
గుంటూరు వెస్ట్: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని వీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ లేని యానాది కులానికి చెందిన 531 మందిని గుర్తించామని, వారికి ఆధార్ కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు. గిరిజన భవన్ మరమ్మతుల పనులు మంజూరు చేశామన్నారు. అంబేడ్కర్ భవన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాస్టల్స్‌లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దాడులపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కుల ధ్రువీకరణ పత్రాలపై వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లో పరిష్కరించనున్నట్లు చెప్పారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, ఆ మేరకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో సునిశితమైన కేసుల వివరాలు పోస్టు చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, డీఆర్వో షేక్ ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి, గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కె.శ్రీనివాసరావు, కె.శ్రీరమణి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి, డీఎస్ఓ పి.కోమలి పద్మ, జిల్లా సాంఘిక సంక్షేమ, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి డి.దుర్గాబాయి పాల్గొన్నారు. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
పోలీసులకూ ‘సినిమా’ చూపెడుతున్నారు!
● ఘంటసాల ప్రీవ్యూ షో టికెట్లు విక్రయించాలంటూ ఆదేశాలు ● ఒక్కో స్టేషన్‌కు 50 టికెట్లు పంపిన ఉన్నతాధికారులు ● మరోవైపు కూటమి నాయకుల ఇండెంట్లతో సతమతం లక్ష్మీపురం: ప్రజా సంరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించే పోలీసులకు కూటమి నేతల తీరుతో సినిమా కష్టాలు తప్పడం లేదు. ఇటు ప్రజలకు, అటు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు రక్షణ కల్పించేందుకు నిరంతరం కృషి చేసే పోలీసులపై కూటమి నాయకుల వేధింపులు, ఇండెంట్లతో భారం పడుతోంది. ఉన్నతాధికారుల హుకుంలు కూడా తోడవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల కొంత కాలంగా కనీవినీ ఎరుగని రీతిలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీస్ స్టేషన్లలో పుస్తకాలు, సినిమా టిక్కెట్లు విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. హరిహర మహల్ థియేటర్లో శనివారం ఉదయం 8.30 గంటలకు ఘంటసాల ప్రీవ్యూ షోకి సంబంధించిన టికెట్లను గుంటూరు నగరంలో ఉన్న ఆరు పోలీస్ స్టేషన్లకు పంపారు. పోలీస్ బాస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీటిని విక్రయించాలంటూ మౌఖిక ఆదేశాలను జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో టికెట్ ధర సుమారు రూ.100కు పైగా ఉందని, ఆ టికెట్లు ఎవరికి విక్రయించాలంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించక తప్పడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం న్యాయశాఖకు సంబంధించిన పుస్తకాలను పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు కొనుగోలు చేయాలంటూ ఆయా పోలీస్ స్టేషన్లకు పంపించారు. వాటి విలువ సుమారు రూ.2 వేలకు పైగా ఉందని అంటున్నారు. అసలు పోలీసు శాఖలో ఎప్పుడూ లేని విధంగా సినిమా టికెట్లు, పుస్తకాలు విక్రయించడం సరికాదని కొందరు పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. పోలీస్ బాస్ ఆదేశాలకు భయపడాల్సి వస్తోంది. కూటమి నేతల జులుం ఇదంతా ఒక ఎత్తు అయితే, పోలీసు శాఖను సైతం కూటమి నాయకులు ఇండెంట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పోలీసుల జేబులు ఖాళీ అవుతున్నాయని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆయా పోలీస్ స్టేషన్ల సీఐ, ఎస్ఐల చేత కార్లు, బొకేలు, శాలువాలు, భోజనాలు అంటూ ఇండెంట్లు వేస్తున్నట్లు సమాచారం. మరో వైపు పోలీసులను ప్రజల ముందు అవమానించేలా ప్రజా ప్రతినిధులు స్టేట్మెంట్లు ఇస్తున్నారని, పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేల నుంచి సిఫారసులు తీసుకోక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. దానికి సైతం ముడుపులు చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. బదిలీ అయ్యేంత వరకు సంబంధిత ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో విధులు నిర్వహించడంతో పాటు, వారి అవసరాలకు ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదని అంటున్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, సంబంధిత పోలీస్ స్టేషన్లలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు మరో వైపు పీజీఆర్ఎస్ నుంచి వచ్చిన ఫిర్యాదులను, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన సిఫారసులను పరిష్కరించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు పోలీసులను బందోబస్తులకు కేటాయించడంతో సామాన్య ప్రజలకు స్టేషన్లో సకాలంలో న్యాయం అందడం లేదు. -
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి తాడేపల్లి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ రీజియన్ కో ఆర్డినేటర్, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివకుమార్‌లతో సమావేశయ్యారు. వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల్లో సత్తా చాటాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతినియోజకవర్గంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతోపాటు, కూటమి ప్రభుత్వం వైఫల్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పారు. ఆడపిల్లలను రక్షిద్దాం లఘుచిత్రాల పోటీలు గుంటూరు మెడికల్: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా లఘుచిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 30న గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘ఆడపిల్లలను రక్షిద్దాం’ అనే అంశంపై లఘు చిత్రాల పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి కింద రూ.30వేలు, రెండవ బహుమతి కింద రూ.20వేలు, మూడో బహుమతి కింద రూ.10వేలు అందజేస్తారని తెలిపారు. బహుమతులను ఈనెల అక్టోబరు 11న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విజేతలకు అందజేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లాలో కేవలం రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, అవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చేబ్రోలు మాత్రమేనన్నారు. ఈవిషయంపై ఆర్జేడీకి సర్క్యూలర్ పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. చేపల చెరువులో పడి వ్యక్తి మృతి నందివాడ: మండలంలోని ఇలపర్రు గ్రామంలో ఉన్న చేపల చెరువులో పడవపై స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామానికి చెందిన పొన్నూరి పోతురాజు (30), లక్ష్మీతిరుపతమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఇలపర్రు గ్రామంలోని పెనుమత్స రామరాజుకు చెందిన చేపల చెరువుల వద్ద నాలుగు రోజుల క్రితం మేత కట్టే పనికి వచ్చారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో చెరువులోకి పడవపై వెళ్లి మేతకట్టిన అనంతరం స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారీ నీటిలో పడిపోయాడు. నీటమునిగి మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మీతిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందివాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు పట్నంబజారు: పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పెదకాకానికి చెందిన బాలిక పదో తరగతి చది ఇంట్లో ఉంటుంది. గుంటూరు నగరంలోని అమ్మమ్మ ఉంటున్న అంబేడ్కర్ నగర్‌కు వచ్చి వెళుతుండేది. అదే ప్రాంతానికి చెందిన కాండ్రుగుంట శివధర్మ పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమని యువతి కోరగా, తాను చేసుకోనంటూ బెదిరింపులకు గురిచేస్తున్న శివధర్మపై యువతి ఫిర్యాదు మేరకు లైంగిక దాడి పాల్పడినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ విద్యార్థులతో ముఖాముఖి ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలోని వికాస భవన్లో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్లానింగ్ టు పర్సు యువర్ మాస్టర్స్ ఆర్పీహెచ్డీ అబ్రాడ్ అనే అంశంపై విదేశీ విద్యాలయాల ప్రతినిధులు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినట్లు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ తౌసిఫ్ అహ్మద్ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన ఏడు యుఎస్ఏ, ఒకటి నెదర్లాండ్స్ దేశానికి సంబంధించి యూనివర్సిటీల ప్రతినిధులతో వీసీ ఆచార్య కంచర్ల గంగాధరరావు, రెక్టర్ ఆచార్య రామినేని శివరాం ప్రసాద్, రిజిస్టర్ ఆచార్య జి సింహాచలం చర్చించి వారిని స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సన్మానించారు. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు
తెనాలిరూరల్: తెనాలి–విజయవాడ ప్రధాన రహదారిపై నందివెలుగు సమీపంలో శనివారం ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం.. తెనాలి నుంచి మంగళగిరి వైపు కారు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసున్న మహిళ కారు నడుపుతూ వస్తుండగా వేగం అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. నేడు రాజధాని రైతులతో మాటామంతీ తాడేపల్లి రూరల్: రాజధాని రైతులతో మాటామంతీ కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఉండవల్లి గ్రామ అధ్యక్షుడు మున్నంగి శ్రీధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి రైస్‌మిల్లులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి, రైతు ఉద్యమ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌కుమార్, రిటైర్డ్ నీమ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ రామచంద్రయ్య, సామాజికవేత్త డాక్టర్ వసుంధర తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. కార్యక్రమానికి రాజధాని రైతులు, రైతులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. -
ఘనంగా రాధాష్టమి వేడుకలు
తాడేపల్లి రూరల్: ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న రాధా శ్యాంసుందర్ మందిరంలో శనివారం రాధాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి స్వామి వారికి ధూప, దీప, హారతులు, విశేష కీర్తనలు నిర్వహించారు. 9 గంటలకు భజనలు, కీర్తలు, అనంతరం శ్రీమాన్ పవనపుత్ర ప్రభు, శ్రీమాన్ చక్రధారి ప్రభు ప్రవచనం చేశారు. సాయంత్రం 5 గంటలకు మహాకీర్తనలు, 6 గంటలకు పంచామృతాలతో రాధాకృష్ణులకు మహా శంఖాభిషేకం నిర్వహించారు. చిన్నారుల భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. 7 గంటలకు ఇస్కాన్ బాలికలచే బృందావనంలో కృష్ణుడు గోప బాలురు, గోప బాలికలతో చేసిన లీలలను నాటక రూపంలో ప్రదర్శించారు. రాత్రి 8 గంటలకు శ్రీమాన్ బలరాం ప్రభు ప్రత్యేక ప్రవచనం జరిగింది. 108 రకాల పిండివంటలతో భోగా అర్పించి, భక్తులకు మహా ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను శ్యామసుందర్ అచ్యుత దాస పర్యవేక్షించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎలిమెంటరీ స్కూల్ కాంప్లెక్స్ తరగతులను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో శిక్షణ అంశాలపై చర్చించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి సూచనలు చేశారు. హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. తాడేపల్లి ఎంఈవో డి. నాగేశ్వరరావు, హెచ్ఎం భీమిరెడ్డి తాతిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నగరంపాలెం: వినాయక చవితిని పురస్కరించుకుని గుంటూరు నగరం కొరిటెపాడులో ఉన్న కల్యాణ రామాలయంలో వాయుపుత్ర కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మండపంలో శనివారం లడ్డూ వేలం నిర్వహించారు. వేలంలో లడ్డూను రూ.6,66,666లకు భక్తుడు రెడ్డిబత్తుల శ్రీనివాసరెడ్డి దక్కించుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వంగల పున్నారెడ్డి, వంగల సతీష్‌రెడ్డి, కత్తి సందీప్‌రెడ్డి, యేటిగడ్డ వెంకటరెడ్డి. కారసాని శ్రీనివాసరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: తాము 2016 నుంచి చేసిన పనికి న్యాయంగా రావాల్సిన జీతం బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్‌కాంత్ డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో గత నెల నుంచి అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ వైద్యులు ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. డాక్టర్ స్వరూప్‌కాంత్ మాట్లాడుతూ తమకు న్యాయంగా ఇవ్వాల్సిన జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఉషారాణి, డాక్టర్ కమల, డాక్టర్ సునీత, డాక్టర్ సుధా రాణి, డాక్టర్ దేవకుమార్, డాక్టర్ అజయ్, డాక్టర్ రామకృష్ణ గాజుల, డాక్టర్ రాజా, డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
గుంటూరు రూరల్: దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ఒక ఆటో, సెల్‌ఫోన్, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరు స్నేహితులు దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. స్వర్ణభారతీనగర్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారిలో వికాస్‌నగర్‌కు చెందిన ఉప్పుతల శ్రీకాంత్, స్వర్ణభారతీనగర్‌కు చెందిన ఓర్సు గోపీ పలు దోపిడీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఇరువురు కలిసి నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు నిందితులు ఇరువురు విచారణలో ఎస్వీఎన్ కాలనీ ఆర్చి ఎదురుగా ఉన్న పొలంలో ఒక వ్యక్తిని బెదిరించి అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్, రూ.9,000 చోరీ చేసినట్లు చెప్పారు. కేసును ఛేదించిన నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ భాస్కర్, ఎస్ఐ ఎ.మధుపవన్తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. చోరీలకు పాల్పడే ఇద్దరు మైనర్లు అరెస్ట్ ఇళ్లకు తాళాలు వేసిన ఇంటిపై రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడే ఇద్దరు బాలురను నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నగరంలోని సౌత్ సబ్‌డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పూర్ణచంద్రరావు నిందితుల వివరాలు వెల్లడించారు. పెద్దపలకలూరు జెండాచెట్టు సెంటర్, పట్టాభిపురం 2వ లైనుకు చెందిన ఇరువురు స్నేహితులు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకున్నారు. పలకలూరు రోడ్డులో అనుమానంగా తిరుగుతున్న ఇరువురిని అదుపులోకి తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. పోలీసుల విచారణలో నగరంలో, రూరల్ మండలంలో, నల్లపాడు, తురకపాలెం గ్రామం, ఎల్.వి.ఆర్. కాలనీలో తిరుగుతూ ఒక ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి చోరీకి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు. తురకపాలెం గ్రామం, ఎల్.వి.ఆర్. కాలనీలో ఒక ఇంటికి తాళం వేసి ఉన్న ఇంటిలో తాళాలు పగులగొట్టి వెండి పట్టీలు, నగదు తదితర వస్తువులు దొంగిలించినట్లు, రూ.80,000 నగదు చోరీ చేసినట్లు, నిందితులు ఒప్పుకున్నారన్నారు. అదే విధంగా పలు చోరీలకు పాల్పడినట్లు తెలపటంతో నిందితుల వద్ద నుంచి సుమారు రూ.2.5 లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. -
టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత
నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక, అరాచక పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జీఎంసీ పరిధిలోని మొత్తం 76 డివిజన్లలో వైఎస్సార్సీపీని విజయపథంలో నడిపించేందుకు విస్తృత కార్యాచరణ సిద్ధం చేసినట్లు అంబటి రాంబాబు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన సాయంత్రం అమరావతి రోడ్డులోని ‘ఏ1 కన్వెన్షన్ హాల్’లో భారీ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. ఈ భారీ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఉదయం జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, తాడికొండ సమన్వయకర్త డైమండ్ బాబు పరిశీలించారు. సభకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. బోగస్ ఓట్లుపై విచారణ చేయాలి జీఎంసీ పరిధిలో పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్పించారని అంబటి ఆధారాలతో వెల్లడించారు. గుంటూరు వెస్ట్‌లో దాదాపు 14 వేలు, ఈస్ట్‌లో 3 వేలకు పైగా డబుల్ ఓట్లు ఉన్నట్లు క్షేత్రస్థాయిలో గుర్తించామన్నారు. హైదరాబాద్‌లో నివసించే వారి పేర్లు, ఒకే డివిజన్లో ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు ఉన్న ఉదంతాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు సమగ్ర ఆధారాలతో జాబితా అందించామని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి బోగస్ ఓట్లను తొలగించాలని, లేనిపక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. అక్రమ కేసులు, వేధింపులకు భయపడం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిపై తప్పుడు చట్టాలు, పోలీసులను అడ్డంపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు చంద్రబాబు, లోకేష్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడో కేసులు పెట్టి వేధించినా భయపడే ప్రసక్తే లేదన్నారు. రానున్న ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినా, అక్రమాలకు ఒడిగట్టినా చూస్తూ ఊరుకోబోమని, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. మేయర్ రిజర్వేషన్లపై ఇప్పటినుంచే అనవసర రాద్ధాంతం అవసరం లేదని, ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే పార్టీ తరఫున నిర్ణయం తీసుకుంటామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 76 డివిజన్లలో గట్టి పోటీ ఇస్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నగరంలోని మొత్తం 76 డివిజన్లలో వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగి గట్టి పోటీ ఇస్తామని, ఎక్కడా కూటమి పార్టీలకు ఏకగ్రీవం చేసుకునే అవకాశం ఇవ్వబోమని వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని అంబటి మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాభివృద్ధి పాలనతో నేటి పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల విశ్వాసం చూరగొన్న, నిబద్ధత గల విధేయులైన అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పార్టీ ద్వారా పదవులు పొంది ఇతర పార్టీల్లోకి వెళ్లిన అవకాశవాదులను ప్రజలే తిరస్కరిస్తున్నారని తెలిపారు. -
సమస్యలకు సకాలంలో పరిష్కారం
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. శుక్రవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లల్లో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది నుంచి వ్యక్తిగత సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలు పరిపాలనా అంశాలకు సంబంధించి వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ప్రతి వినతిని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. శాఖ నిబంధనలకు అనుగుణంగా వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తాన్నామని అన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతులు, పరిపాలనా నిర్ణయాలతోపాటు ఇతరత్రా వాటిని పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావంతో వ్యవహరించాలని అన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా మెలుగుతూ పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం, భద్రతాభావం పెంపొందించాలని సూచించారు. -
నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ బైఠాయింపు
గుంటూరు రూరల్: న్యాయం చేయాలని కోరుతూ మహిళ నల్లపాడు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నల్లకుంటకు చెందిన తిరుపతి శివప్రసాద్ మిర్చియార్డులో వేమెన్గా పనిచేస్తుంటాడు. స్నేహితుడు చల్లా రాజేష్ వద్ద మూడు సవర్ల బంగారు గొలుసును తన అవసరాల నిమిత్తం తీసుకుని దానిపై అప్పు తెచ్చుకున్నాడు. అదే విధంగా సైదా అనే స్నేహితుడి వద్ద 32 బస్తాలు మిర్చిని తీసుకుని డబ్బు ఇవ్వటంలేదు. దీంతో గత ఏడాది క్రితం నల్లపాడు పోలీస్ స్టేషన్లో రాజేష్, సైదా ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ శివప్రసాద్‌ను పిలిచి బైండోవర్ రాసి, ఈనెల 15వ తేదీన డబ్బు చెల్లించే విధంగా సెటిల్మెంట్ చేశారు. ఈ నెల 15వ తేదీన శివప్రసాద్ డబ్బు చెల్లించకపోవటంతో రాజేష్, సైదా గురువారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో గతంలో జరిగిన విషయాన్ని తెలియజేసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శివప్రసాద్‌ను ఉదయం పిలిపించి బాధితులకు డబ్బు ఇచ్చి వెళ్లాలని స్టేషన్లో కూర్చోబెట్టారు. నల్లకుంటకు చెందిన శివప్రసాద్ సోదరి లక్ష్మీపార్వతి పోలీసులను నిలదీసింది. తమ్ముడిని వెంటనే బయటకు పంపాలని పోలీస్ స్టేషన్ బయట రోడ్డుపై బైఠాయించింది. గమనించిన పోలీసులు శివప్రసాద్‌ను బయటకు పంపి ఈ కేసును కోర్టులో తేల్చుకోవాలని పంపివేశారు. సివిల్ సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నించిన సీఐ, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీపార్వతి ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం. -
జిల్లా సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యం
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్.ఎన్.శంకరన్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) నిర్వహించారు. సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, గళ్లా మాధవి, తెనాలి శ్రావణ్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. అమరజీవి జలధార ప్రాజెక్టు రెండవ దశ పనులను శరవేగంగా పూర్తి చేయాలని, జల్ జీవన్ మిషన్ 2.0 పనులను వేగవంతం చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 50,527 మంది నూతన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రాథమికంగా 1,081 దరఖాస్తులను ఆమోదించినట్లు అధికారులు తెలిపారన్నారు. పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హౌస్ హోల్డ్ సర్వే సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. జిల్లాలో 13,657 మంది రైతుల నుంచి ఇప్పటివరకు 91,178 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, పొన్నూరు నియోజకవర్గంలో అత్యధికంగా సేకరణ జరిగిందని వెల్లడించారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. దీపం పథకం కింద ఐదు దశల్లో రూ.168 కోట్ల లబ్ధితో 20,25,565 మందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తూ కందుకూరి, ఉగాది కళారత్న, గుర్రం జాషువా, బోయి భీమన్న, గిడుగు రామమూర్తి పంతులు పేరిట పురస్కారాలను ఇస్తోందన్నారు. గుంటూరు జిల్లాను సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని ప్రతిబింబించేలా రాబోయే జనవరి నెలలో తెనాలి వేదికగా ‘నంది నాటకోత్సవాలు’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అనంతరం జిల్లా వార్షిక క్రెడిట్ ప్లాన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. రూ.55,015 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.55,015 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను లబ్ధిదారులకు అందించడంలో ప్రైవేట్ బ్యాంకులు వెనకబడటం గర్హనీయమని, ఇదే పద్ధతి కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రూ.18,974 కోట్లు లక్ష్యం కాగా, జూన్ మాసం చివరి నాటికి రూ.6,351 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎంఎస్ఎంఈలకు 15,996 కోట్లు లక్ష్యం కాగా, రూ.6,635... ఎక్స్పోర్ట్ క్రెడిట్‌కు రూ.58 కోట్లు లక్ష్యానికిగాను రూ.91 కోట్లు, విద్యా రుణాలకు రూ.210 కోట్లు లక్ష్యం కాగా, రూ.24 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. మొత్తంగా ప్రాధాన్యతా రంగానికి రూ.36,400 కోట్లు లక్ష్యం కాగా, రూ.13,234 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రాధాన్యేతర రంగానికి సంబంధించి రూ.18,615 కోట్లకుగాను రూ.6,321 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో యూబీఐ డీజీఎం హనుమంత్ రెడ్డి, ఆర్బీఐ అధికారి రవీంద్ర బాబు, నాబార్డ్ డీడీఎం శరత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సాయం చేయబోతే ప్రాణమే పోయింది
మిర్యాలగూడ అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు మానవత్వంతో స్పందించిన ఒక వ్యక్తిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దుప్పలపూడికి చెందిన పొలినేని శ్రీనివాసరావు(36), ఆయన భార్య అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో మిర్యాలగూడలోని అద్దంకి– నార్కట్‌పల్లి బైపాస్ నందిపాడు క్రాస్ రోడ్డు వద్ద హనుమాన్‌పేటకు చెందిన బొల్లెపల్లి వెంకటేశ్వర్లు బైక్ స్కిడ్ అయి రోడ్డుపై పడిపోయాడు. అతడిని గమనించిన శ్రీనివాసరావు తన కారును రోడ్డు పక్కకు నిలిపి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లోకి క్షతగాత్రుడిని ఎక్కిస్తున్న క్రమంలో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎల్పీజీ గ్యాస్ లారీ అతివేగంగా వచ్చి అప్పటికే రోడ్డుపై ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొట్టడంతో పాటు అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈక్రమంలో శ్రీనివాసరావుపై నుంచి లారీ వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అంబులెన్స్‌లో ఉన్న మహిళా సిబ్బంది చిట్యాల స్వప్నకు గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ చెన్నకేశవులును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ సోమనర్సయ్య తెలిపారు. మనకెందుకు నాన్న.. వెళ్లిపోదామని చెప్పినా వినలేదు ‘రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని చూసి మా నాన్న కారు ఆపారు. మనకెందుకు నాన్న, ఎవరైనా హెల్ప్ చేస్తారులే అని చెప్పినా వినలేదు’ అని శ్రీనివాసరావు 12 ఏళ్ల కుమారుడు కన్నీరుమున్నీరుగా రోధించాడు. మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు వెళ్లి కళ్లముందే లారీ కిందపడి మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నామని మృతుడి భార్య బోరున విలపించింది. ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయంలో ఈనెల 20వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్చరీ టీమ్(జూనియర్స్) ఎంపిక చేసేందుకు సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ట్రెజరర్ ఎం.బుజ్జిబాబు ఒక ప్రకటనతో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 44 వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ పోటీల్లో పాల్గొనే ఆర్చర్లు రూ.300 ఎంట్రీ ఫీజు అసోసియేషన్‌కు చెల్లించాలన్నారు. ఆర్చర్లు ప్రధానంగా 2006 జనవరి1 తరువాత జన్మించిన వారై ఉండాలని, ఆధార్ కారు, జనన ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాలని సూచించారు. అలానే జిల్లా అసోసియేషన్‌లో రిజిస్టరు చేయించుకోవాలని, 30వ ఇండియన్ రెండ్ కాంపౌండ్, 50 మీటర్లు, 70 మీటర్ల నందు పోటీలు జరుగుతాయని వివరించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీఈఏపీ సెట్–2026 పరీక్ష రాసి స్పోర్ట్స్ కోటా కింద అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 21వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగే ఈ స్కిల్ టెస్ట్‌లో ఫిజికల్ డైరెక్టర్, కోచ్‌లు హాజరై అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ టెస్ట్‌కు హాజరు కావాలని స్పష్టం చేశారు. -
జ్వరాల విజృంభణ
దోమల నియంత్రణ కోసం ఇంటి లోపల, బయట నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి నీటి నిల్వలు లేకుండా ఇళ్లలో ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలి. ఇంటి ఆవరణలో ఖాళీ కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు, పాత టైర్లు, రోళ్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఎయిర్ కూలర్లలో, పూల కుండీలలో నీటిని మూడు రోజులకు ఒకసారి మార్చాలి. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు మూతలు బిగించాలి. వారానికి ఒకసారి నీటి గుంతలలో కిరోసిన్, మడ్డి ఆయిల్ చల్లించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల బారిన పడకుండా దోమ తెరలు తప్పనిసరిగా వాడాలి. శాఖాపరంగా జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. –డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ వైద్య రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న గుంటూరు జిల్లాలో ప్రజలు చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో జ్వరాలతో అల్లాడిపోతున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా జ్వరాల కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఆసుపత్రులకు రోగులు పరుగులు తీస్తున్నారు. చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడం, కాల్వల్లో మురుగు నీరు పారకపోవడంతో దోమలు వృద్ధి చెంది ప్రజలను జ్వరాల బారినపడుతున్నారు. పారిశుద్ధ్యం మెరుగు, ముందస్తుగా అవగాహన కల్పన, ప్రాథమిక దశలోనే వ్యాధుల తీవ్రత గుర్తించి కట్టడి చేయాల్సిన యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ చూసే విభాగాలు, వైద్య ఆరోగ్యశాఖ మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలూ ఈ పరిస్థితికి ఓ కారణంగా ఉన్నాయి. చికిత్స కోసం ప్రజలు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. డెంగీ జ్వరాలు సోకిన వారికి రూ.లక్షల్లోనే బిల్లులు అవుతున్నాయి. ప్లేట్లెట్ల పేరిట ప్రైవేట్ ఆసుపత్రుల వారిని పీల్చి పిప్పిచేస్తున్నాయి. జిల్లాలో కేసుల వివరాలు... ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పదేళ్ల శ్రీకాంత్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు రోజులకు రూ.10 వేలు బిల్లు వేయడంతో రోజువారీ పనులు చేసుకుంటున్న శ్రీకాంత్ తండ్రి ఒక్కసారిగా కంగుతిన్నాడు. గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు వచ్చి చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. జిల్లాలో వైద్య అధికారుల గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఇప్పటి వరకు 12 వేల జ్వరాల కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా వీటి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మలేరియా 6, డెంగీ 56, చికున్‌గున్యా 5 కేసులు నమోదయ్యాయి. కుటుంబం మొత్తం జ్వరాలతో అల్లాడుతున్నప్పటికీ వైద్య సిబ్బంది సదరు గృహాలను సందర్శించి జ్వరాల తీవ్రత నిర్ధారించేందుకు పరీక్షలు చేయడంగానీ, వివరాలు తీసుక్వోడంగానీ మానేశారు. ప్రజలు వైద్య పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రాలకు వెళుతుంటే అక్కడ అరకొర సేవలు అందుబాటులో ఉంటున్నాయి. వైద్యులు నిర్ణీత పనివేళల్లో ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం లేదు. సిబ్బంది కూడా మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. అన్నిరకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు పలు ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేవు. మందులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. రోజుల తరబడి ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. గత్యంతరం లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. -
కిడ్నాప్ చేశాక బాలికకు చిత్రహింసలు
లక్ష్మీపురం: గుంటూరు నగరంలో మైనర్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన రబ్బానీ అసలు నైజం తాజాగా వెలుగులోకి వచ్చింది. తొలుత ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని, ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బాలికను బెదిరించినట్లు వెల్లడైంది. నమ్మించి కిడ్నాప్ చేశాక ఆమెను చిత్రహింసలు పెట్టినట్లు తేలింది. ఆమె తెచ్చిన 230 బంగారం కాజేయడానికి ఆమెను వేధించినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. సేకరించిన సమాచారం మేరకు... పర్చూరు వద్ద దగ్గుపాడుకు చెందిన షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అలియాస్ పండుకు తల్లి, సోదరి ఉన్నారు. ఎక్కువగా జులాయిగా తిరుగుతూ ఉండే అతడు రెండు సంవత్సరాల క్రితం గుంటూరు నగరానికి చెందిన ఓ మైనర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకున్నాడు. స్నేహం నటించాడు. ఎలాగైనా బాలికను లొంగదీసుకునేందుకు తల్లి, సోదరితో కలిసి పథకం వేశాడు. వీడియో కాల్ చేసి ప్రేమించని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఓ గ్లాసులో ఉంచిన ద్రావణం తాగాడు. రబ్బానీ తల్లి, సోదరి వెంటనే వీడియో కాల్లోకి వచ్చి బాలికపై ఒత్తిడి చేశారు. ప్రేమిస్తున్నానని చెప్పకపోతే రబ్బానీ చనిపోతాడని భయపెట్టారు. నగదు, నగలతో మకాం మారుస్తూ... అనంతరం ఆమెను మాయమాటలతో ట్రాప్ చేసి జూన్ 9న రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటి నుంచి తీసుకెళ్లాడు. సుమారు 230 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.లక్ష కూడా ఆమె తీసుకొచ్చేలా చూశాడు. తొలుత నెల్లూరు తదితర ప్రాంతాల్లో తిరిగాడు. అదే రోజు రాత్రి బాలిక తండ్రి పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ పోలీసులు దర్యాప్తు చేయలేదు. ఈ నేపథ్యంలో బాలికతో రబ్బానీ హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. అక్కడ రబ్బానీ మేనత్త వద్దకు వెళ్లినట్లు తెలిసింది. ఆమె భర్త గతంలో మృతి చెందాడు. ఇప్పుడు ఓ ఆశ్రమంలో పని చేస్తోంది. రబ్బానీతో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బాలిక విషయం గురించి తనకు పూర్తిగా తెలియదని, రబ్బానీ వద్ద ఎప్పుడూ కత్తి ఉంచుకుని భయపెడుతూ ఉండేవాడని చెప్పింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే బంగారం విక్రయించాడని తేలింది. తర్వాత బాలికతో పలు నగరాల్లో తిరిగాక హరియాణాలోని కర్నాల్ అనే ప్రాంతానికి రబ్బానీ వెళ్లాడు. అక్కడ మూడు ద్విచక్ర వాహనాలు, ఇల్లు అద్దెకు తీసుకుని ఫర్నీచర్ కొనుగోలు చేశాడు. హోటల్లో చిత్రహింసలు.. బాలికను అంతకుముందే బెంగళూరు తీసుకెళ్లినప్పుడు ఓ హోటల్లో సుమారు నాలుగు రోజుల పాటు చిత్ర హింసలు పెట్టాడని పోలీసులు నిర్ధారించారు. బంగారం గురించి పోలీసులు అడిగితే బెంగళూరు పబ్లిక్ టాయిలెట్లో పెడితే కనిపించకుండా పోయాయని చెప్పాలని బెదిరించినట్లు కుటుంబ సభ్యుల ముందు బాలిక కన్నీరుమున్నీరుగా విలపించిందని తెలిసింది. ఆ వేధింపులు తాళలేక బాలిక ఆగస్టు 29వ తేదీన ఇన్‌స్టా నుంచి కుటుంబ సభ్యులకు కాల్ చేయగా వారు సెప్టెంబర్ ఒకటిన దానిని చూశారు. అప్పటికే ఆగస్టు 29న హైకోర్టును వారు ఆశ్రయించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆరా తీయగా హరియాణాలోని కర్నల్ అనే ప్రాంతంలో ఉంటున్నట్లు సమాచారం వచ్చింది. పోలీసులు రబ్బానీని అదుపులో తీసుకుని, బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అరెస్టు అనంతరం రబ్బానీ, అతడి తల్లి, సోదరిని కూడా రిమాండ్‌కు తలించారు. విక్రయించిన బంగారం రికవరీ కోసం పట్టాభిపురం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సీజ్ చేసిన మూడు ద్విచక్ర వాహనాలు, ఫర్నీచర్‌ను గుంటూరుకు తీసుకురావాలా? లేక సీజ్ చేసి అక్కడే ఉంచాలా? అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. -
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థను సందర్శించిన కమిషనర్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న శుక్రవారం సందర్శించారు. విపత్తుల నిర్వహణ సంస్థ పనితీరు, అత్యవసర సమయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు, వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర అత్యవసర నిర్వహణ కేంద్రం నుంచి తుఫాన్లు, వరదలు, పిడుగుపాట్లు తదితర విపత్తులను అంచనా వేయడం, క్షేత్రస్థాయిలో ముందస్తుగా హెచ్చరికలను ఏ విధంగా పంపుతారో విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో ఆయనకు వివరించారు. అనంతరం కమిషనర్ ఆదెన్న మాట్లాడుతూ విపత్తు హెచ్చరికలు, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన కీలక వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మాధ్యమాలు, అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతోందని తెలిపారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఏఓ రవిబాబు, ఎన్ఈఓసి ఇన్‌ఛార్జి పీటర్, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 23న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్‌లో గుంటూరు జిల్లా అథ్లెటిక్ ఎంపికలు అండర్ –14, 16, 18, 20 బాలబాలికలు విభాగంలో జరుగుతాయని జిల్లా సంఘం కార్యదర్శి జీ వీ.ఎస్. ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు ఆదోనిలో జరిగే ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వయసు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు తీసుకొని ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్ లో రిపోర్ట్ చేయాలని కోరారు. పొగాకు బోర్డు ఈడీకి రైతు సంఘాల వినతి లక్ష్మీపురం: వర్జీనియా పొగాకు రైతుల వద్ద మిగిలిన సరుకును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. శుక్రవారం భారత పొగాకు బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు విశ్వశ్రీని కలిసి వినతిపత్రం అందజేశారు. మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 30 శాతం ఎఫ్‌సీవీ పొగాకు రైతులు తక్కువ ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించుకోవాల్సి వస్తోందని తెలిపారు. మిగిలిన పొగాకును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల ఆర్థిక సాయాన్ని వాస్తవ సాగుదారులైన ఎఫ్‌సీవీ రైతులకు ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని ఈడీని కోరారు. సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు ఈడీ తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డె హనుమారెడ్డి, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీవీ జగన్నాథం, రైతు కూలీ సంఘం నాయకులు పరిటాల కోటేశ్వరరావు, అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె.హనుమంతరావు, కనపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి రూరల్: మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ (డబ్లూఎపీఎల్–2026) టోర్నమెంట్ ప్రారంభం కానున్నది. ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా నారా బ్రాహ్మణి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాయలసీమ జెన్ స్టార్ జట్టుకు, గోదావరి గోల్డెన్ ఈగల్ జుట్టు మధ్య మ్యాచ్ జరుగనుంది. సాయంత్రం 6.30 గంటలకు వైజాగ్ ఫైబర్స్ జట్టు, అమరావతి జాబ్స్ జట్టు మధ్య మ్యాచ్ జరగనుంది. -
మెనూ ప్రకారం ఆహారం అందించాలి
గుంటూరు వెస్ట్: మెనూ ప్రకారం వసతి గృహాలు, అంగన్వాడీ, పాఠశాల విద్యార్థులకు ఆహారం అందాలని జిల్లా కలెక్టర్ ిసీఎం సాయికాంత్ వర్మ సిబ్బందిని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలులో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ లేదని స్పష్టం చేశారు. గుడ్లు నాణ్యమైనవిగా ఉండాలని, పాడైన గుడ్లు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి సమాచారం అందించాలన్నారు. అన్న క్యాంటీన్లలో సైతం ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పురపాలక సంఘాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, పూడికలు తీయడంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులకు రూపొందించిన యాప్‌లలో సమాచారాన్ని పొందుపరచాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఆర్వో ఎన్.ఎస్.కె. ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, సీపీఓ పి.శేషశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె.విజయలక్ష్మి పాల్గొన్నారు. పింఛనుకు 56,867 దరఖాస్తులు నెహ్రూనగర్: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల నుంచి మొత్తం 56,867 దరఖాస్తులు అందాయి. ఇందులో ఇప్పటివరకు 9,305 అర్జీలను అధికారులు పరిశీలించి ఆమోదించారు. అర్హత ప్రమాణాలు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో 632 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 46,930 దరఖాస్తులు పరిశీలన దశలో పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ నగరంపాలెం: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కోరుకుంటున్న మధ్యంతర భృతి, కరువు భత్యం బకాయిలు ఇతరత్రా సమస్యల పరిష్కారానికై దశల వారీగా కృషి చేస్తానని ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం గుంటూరు తాలుకా కార్యాలయ ఆవరణలోని పెన్షన్ హోమ్‌లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి ఆధ్వర్యంలో ఏపీజేఏసీ రాష్ట్ర నాయకుల అభినందన సభ, రాష్ట్ర విస్తృత కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అసోసియేషన్ సుదీర్ఘకాలంగా కోరుతున్న అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు సీఎం అంగీకరించడంపై ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. దీనికై సహకరించిన ఏపీజేఏసీ రాష్ట్ర నాయకత్వంలో ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ఏపీజేఎసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణను సత్కరించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగ్గా, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుతో ఈనెల 29, 30 తేదీల్లో అన్ని జిల్లాల్లో జరిగే ధర్నా విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఎన్.కుమార్‌రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టేట్ సెక్రటరీ జనరల్ జి.ప్రభుదాస్, రాష్ట్ర కోశాధికారి ఎన్వీ.సుబ్బరాయుడు, సీనియర్ రాష్ట్ర నాయకులు అబ్దుల్కరీం, దాలి నాయుడు, పెద్దన్న గౌడ్ పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: ఏపీ ఎన్జీవో హోంలో ఏపీఎన్జీ జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి.రమణలను సన్మానించారు. అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
పేలుడు పదార్థాల రవాణా కేసులో నిందితుడికి రిమాండ్
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని 12వ స్వర్ణ వార్డు సచివాలయ శానిటేషన్ సెక్రటరీ కోటగిరి లక్ష్మీప్రసన్న (34) బుధవారం మృతి చెందింది. పట్టణంలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మీప్రసన్నకు పిల్లలు లేకపోవడంతో రొటీన్ చెకప్‌లో భాగంగా గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలను మంగళవారం వెళ్లింది. ఈ క్రమంలో ఆమె గర్భసంచిలో తిత్తులు తొలగించేందుకు సర్జరీ చేయాలని వైద్యులు నిర్ధారించారు. బుధవారం ఆమెకు వైద్యశాలలో వైద్యులు మత్తు ఇవ్వగా, డోస్ అధికం కావడంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. భర్త బెల్లంకొండ భార్గవ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్స్ వ్యవహారాలు చూస్తుంటారు. గురువారం లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ బి. మధుసూదనరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ విజయసారథి, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను రవాణా కేసులో నిందితుడైన వెంకట రామాంజనేయులును కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ జె.మురళీకృష్ణ తెలిపారు. భవనాలు కూల్చేవే.. అలుగు లక్ష్మీనారాయణ పాత భవనాలు కూల్చడం, స్లాబులు పగలగొట్టడం, పునాదులు తీయడం వంటి పనులు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని తమ్ముడు సాయి, మేనల్లుడు గుంజా వెంకట రామాంజనేయులు అతని వద్దే పనిచేస్తుంటారు. రామాంజనేయులు వడ్డేశ్వరంలో ఉంటుండగా, సాయి పెనమలూరు మండలం కానూరులోని మురళీనగర్‌లో ఉంటున్నాడు. భవనాల తొలగింపు పనుల్లో అవసరమైనప్పుడు జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వాడుతుంటారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని లక్ష్మీనారాయణ, రామాంజనేయులు స్వగ్రామానికి వెళ్లారు. కుంట గ్రామంలో లక్ష్మీనారాయణ జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కొనుగోలు చేశాడు. వాటిని బ్యాగ్‌లో పెట్టి సాయికి ఇవ్వాలని వీరాంజనేయులుకు ఇచ్చి వేరే పని మీద వెళ్లిపోయాడు. ఈ నెల 14వ తేదీన అతను శ్రీశైలం నుంచి విజయవాడ బస్సు ఎక్కాడు. అదేరోజు రాత్రి 10గంటల సమయంలో వారధి వద్ద దిగే తొందరలో మరో బ్యాగ్ తీసుకుని బస్సు దిగాడు. అంతటా అతను మురళీనగర్‌లో ఉంటున్న సాయి వద్దకు చేరుకుని బ్యాగ్ తెరిచి చూడగా దుస్తులు ఉన్నాయి. బ్యాగ్ మారిపోయిందని నిర్ధారించుకుని వడ్డేశ్వరంలోని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలు ఉన్న ఒక్క బ్యాగ్ లభించిందని కలకలం రేగింది. పోలీసులు బస్సులో పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయం తెలుసుకున్న రామాంజనేయులు బుధవారం స్టేషన్లో లొంగిపోయాడు. ప్రత్యేక బృందాలతో గాలింపు.. గురువారం రామాంజనేయులును అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు లక్ష్మీనారాయణ, సాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
దళితులంటే అంత చిన్న చూపా!
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): దళితులంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు.. కూటమి ప్రభుత్వం ఉన్నది కేవలం కమ్మ, కాపుల కోసమేనా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. దళిత యువకుడు చీకటి గోపి మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన సీఐ, ఎస్ఐ, స్టేషన్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్, వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ, దళిత, గిరిజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. కృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కమ్మ, కాపులకు ఉన్న విలువ దళితులకు లేదని విమర్శించారు. పోలీసుల దారుణాలకు సాయికృష్ణ, చీకటి గోపి బలయ్యారని అన్నారు. సాయికృష్ణపై 22 కేసులు ఉన్నాయని చెప్పారు. చీకటి గోపిపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్నారు. కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణ కోసం చంద్రబాబు ఆగమేఘాల మీద సిట్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సాయికృష్ణ సిట్ వ్యవహారంలో దళిత బిడ్డ హోం మంత్రి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కాపులు, కమ్మ సామాజిక వర్గాల ఓట్లతోనే అధికారంలోకి రాలేదని, మాల, మాదిగల ఓట్లతో గద్దెనెక్కారన్న విషయాన్ని మరిచారన్నారు. చీకటి గోపి నిజానికి జనసేన పార్టీ గ్రామ కార్యదర్శిగా ఉన్నాడన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ మరిచినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు సుమారు 25 మంది దళిత యువకులు మృతి చెందారని, కనీసం వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదని విమర్శించారు. కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు వర్గపోరులో హత్యలు చేసుకుంటే వారిని పరామర్శించేందుకు మంత్రులు, చంద్రబాబు పార్టీ నాయకులు అధికారులు వెళ్లి వారికి పొలాలు, స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. చీకటి గోపి వ్యవహారంలో తక్షణమే సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే ఉద్యమం రాజధానినే అతలాకుతలం చేసే స్థాయికి చేరుతుందన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు) మాట్లాడుతూ చీకటి గోపి మృతి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఏం జరిగిందనే విషయాల్ని తేటతెల్లం చేయలేకపోయారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గోపి మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటి వరకు పోలీస్ అధికారులు, హోం మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పాల్గొన్నారు. -
భగవాన్ విశ్వకర్మ జయంతి
నగరంపాలెం: భగవాన్ విశ్వకర్మను దైవిక శిల్పి, వాస్తుశిల్పి, సృష్టి నిర్మాణకర్తగా పూజిస్తారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గురువారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో విశ్వకర్మ జయంతి(విశ్వకర్మ పూజ) వేడుకలు జరిగాయి. తొలుత భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాల వేయగా, పోలీస్ అధికార, సిబ్బందితో ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ(పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు అళహరి శ్రీనివాస్ (ఎస్బీ), సంకురయ్య(ఏఆర్), ఆర్ఐలు శ్రీహరిరెడ్డి కృష్ణయ్య పాల్గొన్నారు. జెడ్పీలో విశ్వకర్మ జయంతి గుంటూరు ఎడ్యుకేషన్ దేవతల వాస్తుశిల్పి, సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని గురువారం సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి జెడ్పీ డెప్యూటీ సీఈలో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పూలమాల వేసి నివాళులర్పించారు. -
అక్రమ విద్యుత్ వినియోగంపై కొరడా
కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం డీ–3 గుంటూరు సెక్షన్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 53 మంది అధికారులు, 146 మంది సిబ్బంది 53 బృందాలుగా ఏర్పడి మొత్తం 4,212 విద్యుత్ సర్వీసలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఐదుగురు మీటర్లు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తించి రూ.75 వేలు, మరో ముగ్గురు అనుమతించిన కేటగిరీకి భిన్నంగా విద్యుత్ వినియోగించడంతో రూ.60 వేలు జరిమానా విధించారు. అనుమతించిన లోడ్‌కు మించి విద్యుత్ వినియోగిస్తున్న 233 మందిపై రూ.12.62 లక్షల అపరాధ రుసుం విధించారు. మొత్తంగా రూ.13.97 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ చౌర్యం, అక్రమ వినియోగంపై తనిఖీలు కొనసాగుతాయని అధికారులు వివరించారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, గుంటూరు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పఠాన్ హుస్సేన్ ఖాన్, డీఈఈలు షేక్ ముస్తాక్ అహ్మద్, ఎన్.మల్లికార్జునప్రసాద్, కె.రవికుమార్, ఏఈలు ఎం.చంద్రశేఖర్, యు.శివశంకర్, ఎం.సతీష్ కుమార్ పాల్గొన్నారు. బదిలీ చేయిస్తానని మోసం తెనాలిరూరల్: ఉద్యోగం బదిలీ చేయిస్తానని డబ్బు తీసుకుని మోసం చేయడంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన నాగిడి శ్రీనివాసరావు విద్యుత్ శాఖలో కాకుమాను సెక్షన్లో లైన్ మ్యాన్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం కుటుంబంతో కలసి దుగ్గిరాలలో నివసిస్తున్నాడు. తన భార్య అనారోగ్యం కారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు శెలవు తీసుకోవాల్సివచ్చింది. దుగ్గిరాలకు దగ్గరగా ఉన్న ప్రదేశానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరాడు. ప్రస్తుతం కుదరదని చెప్పారు. విద్యుత్ ఈఈ వద్ద డ్రైవరుగా పని చేసే దినేష్రూ. 50 వేలు ఇస్తే బదిలీ చేయిస్తానని చెప్పాడు. నమ్మిన శ్రీనివాసరావు రూ.25 వేలు ఫోన్‌పే చేశాడు. దుగ్గిరాలకే బదిలీ చేయించానని బదిలీ ఉత్తర్వు కాపీని దినేష్ శ్రీనివాసరావు వాట్సాప్‌కు పంపాడు. అనుమానం వచ్చి అధికారులను ఆశ్రయించగా నకిలీదని తేలింది. త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించగా కేసు గురువారం నమోదు చేశారు. క్వారీ బ్లాస్టింగ్.. ఒకరికి గాయలుఫిరంగిపురం: మండల కేంద్రంలోని తాగునీటి కోనేరు సమీపంలో ఉన్న కొండక్వారీ గురువారం ఉదయం బ్లాస్టింగ్ నిర్వహించారు. పేలుడుధాటికి రాళ్లు సమీపంలోని రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో క్లారీ బ్లాస్టింగ్ నిర్వహించే పనులు పర్యవేక్షిస్తున్న లీజు దారుడు మాగేష్కు ఓ రాయి వచ్చి తలకు తగిలింది. దీంతో గాయం కావడంతో అతడిని కార్మికులు వాహనంలో చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. ఎటువంటి ప్రమాదం లేదని కార్మికులు చెబుతున్నారు. రోడ్డుపై పడుతున్న రాళ్లు.. క్వారీ వద్ద ప్రతిరోజు రెండు లేక మూడు సార్లు బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫిరంగిపురం నుంచి చిలుకలూరిపేట వెళ్లే రహదారి కావడంతో అనేక వాహనాలు ఆమార్గంలో ప్రయాణిస్తుంటాయి. బ్లాస్టింగ్ సమయంలో 30 నుంచి 40 నిమిషాలు వరకు వాహనాలు నిలిపివేస్తుంటారని వాహనదారులు చెబుతున్నారు. ఓ స్టోన్ క్రషర్కు చెందిన వ్యక్తి నుంచి కర్ణాటకకు చెందిన మాగేష్ సబ్ లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్లాస్టింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాహన దారులు, ప్రయాణికులు కోరుతున్నారు. బాలికపై లైంగిక దాడి, కిడ్నాప్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు గుంటూరు లీగల్: బాలికపై లైంగిక దాడి, కిడ్నాప్‌కు సంబంధించిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి షమీ పర్విన్ సుల్తానా బేగం గురువారం తీర్పు వెలువరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన మిరియాల జైరావు (28)పై బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కేసును విచారించిన అనంతరం నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి జీవిత ఖైదు, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి నష్టపరిహారంగా ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షలు చెల్లించే విధంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. పిడుగురాళ్ల: పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు కెనాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పందిటివారిపాలెం గ్రామానికి చెందిన అంచూరి లింగారెడ్డి (48) వినాయకుని నిమజ్జనం సమయంలో జూలకల్లు వెళ్లారు. బుధవారం రాత్రి సమయంలో నిమజ్జనం వేళ కాలు జారి కెనాల్లో పడ్డాడు. వెంటనే పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు పోలీసు బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. లింగారెడ్డి మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు. -
అంతర్జాతీయ స్థాయి విద్యే వీవీఐటీయూ లక్ష్యం
చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పెదకాకాని: అందరికీ అంతర్జాతీయ స్థాయి విద్య, రేపటి ప్రపంచానికి నైపుణ్యం గల యువతను అందించడమే వీవీఐటీ విశ్వవిద్యాలయం ముఖ్య ఉద్దేశమని వర్సిటీ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పేర్కొన్నారు. నంబూరులోని సంస్థలో నిర్వహించిన 2026–27 విద్యాసంవత్సరపు మొదటి ఏడాది విద్యార్థుల తరగతుల ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈఏపీసెట్‌లో టాప్ ర్యాంకర్లుగా నిలిచి, విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించిందని, మాపై వారికున్న నమ్మకం మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. విశ్వవిద్యాలయంలోని మౌలిక వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం ద్వారా విద్యార్థులు ఉపాధి కల్పనకు అవసరమైన మెరుగైన నైపుణ్యాలను సంపాదించుకోవచ్చన్నారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, కార్పొరేట్ రిలేషన్స్ డైరెక్టర్ మామిళ్లపల్లి శ్రీకృష్ణ, ప్రో–చాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్, సీఎఫ్ఏఓ సూర్యదేవర బదరీప్రసాద్, రిజిస్ట్రార్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, డీన్ ఫ్రేష్మన్ ఎంవీ రఘురామ్, డీన్ ఏఎస్‌బీ సిహెచ్.ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు
గుంటూరు వెస్ట్: జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, మెరుగైన ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేసేందుకు అధికారులు, శిక్షణ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్యే గళ్ల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్కుమార్లతో కలసి స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ జనరేషన్‌పై అధికారులు, నైపుణ్య శిక్షణ నిర్వాహకులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గుంటూరు జిల్లాకు నిర్దేశించిన 9,000 మంది యువతను నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేసే లక్ష్యాన్ని సమర్థంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హత కలిగిన యువతకు ఈ కార్యక్రమం ద్వారా లభించే శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గుంటూరు పార్లమెంట్‌తోపాటు పల్నాడు, బాపట్ల, ప్రకాశం తదితర సమీప ప్రాంతాల నిరుద్యోగ యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల మొదటి వారంలో శిక్షణ జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యం మేరకు అక్టోబర్ మొదటి వారంలో మొదటి విడత శిక్షణ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల స్థాయిలో రిజిస్ట్రేషన్ క్యాంపులు నిర్వహించి అర్హులైన నిరుద్యోగ యువతను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి అభినవ్, జిల్లా నైపుణ్య శాఖ అధికారి సంజీవరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని -
‘శ్రీ చక్ర’ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
లక్ష్మీపురం: పల్నాడు జిల్లాలోని శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమను కాపాడాలని, అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ ఫెడరేషన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగంభవన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని శ్రీ చక్ర సిమెంట్ పరిశ్రమ ఆక్రమంగా లాకౌట్ ప్రకటించడంతో దశాబ్దాలుగా పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిపై అనేక దఫాలుగా యాజమాన్యం, కార్మిక శాఖతో చర్చలు జరిగాయని, కానీ యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేసేలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. సిమెంట్ పరిశ్రమలకు వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మోహన్ రావు మాట్లాడుతూ శ్రీ చక్ర సిమెంట్ యాజమాన్య వైఖరిపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. యాజమాన్య ఆర్థిక అక్రమ లావాదేవీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల అంజిబాబు, మేడా హనుమంతరావు, శ్రీ చక్ర సిమెంట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్కే గాలిబ్, ఐ.అంజయ్య, ఎన్.వెంకట్రావు, జి.వెంకటేశ్వర్లు, కేపీ శ్రీను, డి.సైదులు, ఓ.బాలరాజు, ఓ.రాజారావు పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య డిమాండ్ -
నేడు వీఆర్ఏల సమస్యలపై సామూహిక రాయబార కార్యక్రమం
● అప్పటికీ పరిష్కరించకపోతే సమ్మె చేయటానికి సిద్ధం ● సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బందకి సాహెబ్ మంగళగిరి రూరల్: వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి సాముహిక రాయబార కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నుట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు బందకి సాహెబ్ తెలిపారు. మండల పరిధి చినకాకాని గ్రామం నేతన్న సర్కిల్ వద్ద గురువారం వీఆర్ఏలు నిరాహార దీక్ష చేపట్టారు. బందకి సాహెబ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. నెలకు రూ.11 వేల నుంచి రూ.11,500 మాత్రమే వేతనం అందుతోందని చెప్పారు. తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో మదనపల్లిలో రెవెన్యూ ఆఫీస్‌లో ఫైల్స్ తగలబడితే అప్పటి నుంచి మమల్ని నిబంధనలకు విరుద్ధంగా రాత్రి విధులు నిర్వహింపజేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు టీఏ, డీఏ, రక్షణ సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15–16 ఏళ్లుగా ప్రమోషన్లు లేక వీఆర్ఏలు ఇబ్బందులు పడుతున్నారని, అర్హులందరికీ వన్న్టైమ్ సెటిల్మెంట్ ద్వారా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సీసీఎల్ఏ అధికారితో సామూహికంగా రాయబారం నిర్వహించి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
అక్టోబర్ 11 నుంచి ఉత్సవాలు
లక్ష్మీపురం(గుంటూరుఈస్ట్): ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యులను, పొరుగు వారిని స్వచ్ఛతా ప్రచారంలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని, తద్వారా వారు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను నిర్వహించడానికి దోహదపడాలని డీఆర్ఎం సుధేష్ణ సేన్ అన్నారు. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ‘స్వచ్ఛతా హి సేవ–స్వచ్ఛతా పక్షోత్సవం–2026’ ప్రచారంలో భాగంగా గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హి సేవ–స్వచ్ఛతా పక్షత్సవం కార్యక్రమంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యాలయ ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది శ్రమదానం చేసి సుమారు ఆరు టన్నుల చెత్తను తొలగించారు. డీఆర్ఎం మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవా–స్వచ్ఛతా పక్షోత్సవం–2026 ప్రచారం అక్టోబర్ 10వ తేదీ వరకు డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో డివిజన్ సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
22న ఓటర్ల జాబితా.. రిజర్వేషన్లపై ఉత్కంఠ
76కు చేరిన డివిజన్లు స్పష్టమైన సరిహద్దులు నగరంలో 57 నుంచి 76కు పెరిగిన డివిజన్లు సరిహద్దులు, డోర్ నంబర్లతో తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఈ నెల 22న ఫొటో ఎలక్టోరల్ జాబితాల ప్రచురణ మేయర్, కార్పొరేటర్ల స్థానాల రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ -
ప్రజలకు మళ్లీ ‘నివాస’ కష్టాలు
● రెసిడెన్స్ సర్టిఫికెట్ల జారీని పునరుద్ధరిస్తూ జీఓ జారీ ● తహసీల్దార్ల ద్వారా మంజూరుకు ఉత్తర్వులు ● 2015లో జీఓ 581తో రెసిడెన్స్ సర్టిఫికెట్ల మంజూరు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ● తాజాగా ఇప్పుడు పునరుద్ధరిస్తూ జీఓ 592 జారీచేసిన వైనం ● మళ్లీ జనం నెత్తిన కొత్త తిప్పలు, పాత కష్టాలు యూటర్న్‌తో జనానికి తిప్పలు మళ్లీ రెవెన్యూ కార్యాలయాల బాట -
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం
● జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ● ప్రతి అర్జీని పరిష్కరిస్తాం ● పరిష్కరించలేవి ఉంటే ఫిర్యాదుదారులకు వివరిస్తాం ● ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి కొల్లిపర: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఒక నెల– ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. గురువారం కొల్లిపరలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలోనే నెలకు నాలుగు సార్లు అధికారులు సందర్శించడం వలన ప్రజలు స్థానికంగానే అర్జీల పరిష్కారం వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రజల అర్జీలకు వారి సమక్షంలోనే నాణ్యమైన పరిష్కారం కూడా లభిస్తుందన్నారు. మున్నంగి గ్రామానికి చెందిన బొంతు అశోక్‌రెడ్డితో పాటు కొంత మంది కొల్లిపర వయా తెనాలి, హైదరాబాదు ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సు సరిగా లేదని దాని కాలపరిమితి ముగిసిపోయిందని, ఆ బస్సు మార్చాలని కోరారు. కొల్లిపరలో రజకులకు చెందిన స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకుని ఉన్నారని ఆ స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం జరగకుండా ఆక్రమించుకున్నవారు అడుపతున్నారని ఈ విషయం తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదుని కొల్లిపర రజక సంఘం నాయకుడు వెంకటేశ్వరరావు కలెక్టర్ వివరించాడు. కలెక్టర్ స్పందించి తహసీల్దార్‌ను స్వయంగా వెళ్లి పరిశీలించి సమస్య పరిష్కరించాలని, లేదా తగు నివేదిక అందించాలని ఆదేశించారు. ప్రజల వద్ద నుంచి 78 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసిన ప్రదర్శన, విక్రయాలను జిల్లా కలెక్టర్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీరమణి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఆర్టీఓ కె శ్రీహరి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జె పార్థసారథి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్.రమేష్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు పి.సత్యనారాయణ, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, తహసీల్దార్ సిద్ధార్థ, ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం దైవాధీనం!
జీజీహెచ్‌లో ఉద్యోగాలకు ఏడాదిగా ఎదురు చూపులు ● ఉద్యోగ నియామకాలపై కిమ్మనని జీజీహెచ్ అధికారులు ● ‘సాక్షి’ కథనంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో మెరిట్ లిస్టు ప్రకటన ● అప్పటి నుంచి పోస్టింగులు ఇవ్వని వైనం ● ఏడాది దాటితే నోటిఫికేషన్ మారిపోతుందని దరఖాస్తుదారుల ఆందోళన ● గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్ అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం సుమారు రూ.6 కోట్ల ఐపీతో దిగుమతి వ్యాపారులకు నోటీసులు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డులోని వ్యాపార వర్గాల్లో ఐపీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మిర్చి వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొన్నట్లు చెబుతున్న ఓ ఎగుమతి వ్యాపారి తాజాగా రూ.6 కోట్ల మేర ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. ఐపీ ప్రక్రియలో భాగంగా తనతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సుమారు 64 మంది మిర్చి దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. యార్డులో మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారం నిత్యం కోట్ల రూపాయల్లోనే లావాదేవీలు జరుగుతుంటాయి. దిగుమతి వ్యాపారుల నుంచి ఎగుమతి వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ అనంతరం విదేశీ మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య సరుకు సరఫరా, చెల్లింపులు, బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి ఐపీ దాఖలు చేసి సంబంధిత దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపడం బాధితుల్లో ఆందోళన రేపుతోంది. తమ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని పలువురు భయపడుతున్నారు. రెండున్నర ఏళ్లుగా యార్డులో పలువురు కోట్ల రూపాయల్లో ఐపీలు పెట్టడం గమనార్హం. తాజాగా మరొకరు అదే బాటలో వెళ్లడం మిర్చి వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఏడాదిలో ఐదో ఐపీ.. ఈ ఏడాది అన్ సీజన్ జూన్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చూసుకొంటే ప్రస్తుతం ఐపీ దాఖలు చేసిన వ్యాపారి ఐదవ వ్యక్తి. గతంలో నలుగురు ఎగుమతి వ్యాపారులు ఇదే రీతిన దివాళా తీశారు. ఈ ఏడాది సుమారు రూ.27 కోట్లకు పైగా ఐపీ దాఖలు చేశారు. ఇటీవల మిర్చి ఎగుమతిదారులు ఐపీ దాఖలు చేస్తున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై మిర్చి రైతులు, దిగుమతి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల అధికారుల తీరుతో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కానీ రిక్రూట్మెంట్ చేయడం లేదు. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారుల తీరుతో అభ్యర్థులు ఉద్యోగాలు రాక మనోవేదనకు గురవుతున్నారు. అధికారులు నత్తకు పోటీగా పనిచేస్తూ విమర్శలు మూటకట్టుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశించినా... గుంటూరు వైద్య కళాశాలలో ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికారులు సెప్టెంబర్ 9, 2025న నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 61 పోస్టులు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే ఏడాది నవంబరులో ఫైనల్ మెరిట్ లిస్టు పెట్టి ఉద్యోగాలు ఇస్తామని రిక్రూట్మెంట్ షెడ్యూల్లో ప్రకటించారు. దీంతో గుంటూరు జీజీహెచ్, జీజీహెచ్ నాట్కో క్యాన్సర్‌సెంటర్, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పలు రకాల టెక్నీషియన్ పోస్టులు, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంతో మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏడాదిగా ఉద్యోగపు నియామకపు ఉత్తర్వులు అభ్యర్థులకు అందించలేదు. కనీసం ప్రొవిజన్ మెరిట్ లిస్టు కూడా ప్రకటించలేదు. దీనిపై ‘నో.. టిఫికేషన్!’ శీర్షికన ఈ ఏడాది ఏప్రిల్ 15న ‘సాక్షి’లో కథనం వెలువడడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ త్వరితగతిన ఉద్యోగ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య కళాశాల అధికారులు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ప్రకటించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సైతం పూర్తి చేశారు. ఆప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు ఇవ్వకుండా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఏడాదిన్నరగా జీతాలు లేవు.. 2025 మార్చిలో గుంటూరు జీజీహెచ్ నాట్కో సెంటర్లో 27 మంది ఉద్యోగులు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందారు. నేటికి ఉద్యోగులు విధుల్లో చేరి ఏడాదిన్నర అయింది. అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క నయాపైసా జీతం చెల్లించలేదు. ఏడాదిన్నరగా వేతనాలు లేకుండానే ఉసూరు మంటూ క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్, వైద్య కళాశాల అధికారులు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. సమన్వయ లోపమే శాపం వైద్య కళాశాల, జీజీహెచ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. వారికి నచ్చిన ఫైల్స్ మాత్రం పరస్పర ఒప్పందంతో త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ఎంతో మందికి ఉపయోగపడే పనులు మాత్రం పక్కన పడేస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా జీజీహెచ్ చైర్మన్‌గా వ్యవహరించే జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఈ సమస్యపై దృష్టి సారించి, త్వరితగతిన రిక్రూట్మెంట్ జరిగేలా, జీతాలు త్వరగా మంజూరయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. పురపోరుకు సిద్ధం ఉద్యోగాలు సకాలంలో భర్తీ చేయని పక్షంలో గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాది లోపు రిక్రూట్మెంట్ చేయకపోతే ఆటోమ్యాటిక్‌గా నోటిఫికేషన్ రద్దవుతుంది. ఈనేపథ్యంలో నెల, రెండు నెలల్లో చేయాల్సిన నియామకాలు ఏడాది గడిచినా జరగకపోవడంతో ఉద్యోగాలు వస్తాయా.. రావా అన్న.. డైలమాలో దరఖాస్తుదారులు కొట్టుమిట్టాడుతున్నారు. -
సరిపుచ్చారు...
ఐదుగురి అరెస్టుతో పట్నంబజార్: మైనర్‌ను వ్యభిచార కూపంలోకి దించిన కేసులో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు మైనర్‌ను సుమారు ఏడాదిపాటు వ్యభిచార కూపంలోకి దించిన మహిళ, మరో నలుగురు వ్యక్తుల అరెస్ట్ విషయంలో ఏదైనా మతలబు జరిగిందా..? అనే అనుమానాలు లేకపోలేదు. పది రోజుల క్రితం గుంటూరు ఈస్ట్ సబ్‌డివిజన్ పాతగుంటూరు పోలీసుస్టేషన్లో మైనర్‌తో వ్యభిచారం చేయించిన ఘటనపై కేసు నమోదైంది. పరిస్థితిని ఆసరాగా తీసుకుని... మైనర్ విద్యార్థిని తల్లిదండ్రులు మనస్పర్థల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఒంగోలులో ఉంటున్న తల్లి దగ్గర నుంచి తండ్రి వద్దకు వచ్చిన మైనర్‌ను నగరంలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేర్పించారు. ఈ క్రమంలో తండ్రి పాతగుంటూరు బాలాజీనగర్‌లో నివాసం ఉండే తన సోదరుడి దగ్గర కుమార్తెను ఉంచి చదివిస్తున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉండే పావని అనే మహిళతో పరిచయం ఏర్పడింది. విద్యార్థినికి మాయమాటలు చెప్పి, లేనిపోని ఆశలు చూపి వ్యభిచార కూపంలోకి దించింది. అసలు ఆ బాలిక ఇంటికి కూడా సరిగా రావడం లేదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీనిపై ఈ నెల 5వ తేదీన పాతగుంటూరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. తొలి నుంచి గోప్యమే... ఈ కేసులో పోలీసులు తొలి నుంచి గోప్యంగానే వ్యవహరించారు. విషయం బయటకు పొక్కకుండా, మీడియా అడుగుతున్నప్పటికీ సమాధానం దాటవేస్తూ వచ్చారు. ప్రధాన నిందితురాలు పావని, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. తర్వాత విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి, వారిని సైలెంట్‌గా కోర్టుకు హాజరుపరిచారు. ఫిర్యాదులో స్పష్టంగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్, విజయవాడతో పాటు పలు ప్రాంతాలకు పావని తనను తీసుకుని వెళ్లిందని మైనర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెలల తరబడి ఈ తంతు జరిగినా కేవలం ముగ్గురిని మాత్రమే నిందితులుగా చూపడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో అసలు ఏ లాడ్జికి తీసుకుని వెళ్లారు.. అక్కడ ఆధార్ ఏం ఇచ్చారు.. మైనర్ లాడ్జిలోకి వెళ్తుంటే ఎలా అంగీకరించారు..? అనే అంశాలు మిస్టరీగానే ఉన్నాయి. ఈ కేసులో ఇంకెంత మంది నిందితులు ఉన్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నాడు బాధితులకు న్యాయం మేడికొండూరుకు చెందిన ఒక మైనర్ ఘటన గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసు విషయంలో అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఉన్న కె. సుప్రజ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఏపీ, తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాలకు వెళ్లి మరీ 112 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరికి లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. ఈ కేసు విచారణ సుమారు సుదీర్ఘంగా మూడు నెలలపైనే సాగింది. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగింది. ఈ కేసు పరిణామంలో పోలీసులు నిందితులను వదిలివేశారా..? కేసును తూతూ మంత్రంగా విచారించారా..? ఎవరైనా పెద్దల ప్రమేయం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పావని, ఆమె భర్త, కేవలం ముగ్గురు విటులుగా ఉన్న వారిని అరెస్ట్ చేసి మమ అనిపించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన పోలీసులు.. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. ఈ కేసులో లాడ్జి నిర్వాహకులు, పావనికి సహకరించిన మరికొంత మందిని ఎందుకు నిందితులుగా చేర్చలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాకు తెలియకుండా అరెస్ట్ చూపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
‘స్వచ్ఛతా హీ సేవ’కు ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ లక్ష్మీపురం: జిల్లాలో పెద్ద ఎత్తున ‘స్వచ్ఛతా హీ సేవ 2026’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. కార్యక్రమంపై రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. పౌరులు, సంస్థలు, నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. పరిశుభ్రత లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లో మార్పు తీసుకురావడం, పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలు, స్వచ్ఛ పాఠశాల–యువత భాగస్వామ్యం, సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాలు వంటి అంశాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, గృహ కంపోస్టింగ్‌ను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ పేరుతో సామూహిక శ్రమదానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు బొక్కా అగస్టీన్ లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల నమోదు చేసుకునేందుకు కాలపరిమితిని అక్టోబరు 25వ తేదీ వరకు పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు బొక్కా అగస్టీన్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం డీఆర్ఓ ఖాజావలికి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించినా తక్కువ గడువు పెట్టిందన్నారు. దీంతో అర్హులైన దివ్యాంగులు తహసీల్దార్ కార్యాలయాలు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వర్లు పనిచేయకపోవడం, తహసీల్దార్ కార్యాలయాల్లో కులం, ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు సమయానికి వచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీటిని పరిశీలించి గడువును పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొరిటెపాడు (గుంటూరు): సహకార సొసైటీల్లోని ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. బ్రాడీపేటలోని బ్యాంకు పరిపాలనా భవనంలో బుధవారం డీఎల్ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల అభ్యర్థనలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులకు పదోన్నతులపై చర్చించారు. సీఈఓ వి.వి.ఎస్. ఫణికుమార్, గుంటూరు జిల్లా సహకార శాఖ అధికారి రత్నకుమారి, పల్నాడు జిల్లా సహకార శాఖ అధికారి నాగరాజు, ఆప్కాబ్ అధికారులు ఎం. శామ్యూల్ ధీరజ్, సీహెచ్. ధనాంజనేయులు పాల్గొన్నారు.నగరంపాలెం: జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో బుధవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రులు, బ్యాంక్‌లు, బస్టాండ్లు, విద్యాసంస్థలు, సున్నిత ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ కొనసాగించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించి, గణేష్ ఊరేగింపుల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పెట్రోలింగ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల కదలికలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాల తనిఖీలు చేపట్టారు. -
సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం
తాడేపల్లి రూరల్(మంగళగిరి): తాడేపల్లి పట్టణ పరిధిలోని ఆశ్రమం రోడ్డులో రెడ్ల సత్రం వద్ద సగం కాలిన స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. తాడేపల్లి సీఐ వీరేంద్ర, ఎస్ఐ ఖాజావలి మృతదేహాన్ని పరిశీలించారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతకగా మృతిచెందిన మహిళ ఫోన్‌తో పాటు బంగారు ఆభరణాలు లభించాయి. మృతిచెందిన మహిళ విజయవాడ కండ్రికకు చెందిన మాలకొండ మహేశ్వరి (44)గా గుర్తించారు. బంధువులు పోలీసులకు అందించిన సమాచారం మేరకు.. గత శనివారం సింగ్‌నగర్‌లో తను పనిచేస్తున్న కూరగాయల మార్కెట్ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయింది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని కుమార్తె సింధూర లక్ష్మికి ఫోన్ చేసి స్విచ్చాఫ్ చేసింది. వెంటనే కుమార్తె బంధువుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో నున్న పోలీస్‌స్టేషన్‌తో తన తల్లి కనిపించడం లేదంటూ కుమార్తె ఫిర్యాదు చేసింది. పోలీసులు మాలకొండ సింధూర లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. మహిళ మృతదేహం విషయాన్ని తాడేపల్లి పోలీసులు డీఎస్పీ మురళీకృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పదంగానే.. ఇదిలా ఉండగా మృతదేహం తీరు.. ఘటనా స్థలం పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. మృతిచెందిన మల్లేశ్వరి ఆశ్రమం రోడ్డులోకి ఎలా వచ్చింది.. పెట్రోల్ ఎక్కడ కొన్నది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమం రోడ్డులో క్రిస్టియన్ శ్మశాన వాటిక గోడపక్కనే కంకర గుట్టపై తగలబడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె వేసుకున్న చెప్పులు అదే ప్రాంతంలో విడివిడిగా దూరంగా పడి ఉన్నాయి. మహిళ ఒంటిపై ఉన్న మంగళసూత్రం, తాడు, చెవి దుద్దులు, ఫోన్ ఒక కవరులో పక్కన పెట్టిన ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే ఎవరైనా మహిళను వేధించి పెట్రోల్ పోసి తగలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగలబడిన ప్రాంతం నుంచి సుమారు 50 అడుగుల దూరంలో మృతదేహం వెల్లికిలా పడి ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ మృతిచెంది ఉంటే తగలబడినట్లు ఆనవాళ్లు అయినా ఉండాలి. అలాంటి గుర్తులు ఏమి కనిపించడం లేదు. మృతదేహం పూర్తిగా పురుగులు పట్టి ఉండడంతో స్పష్టంగా ఏం జరిగిందనేది పోలీసులు కూడా నిర్ధారించలేకపోతున్నారు. పైకి ఆత్మహత్య అని చెబుతున్నా వారికి పలు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం వద్ద పెట్రోల్ బాటిల్ కానీ, అగ్గిపెట్టె కానీ లభించలేదు. తన కుమార్తెతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా శరీరం అంతా మంటగా ఉందని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసిందని నున్న పోలీసులు తెలిపారు. పెట్రోల్ పోసుకుని తగలపెట్టుకున్న తరువాత కుమార్తెకు ఫోన్ చేస్తే ఆ మంటలకు ఆమె ఫోన్, ఆభరణాలు క్యారీ బ్యాగ్‌లోకి ఎలా వచ్చాయి? కనీసం ఆ వస్తువులు కాలినట్లు కూడా కనిపించడం లేదు. సదరు మహిళ ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే మద్యం మత్తులో ఉన్న వారు ఏమైనా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 50 శాతం తగలబడిన మృతదేహం ఆనవాళ్లు కూడా అక్కడ పెద్దగా కనిపించడం లేదు. చిన్నచిన్న కాలిపోయిన గుడ్డముక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఘటనా స్థలం వద్ద పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆ మహిళ ఆత్మహత్యా లేదా హత్యా అన్నది నిర్ధారించాల్సి ఉంది. జరిగిన ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప ఏం జరిగిందనే వివరాలు బయటకు వస్తాయి. -
విద్యార్థినిని బెదిరించిన యువకుడు అరెస్ట్
తెనాలిరూరల్: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమై బీటెక్ విద్యార్థినిని నమ్మించి మోసం చేయడమే కాకుండా నగలను అపహరించి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ డి.రవీంద్రబాబు వివరాలను వెల్లడించారు. స్థానిక గంగానమ్మపేటకు చెందిన బీటెక్ విద్యార్థినికి ఇన్‌స్టాగ్రామ్‌లో కఠెవరం గ్రామానికి చెందిన కమాధుల సాయి అలియాస్ పవన్ సాయి పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు చెబుతూ నమ్మించి ఆమె నుంచి బంగారపు వస్తువులు, రూ. 40,700 నగదు, వెండి పట్టీలు తీసుకున్నాడు. వాటిపై ఉమా కీర్తన పలుమార్లు ప్రశ్నించడంతో ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని, ఆమె వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1.30 లక్షల విలువైన బంగారపు గొలుసు, రెండు ఉంగరాలు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ సిహెచ్. రాజ్యలక్ష్మి నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించారని, ఆమెను డీఎస్పీ అభినందించారని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. చుట్టంలా వచ్చి చోరీలు.. చుట్టంలా వచ్చి కొద్ది రోజులు ఇంట్లో ఉండి విడతల వారీగా వస్తువులు దొంగిలించి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ టు టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఐ డి. రవీంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక ఐతానగర్‌కు చెందిన నిమ్మగడ్డ జితేంద్ర శ్రీనివాస ప్రసాద్ ఇంటికి తాడికొండ మండలం దామర్లపల్లి గ్రామానికి చెందిన బంధువు జాగర్లమూడి భరత్ వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న భరత్ తనకు ఇంటర్వ్యూ ఉందంటూ చెప్పి నమ్మించాడు. దాదాపు నెల రోజులపాటు ఉన్న భరత్, ఇంటిలో ఒక్కొక్కటిగా వస్తువులు దొంగిలించాడు. వెళుతూ శ్రీనివాస ప్రసాద్‌కు చెందిన వాహనాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.7.50 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు గొలుసు, 15 గ్రాముల బంగారు పూసల గొలుసు, 18 గ్రాముల బంగారు గొలుసు(తాకట్టు), నిందితుడు అపహరించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించిన ఎస్ఐ పి. సురేష్, సిబ్బంది ఆర్. రామకృష్ణ, పి. నరేంద్రబాబు కే. బాబురావు, జి.గణేష్‌ను డీఎస్పీ అభినందించినట్లు సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త జోరు... పాత గుర్రు!
గుంటూరు జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. ఎందరో సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీలో ఉన్నారు. మొదటి నుంచీ ఈ జిల్లాలో వారే పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. జిల్లాలో చినబాబు వర్గంగా ఉన్న జూనియర్ నాయకుల హవా పెరిగింది. స్థానిక ఎన్నికల వేళ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి వచ్చేలా చేయాలని వారి అనుచరులు, అభిమానులు తేల్చి చెప్పేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారిక పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు జిల్లాలో రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులు ఏది ఇవ్వాలన్నా గతంలో సీనియర్ల సిఫార్సుల మేరకే ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం జూనియర్ల హవా నడుస్తోంది. ఆ నాయకులు చెప్పిన వారికే పదవులు, అధికారులకు ఉన్నతస్థాయి పోస్టింగ్‌లు దక్కుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదవులే కాకుండా జిల్లాలో ఇసుక, మట్టి, పేకాట క్లబ్బులు వంటి అక్రమ దందాలు సైతం జూనియర్ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్న పరిస్థితి. దీంతో సీనియర్లు చినబాబుకు ఎదురు తిరగలేక, పార్టీలో ప్రాధాన్యత కోల్పోయి తలెత్తుకు తిరగలేక అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా వారంలో రెండు రోజులు నియోజకవర్గాల్లో తిరుగుతూ, అనంతరం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో వ్యాపారాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది సీనియర్లు అయితే వాళ్ల పరిధిలో ఉన్న మట్టి, గ్రానైట్, ఇతర మైనింగ్ వ్యవహారాల్లో నెలవారీగా ఫిక్స్డ్ ఆదాయం వచ్చేలా సెట్ చేసుకుని పార్టీకి దూరంగా తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. తీవ్ర అసంతృప్తిలో సీనియర్లు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్లు పార్టీకి దూరంగా ఉండటంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదే కొనసాగితే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం కూడా ఉందనే భయంతో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి గుంటూరు ఎంపీగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన లావు శ్రీకృష్ణదేవరాయలుకు లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పదవి కట్టబెట్టడంపై కూడా సీనియర్లు గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి పార్టీలో ఉన్నా... జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్, రాజకీయాల్లో సీనియర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ వంటి వారికి సరైన ప్రాధాన్యం లేకపోవడంపై వారి వర్గీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీనియర్లలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వకపోగా, జిల్లాలో వారు చెప్పిన వారికి నామినేటెడ్ పోస్టులు దక్కకపోవడం తీవ్ర అవమానకరంగా ఉందని అనుయాయుల వద్ద సీనియర్లు వాపోతున్నట్లు సమాచారం. జిల్లాలో ఇచ్చిన ప్రధాన పోస్టుల్లో జీడీసీసీ బ్యాంకు చైర్మన్, జీడీఎంఎస్ పోస్టులు ఎంపీలు చెప్పిన వారికి ఇవ్వడం, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా పేరొందిన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా జూనియర్ ఎమ్మెల్యే అనుచరుడికి ఇవ్వడంపై సీనియర్లు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీలో సీనియర్‌గా ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్‌ను పక్కనపెట్టి, మండల స్థాయి లీడర్‌కు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కేటాయించడంపై సీనియర్ ఎమ్మెల్యేలంతా గుర్రుగా ఉన్నారు. నాలుగైదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన తమపై పార్టీలో పెత్తనం చేసేందుకు మండల స్థాయి లీడర్‌ను పెట్టి అవమానిస్తారా అంటూ మండిపడుతున్నట్లు సమాచారం. సీనియర్ల నియోజకవర్గాల్లో సైతం వారికి తెలియకుండా రాష్ట్ర స్థాయి పదవులు చినబాబు వర్గానికి చెందిన వారికి ఇవ్వడంతో ఏమీ మాట్లాడలేక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు, వారి వర్గంగా ఉన్న అనుయాయులంతా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బుద్ధి చెబుదామంటూ ద్వితీయ శ్రేణి నాయకులంతా సీనియర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా, సీనియర్లలో పార్టీ పట్ల అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందనేది మాత్రం అక్షర సత్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తమ మాట వినకుండా జూనియర్ల పెత్తనం నడిస్తే మాత్రం వారిని ఓడించి పార్టీకి బుద్ధి చెప్పాలనే తలంపుతో ఉన్నట్లు సమాచారం. -
● బంగారం, డబ్బుల కోసం భర్తతో కలిసి తల్లిని చంపిన వైనం ● ఈనెల 12న వృద్ధురాలి హత్య ఉదంతంలో వీడిన మిస్టరీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు
25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం లక్ష్మీపురం: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంపై జిల్లా సమన్వయ సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం‘లో బాగంగా జిల్లాలో గల 1 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల దాదాపు 4,62,714 మంది బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె.విజయ లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. కన్న కూతురే హంతకురాలు పొన్నూరు: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని కూలి పనులతో జీవనం భారమై.. భర్తతో సహా తల్లి పంచన చేరి, డబ్బు, నగల కోసం ఆమెనే హత్య చేసిన కసాయి కూతురి ఉదంతమిది. పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్థనరావు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని క్యాబిన్ పేటలో ఈ నెల 12వ తేదీన తల్లిని హతమార్చిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. క్యాబిన్ పేటలో నివాసం ఉంటున్న మృతురాలు ఈవూరు లక్ష్మీకి కూతురు, కొడుకు ఉన్నారు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన మనవడు జాషువాతో కలిసి జీవనం సాగిస్తున్నారు. కుమారుడు మరణించినప్పుడు వచ్చిన ఇన్య్సూరెన్స్ డబ్బులతో లక్ష్మీ బంగారం నగలు చేయించుకున్నారు. ఆమె కూతురు పుష్పలత మొదటి భర్తతో విడిపోయి, రెండో భర్త చనిపోవడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన సఖినేటిపల్లికి చెందిన రాకేష్ కుమార్‌ను మూడో పెళ్లి చేసుకొని తిరుపతిలో కూలి పనులు చేసుకుంటూ జీవన సాగిస్తోంది. కూలి పనులతో జీవనం భారంగా మారడంతో ఆర్థిక సహాయం కోసం పొన్నూరులో ఉంటున్న తల్లి లక్ష్మిని వారు ఆశ్రయించారు. అయితే రెండు నెలల పాటు కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉంటూ ఏ పని చేయకుండా ఉండడంతో తల్లి వారిద్దరిని తిరుపతికి వెళ్లిపోవాలంటూ మందలించింది. అయితే ఎలాగైనా తల్లి మెడలోని బంగారం, బీరువాలోని డబ్బులు కాజేయాలని కూతురు, అల్లుడు పన్నాగం వేశారు. 12వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో లక్ష్మి నిద్రలో ఉండగా గొంతుకు చున్నీ బిగించి హత్యకు పాల్పడ్డారు. ఆమె మెడలోని బంగారం తాడుతోపాటు బీరువాలోని డబ్బులు అపహరించి పరారయ్యారు. హత్య చేయడాన్ని చూసిన మనవడు జాషువా వివరాలను పోలీసులకు తెలిపాడు. మృతురాలి సోదరుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. ఈ కేసులో నిందితులైన పుష్పలత, రాకేష్‌కుమార్‌ను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి బంగారం ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. కుంభకర్ణ రెస్టారెంట్ తాత్కాలిక మూసివేత మంగళగిరి రూరల్: పాడైన ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న మాంసం అపరిశుభ్రంగా ఉన్న వంటగది మొదలగు లోపాలు రెస్టారెంట్లో బయటపడటంతో మండల పరిధి కాజా గ్రామం టోల్‌ప్లాజా సమీపంలోని కుంభకర్ణ మల్టీ క్యుజియన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఐపీఎం డైరెక్టర్ అరుణ్‌బాబు స్వయంగా తనిఖీ చేసి పాడైన మాంసం, అపరిశుభ్ర వంటగది తదితర లోపాలను గుర్తించారు. దీంతో రెస్టారెంట్ వంటగది కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత అధికారులు బి.నరసింహుడు, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేష న్స్ (ఎంసీఏ) కోర్సుల ప్రవేశ పరీక్ష ఈనెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత పత్రాలను పరీక్ష కేంద్రంలో చూపించాలని తెలిపారు. ఒకవేళ దరఖాస్తులు అందించని అభ్యర్థులు నేరుగా అభ్యర్థి ఆధార్ కార్డు, ఫొటోతోపాటు రూ.500 తత్కాల్ ఫీజు చెల్లించి పరీక్ష కేంద్రాల్లో నేరుగా హాజరు కావచ్చన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కేంద్రంతో పాటు దగ్గరలో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లి కూడా పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. అభ్యర్థులు అవసరమైన పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు ప్రవేశ పరీక్ష కేంద్రాలు సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), శ్రీ కృష్ణవేణి ఐటీఐ కాలేజ్ (కర్నూలు), ఇంటెల్ ఇంజినీరింగ్ కాలేజ్ (అనంతపురం), విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ (కై కలూరు), చక్రధర్ డిగ్రీ కాలేజ్ (మాచర్ల), ఎిస్బీఎస్వైఎం డిగ్రీ కాలేజ్ (మైదుకూరు), ప్రభాస్ డిగ్రీ కాలేజీ (విజయవాడ), శాంతినికేతన్ డిగ్రీ కాలేజీ (శ్రీకాకుళం), గీతాంజలి డిగ్రీ కళాశాల (భీమడోలు), శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాల సంఘం (నెల్లూరు) కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని వివరించారు. ఈ నెల 20న జరగనున్న ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల18 నుంచి అభ్యర్థులతు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. -
రేపు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం
లక్ష్మీపురం: జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకర్ల సమావేశం ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ హాజరు కానున్నారని తెలిపారు. అనంతరం జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. తెనాలి రూరల్: నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి మహిళ మృతికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2021 మార్చి 14న తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన కావూరి ఉషారాణి, మేనల్లుడు మాచర్ల నవీన్‌బాబు కలిసి స్కూటీపై రేపల్లెకు బయలుదేరారు. కొల్లూరు గ్రామం కృష్ణానది కరకట్ట దగ్గరకు వచ్చేసరికి టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఉషారాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. డ్రైవర్ బుడంపాడు గ్రామానికి చెందిన కొండమూది మస్తాన్‌పై కేసు నమోదు చేశారు. బుధవారం కేసు విచారణకు రాగా నిందితుడిపై నేరం రుజువు కావడంతో తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఏకా పవన్ కుమార్... నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ ఏపీపీ పరిశపోగు సునీల్ కుమార్ వాదించారు. అప్పటి కొల్లూరు ఏఎస్ఐ కె. శోభన్‌బాబు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. తరువాత అప్పటి ఎస్ఐ ఎస్. ఉజ్వల్‌కుమార్ చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టు కానిస్టేబుళ్లు మాధవరావు, వెంకట్ సహకారం అందించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.6029 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది. -
నేతన్న సేవలో అక్రమాలపై విచారణ జరపాలి
మంగళగిరి టౌన్: నేతన్న సేవా పథకంలో నిజంగా చేనేత వృత్తిపై ఆధారపడిన పలువురు కార్మికులకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 25 వేల ఆర్తిక సహాయం అందించే నేతన్న సేవా పథకాన్ని ఆగస్టు 7 నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారుల సంఖ్య 51,952 ఉండగా, సుమారు 71 వేల మందికి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయినట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పథకం అమలుకు ముందే కొందరు అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన పేర్లను జాబితాలో చేర్పించారని, చేనేత వృత్తితో సంబంధం లేని వారి పేర్లు కూడా నమోదు అయ్యాయని ఆరోపించారు. నిజంగా మగ్గం నేస్తున్న అర్హులైన కార్మికులకు పథకం అందలేదని, దీనిపై విచారణ కోరుతూ అధికారులకు జాబితాలు ఇచ్చినా నేటికీ చర్యలు తీసుకోలేదన్నారు. రాయలసీమ జిల్లాల్లో పథకం అమలుపై ఆగస్టు 7కు ముందే పత్రికల్లో పలు ఆరోపణలు వెలువడ్డాయని తెలిపారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి పథకం అందేలా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు. మరో 30 వేల మంది చేనేత కార్మికులకు రూ. 25 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, ఆగస్టు 30 నాటికి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని చేనేత మంత్రి ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ 15 నాటికి కూడా నగదు జమ కాలేదని అన్నారు. దీంతో పథకం అమలుపై చేనేత కార్మికుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మిగిలిన అర్హులైన చేనేత కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేసి న్యాయం చేయాలని ఆయన ప్రకటనలో కోరారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ -
అమరావతిలో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేయాలి
మంగళగిరి టౌన్: రాజధాని అమరావతిలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 25 అడుగుల భారీ విగ్రహంతో పాటు ఘంటసాల కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర చైతన్య వేదిక, ఘంటసాల చైతన్యవేదిక అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరి పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. నవ్యాంధ్ర చైతన్య వేదిక 17వ జాతీయ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని భావితరాలకు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ, వేదిక గౌరవ అధ్యక్షులు చిట్టిబాబు, కార్యదర్శి ఆంజనేయ రాజు, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన తాడికొండ: రాజధాని అమరావతి ప్రముఖ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఈ నెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి శంకుస్థాపన నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ)– మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్షీ పార్థసారథి పరిశీలించారు. ముఖ్యంగా ఈ–3, ఎన్న్–14 కూడలి నుంచి వేదిక వద్దకు చేరుకునే మార్గాన్ని ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. సీడ్‌యాక్సెస్ రోడ్డు నుంచి సీఎం కాన్వాయ్ నేరుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి కేటాయించిన స్థలానికి సౌకర్యవంతంగా చేరుకునేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజినీరు టి.మోజెస్ కుమార్‌ను ఆదేశించారు. పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజినీర్లు బి.నరసింహమూర్తి, సీహెచ్ ధనుంజయ పాల్గొన్నారు. ‘సాఫ్ హ్యాక్‌ఫెస్ట్’ వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాం నందున్న చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19వ తేదీన చైన్నెకి చెందిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, కళాశాల సంయుక్తంగా జాతీయ స్థాయి సాప్ హ్యాక్‌ఫెస్ట్ 2026 నిర్వహించనున్నట్లు చలపతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వైవీ ఆంజనేయులు తెలిపారు. బుధవారం కళాశాలలో పెస్ట్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ సాంకేతిక పరమైన పోటీ ప్రపంచంలో విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న హ్యాకఫెస్ట్ ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్‌లో ఫ్రెషర్స్ డే చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయస్థాయి యూత్ ఫెస్టివల్ ‘విజ్ఞాన్ మహోత్సవ్–2కే27’ పోస్టర్‌ను చైర్మన్ లావు రత్తయ్య ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు నిర్వహించనున్న ఈ మహోత్సవంలో మొత్తం 95 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. వివిధ పోటీల్లో విజేతలకు రూ.20 లక్షలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మంగళగిరిలో మహిళా క్రికెట్ సందడి ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మంగళగిరి టౌన్: మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహం కల్పించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు వేదిక కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూఏపీఎల్) 2026 సీజన్–1కు మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఏసీఏ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్ ప్రారంభో త్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయలసీమ జెన్‌స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించడంతో నగరానికి మరోసారి క్రీడావేదికగా గుర్తింపు లభించనుంది. -
దళిత యువకుల మృతిపై న్యాయవిచారణ చేయండి
లక్ష్మీపురం: రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో దళితులపై దాడులు గణనీయంగా పెరిగాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. దొంగతనం నెపంతో మంగళగిరిలో హత్య గురైన మేకల రమేష్ కుటుంబ సభ్యులను తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో వి.శ్రీనివాసరావుతో పాటు కేవీపీఎస్ నాయకులు బుధవారం పరామర్శించారు. అలాగే పోలీసు దెబ్బలకు తాళలేక మృతిచెందిన దళిత యువకుడు చీకటి గోపి కుటుంబ సభ్యులను కూడా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో వారు పరామర్శించారు. అనంతరం గుంటూరులోని బ్రాడిపేట సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో దళితులు పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందన్నారు. పేదలు బడుగు వర్గాలు, దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. దళితుల కేటాయించిన తాడికొండ నియోజకవర్గంలో ఈ ఘటనలపై ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించలేదన్నారు. దొంగతనం నెపంతో మేకల రమేష్ పెత్తందారులు కొట్టగా చనిపోగా, చీకటి గోపి పోలీసులు కొట్టడంతో చనిపోయాడని తెలిపారు. ఈ రెండు ఘటనలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా ఉందన్నారు. తాడికొండ సీఐపై ఆరోపణలు వస్తే మేడికొండూరు సీఐని విచారణ అధికారిగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే స్థాయి అధికారిని విచారణ అధికారిగా ఇలా నియమిస్తారా అని ప్రశ్నించారు. విచారణ పూర్తికాకుండానే పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే జ్వరంతో చీకటి గోపి మృతి చెందాడని డీఎస్పీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధితులను ఇంతవరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శించలేదన్నారు. కొద్దిరోజుల క్రితం తాడేపల్లి లో ఎస్టి యువకుడు కూడా దొంగతనం కేసులో మృతి చెందాడని ఆరోపించారు. ఈ ఘటనలపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కాకినాడలో నిరుద్యోగుల ఆందోళనలను బూచిగా చూపి కోచింగ్ సెంటర్ల పై దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20 వేల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మాట మార్చడం ఏంటని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. యూనిఫాం సివిల్ కోడ్ ను 16 రాష్ట్రాలలో అమలు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ దళితుల పై దుర్మార్గమైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్‌లో అభివద్ధి కన్నా పేదలపై దాడులు పెరిగాయన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద గురువారం దళిత సంఘాలు చేయనున్న ఆందోళనకు మద్దతు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు బి.లక్ష్మణరావు, జె.నవీన్‌ప్రకాష్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు -
మళ్లీ తమ్ముళ్లకే ‘కిక్కు’
నెహ్రూనగర్: టీడీపీ సర్కారు తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల జేబులు నింపేందుకే సరికొత్త ‘మద్యం’ ఎత్తుగడలు వేస్తోందన్న విమర్శలు జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మద్యం దుకాణాల రెండేళ్ల లైసెన్సు గడువు అక్టోబర్ 2వ తేదీతో ముగియనుంది. కొత్త పాలసీ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ, అలా చేస్తే తమ అనుచరుల చేతుల్లో ఉన్న దుకాణాలు చేజారిపోతాయన్న భయంతో కూటమి పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పాతవారికే మరో ఏడాది పాటు లైసెన్సులను రెన్యూవల్ చేస్తూ టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని లిక్కర్ సిండికేట్ల చేతిలోనే మళ్లీ మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి. పక్కా ప్రణాళికే... జిల్లా పరిధిలో మొత్తం 138 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిలో 125 ఓపెన్, 13 గీత కులాలకు కేటాయించారు. వీటికి సంబంధించి ఎకై ్సజ్ శాఖ ఇప్పటికే రెన్యూవల్ ప్రక్రియను ప్రారంభించింది. రెన్యూవల్ చేసుకోని షాపులకు దరఖాస్తులు స్వీకరించి లాటరీ వేస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి జిల్లాలోని అత్యధిక మద్యం దుకాణాలు అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నియోజకవర్గ స్థాయి నేతల బినామీలు, వారి అనుకూల వ్యాపారుల చేతుల్లోనే ఉన్నాయి. గత రెండేళ్ల కాలంలో ఈ దుకాణాల ద్వారా అధికార పార్టీ నేతలు రూ.వందల కోట్ల వ్యాపారం సాగించి భారీగా ఆర్జించారు. మళ్లీ టెండర్లు పిలిచి ఓపెన్ లాటరీ నిర్వహిస్తే ఇతర వ్యాపారులు రంగంలోకి దిగి తమ గుత్తాధిపత్యానికి గండి కొడతారని భావించిన నేతలు.. పాత పాలసీనే కొనసాగించాలని ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుకున్నది సాధించారు. ‘స్థానిక’ నిధుల కోసమే.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన ప్రచార ఖర్చులు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా నిధులు అవసరం అవుతాయి. మద్యం దుకాణాలు తమ వారి చేతుల్లోనే ఉంటే అటు నిధులు, ఇటు మద్యం పంచి గెలవాలని భావిస్తున్నట్లు ఆరోపణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మద్యం అమ్మకాలపై తొలుత 20 శాతం కమీషన్ ఇస్తామని చెప్పి, ఆ తర్వాత దానిని 9 శాతానికి, అనంతరం 15 శాతానికి పరిమితం చేసిందని సిండికేట్లు వాదిస్తున్నాయి. తాము నష్టపోతున్నామంటూ మొసలి కన్నీరు కార్చడంతో ప్రభుత్వం నిర్ణయం తీసకున్నట్లు పైకి చెబుతున్నారు. క్వార్టర్ బాటిల్‌పై ఎమ్మార్పీకి కనీసం రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అదనపు బాదుడు ద్వారా జిల్లావ్యాప్తంగా నిత్యం రూ.లక్షలు అధికార పార్టీ నేతల జేబుల్లోకి నేరుగా చేరుతోందని సమాచారం. షాపుల వ్యవహారం ఒకెత్తయితే, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ వ్యాపారం మరో ఎత్తు. కొనుగోలు చేసిన మద్యం తాగడానికి మాత్రమే ఉద్దేశించిన పర్మిట్ రూములను హోటళ్లు, స్టార్ బార్ల తరహాలో నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ భారీ ఎత్తున ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింకులను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రైవేట్ వ్యాపారం సాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి రూ.10 లక్షల జరిమానా విధిస్తామని, సీసీ కెమెరాలు ట్యాంపరింగ్ చేస్తే కేసులు పెడతామని ఎకై ్సజ్ అధికారులు మీడియా ముందు ప్రకటనలు గుప్పిస్తున్నా, క్షేత్రస్థాయిలో అదేం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే మద్యం మాఫియా నడుస్తుండటంతో తనిఖీలు చేసే సాహసం కూడా చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాలను గాలికొదిలేసి కేవలం కూటమి నేతల జేబులు నింపేందుకు, లైసెన్సులు రెన్యూవల్ చేశారని విమర్శలు వస్తున్నాయి. -
అర్ధరాత్రి యువకుడిపై అమానుషం!
లక్ష్మీపురం: యువకుల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసిన ఘటనలో పోలీసులు స్థానిక టీడీపీ నేతల ప్రోదల్బంతో బాధితుడినే చితకబాదిన ఘటన జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక చవితి పండుగ సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన వినాయక పందిరి వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అరండల్‌పేటలోని ఓ బడ్డీ కొట్టు వద్దకు తూర్పు నియోజక వర్గానికి చెందిన కొందరు యువకులు ఆగారు. ఆ బడ్డీ కొట్టులో ఉండే వ్యక్తితో ముచ్చటిస్తున్న సమయంలో కొంతమంది మద్యం మత్తులో ఉన్న యువకులు వచ్చి వారితో అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఇది సరికాదని చెప్పడంతో ఒక యువకుడిని మద్యం సేవించి ఉన్న వారు తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలయ్యాడు. దీంతో బాధిత యువకుడు అరండల్‌పేట పోలీస్ స్టేషన్ వద్దకు ఫిర్యాదు నిమిత్తం వెళ్లాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. సదరు యువకులు ఓ టీడీపీ నేతకు చెందిన అనుచరులం అని తెలపడంతో అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి ఫైబర్ స్టిక్ తీసుకుని స్టేషన్‌లోపల బాధిత యువకుడిని లాఠీతో కొట్టి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం ప్రారంభించాడని బాధితులు వాపోయారు. గాయపడి స్టేషన్‌కు వస్తే ఫిర్యాదు తీసుకోకుండా తనను ఇలా కొట్టడం సరికాదని చెప్పడంతో స్టేషన్లో ప్రైవేట్ డ్రైవర్‌తో పాటు కానిస్టేబుల్ సైతం ఇద్దరు కలిసి కింద పడేసి లాఠీలతో తీవ్రంగా కొట్టారని బాధితుడు తెలిపాడు. ఇదంతా ఒక ఎత్తయితే మద్యం మత్తులో ఉన్న యువకులకు మద్దతుగా తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ కార్పొరేషన్ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) స్టేషన్ వద్దకు నేరుగా వచ్చి మద్యం తాగి దాడి చేసిన వారికి వత్తాసు పలికారు. ఆ పీఏని మళ్లీ మచ్చిక చేసుకునే క్రమంలో ఆ ప్రైవేట్ డ్రైవర్, కానిస్టేబుల్ ఇద్దరు కలిసి మళ్లీ బాధితుడిని సెల్లో పడేసి లాఠీతో కొట్టారు. బాధితుడి స్నేహితులు వచ్చి ఎంత ప్రాధేయపడినా ప్రైవేట్ డ్రైవర్ వదల్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే స్టేషన్ బయట కాచుకుని ఉన్న తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు యువకులు సదరు టీడీపీ నేత అండ చూసుకుని సినిమా స్టయిల్లో ఆ యువకుడిపై మళ్లీ స్టేషన్ బయట దాడి చేసి తీవ్రంగా గాయపరచి ఇప్పుడు పెట్టుకోరా కేసు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారని బాధితులు వాపోయారు. బాధిత యువకులు పోలీసులకు ఎంత చెప్పినా వినకపోగా గాయపడిన వారిని తెల్లవారు జామున 4 గంటల వరకు స్టేషన్లో ఉంచారు. వదిలేందుకు డబ్బులు డిమాండ్! ఇదిలా ఉండగా.. బాధితుడితో పాటు అతని స్నేహితులను బయటకు పంపించేందుకు ఓ పోలీస్ అధికారి డబ్బులు డిమాండ్ చేసి, తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాయాలపాలైన సదరు యువకుడు అక్కడ నుంచి స్నేహితుల సహాయంతో జీజీహెచ్‌లో చికిత్స కోసం చేరాడు. పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ డ్రైవర్ చేస్తున్న అరాచకంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్టేషన్ బయటకు వచ్చిన తరువాత కూడా తమవారిపై దాడి చేసిన వారి పై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని బాధిత యువకుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహరం అంతా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లేందుకు బాధితులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. -
ఏపీసీపీడీసీఎల్ నూతన ఎస్ఏఓ బాధ్యతల స్వీకరణ
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా విద్యుత్ శాఖ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్(ఎస్ఏఓ)గా బి.వెంకటేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.సారథి, ఎం.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అసోసియేషన్ నాయకులు నూతన ఎస్ఏఓను కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సారథి, చంద్రశేఖర్ మాట్లాడుతూ వెంకటేశ్వరరావు ప్రతిభగల అధికారిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన నేతృత్వంలో గుంటూరు జిల్లా విద్యుత్ శాఖతో పాటు ముఖ్యంగా అకౌంట్స్ విభాగం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.సింగయ్య, అకౌంట్స్ ఆఫీసర్(ఫైనాన్స్) వి.శ్రీనివాస్, అసోసియేషన్ నాయకులు కె.వరప్రసాద్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల: ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో పేరుకలపూడి నుంచి వచ్చిన రామకృష్ణ కుటుంబం గత కొంత కాలంగా నివసిస్తున్నారు. సంపతి వెంకట లక్ష్మి(16) తెనాలిలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సినీసంగీతంలో సరికొత్త స్వరం
తెనాలి: కళల తెనాలి నుంచి ఎందరో వెండితెరను సుసంపన్నం చేశారు. సినిమాకు ప్రాణం పోసిన కలం వీరులూ, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నా సంగీత దర్శకత్వంలో మాత్రం బీఎన్నార్ ఒక్కరే ఉన్నారు. సినిమా సంగీతానికి ఆయన ఓ కొత్త ఒరవడిని, సినిమా పాటకు కొత్త వరుసలను సృష్టించిన సంగీత దర్శకుడు. ఆయన కూర్చిన విధానాన్నే నేటికీ తెలుగు సినిమా పాటిస్తోంది. బీఎన్నార్ తర్వాత ఏడున్నర దశాబ్దాలకు మళ్లీ సినిమా సంగీత సాగరంలోకి ఓ యువకెరటం దూసుకొచ్చింది. పేరు సందీప్ అద్దంకి. స్క్రీన్ నేమ్ శాండీ అద్దంకి. 2026 నుంచి ‘వియాన్’గా సినిమాలు చేస్తున్నారు. కళానేపథ్య కుటుంబం... వియాన్ సొంతూరు తెనాలి. తండ్రి అద్దంకి పాల్ ప్రభాకర్ బీఎఫ్ఏ చేశారు. హాబీగా ‘ఎకార్డినిస్ట్’గా వ్యవహరించేవారు. ‘పల్లె పిలిచింది’ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తల్లి కళాప్రభాకర్ ఆకాశవాణిలో ‘ఏ’ గ్రేడ్ డ్రామా ఆర్టిస్టు. పెద్దన్నయ్య జోసఫ్ ప్రీతమ్ బీఎఫ్ఏ చేశారు. కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. సంగీతంపై ఆసక్తి కలిగిన వియాన్.. తండ్రి వద్ద కీబోర్డు నేర్చుకున్నారు. నృత్యగురువు రంగనాయకి, నాదస్వర విద్వాంసుడు మార్టూరు వెంకటేశ్వర్లు వద్ద శాసీ్త్రయ సంగీతం అభ్యసించారు. హైదరాబాద్‌లో జె.విజయపాల్ వెస్ట్రన్ సంగీతం నేర్పించారు. ఇళయరాజా సంగీతం వింటూ... తొలి నుంచీ ఇళయరాజా సంగీతం వింటూ పెరిగారు వియాన్. ఎంబీఏ డిస్కంటిన్యూ చేశారు. 2008 నుంచి కీబోర్డు ప్లేయర్‌గా కెరీర్ ఆరంభించారు. ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ మొదటి సినిమా. టీవీ సీరియల్స్‌కూ పనిచేస్తుండగా, ప్రసిద్ధ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దృష్టిలో పడ్డారు. ‘మాయదారి మైసమ్మా’ గాయకుడు శ్రీకాంత్ తన పేరును సూచించారు. రామ్‌గోపాల్‌వర్మ తీసిన ‘రక్తచరిత్ర’, ‘బెజవాడ రౌడీ’లకు కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. ఆ అనుభవంతో వియాన్లోని ప్రతిభను గుర్తించిన రామ్‌గోపాల్‌వర్మ 2016లో ద్విభాషా సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’కు తీసుకున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరర్‌గా చేశారు. ‘ఆ సినిమా కోసం నేను చేసిన థీమ్‌ను వర్మ సార్ మెచ్చుకున్నారు. సినిమా రిలీజయ్యాక ఆయన చేసిన ట్వీట్ నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది’ అంటారు వియాన్. ఆ సినిమా సంగీతాన్ని విన్నాకే గౌతమ్ రాజ్‌కుమార్ పిలిచారు. తొలి సినిమా ఇలా.. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో హాస్యనటుడు అలీ సమర్పణలో 2018లో వచ్చిన ‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమాతో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా వియాన్ మారారు. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సాగిన చిత్రమది. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికయింది. అందులో ‘ఎవరికి ఎవరో ఎవరికి ఎరుక/ తెలియని మజిలీ మనిషిది కనుక’ పాటను వియాన్ పాడారు. తర్వాత రాణి, అస్మి సినిమాలకు పని చేశారు. తర్వాత దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సత్యదేవ్, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటించిన ‘గాడ్–సే’ చిత్రాన్ని సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించగా.. వియాన్ సంగీతం అందించారు. ఆ సినిమా హిట్టవటంతో మరికొంత గుర్తింపు లభించింది. అదే సమయంలో ఇంకో చిత్రం ‘మరో ప్రపంచం’ విడుదలైంది. తెనాలి నుంచి వెళ్లి సత్తా చాటుతున్న వియాన్ ఈ క్రమంలో సంగీతం అందించిన ‘ఆలోచన’ అనే మరో చిత్రం ట్రయలర్ చూసిన సుప్రసిద్ధ నటుడు మురళీమోహన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సినీనటులు, స్నేహితులు కూడా అయిన నారాయణరావు, నరసింహరాజు, ప్రసాద్‌బాబు, హరిబాబు, మహర్షి రాఘవలు ఇందులో నటించారు. వియాన్ ఎస్ఏ స్క్రీన్ నేమ్‌తో సంగీతం అందించారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకు వియాన్ సంగీతం అందించిన సినిమాలు 22 ఉన్నాయి. ఇందులో కన్నడలో ‘రాధేయ’తోపాటు మరొక సినిమా ఉంది. విడుదల కావాల్సిన సినిమాలు ‘ఆలోచన’తోపాటు ‘ఆద్యంత’, ‘నేను వెతికిన నీవె’, ‘మంగంపేట’, ‘లూసీ’ తదితర సినిమాలున్నాయి. సినీదర్శకుడు కె.రాఘవేంద్ర రావు ‘కథాసుధ’ పేరుతో ఓటీటీకి తీస్తున్న మినీ సినిమాల్లో మూడింటికి వియాన్ సంగీతం అందించారు. -
కొమ్మమూరు చానల్ బ్రిడ్జి వద్ద ప్రమాదం
చేబ్రోలు: చేబ్రోలు సమీపంలోని బ్రిటీషు కాలం నాటి పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరటంతో అక్కడ ప్రయాణం వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. తెనాలి రూరల్ మండలం మల్లెపాడు ప్రాంతానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి కొమ్మమూరు బ్రిడ్జికి చేబ్రోలు వైపు ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలి నుంచి పొన్నూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తాడిబోయిన గోపి, కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కన తవ్వకాలు చేయటంతో గుంతలుగా ఉన్న ప్రాంతంలో పడిపోయాడు. ముఖానికి, కాళ్లు, చేతులకు గాయాలైన బాధితుడిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
23న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ
తాడికొండ: తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఈ–03 రోడ్ (సీడ్ యాక్సిస్ రోడ్డు) ఎన్–14 జంక్షన్ వద్ద సర్వే నంబర్లు 51, 52, 55లో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణ పనులకు ఈ నెల 23న సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అబ్బురాజుపాలెం గ్రామ పరిధిలోని ఆసుపత్రి నిర్మాణ స్థలంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ, అడిషనల్ ఎస్పీ రవికుమార్, తాడేపల్లి –మంగళగిరి మున్సిపల్ కమిషనర్ హలీంబాషా, డీఎం హెచ్‌వో విజయలక్ష్మి, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ ఇతర పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమన్వయ సమావేశం -
ఓటీపీ నిబంధనతో ఆరోగ్య సర్వేలకు ఆటంకం
● క్షేత్రస్థాయి సిబ్బందిపై పెరుగుతున్న పనిభారం ● ప్రత్యామ్నాయ ధ్రువీకరణ విధానం కల్పించాలని వినతి మంగళగిరి టౌన్: ఎన్ఎల్ఈపీ, ఎల్సీడీసీ (ఎన్సీడీ–సీడీ) ఆరోగ్య సర్వేల్లో ప్రతి వ్యక్తికి ఏబీహెచ్ఏ రూపొందించి, ఓటీపీ ద్వారా ధ్రువీకరణ తప్పనిసరి చేయడం క్షేత్రస్థాయి సిబ్బందికి ఇబ్బందికరంగా మారిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య, ఏపీ సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్‌బాబు తెలిపారు. ఈ మేరకు మంగళగిరి పట్టణ పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ జి.వీర పాండియన్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఓటీపీ కోసం ప్రజలను ఒప్పించేందుకు అదనపు సమయం వెచ్చించాల్సి రావడంతో సర్వే సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని వారు తెలిపారు. మొబైల్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం, నెట్వర్క్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం, వ్యక్తిగత గోప్యత కారణంగా కొందరు ఓటీపీ చెప్పేందుకు నిరాకరించడం వంటి సమస్యలతో సర్వే ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు. నిర్ణీత 14 రోజుల్లో ఎన్ఎల్ఈపీ సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, ప్రతి వ్యక్తికి ఏబీహెచ్ఏ–ఓటీపీ ప్రక్రియను పునరావృతం చేయడం వల్ల రోజువారీ సర్వే లక్ష్యాలు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఓటీపీ సాధ్యం కాని సందర్భాల్లో ప్రత్యామ్నాయ ధ్రువీకరణకు అవకాశం కల్పించాలని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సరళమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్సీడీసీ ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, సిబ్బందిపై అదనపు భారం పడకుండా విధానాన్ని సరళీకరించాల్సిన అవసరం ఉందని వెంకటసుబ్బయ్య, రమేష్‌బాబు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ నాయకులు సుజాత, స్పందనలతో పాటు సెక్రటరిలు వనిత జ్యోతి, నాగమణి, అరుణ, దుర్గ, సుకన్య, అంజలమ్మ, ఉషారాణి, ప్రతిభ, విజయకుమారి, కిరణ్‌కుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు పోటీలు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చండ్రాకోల్ చేతబట్టి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పళ్ల పోటీలను ఆరంభించారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఒంగోలు జాతి గిత్తలు పోటీల్లో పాల్గొన్నాయి. ప్రారంభించిన ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బూర్ల -
గెజిట్ నోటిఫికేషన్ విడుదల
గుంటూరు కార్పొరేషన్లో 76 డి విజన్లు ఖరారు నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) పరిధిలోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. నగరంలో డివిజన్ల సంఖ్యను 57 నుంచి 76కు పెంచుతూ ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆదేశాల మేరకు కార్పొరేషన్ కమిషనర్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ ఆధారంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి సేకరించిన వినతులు, అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఈ తుది నోటిఫికేషన్ ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పునర్విభజన జరిగిన 76 డివిజన్ల పరిధిలోని నాలుగు వైపులా సరిహద్దులు (ఉత్తరం, తూర్పు, దక్షిణం, పశ్చిమం), విస్తరించిన కాలనీలు, డోర్ నంబర్ల వివరాలను గెజిట్‌లో స్పష్టంగా పొందుపరిచారు. నగర శివారు ప్రాంతాలు, కొత్తగా విలీనమైన గ్రామాలు, ప్రధాన రహదారుల విస్తరణకు అనుగుణంగా వార్డుల రూపురేఖలను నిర్దేశించారు. పెరిగిన జనాభాకు తగినట్లుగా పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికే డివిజన్ల సంఖ్యను పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సరిహద్దుల విభజనే ప్రామాణికం కానుండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలు నయా డివిజన్ల లెక్కలపై దృష్టి సారించాయి. పూర్తి వివరాలు అధికారిక గెజిట్ ద్వారా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. -
రాష్ట్రానికే ఆదర్శం గుంటూరు జిల్లా కోర్టు
గుంటూరు లీగల్: సివిల్ కేసుల పరిష్కారంలో గుంటూరు జిల్లా కోర్టు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈనెల 12వ తేదీన నిర్వహించిన లోక్ అదాలత్‌లో 1,041 కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. వరుసగా ఆరుసార్లు ఈ ఘనత సాధించింది. ఈ విజయం వెనుక జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ప్రత్యేక పర్యవేక్షణ ఉంది. పరిష్కారానికి అనుకూలమైన కేసులను గుర్తించడం, ప్రీ–లోక్ అదాలత్ చర్చలు నిర్వహించడం, నిరంతర పర్యవేక్షణ, న్యాయాధికారులు, న్యాయవాదులు, సంబంధిత సంస్థలతో సమన్వయం వంటి క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించడం ద్వారా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఇలా రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. జూలై 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు నిర్వహించిన ఆరు జాతీయ లోక్ అదాలత్‌లలో డీఎల్ఎస్ఏ మొత్తం 7,900 సివిల్ కేసులను పరిష్కరించింది. 2025 జూలై 5న – 1,076, సెప్టెంబర్ 13న – 937, డిసెంబర్ 13న– 1,407, 2026 మార్చి 14న–1,784, జూలై 11న – 1,655, సెప్టెంబర్ 12న – 1,041 కేసులు పరిష్కారం అయ్యాయి. లక్ష క్రిమినల్ కేసులు పరిష్కారం సివిల్ కేసులతోపాటు, ఈ ఆరు లోక్ అదాలత్‌లలో 1,07,710 క్రిమినల్ కేసులను, 424 ప్రీ–లిటిగేషన్ కేసులను పరిష్కరించింది. మొత్తం పరిష్కరించిన కేసుల సంఖ్య 1,16,034కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ దొనాది రమేష్ మార్గదర్శకత్వంలో, డీఎల్ఎస్ఏ చైర్మన్ , ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.సాయి కళ్యాణ చక్రవర్తి పర్యవేక్షణలో ఈ ఘనత సాధించినట్లు డీఎల్ఎస్ఏ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. పరిష్కారానికి అధిక అవకాశం ఉన్న కేసులను గుర్తించేందుకు సీనియర్ స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం, స్టేషన్ వారీగా కేసులను గుర్తించడం ప్రధానమైన విధానాలలో ఒకటని ఆయన తెలిపారు. వరుసగా ఆరుసార్లు ప్రథమ స్థానం -
సర్వర్... చుక్కలు చూ‘పింఛెన్’!
పింఛను దరఖాస్తుకు నేడు తుది గడువు నెహ్రూనగర్ కొత్త సామాజిక పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగుస్తుండటంతో జిల్లాలోని దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా దరఖాస్తుల ప్రక్రియను తెరపైకి తెచ్చింది. సర్వర్ల వైఫల్యం, సాంకేతిక లోపాల కారణంగా వేలాది మంది అర్హుల దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు కావడం లేదు. బుధవారం సాయంత్రంతో గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఆన్లైన్ కాని దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారా? లేక చెత్తబుట్టలో వేస్తారా? అనే భయం అర్హులను వెంటాడుతోంది. నిత్యం ‘రేపు రండి...’ గుంటూరు జిల్లాలో 15వ తేదీ నాటికి మొత్తం 37,270 దరఖాస్తులు అందాయి. వీటిల్లో 36,806 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 441 దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయి. 23 దరఖాస్తులు తిరస్కరించినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గుంటూరు నగర కార్పొరేషన్ పరిధితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న మొత్తం 568 సచివాలయాల వద్ద పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన కొద్దిరోజుల గడువులో వరుసగా సెలవులు వచ్చాయి. పైగా మిగిలిన అతి స్వల్ప సమయంలో సర్వర్లు కూడా పూర్తిగా మొరాయించాయి. ఒక్కో దరఖాస్తు నమోదుకు రెండు ఓటీపీలు అవసరం కాగా, సర్వర్ డౌన్ వల్ల అవి రాకపోవడం, పేజీలు లోడ్ కాకపోవడంతో సచివాలయాల్లో రోజుకు కనీసం పది దరఖాస్తులు కూడా అప్లోడ్ కావడం లేదు. గంటల తరబడి పడిగాపులు కాసిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ‘సర్వర్ రావట్లేదు.. రేపు రండి’ అంటూ సిబ్బంది తిప్పి పంపిస్తున్నారు. సవాలక్ష ఆంక్షలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా ఆధార్, రేషన్ కార్డులతో ఏటా జనవరి, జూలై నెలల్లో పారదర్శకంగా కొత్త పింఛన్లు అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను రసీదులు, కరెంట్ బిల్లులంటూ సవాలక్ష కొర్రీలు పెట్టింది. భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, రేషన్ కార్డులో పేరు తొలగించలేదనే సాకుతో వితంతువుల దరఖాస్తులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని పలువురు వాపోతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్ హామీని పూర్తిగా గాలికొదిలేశారు. గడువు ముగిస్తే పరిస్థితేంటి? బుధవారంతో ప్రభుత్వం విధించిన గడువు ముగుస్తుండగా, జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తులు సచివాలయ సిబ్బంది చేతుల్లో మాన్యువల్‌గానే ఉండిపోయాయి. ఇప్పుడు ఆన్లైన్ ప్రక్రియ నిలిచిపోతే తమ దరఖాస్తుల పరిస్థితి ఏంటని నిరుపేదలు కన్నీటి పర్యంతమవుతున్నారు. నామమాత్రపు గడువుతో ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమా అని పలువురు మండిపడుతున్నారు. గడువును తక్షణమే పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వినాయకుడి పూజలు
నెహ్రూనగర్: నగరంలో వినాయక చవితి వేడుకలను వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, తూర్పు నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శేషగిరి పవన్‌కుమార్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పందిరితో పాటు, 4వ డివిజన్లో కన్నా యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న అంబటి రాంబాబు, నూరి ఫాతిమా -
విశేషాలంకారంలో గణనాథుడు
అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరాలయంలో సోమవారం వేకువజామునే స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణనాథునికి పత్రితో సహస్రనామ పూజ చేశారు. విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. పెదకాకాని: శివాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మహా గణపతిని ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూలతో అలంకరించి, విశేష పూజలు నిర్వహించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గణపతి నవరాత్రులలో భాగంగా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం విశేష అర్చనలు జరుగుతాయన్నారు. ఈ నెల 23వ తేదీన విఘ్నేశ్వరుని నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది వినూత్న రీతిలో సర్కారుకు తమ నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత నెల నుంచి గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది రోజూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణపతి విగ్రహానికి తమ వినతి పత్రం అందజేశారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు నూరు శాతం గ్రాస్ జీతం చెల్లించాలని, బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విగ్రహానికి అందజేశారు. తమ కోరికలు నెరవేరేలా అనుగ్రహం చూపాలని స్వామి వారిని మొక్కుకున్నారు. చవితి రోజు సైతం ఆసుపత్రిలో రంగోలి కార్యక్రమం నిర్వహించారు. కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. బంగారం, నగదు కాజేత గుంటూరు రూరల్: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి కాలనీలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరస్వతి కాలనీ ఏడో లైనుకు చెందిన కె.వీరాంజనేయులు ఇబ్రహీంపట్నం స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. 26 గ్రాముల బంగారం చైను, 12 గ్రాముల బ్రాస్లెట్, 17 గ్రాముల చెవి రింగులు, రూ. 2.96 లక్షల నగదు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
జై గణేశా.. జైజై గణేశా..
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026వినాయక చవితిని జిల్లాలోని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. సోమవారం భక్తిశ్రద్ధలతో గణనాథుడిని ఇంటింటా కొలిచారు. ఆనందంగా వేడుకలను జరుపుకొన్నారు. ఊరూవాడా మండపాలు ఏర్పాటు చేసి వైవిధ్య రూపాల్లో గణపయ్యను కొలువుదీర్చారు. పూజలు, భజనలు, నైవేద్యాలతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ భక్తులు ‘‘జై గణేశా.. జై జై గణేశా’’ అంటూ ఎంతో ఉత్సాహంగా పూజల్లో పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు -
రద్దీ మాటున ప్రైవేట్ దోపిడీ!
పట్నంబజారు: పండుగ వచ్చిందంటే చాటు.. ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ప్రయాణికులను ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుతింటున్నారు. వినాయక చవితి.. వరుస సెలవులు.. స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల తాకిడి.. ఇదే అదనుగా చార్జీలు పెంచేశారు. ఆర్టీసీ విఫలం ఈ నెల 12, 13, 14 తేదీలు వరుసగా సెలవులు రావటంతో సుదూర ప్రాంతాల నుంచి గుంటూరుకు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. సెలవులు, పండుగ అయిపోవడంతో తిరుగు పయనమయ్యారు. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరగడంతో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్ల దోపిడీ మొదలైంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. సుదూర ప్రాంతాలకు బస్సులు నడపటంలో పూర్తిగా విఫలం అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రజల నుంచి యజమానులు పండుగ పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. గుంటూరు నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఉండే చార్జీలతో పోలిస్తే పండుగ సమయంలో టికెట్ ధరలను గణనీయంగా పెంచుతున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సిన వారు అడిగిన మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అన్ని మార్గాల్లో తగినన్ని బస్సులు లేవు. రాత్రి వేళల్లో హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విశాఖపట్నం నగరాలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు తగ్గిపోతున్నాయి. భారీగా దోపిడీ కుటుంబాలతో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ ఆపరేటర్లు అదనపు చార్జీల మోత మోగిస్తున్నారు. పండుగ సమయంలో భారీగా వసూలు చేస్తున్నారు. చివరి నిమిషంలో మరింత భారం పడుతోంది. కుటుంబ ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు అధిక ధర చెల్లించక తప్పడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పరిశీలిస్తే.. గుంటూరు–హైదరాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సు చార్జీలు సర్వీసును బట్టి సుమారు రూ.451 నుంచి రూ.767 వరకు కనిపిస్తున్నాయి. గుంటూరు – చైన్నె మార్గంలో సుమారు రూ.670 నుంచి రూ 900 వరకు ఉండగా, విశాఖపట్నంకు రూ.626 నుంచి రూ.796 వరకు ఉన్నాయి. బెంగళూరుకు రూ.1,033 నుంచి రూ.1,818 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ చార్జీలకు అనుగుణంగా ప్రైవేట్ చార్జీలు ఉండాలనే నిబంధనలు చెబుతున్నాయి. హైదరాబాద్‌కు రూ. 2 వేలు, స్లీపర్‌కు రూ.3 వేలు, బెంగళూరుకు రూ.4 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లోనే భారీ చార్జీలు చూపుతున్నారు.. ఇక ఆఫ్‌లైన్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పండుగ రద్దీ ముందుగానే తెలిసినా ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయలేదు. ప్రధాన రహదారులు, బస్టాండ్లు, ప్రైవేట్ బస్సులు బయలుదేరే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పర్మిట్ ఉల్లంఘన, అధిక ప్రయాణికుల తరలింపు, నిబంధనలకు విరుద్ధంగా చార్జీలు వసూలు చేయడం, ఫిట్నెస్, ఇతర పత్రాల్లో లోపాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కనీసం ఒక్కటంటే ఒక్క తనిఖీ కూడా చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిక చార్జీలు వసూలు చేస్తున్నా అధికారులు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా టీడీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏఎన్‌యూ స్వర్ణోత్సవాలు విజయవంతం
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వర్సిటీ వీసీ కె.గంగాధరరావు అన్నారు. స్వర్ణోత్సవాలు విజయవంతం కావడంతో మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచేలా స్వర్ణోత్సవాలు నిర్వహించామన్నారు. వేడుకల నిర్వహణలో బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. దశల వారీగా నిర్వహించిన కార్యక్రమాలతో వర్సిటీ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ, విదేశాలలో ఏఎన్‌యూ కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం మాట్లాడుతూ స్వర్ణోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వర్సిటీ పాలకమండలి సభ్యులు ఎం.త్రిమూర్తిరావు, ప్రొఫెసర్ ఎస్.మురళీమోహన్, డాక్టర్ పి.సుధాకర్, వర్సిటీలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్ సిహెచ్.లింగరాజు, ప్రొఫెసర్ పీపీఎస్ పాల్ కుమార్, ప్రొఫెసర్ తేజోమూర్తి, ప్రొఫెసర్ నిరూపమా, దూరవిద్య కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డి.రామచంద్రన్ పాల్గొన్నారు. -
రేపు కలెక్టరేట్ వద్ద ధర్నా
నెహ్రూనగర్: రాష్ట్రంలో దళిత, గిరిజనులపై పోలీసుల దాడులు, అక్రమ నిర్బంధాలను నిరసిస్తూ గురువారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు దళిత, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. మంగళవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ తదితరులు మాట్లాడారు. నగరంపాలెం: వినాయకచవితి పండుగ సందర్భంగా జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని డీఎస్పీలు, ఎస్హెచ్ఓలతో సెల్‌ఫోన్ కాన్ఫరెనన్స్ నిర్వహించారు. వినాయక ప్రతిమల ఏర్పాటు, పూజా కార్యక్రమాలు, నిమజ్జనం తదితర అంశాలపై జిల్లా ఎస్పీ సమీక్షించారు. – నేడు నామినేషన్ల స్వీకరణ నగరంపాలెం: గుంటూరు నగరంలోని ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఈనెల 26న జరగనున్న ఎన్నికలకు బుధవారం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఎన్నికలు ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష పీఠం ఎవర్ని వరిస్తుందనే ఉత్కంఠ వ్యాపార వర్గాల్లో నెలకొంది. ఏళ్ల క్రితమే గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఉంది. అందులో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని వ్యాపార వర్గాలకు సభ్యత్వాలు ఉన్నాయి. సుమారు 3,200 మంది ఓటర్లు ఉండగా, ఈనెల 26న ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 16న చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అధ్యక్ష పదవితోపాటు పలు పదవులకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏడాదికి ఒకసారి జరగనున్న ఈ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి ఐదారు మంది అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. మూడు దశాబ్ధాలకుపైగా అధ్యక్షుడిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే గత రెండేళ్లుగా అధ్యక్ష పదవికి పోటీపడటం అనివార్యమైంది. దీంతో అప్పటి నుంచి చాంబర్ ఎన్నికలు వేడెక్కాయి. దీంతో గత రెండేళ్లు ఏల్చూరి వెంకటేశ్వర్లు అధ్యక్షునిగా కొనసాగారు. ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీపడేందుకు వ్యాపార ఓటర్ల వర్గాల్లో ఆశావాహులు ఎక్కువయ్యారు. ఈసారైనా అధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు గతంలో పోటీ చేసిన అభ్యర్థులు, కొత్తగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నూతన అభ్యర్థులు బరిలో పోటీపడనున్నారు. రెండేళ్లుగా అధ్యక్షునిగా కొనసాగిన ఏల్చూరి వెంకటేశ్వర్లు మూడోసారి హాట్రిక్ సాధించేందుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నామినేషన్ల స్వీకరణ ముగిసిన రోజే నూతన అధ్యక్షుడు ఎవరనేది తెలుస్తోందని చాంబర్లో బాహాటంగానే వినిపిస్తోంది. -
గోపి మృతిపై న్యాయ విచారణ చేపట్టాలి
తాడికొండ: పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి మృతిపై న్యాయ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పొన్నెకల్లులో గోపి కుటుంబాన్ని సీపీఐ బృందం పరామర్శించింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతుని భార్య జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. పార్టీ తరఫున కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయకులు చిన్ని తిరుపతయ్య, మేడా హనుమంతరావు, ముప్పాళ్ళ శివశంకరరావు, రేపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు లాక్కెళ్లిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. మంగళగిరి పట్టణానికి చెందిన దుర్గ సోమవారం సాయంత్రం తన ఇంటి నుంచి సరుకులు కొనుగోలు చేసేందుకు గౌతమ బుద్ధ రోడ్డులోని ఉషోదయ సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. సరుకులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో ఉర్వశి థియేటర్ సమీపంలోకి రాగానే బైక్‌పై ముగ్గురు వ్యక్తులు తనను వెంబడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా ఆమె మెడలోని లాకెట్‌తో కూడిన సుమారు 4 సవర్ల బంగారు గొలుసును లాక్కొని వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో దుర్గ కిందపడి గాయపడినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన అనంతరం బాధితురాలు తన కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కుమారుడితో కలసి ఆమె మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సివిల్ కేసుల పరిష్కారంలో గుంటూరుకు ప్రథమస్థానం
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ మార్గదర్శకత్వంలో, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ చక్రవర్తి నాయకత్వంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన జిల్లా కోర్టు ప్రాంగణంలో కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 46 బెంచ్‌లను, జిల్లా కోర్ట్‌లో 16 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 14,587 కేసులను పరిష్కరించారు. వీటిలో సివిల్ కేసులు 954, క్రిమినల్ కేసులు 13594, ప్రీ– లిటిగేషన్ కేసులు 39 ఉన్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అధిక విలువ కలిగిన అనేక కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించబడ్డాయని తెలిపారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రంలో సివిల్ కేసుల పరిష్కారంలో వరుసగా ఆరుసార్లు ప్రథమ స్థానాన్ని సాధించిందని పేర్కొన్నారు. అదనపు జిల్లా జడ్జిలు, అదనపు సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, అదనపు సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్), న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బార్ అసోసియేషన్ సభ్యులు, ఇన్స్యూరెన్స్ కంపెనీ, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న 24 భూ సేకరణ అప్పీళ్లకు లోక్‌అదాలత్‌లో పరిష్కారం లభించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దేవరపల్లి జయంత్ కుటుంబసభ్యులకు రూ.96 లక్షల పరిహారం చెల్లించేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీ అంగీకరించింది. సోదరీమణులు తమ ఆస్తి హక్కును వదులుకుని రూ.రెండు కోట్లు స్వీకరించేందుకు అంగీకరించారు. -
మద్యం దుకాణాల రెన్యూవల్‌కు నోటిఫికేషన్
నెహ్రూనగర్: గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఓపెన్, రిజర్వు కేటగిరీ మద్యం దుకాణాల రెన్యూవల్‌కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు శనివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక ఏడాది కాలపరిమితికి (01.10.2026 – 30.09.2027 వరకు) గానూ ఈ కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పరిధిలో 125 ఓపెన్ దుకాణాలు, 13 గీత కులాలకు కేటాయించిన దుకాణాలు ఉన్నాయని తెలిపారు. పల్నాడు జిల్లాలో 129 ఓపెన్, 13 గీత కులాల మద్యం దుకాణాలు ఉన్నాయని చెప్పారు. చెల్లింపు నిబంధనలు ఇలా... నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు వైన్ షాపుల్లో ఎమ్మార్పీ ధరలకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలని.. ఎవరైనా మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నట్లు గుర్తిస్తే మొదటిసారి రూ.10 లక్షలు జరిమానా.. రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. అదే విధంగా ప్రతి షాపులోనూ తప్పనిసరిగా సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉండాలని, వాటికి కమాండ్ కంట్రోల్ అయిన ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్, జిల్లా అధికారులకు యాక్సెస్ ఉంటుందన్నారు. సీసీ కెమెరాలను ట్యాంపరింగ్ చేస్తే మొదటిసారి రూ.50 వేలు, రెండోసారి రూ. లక్ష, మూడోసారి లైసెన్స్ రద్దు ఉంటుందన్నారు. 21వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఆసక్తిగల వారు ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఏపీఎస్బీసీఎల్టీడీ.ఏపీ.జీఓవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. ఎవరైనా మద్యం షాపులను రెన్యూవల్ చేసుకోని వారు ఉంటే, సదరు షాపులకు ఈ నెల 22 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించి, 30వ తేదీన లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీఈఓ) వి. అరుణకుమారి, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ. మారయ్యబాబు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే దోపిడీ ముఠాలు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఆధారాలు దొరక్కుండా వ్యూహాత్మకంగా దోపిడీలకు పాల్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడడంతో బయట రాష్ట్రాల వారితోపాటు జిల్లాకు చెందిన కొంతమంది కూడా ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడులో హత్యలు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు, దోపిడీల పరంపరను పరిశీలిస్తే.. అధిక శాతం దొంగతనాలు తాళాలు వేసి ఊరికి వెళ్లిన వారి ఇళ్లల్లోనే జరుగుతున్నాయి. ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధులు ఉండే ఇళ్లను ముందుగానే రెక్కీ వేసి ఎంచుకుని మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. 80 శాతం దొంగతనాలు ఇలాంటివే కావడం గమనార్హం. గుంటూరు జిల్లాలో... బాపట్ల జిల్లాలో... బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, చీరాల, మార్టూరు వంటి ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో భారీ మొత్తంలో సొత్తు చోరీకి గురైనట్లు కేసులు నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో సొత్తు మాత్రం రికవరీ చేయని పరిస్థితి నెలకొంది. వినుకొండ పట్టణంలో వరుస దొంగతనాలు అక్కడి ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించి రాత్రిపూట గస్తీలు ముమ్మరం చేసి దొంగతనాలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. లక్ష్మీపురం: క్రికెట్ అండర్–19 వన్డే ఆంధ్రా జట్టుకు గుంటూరు నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎ.దేవ ప్రమోద్ వికెట్ కీపర్ కం బ్యాటర్, ఎం. శ్రీ సమన్విదత్త ఓపెనింగ్ బ్యాటర్‌గా, కె.వి.కౌశిక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా, ఎస్.కె. అబ్దుల్ జబ్బర్ లెగ్ స్పిన్నర్‌గా జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఆంధ్రా జట్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు త్రీ మెన్ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. త్వరలో జరగబోయే అంతర్రాష్ట్ర పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కోచ్‌కి, సెలక్షన్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గంటల కొద్దీ ట్రాఫిక్‌కు అంతరాయం చేబ్రోలు: చేబ్రోలు – మంచాల గ్రామాల మధ్య ఉన్న కొమ్మమూరు బ్రిడ్జిపై శనివారం రాత్రి లారీ నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొన్నూరు, గుంటూరు మార్గాల వైపు కి.మీ.ల పొడువున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎనిమిది రోజుల కిందట కొమ్మమూరు బ్రిడ్జికి ఒకవైపు కొంతభాగం కూలిపోయింది. అప్పటి నుంచి పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. పెద్ద వాహనాలు బ్రిడ్జిపైనుంచి రాకపోకలు సాగకుండా చర్యలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం సమయంలో కొద్దిపాటి వర్షం కురిసింది. పొన్నూరు వైపు లారీ వెళుతుండగా బ్రిడ్జిపైభాగంలో ఎదురుగా మరో వాహనం వచ్చింది. లారీ ఆగిపోవటంతో దీనిని సర్దుబాటు చేయటానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. రెండు వైపులా సుమారు ఐదు కి.మీ. మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. బ్రిడ్జి దాటడానికి వాహనదారులకు గంటలకొద్దీ సమయం పట్టడంతో అవస్థలు తప్పలేదు. మరోవైపు వర్షం పడటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి అయినప్పటికీ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో క్లియర్ కాకపోవడంతో పోలీసులకు కూడా కష్టాలు తప్పలేదు. ఈపూరు: తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ జలాలను విడుదల చేసిన క్రమంలో 85వ మైలు సమీపంలో కుడి ప్రధాన కాలువను ఎస్ఈ టి. రమేష్ శనివారం పరిశీలించారు. కాలువలో నీటి ప్రవాహ కొలతలను తెలుసుకున్నారు. నీటి వృథా జరగకుండా కాలువలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను పరిగణనలో తీసుకుని తాగునీటి చెరువులను సకాలంలో నింపాలని ఆదేశించారు. వెంట ఈఈ ఆర్.మల్లికార్జున, డీఈఈ షేక్ ఖాదర్, ఏఈ ఎం యుగంధర్ ఉన్నారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,535 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హై లెవెల్‌కి 96 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 604, తూర్పు కాలువకు 403, పశ్చిమ కాలువకు 150, నిజాంపట్నం కాలువకు 250, కొమ్మమూరు కాలువకు 915 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దొంగతనాలు జరిగిన వెంటనే పోలీసులు స్పందించకపోవడంతో పాటు, దొంగలు దొరికినా బాధితులు పోగొట్టుకున్న సొత్తు మాత్రం పూర్తి స్థాయిలో వారి చేతికి అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చోరులు చెలరేగిపోతున్నారు. దొంగతనానికి వచ్చి ఇంట్లోని వారిని సైతం చంపేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ దొంగతనాలు, దోపిడీలతో హడలిపోతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా నేరాల నియంత్రణకు చంద్రబాబు సర్కారు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఐ ప్రతీకాత్మక చిత్రం -
శివ శక్తి.. వీక్షణతో సంతృప్తి
తెనాలి: తెనాలికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు రాయన గిరిధరగౌడ్ తాజా చిత్రాలు దేశ రాజధాని ఢిల్లీలో కళాప్రియులను ముగ్ధులను చేయనున్నాయి. ఆరుగురు చిత్రకళాకారులతో కలిసి అక్కడి బికనీర్ హౌస్‌లోని సెంట్రల్ హాలులో ఈ బృంద ప్రదర్శన ఏర్పాటు కానుంది. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరిగే ప్రదర్శనలో గిరిధర్గౌడ్వి ఐదు పెయింటింగ్స్, పది రేఖాచిత్రాలు కొలువుదీరనున్నాయి. లేపాక్షి చిత్రకళలోని సంప్రదాయ ప్రతిధ్వనులను దాటి, ఆధునికతను జోడించి శివ–శక్తిల శాశ్వత తత్వాన్ని దృశ్యీకరించిన చిత్రసరళి ఇది. విభిన్న శైలులు... మైసూర్లో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ, బరోడాలో పీజీ చేసిన గిరిధరగౌడ్ అక్కడే కొంతకాలం ఫ్యాకల్టీగా పనిచేశారు. ఉద్యోగ జీవితం సంతృప్తిగా అనిపించక తెనాలి సమీపంలోని స్వస్థలం గరువుపాలెంలో స్థిరపడ్డారు. అక్కడే చిత్రకళా రచనలో ప్రయోగాలు చేస్తున్నారు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రభావంతో తొలిదశలో పౌరాణిక చిత్రాలను గీస్తూ వచ్చారు. ఒకే మూసకు పరిమితం కాకుండా తన కళాజీవితంలో మహాభారతం, రామాయణం ఇతివృత్తాలను, విభిన్న శైలులను అనుసరించి ఒకదాని తర్వాత ఒకటిగా చిత్రకళా సిరీస్‌ను రూపొందిస్తున్నారు. వర్ణాల వినియోగంలో విలక్షణత గిరిధరగౌడ్లోని ప్రత్యేకతగా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ‘లేపాక్షి’కి నవ్యధోరణి... కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఫెలోషిప్తో లేపాక్షి చిత్రకళపై చేసిన పరిశోధన అనంతరం చిత్రకళా రీతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఐదు శతాబ్దాల నాటి లేపాక్షి కళలోని మంచి లక్షణాలను, శైలిని దృష్టిలో ఉంచుకొని నవ్యధోరణితో, రంగుల మేళవింపుతో ఆధునికతను మేళవిస్తున్నారు. చిత్రకళా రచనలో ‘దశావతారాలు’ నుంచి రకరకాల సిరీస్‌లను తీసుకొచ్చారు. ఆ క్రమంలో చిత్రీకరించిన కళాఖండాలను ‘శివ శక్తి’ సిరీస్‌గా గతేడాది హైదరాబాద్ కళాకృతిలో ప్రదర్శించారు. తాజాగా ఢిల్లీలో బృంద ప్రదర్శనకు చేసిన చిత్రాలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. హిందూ చింతనలోని అత్యంత లోతైన తాత్విక భావనలలో ఒకటైన శివ–శక్తి శాశ్వత తత్వాన్ని అన్వేషించేవిగా ఉన్నాయి. చైతన్య తత్వాన్ని వివరించేలా... శివ–శక్తికి సంబంధించిన విడదీయరాని బంధాన్ని శ్రీచక్రం, ప్రకృతి–పురుష తత్వం ద్వారా దృశ్యకళారీతిలో ప్రయోగాత్మకంగా చేసిన చిత్రసరళిగా గిరిధరగౌడ్ చెప్పారు. శివుడు, శివ శక్తి, నంది, సింహనంది, మయూర, గణపతి, కుమారస్వామి, మూషికం... కుటుంబం అంతా మమేకమై సృష్టికి సంబంధించిన చైతన్యతత్వాన్ని వివరించే దృశ్య రూపాలివి. వీటిలో సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ రూపాలను ఈ చిత్రసరళిలో శ్రీచక్ర రూపంలో ఇమిడి ఉండేలా చిత్రీకరించారు. శ్రీచక్రం స్వరూపాన్ని కేవలం దృశ్యమాధ్యమంలా కాకుండా, శివ–శక్తి త్రికోణాత్మక తత్వాలను జోడించారు. ఆదిశంకరాచార్య ‘సౌందర్యలహరి’లోని శ్లోకాలను స్ఫూర్తిగా తీసుకుని, అర్ధనారీశ్వర స్తోత్రానికి ఆలంబనగా శివకుటుంబం మహత్యాన్ని దృశ్యమాధ్యమంలో తెలియజేశానని ఆయన పేర్కొన్నారు. అక్రిలిక్ పెయింటింగ్స్‌కు బంగారం, వెండి పూతను అద్దటం మరో విశిష్టత. దేశవిదేశాల్లో చిత్రాలు... గత మూడు దశాబ్దాల్లో వివిధ రాష్ట్రాల్లోని గ్యాలరీల్లో 10 సోలో ఎగ్జిబిషన్లు చేశారు గిరిధరగౌడ్. దేశవ్యాప్తంగా జరిగిన 37 గ్రూప్ ఎగ్జిబిషన్లలోనూ చిత్రాలను ప్రదర్శించారు. వీటిలో లండన్, న్యూయార్క్, సింగపూర్, చైనా తదితర ఎగ్జిబిషన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతోపాటు అనేక కళాసంస్థల నుంచి గౌరవాన్ని అందుకున్నారు. -
కార్పొరేషన్ పీఠం వైఎస్సార్ సీపీదే
నెహ్రూనగర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్ సీపీ నేతలు స్పష్టం చేశారు. రానున్న గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కై వసం చేసుకోవడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో కదనరంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు నియోజకవర్గ షేక్ నూరి ఫాతిమా అధ్యక్షతన నిర్వహించిన తూర్పు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, తూర్పు నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ ప్రసంగించారు. తొలుత దివంగత మహానేత డాక్టర వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం నియోజకవర్గంలోని డివిజన్, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను (ఐడీ కార్డులు) పంపిణీ చేశారు. -
విజ్ఞాన్‌లో ఘనంగా ఏపీ ఫార్మసీ లీడర్షిప్ సమ్మిట్–2026
చేబ్రోలు: ఫార్మసీ రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలు కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధనా దృక్పథం, నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరమని ఐపీజీఏ అధ్యక్షుడు డాక్టర్ అతుల్ నాసా అన్నారు. ఫార్మసీ రంగంలో భవిష్యత్ అవకాశాలు, కెరీర్ మార్గాలు, వృత్తిపరమైన అభివృద్ధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ఏపీ ఫార్మసీ లీడర్ షిప్ సమ్మిట్–2026’ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, ఫార్మసీ కళాశాల, ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (ఐపీజీఏ) ఏపీ స్టేట్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐపీసీ–2026 బ్రోచర్‌ను అతిథులు ఆవిష్కరించారు. ‘అన్లాకింగ్ ఫ్యూచర్ కెరీర్స్ అండ్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్’ అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఫార్మసీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులకు భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు పరిశ్రమలో వస్తున్న నూతన మార్పులు, ఆధునిక సాంకేతికత, పరిశోధన రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజధాని పనుల పురోగతిపై మంత్రి సమీక్ష
వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని దుర్గాప్రసాద్ గుంటూరు రూరల్: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతేడాది పంట నష్టం కూడా ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని దుర్గాప్రసాద్ అన్నారు. గుంటూరు అమరావతిరోడ్డులోని ఓ ప్రైవేటు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు పంటలకు ఇన్స్యూరెన్స్ చేయించి పంట నష్టాలను జగన్ అందజేశాడని, కానీ నేడు టీడీపీ ప్రభుత్వం రైతులతోనే పంటలకు ఇన్స్యూరెన్స్ కట్టాలని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రైతులకు చేసిందేమీ లేకపోయినా కనీసం ఇన్స్యూరెన్స్, పంటనష్టాలను కూడా చెల్లించకుండా రైతులను టీడీపీ ప్రభుత్వం దగా చేస్తుందన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడటంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి గుంటూరు జిల్లాలో అన్ని మండలాలలో వర్షాభావ పరిస్థితులపై తక్షణమే సమగ్ర పంట నష్టం సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు తగిన పరిహారం, ఇన్‌న్‌పుట్ సబ్సిడీ అందించాలన్నారు. వర్షాభావంతో నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకునేందుకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకోవాలి
గుంటూరు మెడికల్: పండుగలను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణ బాధ్యతతో జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య అన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ పర్యావరణ హిత వినాయక చవితి వేడుకలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం గుంటూరు ఆధ్వర్యంలో పర్యావరణ మానవ సమాజ భద్రత ఫౌండేషన్, పర్యావరణ విద్యా కో ఆర్డినేటర్ డి.తిరుపతిరెడ్డి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో అంతర్భాగమని చెప్పారు. అయినప్పటికీ వాటి వల్ల పర్యావరణానికి హానికలుగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కృష్ణయ్య వెల్లడించారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ ఎం.డి.నజీనాబేగం మాట్లాడుతూ ప్లాస్టర్ ప్యారీస్(పీఓపీ) విగ్రహాలు, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి నాణ్యతతోపాటు, జలచరాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన విగ్రహాలు, సహజ రంగులను వినియోగించడం పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయమని వెల్లడించారు. పండుగ సమయంలో ప్లాస్టిక్ అలంకరణలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు. సహజ పదార్ధాలను ఉపయోగించాలని, పర్యావరణానికి హాని కలుగకుండా బాధ్యతాయుతమైన నిమజ్జన పద్ధతులు పాటించాలని సూచించారు. సహజ మట్టితో, వివిధ విత్తనాలతో కలిపి తయారు చేసిన 3వేల గణేష్ విగ్రహాలను రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఉచితంగా పంపిణీ చేశారు. పూజల అనంతరం విగ్రహాలను మట్టిలో నాటడం ద్వారా వాటిలోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరిగే విధంగా రూపొందించినట్లు నజీనా బేగం చెప్పారు. సంప్రదాయ పండుగను పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, జీవ వైవిద్య పరిరక్షణతో అనుసంధానం చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు పాల్గొన్నారు. -
ఏపీ సీఆర్డీఏ గ్రీవెన్స్ రద్దు
తాడికొండ: రాజధానిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను వినాయక చవితి పర్వదినం సందర్భంగా రద్దు చేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి సెలవు దినాలలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ సమస్యలు పంపించాలని సూచించారు. వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సింగు గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సింగు నరసింహారావును వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జీడీసీసీ బ్యాంక్ బ్రాంచిల్లో డిపాజిట్లు పెంచాలి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(జీడీసీసీబీ) పరిధిలో డిపాజిట్లను గణనీయంగా పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు సూచించారు. జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ సమావేశం బ్యాంక్ చైర్మన్ మక్కెన అధ్యక్షతన బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జీడీసీసీ బ్యాంక్ పరిధిలోని సహకార సంఘాల పనితీరు, ఆర్థిక పరిస్థితి, రైతులకు అందుతున్న రుణ సదుపాయాలు తదితర అంశాలపై జరిగిన సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. సమావేశంలో నాబార్డు డీడీ శరత్, ఆప్కాబ్ జీఎం అశ్విని, జీడీసీసీ బ్యాంక్ సీఈఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలికపై లైంగిక దాడి కేసులో వృద్ధుడికి యావజ్జీవం గుంటూరు లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షమీ పర్వీన్ సుల్తానా బేగం శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. పెదకాకాని పోలీస్ స్టేషన్‌న్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 708/2021 కేసులో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగళ్ల గ్రామానికి చెందిన షేక్ సుభాని(70) నిందితుడిగా ఉన్నారు. బాధితురాలి తరఫున బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవర్లు బాధ్యత తీసుకోవాలి పట్నంబజారు: ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రైవర్లు బాధ్యతతో డ్రైవింగ్ చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జి.సామ్రాజ్యం సూచించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫెరెన్స్ హాలులో శుక్రవారం హయ్యర్ బస్సులు, ఆంకాల్ బస్సుల డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆర్ఎం సాంబ్రాంజ్యం మాట్లాడుతూ సెల్‌ఫోన్ డ్రైవింగ్, మద్యం తాగడం, ఇతర కారణాలతో డ్రైవింగ్ చేయడం వలన ప్రయాణికుల జీవితాలు ఇబ్బందులు నెట్టడమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వేగనియంత్రణ, సమయస్ఫూర్తితో డ్రైవింగ్చేయాలన్నారు. అనంతరం బస్సుల ద్వారా ప్రమాదాలు జరిగిన సమయంలో ఏవిధంగా ఎదుర్కొవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఏఎస్ఐ, వైద్యశాల సెక్యూరిటీపై దౌర్జన్యం తెనాలిరూరల్: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఔట్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ, వైద్యశాల సెక్యూరిటీపై దౌర్జన్యం చేసి దాడి చేయబోయిన వ్యక్తిపై కేసు నమోదైంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం పెరవలి నుంచి సాయి, మరి కొంత మంది తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు గురువారం అర్ధరాత్రి దాటాక సుమారు 1.30 గంటల ప్రాంతంలో వచ్చారు. మద్యం తాగి ఉన్న వారు అక్కడ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న యువకుడితో వాగ్వాదానికి దిగి దౌర్జన్యం చేశారు. విషయం తెలుసుకున్న ఔట్‌పోస్ట్‌లోని ఏఎస్ఐ రఘు వెళ్లారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆయనపైనా దౌర్జన్యం చేశారు. దీనిపై త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. -
మేధకు వెన్నుదన్ను
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రస్తుతం తరం విన్నూత ఆలోచనలతో ముందుకెళ్తోంది. సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. పరిష్కారానికి సులవైన మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్పైర్ చేసే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోంది. చిట్టిబుర్రల్లో నూతన ఆలోచనలను రేకెత్తించి, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలలో ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తు న్న కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో వా టికి బీజం వేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతో పాటు సైన్స్ ఉపాధ్యాయులకు అప్పగించింది. తాజాగా 2026–27 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ మానక్ రిజస్ట్రేషన్లను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) ఆన్లైన్లో ప్రాజెక్టు నివేదికలను ఆహ్వానిస్తోంది. ఆన్లైన్లో ప్రాజెక్టు నివేదికలను నమోదు చేసుకునేందుకు తుది గడువు ఈనెల 15న ముగియనుంది. ప్రాజెక్టుల తయారీ కోసం.. విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే సమగ్ర నివేదికను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాలస్థాయిలో మూడు చొప్పున ప్రాజెక్టులను విద్యార్థులతో ఆన్లైన్లో రిజిస్టర్ చేయించాల్సి ఉంది. అందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకుని వారి పాఠశాలల్లో విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించేందుకు సైన్స్ ఉపాధ్యాయులకు బాధ్యత అప్పగించాల్సి ఉంది. గతేడాది 1,100 ప్రాజెక్టులు నమోదు గతేడాది ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శనలకు గుంటూరు జిల్లా నుంచి నమోదు చేసిన 1,100 ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైన 88 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సంబంధిత ప్రాజెక్టుల తయారీకి ఒక్కో విద్యార్థికీ రూ.10 వేలు చొప్పున మంజూరు చేసింది. గతంలో నిర్వహించిన ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శనల్లో భాగంగా పలువురు విద్యార్థులు జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపికయ్యారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటి కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డులు పొందిన విద్యార్థులు ఉన్నారు. నమోదు ఎలా అంటే.. విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డ్స్– డీఎస్టీ.జీవోవీ.ఇన్ సైట్‌కు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. విద్యార్థి పేరు, పాఠశాల, చదువుతున్న తరగతి వివరాలతో పాటు విద్యార్ధి ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా, పేరెంట్ జాయింట్ అకౌంట్ నంబ ర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు న మోదు చేయాలి. పూర్తి వివరాలను హెచ్ఎం, సైన్స్ టీచర్ల నుంచి పొందాలి. విద్యార్థులు పంపిన ప్రాజెక్టులను పరిశీలించిన తరువాత వాటిలో బెస్ట్ ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసి, ప్రదర్శన జరిగే సమయంలో వాటిని తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులను కలుపుకుని సంబంధిత విద్యార్థికి రూ.10 వేలు చొప్పున కేంద్ర అందించనుంది. సమస్యలకు పరిష్కారానికి వినూత్న ఆలోచనలు ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తుది గడువు ఈనెల 15న ముగియనుంది. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, రెసిడెన్షియల్, సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు తాము ఎంచుకున్న ప్రాజెక్టు పేరు, దాని వలన సమాజానికి, ప్రజలకు మేలు చేసే అంశాలతో ప్రాజెక్టు నివేదికను గైడ్ టీచర్ సహాయంతో సిద్ధం చేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. వైజ్ఞానిక ప్రతిభ, నూతన ఆలోచనలు కలిగిన విద్యార్థులకు ఆకాశమే హద్దుగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనల ద్వారా ప్రతిభ చాటేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో మూడు ప్రాజెక్టులు, హైస్కూల్, ఇంటర్మీడియెట్ స్థాయిలో ఐదు ప్రాజెక్టుల చొప్పున నమోదు చేసుకోవాలి. ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనపై అన్ని యూపీ, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ యాజమాన్యాలు విద్యార్థులకు సమాచారం ఇచ్చి, ఆసక్తి గల విద్యార్థులను కచ్చితంగా ప్రోత్సహించాలి. తరగతి గదిలో చదువుతో పాటు విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడంలో ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఎంతో కీలకం. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ చేయించుకోని పాఠశాలలు, కళాశాలలు తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రోత్సహించాలి. –షేక్ సలీమ్ బాషా, జిల్లా విద్యాశాఖాధికారి -
‘కాటూరి’లో అరుదైన సమస్యకు శస్త్ర చికిత్స
ప్రత్తిపాడు: అరుదైన సమస్యతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారికి కాటూరి వైద్యుల బృందం విజయవంతంగా శస్త్ర చికిత్సను చేసింది. వివరాలు.. గ్రామానికి చెందిన రితిక(6) తన మూడవ సంవత్సరం నుండే మూత్రకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. బాలికను ఆమె తల్లిదండ్రులు ఇటీవల ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలోని కాటూరి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యుల బృందం బాలికకు సీటీ యూరోగ్రామ్ పరీక్షలు చేసి రెండు వైపులా డ్యూప్లెక్స్ కిడ్నీలు, డబుల్ యూరేటర్లు (మూత్రనాళాలు) ఉన్నట్లు నిర్ధారించారు. కుడి వైపునున్న కిడ్నీ ఎగువ భాగం మూత్రనాళం బాగా ఉబ్బి, వంకర్లు తిరిగి యోని లోపలకు తెరుచుకుని ఉండటం వలనే నిరంతరం యోని నుంచి ద్రవ స్రావం అవుతున్నట్లు గుర్తించారు. దీంతో కుడి కిడ్నీలో పనిచేయని ఎగువ భాగాన్ని, ఉబ్బి వంకర్లు తిరిగిన ఎగువ మూత్రనాళాన్ని డాక్టర్ బి.ప్రకాశరావు, డాక్టర్ నిషాంత్, డాక్టర్ వెంకటేశ్వరరావులతో కూడిన వైద్యుల బృందం గురువారం శస్త్రచికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వ్యాధి వివరాలను వైద్యుల బృందం వెల్లడించింది. చిన్నపిల్లల్లో నిరంతర యోని స్రావాలు, పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తే ‘ఎక్టోపిక్ యూరేటర్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ఎక్టోపిక్ యూరేటర్ చాలా అరుదైన సమస్యని, రెండు నుంచి నాలుగు వేల మందిలో ఒకరు ఈ సమస్య బారిన పడతారని తెలిపారు. అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యుల బృందాన్ని మేనేజ్మెంట్ అభినందించింది. ఎక్టోపిక్ యూరేటర్ సమస్యకు సమర్థంగా చికిత్స -
ఆర్టీసీ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి
తాడేపల్లి రూరల్: రాజధాని పరిధిలోని పెనుమాక అమరావతి రోడ్డులో కృష్ణాయపాలెం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై అమానుషంగా మీదపడి దాడిచేసిన ఘటనపై ఆలస్యంగా తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతి నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పెనుమాక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో డ్రైవర్ తలమల ఏసురాజును పెనుమాకకు చెందిన దుర్గాప్రసాద్, బస్సు ఆపి డ్రైవర్‌ను విచక్షణా రహితంగా దాడిచేశాడు. జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ వీరేంద్ర తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 3వ తేదీన డ్రైవర్ తలమల ఏసురాజు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. డ్రైవర్ ఏసురాజును విచక్షణా రహితంగా కొట్టిన దుర్గాప్రసాద్ వీడియో ఫేస్‌బుక్‌ల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆలస్యంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్‌కు అరెస్ట్ చేసి నోటీసులు జారీ చేశారు. గుంటూరు రూరల్: కారు డ్రైవర్ ఓవర్ స్పీడుకు బొలెరో డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఎన్‌హెచ్ 16లో బుడంపాడు వద్ద ప్రకాశం జిల్లాకు చెందిన పాలకుర్తి వెంకటేశ్వర్లు బొలెరో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈక్రమంలో శుక్రవారం విజయవాడ వైపు నుంచి బొలెరో ట్రక్‌లో బాతుల లోడుతో వెళుతూ బుడంపాడు వద్ద హైవే నుంచి కిందకు దిగుతున్నాడు. అదే క్రమంలో తెనాలి బాలాజీరావుపేటకు చెందిన జల్లి సతీష్ హైవే సమీపంలోని ఆస్పత్రిలోలో ఆరోగ్యం చూపించుకుని హైవే ఎక్కేందుకు తన కారులో వెళుతున్నాడు. కారులో వెళుతూ మితిమీరిన వేగంతో హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగుతున్న బొలెరో ట్రక్‌ను ఢీకొన్నాడు. బొలెరో ట్రక్ బోల్తాపడగా డ్రైవర్ వెంకటేశ్వర్లు(45) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురికి తరలించి మృతుడి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 44 బెంచెస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సివిల్, చెక్కు బౌన్స్ కేసులు ఎక్కువగా రాజీ చేసే దిశగా న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మీడియేటర్స్‌కు వర్చువల్ పద్ధతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రైనీ ఆర్. విజయ కమల మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి వీఎస్వీ హిమబిందు, సీనియర్ సివిల్ జడ్జి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అదనపు కార్యదర్శి హెచ్. అమరలింగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: అమావాస్యను పురస్కరించుకుని మంగళగిరి కొండపై కొలువైన గండాలయ స్వామికి భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు కొండపై దీపాలు వెలిగించారు. మంగళగిరితోపాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీపాలు వెలిగించిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య రోజున గండాలయ స్వామికి దీపాలు వెలిగిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి అమావాస్యకు కొండపై స్వామి సన్నిధికి చేరుకుంటారు. దీపాలు వెలిగించడం వల్ల చీకటి దూరమై వెలుగులు నిండుతాయని, జీవితాల్లో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మంగళగిరి కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా.. సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో మిర్చి యార్డులో క్రయవిక్రయాలు, ఇతర మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెలవు రోజుల్లో మిర్చి పంటను యార్డుకు తీసుకురావద్దని యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి యార్డులో యథావిథిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు. యడ్లపాడు: చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎల్ఎన్ మూర్తి, సీఆర్డీఏ పర్యవేక్షక ఇంజినీర్ బీవీ సుధాకర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట టౌన్ సెక్షన్ పరిధిలో ఈ తనిఖీలు చేశారు. 34 బృందాలు, 34 మంది అధికారులు, 85 మంది సిబ్బంది పాల్గొన్నారు. 1,885 విద్యుత్ సర్వీసులను పరిశీలించారు. ప్రత్యేక తనిఖీల్లో 115 కేసుల్లో వినియోగదారులకు రూ.8.79 లక్షల అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ ఇంజినీర్ డీపీఈ సీహెచ్ వెంకటేశ్వరరావు, గుంటూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ఆఫీసర్ వై. ఏడుకొండలు వివరాలను వెల్లడించారు. విద్యుత్ అక్రమ వినియోగంపై 94408 12263, 94408 12360 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తనిఖీల్లో పలు విభాగాల డీఈఈలు పి. భార్గవి, కె.రవికుమార్, ఎన్. మల్లికార్జున ప్రసాద్, ఏఈఈలు ఎన్. కరుణాకర్, ఎం.సతీష్‌కుమార్, యు. శివశంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ కోటేశ్వరరావుకు గుర్రం జాషువా పురస్కారం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుర్రం జాషువా 2026 సాహితీ పురస్కారం ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలుగు అధ్యాపకుడు ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావుకు ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం ఉదయం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఈ నెల 27న సాయంత్రం 4 గంటలకు జరిగే సాహితీ సభలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు వివరించారు. గతంలో సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, చంద్రబోస్, కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, ఓల్గా వంటి ప్రముఖులకు ఈ పురస్కారం అందించామన్నారు. జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాశం రామారావు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కవితా సమ్మేళనం, 25వ తేదీన దేశభక్తి, అభ్యుదయ పాటల పోటీలు, జాషువా పద్యాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ‘దేశంలో విద్య, ఉద్యోగాల పరిస్థితులు– యువత, విద్యార్థుల కర్తవ్యాలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని చెప్పారు. జాషువా పురస్కార సభలో ముఖ్య వక్తగా ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథులుగా ప్రజాశక్తి దినపత్రిక డెప్యూటీ ఎడిటర్ వి.రాం భూపాల్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో జాషువా విజ్ఞాన కేంద్రం ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు ఎన్.భావన్నారాయణ, కార్యదర్శి వి.వి.కె.సురేష్, ఎస్.పద్మ, కాకుమాను నాగేశ్వరరావు, వై.కృష్ణకాంత్ పాల్గొన్నారు. -
చిట్టి చేతులతో మట్టి గణపతి తయారీ
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గ్రీన్ గణేష్’ కార్యక్రమం ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. శుక్రవారం నగరంలోని 55 పాఠశాలలకు చెందిన 25 వేల మంది విద్యార్థులు ఏకకాలంలో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి ఈ ఘనత సాధించారు. గతంలో 8,750 మందితో ఉన్న రికార్డును అధిగమించడంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి ఎలియాజ్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై భావితరాలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సైకత వినాయకుడు, మట్టి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియనన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. యూఎఫ్‌బీయూ పరిధిలోని ఏడు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. గుంటూరు నగరం, జీటీ రోడ్లో శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివిధ బ్యాంకుల యూనియన్ల నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌న్ (ఐబీఏ)తో చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్పీఎస్కు బదులుగా పాత పెన్షన్న్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాలు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మె, అనంతరం అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల నాయకులు కె.రవికుమార్, కేఆర్వీ విజయ్‌కుమార్, నాగపావని, కె.కోటిరెడ్డి, రాంబాబు, మైనేని శివప్రసాద్, ఏఐటీయూసీ నాయకుడు వి.రాధాకృష్ణమూర్తి, సీఐటీయూ నాయకులు లక్ష్మీనారాయణ, నళినీకాంత్, ఎం.సాంబశివరావు, జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే సహించం
లక్ష్మీపురం: ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా హింసిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందారపు యశ్వంత్ రఘువీర్ డిమాండ్ చేశారు. గుంటూరు నాజ్ సెంటర్లోని ఆర్జేడీ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఐఓ సునీత, ఆర్జేడీ లింగేశ్వరరెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే నోటీసులు ఇచ్చి సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించకుండా చూస్తామని ఆర్ఐఓ, ఆర్జేడీ హామీచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, నగర నాయకులు మహేష్, సతీష్, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.1,272 కోట్లతో ఆరోగ్య వసతులు
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు రూ.1,272 కోట్లతో చేపట్టిన ఆరోగ్య వసతుల పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం గుంటూరు మెడికల్ కాలేజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.249.50 కోట్లతో పూర్తి చేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులను శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇందులో రూ.234.50 కోట్లతో 10 అత్యవసర చికిత్స కేంద్రాలు, రూ.15 కోట్లతో 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 24 అత్యవసర చికిత్స కేంద్రాలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 10 పూర్తయ్యాయని చెప్పారు. సెప్టెంబరు నెలాఖరుకు మరో మూడు పూర్తి చేసి, మార్చి నాటికి మొత్తం 24 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డిసెంబరులో ‘సంజీవని’ డిసెంబరులో రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులను అనుసంధానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు వివరించారు. -
పేదల వైద్యంపై పాలకుల కుట్ర
పేదల ఆరోగ్యంపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. నాడు వారిని ఆదుకునేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకానికి పేరుమార్చి మరీ నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలు అంటే నెట్వర్క్ ఆసుపత్రులు భయపడేలా బిల్లుల బకాయిలు పెట్టింది. వైద్యం చేయించుకోవాలని ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరణే ఎదురవుతోంది. కొర్రీలు పెట్టి నానా అవస్థలు పడేలా వ్యవహరిస్తోంది. ఆపరేషన్లకు పేద రోగులు రూ.వేలల్లో ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోతున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో కనీసం మందులు కూడా పూర్తిగా ఇవ్వని దుస్థితిలో టీడీపీ పాలన సాగుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: అనారోగ్య సమస్యతో గత నెల 10వ తేదీన వెంకటేశ్వర్లు (60) గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా తనకు ఉచితంగా ఆపరేషన్ చేయాలని రోగి కోరాడు. డబ్బులు తమకు సకాలంలో విడుదల కావడం లేదని, అదనంగా రూ.30 వేలు చెల్లిస్తే ఆపరేషన్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అంత మొత్తం లేక వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఇలా నిత్యం గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఎన్టీఆర్ వైద్య సేవ చికిత్స అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదులు రావడం లేదని, అందుకే ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోతున్నామని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్లు సమాధానం ఇస్తున్నారు. అంతిమంగా పేద రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందక డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకోవడంగానీ, జీజీహెచ్‌కు వెళ్లడంగానీ చేస్తున్నారు. తొమ్మిది నెలలుగా బిల్లులు పెండింగ్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తోంది. ఆరోగ్యశ్రీ నుంచి గతంలో ఉన్న రోగాల జాబితాను తగ్గించడం, ఆపరేషన్ల ప్యాకేజ్ తగ్గించడం, అనుమతులు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం నిత్యకృత్యంగా మారింది. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులను తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉంచడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద రోగులకు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా అందించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చెరిపివేయాలనేది కుట్రలో భాగంగా పేరు మార్చింది. ఆరోగ్యశ్రీ అనే పేరు ఉన్నంత వరకూ ప్రజల గుండెల్లో నుంచి వైఎస్ఆర్ పేరును చెరపలేమని భావించి కార్డులను సైతం మార్చివేసింది. బిల్లులు రాక కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందేందుకు వచ్చే నిరుపేద రోగులను చేర్చుకోవడం లేదు. అనుమతులకు సాగదీత ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకునే రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఒక్క రోజులో అనుమతి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ అనుమతులు రావాలంటే కనీసం నాలుగు నుంచి వారం రోజులు కూడా పడుతోంది. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులను గతంలో ప్రతి నెలా సక్రమంగా చెల్లించేవారు. ఆసుపత్రుల నిర్వాహకులు సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చేవారు. నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ.1,500 కోట్లు బకాయిలు ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం రూ. వెయ్యికోట్లకుపైగానే చెల్లించాల్సి ఉంది. నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్లు మాత్రమే విడుదల చేస్తుండటంతో బకాయిలు పెరుగుతున్నాయేగానీ తగ్గని పరిస్థితి నెలకొంది. దీనిపై నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఫాలోఅప్ మందులు సక్రమంగా అందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలనెలా ఇచ్చే మందుల్లో రెండు, మూడు రకాలను మాత్రమే ఇస్తున్నారు. మిగతావి లేవని, మరుసటి రోజు రావాలని చెబుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే మందుల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని వారు మండిపడుతున్నారు. రోగులకు అంత ఓపిక లేక బయట మార్కెట్లో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేయడమే ధ్యేయం వ్యవహారం ఉందని వైద్యులే చెబుతున్నారు. -
రైలు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
లక్ష్మీపురం: సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అర్ధరాత్రి చైన్ లాగి ఇద్దరు మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కొని పరారీ అయిన భవారియా గ్యాంగ్‌లో మూడో నిందితుడిని రైల్వే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో గుంటూరు రైల్వే పోలీస్ డీఎస్పీ అక్కేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమంయలో చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఆరుగురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భవారియా గ్యాంగ్ దుండగులు, అప్పికట్ట రైల్వే స్టేషన్ సమీపంలోని నాగరాజు కాలువ వద్దకు రాగానే చైన్ లాగి రైలును నిలిపి వేశారు. రైలులోని ఎస్–3, ఎస్–6 బోగీలలో ఇద్దరు మహిళలల మెడల్లో సుమారు 75 గ్రాముల బంగారు గొలుసులు లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు యత్నించిన రైలు బందోబస్తు పోలీసు సిబ్బంది అయిన కొండెపి సాయి, ప్రయాణికులపై కంకర రాళ్లతో, క్యాట్ బాల్‌తో దాడి చేయడంతో పాటు కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు హెచ్చరించినప్పటికీ దుండగులు వినక పోవడంతో ఆత్మ రక్షణార్థం ఎస్ఎల్ఆర్ ఆయుధంతో ఏఆర్ పోలీసులు వి.రవికుమార్, కె.బాలకెంటరెడ్డి, ఆర్పీఎఫ్ సిబ్బంది ఎం.అలెగ్జాండర్, ఎం.వెంకటనాగరాజు పది రౌండ్లు నిందితులపై కాల్పులు జరిపారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై తెనాలి పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ లోదే సరస్వతి కేసు నమోదు చేశారు. జూలై 3వ తేదీన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో అరెస్టు దర్యాప్తులో భాగంగా హరియాణా రాష్ట్రం నూహ జిల్లా, సాంగెల్ గ్రామానికి చెందిన నిందితులలో ఒకరైన ఏ 3 కిషన్ సింగ్ అలియాస్ సీతారామ్‌ను ఈనెల 8వ తేదీన గ్రామంలోని ఇంటి వద్ద అరెస్ట్ చేసి నూహా స్థానిక కోర్టులో హాజరు పరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పొంది శుక్రవారం గుంటూరు ఫస్ట్ క్లాస్ రైల్వే కోర్టులో హాజరు పరిచారు. సాంకేతిక ఆధారాలతో ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరచిన గుంటూరు రైల్వే డీఎస్పీ పి.అక్కేశ్వరరావు, గుంటూరు లైన్ సర్కిల్ సీఐ పి.నరసింహారావు, చీరాల పోస్ట్ ఐపీఎఫ్ బి.చంద్రశేఖర్‌రావు, గుంటూరు ఆర్పీఎఫ్ ఎస్ఐ షేక్ మహబూబ్ సుభాని, ఆర్పీఎఫ్ ఇన్చార్జి మహిళా ఎస్ఐ ఎల్.సరస్వతి, నరసరావుపేట, బాపట్ల ఆర్పీఎఫ్ ఎస్ఐలు ఎం.రాజమోహన్, ఎస్.మనోజ్‌కుమార్‌రెడ్డి, చీరాల ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పూర్ణచంద్రారావు, ఒంగోలు ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బజార్, రేపల్లె ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గోపీలను రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. గత రెండు సంవత్సరాలుగా చేసిన నేరాలు ఇవే... ఈ నేరంతో పాటుగా రాజస్థాన్ భవారియా గ్యాంగ్ గుంటూరు రైల్వే పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గత రెండు సంవత్సరాల నుంచి చైన్ లాగి, సిగ్నల్ ట్యాంపరింగ్ నేరాలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కిషన్ సింగ్‌ను విచారించగా గుంటూరు జీఆర్పీ సబ్ డివిజన్ పరిఽధిలో 12 నేరాలు చేసినట్లుగా వెల్లడైంది. నడికుడి న్యూ పిడుగురాళ్ల, తుమ్మల చెరువు, దొనకొండ, అప్పికట్ల వద్ద జరిగిన నేరాలు, అదే విధంగా తుమ్మల చెరువు, నిడుబ్రోలు ప్రదేశాల్లో జరిగిన పోలీస్ కాల్పుల కేసులుగా వీటిని గుర్తించారు. ఇంకా అరెస్ట్ కావల్సిన నిందితులు వీరే.. -
వీసీ హామీతో రిలే నిరాహార దీక్షలు విరమణ
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు ఇచ్చిన హామీతో ఒప్పంద ఆధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలను విరమించుకుంటున్నట్లు వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సుమారు 20 ఏళ్ళుగా సేవలందిస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిలే నిరాహార దీక్షలు గురువారం 44వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతన పెంపుపై ఉత్తర్వులు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ఇటీవల కమిటీ సమర్పించిన వేతన పెంపు నివేదికను రాబోయే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదింపజేసి, ఒప్పంద అధ్యాపకులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని వీసీ ఆచార్య కె.గంగాధరరావు హామీ ఇచ్చారన్నారు. ఈ రిలే నిరాహారదీక్షలను రెక్టార్ ఆచార్య ఆర్.శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, నూట అధ్యక్షుడు ఆచార్య పి.బ్రహ్మాజీరావు ఒప్పంద అధ్యాపకుల నిరసన టెంట్ వద్దకు చేరుకుని వారితో మాట్లాడి నిమ్మరసం అందించి శాంతియుత ఆందోళనను విరమింపజేశారు. రేపు జాతీయ లోక్ అదాలత్ గుంటూరు వెస్ట్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈ నెల 12వ తేదీన జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ పై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సేవలను పొందేందుకు కోర్టు ఫీజు లేదని, పరస్పర అంగీకారంతో పరిష్కారం అవుతుందని, త్వరగా న్యాయం లభిస్తుందని చెప్పారు. అన్ని కోర్టుల పరిధిలో జరుగుతుందన్నారు. అనంతరం జేసి జాతీయ లోక్ అదాలత్ పోస్టర్‌ను విడుదల చేశారు. డీఆర్ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు అత్తోట(కొల్లిపర): మండల పరిధిలోని అత్తోట గ్రామశివారు డొంక రోడ్డులో మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన బుధవారం రాత్రి చోటుచోసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తోట గ్రామానికి చెందిన కొంతమంది కారులో తెనాలి వెళుతున్నారు. గ్రామ శివారులోని డొంక రోడ్డులో మలుపు గమనించకపోవటంతో కారు ఒక్కసారిగా పంట కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న కొంత మంది వెంటనే కారులోని వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు. -
విజ్ఞాన్–ఎన్ఐటీ ఢిల్లీ మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ–న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఎన్ఐటీ ఢిల్లీ) మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు విద్యా, పరిశోధనా రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగనున్నాయని తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల కోసం ప్రయోగశాల సందర్శనలు, శాసీ్త్రయ సమాచారం, పరిశోధనా సామగ్రి మార్పిడి, సంయుక్త సదస్సులు, సెమినార్లు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు (ఎఫ్డీపీ), వర్క్‌షాప్‌ల నిర్వహణ చేపట్టనున్నారు. వర్చువల్ తరగతుల ద్వారా అతిథి అధ్యాపకుల ఉపన్యాసాలతో పాటు, ఫ్యాకల్టీ ఇమర్షన్ ప్రోగ్రామ్ (ఎఫ్ఐపీ) కింద అధ్యాపకుల పరస్పర మార్పిడికి అవకాశం కల్పించనున్నారు. ఈ అవగాహన ఒప్పందం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా విద్య, పరిశోధన, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత బలమైన వేదిక ఏర్పడనుందని వైస్ చాన్స్‌లర్ తెలిపారు. ఎన్ఐటీ ఢిల్లీ అధ్యాపకులు, విజ్ఞాన్ డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. -
మహిళ హత్యకేసులో ముగ్గురు అరెస్టు
పెదకాకాని: మహిళను దారుణంగా హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నార్త్ డిఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ అన్నారు. ఈనెల 7వ తేదీన పెదకాకాని మండలం, వెనిగండ్లలో దాది కోటేశ్వరమ్మ(48)ను గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న చాకుతో గొంతు కోసి హతమార్చిన సంగతి విధితమే. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని గురువారం పెదకాకాని పీఎస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ మృతురాలు కోటేశ్వరమ్మ కుమారుడు సాధిక్ గుంటూరు ఆటోనగర్‌లోని మెకానిక్ షోరూంలో నాలుగేళ్లుగా మెకానిక్‌గా పనిచేస్తున్నారు. అదే షోరూంలో దాచేపల్లి మండలం, ముత్యాలంపాడు గ్రామానికి చెందిన యద్దనపూడి మరియకుమారి ఆమె భర్త పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరియకుమారితో సాధిక్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. దీంతో సాధిక్ వారి కాపురాన్ని కూడా వెనిగండ్లలోనే పెట్టాడు. కొద్దికాలానికి సాధిక్ మరియకుమారి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ.. ఆ యువతినే పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పాడు. అంతేకాకుండా మరియకుమారి కుటుంబ అవసరాలకు డబ్బులు ఇవ్వడం, వారి బాకీలు తీర్చడం, కులాలు వేరు కావడంతో ఇష్టం లేని కోటేశ్వరమ్మ మరియకుమారి కుటుంబంతో గొడవ పడుతూ వస్తోంది. తన కుమార్తె వివాహానికి అడ్డుగా ఉన్న ఆమెను ఎలాగైనా హతమార్చాలని మరియకుమారి నిర్ణయించుకుంది. పిడుగురాళ్ల ప్రాంతంలో నివశిస్తున్న తన సోదరితో పరిచయం ఉన్న పల్నాడు జిల్లా, మాచవరం మండలం, రుక్మిణీపురం గ్రామానికి చెందిన అన్నంగి శ్రీకాంత్‌ను సంప్రదించింది. అందుకు అంగీకరించిన శ్రీకాంత్ అప్పటికే భార్యపై దాడి చేసి కేసులో నిందితుడిగా ఉన్నాడు. శ్రీకాంత్ తనకు తోడుగా తన మేనమామ కొడుకు బత్తుల మహేష్‌కు ఈ విషయం తెలియజేశాడు. మహేష్ పల్నాడు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతూ ఏడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పథకం ప్రకారం హత్య... మరియకుమారి కోటేశ్వరమ్మను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. గత కొద్ది రోజులుగా మృతురాలితో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ వస్తుంది. గతంలో బిర్యానీలో విషప్రయోగం చేసినా సఫలీకృతం కాలేదు. గత 15 రోజుల కిందట కోటేశ్వరమ్మకు కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి నమ్మించి తాగించింది. దీంతో అనారోగ్యానికి గురైన ఆమె కొద్ది రోజులుగా గేదెలు మేపేందుకు కూడా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటుంది. ఇదే అదునుగా చూసిన నిందితురాలు ఈనెల 7వ తేదీన ఉదయం మృతురాలి ఇంటికి వెళ్ళింది. మంచిగా పలకరించి స్టౌ వెలిగించి దోసె వేసి ఇచ్చింది. అప్పటికే బత్తుల మహేష్, అన్నంగి శ్రీకాంత్‌లు నెంబర్ ప్లేట్లు తొలగించిన బైక్‌ను సమీపంలోని చెట్టు కింద పెట్టి ఎదురు చూస్తున్నారు. నిందితురాలు ఇచ్చిన ఫోన్ సిగ్నల్‌తో ఇరువురూ ఇంటిలోకి ప్రవేశించారు. మీరు ఎవరంటూ మృతురాలు అడగడం, మన పిల్లలే అని చెప్పడం, ఇరువురూ ఒక్కసారిగా కోటేశ్వరమ్మపై దాడి చేసి పక్కనే ఉన్న చాకుతో గొంతు కోయడం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇరువురు పక్కనే ఉన్న నీటితో రక్తపు మరకలు కడుక్కుంటుండగా ఒక్కసారిగా పైకి లేచి గోడను పట్టుకోవబోవడంతో మరోసారి చాకుతో బలంగా గొంతు కోసి, బీరువాలో ఉన్న బంగారం, డబ్బులు దోచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్థానికంగా సేకరించిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానంతో మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని వారి దొంగిలించిన బంగారు ఆభరణాలు, రూ.70,260 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ వివరించారు. ఈ కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నారాయణస్వామి, ఎస్ఐలు సురేష్, డి.రామకృష్ణ, క్రైం సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
మార్కెట్ ఆధారిత పంటల దిశగా దృష్టి సారించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: రైతులు సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్ ఆధారిత పంటల దిశగా దృష్టి సారించాలని నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ గోవింద రాజులు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ 2047– వ్యవసాయ ఆధారిత పారిశ్రామికత ద్వారా ఆంధ్రప్రదేశ్ సాధికారత’ అనే అంశంపై గురువారం జాతీయ సదస్సు నిర్వహించారు. గోవిందరాజులు మాట్లాడుతూ సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్ ఆధారిత రైతులుగా అంతర్జాతీయ మార్కెట్ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర కాలం నుంచి ఇప్పటి వరకు దేశంలో వ్యవసాయం అభివృద్ధి సాధించిన తీరును వివరించారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు రైతుల శ్రేయస్సుకోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను గురించి వివరించారు. పొగాకు బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ యువత తమ తెలివితేటలతో పాటు సాంకేతికతపై తమకున్న పట్టుతో వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చాలన్నారు. సదస్సు కన్వీనర్, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ యు.రవి కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 60కి పైగా పరిశోధన పత్రాలు వచ్చాయని, వాటిలో 30 ఉత్తమ పరిశోధన పత్రాలను ఎంపిక చేశామని చెప్పారు. ఆయా పరిశోధనాంశాలతో అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించిన ప్రత్యేక సంచికను సదస్సులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, పీజీ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్.అనితాదేవి, డాక్టర్ కామేశ్వర శాస్త్రి, వీఎస్టీ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెంకట నర్సయ్య, అధ్యాపకులు డాక్టర్ నిర్మలా రాణి, డాక్టర్ ఎస్. శ్రీనివాసరావు, డాక్టర్ జేవీ సుధీర్ కుమార్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ గోవింద రాజులు -
నవీన ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి
తెనాలి: ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్ఫూర్తిగా నేటి యువతరాన్ని మానవతా స్పృహ కలిగిన శాస్త్రవేత్తలుగా రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య భావజాలంతో కూడిన కృత్రిమ మేధస్సులో స్వదేశీ సంస్కారాన్ని జోడించాలని, ఇందుకు తరగతి గదిలో నైతికతతో కూడిన శాస్త్ర పాఠాలను బోధించాలని సూచించారు.డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటైన పత్యేక సభకు ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాధబాబు అధ్యక్షత వహించారు. తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును అమరరాజా గ్రూప్ అధినేత గల్లా రామచంద్రనాయుడుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రదానం చేశారు. ● సభలో వెంకయ్యనాయుడు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ స్వర్గీయ యలవర్తి నాయుడమ్మ పల్లెటూరి నుంచి దేశ శాస్త్ర సాంకేతికరంగాన్ని దిశానిర్దేశం చేసేస్థాయికి ఎదిగిన మహామనిషిగా గుర్తుచేశారు. విజ్ఞానశాస్త్రం ప్రయోగశాలకే పరిమితం కాకుండా సమాజంలోని చివరి వ్యక్తికి అందాలని భారతరత్న అంబేడ్కర్, దీనదయాళ్లు చెప్పిన మాటలను నాయుడమ్మ ఆచరించి చూపారని తెలిపారు. 1951లో ఆయన సీఎల్ఆర్ఐ డైరెక్టర్‌గా చేరేనాటికి దేశంలో తోలు పరిశ్రమలో 56 వేలమందికి జీవనాధార వృత్తిగా మాత్రమే ఉండేదన్నారు. సీఎల్ఆర్ఐ, సీఎస్ఆర్ఐల్లో నాయుడమ్మ చేసిన పర్యావరణ అనుకూల సాంకేతికతతో దేశంలో ఆ పరిశ్రమ రూపురేఖలు మారాయని చెప్పారు. ● అవార్డుగ్రహీత గల్లా రామచంద్రనాయుడు తన ప్రసంగంలో నాయుడమ్మతో తనకు గల అనుబంధాన్ని స్మరించుకున్నారు. అమెరికాలో ఉన్నపుడు తిరిగి మాతృదేశానికి వచ్చి, ఇక్కడ పరిశ్రమల స్థాపనకు తనను ప్రోత్సహించినవారిలో నాయుడమ్మ ఒకరని చెప్పారు. స్వదేశానికి వచ్చినా ఏదైనా సమస్య వచ్చినపుడు తగిన పరిష్కారాన్ని చూపేవారని గుర్తుచేసుకున్నారు. ఆ అనుబంధం కారణంగానే తాను ఈ అవార్డుకు ప్రతిపాదన తీసుకురాగానే వెంటనే అంగీకరించానని వివరించారు. ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులకు శాస్త్రసాంకేతికపై ఆసక్తిని పెంచి యువశాస్త్రవేత్తలు ఎదిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫౌండేషన్ తరపున సైన్స్ సెంటర్ నిర్వహించిన సైన్స్ ప్రయోగాల్లో విజేతలైన విద్యార్థులకు అతిథుల చేతులమీదుగా సర్టిఫికెట్లు, నగదు, జ్ఞాపికను అందజేశారు. రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నపనేని సునీల్, అయినాల మల్లేశ్వరరావు, ఫౌండేషన్ కార్యదర్శి యలవర్తి పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
పారా మెడికల్ విద్యార్థుల నిరసన ర్యాలీ
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) గుంటూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ గురువారం రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి బీఆర్ స్టేడియం, టీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు అనేక కారణాల వల్ల ఆరు సంవత్సరాలకు పొడిగించ బడుతున్నాయన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కన్వీనర్ షేక్ సమీర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం, సంబంధిత విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు చెలగాటం ఆడటం సరికాదన్నారు. గుంటూరు నగర అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్యదర్శి కిరణ్ దాసరి, నాయకులు నాయక్, సాయి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
కళ్లకు గంతలు కట్టుకుని కాంట్రాక్టు వైద్య సిబ్బంది నిరసన
గుంటూరు మెడికల్: కాంట్రాక్టు వైద్య సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం గుంటూరు జీజీహెచ్‌లో కళ్లకు నల్లరిబ్బన్లతో గంతలు కట్టుకుని వినూత్న తరహాలో నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది గతనెల 20 నుంచి వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా గురువారం నల్లరిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి, ఉద్యోగాలు రెగ్యులరయ్యేంత వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, కాంట్రాక్టు వైద్య సిబ్బందికి బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టాఫ్‌నర్సులు రేణుక, బి.వి.ఆర్.లక్ష్మి, మేరి, శ్రీలక్ష్మి, లక్ష్మీకుమారి, పద్మావతి, ఫార్మాసిస్టులు చంద్రకళ, అశ్విని, పావని, శ్రీలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్లు చారి, ఖాశిం, బాషా, సుభశ్రీ, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
గర్వించేలా గుర్తింపు
● వ్యర్థాల నిర్వహణలో సరికొత్త విధానాల అమలు ● ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026’లో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ ● ఫ్లోటింగ్ సౌర విద్యుత్‌తో 420 ఈ–వాహనాల పరుగులు మైక్రో పాకెట్లు.. చెత్త నుంచి సంపద సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై సమరం ‘ఆత్మ’లకూ పింఛన్లు! ‘సర్’పై ఎన్నో సందేహాలు నగరంలో గాలి నాణ్యతను కాపాడేందుకు ప్రధాన రహదారులపై మెకానికల్ స్వీపింగ్ యంత్రాలు, ధూళి నియంత్రణకు వాటర్ స్ప్రింక్లర్లు వినియోగిస్తున్నారు. రహదారులపై ఏర్పడే గుంతలను గుర్తించిన వెంటనే మరమ్మతులు చేసేందుకు ‘రోడ్ డాక్టర్’ వ్యవస్థ ద్వారా వేగంగా ప్యాచ్‌వర్క్ పనులు చేపడుతున్నారు. రహదారి డివైడర్లలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ అర్బన్ గ్రీనరీని విస్తరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత ఆలోచనలు తోడైతే నగర రూపురేఖలు ఎలా మారతాయో గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) నిరూపిస్తోంది. శాసీ్త్రయ పద్ధతుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, హరిత ఇంధన వినియోగంతో సుస్థిర ప్రగతి దిశగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026’లో దేశవ్యాప్తంగా 130 నగరాలతో పోటీపడి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకును కై వసం చేసుకుంది. నగరపాలక సంస్థ పరిధిలోని 42వ వార్డు రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది. -
నేడు ఏఎన్‌యూ స్వర్ణోత్సవ స్మారక చిహ్నం ఆవిష్కరణ
ఏఎన్‌యూ (పెదకాకాని): ఉన్నత విద్యకు బీజం వేసిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఐదు దశాబ్దాల ప్రస్థానంలో విద్య, పరిశోధన, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట గుర్తింపును సొంతం చేసుకుందని ఇన్చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఏఎన్‌యూలో ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ 1976లో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకొంటోందన్నారు. వేడుకల్లో భాగంగా స్వర్ణోత్సవ స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు, ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు, ఇన్చార్జి రెక్టార్ ఆచార్య ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
కారుమూరి కోటిరెడ్డికి ఘననివాళి
అంతిమయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు గుంటూరు రూరల్: మండలంలోని అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బావ కారుమూరి కోటిరెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామంలోని కోటిరెడ్డి నివాసంలో ఆయన పార్థివ దేహానికి వైఎస్సార్ సీపీ నేతలు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర, దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటిరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేకతోటి సుచరిత, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అన్నాబత్తిని శివకుమార్, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరిఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్, అంబటి మురళి, డైమండ్ బాబు, గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి నాగార్జునయాదవ్, మాజీ ఇన్‌కంటాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాంరసూల్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఒక్క జీవితం..!
గుంటూరు మెడికల్: యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి 7లక్షల మంది ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. భారతీయులు 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 15నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సువారే ఎక్కువ. కేవలం క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ సంయుక్తంగా 2003 నుంచి ప్రతి ఏడాది సెప్టెంబరు 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. డేంజర్ బెల్స్.. వ్యక్తులు డల్‌గా ఉండటం, ఎవరితో కలవకుండా మూలన ఒంటరిగా కూర్చోవడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం, బరువు తగ్గిపోవడం, ముఖం దిగాలుగా ఉండటం, ఆహారం మానివేయడం, తదితర లక్షణాలు వ్యక్తుల్లో కనిపిస్తే తక్షణమే అప్రమత్తమై వారికి మానసిక వైద్యులచేత కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఈలక్షణాలు కనిపించేవారు హైరిస్క్ గ్రూపునకు చెందిన వారు. కారణాలు.... భారతదేశంలో ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆల్కహాలు, మాదకద్రవ్యాలకు బానిసలవ్వటం, వైవాహిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో అపజయాలు, ఒత్తిడి, కుంగుబాటు, ఆర్ధిక సమ్యలు, నిరుద్యోగం, ఆస్తి తగాదాలు, పేదరికం, అక్రమ సంబంధాలు, కుల,వర్గ వివక్షలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీజీహెచ్‌లో బాధితుల వివరాలు... గుంటూరు జీజీహెచ్‌లో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి చికిత్స పొందినవారు ప్రతినెలా 30 మందికిపైగా ఉంటున్నారు. జీజీహెచ్ వైద్యులు, మానసిక వైద్య నిపుణులు వీరిలో పలువురికి కౌన్సెలింగ్ చేసి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతున్నారు. ప్రతిఏడాది 200 నుంచి 300 మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వారు జీజీహెచ్‌కు వస్తుండగా, కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సామాజిక మాధ్యమాలలో, వార్తా పత్రికల్లో, ఆత్మహత్యలు జరిగే విధానాన్ని అన్వేషించేవారిని, విచారం, దిగులు, దుఃఖం, ఎక్కువ కాలం ఉంటే అది ఆత్మహత్యకు దారి తీసే అవకాశముంది. సాధారణ ప్రవర్తనకు భిన్నంగా సడన్‌గా శాంతంగా ఉండడం, నిరుత్సాహంగా గడపడం చేస్తుంటే తేడాను గమనించాలి. గతంలో లాగా స్నేహితులతో కలవకుండా, ఆట పాటల్లో పాల్గొనకుండా, దైనందిన కార్యక్రమంలో నిరాసక్తతతో ఒంటరి తనంగా వుండడానికి ఇష్టపడుతుంటే ఆ మార్పును ఆత్మహత్యకు సంకేతంగా పరిగణించాలి. మాటల్లో, సంభాషణల్లో నైరాశ్యం కనబరుస్తూ, వస్త్రధారణలో, వ్యక్తిగత శుభ్రతలో, ఆకర్షణలో నిరాసక్తత, వ్యక్తపరుస్తుంటే వారితో తప్పనిసరిగా వారితో మాట్లాడి వారి బాధను ఆలకించి మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. -
ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు...
ఆత్మహత్య చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్న వారు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఇంట్లో తమపై ఉన్న బరువు బాధ్యతల్ని ఇతర కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడి చేసి జీవితంలో ఎదగాలంటే ఎలా ఉండాలో జాగ్రత్తలు సైతం పిల్లలకు, కుటుంబ సభ్యులకు వివరిస్తారు. ఇలాంటివారిని తక్షణమే మానసిక వైద్యులకు చూపించడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడకుండా నివారించవచ్చు. కుటుంబ సభ్యులు ఎవరైనా అడిగిన వస్తువు కొనిపించకపోతే చనిపోతామని బెదిరిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తక్షణమే స్పందించి వారిని మానసిక వైద్యులకు చూపించాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం మానసిక రుగ్మత. దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసికవ్యాధుల వైద్య నిపుణుల సంఘం, జిల్లా అధ్యక్షుడు -
జీజీహెచ్‌లో ఉచితంగా వైద్యసేవలు....
గుంటూరు జీజీహెచ్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు సాధారణ జీవితం గడిపేలా చేస్తున్నాం. ఆర్థికపరమైన సమస్యలు, సంసార జీవిత సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, ప్రయోజకులు కాకపోవడం, ఉద్యోగపరమైన ఒత్తిడులు, తాగుడు అలవాటు ఉండటం, కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య పాల్పడిఉండటం తదితర కారణాల వల్ల పలువురు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారిని ఓ కంట కనిపెట్టాలి. ఆత్మహత్యలకు పాల్పడే ఆలోచన ఉన్నవారిని సంప్రదించటం, వారితో చర్చించటం, వారికి వనరులు కల్పించటం ద్వారా నివారించవచ్చు. – డాక్టర్ నీలి ఉమాజ్యోతి, మానసిక వైద్య విభాగాధిపతి, జీజీహెచ్ -
నేడు దశాబ్ది ఉత్సవాలు
నెహ్రూనగర్: గుంటూరు కథోలిక పీఠాధిపతులుగా డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య బాధ్యతలు స్వీకరించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం గుంటూరు నగరంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫాదర్లు మోన్సిగ్నోర్ అల్లం శౌరెడ్డి, మోన్సిగ్నోర్ పామిశెట్టి బాలస్వామి, మోన్సిగ్నోర్ చాట్ల మరియదాసు, పూదోట దానయ్య, దాసరి కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు రింగ్ రోడ్డులోని బిషప్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద నుంచి బిషప్ హౌస్ వరకు ప్రదక్షిణ (ఊరేగింపు) ప్రారంభం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు డాన్‌బాస్కో మైదానంలో ప్రత్యేక దివ్యబలి పూజ సమర్పించనున్నట్లు వివరించారు. అనంతరం బిషప్ భాగ్యయ్యకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతి, భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని హాజరుకానున్నారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు బిషప్‌లు, గురువులు, కన్యాసీ్త్రలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొంటారని వివరించారు. -
జాతీయ రహదారిపై ‘తెనాలి డబుల్‌హార్స్’ అవుట్లెట్
తెనాలి: విదేశాలకు తమ ఉత్పత్తులను పంపుతున్న తెనాలి డబుల్‌హార్స్ గ్రూప్ (టీడీహెచ్) కొంతకాలంగా దేశీయ రిటైల్ మార్కెట్‌పై దృష్టిని సారించింది. ఇందులో భాగంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–65)పై సూర్యాపేట మండలం, రాయన్‌గూడెం గ్రామంలోని సూర్యాపేట హోటల్–7 ప్రాంగణంలో తమ ఆరవ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. మధ్యాహ్నం జరిగిన ప్రారంభ వేడుకలో తెనాలి డబుల్‌హార్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడారు. జాతీయ రహదారిపై ప్రయాణీకులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులకు ఇకపై వందకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు, 130పైగా రకాలను (ఎస్కేయూ) ఒకేచోట నేరుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. వీటిలో తమ బ్రాండ్‌కు చెందిన పప్పుధాన్యాలు, ఫుడ్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ (చిరుధాన్యాలు)తో పాటు ప్రీమియం చాకెట్లు, టీడీహెచ్ ఫుడ్స్, మిల్లెట్ మార్వెల్ కౌమ, గోపురం బ్రాండ్ల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయని వివరించారు. విమాన ప్రయాణికులకు విజయవాడ ఎయిర్‌పోర్టులో, రోడ్డుమార్గాన వెళ్లేవారికి సూర్యాపేట హోటల్–7వద్ద తెనాలి డబుల్ హార్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మోహన్ శ్యాంప్రసాద్ తెలిపారు. దళితుల హత్యలను పట్టించుకోని ప్రభుత్వం ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గుంటూరు రూరల్: రాష్ట్రంలో ఇప్పటి వరకూ 25 మంది దళితులను హత్యలు చేసి తగలబెట్టినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదని ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ధ్వజమెత్తారు. బుధవారం పెదపలకలూరు గ్రామంలో ఇటీవల అమానుషంగా హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టబడిన దావులూరి ప్రసన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దావులూరి ప్రసన్నపై ఆగస్టు 13 తేదీన పెట్రోలు పోసి దహనం చేసిన ఘటనలో మరణించిన మాదిగ బిడ్డ ప్రసన్న కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నా పాలకుల స్పందన శూన్యమన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపలకలూరూకు చెందిన నిరుపేద టైల్స్ కార్మికుడు దావులూరి ప్రసన్న హత్యతో కలిపి ఇప్పటివరకు ఏకంగా 25 హత్యలు జరిగినా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఈ మారణహోమం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. లక్ష్మీనాయుడు హత్య బాధాకరమే కానీ ఆ కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం ప్రకటించినట్టే అదే రీతిలో ప్రసన్న కుటుంబానికి కూడా రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో దళితుల తీవ్ర ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూడక తప్పదని సువర్ణ రాజు హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రావూరి శ్యామ్, ఇంజుమూరి విజయ్‌కుమార్, తలారి నాని, కేశవరపు దానియేలు, జె.విజయ్, వి.బుజ్జి, ఎన్.రాంబాబు, బాబు, బి.సత్యనారాయణ, పి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పెదకాకానిలో 35.2 మి.మీ. వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 35.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా పెదనందిపాడు మండలంలో 1.2 మి.మీ వర్షం పడింది. సగటున 8.3 మి.మీ వర్షపాతం నమోదైంది. వివరాలు.. చేబ్రోలు మండలంలో 21 మి.మీ., పొన్నూరు 19.8, తాడేపల్లి 19.6, ప్రత్తిపాడు 14.8, ఫిరంగిపురం 12.2, వట్టిచెరుకూరు 10.2, మంగళగిరి 3.8, గుంటూరు పశ్చిమ 2.8, తెనాలి 2.6, కాకుమాను 2.6, గుంటూరు తూర్పు 1.8, తుళ్ళూరు మండలంలో 1.4 మి.మీ చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 43.6 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 40.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సూర్యాపేట హోటల్–7లో 6వ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ప్రారంభించిన చైర్మన్ అండ్ ఎండీ మోహన్ శ్యామ్‌ప్రసాద్ -
నిరంతర విద్యుత్ సరఫరా ప్రధాన లక్ష్యం
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్– మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి అధ్యక్షతన సీఆర్డీయే అమరావతి సర్కిల్ పనితీరుపై రాయపూడిలోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్న్లు, ట్రాన్న్స్ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం ఇకపై ఈ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ అధికారిక వెబ్సైట్ www.a pcpdc.in లేదా ఏపీసీపీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్న్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఎండీ సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థానిక అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
నిత్యావసరాల ధరలకు కళ్లెం వేయాలి
మంగళగిరి టౌన్: నిత్యావసర వస్తువుల ధరలకు కళ్ళెం వేయాలని, వారం రోజుల్లో ధరలు నియంత్రించకపోతే గిడ్డంగుల ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హెచ్చరించారు. ఈ మేరకు మంగళగిరి పట్టణంలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ బుధవారం సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. గౌతమబుద్ధ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం డీటీకి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ రోజురోజుకూ ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి నిత్యావసర ధరలను అదుపులోకి తీసుకురాకపోతే ప్రజలను సమీకరించి గిడ్డంగులను ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, చంద్ర నాయక్, న్నవరపు ప్రభాకర్, జాలాది జాన్‌బాబు పాల్గొన్నారు. -
నిమిషంలో 60 ఆరోగ్య పరీక్షలు
మంగళగిరి టౌన్: అత్యాధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతతో వైద్యరంగంలో సరికొత్త మార్పులకు మంగళగిరి వేదికగా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు వేగవంతమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే లక్ష్యంతో మంగళగిరి పట్టణ పరిధిలోని గణపతి నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో ఎరోస్ వెల్నెస్ ఆధ్వర్యంలో వినూత్న ఏఐ ఆధారిత ఆరోగ్య పరీక్షల విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఏఐ ఆధారిత ముఖ స్కానింగ్ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల మాట్లాడుతూ సాధారణంగా ఆరోగ్య పరీక్షలకు రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాల నివేదకల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ కొత్త విధానంలో రక్తనమూనా సేకరించడకుండానే కేవలం 60 సెకండ్లలో 60 రకాల ఆరోగ్య సూచికలను అంచనా వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సాంకేతికతలో భాగంగా వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్తప్రసరణ, చర్మకణాల కదలిక తదితర అంశాల ఆధారంగా సుమారు 28 రకాల శారీరక కొలమానాలను గుర్తించవచ్చని పేర్కొన్నారు. అదనంగా ఇంటర్నెర్ ఆధారిత జీవ సంవేదకాలు, ఆధునిక స్క్రీనింగ్ పరికరాలతో మరో 32 కీలక ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని వివరించారు. ఈ వినూత్న ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేసేందుకు యూపీహెచ్సీకి చెందిన సాంకేతిక నిపుణులు, వైద్య సిబ్బందికి రెండు రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి అయిన అనంతరం పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎరోస్ వెల్నెస్ సీఈవో శిల్పాదేశాయ్, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష, వైద్యసిబ్బంది, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
నిర్దేశిత ప్రదేశాల్లో నిమజ్జనం చేయాలి
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: వినాయకుని విగ్రహాలను నిర్ణయించిన ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని పాటించి పర్యావరణ హితానికి తోడ్పాటును అందించాలని కోరారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా పర్యావరణ హిత రంగులు మాత్రమే విగ్రహాలకు వినియోగించాలన్నారు. అవసరమైన సౌకర్యాలతో తాత్కాలికంగా ప్రత్యేక నిమజ్జన కొలనులను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. మండపాలు నిర్వహించే వర్గాలు సహా ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నీటి నాణ్యత దెబ్బతినకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్న కారణంగా ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. -
ముగ్గురు ద్విచక్ర వాహన చోరులు అరెస్ట్
తెనాలి రూరల్: వారంతా చదువు మధ్యలో ఆపేసిన వారు. బైక్ మరమ్మతు పనులు నేర్పించేందుకు మెకానిక్‌ల వద్ద తల్లిదండ్రులు చేర్పించారు. తాళం లేకుండా వాహనాలను స్టార్ట్ చేసి తీసుకెళ్లడం, ఇగ్నిషన్ వైరింగ్ మార్చి బైక్‌లను ఆన్ చేయడం నేర్చుకున్నారు. ఇంకేముంది.. బైక్‌లను చోరీ చేసి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. మైనార్టీ తీరని వీరు తొలి ప్రయత్నంలోనే మూడు బైక్‌లను చోరీ చేశారు. ఎక్కడ అమ్మాలో తెలియక పోలీసులకు పట్టుబడ్డారు. తెనాలి పట్టణంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న బాల నేరస్తులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ పోలీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సీహెచ్. రాంబాబు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలో ఇటీవలి కాలంలో బైక్‌ల ఇగ్నిషన్ వైరింగ్‌ను తప్పించి, చిన్న వైరు ముక్క సాయంతో బైక్‌ల చోరీ జరుగుతుండడంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మూడు కేసులు నమోదైనట్టు తెలిపారు. దర్యాప్తులో ముగ్గురు బాల నేరస్తులు చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బజాజ్ పల్సర్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, బజాజ్ ప్లాటినా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంటి ముందు, బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయడంతో పాటు, వీలైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐ విజయ్‌కుమార్ ఉన్నారు. బాల నేరస్తులను జువైనెల్ హోంకు తరలించారు. బైక్‌లు చోరీ చేసి తీసుకెళుతున్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లు, వాహనాల నంబర్లను మెకానిక్‌ల గ్రూప్‌లో పెట్టడం నిందితులను గుర్తించడంలో పోలీసులకు ఉపయోగపడింది. మెకానిక్ పనులు నేర్చుకుంటూ దొంగతనాలు చేసిన మైనర్లు -
ఓట్ల తొలగింపుపై విచారణకు కలెక్టర్ ఆదేశం
గుంటూరు వెస్ట్: పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు తొలగించారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ విచారణకు ఆదేశించారు. మన్నవ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బొనిగల అమరేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు, అలాగే గత నెల 5వ తేదీన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అమరేంద్ర ప్రసాద్ కోరారు. ఎంపీటీసీ సభ్యుని భార్య సహా సుమారు 173 మంది ఓటర్ల పేర్లు ఎటువంటి నోటీసులు లేకుండా అధికారులు తొలగించారు. సర్ ప్రక్రియలో మరిన్ని పేర్లు తొలగింపునకు గురయ్యాయి. వీటితోపాటు బీఎల్వో లాగిన్‌ను అనధికార వ్యక్తులు వాడుతూ జోక్యం చేసుకోవడం తదితర అంశాలు ఫిర్యాదులో ప్రస్తావించారు. స్పందించిన కలెక్టర్... విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని 88–పొన్నూరు ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ను ఆదేశించారు. నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా ప్రతాప్‌రెడ్డి గురు, శుక్రవారాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజులు జిల్లా పరిధిలోని పలు సంక్షేమ వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేయనున్నారు.


