18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు

18 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్‌: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు–2026 (టీసీసీ)లో భాగంగా డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీలో లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు ఈనెల 18 నుంచి 21 వరకు జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీమ్‌ బాషా మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు బీఎస్‌ఈఏపీ.ఓఆర్జీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. గుంటూరు నగరంపాలెంలోని స్టాల్‌ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, మార్కెట్‌ సెంటర్లోని హిందూ కాలేజీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో డ్రాయింగ్‌ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని, హాల్‌ టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. జిల్లాలో పోలీస్‌ చట్టం 30 అమలు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ కీలకం

నగరంపాలెం: జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉందని గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. అనుమతుల్లేని సభలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా

గుంటూరు వెస్ట్‌: జిల్లా పరిధిలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఘన, ద్రవ వ్యర్థాలను పకడ్బందీగా నిర్వహించేలా మున్సిపల్‌ అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌తో కలిసి నిర్వహించిన డిస్ట్రిక్ట్‌ ఎన్‌జీటీ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ... పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాలను ఇంటి నుంచే సేకరించటంతోపాటు, పర్యావరణానికి హాని లేకుండా నూరుశాతం సక్రమంగా నిర్వహించాలన్నారు. మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేయాలన్నారు. తడి వ్యర్థాలతో ఎరువుల తయారీని నివాస ప్రాంతాల్లోని తయారుచేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రీసైకిలింగ్‌ వ్యర్థాలతో సంపద సృష్టించే ప్రాజెక్టులను మరింతగా విస్తరించాలన్నారు. పట్టణాల్లో సీవరేజ్‌ నీటిని శుద్ధి చేయడానికి అనుగుణంగా ఎస్టీపీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌ (ఈ వేస్ట్‌)ను సైతం ప్రభుత్వతో ఎంఓయూ చేసుకున్న ఏజెన్సీకి అందించాలన్నారు. ఎన్టీఆర్‌ క్యాంటీన్ల నిర్వహణ, ఇంటింటికి చెత్త సేకరణ, పబ్లిక్‌ మరుగు దొడ్లు, శానిటేషన్‌, డ్రెయిన్ల శుభ్రత అంశాలపై పబ్లిక్‌ పెర్సెప్షన్‌లో ప్రజల ఫీడ్‌ బ్యాక్‌ మరింతగా మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వేర్వేరుగా చెత్త సేకరణ..

జీఎంసీ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ... నగర పరిధిలో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త వేరు చేసి సేకరించటం జరుగుతుందన్నారు. తడి వ్యర్థాలతో వివిధ ప్రాంతాల్లో 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఎరువుల తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో వర్మీ కంపోస్ట్‌ ఎరువుల తయారీ కేంద్రాలను ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రతి రోజు 300 టన్నుల వరకు వ్యర్థాలను జిందాల్‌ వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌కు పంపిస్తున్నామని తెలిపారు. మెటీరియల్‌ రీసెక్లింగ్‌కు 10 టన్నుల వరకు తరలిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎంటీఎంసీ మున్సిపల్‌ కమిషనర్‌ అలీం బాషా, తెనాలి మున్సిపల్‌ కమిషనర్‌ జేఆర్‌ అప్పలనాయుడు, పీసీబీ ఈఈ నజీమా బేగం, సీఎంహెచ్‌ఓ శాంతి కళా, ఈఈ సుందర రామిరెడ్డి, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజనీర్‌ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement