శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించి మల్లికార్జున స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు పరితపిస్తారు. దీనికోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు కూటమి సర్కారు విఫలమైంది. ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో అలక్ష్యం ప్రదర్శించింది.
ఫలితంగా సోమవారం బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేశారు. భక్తులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు పడిన వృద్ధులు, మహిళలు, చంటిపిల్లలు అల్లాడిపోయారు.
శివస్వాములను నియంత్రించేందుకు వచ్చిన నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు.
శివస్వాముల పై లాఠీ ఎత్తారు. దీంతో భక్తులు ఆగ్రహంచి ఏఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఏఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలని ఆలయ రాజగోపురం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. చివరికి ఏఎస్పీ అక్కడి నుంచి నిష్క్రమించడంతో శివస్వాములు శాంతించారు.


