breaking news
AP Government
-
శ్రీశైలంలో స్వాముల పై లాఠీ ఛార్జ్.. ‘శివ’మెత్తిన స్వాములు (ఫొటోలు)
-
Advocate: PT వారెంట్ పెట్టి హింసిస్తున్నారు..? అంబటి ఆరోగ్యం ఎలా ఉందంటే..
-
కరెంట్ చార్జీలపై ఏపీ సర్కారు కహానీ. చార్జీలు తగ్గిస్తామంటూనే 20వేల కోట్ల రూపాయల భారం
-
వెలిగొండ ఆశలపై నీళ్లు... నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం
-
చంద్రబాబుకు బిగ్ షాక్ YSRCPలో టీడీపీ నేతల చేరిక
-
స్వచ్ఛంద పంటల బీమాకూ మంగళం. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం
-
మీరు కోరిన పత్రాలు వారి నుంచే తీసుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాజెక్టులకు 940.87 టీఎంసీల జలాలను వినియోగించుకోవడానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లోని వివిధ డైరెక్టరేట్లతో పాటు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) ఇచ్చిన అనుమతుల పత్రాలు ప్రాజెక్టుల వారీగా అందజేయాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)ను ఏపీ ప్రభుత్వం కోరింది. దీనిపై గోదావరి బోర్డు స్పందిస్తూ ఆయా విభాగాల నుంచే నేరుగా ఆ సమాచారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలపై ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యున్నత స్థాయి పరిపాలన, సాంకేతిక విభాగాల అధికారులతో పాటు సీడబ్ల్యూసీలో ప్రాజెక్టుల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టులు(పీఎఫ్ఆర్), డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు(డీపీఆర్)లను మదింపు జరిపే అధికారులూ ఉన్నారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన పత్రాలు, సమాచారాన్ని కోరుతూ నేరుగా కమిటీకి విజ్ఞప్తి చేయాలని ఏపీకి సూచించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ (ఇరిగేషన్)కి గోదావరి బోర్డు శుక్రవారం లేఖ రాసింది. -
Nagari : రోజా ఇంట్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
-
KSR: రాజ్యసభ సీటు కోసం ఆర్కే మాస్టర్ ప్లాన్..
-
AP Government: ఆదాయాన్ని మింగేసి.. అధికారులపై అరుపులు
-
'బురద' రాజకీయాలు మానాలి!
‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’పై బురద చల్లే కార్యక్రమాన్ని ఆపి సీమను ఆదుకునే పనిపై సంబంధిత పక్షాలన్నీ దృష్టి పెట్టాలి. ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా తప్పు పట్టడం, ఆ పథకం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దీనికి ప్రత్యామ్నాయం అన్నట్లు మాట్లాడటం సరికాదు. కొంత మంది రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదనీ, 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటే నీళ్లు కాదు బురద వస్తుందనీ మాట్లాడటం అభ్యంతరకరం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయం కాదు. అసలు రెండు ప్రాజెక్టులకు పోటీ పెట్టి మాట్లాడటమే పొరపాటు. రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని గరిష్ఠ స్థాయిలో ఎలా తీసుకోవాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.ముచ్చుమర్రి ఎలా ప్రత్యామ్నాయం?ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడుతున్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 798 అడుగులు ఉన్నపుడు కూడా నీటిని తోడే అవకాశం ముచ్చుమర్రి ద్వారా సాధ్యం అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ముచ్చుమర్రి. 2007లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయల ఖర్చుతో పాలనాపరమైన, ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి వలన ప్రయోజనాలు, పరిమితులను నిజా యతీగా విశ్లేషించుకోవాలి.ఈ పథకం ద్వారా కేసీ కెనాల్‌కు 1,000 క్యూసెక్యులు,హంద్రీ–నీవా ప్రాజెక్టుకు 3,000 క్యూసెక్యుల నీటిని రెండు మార్గాల ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. మల్యాల నుంచి మరో 3,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా హంద్రీ–నీవాకు సరఫరా చేస్తున్నారు. అయితే మల్యాల నుంచి లిప్ట్ చేయాలంటే శ్రీశైలంలో 834 అడులు నీరు ఉంటేనే సాధ్యం. ముచ్చుమర్రి దగ్గర కృష్ణానది నుంచి సిద్ధేశ్వరం దాకా 7 కి.మీ. మేరకు కాలువ తవ్వడం వలన నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ– నీవా, కేసీ కెనాల్లకు పరిమిత స్థాయిలో సరఫరా చేయవచ్చు. 11,574 క్యూసెక్కులు నిరాటంకంగా తోడితే ఒక టీఎమ్సీ నీటిని తోడవచ్చు. ఒక్క హంద్రీ–నీవాకే 40 టీఎమ్సీలు అవసరం. 2017లో ప్రారంభమైన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గడిచిన 7, 8 సంవత్సరాలలో ఏడాదికి 7 నుంచి 9 టీఎమ్సీల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. హంద్రీ–నీవాకు 40 టీఎమ్సీలూ, కేసీ కెనాల్‌కు పూర్తి స్థాయి అవసరాలకూ అనుగుణంగా నీరు సరఫరా సాధ్యం కావడం లేదు. అలాంటి పరిస్థితిలో అదనంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయా ల్సిన ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ, నెల్లూరు జిల్లా సోమశిల వంటి వాటికి ముచ్చుమర్రి ద్వారా నీరు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది?పోతిరెడ్డిపాడు కింద ఎస్ఆర్ఎమ్సీ వద్ద రోజుకు మూడు టీఎమ్సీల నీటిని సరఫరా చేసే అవకాశం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లభిస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ముచ్చుమర్రి ద్వారా మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నట్లు మాట్లా డటం సరికాదు. ముచ్చుమర్రి ద్వారా వచ్చే పరిమిత ప్రయోజ నాలను కొనసాగిస్తూ అదనపు ప్రయోజనాలకు అనుగుణంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.అవగాహన లేని వ్యాఖ్యలుకొందరు ఏకంగా శ్రీశైలంలో 800 అడుగులు నుంచే నీరు లిఫ్ట్ చేస్తే బురద వస్తుందనడం అభ్యంతరకరం. మరి అంతకన్నా కొన్ని అడుగుల క్రింద నుంచే గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా ముచ్చుమర్రి ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల కింద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తోంది. అక్కడెక్కడా రాని బురద రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మాత్రమే వస్తుందనడం న్యాయమా? కొందరు మంత్రులు ఏకంగా ముచ్చుమర్రి నుంచే పోతిరెడ్డిపాడుకు నీరు లిఫ్ట్ చేసుకుందాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి హంద్రీ–నీవా అవస రాలకు 40 టీమ్సీల నీరు అవసరం అయితే, అందులో సగం నీరు కూడా తీసుకోలేని దుఃస్థితిలో ఉంటే... అదనంగా పోతిరెడ్డిపాడుకు కూడా ముచ్చుమర్రి నుంచే నీరు లిఫ్ట్ చేసుకుందాం అనడం దారుణం.రాయలసీమ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లతో నికర జలాలు సగం కూడా తీసుకోలేక పోతున్నాము. ఇంక వరద జలాలపై ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలుగొండ, సోమశిలలకు నీరు ఎలా తీసుకుంటాం? బాధ్యత గల ప్రభుత్వాలు శ్రీశైలం నుంచి అవకాశం ఉన్న మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని తీసుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. సింహ భాగం పూర్తి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తే నష్టపోయేది రాయలసీమ ప్రజలే!మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
శాపనార్థాలే సమాధానాలా?
‘వినదగు నెవ్వరు చెప్పిన...’ అన్నాడు సుమతీ శతకకారుడు. విన్న తర్వాత అందులోని నిజానిజాలేమిటో నిర్ధారించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటాడు. సంఘ జీవనంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన హితోక్తి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడిన ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించవలసిన నీతిపాఠం. ప్రభుత్వ చర్యలను, నిర్ణయాలను ప్రజల తరఫున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అది వాటి బాధ్యత. ఆ ప్రశ్నలకు ప్రభుత్వాలు సూటిగా సమాధానాలు చెప్పి తీరాలి. అలా చెప్పకుండా దాటవేయడం మొదలుపెడితే ఆ ప్రభుత్వాలు ఏదో దాచిపెడుతున్నట్టు లెక్క. ప్రస్తుత ఏపీ సర్కార్ దాటవేసే దశను కూడా దాటిపోయింది. ఎదురు దాడినే ఆయుధంగా ప్రయోగిస్తున్నది. అందులోనూ పూనకాల దశకు చేరుకున్నది. జరగరానిదేదో జరుగుతున్నదని దీని అర్థం. చేయగూడని తప్పులేవో ప్రభుత్వం చేస్తున్నదని అర్థం. ప్రజలకు బాధ్యత వహించ వలసిన పవిత్ర కర్తవ్యాన్ని ఏపీ సర్కార్ ఈ రకంగా ఎగతాళి చేస్తున్నది. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గురువారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ అంశాల మీద ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. అంతే, మిడతల దండు దాడి చేసినట్టు, తోడేళ్ల మంద దండెత్తి వచ్చినట్టుగా ఉన్నది కూటమి రియాక్షన్. కనీసం పదిమంది మంత్రులు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. అందులో ఒక వయసు మళ్లిన మంత్రి స్థిమితం కోల్పోయి మాట్లాడారు. యెల్లో మీడియా ఛానల్స్ అన్ని రకాల మర్యాదల్నీ అతిక్రమించాయి. యెల్లో పత్రికలు యథావిధిగా వక్రీకరణకు పూనుకున్నాయి. కానీ, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే సాహసాన్ని ప్రభుత్వం కానీ, దాని తాబేదార్లు కానీ చేయలేదు. అసలు విషయాన్ని దాచేసి కొసరు సంగతులపై షాడో బాక్సింగ్ చేసే సంస్కృతిని యెల్లో కూటమి బాగా వంటపట్టించుకున్నది. విషయ పరిజ్ఞానం లేని పదిమంది తుత్తురుగాళ్లతో మాట్లాడించి, గత్తరలేపే వ్యూహాన్ని ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తున్నది.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రితో ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో మాట్లాడి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ పను లను ఆపేయించాననీ, కావాలంటే ఎవరైనా సరే చెక్ చేసుకో వచ్చనీ ఆయన అన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నిత మైన అంశం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఎత్తిపోతలపై తెలంగాణకు అభ్యంతరాలున్నాయి. కానీ రాయలసీమ అవసరాల రీత్యా ఏపీకిది వరదాయిని. ఇటువంటి అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో వైసీపీ సహా మరికొన్ని రాజకీయ పక్షాల ఏపీ ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేశాయి. జగన్మోహన్రెడ్డి కూడా తన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎవరూ అడక్కుండానే ప్రభుత్వం ఈ అంశంపై ఒక ప్రకటన చేసి ఉండవలసింది. కానీ, ఇప్పటివరకూ ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం సూటిగా స్పందించలేదు. రేవంత్‌రెడ్డి, తాను క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఈ విషయం మాట్లాడుకున్నారా లేదా అనే సంగతి తప్ప అనేక ఇతర విషయాలు చంద్రబాబు మాట్లాడారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పింది తప్పయితే దాన్ని ఖండించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కాని విషయం. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే, అటువంటి రహస్య నిర్ణయం తీసుకోవలసి రావడం వెనుక కీలకమైన జాతీయ భద్రతా అంశాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. కానీ అసలు విషయాన్ని వదిలేసి ఉపవాచకాలను పఠించడం, ఉక్రోషాన్ని ప్రదర్శించడం యెల్లో కూటమి బలహీనతల్ని ఎత్తి చూపింది.అదే మీడియా సమావేశంలో అమరావతి వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా జగన్ ఎత్తిచూపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే వాటికి సమాధానం చెప్పాలి. కానీ, ఆయన మాట్లాడిన మిగిలిన అన్ని విషయాలను వదిలేసి, ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని అమరావతి మీద జగన్మోహన్రెడ్డి విషం కక్కుతున్నారంటూ ఒక చౌకబారు ప్రచారాన్ని దిగజారుడు భాషలో వండి వార్చి వడ్డించడం మొదలుపెట్టారు. ఒక్క జగన్మోహన్రెడ్డికే కాదు, అమరావతి విషయంలో ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులపై చాలామంది మేధావులకూ, స్థానిక ప్రజలకూ పలురకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయకుండా నిందారోపణలు చేయడం వల్ల పవిత్రులమై పోతామనుకుంటే పప్పులో కాలేసినట్టే!వరద ముంపునకు అవకాశముండే ప్రాంతంలో నగర నిర్మాణం పట్ల నిపుణులందరికీ అభ్యంతరాలున్నాయి. వెయ్యి కోట్ల ఖర్చుతో రెండు ఎత్తిపోతల పథకాలను పెట్టి, రెండు రిజర్వాయర్లు నిర్మించి అమరావతిని వరద ముప్పు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి నిజమే కదా! ఇంత ఆయాసం దేనికి, వరదముప్పు లేని ప్రాంతంలో నిర్మించు కోవచ్చు కదా! అక్కడ ముందుగానే పాలక పెద్దల అనుయా యులు భూములు కొనుగోలు చేసినందువల్లనే ఎంత ప్రయా సైనా సరే అక్కడనే రాజధాని ఉండాలని ఆరాటపడుతున్నారని అనుమానం రావడంలో తప్పేముంది! వరదముప్పు పొంచి ఉన్నచోటనే నగర నిర్మాణం ఎందుకన్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం ఉన్నదా?మొదట సేకరించిన 54 వేల ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడగడం దేనికి? అందులో తక్షణమే 20 వేల ఎకరాల సమీ కరణకు రంగం సిద్ధం చేయడంలో పారదర్శకత ఏమైనా వున్నదా? ఎవరూ అడగకుండానే ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వవలసింది. కానీ, అడిగినవారి మీద ఎదురుదాడికి దిగడం వెనుక ఏదో గూడుపుఠాణీ ఉన్నదనే కదా అర్థం? సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం తొలి దశ 54 వేల ఎకరాల్లో పార్కులు, రోడ్లు, చెరువులు వగైరాలు తీసేసిన అనంతరం 29 వేల పైచిలుకు భూములు అందుబాటులో ఉంటాయి. రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు, ఇప్పటి వరకు జరిపిన కేటాయింపులు, ప్రభుత్వ భవనాల అవసరాలు తీసివేసినా ఇంకా 18 వేల ఎకరాలకు పైగా సీఆర్డీఏ చేతిలో ఉన్నాయి. మరి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్లో, శ్మశానాల్లో ఎందుకు వేస్తున్నారు? ఈ కారణం వల్లనే రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయిన ఉదంతాన్ని విస్మరించగలమా? అమ్ముకోవడానికి ప్రభుత్వం చేతిలో 18 వేల ఎకరాలు స్థిరంగా ఉండగా ఇంత ఆదరా బాదరాగా ఇంకో 20 వేల ఎకరాల సేకరణలోని ఔచిత్యాన్ని ఎవరైనా అడిగితే వాళ్ల మీద ‘అమరా వతి ద్రోహులు’, ‘అభివృద్ధి నిరోధకులు’ అనే ముద్రలు వేయ డానికి యెల్లో కూటమి సర్వసన్నద్ధంగా ఉన్నది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అవుతుందనీ, ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదనీ చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏడాది న్నరలోనే అమరావతి ఖాతాలో 50 వేల కోట్ల అప్పును ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాలని అడిగితే కూడా అమరావతి ద్రోహులవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని అడిగిన వారి మీద శాపనార్థాలు ప్రయోగిస్తూ బండి లాగిస్తున్నారు. పద్దెనిమిది నుంచి అరవయ్యేళ్లలోపు వయసున్న మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించరాదు. నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి సంగతి ఏమిటని అడగరాదు. అడిగితే అభివృద్ధికి అడ్డుపడినట్టు. ఏపీ అంటే... ‘ఏ ఫర్ అమరావతి’, ‘పీ ఫర్ పోలవరం’ అని ప్రచారం చేసుకున్న బాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహాన్ని కూడా ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించే విధంగా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా, ఏవో ప్రయోజనాల కోసం పునాది డయా ఫ్రమ్ వాల్ వేసి, వరద కారణంగా అది దెబ్బతినడానికి కారణమయ్యారని వారిని అధిక్షేపించరాదు. ఈ చారిత్రక తప్పిదం వల్ల ఆ ప్రాజెక్టు ఇంకెంతకాలం కుంటుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కేవలం తమ వారికి కాంట్రాక్టు పనిని అప్పగించడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నెత్తినెత్తుకున్నారన్న అభియోగం నిజం కాదని నిరూపించగలరా? చివరికి కేంద్రం ఒత్తిడికి లొంగిపోయి, దాని ఎత్తు తగ్గించి బరాజ్ స్థాయికి కుదించలేదా? ఈ విషయం నిజమా... కాదా?ఏ ఫర్ అమరావతి. పీ ఫర్ పోలవరం... ఈ రెండింటిలోనూ పారదర్శకత కనిపించడం లేదు. ఈ రెండింటిలోనూ గోల్మాల్ జరుగుతున్నదనే ఆరోపణలు నిజమైతే విభజిత రాష్ట్రానికి అంతకంటే పెద్ద ద్రోహం ఇంకేమన్నా ఉంటుందా? ఇవే కాదు, రాష్ట్రంలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధా నాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా చెబుతున్నారు. ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేట్ పెట్టుబడికి ఊడిగం చేసే పాత్రను పోషిస్తున్నారు? విశాఖ నగరానికి ఇంతకాలం ఆయువుపట్లుగా నిలిచిన విశాఖ ఉక్కు, విశాఖ పోర్టులను దెబ్బతీయడం కోసమే మిట్టల్ స్టీల్స్‌కు సముద్రతీరం వెంబడి మూడు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ పోర్టును కేటాయించారనీ, క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడం కోసం కేంద్రం దగ్గరికి ఎంపీలను పంపించారనీ వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? సూటిగా సమాధానం చెప్పగలరా? ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ విద్య, ఆరోగ్య రంగాలను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంగడి సరుకుగా మార్చిందనడానికి ఈ పందొమ్మిది నెలల పాలన రుజువు కాదా? ప్రజల మనసుల్లో ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇందులో దేనికీ కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పే అవకాశం లేదు. కనుక ఈ శేష కాలాన్ని శాపనార్థాలతోనే వారు గడిపేస్తారని భావించవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Sambasiva Reddy: ఏపీ అభివృద్ధి YS జగన్ తోనే సాధ్యం..!
-
Malladi Vishnu: శాస్త్రంతో సంబంధం లేదా! శివలింగ పునః ప్రతిష్ట ఇలాగేనా?
-
కడుపుకు అన్నమే తింటున్నావా? లోకేష్ ను ఏకిపారేసిన జడ శ్రవణ్
-
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ప్రస్తుత పరిస్థితి
-
అంతర్జాతీయ రాజధాని అంటూనే అవినీతికి కేరాఫ్ గా మార్చేశారా ?
-
సుబ్బారెడ్డి పరువు నష్టం దావా కేసులో హైకోర్టు స్పష్ఠీకరణ
-
పేర్ని నాని: రేషన్ బియ్యం దొంగా ...?
-
తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు
-
AP: వాట్సాప్ గవర్నెన్స్ కారణంగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
-
KSR: మీకు నిజంగా గట్స్ ఉంటే? హోంమంత్రికి ఓపెన్ ఛాలెంజ్
-
రాయచోటిలో నిరసన జ్వాలలు.. YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
-
ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని నీరుగార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
Magazine Story: దారి తప్పిన నాలుగో సింహం పోలీసుల మెడకు ఉచ్చు
-
ఆంధ్రప్రదేశ్‌లో బాదుడే బాదుడు...ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం...
-
మా నాయకుడు జగన్ అని గర్వంగా చెప్తాం రాచమల్లు గూస్ బంప్స్ కామెంట్స్
-
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
-
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
-
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
-
కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)
-
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
-
YS Jagan: మోదీ, పుతిన్ వస్తే ఎక్కడ ఉంచుతావ్ బాబు
-
Monditoka Arun: నీ సొంత ఊరిలోనే జగన్‌కు మద్దతిచ్చారు..
-
Margani: డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి..
-
Ambati: మీ పర్మిషన్ ఎవరికి కావాలి.. ఇది ప్రజా ఉద్యమం .. ఎవరూ ఆపలేరు
-
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
-
Karumuri Venkat: నువ్వు ఎంత యాక్టింగ్ చేసిన ప్రైజ్ మాత్రం లోకేష్క
-
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికే అంకెల గారడీ. చంద్రబాబు జీఎస్డీపీ ముందస్తు అంచనాలపై వైఎస్ జగన్ ధ్వజం
-
పిచ్చెక్కి మాట్లాడుతున్నావా.. సోమిరెడ్డిపై కాకాణి ఫైర్
-
నాలుగొచ్చినా.. నరక‘వేతన’ జీతమేది బాబూ?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సర్కారు ఈ నెల 4వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు జమ చేయలేదు. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకూ జీతాలు పడలేదు. వ్యవసాయ, జలవనరులు, పంచాయతీరాజ్, సమాచార, ప్రణాళికా శాఖలో పని చేసే ఉద్యోగులు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితంగా వారు రుణ వాయిదాల చెల్లింపులు.. పిల్లల ఫీజులు, ఖర్చులకు నరకయాతన అనుభవిస్తున్నారు. 3వతేదీన అరకొరగా కొన్నిశాఖల్లో అదీ అతికొద్దిమందికి మాత్రమే జీతాలు జమైనట్టు సమాచారం. దీంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు చెల్లింపులను విడతల వారీ తంతుగా చంద్రబాబు సర్కారు మార్చేసిందని మండిపడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని గత ఎన్నికల ముందు ప్రతిసభలోనూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినెల మాత్రమే ఉద్యోగులకు ఒకటో తేదీ చెల్లించారని, ఆ తర్వాత పూర్తిగా చతికిలపడ్డారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతితక్కువ గౌరవ వేతనాలు తీసుకునే ఉద్యోగులకూ సర్కారు చెల్లింపులు చేయలేకపోతోందని ధ్వజమెత్తుతున్నారు. మంగళవారం రూ.3000 కోట్లు అప్పు చేసినప్పటికీ బాబు సర్కారు జీతాలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులపై వ్యత్యాసం చూపడమేమిటీ? చంద్రబాబు సర్కారు ఉద్యోగులందరూ సమానం కాదనే ధోరణిలో వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ముందుగా వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల్లో విభజన తీసుకొస్తోందని, అలాగే ఇప్పటికే పలుమార్లు రోడ్డెక్కిన ఉపాధ్యాయులకు 3న జీతాలు జమ చేశారని, మిగతా వారికి చెల్లించలేదని.. ఇలా ఉద్యోగుల్లో విభజన తీసుకురావడం సరికాదని ఉద్యోగవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిరుద్యోగులూ ఎదురు చూపే కూటమి సర్కారులో చిరుద్యోగులు వేతనాల కోసం ప్రతి నెలా ఎదురు చూడాల్సి వస్తోందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 104 ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, హోంగార్డులు, వీఆర్ఏలుఏ, ఆరోగ్య మిత్రలు వేతనాల కోసం 10–15వ తేదీ వరకు నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులైతే వేతనాల కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. జనవరి వస్తే ఐదు డీఏలు పెండింగ్ డిసెంబర్ వచ్చేసింది జనవరి వస్తే మొత్తం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటాయి. అయితే ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే మంజూరు చేసి అదీ మూడు వాయిదాల రూపంలో చెల్లిస్తామని పేర్కొందని, ఇప్పుడు ప్రతీ నెలా వేతేనాలను కూడా 1వ తేదీన కాకుండా విడతల వారీగా పలు తేదీల్లో చెల్లించే విధానాన్ని చంద్రబాబు సర్కారు అమలు చేస్తోందని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ నెలా ఒకటినే జీతాల్లేవు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను పట్టించుకోవడం లేదని, చులకనగా చూస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఏ నెలా ఉద్యోగులందరికీ 1న జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతి నెలా ఉద్యోగులు జీతాల కోసం 10వ తేదీ వరకు ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలు, హోంగార్డులు లాంటి చిరుద్యోగులకూ జీతాలు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వీఆర్ఏలు గౌరవ వేతనంతో పనిచేస్తారని, ఆ గౌరవ వేతనం కూడా సకాలంలో ఇవ్వకపోడం బాధాకరమన్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఒక తేదీన మరో కొంత మందికి మరో తేదీన జీతాలు చెల్లించడం అనేది ఇప్పుడే కొత్తగా చూస్తున్నామని పేర్కొన్నారు. -
బాలయ్య సినిమాకు నజరానా.. భారీగా అఖండ-2 టికెట్ ధరల పెంపు
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో యాక్షన్ మూవీ అఖండ-2. ఈ సినిమా రిలీజ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.భారీగా ధరల పెంపు.. అఖండ-2 మూవీకి భారీగా టికెట్ ధరలు పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో ఏకంగా రూ.75 పెంచుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టకెట్‌పై అదనంగా రూ.100 పెంపునకు అనుమతులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ టికెట్ ధరలు 10 రోజుల వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వులిచ్చింది. దీంతో పాటు ఎన్నడూ లేనివిధంగా ప్రీమియర్ షోలకు కూడా అనుమతిలిచ్చింది. ఈ నెల 4న ప్రీమియర్ షో టికెట్ ధర ఏకంగా రూ.600లుగా నిర్ణయించింది. ఇంత భారీ స్థాయిలో టికెట్స్ పెంచడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడంతో భారీగా ధరలు పెంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించకునేందుకు ఉత్తర్వులిచ్చారు. భారీగా టికెట్ ధరల పెంపుతో సినీ ప్రేక్షకుల జేబులు గుల్ల కావడం ఖాయంగా కనిపిస్తోంది. #Akhanda2 కి అనుమతి 👍#Akhanda2Thaandavam 🔥 https://t.co/gvFHBdGH3f pic.twitter.com/GdqfNfYdwc— Kakinada Talkies (@Kkdtalkies) December 2, 2025 -
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
-
Kadapa Tour: చంద్రబాబుపై జగన్ పంచులు..
-
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ ముసుగులో రియల్ దందా...
-
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో వ్యవస్థలు పుట్టిన తర్వాతే... చంద్రబాబు పుట్టారు తప్ప... ఆయన వ్యవస్థలను పుట్టించలేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వానికి వ్యవస్ధలన్నా, చట్టాలన్నా గౌరవం లేదని, రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? తాలిబన్ ప్రభుత్వమా? అని నిలదీశారు. పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిది అక్రమ అరెస్టే అని తేల్చి చెప్పిన బొత్స... పార్టీ అభిప్రాయాన్ని చెబితే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. బహుశా ప్రభుత్వ ఒత్తిడితోనే సతీష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్నదే తన అభిప్రాయమని... అలా చెబితే నన్ను కూడా అరెస్టు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. మా గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అసహనంతో ఊగిపోతున్న సీఎం... ప్లాంట్ రక్షణ కోసం శాశ్వత పరిష్కారం చూపకుండా ఎదురుదాడి చేయడమేంటని నిలదీశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో కరువైన రాజ్యాంగబద్ద పాలన...రాష్ట్రంలో రాజ్యంగబద్దమైన పాలన సాగడం లేదు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత చట్టాలు, రాజ్యాంగంతో మాకు పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. చట్టాలను చేతిలోకి తీసుకుని... రాజ్యాంగం పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇలాంటి ఘటనలో కొకొల్లలు. నిన్న ఉదయం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిని అనంతరపురం పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి కనీస సమాచారం, ఎలాంటి పేపర్లు లేకుండా అరెస్టు చేసి.. రాత్రికి గౌరవ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. పోలీసుల వ్యవరహరించిన తీరును తప్పుపట్టిన న్యాయమూర్తి చీవాట్లు పెడితే అప్పుడు వెంకటరెడ్డిని విడుదల చేశారు.ప్రతిపక్ష పార్టీ అభిప్రాయాన్ని చెబితే అరెస్టులా?వెంకటరెడ్డి మాటల్లో ఏం తప్పుంది? టీటీడీ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీగా సతీష్ కుమార్ మృతిపై మా అభిప్రాయాలను పార్టీ అధికార ప్రతినిధిగా వెంకటరెడ్డి మాట్లాడితే ఆయన్ను అరెస్టు చేస్తారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. ప్రభుత్వమే సతీష్ కుమార్ పై ఒత్తిడి తీసుకొచ్చి ఉంటుంది. ఆయన్ను ఎవరైనా హత్య చేశారా? లేక ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నారా? అన్నది ప్రభుత్వమే తేల్చాలి. హత్య జరిగితే ప్రభుత్వం నిందితులను పట్టుకుని శిక్షించండి. ఎవరు అభ్యంతరం చెప్పారు ? ప్రభుత్వం సతీష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చిందని మా పార్టీ అభిప్రాయాన్నిచెబితే .. అరెస్టు చేస్తారా? బహశా ప్రభుత్వ పెద్దలు, పోలీసుల ఒత్తిడి చేయడం వల్లే అది తట్టుకోలేక సతీష్ కుమార్ చనిపోయి ఉండవచ్చు. నేను కూడా అదే విషయాన్ని చెబుతున్నాను. నన్ను అరెస్టు చేయండి? ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే అన్నీ మీకు అనుకూలంగా చేయాలా? అది నడవదు. బాధ్యతాయుతమై రాజకీయ పార్టీగా వైయస్.జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా నిస్సంకోచంగా మా అభిప్రాయాన్ని వెల్లడిస్తాం. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంతే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే రోజులన్నీ ఒకేలా ఉండవని అధికార పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నాం. హత్య అని అధికార పార్టీ నాయకులే అన్నప్పుడు ప్రభుత్వం ఇంతవరకు ఏం చేస్తోంది?. వాళ్లమీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఇది చేతకాని ప్రభుత్వమా? నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేసి.. తప్పు చేసిన వాళ్లను శిక్షించండి. ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నాను.స్టీల్ ప్లాంట్ పై సీఎం అసహనం ఆశ్చర్యకరం...మరోవైపు విశాఖలో సీఎం చంద్రబాబును స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పాత్రికేయులు ప్రశ్నిస్తే.. ఆయన అంత అసహనానికి గురికావడం ఆశ్చర్యకరం. మీ చర్యలు, వ్యవహారశైలిపై అనుమానం ఉండబట్టే మిమ్నల్ని ప్రశ్నిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.11,400 కోట్లు నిధులు విడుదల చేసినందుకూ అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. బాధ్యత ప్రతిపక్షంగా కేంద్రం సాయానికి అభినందనలు తెలుపుతాం కానీ.. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయమని కూడా తీర్మానం చేయాలని పట్టుబడ్డాం. కానీ దానికి ఎందుకు ప్రభుత్వం అంగీకరించలేదు? గతంలో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ .జగన్ నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశాం. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ వస్తే .. వేదిక మీదే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దు, విశాఖ ఉక్కు ప్రజాపోరాటం, త్యాగాల ఫలితం అని వైయస్.జగన్ ప్రధానిక సమక్షంలోనే చెప్పారు. దయచేసి ప్రైవేటీకరణ ప్రక్రియను విరమించుకోవాలని కోరాం. కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ మాట చెప్పలేక పోతుంది.ఇది ప్రజా ప్రభుత్వమా ? తాలిబన్ రాజ్యమా ?మేము స్టీల్ ప్లాంట్ కు రూ.11 వేలు కోట్లు ఇచ్చాం, డెత్ రిలీఫ్ కు పనికి వస్తుందని డొంకతిరుగుడు సమాధానం చెబుతున్నారు తప్ప.. ప్రజలు, కార్మికులకున్న సందేహాలను నివృత్తి చేయడం లేదు. అప్పులు తీర్చి ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తున్నారన్న వారి ఆందోళనను ఎందుకు నివృత్తి చేయడం లేదు? నాలుగు నెలల క్రితం వైయస్సార్సీపీ ఎంపీలు లోక్ సభలో ప్రశ్నిస్తే... ప్రైవేటీకరణలో భాగంగా చేస్తున్న డిజ్ ఇన్వెస్ట్ మెంట్ నుంచి వెనక్కి వెళ్లేది లేదని కేంద్రమంత్రే సమాధానం చెప్పారు. దాన్ని ఆసరగా పాత్రికేయులు ప్రశ్నిస్తే... వారిని బెదిరిస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్న ప్రజా ప్రభుత్వమా ? లేక తాలిబాన్ ప్రభుత్వమా? ఇది చాలా శోచనీయం. సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ మీద స్పష్టతనివ్వకుండా సహనం కోల్పోవడాన్ని బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు. చంద్రబాబు పుట్టిన తర్వాత వ్యవస్థలు రాలేదని.. వ్యవస్థలు వచ్చిన తర్వాత మనందరం వచ్చామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చట్టాన్ని చేతిలోకి తీసుకుని.. పోలీస్ వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీకోసమే ఉన్నట్టు.. ప్రజల కోసం కాదన్నట్టు వ్యవహరిస్తున్న తీరు సరికాదని హెచ్చరించారు.అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...గత 15 ఏళ్లుగా కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కేంద్రం ఆధీనంలో ఉందా? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందా? ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆ పరిశ్రమకు కావాల్సన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అసలు నష్టాలకు కారణం ఏంటో కనుక్కోవాలి. నవరత్నాల్లో ఒకటిగా నిల్చిన స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లోకి వెళ్లింది. ముడిసరుకు ఖరీదు పెరిగిపోయింది. క్యాప్టివ్ మైన్స్ ఉన్న ప్లాంట్లు కన్నా... ముడిసరుకు ఖరీదు పెరిగిపోవడంతో అది ప్రొడక్షన్ కాస్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. కొంతమంది నిపుణులు చెప్పిన దాని ప్రకారం గతంలో రామెటీరియల్ కాస్ట్ 54 శాతం ఉంటే ఇప్పుడు అది 64 శాతం అయింది. దానికి క్యాప్టివ్ మైన్ లేకపోవడమే కారణం. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ అడిగితే పైపులైన్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. వైజాగ్ స్టీల్ కు కూడా క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ప్లాంట్ వయబులిటీకి వస్తుందని రాష్ట్రంలో ఉన్న మేధావులు, కార్మికులు, ప్రజలు అడుగుతున్నారు. అది చేయాల్సింది పోయి... సీఎం చంద్రబాబు ఎదురుదాడిగి దిగడం సరైనది కాదు. గాయం ఉన్నచోట మందు పూయాల్సింది పోయి... అది పక్కనపెట్టి మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం. స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారానికి శాశ్వతంగా నివారణ చర్యలు తీసుకోవాలన్నదే ప్రధాన డిమాండ్. దాని గురించి మాట్లాడకుండా.... ఎదురు దాడికి దిగడం సమంజసం కాదు. సతీష్ కుమార్ మృతి వెనుక వైయస్సార్సీపీ నేతలున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ... ప్రభుత్వంలో ఉన్నవారు ఆరోపణలు చేసే అవకాశం లేదు. చేతకానప్పుడు, బురద జల్లాలనుకుంటేనే ఆరోపణలు చేస్తారు. లేదంటే వాస్తవాలు చెబుతారు. వ్యవస్థలన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నవారు ఆపోహపడే అవకాశం ఉంది. ఆరోపణ చేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు వాస్తవాలే చెప్పాలి. అందుకే మా పార్టీ నేత వెంకటరెడ్డి అక్రమ అరెస్టును ఖండించాం. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ల చేతుల్లో వ్యవస్ధలుండవు. ప్రజల తరపున ప్రశ్నిస్తారు. ప్రజలకున్న సందేహాలను, వస్తున్న ఆరోపణలను అడుగుతారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బొత్స స్పష్టం చేశారు. -
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
-
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
-
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. అప్పుడలా.. ఇప్పుడిలా
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వంలో నవంబర్ 5వ తేదీ వచ్చినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. దీంతో ప్రభుత్వం జీతం ఎప్పుడిస్తుందా? అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటినే జీతాలు చెల్లిస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అయినా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు.. చంద్రబాబు ప్రభుత్వంలో జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే, జీతాలివ్వండి మహా ప్రభో.. అంటూ ఉద్యోగులు నిరసన తెలుపుతారేమోనన్న ఉద్దేశ్యంతో నిన్న రాత్రి పోలీస్, మెడికల్,టీచర్,సచివాలయ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించింది.ఆ జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అప్పు చేసింది. మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
మార్గదర్శి కేసు.. ఉండవల్లికి సుప్రీం కోర్టు కీలక సూచన
సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ఆర్బీఐ నిబంధనలను ఆ కంపెనీ ఉల్లంఘించిన అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలని మాజీ ఎంపీ, అడ్వొకేట్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు గురువారం సూచింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ఇవాళ వాదనలు వింది. వర్చువల్‌గా విచారణకు హాజరైన ఉండవల్లి ‘‘ఇది డిపాజిట్ల కలెక్షన్, పేమెంట్స్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందని.. దీనిపైన విచారణ జరగాలని’’ కోరారు. అయితే.. ఈ అంశాలన్నీ హైకోర్టు ముందున్న ప్రధాన పిటిషన్ విచారణ సందర్భంగా వినిపించాలని ఆయనకు ధర్మాసనం సూచించింది. ప్రస్తుతం తాము కేసు మెరిట్ లోకి వెళ్లడం లేదని.. హైకోర్టు స్టే ఇవ్వనన్న అంశంపై మాత్రమే విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇక.. ఈ కేసులో ఉండవల్లి అసలు ప్రతివాది కాదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ సమయంలోనూ తాము ఎలాంటి వ్యాఖ్యానం చేయదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తూ.. తాము చెల్లించాల్సిన 2,300 కోట్ల రూపాయల డిపాజిట్లలో సింహభాగం చెల్లించామని, ఎస్క్రో ఖాతాలో 5.43 కోట్ల రూపాయలు ఉన్నాయని.. డిపాజిట్ల మెచ్యూరిటీ ఆధారంగా వాటిని చెల్లించాలని కోరారు. -
66 ఏళ్ళ తరువాత ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. బాబుపై గుడివాడ సెటైర్లు
-
ఉద్యోగుల డిఏ పై మరో జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పై మరో జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం. డిఏ అరియర్స్ రిటైర్ అయ్యాక చెల్లిస్తామన్న నిబంధన వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం. అరియర్స్ 10 శాతం 2026 ఏప్రిల్ లో చెల్లిస్తామని వెల్లడించింది. 90 శాతం అరియర్స్ 2026 ఆగస్ట్, నవంబర్, 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగుల జి పి ఎఫ్ లో జమ చేస్తామని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
మీడియాపై హోంమంత్రి అనిత తీవ్ర అసహనం.. ఎందుకంటే?
సాక్షి,అమరావతి: మీడియాపై హోంమంత్రి తీవ్ర అనిత అసహనం వ్యక్తం చేశారు.పవన్ వద్ద భీమవరం డీఎస్పీ పేకాట పంచాయితీపై మీడియా ప్రశ్నించింది. సమాధానం చెప్పలేక మీడియాపై హోంమంత్రి ఎదురుదాడికి దిగారు. పవన్ సలహాలు ఇవ్వడంలో తప్పులేదు. మాకు మాకు లేని ఈగోలు మీకెందుకు?.ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. మా మధ్య అండర్ స్టాండింగ్ ఉంది. ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తున్నాం’ అంటూ మీడియాపై ఫైరయ్యారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు పేకాట పంచాయితీ చేరింది. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పవన్‌కు జనసేన నేతల ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని, భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని డీఎస్పీపై పవన్‌కు చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులపై పవన్ స్పందించారు. కూటమి నేతల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయన్న ఆయన ..డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలపాలని అధికారులకు ఆదేశాలు చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఎస్పీకి ..పవన్ ఆదేశించారు. ఈ ఆదేశాలు,పవన్ జోక్యం వంటి అంశాలపై మీడియా హోంమంత్రి అనితను ప్రశ్నించింది. పేకాట పంచాయితీలో మాకు లేని ఈగోలు మీకెందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు.👉ఇదీ చదవండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు ‘పేకాట పంచాయితీ’ -
Gudivada: గూగుల్ సంస్థతో ఆ మాట చెప్పిస్తే నిన్ను నేనే సన్మానిస్తాలోకేష్
-
Abhinay: ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదు
-
కర్మ ఎవ్వరిని వదలదు... పవన్‌కు రోజా పవర్ పంచ్..
-
ABN రాధాకృష్ణను ఏకిపారేసిన పేర్ని నాని
-
ప్రభుత్వానికి భారీ షాక్.. పనిచేయని సిద్దార్థ్ లూథ్రా వాదనలు
-
టీడీపీ నేతల కల్తీ మద్యంపై జూపూడి సెటైర్లు
-
డిజిటల్ బుక్ లాంచ్ చేసిన ఉషశ్రీ చరణ్..
-
సప్త సముద్రాలు అవతల ఉన్నా లాక్కొచ్చి మరీ..
-
మండలిలో సభాపతికి జరిగిన అవమానంపై YSRCP MLCల నిరసన
-
నేను కూడా ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నా... ఈ రోజు నువ్వు బతుకుతున్న బతుకు YSR బిక్ష
-
వైద్యం కోసం హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్ ప్రయాణం
-
జగన్ వస్తే భయం.. అసెంబ్లీలో చంద్రబాబు స్కెచ్
-
తప్పుడు పనులు మానుకో.. లేదంటే ఎమ్మెల్యే ఈశ్వర్ రావుకి గొర్లె కిరణ్ వార్నింగ్
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయకపోతే... ఉషశ్రీ చరణ్ ఉగ్రరూపం
-
Perni Nani: ఇంట్లో పడుకుంటే పని అవ్వదూ... విలేకర్ ప్రశ్నకు పేర్ని నాని సమాధానం అదుర్స్
-
ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై YARCP ఎమ్మెల్సీ ల నిరసన
-
AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు
-
Merugu Nagarjuna: మీకు చేతకాక కలెక్టర్లపై నిందలా.. పవన్ కళ్యాణ్,లోకేష్ ఎక్కడ?
-
జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
-
YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల
-
ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్
-
సీపీఐ సెల్వకుమార్ దంపతులపై దాడి
-
సూపర్ సిక్స్, సూపర్ హిట్ కార్యక్రమానికి బస్సులు తరలింపు
-
పవన్ పై వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ వేరే లెవల్
-
ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం
-
ప్రజల, ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలకు,బెల్లానికి అమ్ముతున్నాడు
-
Kakani: ఇమామ్, మౌజన్ లకు న్యాయం జరిగే వరకూ YSRCP పోరాటం ఆగదు..
-
దివ్యాంగుల పాలిట శాపంగా మారిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
-
Vellampalli Srinivas: అమరావతిలో వేల ఎకరాలు ఉన్నాయి కదా ఏమయ్యా సనాతనీ మాట్లాడు..
-
ముస్లిం, మైనార్టీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: ఖాదర్ బాషా
-
నీ ఉచిత సలహాలు ఎవడికి కావాలి.. బాబుపై సజ్జల ఫైర్
-
Kethireddy: నన్ను ఎవడు తొక్కలేడు పోరాటం నా బ్లడ్ లోనే ఉంది
-
Sajjala Ramakrishna: విజయమ్మ విషయంలో లోకేష్ రాజకీయం..!
-
జగన్ తోనే అభివృద్ధి నిజం ఒప్పుకున్న బాబు
-
నల్లపురెడ్డి పల్లెలో Y.S జగన్ కు ఘనస్వాగతం పలికిన YSRCP శ్రేణులు
-
ఆడబిడ్డ ఏడుపు మీకు కనిపించట్లేదా ? సుగాలి ప్రీతి కేసుపై ఎక్కడ?
-
Vellampalli Srinivas: వరద బాధితుల పై లాఠీ ఛార్జ్ చేసిన ఘనత మీదే..
-
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతు కష్టాలు
-
Kakani: రౌడీలను పెంచి పోషించిందే నువ్వు, కోటంరెడ్డి కొత్త డ్రామా...
-
మీలాగా పిరికిపందలు అనుకుంటున్నావా ఇది జగనన్న సైన్యం..
-
తిరుపతి ప్రజల డిమాండ్.. BR నాయుడుని వెంటనే TTD చైర్మన్‌గా తొలగించాలి
-
తిరుపతిలో దివ్యాంగుల ఆందోళన
-
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు
-
మాపైన కూతలు.. చంద్రబాబుపై జగన్ షాకింగ్ కామెంట్స్
-
బాబుకు EC చెంప చెళ్ళు.. పులివెందులలో రీపోలింగ్
-
పవన్ పై దాడి చేసిన దినేష్‌కు కానిస్టేబుల్ సహకరించినట్లు ఆరోపణలు
-
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావం... ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలైనా ముందుకు సాగని పంటల సాగు
-
తప్పుడు కథనాలతో ఎల్లో మీడియా ప్రజలను మభ్యపెడుతోంది: ఎంపీ గురుమూర్తి
-
నా భర్తను బ్లాక్ మెయిల్ చేసి సంచలన నిజాలు బయటపెట్టిన అనిల్ రెడ్డి భార్య
-
ఇది వైయస్సార్ అడ్డా.. పులివెందుల ప్రచారంలో పెద్దారెడ్డి
-
Ramesh Yadav: 100 మంది ఒక్కసారిగా మాపై దాడి...!!!
-
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
-
అమరావతి కోసం మళ్లీ చందాలు ప్రారంభించిన చంద్రబాబు
-
తురకా కిషోర్‌కు యాంత్రికంగా రిమాండ్ విధింపు.. ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి
-
AP Farmers: పెట్టుబడి సాయంలో మోసం.. ఎరువుల కొరత..మద్దతు ధరలో దగా
-
కూటమి ప్రభుత్వ తీరుపై సర్పంచ్ వినూత్న నిరసన
-
జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన భార్య..
-
సిగ్గులేకుండా సుపరిపాలన అని చెప్పుకుంటున్నారు చంద్రబాబుపై దేవభక్తుని చక్రవర్తి ఫైర్
-
నీ గురించి మాట్లాడటం మొదలుపెడితే హోంమంత్రి అనితకు అంబటి వార్నింగ్
-
మా వాళ్ళని పంపిస్తే వేరేలా ఉండేది.. బాబుకు జగన్ వార్నింగ్.. జాగ్రత్త
-
ఎవ్వడిని వదిలిపెట్టం.. తురకా కిషోర్ అరెస్ట్ పై పేర్ని నాని వార్నింగ్
-
చంద్రబాబుకు వయసైపోయింది.. అందుకే ఇచ్చిన హామీలు మర్చిపోయాడు
-
భూములు అమ్మకాలపై బాబుని ఏకిపారేసిన శోభనాద్రీశ్వరరావు
-
జగన్ టూర్ అంటే చాలు గడగడలాడుతున్న చంద్రబాబు సర్కార్.. ఆంక్షలే ఆంక్షలు
-
తల్లికి వందనం డబ్బులు పడలేదని కుటుంబం ఆవేదన
-
Nedurumalli Ramkumar: చేస్తే న్యాయం చేయండి అన్యాయం మాత్రం చేయకండి
-
ఉపాధి హామీ పథకం టీడీపీ నేతల దోపిడీకి అడ్డాగా మారింది: శైలజానాథ్
-
అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి తెరతీసిన SIT
-
మిర్చి రైతులను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
-
బరితెగించిన టీడీపీ నేతలు .... ఎమోషనల్ అయిన రాప్తాడు ఎంపీపీ
-
Madhumathi: మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు..
-
ఒక్క వర్షంతోనే మునిగిన కానూరు ప్రధాన రహదారి
-
అయ్యా చంద్రబాబు, బాధిత మహిళకు రక్షణ కల్పిస్తారా ?
-
Hindupur: టీడీపీ సైకోల లైంగిక వేధింపులు
-
రెడ్ బుక్ ప్రకారం బెదిరించి వాంగ్మూలాలు తీసుకుంటున్న పోలీసులు
-
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
-
Liquor Scam: CID విచారణలో బట్టబయలు.
-
హైదరాబాద్ లో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
-
పార్లమెంట్లో మిథున్ రెడ్డి నిలదీస్తాడనే భయంతోనే అరెస్ట్
-
YSRCP రమేష్ రెడ్డి అరెస్ట్ పై గడికోట శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్
-
Jogi Ramesh: ఇక్కడున్న YSRCP కార్యకర్తలకి మాట ఇస్తున్న..
-
YSR జిల్లా బద్వేల్లో అంగన్వాడి సెంటర్లకు పురుగుపట్టిన కందిపప్పు సరఫరా
-
అక్రమంగా పేదవారి భూమి లాగేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే
-
వచ్చే ఎన్నికల్లో గెలిచేది YSRCPనే మళ్ళీ సీఎం అయ్యేది జగనే
-
2024-25 బాకీ ఉన్నారు.. ఇచ్చేయాలి ప్రజల తరుపున నిలదీస్తాం: Vanga Geetha
-
రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలు వరుదు కళ్యాణి స్టాంగ్ కౌంటర్
-
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి
-
Ambati: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు 2027కి పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు
-
శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన వినుత డ్రైవర్ శ్రీనివాసులు సోదరి కీర్తి
-
Guntur: డీఎంపీ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ ఆందోళన
-
చాపాడులో జరిగిన వైఎస్ MPP ఎన్నికల్లో YSRCP అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక
-
విజయవాడ గవర్నర్ పేటలో డబుల్ మర్డర్
-
సీనియర్ పోలీస్ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు: వైఎస్ జగన్
-
ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు, ప్రజల తరపున పోరాటం ఆగేది లేదు
-
శ్రీనివాసులు హత్య కేసులో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు: తాసిర్ తల్లి
-
ఉప్పాల హారికను పరామర్శించిన YSRCP నేతలు


