అంగన్ వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టుపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైరయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పేలా అవుతుందని నిలదీశారు. రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని నిలదీయడం నేరం అవుతుందా? అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయమని ట్వీట్ చేశారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేస్తూ, పోలీసుల చేత బలప్రయోగంచేస్తూ, ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారని వెఎస్ జగన్ మండిపడ్డారు.
ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా?
వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈ ఉదయం చర్చలకు పిలుస్తామనిచెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లు ఎగ్గొట్టి పచ్చి మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ఒక్క అంగన్‌వాడీలకే కాదు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబూ.. మీరు తక్షణం అంగన్‌వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని.. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా వైఎస్ జగన్ ప్రశ్నించారు.
.@ncbn గారూ.. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని…
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2026


