విజయవాడలో కొనసాగుతున్న అంగన్‌వాడీల ఆందోళన | Anganwadi Workers Protest Intensifies in Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో కొనసాగుతున్న అంగన్‌వాడీల ఆందోళన

Mar 2 2026 5:16 PM | Updated on Mar 2 2026 9:21 PM

Anganwadi Workers Protest Intensifies in Vijayawada

విజయవాడ:  తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ అంగన్వాడీలు పట్టుబట్టుకుని కూర్చొన్నారు. తమ డిమాండ్లపై ప్రకటన వచ్చే వరకూ తాము నిరసన కొనసాగిస్తామని ప్రభుత్వాని హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగంగా వారు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.  రాత్రికి కూడా ధర్నా చౌక్‌లోనే  ఉంటామని వారు స్పష్టం చేశారు. 

రేపటి వరకూ ప్రభుత్వంకు గడువు ఇస్తున్నామని, తమకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా తమ కార్యాచరణ ఉంటుందని అంగన్వాడీలు తెలిపారు.  సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రికి వంటా వార్పు కార్యక్రమం చేపడతామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement