ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి: వైఎస్‌ జగన్‌ | Andhra Migrants in Gulf Countries Must Be Brought Back Safely: YS Jagan | Sakshi
Sakshi News home page

ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి: వైఎస్‌ జగన్‌

Mar 2 2026 3:03 PM | Updated on Mar 2 2026 4:16 PM

Andhra Migrants in Gulf Countries Must Be Brought Back Safely: YS Jagan

తాడేపల్లి:  అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల యుద్ధం నేపథ్యంలో  గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.  యుద్ధం నేపథ్యంలో ప్రవాసాంధ్రుల రక్షణ అంశానికి సంబంధించి వైఎస్‌ జగన్‌ ప్రకటన చేశారు.

‘ఏపీకి చెందిన వేలాదిమంది గల్ఫ్‌ దేశాల్లో పని చేస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలి. యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొనడంతో పాటు భద్రత కొరవడింది. పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలామంది ఎక్కడికక్కడి చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.  

వారందరినీ ఇక్కడకి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. ఆంధ్రుల భద్రత, సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సంక్షోభ సమయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. అక్కడి వారి పరిస్థితిని ఎప్పడికప్పుడు, వారి కుటుంబాలకు తెలియజేసే విధంగా ఇక్కడ ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్‌ నెంబర్లు కూడా అందుబాటులోకి తేవాలి’ అని వైఎస్‌ జగన్‌ సూచించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement