ఎర్ర బుక్‌లు.. పసుపు బుక్‌లకు ఎవ్వరూ భయపడరు
జైల్లో పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుని తగిన బుద్ధి చెబుతాం మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని, కురసాల కన్నబాబు అంబటి రాంబాబుకు పరామర్శ
ఉభయ గోదావరి జిల్లాల నేతల పరామర్శ
భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చినమెల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ.. తనతోపాటు ఉభయ గోదావరి జిల్లాలోని ఒక్కో మండలం నుంచి కాపు ప్రముఖులు అంబటిని పరామర్శించేందుకు వచ్చారని అన్నారు. గత జనవరిలో అంబటి రాంబాబుపై, ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడి నిరంకుశ పరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఇది ముమ్మాటికీ కాపులపై జరిగిన దాడి అని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి మోహన రంగాను కిరాతంగా హత్య చేశారని, ఈ దారుణంతో యావత్తు కాపు జాతి మానసిక క్షోభకు గురైందని అన్నారు. తర్వాత ఎన్నికల్లో టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పలేదని గుర్తుచేశారు. మాయమాటలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను అనేక విధాలుగా హింసించారని గుర్తుచేశారు. ఆయన భార్య, కొడుకు, కోడలిని లాక్కెళ్లి అరెస్ట్ చేశారని అన్నారు. ఇందుకుగాను ప్రతి కాపు హృదయం ఆవేదన చెందిందని అన్నారు. ఈ క్రమంలోనే 2019లో టీడీపీని బంగాళాఖాతంలో కలిపారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి చంద్రబాబు వచ్చేందుకు కాపు నాయకుల మద్దతు కీలకంగా మారిందని అన్నారు. అంబటి రాంబాబుపై, ఇంట్లోని మహిళలు, పిల్లలను కూడా చూడకుండా దమనకాండ సృష్టించారని ఆరోపించారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ప్రతి కాపు మనసులో పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో మరోసారి బంగాళాఖాతంలోకి కలుపుతారని చెప్పారు.
కాపు ఎస్‌ఎస్‌సీ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ అంబటి రాంబాబుపై జరిగిన దాడి కాపు కులంపై జరిగినట్టేనని అన్నారు. కాపు సంఘం నేతలపై కూటమి ప్రభుత్వం వచ్చాక దాడులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పారు. భీమవరంలో ఇటీవల కాపు టీడీపీ కార్యకర్తను తొక్కితొక్కి చంపారంటే వారికి కాపులపై ఎంత కసి ఉందో అర్థమవుతోందని అన్నారు. జనసేన పార్టీ 21 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరూ దీనిని ఖండించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గళ్లా మాధవికి తమ సత్తా ఏంటో చూపుతామని హెచ్చరించారు. రంగా వంటి వ్యక్తి అంబటి రాంబాబు అన్నారు. కాపులపై దాడులను ఏక కంఠంతో ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ (రాజమండ్రి), విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకేరాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దీవన్‌రెడ్డి, వైజాగ్ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎం.అప్పారావు, కాపు నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి అంబటికి సంఘీభావం తెలిపారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్)/ నగరంపాలెం:
నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎర్ర బుక్ పాలనకు.. పసుపు బుక్ పాలనకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే రోజులు పోయాయని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని సిద్ధార్థనగర్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకర రావులు పరామర్శించారు. కొడాలి నాని మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై, కార్లను ధ్వంసం చేసి ఇంట్లో ఆడపిల్లలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని వదిలేశారని మండిపడ్డారు. కానీ అంబటి రాంబాబును 18 రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులు గురిచేశారని ధ్వజమెత్తారు. అంబటిని రెచ్చగొట్టినప్పుడు నోరు జారి ఒక మాట మాట్లాడారని, దానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కావాలనే టీడీపీ వారు ఇలా దాడి చేయించారని అన్నారు.
జగన్‌తో పెట్టుకుంటే లోకేష్‌కే ప్రమాదం
రెడ్‌బుక్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ఉందో లేదో మీకు త్వరలో తెలుస్తుందని మంత్రి నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ బుక్‌లో వైఎస్ జగన్ పేరు రాస్తే లోకేష్‌కే ప్రమాదమని, వైఎస్ జగన్ ఏదైనా బుక్‌లో లోక్‌ష్ పేరు రాసినా లోకేష్‌కే ప్రమాదమని హెచ్చరించారు. సిగ్గు ఉంటే ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంపై పాలకులు దృష్టి సారించాలన్నారు.
అరెస్టులతో మరింత పట్టుదల
అంబటి రాంబాబు అరెస్టు తర్వాత వైఎస్సార్ సీపీలోని అన్ని స్థాయిల నాయకుల్లో మరింత పట్టుదల పెరిగిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారనే ఇంగితజ్ఞానం లేకుండా స్థానిక ఎమ్మెల్యే జనాలను వేసుకొచ్చి ఇలా దాడులు చేస్తే వాళ్లకి మద్దతు ఇస్తున్నారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దుస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. 2014–19 మధ్య కాపు నాయకులు ముద్రగడ పద్మనాభంపై దాడి చేశారని, వారి కుటుంబ సభ్యుల్ని హింసించారని, ఇప్పుడు కాపు నాయకుడైన అంబటిపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ప్రయత్నం కొందరికి అలవాటుగా మారిపోయిందని స్పష్టం అవుతోందన్నారు.
కక్ష సాధింపు మానుకోకుంటే ఇబ్బందులే
ఎవరైనా కూటమి ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపితే వారి గొంతు నొక్కేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు. కేసులు పెట్టినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళతామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోని ప్రజాప్రయోజనాలపై దృష్టి సారించాలని హితవు పలికారు.
గుంటూరు సిద్ధార్థనగర్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆదివారం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి మద్దతు పలికారు. జై జగన్, జై అంబటి, కాపుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా అంబటి నివాసానికి తరలివచ్చారు.
ఎర్ర బుక్‌లు.. పసుపు బుక్‌లకు ఎవ్వరూ భయపడరు


