న్యాయ విచారణ చేపట్టాలి
గడిచిన మూడు నెలల్లో సుమారు 40 మందికిపైగా సచివాలయ ఉద్యోగులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది 40 ఏళ్ల వయస్సు గలవారే. ఈ మరణాలకు కారణం తీవ్రమైన పని ఒత్తిడే. సచివాలయ శాఖలో సుమారు 15 వేల మందికిపైగా ఉద్యోగులు వివిధ శాఖలకు, అధికారుల వద్ద డెప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వీరందరి భారం మిగిలిన వారిపైనే పడి వారు తీవ్రమైన పని ఒత్తిడితో మరణిస్తున్నారు. సర్వేలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతోపాటు సచివాలయ ఉద్యోగుల మరణాలపై జ్యూడీషియల్ విచారణ చేపట్టాలి.
– షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర అధ్యక్షుడు,
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం


