సాక్షి,తిరుపతి: ‘బీఆర్ నాయుడు నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. బీఆర్ నాయుడు నీలాంటి వాడిని మనిషిలా కూడా చూడను’అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం తిరుపతి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు ఓ మహిళతో పలు ప్రాంతాల్లో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోల్ని మీడియా ఎదుట విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తనపై డీప్ ఫేక్ వీడియోతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అది డీప్ ఫేక్ వీడియో కాదు. ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాతనే మేం ఆ వీడియోలపై మాట్లాడాం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని అడిగాం.
2019లో వీడియోలోని మహిళ చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖలో బీఆర్ నాయుడు భయంకరమైన మహిళా వ్యసనపరుడని చెప్పారు. లెటర్‌లో రాసిన ప్రతి అక్షరానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఆ లేఖతో బీఆర్ నాయుడు కంటతడి పెట్టుకుంటే నేను ఆయన్ను నమ్మాను. కానీ ఇప్పుడు వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. విచారణ జరిపిస్తే అసలు రంగు బయటపడుతుంది. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుంటే మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు.


