breaking news
bhumana karunakar reddy
-
రూ.306లకే నెయ్యిని చంద్రబాబు హయాంలో సరఫరా చేశారు
-
చంద్రబాబు నోటికి తోచింది మాట్లాడుతున్నారు
-
తిరుమల నెయ్యిలో కొత్త కోణం.. ఇందాపూర్ సంగతేంటి?: భూమన
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నోటికి తోచింది మాట్లాడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 300 రూపాయలకే స్వచ్చమైన నెయ్యి ఎవరు అందిస్తారు.. అది కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. గతంలో హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ నెయ్యి సంగతేంటి?. ఇందాపూర్‌లో కల్తీ జరిగిందా? అని ప్రశ్నించారు. అసలు నిజాలు బయటకు వస్తున్నాయి అని కామెంట్స్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ గురించి వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ ఫ్రాంచైజీ సంస్థ. 2015లో రూ.278కే నెయ్యి సరఫరా చేసింది. 2016లో ఇందాపూర్ సంస్థ డిస్ క్వాలిఫై అయ్యింది. కానీ, 2025 డిసెంబర్ 16న కేజీ నెయ్యి రూ.658కి ఇందాపూర్ సంస్థ దక్కించుకుంది. గతంలో 2013-19వరకు ప్రీమియర్ అగ్రి డైరీ నుంచి 40 లక్షలు కేజీల నెయ్యి సరఫరా చేశారు. ఈ నెయ్యి ఖరీదు దాదాపు 300లుగానే ఉంది. ఈ రెండు సంస్థలు 50 కోట్ల 40 లక్షలు నెయ్యి సరఫరా చేశాయి.ఇందాపూర్‌లో సరఫరా చేసిన నెయ్యి కల్తీదా? అనే అనుమానాలు ఉన్నాయి. మీ హయంలో తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసింది కల్తీనా?. రూ.300లకు సరఫరా చేసే నెయ్యి.. 658కి ఒకేసారి రెట్టింపు ధరకు ఎలా సాధ్యమైంది?. దీనిపై చంద్రబాబు, హెరిటేజ్ సంస్థ స్పందించాలి. స్వచ్చమైన నెయ్యి రెండు వేల అయితే కానీ రాదు అని చంద్రబాబు పదేపదే చెప్పారు కదా?. తక్కువ రేటుకు సరఫరా చేసిన నెయ్యి కల్తీదా అనిపిస్తోంది. హెరిటేజ్ సంస్థ అనే పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దాచేసినా దాగని సత్యం.. ఇప్పుడు బయట పడింది అని వ్యాఖ్యలు చేశారు. -
‘కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు’
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారన్నారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తిరుపతి నుంచి మీడియాతో మాట్లాడిన భూమన.. తిరుమల లడ్డూపై సిట్ ఇచ్చిన రిపోర్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు, ముద్దాడ, రవిచంద్ర బలవంతంగా పెద్ద జీయర్ స్వామితో లేఖ రాయించారు. లడ్డూ అంశంలో రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రమేయంలేదని సిట్ స్పష్టంగా చెప్పింది. కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు. చంద్రబాబు క్షద్ర రాజకీయాల్లో ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోతున్నారు. స్వాములను భయపెట్టి చంద్రబాబ ఏం సాధించాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.‘కొంతమంది స్వాములకు భక్తి కంటే పైరవీలు ఎక్కువ అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్టులపైనే ఎల్లో మీడియా దాడులు చేస్తోంది. హైందవ సమాజానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు రెడ్‌బుక్ పాలన పెద్ద జీయర్స్వామిపైకి మళ్లింది. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
లడ్డూపై పవన్ వ్యాఖ్యలు నీచాతి నీచం.. గొడ్డు మాంసం తింటా అన్నాడు
-
హిందూ మఠాలపై చంద్రబాబు రెడ్‌బుక్
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ వ్యవహారంలో తనకు అనుకూలంగా ప్రకటనలు చేయించుకునే పనిలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారని టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిశాయంటూ బాధ్యతారహితమైన ప్రకటనలు చేసిన చంద్రబాబు.. అవి అసత్యాలని సీబీఐ–సిట్ దర్యాప్తులో తేలడంతో ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, తన అబద్ధాలను నిజం చేయించుకోవాలని, అవమానకర పరిస్థితుల నుంచి బయటపడాలని రోజుకో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘హిందూ ఆధ్యాత్మిక మఠాలపైనే తన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తూ దేశవ్యాప్తంగా తిరుమల క్షేత్రం పరువు, ప్రతిష్టను దెబ్బతీసే అపవిత్ర కార్యక్రమాలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎంవోలో ఓ అధికారికి ఈ ప్రత్యేక బాధ్యతలు అప్పగించగా, టీటీడీలో కొందరు అధికారులు వీరికి సహాయపడుతున్నారు. దక్షిణాది సహా దేశంలోని హిందూ ఆధ్యాత్మిక మఠాలకు వెళ్లి వారిని ఒత్తిళ్లకు గురిచేసి, అసత్యాలు చెప్పి తనకు అనుకూలంగా మఠాధిపతుల చేత లేఖలు విడుదల చేయించడం, వాటిని తమ ఎల్లో మీడియాలో ప్రధాన శీర్షికల్లో ప్రచురించి, దుర్బుద్ధితో కూడిన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్ద జీయంగార్పై కొద్దిరోజులుగా ఒత్తిడి తిరుపతిలోని పెద్ద జీయంగార్ మఠంపై ఇలాగే ఒత్తిడి తెచ్చి లేఖ విడుదల చేయించారు. కొన్నిరోజులుగా ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నా నిరాకరించిన నేపథ్యంలో నేరుగా సీఎంవో కార్యాలయమే రంగంలోకి దిగింది. చంద్రబాబు తన ప్రత్యేక కార్యదర్శి, టీటీడీ కొత్త ఈవో ముద్దాడ రవిచంద్రను పెద్ద జీయర్ వద్దకు పంపి తనకు అనుకూలంగా లేఖ రాయించుకున్నారు. వేయి సంవత్సరాల రామానుజాచార్యుల పరంపరనే భ్రష్టుపట్టించడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదు. ఈ కార్యక్రమాల కోసమే ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా నియమించారు.హిందూ ధర్మానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు. వేల సంవత్సరాల ప్రతిష్ట ఉన్న తిరుమల ఆలయాన్ని రాజకీయాలకోసం దెబ్బతీయడం అత్యంత శోచనీయం. శ్రీవారి భక్తులు, మఠాలపై చంద్రబాబు తన రాజకీయ స్వార్థంతో చేస్తున్న దాడిగానే దీన్ని చూడాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు కుట్రలను గమనించి ప్రతి ఒక్కరు వాటిని తిప్పికొట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారు.. కూటమిలో భయం మొదలైంది
-
అంబటి కుటుంబానికి రోజా, భూమన పరామర్శ
-
శ్రీవారి పేరుతో జగన్‌పై కుట్ర
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామినే రాజకీయ ఆయుధంగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దైవ ద్రోహం పేరుతో వైఎస్ జగన్‌పై కుట్రకు తెగబడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తాము తప్ప మరెవ్వరూ భక్తులు కారన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో తన రాజకీయాల కోసం వ్యవస్థలను వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు తిరుమల శ్రీవారినే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో గురువారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ సిట్ తేల్చిచెప్పినా చంద్రబాబు అబద్ధాలు, దుష్ప్రచారం ఆగడంలేదని మండిపడ్డారు. భూమన ఇంకా ఏమన్నారంటే..అడ్డంగా దొరికి చంద్రబాబు నంగి మాటలు..గత పత్రికా సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కూటమి నేతలు ఇవాళ ప్రజలకు దొరికిపోయామన్న భావన వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. సీబీఐ సిట్ నివేదికతో పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు ఇప్పుడు కూటమి పార్టీలనూ తన తప్పులో భాగస్వామ్యులను చేస్తున్నాడు. గత పదేళ్లలో పవన్‌కళ్యాణ్ అనేకసార్లు ‘నేను బాప్టిజమ్ తీసుకున్నాను. మా నాన్న దేవుడి దీపంతోనే సిగరెట్ ముట్టించేవాడు. మా ఇంట్లో ఏ రకమైన దైవ పూజలు జరగవు.. అవసరమైతే నేను గొడ్డు మాంసం తింటాను’.. అంటూ చెప్పాడు. ఆయన ఇవాళ సనాతన హైందవ ధర్మ పరిరక్షక అవతారిగా మారి చంద్రబాబు ఆలోచనలకు అమ్ముడుపోయాడు. ఆలయాలపై మీ అరాచకాలు మర్చిపోయావా బాబూ.. తన హయాంలో పదుల సంఖ్యలో దేవుడి ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ దేవాలయాలన్నీ నాశనం చేశాడంటున్నారు. నిజానికి.. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాకే తిరుమల కొండ మీద మద్యం, మాంసాలు దొరికాయి. బిర్యానీలు తింటూ, తాగి గొడవలు చేస్తూ పట్టుబడ్డారు. కొద్దిరోజుల కిందటే మద్యం బాటిళ్లు విచ్ఛలవిడిగా పడి ఉంటే.. దాన్ని ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్త మీదే కేసు బనాయించారు. బాబు హయాంలోనే వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అయోధ్య లడ్డూల పైనా అబద్ధాలు..పవన్‌కళ్యాణ్ అయితే మరింత దారుణంగా.. అయోధ్యకి పంపించిన లడ్డూలు కల్తీ అన్న విషయాన్ని ఆ రోజు ఎవరో చెబితే మాట్లాడానని చెప్పిన వ్యక్తి.. ఇవాళ మళ్లీ అయోధ్యకి పంపిన లడ్డూలు జంతుకొవ్వుతో తయారుచేసినవే అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూలు.. మీ ప్రభుత్వ హయాంలోనే పాలక మండలి సభ్యుడైన సౌరబ్ బోరా రూ.30 లక్షల విలువైన నెయ్యి డొనేషన్‌తో తయారుచేసి అయోధ్యకి పంపించారు. పవన్‌కళ్యాణ్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. వైవీ సుబ్బారెడ్డే సీఎఫ్టీఆర్ఐ రిపోర్టు కోసం పంపిస్తే.. ఆయనే తొక్కి పెట్టారని చెప్పడం అసమంజసం. అసలు విచారణకు పంపించిందే మేమైతే తిరిగి మాపైనే లాజిక్ లేకుండా అపవాదులు వేస్తున్నారు. అడ్డంగా దొరికిపోవడంతో ఏకసభ్య కమిషన్‌తో కుట్ర..ఇక సీబీఐ సిట్ మమ్నల్ని దోషులుగా ప్రకటించలేదు. దీంతో వారు అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. ఇది మమ్మల్ని ఎలాగైనా నేరస్తుల్ని చేయాలన్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇవాళ నేరస్తుడిగా ఉన్న ప్రీమియర్ డెయిరీ 2014–19 వరకు 80 శాతం మేర మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసింది. క్షమాపణ చెప్పాల్సిందే..మేం తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ సిట్ మమ్మల్ని దోషులుగా నివేదికలో పేర్కొనలేదు. అయినా మాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్న మీరు క్షమాపణ చెప్పాల్సిందే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండు కొండలే చేశాడని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం కూడా చెబుతున్నాడు. అయితే, 2007 మే 12న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చాలా స్పష్టంగా మొత్తం 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏడు కొండలు శ్రీ వేంకటేశ్వరస్వామివే అని జీఓ ఇచ్చారు. ఈ నిజాలన్నింటినీ దాచి చంద్రబాబు మమ్నల్ని దైవ ద్రోహులుగా చిత్రీకరించే అతిపెద్ద కుట్రకు తెగబడుతున్నాడు. మీలాంటి వాళ్లను మాత్రం దేవదేవుడు క్షమించడు.శ్రీవారి విశేష సేవలో వైఎస్సార్, జగన్..వాస్తవానికి.. వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన దైవసేవ ఎవ్వరూ చేయలేదు. అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ మీకు రాలేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో మా హయాంలోనే పాదరక్షలు ధరించకూడదని నిబంధన విధించాం. శ్రీ వేంకటేశ్వరస్వామి అఖండ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ కూడా మా హయాంలోనే తీసుకొచ్చాం.కొండమీద హరినామ సంకీర్తన ఏర్పాటుచేసింది, నాద నీరాజనాన్ని తీసుకొచ్చింది కూడా మేమే. తిరుమలలో నిరంతరాయంగా భాగవతం, భారతంతో పాటు వేదఘోష నిర్వహించాలని నిర్ణయం కూడా మేమే తీసుకున్నాం. వందకు పైగా పీఠాధిపతులతో సదస్సులు కూడా నిర్వహించాం. అన్యమతాల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేసిన మంగళసూత్రాలతో దాదాపు 46 వేల పెళ్లిళ్లు కూడా మా హయాంలోనే నిర్వహించాం. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ, గ్రామానికి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని కూడా మేమే తీసుకెళ్లాం. వైఎస్ జగన్ హయంలో దేశవ్యాప్తంగా స్వామివారి ఆలయాలు.. అంతేకాదు.. ఇవాళ మేం కొత్తగా ఐదు వేల ఆలయాలను కట్టబోతున్నామని చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి.. వైఎస్ జగన్ హయాంలోనే రాష్ట్రవ్యాప్తంగా 3,500 ఆలయాలు కట్టారు. వాటి నిర్మాణ భాగస్వామ్యం ఆరెస్సెస్‌కు సంబంధించిన సంస్థకు అప్పగించాం. మా హయాంలో శ్రీవాణి పథకంపై విమర్శలు చేసిన మీరు ఇవాళ అదే శ్రీవాణి డబ్బుతో అమరావతిలో గుడి కడుతున్నారు. అదే డబ్బుతో గట్టు ఆంజనేయస్వామికి పవన్‌కళ్యాణ్ డబ్బులిప్పించారు. జమ్మూకశ్మీర్లోనూ, నవీ ముంబై, విశాఖలో శ్రీవారి ఆలయాలను వైఎస్ జగన్ నిర్మించారు. చెన్నైలో పద్మావతి ఆలయాన్ని నిర్మించారు. కానీ, మీరు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.3 వేల కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు హోటల్‌కి కట్టబెట్టారు. వైకుంఠ ఏకాదశికి 10 రోజులు ఎందుకని ప్రశ్నించారు. మీరెన్ని అభాండాలు వేసినా వైఎస్సార్సీపీ హయాంలో ఎలాంటి తప్పులూ జరగలేదు.కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలకు నెయ్యి అద్దింది మీరే..భోలేబాబాను చంద్రబాబు 2018లోనే రప్పించారు. అలాగే, గత ప్రభుత్వ పాలనలో లడ్డూ నాణ్యత బాగోలేదు.. అందుకే భక్తుల సంఖ్య తగ్గిపోయిందని దారుణమైన అబద్ధాలు చెబుతున్నారు. దీనిపై మీరు విచారణకు సిద్ధమా? ఇక 2018 ఫిబ్రవరిలో లడ్డూలకు వాసన రావడానికి మీరు రోజుకు 975 కేజీల నెయ్యిని రూ.3.87 కోట్లకు కొన్నారు. (ఆధారాలు చూపించారు). అంటే.. మీరు ఆ రోజు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారుచేయడంవల్ల అవి వాసన రాకుండా వాటిపై మళ్లీ నెయ్యి అద్దడం కోసమే రూ.3.87 కోట్లతో నెయ్యి కొన్నారు. ఇది మీ హయాంలోనే జరిగిన విషయం. కొద్దిమంది అవినీతి అధికారులు, మీ హయాంలో మీరు ఏర్పాటుచేసిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్, డెయిరీ సంస్థలు కుమ్మక్కై చేసిన నేరాన్ని సిట్ బయటపెట్టింది. -
తప్పు చేసి దొరికిపోయి.. డిఫెన్స్‌లో చంద్రబాబు, పవన్: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి చంద్రబాబు.. వైఎస్ జగన్‌పై విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. లడ్డూలో కల్తీ జరగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయి. పవన్ కల్యాణ్ పదే పదే చెప్పిన అబద్ధమే చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భోలే బాబాను తీసుకువచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల ముందు నటిస్తున్నారు. కెబినెట్ సమావేశంలోనే మంత్రి పార్థసారథి పచ్చి అబద్దాలు చెప్పారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ మమ్మల్ని దోషులుగా ప్రకటించలేదు. మమ్మల్ని దోషులుగా చూపించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తప్పు చేసి, తప్పుగా మాట్లాడి దొరికిపోయి.. మళ్లీ ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అంటున్నారు. 2014-2019 మధ్య అధిక శాతం నెయ్యి సరఫరా ప్రిమియర్ డెయిరీనే. 2018లోనే భోలే బాబాను చంద్రబాబు తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇప్పుడు ఉన్న అధికారులే చంద్రబాబు హయాంలో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో పవన్ చెప్పినవి ఇవే.. జగన్ రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి ఏదైనా వాడుకోవడానికి సిద్దంగా ఉన్నారు. మీడియా సమావేశంలో నంగిలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం భయంతో చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారు. చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికి నవ్వు తెప్పిస్తుంది. పదేళ్ల కాలంలో పవన్.. అనేక మార్లు బాప్టజం తీసుకున్న, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించేవారు, గొడ్డు మాంసం తింటే తప్పేంటి అన్న వ్యక్తి. కానీ, నేడు సనాతన ధర్మం అంటున్నారు. చంద్రబాబు తనంత భక్తుడే లేడని అంటారు. భగవంతునికి చంద్రబాబు ఒక్కడే భక్తుడు కాదు, రోజుకు లక్షమంది వస్తారు. చంద్రబాబు హయాంలో కొండపై మద్య మాంసాలు అనేమార్లు దొరికాయి. మత్తులో ఘర్షణలకు పాల్పడ్డారు. తొక్కిసలాటలో భక్తులు మరణించారు.చంద్రబాబుది దైవ ద్రోహం.. చంద్రబాబు అలిపిరిలో జరిగిన దాడికి మొదట బాధపడిన వ్యక్తి వైఎస్సార్, నేను. వైఎస్సార్ అలిపిరి వద్ద నిరసన కూడా చేశారు. దేవుడి దయవల్ల చంద్రబాబు బతికారు. ఆయన ఏం చెప్పినా నమ్మించడానికి పచ్చ పత్రికలు ఉన్నాయి. నెయ్యిలో నెయ్యే లేకుండా జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు చీవాట్లు పెట్టి సిట్ వేసింది. సిట్ రిపోర్టులో క్లియర్‌గా ఉంది. ఎక్కడ కూడా జంతువుల కొవ్వుతో లడ్డులు తయారు కాలేదని రిపోర్ట్ చెప్పారు. దైవ ద్రోహానికి పాల్పడే పరిస్థితిలో ఈ ఘటన ఉంది. అయోధ్య పంపిన లడ్డులో నెయ్యి కలిసిందని అంటున్నారు పవన్. ప్రస్తుతం పాలకమండలి సభ్యులుగా ఉన్న వారు విరాళంగా ఇచ్చిన నెయ్యితో అయోధ్య లడ్డు తయారు చేశారు.వైవీ సుబ్బారెడ్డి హయాంతో నెయ్యి టెస్ట్ రిపోర్ట్ దాచేసారని మరో అబద్దం ఆడుతున్నారు. కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే, నాకు ఎటువంటి హక్కు ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిబంధనలు మార్పు చేసాము, అందులో మా దురుద్దేశం ఏమీ లేదు. మమ్మల్ని ఇరికించడానికే ఏకసభ్య కమిషన్ వేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, కూటమి నేతలకు ఉంది. చంద్రబాబు పచ్చ అబద్దం చెప్తారు. వేంకటేశ్వరస్వామిని మీ రాజకీయాలకు వాడుకుంటారా?. పచ్చ పత్రికలలో ఎన్ని తూటాలు ఎక్కుపెట్టినా మమ్మల్ని భయపెట్టలేరు. మేము ఒక్క తప్పు కూడా చేయలేదు. చంద్రబాబు లాంటి వాళ్లను దేవుడు క్షమించరు’ అని అన్నారు. -
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది. రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినాఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనినపొగడరా నీతల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. సాగు, తాగునీటికి గేట్ వే! సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్‌లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరారు.తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్ భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్ జగన్ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. అడుగడుగునా అడ్డంకులుశ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్‌రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఒక సంజీవనిగా జగన్ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఇక ఇన్సూరెన్స్ పాలసీగా భావించి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు!రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. యావత్ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం.రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం! భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు(నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’) -
భోలే బాబా వెనక ఉన్న ఆలీబాబా ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతుకొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపిన నెయ్యి వాడారని పచ్చి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్న సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్‌తో అడ్డంగా దొరికిపోయి, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్, నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని చెప్పినా, మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి చేతనైతే సిట్ రిపోర్ట్ తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి, అక్కడ రుజువు చేయాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్ చేశారు. ప్రెస్ మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:సిట్ రిపోర్ట్‌పై క్యాబినెట్ నిర్ణయమా!:సుప్రీంకోర్టు నియమించిన సిట్ అధికారుల్ని సీఎం చంద్రబాబు పిలిపించుకోవడం అసాధారణ విషయం. వారి దగ్గరి నుంచి 11 పేజీల నివేదిక తీసుకుని సుదీర్ఘమైన చర్చ చేశామని కేబినెట్ భేటీ నుంచి బయటికి వచ్చిన మంత్రులు చెప్పారు. చంద్రబాబును కాపాడటానికి, ఆయన చెప్పిన అబద్ధాల్ని కప్పిపుచ్చడానికే వీళ్ల ప్రయాస. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2024 సెప్టెంబర్ 20వ తేదీన కూటమి సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారని ప్రకటించడంతో, వాస్తవాలు నిగ్గు తేల్చాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఏ విషయమూ నిర్థారణ కాకుండా మాట్లాడొద్దంటూ సూచించిన సుప్రీకోర్టు, ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది. అందులో సీబీఐ అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు.సిట్ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్ అదనపు ఛార్జిషీట్లో కానీ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసినట్లు ఎక్కడా చెప్పలేదు. అయినా చంద్రబాబు ఈ ఛార్జిషీట్‌పై సంతృప్తి చెందకుండా ఇవాళ కేబినెట్ సమావేశంలో నెయ్యి విషయంలో ప్రత్యేక విచారణ చేపడుతున్నట్లు మంత్రులతో బయట ప్రకటన చేయించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ రిపోర్టు కాకుండా, మళ్లీ విచారణ చేయించాలన్న నిర్ణయం పూర్తిగా తప్పు.‘భోలేబాబా డెయిరీ’ వెనుక ఉన్న ‘ఆలీ బాబా’ చంద్రబాబే: ఒక మంత్రి భోలే బాబాను తెచ్చిన అలీ బాబా ఎవరని ప్రశ్నించారు. ఈ భోలే బాబాను తెచ్చిన చంద్రబాబే. 2018లోనే భోలే బాబా రంగ ప్రవేశం చేశాడు. దాదాపు 87 వేల టిన్నులకు పైగా నెయ్యి ఈ కంపెనీ సరఫరా చేసింది. అది చాలా స్పష్టంగా సీబీఐ నివేదికలోనే ఉంది. కానీ దాన్ని వదిలేసి మా హయాంలోనే నెయ్యి సరఫరా చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భోలే బాబాకు ముందున్న పేరు హర్‡్ష –వర్‡్ష డెయిరీకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఇప్పుడు భోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలిసిందని అనుకుంటున్నాం.ఆ నెయ్యిపైనా విచారణ జరిపించాలి:నెయ్యిలో కల్తీ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సిట్ విచారణ 2019–24 మధ్య కాలానికి వేశారు. ఇందులో నిందితులుగా తేలిన ప్రీమియర్ డెయిరీ 2013 నుంచి 2024 వరకూ నెయ్యిని అనేకసార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు నిజంగా తిరుమల శ్రీవారి మీద భక్తి ఉంటే, మీ గత ప్రభుత్వంలో సరఫరా అయిన నెయ్యిపైనా విచారణ చేయించాలి. ఆ రోజు 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేసిన డెయిరీయే మా హయాంలోనూ సరఫరా చేసిందన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం.2018లో టీటీడీ తీర్మానంతోనే నెయ్యి కల్తీకి బీజం:విభజిత రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018, ఆగస్టు 27న టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం 87 వేల కేజీల నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్‌ను కలిపిన నెయ్యిని రోజుకు 975 కేజీల చొప్పున కొనుగోలు చేశారు. ఆ రోజున మీరు వాడిన నెయ్యి కల్తీ నెయ్యి కాబట్టే వాసన రాలేదు. అందుకే ఏకంగా రూ.3.75 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫ్లేవర్ కలిపారు.అప్పటి జేఈవో అధ్యక్షతన పని చేసిన ఈ కొనుగోలు కమిటీలో విజయ్‌భాస్కర్‌రెడ్డి, సురేంద్రనాథ్ వంటి సాంకేతిక నిపుణుల్ని నియమించారు. వారే ఆ తర్వాత మా హయాంలోనూ కొనసాగారు. ఇప్పుడు సిట్ రిపోర్ట్ నిందితుల్లోనూ ఉన్నారు. అలాగే ప్రొక్యూర్మెంట్ జీఎం కూడా టీడీపీ హయాంలో ఉన్న వ్యక్తే ఇప్పుడు జైల్లో ఉన్నారు. అలాగే టెంపుల్ అఫైర్స్ ఏవో, ఎస్వీ గోశాల డైరెక్టర్ కూడా మొన్నటి వరకూ ఉన్నారు. వీళ్లంతా నెయ్యిని కొనాలని నిర్ణయించి, పలమనేరుకు చెందిన పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి నుంచి కేజీ నెయ్యి రూ.385 చొప్పున కొనుగోలు చేశారు. అప్పటికే రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేసే కాలంలోనే ప్రతి రోజూ 975 కేజీల నెయ్యికి ఫ్లేవర్ అద్దడానికి వీళ్లు చేసిన దుర్మార్గం ఇది. 2018, ఆగస్టు 28న చేసిన టీటీడీ తీర్మానం 374 ఇందుకు నిదర్శనం.దమ్ముంటే 2014 నుంచీ నెయ్యి కల్తీపై విచారణ జరపండి:2014 నుంచి ఇదే సీబీఐ దర్యాప్తు వేయించే ధైర్యం మీకు ఉందా? టీటీడీని రాజకీయ పావుగా వాడుకోకపోతే మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసిన వాళ్లు, కొనుగోళ్లు చేసిన వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ దోషి అంటున్నారు. సిట్ ఏర్పాటు చేశాక జంతుకొవ్వు విమర్శలు చేసిన మీరు ఆయన్ను రెండోసారి ఎందుకు ఈవోగా నియమించారు? నెయ్యి పేరుతో అనిల్ సింఘాల్‌ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి.చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పదే పదే నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేప నూనె వాడారని దుష్ప్రచారం చేశారు. మీరు ఆరోపించినట్టు ఆ నెయ్యిలో అవేవీ లేవని తేలిపోయింది. అయినా మీరు ఇంకా ఎదురుదాడి చేస్తూ, గత మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తిరుమల శ్రీవారిపై భక్తి ఉంటే, ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకపోతే.. మీ హయాం నుంచే జరుగుతున్న నెయ్యి కల్తీపై విచారణ చేయించమని కోరుతున్నాం.మేము ఏ నిబంధనలూ సడలించలేదు: అలాగే మీ హయాంలో నుంచే ఉన్న అధికారుల్ని మేం నియమించినట్లు చెప్పడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మేం నిబంధనల్ని సడలించడం వల్ల నెయ్యి కల్తీ జరిగిందనేది అబద్ధం. ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపొందించినవి. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. మీరు తెచ్చిన నిబంధనల్ని మేం సడలించి తెచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదు. భోలేబాబా వంటి కంపెనీలు మీ హయాంలోనే టెండర్లు వేసిన విషయం గుర్తుంచుకోండి. ఏఆర్ డెయిరీ, మాల్ గంగా వంటి సంస్థలు మేం నిబంధనలు కఠినతరం చేసిన తర్వాతే టెండర్లలో పాల్గొన్నాయి. అర్హతలు ఉన్నాయి కాబట్టే ఈ కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.దోషులెవరో సిట్ చెప్పినా మాకు అంటగట్టే యత్నం:చంద్రబాబు జంతుకొవ్వు, ఆవు కొవ్వు కలిపారని చెప్పిన నాలుగు ట్యాంకర్లను తిరిగి శ్యామలరావు ఈవోగా, మీరు సీఎంగా ఉండగానే లడ్డూల్లో వాడారని సీబీఐ తన నివేదికలో చెప్పింది. ఇప్పడు చెప్పండి దొంగలెవరో? దోషులెవరో?. మా హయాంలో నాణ్యత లేని 18 నెయ్యి ట్యాంకర్లను మేం వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా 14సార్లు కూడా ఇలాంటి నాణ్యత లేని నెయ్యిని వెనక్కి పంపింది. సీఎస్ఆర్టీఐ రిపోర్టులు వచ్చాక ఛైర్మన్‌కు అందిస్తే ఆయన కళ్లు మూసుకున్నారని ఎలా చెప్తారు? టీటీడీ పాలక మండలి తనకున్న అధికారాల్ని ఈవోకు బదలాయించిన విషయం మీకు నిజంగా తెలియదా? అధికారులు ఈవోను కలవకుండా ఛైర్మన్‌ను ఎలా కలిశారు?వాస్తవాలన్నీ ఇలా ఉంటే, కేవలం దురుద్దేశంతో టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా విచారణ చేయిస్తాం అంటున్నారు. మీ దృష్టిలో మేము (గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం) నేరస్తులమని, శ్రీ వెంకటేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా విచారణ జరిపిస్తామని కబుర్లు చెబుతున్నారు. నిజంగా నేరస్తులు అయితే శిక్షించమనే కదా మేం ముందు నుంచే అడుగుతున్నాం. సీబీఐ వంటి సంస్థే మేం నిర్దోషులమని నిర్థారించాక కొద్ది మంది అధికారులు, సరఫరా దారులు, టెక్నికల్ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారని రిపోర్ట్ ఇస్తే మా వాళ్లను దోషులుగా చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు?.మేము తప్పు చేయలేదు. అందుకే గట్టిగా నిలబడ్డాం:పవన్‌కళ్యాణ్ తమ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నెయ్యిలో ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసిందని, అది అబద్దమని మా పార్టీ చేస్తున్న వాదనను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నామని, ఏం నిద్రపోతున్నారా అని కాకినాడ ఎంపీతో పాటు, తన సోదరుడిని కూడా ప్రశ్నించారు. నెయ్యిలో నిజంగా జంతుకొవ్వు కలిసినా, అది బయట పెడితే, ఎక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయోనని, సిట్ ఛార్జ్‌షీట్‌లో రాయలేదని చెబుతున్నారు.ఒకవేళ నిజంగా సీబీఐ ఆ పని చేసి ఉంటే, సనాతని, హైందవ ధర్మ పరిరక్షకుడదని చెప్పుకునే పవన్, అప్పుడు, ఇప్పుడు పదే పదే అదే మాట ఎందుకు చెబుతున్నారు. తిరుమలలో వాడిన నెయ్యిలో పందికొవ్వు, జంతుకొవ్వు, చేపనూనె కలిసిందని ఎలా ఆరోపిస్తున్నారు? సనాతనిగా ఉన్న మీరు భక్తుల మనోభావాల్ని ఎలా దెబ్బ తీస్తున్నారు?. తప్పు చేయలేదు కాబట్టే మేం ఛాలెంజ్‌గా మాట్లాడుతున్నాం. మీరు అబద్దాలు చెప్పారు కాబట్టే దాన్ని సమర్థించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అటు టీడీపీలో కూడా ముప్పు తిప్పలు పడుతున్నారు.సీబీఐ రిపోర్ట్ పై విచారించే అధికారం మీకు లేదు:సీబీఐ నివేదిక మీద విచారణ చేసే అధికారం మీది కాదు కోర్టుది. కానీ నేరస్తుల్ని మేమే గుర్తించామంటూ విచారణలకు సిద్దమవుతున్నారు. ఇలాంటి తీర్పులు ఇచ్చే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. చంద్రబాబుకు ధైర్యం ఉంటే, నెయ్యిలో ఫ్లేవర్ కలపాలన్న నాటి టీటీడీ బోర్డు నిర్ణయానికి సమాధానం చెప్పాలి. మళ్లీ చెబుతున్నాం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికపై, మరో విచారణ జరిపించే అధికారం మీకు లేదు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..అనిల్ సింఘాల్ విషయంలో సీఎం పేషీనే పెద్ద నాటక వేదిక. ఆయన ఏ సిఫార్సుతో వచ్చారో మాకు తెలియదు కానీ, ఆయన్ను వచ్చిన రోజు నుంచే బదిలీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. సీబీఐ నివేదికను అడ్డు పెట్టుకుని ఇప్పుడు బదిలీ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం సరైన విచారణ చేయలేదని కేబినెట్ తీర్మానం చేస్తే అప్పుడు మళ్లీ మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి చెప్పుకోవాలి. చంద్రబాబు మిమ్మల్ని పట్టించడం అంటే దొంగ పోలీసును పట్టించినట్లుంది. కాబట్టి నెయ్యి మీద మీరు విచారణలు చేయడం కాదు మళ్లీ సుప్రీంకోర్టుతోనే ఆ పని జరిగేలా చూడాలని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
వాస్తవాలను దాచిపెట్టి బాబు రాజకీయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు వాస్తవాలను దాచిపెట్టి భక్తుల విశ్వాసాలతో రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ చంద్రబాబు దు్రష్పచార కుట్రలకు పాల్పడటాన్ని తప్పుబట్టారు. ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు లేదని సీబీఐ దాఖలు చేసిన చార్జిషిట్‌లో తేలడంతో ఆత్మరక్షణలో పడ్డ సీఎం, టీడీపీ–జనసేన నేతలు హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పుల్లయ్యతో కలిసి భూమన సోమవారం మీడియాతో మాట్లాడారు. దు్రష్పచారాన్ని నమ్మకపోవడంతో దాడులు.. యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో ఉందని చార్జిషీట్లో సీబీఐ చాలా స్పష్టంగా పేర్కొంది. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిపై కూడా ఎన్డీఆర్ఐ తన నివేదికలో జంతుకొవ్వు లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. 2024 జూలైలో నాటి ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీడీబీ నివేదికలో వెజిటబుల్ ఆయిల్ కలిపారని నివేదిక వచ్చిం దన్నారు.అనంతరం సెప్టెంబర్ 23న.. ఎన్డీఆర్ఐ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందని వచ్చిందంటూ చంద్రబాబు ఒత్తిడితో ఈవో మాట మార్చారు. ప్రజలు తమ దు్రష్పచారాన్ని నమ్మకపోవడంతో నెయ్యిలో కల్తీ దొంగలు అంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలతో దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ముఠా 3 వేల మంది రౌడీ మూకలతో అంబటి ఇంటిపై దాడికి దిగి హత్యాయత్నానికి పాల్పడింది. అసాంఘిక శక్తులను ఉసిగొల్పి పెట్రోలు బాంబులు విసిరి జోగి రమేశ్ నివాసానికి నిప్పంటించారు. రాష్ట్రమంతటా ఇదే విధ్వంసకర రాజకీయాలకు సన్నద్ధం అవుతున్నారు. బాబు హయాంలోనే భోలేబాబాకు అనుమతి.. నెయ్యిలో జంతుకొవ్వు కల్తీ జరగలేదని సీబీఐ నివేదికలో తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో అప్పటి పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులు, ఉన్నతాధికారుల ప్రమేయం లేదని పేర్కొంది. టీడీపీ హయాం నుంచి ఉన్న కొద్ది మంది సాంకేతిక నిపుణులు నెయ్యి సరఫరాదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని అదే నివేదికలో స్పష్టం చేసింది. భోలేబాబా డెయిరీ 2018 వరకు హర్‡్ష ఫ్రెష్ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కంపెనీకి నెయ్యి సరఫరా టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు. కేజీ నెయ్యి రూ.291 చొప్పున సరఫరాకు అనుమతించారు. ఇక ప్రీమియర్ డెయిరీకి కూడా చంద్రబాబు హయాంలోనే అత్యధిక పర్యాయాలు నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భోలేబాబాను డిస్ క్వాలిఫై చేశాం. నాణ్యమైన నెయ్యిని సరఫరా చేసేలా కఠినమైన నిబంధనలు అనుసరించాం.టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా..సాహి, గిర్ లాంటి ఉత్తమ ఆవులను దాతల విరాళాల ద్వారా టీటీడీకి సమకూర్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. ఆవుల ఉత్పత్తి కేంద్రంలో పెయ్య దూడలు జని్మంచేలా, టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎన్డీడీబీ సహకారంతో అప్పటివరకు అందుబాటులో లేని బీటా సైట్స్ టెరాలసిస్ టెస్ట్ మిషనరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి టెండర్లు పిలిచాం.కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు వెనక్కి పంపినవి.. యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు చెబుతున్న నాలుగు ట్యాంకర్ల నెయ్యిని కూటమి ప్రభుత్వంలోనే వాడారు. అంటే మీరు చెబుతున్నట్లుగా.. మీ ప్రభుత్వ హయాంలోనే పందికొవ్వు నెయ్యితో తయారు చేసిన లడ్డూలు తయారు చేశారా? ఆ నాలుగు ట్యాంకర్లలో కలిసింది పందికొవ్వు కాదని సీబీఐ తేల్చి చెప్పినా.. చంద్రబాబు మాత్రం పదే పదే జంతు కొవ్వులు కలిశాయని ఆరోపణలు చేస్తున్నారు. మీ అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని హింసను ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? మీకంటే దైవ ద్రోహి ఇంకెవరు చంద్రబాబూ?. -
Bhumana: పక్కా ప్లాన్ తోనే TDP దాడులు.. ఏ ఒక్కరినీ వదలం.. రాసిపెట్టుకోండి
-
ఎన్డీడీబీని టీటీడీకి పరిచయం చేసిందే వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ అంశంలో వాస్తవాలను దాచిపెట్టి భక్తుల విశ్వాసాలతో రాజకీయం చేస్తున్న సీఎం చంద్రబాబు తీరుపై వైయస్సారీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీడీబీ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అర్థం వచ్చేలా మాట్లాడ్డాన్ని తప్పు పట్టారు. సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు లేదని, తేలడంతో ఆత్మరక్షలో పడ్డ సీఎం, టీడీపీ–జనసేన నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వైయస్సార్సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో భాగంగానే వైయస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, తన ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నెయ్యి కల్తీ దొంగలు వీరే అంటూ దుష్ప్రచారం చేయడం పక్కా ప్రణాళికతో జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఈ అబద్ధాలను నమ్మడం లేదన్న అసహనంతోనే వైయస్సార్సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఆయనతో పాటు జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీబీఐ నివేదికలో బయటపడ్డ నిజాలను మరుగునపర్చేందుకే ఈ హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారని తేల్చి చెప్పారు. సీబీఐ సిట్ అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం, కల్తీ నెయ్యి తయారు చేసిన ప్రధాన నిందితుడు బోలేబాబా డెయిరీ (మాజీ హర్ష్ ప్రెష్ డెయిరీ) చంద్రబాబు హయాంలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. మరో నిందిత సంస్థ ప్రీమియర్ డెయిరీకి కూడా చంద్రబాబు హయాంలోనే 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లడ్డూలో పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిసిందంటూ మాట్లాడటం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిష్టను భంగం కలిగించినది చంద్రబాబు కాదా అని నిలదీశారు. భగవంతుడిని రాజకీయ పావుగా వాడుకున్నది ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు.సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్లో చాలా స్పష్టంగా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం లేదని పేర్కొంది. ఆ తర్వాత ఈవో శ్యామలరావు ఏ ఆర్ డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిపై ఎన్ డీ ఆర్ ఐ కూడా తన నివేదికలో జంతుకొవ్వు లేదన్న విషయం స్పష్టం చేసింది. అయినా సీఎం చంద్రబాబు, టీడీపీ, జనసేనలు సీబీఐ తన నివేదికను కోర్టుకు సమర్పించిన తర్వాత ఆత్మరక్షలో పడ్డారు. తామే తప్పు చేశామన్న సంగతి అర్దమై ఎదురుదాడికి దిగారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు వీరేనంటూ వైయస్.జగన్, వైవీ సుబ్బారెడ్డితో పాటు నా ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ జనం నమ్మే పరిస్థితి లేకపోవడం ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకొని, పక్కా ప్రణాళికతో వైయస్సార్సీపీ నేతలమీద ఏదో ఒక నెపం మోపి దాడి చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల బూతుపురాణంతో దాడికి దిగితే, దానికి స్పందించిన అంబటి ఆ తర్వాత తన మాటలకు క్షమాపణ చెప్పినా.. సహించలేని చంద్రబాబు ముఠా 3వేల మంది రౌడీ మూకలతో ఇంటిపై దాడి చేశారు. అందులో టీడీపీ నేతలు, కార్యకర్తలే కాకుండా అసాంఘిక శక్తులను కూడా ఉసిగొల్పి అంబటి రాంబాబుతో పాటు జోగి రమేశ్ ఇళ్లపై దాడికి దిగారు.బాబు హయాంలోనే భోలేబాబా డెయిరీకి అనుమతి..రాష్ట్రమంతటా ఇదే విధ్వంసకర రాజకీయం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. సిట్ నివేదిక ద్వారా నెయ్యిలో జంతుకొవ్వు కల్తీ జరగలేదని తేల్చిచెప్పింది. అప్పటి పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఆ వ్యవహారంలో లేదని సిట్ తన అనుబంధ ఛార్జిషీట్ లో పేర్కొంది. అదే నివేదికలో కొద్ది మంది సాంకేతిక నిపుణులు ఎవరైతో టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఉన్న వారే, నెయ్యి సరఫరాదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈ బోలేబాబా డెయిరీ 2018 వరకు హర్ష్ ప్రెష్ డెయిరీ పేరుతో టీటీడికి నెయ్యి సరఫరా చేసింది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ కంపెనీకి నెయ్యి సరఫరాకి టెక్నికల్ శాంక్షన్ జరిగింది. అప్పటిలో కేజీ రూ.291 చొప్పున ఈ బోలేబాబా డెయిరీ(అప్పటి హర్ష్ ప్రెష్ డెయిరీ) నుంచి సరఫరాకు అనుమతిచ్చింది. సిట్ పేర్కొన్నట్టు కల్తీ నెయ్యి తయారు చేసిన ప్రధాన నిందితుడు బోలేబాబా డెయిరీ.. చంద్రబాబు హయాంలో కూడా నెయ్యి సరఫరా చేసిన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. మరో నిందితుడుగా ఉన్న ప్రీమియర్ డెయిరీ కూడా కల్తీ చేసిందని చెప్పింది. ఈ ప్రీమియర్ డెయిరీ 2013 లో రూ.273 లకు, 2016లో రూ.332, 2106 సెప్టెంబరులో రూ.364లకు, 2017 ఏప్రిల్ లో రూ.411లకు, అక్టోబరు లో రూ.378లకు, 2018 జనవరిలో రూ.320లకు, 2019 ఆగష్టులో రూ.389 లకు నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ డెయిరీ చంద్రబాబు హాయంలోనే అత్యధిక సార్లు నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చారు . ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డెయిరీకే చంద్రబాబు హాయంలో 90 శాతానికి పైగా నెయ్యి సరఫరాకు అవకాశం ఇచ్చారు. దీంతో డిఫెన్స్ లో పడ్డ చంద్రబాబు ఇవాళ జంతుకొవ్వు కలిపారు చెప్పారు అన్న తర్వాత సాక్షాత్తూ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిస్ధాయిలో ఇలా మాట్లాడ్డం సరికాదని చెప్పి సీబీఐ విచారణకు ఆదేశించారు.మాట మార్చిన శ్యామలరావు..2024 జూలైలో ఈవో శ్యామలరావు నెయ్యి నాణ్యతపై మాట్లాడుతూ... ఎన్ డీ డీ బీ నివేదికలో వెజిటబుల్ ఆయిల్ కలిపారని నివేదిక వచ్చిందన్నారు. అయితే నెయ్యిలో లడ్డూ సీఎం చంద్రబాబు మాట్లాడిన అనంతరం సెప్టెంబరు 23న మరలా ఈవో శ్యామలరావు ఎన్ డీ ఆర్ ఐ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందని వచ్చిందంటూ చంద్రబాబుకి వంతపాడారు. కానీ సీబీఐ విచారణలో అదే ఎన్ డీ ఆర్ ఐ కు శాంపిల్స్ పంపిస్తే అందులో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని అనుబంధ ఛార్జిషీట్ లో నివేదించారు. దీంతో చంద్రబాబును మోసే ఎల్లో మీడియా సంస్థలు సిట్ ను ప్రశ్నిస్తున్నారు? సీబీఐను ప్రశ్నిస్తున్నారు? విచారణ ఫలానా విధంగా చేయలేదని వార్తలు రాస్తున్నారు. చంద్రబాబు సిట్ నియమిస్తే ఆ అధికారులు బాబు చెప్పినట్లు వినేవాళ్లు. వాళ్లు తప్పుడు నివేదికలు ఇచ్చి, వెంటనే మమ్నల్ని నిందితులు చేసే సిట్ కాకుండా... సరైన న్యాయవిచారణ కోసం సుప్రీం కోర్టు నియమించిన అధికారులతో విచారణ చేయించాలి. దీనికి మేం సిద్ధంగా ఉన్నాం. సీబీఐ తన ఛార్జి షీట్ పేజీ నెంబరు 65లో 2018లో బోలేబాబా డెయిరీ హర్ష్ ప్రెష్ డెయిరీ పేరుతో నెయ్యి సరఫరా చేసారని పేర్కొంది. వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బోలేబాబాను డిస్ క్వాలిఫై చేశాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టెండర్ నిబంధనలను సడలించడం ద్వారా ఈ సంస్థలు వచ్చి కల్తీనెయ్యి తయారు చేశాయని ఎల్లో మీడియాలో ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టెండరు నిబంధనలను సరళతరం చేయడానికి ముందే హర్ష్ ప్రెష్ డెయిరీ టెండర్లలో పాల్గొంది. ప్రీమియర్ డెయిరీ కూడా గతంలో ఉంది. ఇప్పుడు కొత్తగా రాలేదు. అదే విధంగా మాల్ గంగా కూడా తర్వాత టెండర్లులో పాల్గొంది. టెండరు నిబంధనలు సరళతరం చేసిన తర్వాత టెండర్లలో పాల్గొన్న ఒక్క సంస్ద పేరు కూడా సీబీఐ పేర్కోలేదు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలన్న నిర్ణయంతో స్ధానికంగా ఉండే తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని డెయిరీ కంపెనీలను ప్రోత్సహించడానికి నిబంధనలను సరళతరం చేశాం.జగన్ హయాంలోనే ఎన్డీడీబీతో ఒప్పందం:అయినా ఒక్క కంపెనీ కూడా రాలేదు కాబట్టి నిబంధనలను మరలా కఠినతరం చేశాం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత సాహి, గిర్ వంటి ఉత్తమ ఆవులను విరాళాల ద్వారా తెప్పించడమే కాకుండా... ఎన్ డీ డీబీ వంటి సంస్థలను వైయస్.జగన్ ప్రభుత్వం టీటీడీకి పరిచయం చేసిందే వైయస్.జగన్ ప్రభుత్వం. గతంలో ఎన్ డీ డీ బీ ద్వారా పరీక్షలకు పంపించే పరిస్థితి లేదు. ఆ సంస్థ ద్వారా రూ.50 కోట్ల విరాళం స్వీకరించి గిర్, సాహీవాల్ ,కాంక్రీజ్ లాంటి ఆవుల ఉత్పత్తి కేంద్రంలో ఆడదూడలు పుట్టేలా చేయడం ద్వారా టీటీడీ సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా పూనుకున్నదే వైయస్.జగన్. ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగానే అప్పటివరకు అందుబాటులో లేని.. బీటా సైట్స్ టెరాలసిస్ టెస్ట్ ను వైయస్.జగన్ ఆదేశాలతో ఎన్ డీ డీ బీ వాళ్ల సహకారంతో ఈ టెస్ట్ మిషనరీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి టెండర్లు పిలిచాం. మా హయాంలోనే ఈ రకమైన ఏర్పాట్లు చేశాం. మా హాయంలో నిబంధలను కఠినతం చేసినందువల్లే కల్తీకి కేంద్రబిందువుగా మారిన ఏ ఆర్ డెయిరీ డెయిరీ నాలుగు ట్యాంకర్లు నెయ్యి కల్తీ అని తెలిసింది. అలా నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ అని తెలిసినా కూడా ఆ నెయ్యి వేరే ఇన్ వాయిస్ లతో వస్తే దాన్ని లడ్డూ ప్రసాదంలో వాడినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు వెనక్కి పంపిన.. చంద్రబాబు చెప్పినట్లు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని కూటమి ప్రభుత్వంలోనే వాడారు. అంటే మీరు చెప్పినట్లు మీ ప్రభుత్వ హయాంలోనే పందికొవ్వు నెయ్యితో తయారు చేసిన లడ్డూలు తయారు చేశారా? సీబీఐ ఆ నాలుగు ట్యాంకర్లలో కలిసింది పందికొవ్వు కాదని చెప్పినా... చంద్రబాబు మాత్రం తాను శ్రీవేంకటేశ్వరస్వామి వీర భక్తుడని పదే పదే చెప్పిన మాటలే చెబుతూ... మరలా జంతుకొవ్వులు కలిసాయని ఆరోపిస్తున్నారు.మా ఇళ్లతో టీడీపీ నేతలు భోగిమంటలునాలుగు దశాబ్దాలుగా మిమ్నల్ని గమనిస్తున్నాను. మిగిలివాళ్లు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు కాదా? భక్తి పేరుతో స్వామి వారి ప్రసాదాలు, స్వామి వారిని రాజకీయాలకు వాడుకోవడమే మీ నైజమా? మీరు చెప్పింది నిజమైతే సుప్రీం కోర్టు మిమ్నల్ని ఎందుకు మందలించింది? దానికి సమాధానం చెప్పాలి. మిమ్నల్ని ఆక్షేపించిన సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ దర్యాప్తులోనే ఎలాంటి జంతుకొవ్వులు కలవలేదని చెప్పిన మాట వాస్తవం కాదా? అయినా మీరు చెప్పిన అబద్దాలు ప్రచారం చేస్తూ.. వాటిని జనాలు నమ్మడం లేదని హింసను ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? ఎవరు ఎవరి ఇళ్లమీద దాడి చేస్తున్నారు? టీడీపీ, జనసేన కార్యకర్తలు వైయస్సార్సీపీ నేతల ఇళ్లు కాలబెట్టి బోగి మంటలు వేసుకుని చలికాసుకుంటున్నారు. ఇదే మీ నైజమా? అని సూటిగా ప్రశ్నించారు.లడ్డూలో పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిపారన్న మీ మాటలతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిష్టకు భంగం కలిగించారు. మా ఇలవేల్పు అని చెబుతున్న మీరే స్వామి వారి లడ్డూలో ఆవుకొవ్వు కలిపారంటే ఎవరిపై అపవాదు మోపారు? భగవంతుడిని రాజకీయ పావుగా వాడుకున్నది మీరు. మీ ఆరోపణలతో 140 కోట్ల మంది భక్తుల మనోభావాలను, శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్ర మహిమని నేలమట్టం చేసేలా మాట్లాడింది మీరు కాదా చంద్రబాబూ? ఇప్పటికైనా మీ అంతరాత్మను ప్రశ్నించుకొండి. దైవద్రోహం చేసినవాళ్లను దేవుడు వాళ్ల జీవితకాలంలోనే శిక్షిస్తాడన్నారు. మీ కంటే ఎవరూ దైవద్రోహం చేసారు చంద్రబాబూ అని భూమన సూటిగా ప్రశ్నించారు. కోట్ల లడ్డూల్లో ఆవుకొవ్వు కలిపారనడం కన్నా అపవాదు ఇంకా ఏముంటుందని భూమన కరుణాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. -
అంబటిపై దాడి.. పోలీసుల సమక్షంలో ఇంత బరితెగింపా?: భూమన
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడి అని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పోలీసులు సమక్షంలో ఇంత బరితెగించి దాడులు చేయడమేంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్న వారికి బాధ్యత లేదా? అని మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని ఖండిస్తూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పద్మావతి పురంలో తన నివాసం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు అంబటి రాంబాబు. దాడి అత్యంత హేయమైనది, నీచమైనది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం జరిగింది. అంబటికి చెందిన ఆస్తుల్ని ధ్వంసం చేసి.. దాడి చేస్తే బయటకు రారు అనే ఉద్దేశ్యంతో ఇలా చేశారు.రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి. ఆయన మాట తూలిన మాట వాస్తవం. అందుకు అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. ఆయన ఇంటిపై దాడి చేసి, ధ్వంసం చేశారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?. పోలీసుల సమక్షంలో ఇంత బరితెగించడమేంటి?. ప్రతీకార ద్వేషంతో హంతక ముఠా దాడులు చేశారు. ప్రతి మండల కేంద్రంలో లడ్డూ వివాదంలో ఫ్లెక్సీలు పెట్టించారు. కాపు నాయకులపై దాడి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అని ఘాటు విమర్శలు చేశారు. -
వేద మంత్రాలతో.. హోరెత్తిన నిందా పరిహార హోమం
తిరుపతి సిటీ/సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిందాపరిహార హోమాన్ని నిర్వహించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికతో స్పష్టమవడంతో ఇప్పటి వరకు ప్రసాదంపై జరిగిన దుష్ప్రచారంతో దెబ్బతిన్న శ్రీవారి పవిత్రతకు, ప్రతిష్టకు ప్రాయశ్చిత్తంగా తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో భూమన దంపతులు పాల్గొన్న ఈ కార్యక్రమం వేదమంత్రాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ప్రసాదంపై రాజకీయ నిందలా? ‘సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచపు అపనిందలు మోపారు. ఆ ఇద్దరూ కుమ్మకై దారుణమైన ఆరోపణలు చేశారు. పవన్‌కళ్యాణ్ అయితే దుర్గా మాత గుడి మెట్లు కడిగి అత్యంత నీచంగా ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతో విష ప్రచారానికి తెగబడ్డారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగుతూ లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఈ ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నిందలకు పరిహారంగా శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమం నిర్వహిస్తున్నాం. దీనిద్వారా అపవాదులు తొలగిపోతాయని విశ్వసిస్తున్నాం. అయితే, లడ్డూ ప్రసాదంలో ఎక్కడా జంతు కొవ్వు కలవలేదని, ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని సీబీఐ తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు చెంపపెట్టుగా మారింది. దీనిని వారు జీర్ణించుకోలేక అనుకూల పత్రికలు, ఛానళ్ల ద్వారా ఇంకా తప్పుడు ప్రచారాన్ని కొనసాగించడం దారుణం’ అని భూమన అన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చిత్రాలు ఇక తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పార్టీలు అడ్డంగా దొరికిపోయినప్పటికీ, టీడీపీకి చెందిన కొందరు ఇప్పటికీ ప్రసాదంపై విషప్రచారం చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లడ్డూతో వేంకటేశ్వరస్వామి ఫొటోలను ఏఐ సాయంతో ఎడిట్ చేస్తూ, మార్ఫింగ్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టులు.. వివిధ ప్రాంతాల్లో ఫెక్సీలు ఏర్పాటు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలను మార్ఫింగ్ చేసిన పోస్టులు కనిపిస్తున్నాయని, శ్రీవారిని అవహేళన చేసేలా క్యారికేచర్ పోస్టులు పెడుతున్నారని వారు ఆరోపించారు. హోమం భగ్నానికి యత్నం శ్రీనివాస ప్రసాదం నిందా పరిహార హోమాన్ని ఎలాగైనా భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీంతో కూటమి పార్టీలకు చెందిన గూండాలు ఒక్కసారిగా భూమన నివాసానికి వందల సంఖ్యలో చేరుకున్నారు. హోమం సమీపంలో నానాయాగీ చేస్తూ అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. ఫలితంగా స్థానికులు, హోమానికి హాజరైన వేద పండితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమ దుష్ప్రచారాలు ప్రజల్లో బట్టబయలవుతాయన్న భయంతో కూటమి నేతలు హోమాన్ని అడ్డుకునేందుకు రౌడీమూకలను దింపారని భూమన ఆరోపించారు. టీడీపీకి చెందిన రాక్షస శక్తులు హోమం జరుగుతున్న తమ ఇంటిపై దాడికి ప్రయత్నించాయని, 100 మందికి పైగా రౌడీమూకలు అన్నమయ్య భవన్ సమీపంలో వీరంగం సృష్టించారని ఆయన తెలిపారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి విష సంస్కృతిని తీసుకొచి్చంది కూటమి పార్టీల పెద్దలేనని, తిరుపతి వంటి పవిత్ర క్షేత్రాన్ని రౌడీల నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన నేతలే ఇలాంటి అరాచక రాజకీయాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. -
కూటమి అపచారం.. YSRCP పరిహార హోమం
-
స్వామిద్రోహుల లడ్డూ మోసం
చంద్రబాబు దైవభక్తి ఒక నాటకంజనక్షేమం ఒక బూటకంఅధికారం అన్నదే కీలకంసంపాదనే ఆయనకు మూలకంచంద్రబాబు ఒక స్వార్థ కీటకంహైందవ ద్రోహ రూపకంఇది నా వ్యక్తిగత అభిప్రాయం కానేకాదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలవనే లేదని సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ నిర్ధా రించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనసుల్లో కలిగిన అభిప్రాయం. హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ప్రసా దాన్ని భక్తిశ్రద్ధలతో కళ్లకద్దుకుని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని చంద్రబాబు ఆరోపణల తర్వాత, స్వీకరించాలంటే ఏదో అనుమానం. మనమెంత గానో ఇష్టపడే, పూజించే స్వామి వారి ప్రసాదమేనా? లేక పంది, ఆవు, చేపల కొవ్వుతో తయారు చేసిందా? అని హిందువుల మనసులు ఆవేదనతో గింజుకున్నాయంటే అనుమానం లేదు. అందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని 2024 సెప్టెంబర్ 18న తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన తర్వాత,హిందువులంతా మనసులో పరమ శివుడు గరళాన్ని దిగ మింగినట్టు క్షోభను అనుభవిస్తూ వచ్చారు. బయటపడిన నీచత్వంసుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ ఎట్టకేలకు నివేదికను న్యాయస్థానంలో సమర్పించింది. అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించే సమాచారం. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ లేవని ‘సిట్’ నిర్ధారించింది. ఈ నివేదిక తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను పెంచేలా ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నీచత్వాన్ని బయట పెట్టిందని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కో లేక, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకుహిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవడం దిగ్భ్రమ కలిగించింది. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదంతాలున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత దుర్మార్గం ఆయనలో ఉందని కలలో కూడా ఊహించ లేదు. కనీసం ‘సిట్’ నివేదిక వెలువడిన తర్వాతైనా ఆయనలో కాసింతైనా పశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది. అలాంటిది లేకపోగా, తమ ప్రసార మాధ్యమాలు, అధికార బలంతో ఎలా పైచేయి సాధించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు చేలో మేస్తే, తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించుకుంటున్నారు. తనను తాను ‘సనాతని’గా ప్రచారం చేసుకుంటున్న పవన్ కల్యాణ్, దేవునికి అన్యాయం జరిగితే, బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాల్సింది. కానీ లడ్డూ ప్రసా దంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలు నిజమన్నట్టు దుష్ప్రచారం చేసిన ఘనతను పవన్ దక్కించుకున్నారు. చంద్రబాబు అండ్ కోకు జగన్‌పై దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే దాన్ని జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిట్టచివరి అస్త్రంగా లడ్డూ ప్రసాదమనే అస్త్రాన్ని ప్రయోగించారు. దేవుని భుజాల పైనుంచి జగన్‌ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది.స్వామివారి పుణ్యమా అని... లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిక్కచ్చిగా విచారణ జరిపించాలని వైసీపీ నాయకుడు, టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయివుంటే, స్వామి వారి ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర నెరవేరేదేమో! కానీ కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రబాబు, ఆయన తాబేదా రులైన పాలకుల కుట్రల్ని గుర్తించి, సీబీఐతో విచారణ చేపట్టేలా చేయించారు. అందుకే సీబీఐ విచారణ జరిపి, చంద్రబాబు, ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నట్టు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఇదే చంద్రబాబు నియమించిన ‘సిట్’ విచారణ జరిపి ఉంటే, తన రాజకీయ స్వార్థానికి, ఆరోపణలే నిజమని నమ్మించేందుకు నివేదిక ఇప్పించేవారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిని, నన్ను, ధర్మారెడ్డిని జైలుకు కూడా పంపి ఉండేవారు. సీబీఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు. బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా, యావత్ హిందూ సమాజం ఆయనను అసహ్యించుకుంటోంది. శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులూ నోళ్లు వెళ్లబెట్టేలా... చంద్రబాబు తన మాటలతో, చేష్టలతో, వంతపాడే ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారోపణలు చేయడాన్ని సమాజం గుర్తించింది. ఒక రాజకీయ నాయకుడికి, అతని దుశ్చర్యల్ని జనం పసిగట్టడం కంటే మరో శిక్ష అవసరం లేదు. పురాణ కాలంలో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు అందులో మద్యమాంసాలు కలిపేవారని కథలు కథలుగా విన్నాం. రాక్షసుల కంటే నీచస్థాయికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగజారారనేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన నానాయాగీని చూడాల్సి ఉంటుంది. దమ్ముంటే మొదటి నుంచీ వద్దాం!టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించిన ‘సిట్’... రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది. అధి కారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్‌ను నెయ్యిగా భ్రమింపచేశారనేది ‘సిట్’ నివేదిక సారాంశం. ‘సిట్‘ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడి నాలుక మడత పడింది. కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, భక్తి ఉంటే 2009 నుంచి 2019 వరకు టీటీడీలో నెయ్యి సరఫరాపై విచారణ చేయించాలి. ఇవాళ సీబీఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది. అలాగే ప్రీమియం డెయిరీకి కూడా! ఈ ప్రీమియర్, ఆల్ఫా డెయిరీలే 2013 సంవ త్సరం నుంచి 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రీమియర్ డెయిరీ కూడా ఇవాళ భోలేబాబా దగ్గరి నుంచే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. టెండర్ నిబంధనల్ని మా హయాంలో సరళతరం చేయడం వల్ల కల్తీ జరిగినట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిబంధనల్ని సరళ తరం చేయాలని అనుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనే కారణం. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొత్త కంపెనీలకు కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని 2021లో టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే పాల ఉత్పత్తులు తగిన మోతాదులో లేకపోతే వెన్న కొనుగోలు చేయొచ్చనే నిబంధన నేటికీ ఉంది. ఆ తర్వాత నిబంధనను కఠినతరం చేసింది నా హయాంలోనే! ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులపై సీబీఐ నేరారోపణ చేయలేదు. ఆ నేరంలో భాగస్వాములుగా టీటీడీ చైర్మన్లగా పని చేసిన మమ్మల్ని ఎక్కడా సీబీఐ చెప్పలేదు. నెయ్యి ప్రామాణికతల్ని మెరుగుపరచడానికి రూ.5.50 కోట్లతో మిషనరీల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది మా హయాంలోనే! ఆ మొత్తాన్ని అందించడానికి దాత వచ్చింది కూడా మా హయాంలోనే. ఆ తర్వాత మా ప్రభుత్వం దిగిపోయింది. మీ హయాంలో చేసిందేమీ లేదు. పైగా మాపై నిందారోపణలు. ఇవాళ నిందితులుగా ‘సిట్’ పేర్కొన్న జీఎం సుబ్రమణ్యం 2016 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా కొనసాగారు. అది కూడా చంద్రబాబు టైమ్ లోనే! మరో నిందితుడు జగదీష్ కూడా 2018–21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా నియమి తులయ్యారు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు 2013 నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నారు. ఇవాళ వారిని నిందితులిగా సీబీఐ తేల్చింది. దీనికి మా నాయకు డైన వైఎస్ జగన్‌కు ఏంటి సంబంధం బాబు? సరైన పాప పరిహారంయజ్ఞం చేస్తున్న వ్యక్తి జగన్. అందులో రక్తం పోసే వ్యక్తులు చంద్రబాబు, పవవ్ కల్యాణ్. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని పవనానంద స్వామి (పవన్ కల్యాణ్) ఆరోపించారు. అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీటీడీ సభ్యుడు సౌరబ్ బోరా... నేటికీ బోర్డు సభ్యుడే! కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి, బహిరంగ సభలో పవన్ నిస్సిగ్గుగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం అపవిత్రం అయ్యిందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. ఇప్పుడు పవన్ నోటి ద్వారా వాస్తవం ఏంటో బయటికి రావాలి. కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పారు. అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్లాయనీ, ప్రసాదంలో వినియోగించారనీ ‘సిట్’ తన నివేదికలో స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కలిపారని, పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ఇప్పుడు చెప్పు బాబు? అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, శ్రీవారి ఆలయ అర్చకులతో చంద్రబాబు సంప్రోక్షణ చేయించారు. తిరుమలలో నాలుగు అర్చక కుటుంబాలున్నాయి. స్వాములూ... మీరు మేల్కో వాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గకండి. ఇప్పటికైనా హిందువులంతా వాస్తవాలు తెలుసుకుని, చంద్రబాబు శ్రీవారి ఆలయం కేంద్రంగా ఆడే రాజకీయ వికృత క్రీడను తిప్పి కొట్టాలి. పదవి పొందడానికి పాతాళం కన్నా కిందికి దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే చెల్లు. పాప పరిహా రానికి అమరావతి నుంచి తిరుమల ఆలయం వరకూ రోడ్లన్నీ పవన్ కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకొని, కోట్లాదిమంది భక్తు లకు క్షమాపణ చెప్పాలి.ఓ విష్ణు పరమాత్మా! రాజకీయ స్వార్థానికి మిమ్మల్ని వాడు కున్న పాలకుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. అధికారమనే పొర కళ్లకు కప్పి, అంధత్వంతో పాలిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికే ‘సిట్’ నివేదిక రూపంలో మా ముందుకొచ్చావు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే సత్యాన్ని చెప్పి, కోట్లాది మంది హిందువుల మనసుల్ని తేలికపరిచావు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏదసత్యం తెలుసు కోలేని దురవస్థలో కూటమి పాలకులున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా... మీరు తలచుకోబట్టే లడ్డూ ప్రసాదంపై ఏడాదిగా ప్రచారమవుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
వైఎస్ జగన్ ను దెబ్బ తీయడానికి చంద్రబాబు అండ్ కో కుట్రలు
-
శ్రీవారి ద్రోహికి శిక్ష తప్పదు!
ధర్మ ఏవ హతో హన్తి, ధర్మో రక్షతి రక్షితః/తస్మాద్ధర్మో న హంతవ్యో, మా నో ధర్మో హతోవధీత్!! ‘ధర్మాన్ని నాశనం చేస్తే, అది చేసిన వాడిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే, అది వారిని రక్షిస్తుంది. అలాగే ధర్మాన్ని ఎప్పుడూ నాశనం చేయకూడదు. ఒకవేళ నాశనం చేస్తే అదే దుర్గతి మనకు సంప్రా ప్తిస్తుంది’ అనేది ఈ శ్లోకం అర్థం. సనాతన ధర్మం (మనుస్మృతి)లో ధర్మ విశిష్టతను చెప్పే శ్లోకం ఇది. ధర్మానికి, న్యాయానికి సర్వలోకమూ నిలువెత్తు కొండగా తిరుమల శ్రీవారిని చూస్తుంది. కష్టమొస్తే, నష్టమొస్తే... ‘కలియుగ దైవమా, పాహిమాం’ అని వేడుకుంటే, ముల్లోకాల్లో శ్రీవారు ఎక్కడున్నా కాపాడుతారని భక్తుల అచంచల విశ్వాసం. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరగణం విషం చిమ్ముతున్నారు. పదివేల శేషుల పడగ లపై ఆసీనులైన శ్రీ మహావిష్ణువుపై తాను విషం చిమ్ముతున్నాననే స్పృహలో లేనంతగా వారికి అహంకారం తలకెక్కిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.రాజకీయ స్వార్థానికి చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సైతం వదిలి పెట్టనంతగా చంద్రబాబులో అవకాశవాదం పెరిగిపోయింది. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే ఆయన సైనికులైన మాలాంటి వాళ్లపై రాజకీయ కక్ష తీర్చుకోవ డానికి చంద్రబాబుకు వేరే మార్గాలున్నాయి. కానీ అధికారంలోకి రాక మునుపు, వచ్చిన తర్వాత కూడా తిరుమల శ్రీవారినే చంద్ర బాబు ఎంచుకోవడం తీవ్ర ఆవేదన, ఆందో ళన కలిగిస్తోంది. గత ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో తిరుమల శ్రీవారి కేంద్రంగానే దుర్మార్గ రాజకీయాలకు బరి తెగించారని చెప్పడానికి ఆవే దన చెందుతున్నా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం స్థాయిలో చంద్రబాబు నోరుజారి, స్వామి వారి దృష్టిలో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూపై నిందారోపణలు చేయడాన్ని సాక్షాత్తు సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది. ఆ విషయమై నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.కల్తీ అయ్యింది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు, చంద్రబాబు మనసు రాజకీంగా కలుషితమైంది. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనూ, అలాగే అలవికాని హామీలిచ్చి ప్రజల్నీ వెన్నుపోటు పొడిచారని మాత్రమే ఇంతకాలం చంద్రబాబును విమర్శించే వాళ్లం. కానీ కలియుగ దైవాన్ని కూడా విడిచిపెట్టలేదని లడ్డూ ప్రసాదంపై అత్యంత దుర్మార్గంగా పేద్ద బండలాంటి నింద వేశారని స్పష్టమైంది. ఆ తర్వాత పరకామణిలో చోరీ కేసును కూడా స్వార్థ రాజకీ యాలకు వాడుకుంటున్నారనేది కలియుగ దైవం ఎరిగిన సత్యం. తన అధికారం, మీడియా అండతో లోకం కళ్లు కప్పొచ్చని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కానీ సర్వాంతర్యామి అయిన శ్రీవారిని మోసగించలేమని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.తప్పు జరిగితే వదిలేవారా?వైసీపీ హయాంలో ఏ తప్పూ జరగకపోయినా, ఏదో జరిగినట్టు ప్రజల్ని మభ్యపెట్టడంలో టీడీపీ, దాని అనుబంధ మీడియా నిమగ్న మైంది. మా హయాంలో తప్పు జరిగి ఉంటే, విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్నకు... మాపై నిందలు మోపేవాళ్లు సమా ధానం చెప్పాలి. చిన్న చిన్న తప్పులకే సామాన్య ప్రజలను వీధుల్లో ఊరేగిస్తుండడాన్ని చూస్తున్నాం. అలాంటిది టీటీడీలో మేమే తప్పు చేసి ఉంటే, ఈ పాటికి రాష్ట్రమంతా ఓపెన్ టాప్ జీపుల్లో ఈ ప్రభుత్వం ఊరేగించి, అవమానించకుండా విడిచిపెట్టేదా? టీటీడీలో కొన్ని విభాగాల్లో అధికారుల తీరు వ్యవస్థీకృతమైంది. వాళ్ల తప్పుల్ని కూడా మాపై మోపి, తద్వారా వైసీపీని హిందూమత వ్యతిరేకిగా ముద్ర వేయాలనే అత్యుత్సాహంలో, కోట్లాదిమంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న సంగతిని విస్మరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తన ఇలవేల్పు అనీ, అపార భక్తిశ్రద్ధలు న్నాయనీ చంద్రబాబు తరచూ చెబుతుంటారు. కానీ మాటలకూ, చేతలకూ పొంతన ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ కేంద్రంగా టీడీపీ తన మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమంతా, అంతిమంగా హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేదే!అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే, ఆ తర్వాత మా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. అయితే మళ్లీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికా రుల్ని బెదిరించి, ప్రలోభపెట్టి తప్పుడు నివేదికలతో కేసులన్నీ కొట్టే యించుకుంటున్న చంద్రబాబు, స్వామివారి హుండీ సొమ్మును దొంగిలించడం తప్పని పశ్చాత్తాపం చెంది... కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారి పేరుతో రాయించిన రవికుమార్ తీరులో ఆలోచించాలి. కనీసం పరకామణి చోరీ నిందితుడిలో కనిపించిన పశ్చాత్తాపం కూడా, ప్రజల సొమ్మును కొల్లగొట్టిన చంద్రబాబులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ కేసులో చంద్రబాబు రాజకీయ స్వార్థానికి సతీశ్‌కుమార్ అనే నిజాయతీ కలిగిన సీఐ బలి అయ్యారు. ఇక్కడ బలి అయ్యింది కేవలం సీఐ మాత్రమే కాదు... ధర్మం, న్యాయం అనే సంగతిని మరిచిపోవద్దు. భార్య, ఇద్దరు చిన్నారులున్న సతీశ్‌కుమార్ కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు. అలాగే చాలామంది అధికారుల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తుండడం బహిరంగ రహస్యమే. అధికారులతో పాటు రాజకీయంగా మాపై వేధింపులు కాస్తా, కక్షగా మారి, సమాజ బహిష్కరణ చేయాలనే బీఆర్ నాయుడి అహంకారపూరిత పిలుపు దిగ్భ్రమ కలిగిస్తోంది. ‘ఇలాంటి వాళ్లా అత్యంత ప్రతిష్ఠాత్మక టీటీడీకి చైర్మన్?’ అనే ప్రశ్న సమాజం మనసును తొలిచేస్తోంది.గోశాల గోవుల మరణాలుటీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో వందలాది గోవుల మర ణాలకు చంద్రబాబు, ఆయన నియమించిన బీఆర్ నాయుడి నేతృత్వంలోని పాలక మండలి మూల్యం చెల్లించుకోక తప్పదు. శ్రీవారిపై భక్తిశ్రద్ధలతో గోవుల మరణాలను నేను వెలుగులోకి తీసుకొస్తే, తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు ఎదురు దాడికి దిగడం దివాళాకోరుతనాన్ని చూపుతోంది. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్పి, అంతిమంగా నేను చెప్పింది నిజమే అని నిర్ధారించడం వాస్తవం కాదా? అసలు గోవును తల్లిగా భావించి, పూజించే పుణ్య భూమి, కర్మ భూమి మనదనే వాస్తవం తెలియక పోవడం మన దురదృష్టం.ఇక టీటీడీలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారిని దర్శించుకోడానికి క్యూ కాంప్లెక్స్‌లలో ఉన్న భక్తులకు ఉచితంగా అందాల్సిన ప్రసాదాలను, దళారులు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? అలాగే టీటీడీలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించే దందా సాగుతోంది. ఇదే మా హయాంలో బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయానికి సంబంధించి ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాం. అలాగే కొండపై నుంచి బ్లాక్ మార్కెట్లో టికెట్ల దళారుల్ని తరిమికొట్టి, స్వామిపై మా భక్తి ఏంటో చేతల్లో చూపాం. మరి మీ హయాంలో చేస్తున్నదేంటో, కొండపై అడుగడుగునా కనిపించే దళారుల దాష్టీకాలే నిదర్శనం.తిరుమల కొండపై అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు. కొండపై అవినీతి కూడా అపచారమే! బీఆర్ నాయుడి కార్యా లయం కేంద్రంగా సాగుతున్న అవినీతి అపచారం అంతా ఇంతా కాదు. దళారులంతా సిండికేట్‌గా ఏర్పడి, భక్తుల్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చి, ఆనందంగా తిరుగు ప్రయాణం కావాల్సిన భక్తులు... దోపిడీకి గురయ్యామన్న ఆవేదనతో వెనుదిరగడం వాస్తవం కాదా? కంచే చేను మేసిన చందంగా, టీటీడీలో అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యతల్లో ఉంటూ, వాళ్లే దళారులుగా మారితే ఇక చెప్పడానికి ఏముంటుంది?అలాగే అలిపిరి సమీపంలో రోడ్డుపక్కన 12 అడుగుల విష్ణు మూర్తి విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో ప్రత్యక్షం కావడం కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన పాపానికి నాపై కేసు పెట్టడం, అలాగే పోలీసులు విచారించడం దేనికి సంకేతం? సత్యం చెప్పినందుకు చరిత్రలో కళ్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. అందుకే నేనెంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగితే ప్రాణాలు పోయేంత వరకూ నిజాలు మాట్లాడు తూనే ఉంటానని గతంలో చెప్పాను. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాను.కొండపై మద్య మాంసాలు యథేచ్ఛగా దొరుకుతుండడం కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? ఈ మధ్య కాలంలో తిరుమల పోలీస్ గెస్ట్‌హౌస్ సమీపంలో మద్యం బాటిళ్లు కనిపిస్తే, వాటిని వీడియో తీసిన వ్యక్తిని, అలాగే సాక్షి ఫొటోగ్రాఫర్‌ని నిందితులుగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ దురాగతానికి నిదర్శనం కాదా? ఇదే విషయమై ఆ రోజు తిరుపతి ఎస్పీ పీఆర్వో విడుదల చేసిన ప్రకటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాయంత్రానికి మాట మార్చడాన్ని ఏమనాలి? వాస్తవాలు చెప్పడం దేశద్రోహమా?అత్యంత పవిత్రమైన, హిందువుల ఆధ్మాత్మిక రాజధాని క్షేత్రమైన తిరుమలను మద్యం, మాంసప్రియులు, దళారులకు వది లేసి, వాస్తవాలను చెప్పిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గం. అయితే న్యాయదేవత కళ్లు తెరిచి, ఆగ్రహించడంతో ఆ కేసు గాలిలో కలిసిపోయింది. శ్రీవారి విషయంలో ద్రోహి ఎవరో ప్రతి హిందువుకూ తెలుసు. కేవలం తన పార్టీకి ప్రచారకర్తగా పని చేసిన టీవీ ఛానల్ అధిపతికి ప్రతిష్ఠాత్మక టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టి, స్వామివారికి చంద్రబాబు మొదటి అపచారం చేశారు. టీటీడీ చైర్మన్‌గా శ్రీవారికి సేవ చేయడానికి బదులు, ఇంకా తాను చంద్రబాబు భక్తి ఛానల్ చైర్మన్ అనే మాయలోనే బీఆర్ నాయుడు ఉన్నారు.అందుకే కొండపై నిత్యం స్వామి వారికి అపచారం. అంతెందుకు సీఎంవో నుంచి నిత్యం వచ్చే సిఫార్సు లేఖలెన్ని? టీటీడీ చైర్మన్ కార్యాలయం నిత్యం ఇస్తున్న వివిధ రకాల దర్శనాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తే, స్వామి వారి విషయంలో వ్యాపారం చేసుకుంటున్నదెవరో తేలి పోతుంది. వాటికి సంబంధించి గోప్యత పాటిస్తున్నారంటే, ఏదో తప్పు చేస్తున్నారనే కదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్వామి వారి చెంత దర్శ నాలకు సంబంధించి పారదర్శకత లేక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. టీటీడీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దాపరికాలు లేవు.ఏడాదిన్నర చంద్రబాబు పాలనను గమనిస్తే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. బాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని... లేనివి ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని కూటమి సర్కార్ చూపుతోంది. మూడో విషయానికి వస్తే, తిరుమల కేంద్రంగా, అలాగే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు, ఆయన్ను మోసే మీడియా ఒక తప్పుడు ఎజెండాతో ముందుకెళు తోంది. ఈ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం.సంస్కరణలా? ఇబ్బందులా?సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మొట్టమొదట శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంస్కరణలకు తిరుమల నుంచే శ్రీకారం చుడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. మా హయాంలో తిరుమ లలో అన్యమత ప్రచారం జరిగిందని, ఇంకా లేనిపోని నిందలన్నీ వేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ సంస్కరణలు కాదు కదా భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైకుంఠద్వార దర్శనం రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. తిరుమల అంటే భక్తుల్లో భయాన్ని కలిగించి, ఏడుకొండలపైకి వెళ్లకుండా చేయడంలో టీటీడీ చైర్మన్, ఇతర అధికారులు విజయవంతం అయ్యారంటే అతిశయోక్తి కాదు. గత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోని కారణంగా... ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ చరిత్రలో ఇదో మాయని మచ్చ. ఇదంతా చంద్రబాబు నియమించిన టీటీడీ పాలక మండలి, అధికారుల చేతకానితనం వల్ల ఏర్ప డిన విపత్తు. అంతే కాదు, టీటీడీ చైర్మన్ చిన్నపిల్లాడిలా ఉన్నతాధి కారులతో గొడవ పడుతూ, పరిపాలన సవ్యంగా సాగనివ్వని పరిస్థితిని సృష్టించడం నిజం కాదా? ‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు’ అని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తుంటారు. బహుశా ఆయన ఈ హెచ్చరిక తనకు వర్తించదని అనుకుంటున్నారేమో! కలియుగ దైవమైన శ్రీవారికి అపచారం చేయడంలోనూ, అప్రతిష్ఠ కలిగేలా వ్యవహరించడంలోనూ చంద్రబాబు తర్వాతే ఎవరైనా, ఏమైనా! శ్రీవారి ఆది అంతాల ద్రోహి ఆయనే. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని నాలాంటి వాళ్లు వెలికితీస్తే... అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం కేసులు పెట్టడానికి అత్యుత్సాహం ప్రదర్శి స్తున్నారు.కానీ ఆ వైకుంఠవాసుడు తనను ద్రోహిగా చూస్తున్నాడని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించి, భయ భక్తులతో మెలిగితే మంచిది. శిశుపాలుడికి శిక్ష విధించడానికి వంద తప్పుల్ని శ్రీకృష్ణ భగవానుడు లెక్కించారు. టీటీడీ కేంద్రంగా చంద్రబాబు తప్పుల్ని కూడా మహావిష్ణువు లెక్కిస్తుంటారు. బాబు నేతృత్వంలో స్వామి వారికి చేస్తున్న ద్రోహానికి, శిక్షించే సమయం మరెంతో దూరం లేదు. రాజకీయాల్లో అధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబును... చివరికి అదే నాశనం చేస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
ఇరుసుమండ బ్లోఅవుట్ వెనుక అనుమానాలు: భూమన
సాక్షి, తిరుపతి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఉన్న ఓఎన్జీసీ మోరి బావి–5లో భారీ బ్లోఅవుట్‌పై సందేహాలు వ్యక్తం చేస్తూ.. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..ఏ అనుభవం లేని డీప్ ఇండస్ట్రీస్:భారీ డ్రిల్లింగ్‌లో ఏ మాత్రం అనుభవం లేని డీప్ ఇండస్ట్రీస్‌కు ఇరుసుమండలో ఓఎన్జీసీ కాంట్రాక్ట్ ఇచ్చారు. దీని వల్ల మోరి బావి–5 వద్ద భారీ బ్లోఅవుట్ జరిగి, 150 అడుగలకు పైగా మంటలు చెలరేగి వేలాది ఎకరాల్లో పంటలు తగలబడి, వందల కోట్ల నష్టం జరిగింది. ఈ దుర్ఘటన వెనుక ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంటే, దీన్ని సహజంగా జరిగిన ప్రమాదంగా చిత్రీకరించి ప్రభుత్వ పెద్దలు మసిపూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు.డీప్ ఇండస్ట్రీస్ అనే ఓ అమెరికన్ కంపెనీకి అనుభవం లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అందుకే బ్లోఅవుట్ జరగ్గానే తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు సీరియస్‌గా సహాయ పనులు చేయాల్సిన అధికారులు నవ్వుతూ కనిపించారు. అందువల్లే బ్లోఅవుట్‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.లోతైన విచారణ జరపాలి:అందుకే డీప్ ఇండస్ట్రీస్ సంస్థకు కాంట్రాక్టు ఎలా దక్కిందనే దానిపై లోతైన విచారణ జరపాలి. అప్పుడే ప్రభుత్వ పెద్దలు, కంపెనీ ప్రతినిధుల మధ్య ఎన్ని వేల కోట్లు చేతులు మారాయో తెలుస్తుంది. అసలు ఎవరి ద్వారా ఈ కంపెనీ సహజ వాయువును వెలికి తీసే కాంట్రాక్టు దక్కించుకుందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కాగా, ప్రమాద ఘటనను కూడా కొందరు ప్రభుత్వ పెద్దలు ఆదాయ వనరుగా మార్చుకున్నారని, అది మరీ దారుణమని భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపించారు. -
మొత్తం ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వెనుక వైఎస్సార్సీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు‘‘తప్పుడు కేసు బనాయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యమే కొండపై తిష్ట వేసింది. ఖాళీ మద్యం బాటిళ్లను కవర్ చేసినవారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టమని సవాల్ చేస్తున్నా. 25 గోనె సంచులు నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయట పడింది నిజం కాదా?. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారు. తిరుమల టు టౌన్ సీఐ శ్రీరాములు..వైఎస్సార్సీపీ కార్యకర్త మణిని కొట్టారు.బీఎన్.ఎస్ సెక్షన్ 152 పెట్టడం అత్యంత దారుణం. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్టకడుతున్నాం. లేదంటే మాకు జైళ్లే అవాసకేంద్రాలుగా మారేవి. మా సవాల్ ను స్వీకరించాలి.. మొత్తం ఆ సీసీ పుటేజ్ బయట పెట్టాలి. అలిపిరి వద్ద నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ ఏం చేస్తోంది?. బీఆర్ నాయుడి ప్రైవేట్ సైన్యం తాగి పడేసి బాటిల్స్ అవి. నీకు లక్షలు, వేల కోట్లు ఎలా వచ్చాయి? కోటి అనే వ్యక్తి మద్యం బాటిల్స్ పెట్టినట్లు సాక్ష్యం చూపించమని సవాల్ విసురుతున్నా.. మేము హైందవ ధర్మ పరిరక్షణ కు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము మీరు చర్చకు సిద్ధం’’ అని భూమన తేల్చి చెప్పారు.‘‘మీరు అరెస్ట్ చేసినా నా గొంతు ఆగదు.. తిరుమలపై ఏది జరిగినా ప్రశ్నిస్తాము. మీరు చేస్తున్నా ఘోరాలు, నేరాలు ప్రజలకు తెలియజేస్తాం. పోలీసులు బలి పశువులయ్యారు. సీఐ శ్రీరాములు చేసినది తప్పు.. తీవ్రవాది పట్ల ప్రవర్తించేలా ఉంది. సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి 40 మంది పోలీసులను పంపించి భయభ్రాంతులు చేశారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు పీడిత రాయలసీమ!
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే,ప్రాంతం పొలిమేరల వరకూ తరిమి కొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే, ప్రాంతం లోపలే పాతిపెడతాం’ అంటూ ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిదాయకమైన మాటలు... రాయలసీమ సమాజం చెవుల్లో మార్మోగుతున్నాయి. అంతేకాదు, రాయలసీమ ప్రాంతంలో పుట్టి, పెరిగి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, పాలకుడిగా ఇప్పుడా ప్రాంతానికే ద్రోహం తలపెట్టిన చంద్ర బాబును ఏం చేయాలో అనే అంతర్మథనంలోనూ రాయలసీమ ఉంది. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కరవు రక్కసిని పారదోలాలనే దివంగత ప్రియతమ నేత, తన తండ్రి వైఎస్సార్ ఆశయాన్ని, ఆకాంక్షను నెరవేర్చడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటితో పాటు కరవు ప్రాంతమైన రాయల సీమలో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం వైఎస్ జగన్ గొప్ప ఆశయానికి నిదర్శనం.అప్పుడే పూర్తయ్యేది!శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ. 3,825 కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. మొదటి దశలో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకం సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు విఘ్నాలు కలిగించిన చందంగా... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా నాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా ఎన్జీటీలో పిటిషన్ వేయించి, అడ్డు తగిలారు. అయితే మహాభారతంలో అర్జునుడి లక్ష్యం చెట్టుపై ఉన్న పక్షి కన్నుపై తప్ప, కొమ్మలపై కానట్టుగా... పార్థుడి లాంటి వైఎస్ జగన్ దృష్టి ప్రాజెక్ట్ పనులపై మాత్రమే ఉండింది. అందుకే చంద్రబాబు సృష్టించిన ఆటంకాలను లెక్క చేయకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని శరవేగంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కొనసాగి ఉంటే, ఈ పాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి, రాయలసీమంతా సస్యశ్యామలం అయ్యేది. కరవు పీడిత ప్రాంత రైతాంగం జీవన రూపురేఖలే పూర్తిగా మారిపోయేవి. కానీ రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వెలుగులు నింపే వైఎస్ జగన్ పరిపాలనా దీపాన్ని... అబద్ధాలు, విష ప్రచారం ద్వారా కూటమి కొండెక్కించేసింది. తద్వారా వైఎస్ జగన్ కంటే, ఎక్కువగా తామే నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోందన్నది ముమ్మాటికీ నిజం.మాతృగడ్డకే ద్రోహమా?ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా... మొదటి బాధిత ప్రాంతంగా రాయలసీమ రికార్డులకెక్కింది. రాయలసీమ వాసిగా, ఆ ప్రాంతా నికి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా సమాజం అతడిపై మండి పడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాలాంటి నాయకులపై ‘చంద్రబాబు అండ్ కో’కు కోపం ఉండొచ్చు. ఒకవేళ మాపై కోపాన్ని తీర్చుకోవాలంటే అధికారాన్ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి.కానీ కరవు ప్రాంతంపై చంద్రబాబు ప్రతాపం ఎందుకో అర్థం కావడం లేదు. అధికారాన్ని తాను పుట్టిన ప్రాంతానికి ద్రోహం తలపెట్టడానికి దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. బహుశా దేశ చరిత్రలో మరే నాయకుడూ తనకు రాజకీయ, అధికార భిక్షమేసిన మాతృగడ్డకు చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇంతకాలం ఆయనపై మచ్చ ఉంది. ఇప్పుడు దానికంటే మించిన మచ్చ, అప్రతిష్ఠ చంద్రబాబుకు దక్కాయి. నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం జీవితాలను మార్చేందుకు, కృష్ణా నీళ్లతో బీడు భూముల్ని తడిపేందుకు భగీ రథుడిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞం తలపెట్టగా, రాక్షసుడి మాదిరిగా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. తన రాజకీయ శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరిన వెంటనే, తన అబ్బ సొత్తు అన్నట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అంతే తప్ప, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరినట్టు నడుచుకోవడా నికి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాళోజీ చెప్పినట్టు...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతతో, ఇవాళ కరవు పీడిత ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. మళ్లీ వలసలు తప్పడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి కూడా కోరలు కట్ చేసిన పరిస్థితి. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? గత ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని కూటమికే కట్టబెడితే, రిటర్న్ గిఫ్ట్‌గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను లేకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఈ దుర్మార్గానికి ఏం పేరు పెడితే సరిపోతుందో విజ్ఞులైన రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. రాయలసీమ ప్రాంతం నీళ్ల కోసం అలమటిస్తోంది. అందుకే దివంగత వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు అప్పట్లో పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచి, రాయలసీమ ప్రాంత కరవు పారదోలడానికి పనుల్ని వేగవంతం చేశారు. ఇదీ రాయలసీమను కరవు రక్కసి నుంచి తరిమికొట్టడానికి జగన్ నిబద్ధత. చంద్రబాబు మాత్రం... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ రాయలసీమ కరవును పారదోలాలని ఆలోచించలేదు. కానీ వైఎస్ జగన్ తీర్చిదిద్దిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మాత్రం తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసం లిఫ్ట్ చేయ డానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకే చంద్రబాబును రాయలసీమ పాలిట పీడకుడని చెప్పడం! తమ ప్రాంతానికి మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైంది. సొంత ప్రాంతం వాడే ద్రోహం చేస్తే, ఏం చేయాలో మహాకవి కాళోజీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయించుకోవా ల్సింది రాయలసీమ సమాజమే!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
రేవంత్ రెడ్డికి పన్నీరు, రాయలసీమకు కన్నీరు బాబును ఏకిపారేసిన భూమన
-
‘మీ దయవల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది’
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దయవలనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందనే విషయం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి. కూటమి ప్రభుత్వం రాయలసీమకు ఎంత అన్యాయం చేస్తుందో తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తేటతెల్లమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రయోజనాలు కాపాడటం కోసమని రాయలసీమ ప్రజల కళ్లలో కారం కొట్టాడు. చంద్రబాబు రాయలసీమను తాకట్టు పెట్టారు. రేవంత్ రెడ్డికి పన్నీరు, రాయలసీమ కు కన్నీరు. వైఎస్ జగన్ పాలనలో రాయలసీమకు మేలు చేయాలని రూ. 7 వేల కోట్లతో ప్రారంభించారు..చంద్రబాబు రాయలసీమ వాసిగా ఉండి ఏనాడు మేలు చేసింది లేదు..రాయలసీమకు వైఎస్సార్ 1984 - 85 నుంచి ఎంతో మేలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీ నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు ద్వారా సస్యశ్యామలం చేశారు. ఆయన వారసుడిగా వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కొనసాగించారు..టిడిపి చెలికత్తె పత్రిక విషపు రాతలు రాస్తోంది..రాయలసీమ మేధావులు, కర్షకులు, ప్రజలు అందరూ ఉపేక్షించకుండా పోరాటానికి సన్నద్ధం కావాలి’ అని భూమన పిలుపునిచ్చారు. -
తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తి డొల్లగా మారింది: భూమన
-
పవన్ నంద స్వామి వీరాభిమాని.. తిరుమలలో మరో ఘోర అపచారం
-
‘ శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో జరిగిన ఘటన దారుణాతి దారుణం’
తిరుపతి: శ్రీ గోవింద రాజస్వామి ఆలయం రాజగోపురంపై ఒక తాగుబోతు కలశాలు పైకి ఎక్కి, మందు కావాలి అంటూ డిమాండ్ చేశాడు అంటే భద్రత డొల్ల ఏస్థాయిలో ఉందో బయట పడిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. గోవింద రాజస్వామి ఆలయం లో జరిగిన ఘటన దారుణాతి. దారుణమన్నారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిటిడి ప్రతిష్ట పూర్తి గా మంటగలిపేలా చర్యలు ఉన్నాయి. ఎంత సేపు మేము గొప్పలు చేశాము అని చెప్పుకోవడమే తప్పా, ఆలయ పరిరక్షణ కోసం చేసింది ఏమి లేదు. టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు వీఐపీ సేవల్లో తరిస్తూ పూర్తిగా ఆలయ ప్రతిష్ట మంటగలుపుతున్నాడు. తిరుమల కొండపై మద్యం, మాంసం ఎక్కడ చూసినా దొరుకుతోంది. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు చిట్టా ఎందుకు తక్కువగా ఇచ్చారు . బీఆర్ నాయుడు దర్శనాలు చిట్టా బయటపెట్టాలి. భక్తులు గోడు పట్టించుకోవడం మానేశారు. తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలేదు. సీఎంవో నుంచి వచ్చిన సిఫార్సులు లేఖలుకే దర్శనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటే ధ్వజమెత్తారు భూమన.కాగా, టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం బయటపడింది. గత రాత్రి విజిలెన్స్ కళ్లు గప్పి ఆలయంలోకి దూరిన ఓ వ్యక్తి.. ఆలయ గోపురం పైకి ఎక్కి మద్యం ఇస్తేనేగానీ కిందకు దిగనంటూ హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో కలశాలను పెకిలించే బెదిరింపులకు దిగాడు. అయితే పోలీసులు అతికష్టం మీద అతన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. -
అనితర సాధ్యుడు
ధరిత్రిలో చరిత్ర సృష్టించేవాళ్ళు కొందరే ఉంటారు. వారి వల్ల కాలానికి ఓ గుర్తింపు వస్తుంది. కాలం కలకాలం వారిని గుర్తుంచుకుంటుంది. సమ కాలీన భారత రాజకీయ చరిత్రలో పదహారేళ్ల క్రితం ఓ ఉత్తుంగ తరంగం ఎగిసింది. హిమాలయ శృంగ సమా నమై నిలిచింది. ఆ తరంగం పేరే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. మన మాజీ ముఖ్యమంత్రి. ప్రజలు ముద్దుగా, గౌరవంగా, ఆత్మీయంగా పిలుచుకునేది ‘జగన్’ అని! ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక కఠోర శ్రమ, ఒక నిరంతర దీక్ష, ఒక పట్టుదల, ఒక ఆత్మీయం – జగన్. అలజడి, ఆందోళన, తిరుగుబాటు ఆయన తత్త్వం. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు జగన్. ఓ 36 ఏళ్ల యువకుడు, రాజకీయ పసిబాలుడు సమాజపు అట్టడుగు దేశ రాజకీయ చరిత్రను తిరగరాయడం ఆశ్చర్యం. అది జగన్‌కే చెల్లింది. 125 సంవత్స రాల కాంగ్రెస్ పార్టీని కదిపి, కుదిపి, ధిక్కరించి, ఛీత్కరించి తన అసామాన్య, అసాధారణ పోరాటంతో ఆ పార్టీ ఊపిరి తీసేసి రాష్ట్రంలో, దేశంలో లేకుండా చేయటం అన్నది మాటలు కాదు. మహామహులకు సాధ్యం కాని పని జగన్మోహన్ రెడ్డి చేయడం జగత్తు చూసి ముక్కున వేలేసుకుంది.ప్రియమైన వారసుడుమహానేత, తెలుగు రాష్ట్ర ప్రజల భాగ్యవిధాత అయిన తండ్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హఠాత్తుగా అందర్నీ వీడి పోతే... ఆ బాధ భరిస్తూ, ఆ అనంత శోకాన్ని ఎదలో మోస్తూ, తండ్రి ఆశయ సాధన కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, జనం కోసం నిలబడిన ధీరోదాత్తుడు జగన్. తండ్రి ఆశయం కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి ముందుకు వచ్చిన అసలు సిసలు యుద్ధవీరుడు. తండ్రి ఆస్తులకు కాదు, ఆశయాల కోసం నిలబడాలి అని ప్రజల పక్షం వహించి, లోకంలో ఆశయం కోసం ఎలా ఉండాలో పోరాటం చేసి చూపిన యోధుడు.పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రత్యర్థులు ప్రతి క్షణం వెనక్కి లాగుతున్నా, ప్రజల కోసం అడుగులు వేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జగన్. ఆయన పట్ల ప్రజలు అపార అభిమానం, నమ్మకం పెంచుకుంటున్న పరిస్థితిని పసిగట్టి జగన్‌ను అణిచివేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అందరికీ తెలిసిందే.మహానేత మరణాన్ని భరించలేక ఆంధ్ర రాష్ట్రం అల్లాడి పోయింది. దాదాపు 673 మంది ప్రజలు ఆత్మహత్య చేసు కున్నారు. తన తండ్రి కోసం తనువులు వీడిన ఆ కుటుంబాలను పలకరించాలని, పరామర్శించాలని జగన్ సంకల్పించారు. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. ఆ యువకుడు కదిలితే అతని వెంట కోట్లాది జనం నడుస్తారని వారికి తెలుసు. అది ఇష్టం లేక ఆ కుటుంబాలను ఒక చోటికి పిలిచి మాట్లాడమని ఆదేశించింది అప్పటి కాంగ్రెస్ అధిష్టానం. చెప్పుడు మాటలకు తలవొగ్గి జగన్మోహన్రెడ్డికి గిరి గీయాలి అని ప్రయత్నించింది సోనియా గాంధీ.బాధిత కుటుంబాలను తన దగ్గరకు పిలిపించుకోవడం న్యాయం కాదనీ, తానే వారి దగ్గరికి వెళ్లి పలకరించడం భార తీయ ధర్మం, సంప్రదాయం అనీ ఆయన చెప్పినా అంగీకరించ లేదు సోనియా గాంధీ. అన్యాయాన్ని, అధర్మాన్ని అంగీకరించి తలవంచడం తెలి యని జగన్, ఆమె మాట కాదన్నాడు. ఆ అభాగ్యుల చెంతకు తనే స్వయంగా వెళ్ళటానికి నిర్ణయించి అడుగు ముందుకు వేశాడు. అది అభిమాన జనప్రవాహంతో ఓదార్పు యాత్రగా మారింది. ఆ యువకుడిని, తమ ప్రియమైన డాక్టర్ వై.ఎస్. రాజ శేఖర రెడ్డి కుమారుడిని చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు, ప్రజా సముద్రం కదిలింది. జగన్ మాట్లాడుతూఉంటే, ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, ఆదరంగా భుజంమీద చేయి వేస్తూ ఉంటే, చేయి ఊపి దగ్గరికి పిలుస్తూ ఉంటే, ‘నేను ఉన్నాను’ అని నమ్మకం ఇస్తూ ఉంటే, ఆంధ్ర ప్రజలు ఆప్యాయ తతో పొంగిపోయారు. కాపాడే నేత కళ్ళ ముందు కనిపిస్తున్నా డని ఆనందపడ్డారు. అతడే తమ నాయకుడు, పరిపాలకుడు కావాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి మారుగా తనయుడు తమ కష్టాలు తీరుస్తాడని త్రికరణ శుద్ధిగా నమ్మారు.అవిశ్రాంత యోధుడుజగన్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి, ప్రత్య ర్థులకు, సోనియా గాంధీకి, చంద్రబాబుకు కన్ను కుట్టింది, వెన్ను జలదరించింది. అతని ముందు నిలబడలేమని అర్థమైంది. ఆనాడు అభిమన్యుడి మీదికి కుట్రతో ఉరికిన కురు మూకల మాదిరి ప్రత్యర్థులు సోనియాగాంధీ, చంద్రబాబు కుయుక్తులు పన్నారు, కుతంత్రాలు చేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకున్నా, పరిపాలనలో పాలుపంచు కోకున్నా సీబీఐని ఉసిగొల్పారు. దాని ఫలితం అనేకమైన అబద్ధపు కేసులు పెట్టి, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం బెయిలు కూడా రాకుండా అక్రమ నిర్బంధం చేశారు. మానసికంగా కుంగదీయాలని అనేక ప్రయత్నాలు చేశారు.అన్ని రోజుల పాటు జైలులో అనంత ఏకాంతంలో ఉన్నా జగన్ మనోబలం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలకు సేవ చేయా లన్న పట్టుదలలో వెనుకంజ వేయలేదు. తాత నుండి ఆత్మస్థైర్యం, తండ్రి నుండి మనోబలం, తల్లి నుండి సహనం సహజంగా అతనికి అబ్బిన గుణాలు. చెక్కుచెదరని అసాధారణ సాధనతో, మనో నిబ్బరం సడలని బలంతో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చాడు. మరొకరైతే చెదిరి బెదిరి విలువలకు తిలోద కాలు ఇచ్చి, కాడె పారేసి కదలి వెళ్లిపోయేవారు. ఎన్ని దాడులు, ఎన్ని విమర్శలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రచారాలు, ఎంత వైషమ్యం, ఎంత విషం తమ పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా నిత్యం ప్రత్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసత్యాన్ని సత్యం అని చెబుతూనే ఉన్నారు. జగన్మోహనుడు ఏ మాత్రం జంక లేదు. ఏ మాత్రం తొణకలేదు. ఒక్కడుగా, ఒకే ఒక్కడుగా జనాన్ని నమ్మి కదన రంగంలోకి కొదమ సింహంలా ఉరికాడు. ఆత్మీయులను ఆదరిస్తూ 2014 ఎన్నికల రంగంలోకి ఏకాకిగా అడుగుపెట్టాడు. ప్రజలలో అదే ఆదరణ, అదే నమ్మకం.అబద్ధం చెప్పలేను, మోసం చేయలేను, అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వలేను అని విలువలకై నిలబడ్డాడు. ప్రత్యర్థులు, చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. అధికారం వస్తే చాలని అబద్ధాల కుప్పలు ప్రజల ముందు పోశారు. ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని ఒకే ఒక అబద్ధం జగన్ చెప్పి ఉంటే అధికారం దక్కేది. మోసం చేయను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోలేదు, ప్రజల పక్షాన నిలబడటం మానలేదు. ఆయనకు కావాల్సింది అధి కారం కాదు, జన క్షేమం. చంద్రబాబు బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. అయినా చంద్ర బాబు ప్రభుత్వం మీద జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు. ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షం నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత యుద్ధం చేస్తూనే ఉన్నారు. తన శాసన సభ్యుల్ని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం, పేదల కోసం గళం ఎత్తుతూనే ఉన్నాడు.సహృదయ నాయకుడుజనం కోసం జగన్ జరిపిన సుదీర్ఘ పాదయాత్ర మరొక చరిత్ర. తండ్రిలాగే తాను జనం మధ్యకు వెళ్లాలనీ, కష్టజీవుల కన్నీటి కథలు తెలుసుకోవాలనీ, రైతుల గోడు వినాలనీ, నిరుద్యోగుల, ఉద్యోగుల, ఆడపడుచుల బాధలు వినాలనీ, ఓదార్చాలనీ, ధైర్యం చెప్పాలనీ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు జగన్. సెక్యూరిటీ వారు వద్దన్నా, ఆత్మీయులు ప్రేమగా వారించినా కాదని ప్రజల కోసం ఎండనకా, వాననకా అడుగులు వేశాడు. కాళ్లు బొబ్బలు ఎక్కాయి, హఠాత్తుగా ఆరోగ్యం సహకరించలేదు, హత్యా ప్రయత్నం జరిగింది, ప్రతీప శక్తులు హేళన చేశాయి. ఏవీ ఆయన లెక్కలోకి తీసుకోలేదు. దీక్ష, పట్టుదల, పేదల పట్ల ప్రేమ, సేవ చేయాలన్న ఆశయం ఆయనను నడిపించాయి. ప్రతిరోజూ ఇరవై వేల మందిని కలుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, ధైర్యం ఇస్తూ కదిలాయి ఆయన పాదాలు. ఆ పాదస్పర్శకు నేలతల్లి పులకించింది. ఆయన మాటల ఓదార్పుకు జనంలో ఆశ చిగురించింది.పేదలు, వృద్ధులు, రోగగ్రస్థులు, ఎందరో ఆయనకు గోడు వినిపించుకున్నారు. పుండ్లతో శరీరం కుళ్ళి రసి కారుతూ దగ్గరకు వెళ్ళటానికి జుగుప్స కలిగించే వారిని సైతం ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్న అమృత హృదయం జగన్ మోహన్ రెడ్డి గారిది. ముగ్గుబుట్ట వంటి తలా, ముడ తలు దేరిన దేహం, కాంతి లేని కళ్ళతో దీనంగా, హీనంగా, దైన్యాతిదైన్యంగా ఆదరణ కోసం, ఆత్మీయత కోసం, సహాయం కోసం, సానుభూతి కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్య సోదర సోదరీమణుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అత్యంత సన్నిహి తంగా దగ్గరకు తీసుకున్న మొదటి, ఆఖరి రాజకీయ నాయకుడు నిస్సందేహంగా జగనే! అంతరంగంలో అపారమైన ప్రేమ, దయ, జాలి ఉంటే తప్ప అది సాధ్యపడదు.అపూర్వమైన సంస్కారం ఆయనది. తనకన్నా చిన్నవారిని, నౌకర్లను, డ్రైవర్లను, సెక్యూరిటీ వారిని అందరినీ ‘అన్నా’ అని పిలిచే సహృదయత ఆయనది. ఎదుటివారికి ఆయన ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడూ ఇవ్వడు. పాదయాత్రతో మరింత ఎదిగాడు. ప్రజల మనసులలో నమ్మకం పెంచాడు. వారికి ఏం కావాలో, తనేం చేయాలో నిర్ణయించుకున్నాడు. పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాడు. నిర్ణయించుకుంటే అడుగు వెనక్కి వేయని తత్వం. చేయాలనుకున్నది చేసి తీరే పట్టుదల. కన్నీటి కథలకు, వెతలకు, కరిగిన ఆయన హృదయం తీసుకున్న కఠిన నిర్ణయం పేదల పక్షపాతం.ఒకే ఒక్కడు2019 ఎన్నికలు వచ్చాయి. ఒక్కడే ఒకే దీక్షతో నారాయణ ధనుర్ముక్త బాణంలా జనంలోకి వచ్చాడు. పర్జన్య గర్జన్యం వంటి ఆయన వాక్కు హామీ అందరూ ఆదరించారు. 151 సీట్లతో ఎవరి అండా లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేను అధికారిని కాను, సేవకుడిని అని ఆ క్షణమే చాటాడు. తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే తన శాసనాలనీ, తన మ్యానిఫెస్టో తన ఖురాను, బైబిలు, భగవద్గీత అనీ, కడుపు నిండని పేద తన దేవుడనీ నమ్మి పరిపాలన సాగించాడు.తను ఇచ్చిన వాగ్దానాలలో దాదాపు అన్నిటినీ నెరవేర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవాడు మూడు పూటలా భోజనం చేయడానికి ఆయన ప్రథమ ప్రాధాన్య మిచ్చాడు. వారి ఇంటి ముంగిటకే తీసుకువెళ్లి రేషన్ అందించాడు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభు త్వాన్ని వారి ఇంటి పక్కన నిలిపాడు. వాలంటీర్లుగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వారి ద్వారా వృద్ధులు, వికలాంగులు, పేదలు, విధవలకు పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశాడు. ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ కావడం మనందరి గర్వకారణం, అదృష్టం. రెండు సంవత్సరాలు కరోనాతో దేశం స్తంభించిపోయింది. ఆర్థికపరంగా అన్ని వ్యవస్థలూ అతలాకుతలమయ్యాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏ పథకమూ ఆగలేదు. ఏ నిరుపేదా ఆకలితో ఉండలేదు. అనేక పట్టణాలలో అభాగ్యు లకు రెండు పూటలా ఆహార పొట్లాలు అందించాడు. అందరికీ వైద్యం అందింది. ఈనాటి పాలకులు, సనాతన ధర్మ రక్షణ పరులు ఇళ్లల్లో ముడుచుకుని మూలన పడుకుంటే ప్రజలకు చేరువగా జగన్ ఉన్నాడు.ప్రమాదంలో మరణించిన వారికి దేశంలోనే మొదటి సారిగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి మరిన్ని రోగాలకు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకున్న ఆరోగ్యదాత జగన్. పేదల కోసం ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా, లక్షల ఇళ్లు నిర్మించాడు. పేద విద్యార్థులకు ఆర్థికసహాయం పథకం మరింత మెరుగు పరిచాడు. ప్రతి పేద పిల్లవాడూ చదువుకోవాలనీ, తద్వారా జీవన ప్రమాణం పెంచుకోవాలనీ ప్రభుత్వ పాఠశాలల్ని వేల కోట్లతో ఆధునీకరించాడు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాడు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెట్టాడు. పిల్లలను స్కూల్‌కు పంపితే చాలు... ఆ తల్లుల అకౌంట్లలో ఏటా రూ. 15 వేలు వేళకు ఇస్తూ, ‘అమ్మ ఒడి’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఆధునిక లాప్‌టాప్‌లు, ఆరోగ్యకరమైన ఆహారం, యూనిఫాం అందించి, పెను మార్పులు తీసుకురావడానికి కారణమయ్యాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులను చేర్చడానికి తల్లిదండ్రులు పోటీపడ్డారన్న మాట, కొన్ని పాఠశాలల్లో సీట్లు దొరకని మాట అక్షరాలా నిజం. ప్రజలు కొనియాడిన సత్యం.ధీరోదాత్తుడుదేశం మొత్తం మీద అతి తక్కువ కోవిడ్ మరణాలు జరి గింది మన రాష్ట్రంలోనే అన్నది జగమెరిగిన విషయం. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోనే ఉండాలని 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. సీట్ల సంఖ్య పెంచాడు. హైందవ ధర్మ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానాల అభివృద్ధికి అపారమైన కృషి చేసింది జగనే. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలను నేడు వారు జగన్ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతని కూటమి అనేక అబద్ధాలు ఆడాయి. జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామనీ, ఉచితాలు అందజేస్తామనీ, అసత్య ప్రచారాలు చేశాయి. ప్రజ లను ఆశపెట్టాయి, భ్రమలు కల్పించాయి. సాధ్యం కాని హామీలు అమలు పరుస్తామని అరచి, మోసం చేసి ప్రజల నోళ్లు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. నిజానికి జగన్ పథకా లకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేసుకున్నారు తప్ప మరేమీ కాదు. కొత్త పథకం ఒక్కటీ లేదు. ఇప్పుడు ఏమీ అమలపరచలేక దీనికి కారణం జగన్ అని ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రాఫిక్ మాయాజాలంతో చిటికెల పందిళ్లు వేస్తున్నాయి. మూడు నెలలకే ప్రజలు అసలు నిజం గ్రహించారు. ఓ మహా నాయకుడిని మాయ మాటల వల్ల ఓడించి ఓడిపోయామని బాధపడుతున్నారు. అన్ని వర్గాల వారూ విలపిస్తున్నారు.గతంలో ఓడిపోయిన చంద్రబాబు మూడు సంవత్సరాలు మూలన ముక్కుతూ కూర్చుంటే – ఓటమిని, ప్రజల తీర్పును, హుందాగా స్వీకరించిన జగన్ వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల కలంగా, గళంగా, బలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తున్నారు, ప్రజలను మేల్కొల్పుతున్నారు. ఐదు సంవత్సరాల పాలనలో రెండేళ్లు కరోనాకు పోయినా, అద్భుతాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజల హృదయాలలో, పేదల మనసులలో, సుస్థిర స్థానం సంపాదించుకున్న పాలకుడు. నేత అన్న పదానికి అర్థం చెప్పిన ప్రజా సేవకుడు. ఓటమికి కుంగని ధీరోదాత్తుడు. ప్రజా హృదయ గోవర్ధనమెత్తిన గోపాలుడు. వక్రబుద్ధులు, కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి జనుల కోసం స్థిరంగా నిలబడిన జననేత, అజేయుడు, అనితర సాధ్యుడు, సున్నిత మనస్కుడు, పేదల పక్షపాతి, ఆరోగ్య విద్యాదాత, ఆపన్నులకు వర ప్రదాత, సహాయానికి సహస్ర హస్తుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు, భవిష్యత్ భాగ్యప్రదాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడికి, ఆలోచనాపరుడికి అనుచరుడిగా ఉండటం, ఆయనతో కలిసి నడవడం నాకు ఇష్టం, ఆనందం, సంబరం... సమున్నత గర్వం.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
టీటీడీ ఆస్తులకు రక్షణేది?: భూమన
సాక్షి, తిరుపతి: టీటీడీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీటీడీ పవిత్ర స్థలాన్ని 7 స్టార్ హోటళ్లకు ఇవ్వడం సరికాదన్నారు. దేవుడి ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. ప్రజా సంఘాలు, హిందుత్వ సంఘాలు ఆందోళనలుచేపట్టాలని భూమన పిలుపునిచ్చారు.‘‘ఎర్ర చందనం చెట్లకు కొత్తగా నెంబర్లు వేస్తున్నారు. ఒక్కో చెట్టుకు రెండు నంబర్లు వేస్తూ మోసం చేస్తున్నారు. ఎర్ర చందనం దుంగుల్ని కాపాడతానన్న పవన్ ఎక్కడ?. ఏపీ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఒబెరాయ్ హోటల్ కి TTD భూములు.. చంద్రబాబు తీరని ద్రోహం..
-
ఇది పరకామణి చోరీ కంటే పెద్ద దోపిడి.. చంద్రబాబుపై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: తిరుమల పవిత్రతను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలం అవుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారాయన. బుధవారం తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడారు.. .. టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు. దేవస్థానం భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. అలిపిరిలో సమీపంలో అత్యంత విలువైన భూముల్ని ఇచ్చేస్తున్నారు. ఎకరా రూ.26 కోట్ల రూ.52 లక్షల ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. రూ.460 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్‌కి ఇచ్చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇది. 13వ తేదీన జీవోకూడా కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 13న జీవో.. 5న రిజిస్ట్రేషన్ చేశారు. మరి ఇంకా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సైట్లో ఎందుకు కనిపించడం లేదు?. ఎవరికి మేలు చేయడానికి రూ. 2 కోట్లు బిల్డింగ్ ఫీజుకు సర్దుబాటు చేశారు, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు. ఆ భూముల్లో భారీగా చందనపు చెట్ల ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కాకముందే చెట్లు కొట్టడం ప్రారంభించారు. ఒక బ్రాహ్మణుడు స్వామివారికి ఇచ్చిన భూమిని బాబు పందేర వేస్తున్నారు. తిరుమల పవిత్రతతను కాపాడడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. వంద గదుల హోటల్‌కు భారీ ఎత్తున భూములు కట్టబెడుతున్నారు. ప్రభుత్వం దగ్గరి భూములు ఇవ్వకుండా(రెవెన్యూ ల్యాండ్).. టీటీడీ భూములు ఎలా ఇస్తారు?. గతంలోనూ హోటల్పేరు మార్చి తతంగం అంతా నడిపించింది చంద్రబాబే. దేవుడిని దోపిడీ చేసి ఒబెరాయ్‌కు ఇప్పుడు భూములు అప్పజెప్తునారు. దేవుడి ఇనాం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు. వెంకటేశ్వరస్వామికి చంద్రబాబు చేస్తోంది అన్యాయం కాదా?..’’ అని భూమన మండిపడ్డారు. వంద రూమ్‌ల ఒబెరాయ్ హోటల్‌తో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోంది. అదెలా సాధ్యం. ఇది పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడి. దీని వల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటి?. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలోనే ఈ భూములు ఉన్నాయి. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి?.. స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వీడాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలి. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’’ అని భూమన డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: తిరుమలలో మహాపచారం.. మద్యం, బిర్యానీ ప్యాకెట్లు లభ్యం! -
‘కూటమి నేతలు తప్పు చేసి.. వైఎస్సార్సీపీపై బురదజల్లుతారా?’
సాక్షి, తిరుపతి: కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్‌పై కూటమి దాడి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని.. కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్నికల ముందు, తరువాత తిరుమల చూట్టు రాజకీయాలు చేస్తున్నారు. లడ్డూ, పరకామణి, పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్‌ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీయడానికి స్వామివారి కూటమి నేతలు వాడుకుంటున్నారు...పదిరోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు దీనికి కారణం వైఎస్సార్సీపీనే.. పదిరోజుల దర్శనం తప్పు అంటూ ప్రచారం చేశారు. లడ్డూ కేసులో ఇప్పటి వరకు రాజకీయపరమైన అరెస్టు ఒక్కటి జరగలేదు. కాని సుబ్బారెడ్డి చేశాడని అసత్య ప్రచారం చేశారు...సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషను బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2015 నుంచి 2025 వరకు పట్టు వస్త్రాల స్కాం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడటంలో పవన్ దిట్టా. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడూ జరగని అపచారాలు తిరుమలలో జరిగాయి’’ అని భూమన ధ్వజమెత్తారు. -
కోర్టు చెప్పినా వినరా.. BR నాయుడు తప్పుడు ప్రచారం
-
పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా CID విచారణ జరిగింది
-
చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు: భూమన
తిరుపతి: పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సీఐడీ విచారణ జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, మంత్రులు తప్పుడు ప్రచారం చేశారు. బీఆర్ నాయుడు, పట్టాభి, వర్ల రామయ్య అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘మీ దగ్గర ఆధారాలు ఉంటే మిమ్మల్ని విచారణకు ఎందుకు పిలవలేదు?. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారిని ఎందుకు విచారించలేదు?. చంద్రబాబును సంతృప్తి పరచడం కోసం కేవలం నన్ను మాత్రమే విచారణకు పిలిచారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకు మాత్రమే సీఐడీ అధికారులు విచారిస్తున్నారు...చంద్రబాబు ప్రభుత్వానికి సీఐడీ అధికారులు తలొగ్గారు. మమ్మల్ని నిందితులుగా నిరూపించడం కోసం ప్రయత్నిస్తున్నారు. విచారణ మొత్తం రికార్డ్ చేసి మా దగ్గర సంతకాలు తీసుకోలేదు. మా దగ్గర సంతకాలు ఎందుకు తీసుకోలేదు. చంద్రబాబుకు న్యాయస్థానాల మీద గౌరవం లేదు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వర్ల రామయ్య వ్యాఖ్యలపై భూమన అదిరిపోయే కౌంటర్
-
నన్ను పరకామణి కేసులో ఇరికించాలని చూస్తున్నారు: భూమన
-
‘పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు’
సాక్షి, తిరుపతి: పరకామణి చోరీ కేసులో వైఎస్సార్సీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సిట్ విచారణ ముగిసింది. మంగళవారం సాయంత్రం అధికారుల ఎదుట హాజరైన ఆయన్ని 25 నిమిషాలపాటు విచారించి పంపించేశారు. అయితే.. విచారణకు హాజరయ్యే ముందు, ఆ తరవాత ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణకు ముందు.. నాకు ఈ కేసుకు భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి శునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికను నింపేశాయి. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, పట్టాభిలు నన్ను కచ్చితంగా విచారణ చెయ్యాలని అధికారులపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను పిలిచారు. అయినను పోయి రావలె హస్తినకు.. ’’ అని భూమన అన్నారు. విచారణ అనంతరం.. నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని ...? 15 ఏళ్లలో శ్రీ వారికి తలనీలాలు ఎంత మంది సమర్పించారూ.. అనేవిధంగా ప్రశ్నలు వేస్తే నాకు తెలియదు. పరకామణి కేసు విషయంలో నాకు అంతే తెలుసు. పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు. నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని చెప్పి వెళ్లిపోయారాయన. -
TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి CID నోటీసులు
-
TTD మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
-
ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ మృతి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల పరకామణికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే మృతి చెందారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసి ఆయన మృతికి కారణమైన అధికారులపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ మరణానికి కారణమైన ప్రభుత్వం, పోలీస్ అధికారులతో పాటు ఆయన మీద ఒత్తిడి తెచ్చినవారందరినీ దోషులుగా చేర్చాలన్నారు.విచారణ పేరుతో సాటి పోలీసులనే వేధిస్తూ, తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ ఈ ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెర తీసిందని మండిపడ్డారు. పోలీసు అధికారుల మరణాలకు కారణమయ్యేలా జరుగుతున్న విచారణలు పోలీసు సమాజానికే అవమానకరమన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులే లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అందుకు అధికారులను పావులుగా వాడుకుంటోందన్నారు. తమపై ఎలాగైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలన్న ప్రభుత్వ కుట్రలకు ఒక అమాయక పోలీసు అధికారి బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడారు.సీబీఐతో విచారణ జరిపించాలి..‘ఈ ప్రభుత్వం చేస్తున్న అపచారాలను ప్రశి్నస్తున్న నన్ను దోషిగా ఇరికించేందుకు టీటీడీ పాలకమండలి అధ్యక్షుడి నుంచి నారా లోకేష్ వరకూ ఏ రకంగా మాట్లాడారో, ట్వీట్లు చేశారో అందరికీ తెలుసు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. సతీష్ మరణం వెనుక కారణాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి. పది రోజులుగా జరుగుతున్న సీఐడీ విచారణ తతంగం, న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా నన్ను ఇరికించడానికి జరుగుతున్న యత్నాలపై కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలి’ అని భూమన డిమాండ్ చేశారు.ఇది ప్రభుత్వ హత్యే..!‘పరకామణికి సంబంధించి రెండు నెలలుగా పత్రికల్లో వస్తున్న కథనాలతో సతీష్ కుమార్ తీవ్రంగా కలత చెందారు. వారం రోజులుగా సీఐడీ విచారణ పేరుతో తనను వేధిస్తోందని సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం నా పేరు చెప్పాలంటూ సతీష్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చి మానసిక క్షోభకు గురి చేసింది. పోలీసు అధికారుల ద్వారా రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం పన్నిన కుట్రలకు ఒక అమాయకుడు, సౌమ్యుడు, నిజాయితీపరుడైన పోలీస్ అధికారి బలైపోయారు. ఎస్పీ గంగాధర్, డీఎస్పీలు వేణుగోపాల్, గణపతి అత్యంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.పరకామణి కేసును విచారిస్తున్న అధికారులు న్యాయమూర్తి ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. రౌడీలు, గూండాల తరహాలో పచ్చి బూతులు తిడుతూ విచారణ ఎదుర్కొంటున్న వారిని వేధిస్తున్నారు. ఏ అర్హత లేని లక్ష్మణ్ రావు అనే క్రిమినల్ కూడా విచారణలో పాల్గొని సతీష్ కుమార్‌ను బండ బూతులు తిట్టాడు. తన పై అధికారి సీవీఎస్వీ నరసింహ కిషోర్ చెప్పడం వల్లే రాజీకి వెళ్లానని అధికారులకు సతీష్ కుమార్ చెప్పారు’ అని భూమన చెప్పారు. -
పవన్ తిరుపతి పర్యటనపై భూమన సెటైర్లే సెటైర్లు
-
కొత్తగా అందుకున్న అధికార ఉత్సాహం పవన్ వ్యాఖ్యలకు భూమన అదిరిపోయే కౌంటర్
-
బీఆర్ నాయుడు వచ్చాకే తిరుమల గోశాల నిర్వీర్యం: భూమన
సాక్షి, తిరుపతి: బీఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోషాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన తప్పే కదా? అని భూమన ప్రశ్నించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయం బోర్డు దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడే స్వయంగా చెప్పారు. గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని వేసి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామంటున్నారు. సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణపై, గోవుల మరణాలు జరుగుతున్నాయని చెప్పాను. దానికి నా మీద కేసులు పెట్టారు.అందుకు బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డిని నాపై ఉసిగొల్పారు. గోశాలపై వ్యాఖ్యలు చేసిన మీకు కూడా ఈ కేసులే వర్తిస్తాయి. నా మీద పెట్టిన కేసులో మీ మీద కూడా పెట్టాలి. దాదాపు 70ఏళ్ల టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాలను బీఆర్ నాయుడు టీటీడీ అధ్యక్షులు అయిన తర్వాత నిర్వీర్యం చేస్తున్నారు. గోశాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనే తప్పే కదా?. మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరు, గోశాలను సరిగ్గా నిర్వహించలేరు. తిరుమలలో ఏం జరుగుతుందో యావత్ ప్రపంచానికి నా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. దానికి మీరు పెట్టిన కేసులన్నీ కూడా నన్ను భయపెట్టడానికి పెట్టినవే తప్ప మరొకటి కాదు. ఇలాంటి తప్పులు ఎన్ని మీరు చేసినా ఆ తప్పుల్ని ఎత్తి చూపటమే ఒక పూర్వ అధ్యక్షునిగా నా బాధ్యత. తిరుమలలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను అని వ్యాఖ్యలు చేశారు. -
‘టీటీడీ ఒత్తిడికి ఆగమశాస్త్ర సలహాదారులు తలొగ్గారు’
తిరుపతి: తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని రెండు రోజులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తప్పుబట్టారు. గత వైఎస్సార్సీపీ హయాంలో వైకుంఠ ఏకాదశి దర్శనాన్ని 26 మంది పీఠాధిపతుల ఆగమ సలహాల మేరకు 10 రోజుల దర్శనం ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని రెండు రోజులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. ఆ రోజు పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తం 32 మంది ప్రముఖులతో చర్చించిన తర్వాతనే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం 10 రోజులపాటు ఉండే విధంగా ఏర్పాటు చేశామన్నారు.2020లో జగన్ సీఎంగా ఉండగా పదిరోజులు పాటు వైకుంఠ ఏకాదశి పదిరోజులు దర్శనం అందుబాటులోకి తీసుకువచ్చాం. కృష్ణ మూర్తి వైద్యనాధన్ అప్పుడు బోర్డు సభ్యులు ఆనాడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. శృంగేరీ మఠం, ఆండవాన్ వన్ మఠం, త్రిదండి ,ఉత్తరాది, వ్యాసారాజ మఠం, పేజావర్ మఠం, అహోబిల మఠం పీఠాధిపతులు సూచనలు సలహాలు తీసుకునే ఈ నిర్ణయం ఆనాడు తీసుకున్నాం. ద్రావిడ సంప్రదాయం అంటూ కొత్తపల్లవి అందుకున్నారు. 12 మంది ఆళ్వారులు స్వామి వారిని కీర్తి, నారాయణ దివ్య ప్రబంధంగా ఇప్పటికీ నిరంతరం కొనసాగుతున్న పక్రియ. ద్రావిడ సంప్రదాయం కొనసాగించవద్దు అని వితండ వాదం చేస్తున్నారు ప్రస్తుత టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత ఏడాది 6మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, మీ పరిపాలన లోపం వల్ల జరిగింది. తిరుమలలో 10 సార్లు, 12 సార్లు ఏడాదికి జరిగేవి, కాలానికి అనుగుణంగా పూర్వ కాలం నిర్ణయాల్లో మార్పులు వచ్చాయి. మీ నిర్ణయం వల్ల 10 లక్షల మందికి వైకుంఠ ఏకాదశి దర్శనం దూరం చేస్తున్నారు. మీ ఒత్తిడి వల్లే ఆగమ శాస్త్ర సలహాదారులు తలొగ్గారు, రెండు రోజులకు తగ్గించాలనే అలోచన మానుకోవాలి. స్థానికులకు దైవ దర్శనం దూరం చేయాలని చూస్తున్నారు, నాలుగేళ్లు పదిరోజులు పాటు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం లక్షలాది మందికి మేము సమర్ధవంతంగా నిర్వహించాము. శ్రీరంగం తరువాత తిరుమల లో పదిరోజులు పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అందుబాటులోకి తీసుకు వచ్చాం. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్న ఈవోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. శ్రీరంగం ద్రావిడ సంస్కృతి అంటూ తెరపైకి తీసుకు వస్తున్నారు. రెండు రోజులకే కుదించాలని చేస్తున్న కుట్ర మానుకోవాలి. రెండు రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్వనం 110 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే’ అని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. -
నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన
సాక్షి, తిరుపతి: తాను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదని.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ‘‘11.04.25న మీడియా సమావేశంలో గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయని నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా’’ అని భూమన స్పష్టం చేశారు.‘‘గోవుల పట్ల నిర్లక్ష్యంగా తగదని నేను మాట్లాడాను. పోలీస్ విచారణకు పిలిచారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండ అసభ్య పదజాలంతో కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. నేను వాస్తవాలు చెబితే సమాధానాలు ఇవ్వడం లేదు. వాళ్ల మీడియాలో నాపై విష ప్రచారం చేస్తున్నారు. మీ చేతిలో అధికారం ఉంది. విచారణ చేయించాలి కదా?’’ అంటూ భూమన ప్రశ్నించారు. -
చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు.. భూమనకు నోటీసులు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి ఎస్వీ వర్శిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు. -
బీఆర్ నాయుడు ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది
-
శ్రాద్ధకర్మల రోజు వేద ఆశీర్వచనమా?: టీటీడీ చైర్మన్‌పై భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: శ్రీవేంకటేశ్వర స్వామికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తీరని ద్రోహం చేస్తున్నారని.. ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అదనపు జేఈవో వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య పెద్దకర్మకు వెళ్లి బీఆర్ నాయుడు పరామర్శించిన తీరు.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామంపై సోమవారం తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీఆర్ నాయుడి మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. కానీ, ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకంగా ఉంటోంది. పవిత్ర భాగవత వస్త్రాన్ని కర్మ రోజు వెంకయ్య చౌదరికి కప్పారు. పరివట్టం కట్టి, లడ్డూ శ్రాద్ధకర్మల రోజు వెంకయ్య చౌదరికి అందించారు. శ్రార్దకర్మల రోజు వేద ఆశీర్వచనం ఇవ్వడమేంటీ?. ఎప్పుడు ఎలా ఉండాలో.. ఏ వస్త్రం కప్పాలో కూడా బీఆర్ నాయుడికి తెలియదు. వధువు, విదవకు తేడా తెలియని వ్యక్తి బీఆర్ నాయుడు’’ అని భూమన అభ్యంతరాలు వ్యక్తం చేశారు... ప్రసాదాల దిట్టం పెంచడం లేదని ఎల్లో మీడియాలోనే వార్త వచ్చింది. రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి స్వామివారిని వాడుకుంటున్నారు. జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థపై తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రభస చేశారు. మరి ఆ సంస్థలో బీఆర్ నాయుడు భాగస్వామిగా ఉన్నారా? శ్రీ వెంకటేశ్వర స్వామికి బీఆర్ నాయుడు ద్రోహం చేస్తున్నాడు. ఆలయ పవిత్రతతను ధ్వంసం చేస్తున్నారు. అర్హత లేనివారికి అధికారమిస్తే అర్థరాత్రి గొడుగు పట్టకోమన్నాడట.. అలా ఉంది బీఆర్ నాయుడి తీరు అని భూమన ఎద్దేవా చేశారు.వైసీపీ పోరాటం వల్లే..ఏపీలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తీ మద్యమే(AP Liquor Mafia). కూటమి పాలనలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ, జనసేన నేతలు ఈ దందాను నడిపిస్తున్నారు. నకిలీ మద్యాన్ని టీడీపీ నేతలు పల్లెపల్లెకూ పంపించారు. ప్రతిచోటా ఏదో కుటీర పరిశ్రమలా.. నకిలీ మద్యం కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. పైగా లిక్కర్ కేసు అంటూ మాపై అసత్య ప్రచారం చేశారు. మా నేతలను జైల్లో పెట్టారు. చివరకు మా పోరాటం వల్లే ములకలచెరువు మద్యం ఇష్యూ బయటపడింది అని భూమన అన్నారు. -
Bhumana Karunakar Reddy: నడిచి వస్తుంటే ఒక యుద్ధ వీరుడు కనిపించాడు..
-
Bhumana: పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప
-
‘డిజిటల్ బుక్‌లో ఫిర్యాదులు, వీడియోలు రికార్డ్ అవుతున్నాయి’
సాక్షి, చిత్తూరు: ఏపీలో చంద్రబాబు అన్యాయ పాలన చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఓట్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.చిత్తూరులో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన పుంగనూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..‘ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా వైఎస్ జగన్ పాలన సాగింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. రాబోయే వైఎస్ జగన్ పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది. మీ పాత్ర ప్రత్యక్షంగా ఉంటుంది. జగన్ చేసే యజ్ఞంలో మనం క్రియాశీలక పాత్రదారులం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కానీ, వైఎస్ జగన్.. ప్రజల సంక్షేమం లక్ష్యంగా పాలన చేశారు. టీడీపీ కమిటీలు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాయి. జగనన్న సైనికులు అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరు పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఉన్నాము అని చెప్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మనకు 18 లక్షలు మంది క్రియాశీలక సైన్యం ఉంది. ఎల్లో మీడియా, సోషల్ మీడియా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. మన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాటిని అడ్డుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం, అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను మన సోషల్ దీటుగా ఎదుర్కొంటోంది. వ్యక్తిగతంగా దాడికి రెడ్ బుక్ ఉపయోగించారు.మనం డిజిటల్ బుక్‌ను లాంచ్ చేశాం. కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనే దానికి ఇది గుర్తు. ఫిర్యాదులు వస్తున్నాయి, వీడియోలు రికార్డు చేస్తున్నాం. డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నమోదు చేయవచ్చు. చట్టబద్ధంగా వారిని శిక్షించేందుకు ఇది ఉపయోగ పడుతుంది. ప్రతీ ఒక్కరికి పార్టీ గుర్తింపు కార్డులు అందిస్తాం, టెక్నాలజీ వాడుకుని ముందు వెళ్తున్నాం. అన్యాయమైన పాలన చంద్రబాబు సాగిస్తున్నారు. ఓటర్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ కార్యకర్త, నాయకులు అప్రమత్తంగా ఉండాలి, బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలి. నిర్మాణాత్మకమైన పార్టీగా, సంస్థాగతంగా సిద్ధం చేస్తాం. రాబోయే 30 ఏళ్లలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నాం. ప్రత్యర్థులను వణుకు పుట్టించేలా ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సమావేశానికి హాజరయ్యారు. బీటలు వారిన కోటలు టీడీపీ అని వ్యాఖ్యలు చేశారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామ కమిటీలకే పూర్తి బాధ్యత, రాబోయే ఐదేళ్లు వీరికే బాధ్యత అప్పగిస్తామన్నారు.భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అన్ని కమిటీలు నియమించిన మొట్టమొదటి నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత. జగనన్న మాటగా మీరు గ్రామస్థాయిలో తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది.ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగనివ్వను. కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత అని జగనన్న చెప్పారు. ఈసారి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని హామీ ఇచ్చారు. -
Bhumana: తిరుమలలో చంద్రబాబు ఆయనను ఆయన పొగుడుకోవడమే సరిపోయింది
-
‘బాబూ.. ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు డబ్బులు మీ ఇంటికి వస్తున్నాయా?’
సాక్షి, తిరుపతి: చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పదిరూపాయలు రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి ట్రస్టు విషయంలో చంద్రబాబు గతంలో విషం చిమ్మారు.. ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘శ్రీవాణి ట్రస్ట్ అవినీతి అంటూ, ట్రస్ట్ డబ్బులు తాడేపల్లికి వెళ్ళాయి అంటూ విష ప్రచారం చేస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్‌కు పనులు చేయడం మాత్రమే తెలుసు. దేశం అంతా దేవాలయాలు నిర్మాణం చేయాలని, ప్రత్యేక దర్శనం ద్వారా దర్శనాలు ఇవ్వాలని చూశారు. చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు పది రూపాయలు కూడా రాలేదు. వైఎస్ జగన్ పాలనలో శ్రీవాణి 2019 నుంచి ఇప్పటి వరకు 2038 కోట్లు జమ అయ్యాయి. అది జగన్ వల్లే జరిగింది.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశం అంతా ఆలయాలు నిర్మించండి అని చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు. 3500 ఆలయాలు వైఎస్ జగన్ పాలనలో పూర్తి అయ్యాయి. అందులో 300 ఆలయాలు జీవోద్ధరణ చేయించారు. ఇప్పుడు పాలన ఉండి ఉంటే దేశ వ్యాప్తంగా లక్ష గుళ్లు నిర్మాణం జరిగి ఉండేది. మరి.. ఇప్పుడు శ్రీవాణి నిధులు అన్ని చంద్రబాబు ఇంటికి వస్తున్నాయా?. శ్రీనగర్, ముంబై, భువనేశ్వర్, విశాఖలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మాణం చేశాం.నాడు శ్రీవాణి ట్రస్టుపై విషం చిమ్మారు.. ఇప్పుడు అదే ట్రస్ట్ గురించి మీరు పొగుడుతున్నారు. చంద్రబాబు.. మీ మాదిరిగా వైఎస్ జగన్ రంగనాయకుల మండపం గురించి చెప్పుకోలేదు. గుడి లోపల ఏఐ టెక్నాలజీ వాడటం ఆగమ శాస్త్రం విరుద్ధం. మీరు చెప్పినట్లు చేస్తే సంతృప్తికర దర్శనం అనేది దుర్లభం. అమరావతి గ్రాఫిక్స్ మాదిరే ఆదిదేవుడిని గ్రాఫిక్స్‌లో చూపించాలని చెప్పదలుచుకున్నారా?. వైఎస్ జగన్ చేసిన మంచిని అంగీకరించండి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఆయన కార్యాలయంలోనే బూతులు మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. శ్రీవాణి ట్రస్ట్ రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు.20 ఏళ్ల ముందే బాలకృష్ణకు పిచ్చి పట్టింది అని ఆయన బావగారు పుస్తకంలో రాశారు. ఆయన బావగారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసుకొచ్చారు. బాలకృష్ణకు కృతజ్ఞత ఉంటుంది అనుకున్నా. దివంగత నేత వైఎస్సార్ ఆనాడు బాలకృష్ణకు సాయం చేశారు. బాలకృష్ణ తప్పతాగి మాట్లాడారు అని ఘాటు విమర్శలు చేశారు. -
అమృత కలశంలో అభాండాల విషం
ప్రజలకు నిశ్శబ్దంగా సేవ చేసేవారు ఒకరు. సేవ చేస్తున్నాము అని పెద్దగా అరుస్తూ ప్రకటించుకునేవారు మరొకరు. కొండంత చేసినా గోరంత కూడా చెప్పుకోని సంస్కారం ఒకరిది. గోరంత కూడా చేయకుండానే కొండంత చేశామని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పత్రికా ప్రక టనలు ఇచ్చుకునే దగాకోరు సంస్కారం మరొకరిది. మొదటి వారు మాజీ ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, మరొకరు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి ప్రభుత్వం అని ప్రత్యేకంగా చెప్పకపోయినా అందరికీ తెలుసు. అయినప్పటికీ – అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల ఆరంభ సందర్భంలో పలు వాస్తవాలను మరొక్కసారి మీ ముందు ఉంచుతున్నాను.బాబుది అదే నీతి, అదే రీతి!తన అయిదు సంవత్సరాల పాలనలో హిందూ ధర్మానికి, హైందవ ధర్మ ప్రచారానికి, ధర్మ రక్షణకు జగన్మోహన్రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. కాని ఆయన ప్రచారం కోరుకోలేదు. కరోనా కాలంలో ప్రపంచంలోని ప్రతి వ్యవస్థా స్తంభించి పోయింది కాని, రాష్ట్రంలో ఏ హిందూ దేవాలయంలోనూ పూజలు ఆగలేదు, జగన్ ఆగనివ్వలేదు. అధికారంలో ఉన్నపుడు వందల ఆలయాలు కూల్చిన చంద్రబాబు, దైవ పూజను కాలికి బూట్లు తీయకుండానే చేసే చంద్రబాబు; సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టి, శాలువా కప్పుకుని మైకు ముందు ఊగితే చాలు అనుకునే ‘పవన’స్వామి... జగన్ పాలనలో హైందవ ధర్మానికి ఏదో అన్యాయం జరిగిందని అరుస్తున్నారు. మల మూత్రాలు, మద్యమాంసాల మధ్య సాక్షాత్తు మహావిష్ణువు విగ్రహం పడి ఉందయ్యా అంటే, ఆ తప్పును గుర్తించి సరిచేసుకోక, చెప్పిన వాడిది తప్పు. వెంటనే జైల్లో పెట్టండి అని పోలీసులను పురమాయిస్తున్నారు. అబద్ధాలు చెప్పే వాడికి అందలాలు, నిజం చెప్పే వాడికి అరదండాలు వేయడం అన్నది ఆది నుంచీ చంద్రబాబు నీతి, రీతి!హైందవ ధర్మానికి స్వర్ణయుగంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలం వేద సంస్కృతికీ, హైందవ ధర్మానికీ స్వర్ణయుగం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాలన, జగన్ మోహన్‌రెడ్డి పాలన చిరస్మరణీయం అన్నది ప్రజావాక్కు. గత అయి దేళ్లు ప్రతి పక్షంలోనూ, ఇపుడు ప్రభుత్వంలోనూ చంద్రబాబు చేస్తున్న ఒకే ఒక్క పని... జగన్‌ను తిట్టడం! జగన్ చేసిన మంచి పనుల మీద బకెట్లతో కాక ఓ నదీ ప్రవాహంలా విషాన్ని చల్లడం! హిందూధర్మం మరింత వెలిగింది, తిరుమల తిరుపతి దేవస్థానం దేదీప్యమానమైందీ నిస్సందేహంగా జగన్ వల్లనే, ఆయన పరిపాలనా కాలంలోనే! తిరుమలలో ‘శ్రీవాణి ట్రస్టు’ ద్వారా స్వామి వారి దర్శనానికి అంకురార్పణ చేసింది జగనే. తద్వారా శ్రీవారి శీఘ్ర దర్శనం, దేశవ్యాప్తంగా శి«థిలమై ఉన్న హైందవ దేవాలయాల పున రుద్ధరణ జరిగింది. బాబుకు అది అర్థం కాక ‘శ్రీవాణి ట్రస్టు’పై అనేక ఆరోపణలు చేశారు. చేయించారు. తాను అధికారంలోకి వస్తే శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తామని ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు రద్దు మాటఅటుంచి, మరిన్ని ఎక్కువ టికె ట్లను అమ్ముతున్నారు. ఆలయాలలో దీపాలు వెలిగించి ఆరాధించిన వారు జగన్. విస్తరణ పనుల పేరుతో వందల ఆలయాలను కూల్చిన మనిషి చంద్రబాబు. ఎవరు నిజమైన హైందవ ధర్మ రక్షకులు? ఇప్పుడేదీ గో సంరక్షణ?!జగన్ హయాంలో దేవస్థానం గోశాల సంరక్షణ జరిగింది. గోవులు ఆరోగ్యంగాను, ఆనందంగాను ఉన్నదీ అప్పుడే. గో సంత తిని మరింత అభివృద్ధి చేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాల కింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు,ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకురావడం జరిగింది. వాటి సంరక్షణకు, సంతతికి వృద్ధికి పక్కా ప్రణాళికలు తయారుచేసి అమలు చేయడం మొదటిసారి జరిగింది. తెలుగు రాష్ట్రాలలోని వివిధ గోశాలలను గుర్తించి అనేక గోశాలలకు మేత, నిర్వహణ వ్యయం అందించింది జగనే. ఈ కూటమి ప్రభు త్వంలో, ఈ ధార్మిక మండలి పాలనలో దేవస్థానం గోశాలలో ఎన్ని గోవులు ఆకలితో, అనారోగ్యంతో మరణించాయో అందరికీ తెలుసు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారు నవనీత ప్రియుడు. అందుకే నిత్యం ఆయనకు నవనీత సేవ జరుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ అత్యంత యాంత్రికంగా జరిపేవారు. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్. ప్రతినిత్యం శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగ చిలికించి, వెన్న తీసి అప్పుడే తీసిన నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించడం ఎంత ధార్మిక కార్యం!వేదంలా ఘోషించిన అలిపిరితిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను ఆహ్వానించాం. వేద వ్యాప్తికి, రక్షణకు, హైందవ ధర్మ పరిరక్షణకు అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం చేయదగ్గ కార్యక్రమాలు ఎన్నో వారు వివరించారు. ఈ ఘనత జగన్‌ది కాదా? వేదమూర్తి, వేద స్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేదఘోష వినిపించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హెూమం ప్రారంభించాం. యువత వక్రమార్గం పట్టకుండా సక్రమ మార్గంలో సరైన హిందువుగా జీవించాలని శ్రీవారి గోవింద కోటి రాసినవారికి శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాం. గోవిందనామ కోటి రాసి ఆలయ సంబంధిత అధికారికి అందజేస్తే వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా శ్రీవారి బ్రేక్ దర్శనం లభించేలా చేశాం. వంద కీర్తనలకు బాణీలువేదాలు, పురాణాలు అందరికీ అర్థం అయ్యే భాషలో ముద్రించ డానికి ప్రత్యేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. గతంలో నేను దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే వ్యాఖ్యానంతో, ప్రతి పదార్థంతో కూడిన భారతాన్ని, భాగవతాన్ని ముద్రించాం. దేవ స్థానం గ్రంథాలలో అత్యంత అధికంగా అమ్ముడు పోతున్నవి అవే. సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేల సంకీర్తనలు రచించారు. అందులో కేవలం పదివేల కీర్తనలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఎస్.వి. భక్తి ఛానల్, ఇతర పండి తులు, సంగీతకారుల సహాయంతో నూతనంగా దాదాపు 100 కీర్తన లకు బాణీలు కట్టించి వెలుగులోనికి తెచ్చాం. ఆంజనేయస్వామి జన్మస్థలం మీద ప్రజలలో అనేక వాదాలు, అపోహలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని పండిత పరిషతు ఏర్పాటు చేశాం. వారు వేలాది గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు, భౌగోళిక అంశాలు పరిశీలించారు. ఆంజనేయుని జన్మ స్థలం తిరుమలలోని అంజనాద్రి అని నిర్ధారించారు. ఆ ప్రాంతంలో బాల ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశాం. జీవన భృతికి పారాయణంరాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, గిరిజన తండాలకు చెందిన వారికి శ్రీవారి బ్రహ్మోత్సవాలలోను, వైకుంఠ ఏకాదశి సందర్భంగాను ఉచిత దర్శనం కల్పించాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వేదం వినిపించాలనే, బ్రాహ్మణ కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే మహత్తర సంకల్పంతో 700 మందికి పైగా వేద పారాయణ దారులను నియమించాలని సంకల్పించాం. దాని ద్వారా 700 పేద బ్రాహ్మణ కుటుంబాలకు జీవన భృతి ఏర్పడుతుంది. గ్రామ గ్రామాన వేదం వర్ధిల్లి, ధర్మరక్షణ జరుగుతుంది. కాని ఈ కూటమి ప్రభుత్వం, ఈ ధర్మకర్తల మండలి ఈ నియామకాలకు అడ్డుపుల్ల వేసింది. సనాతన ధర్మరక్షణ కంకణాబద్ధుడైన ‘పవనానందుడు’ దీనిపై మాట్లాడకపోవడం, 700 మంది పేద బ్రాహ్మణ కుటుంబాల నోరు కొట్టడం ఏ ధర్మరక్షణో ఆయనే చెప్పాలి.కూటమి వచ్చాక నత్తనడకతిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగులకు సైతం ఇంటిస్థలాలు ఇచ్చి తీరాలన్నది జగన్ సంకల్పం. నేను రెండవసారి అధ్యక్షుడిగా ఉండగా ప్రభుత్వం నుంచి దాదాపు 1200 ఎకరాల స్థలం తీసుకొని తి.తి.దే విశ్రాంత ఉద్యో గులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాం. తి.తి.దే.లోని కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగుల జీతం 5 వేల నుంచి 20 వేల వరకు పెంచి వారి కుటుంబాలకు ఆనందం పంచాం. 2021లో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల నిమిత్తం రూ. 320 కోట్లతో పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తలపెట్టాం. అత్యవసరంగా పూర్తి చేయవలసిన ఆ పను లను ఈ కూటమి ప్రభుత్వం నత్తనడక నడిపిస్తోంది. రాయలసీమ ప్రజలందరికి అందుబాటులో ఉన్న అత్యా ధునిక వైద్యశాల ‘స్విమ్స్’ ఆధునికీకరణకు గాను రూ. 200 కోట్లు మంజూరు చేశాము. న్యూరాలజీ, కార్డియాలజీ విభా గాలకు ప్రత్యేక భవనాల నిర్మాణం ప్రారంభించాం. మాట తప్పని మనిషి జగన్జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలోని స్థానికులు గుండె మీద చేయి వేసు కుని హాయిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారికి ప్రతీది సమస్యే. వారిపై ప్రతి ఒక్కరూ ఆధిపత్యం చలాయించేవారే. మొదటిసారి కరోనా వచ్చినపుడు తిరుపతి వీధుల్లో వేలమంది కూలీలు, అనాధలు, చిరు వ్యాపారులు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారు ఆకలికి అల్లాడుతూ రోడ్డుమీద మిగిలి పోయారు. జగన్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిత్యం రెండు పూటలా దాదాపు 50 వేల ఆహార పొట్లాలు అందించి వారిని ఆదుకున్నాం. ఆకలి విలువ తెలిసిన, మాట తప్పని మనీషి జగన్. వాలంటీర్లకు జీతం రెట్టింపు చేస్తా అని వాగ్దానం చేసి, గెలిచాక మొండిచేయి చూపిన మోసపూరిత స్వభావి చంద్రబాబు. మనసున్న మనిషిగా, హైందవ ధర్మరక్షణ కార్యకర్తగా జగన్ చేసిన వేలాది కార్యక్రమాలు ఆయన చెప్పుకోలేదు. కానీ జనం మరచి పోలేదు. ఏమి చేయకుండానే ఎగిరెగిరి పడడం, అవతలి వారు చేసిన మంచికి మసి పూయడం చంద్రబాబు లక్షణం. అసత్య ప్రచారాలకు మీడియాను వాడుకోవడానికి హైందవ ధర్మక్షేత్రానికి ‘అసభ్యభాషా పద పండిత పంచ శస్త్రుడిని‘ అధిపతిని చేశారు. చివరికి దేవుడినీ, దేవుడి ప్రసాదాన్నీ తన అసత్యాలకు బాసట చేయాలనుకున్నారు. న్యాయస్థానం అక్షింతలు వేసినా దులుపుకుపోతున్నారు.గారడీని నిజమనుకుని, మాటల వలకు చిక్కి, సనాతన ధర్మరక్ష కుడి ఊపుల నటనకు ఊతం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కాదనుకు న్నామని ఈ రోజు రాష్ట్ర ప్రజలు రోదిస్తున్న మాట సత్యం. ఈ సంద ర్భంగా మహాకవి దాశరథి వాక్యాలు మరోసారి స్మరించుకుందాం.‘‘మంచితనము కలకాలం నిలచి యుండును వంచన ఏనాటికి నశించి తీరును’’భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
తిరుమలను కూటమి నేతలు రాజకీయ స్వార్ధంగా వాడుకుంటున్నారు
-
‘జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్.. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు’
సాక్షి, తిరుపతి: తిరుమలను కూటమి నేతలు రాజకీయ స్వార్థాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్సార్సీపీ హయాంలోనే రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సయమంలో పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను అని సవాల్ విసిరారు. అలాగే, జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు అంటూ ఎద్దేవా చేశారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ హయాంలో రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నాం. మా పాలనలోనే రవి కుమార్ దొంగతనం బయటపెట్టాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రవి కుమార్ చోరీ చేశాడు. రవి కుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులు టీటీడీకి ఇచ్చారు. రవి కుమార్ అనే దొంగను చంద్రబాబు ప్రభుత్వం పట్టుకుందా?. కొట్టేయాలని అనుకున్న వారు దొంగను పట్టుకుంటారా?. దమ్ముంటే, ధైర్యముంటే విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలి. రవి కుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్నాయి. మా బినామీలకు ఆస్తులు రాసి ఇచ్చి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలి. మంత్రి ఆనం సమాధానం ఇచ్చాక కూడా ఆ నివేదిక ఎందుకు బయటకు రాదు?. ఆ నివేదికకు సంబంధించి చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది.జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు. నేను ఉన్నప్పుడు పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను. దమ్ముంటే సీబీఐ చేత విచారణ చేయించండి. నిజాలు నిగ్గు తేలాలి అంటే సీబీఐ చేత విచారణ చేయించాలి. సీబీఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. పరకామణిలో ఏం జరుగుతుందో సీసీ ఫుటేజీ ద్వారా బయటపెట్టాలి. కూటమికి తాబేదార్లుగా ఉన్న అధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావు. చంద్రబాబు హయాంలో కొట్టేసిన స్వామి వారి నిధులను మేం ఆ దేవదేవుడికి రాయించాం. కోడిగుడ్డు మీద ఈకలు పీకడాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలి. బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి అడుగడుగునా తప్పులే జరుగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన సీసీ కెమెరాలు పుటేజ్ బయట పెట్టాలి. లడ్డు విషయంలో జరిగిన తరహాలో సీబీఐ విచారణ జరిపించాలి. వందల కోట్లు మేము అవినీతికి పాల్పడ్డామని మాపై నిందలు వేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తాము అని చెప్పిన బీఆర్ నాయుడు ఇది చాలా మంచి స్కీమ్ అని మెచ్చుకున్నారు. 22-07-2025 రోజున శ్రీవాణి టికెట్ల ధరను రూ.2వేలకు పెంచడానికి తీర్మానం చేశారు. భగవంతుడిని అడ్డు పెట్టుకుని వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నారు. పరకామణిలో ఏం జరుగుతుందో నిరంతరం చూపించాలి. వీఐపీ దర్శనాలు తగ్గిస్తున్నామని చెప్పి, ఇంకా పెంచుతూ పోయారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
నీ టీవీ5 లోనే చర్చకు సిద్ధం.. BR నాయుడికి భూమన సవాల్
-
4 గంటల పోలీస్ విచారణ.. భూమన రియాక్షన్
-
‘బీఆర్ నాయుడు చేతగానితనం వల్లే టీటీడీలో అక్రమాలు’
సాక్షి,తిరుపతి: టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు చేతకానితనం వల్ల తిరుమలలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్‌రెడ్డి ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర రెడ్డిపై తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి అక్రమ కేసు నమోదైంది. ఆ అక్రమ కేసుపై భూమా అభినయ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడు భూమన కరుణాకరరెడ్డిపై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. వరుస వైఫల్యాలకు కారణం విజిలెన్స్ అధికారుల వైఫల్యమే. మీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు చేతకానితనం వల్లే టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. మీ తప్పుడు కేసులకు భయపడే వ్యక్తి కాదు భూమన కరుణాకర్‌రెడ్డి. మీ తప్పులు సవరించుకోవాలి, మీరు మాపై ఎదురుదాడి చేస్తే చూస్తూ ఊరుకోం. ప్రజా గొంతు నొక్కేప్రయత్నం చేస్తున్నారని’ ధ్వజమెత్తారు. -
శ్రీ మహావిష్ణు విగ్రహామే.. బెదిరిస్తే భయపడేటోన్ని కాదు: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని.. అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. అలిపిరి వద్ద స్వామివారి విగ్రహానికి అపచారం జరిగిన పరిణామంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగింది. అది చెబితే నాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఆది శ్రీవారి విగ్రహం కాదని.. శనీశ్వర విగ్రహం అని అంటున్నారు. శిల్పి చెక్కి పడేశాడని నిరక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుంది?. శని విగ్రహానికి విల్లు, బాణం ఉంటుంది. కాబట్టి.. అది ముమ్మాటికీ శ్రీ మహావిష్ణువు విగ్రహమే. నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఏడాదిన్నర కాలంగా మీరు ఏమి చేస్తున్నారు?. వైఖానస ఆగమ సత్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే దైవానుగ్రహంతో బోర్డు సభ్యులయ్యాం అని మీరు చెప్పుకుంటున్నారు. అదే స్వామివారి అనుగ్రహంతో రెండుసార్లు చైర్మన్, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యాను నేను. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినా వాస్తవాలే చెబుతుంటాను నేను. హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని. కాబట్టి నాపై ఎన్నిసార్లు.. ఎంత దుష్ప్రచారం చేసినా ఎవ్వరు నమ్మరు. రాజకీయాలు కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం. నేను నాయకుడ్ని కాదు.. స్వచ్ఛమైన హిందువును అని భూమన ఉద్ఘాటించారు. -
Bhumana Karunakar Reddy: తిరుమలలో దారుణం.. మలమూత్రాల మధ్య శ్రీమహా విష్ణువు విగ్రహం
-
కూటమి వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది: భూమన కరుణాకర్ రెడ్డి
-
వైద్య రంగంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం: భూమన
సాక్షి, తిరుపతి: విద్య, వైద్యానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మేలు చేసేందుకే వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నారు. వాటిని ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.‘‘తిరుపతిలో నిలోఫర్ ఆసుపత్రికి మిన్నగా టీటీడీ శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తీసుకువచ్చారు. 2021లో చిన్నపిల్లల హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించారు. అపోలో హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి గుండె మార్పిడి పరికరాలు అందుబాటులోకి తెచ్చాం. 2021 అక్టోబర్ 3 నుంచి ఇప్పటికీ వరకు మూడువేలకు పైగా ఓపెన్ హార్ట్స్ సర్జరీలు, 15 గుండె మార్పిడి ఆపరేషన్లు చేశారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలో 15 గుండె మార్పిడులు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో 5 గుండె మార్పిడి ఆపరేషన్లు మాత్రమే చేశారు. ఏడాదిన్నర కాలంలో వెయ్యి ఆపరేషన్లు పూర్తి చేయలేదు’’ అని భూమన మండిపడ్డారు.‘‘80 శాతం పైగా శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు తిరుపతిలో పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది. 20 శాతం పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయలేకపోయారు. 15 విభాగాలలతో శ్రీపద్మావతి చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణం, రాయలసీమకి తలమానికమైన స్విమ్స్ ఆసుపత్రికి రూ.200 కోట్లతో మూడు దశల్లో పనులు చేపట్టాం. క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం, పీజీ హాస్టల్ భవనం, రుయాలో డయాగ్నోసిస్ బ్లాక్‌కు నూతన భవనాలు నిర్మించాము..న్యూరాలజీ, కార్డియాలజీ బ్లాక్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్విమ్స్ ఆధునీకరణ అవసరం లేదన్నారు. 18 పద్మావతి కాలేజీల హాస్టల్ బ్లాక్ కూడా పనులు నిలిపి వేసింది. వైఎస్ జగన్ పాలనలో మూడువేల మందికి చిన్నారులకు శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా పునర్జన్మ ఇచ్చారు.’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
Bhumana: తిరుమల అంటే TV5 ఆఫీస్ కాదు ఇదేం పని నాయుడూ
-
అది శ్రీవారి ఆలయమా?.. టీవీ5 కార్యాలయమా?: భూమన
సాక్షి,తిరుపతి: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి అన్నీ వివాదాలే నెలకొంటున్నాయని.. తప్పులను ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనునిత్యం ఏదో ఒకటి అపచారం జరుగుతున్నాయి. ప్రశ్నించి మాపై వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. చంద్ర గ్రహణం రోజున మహాద్వారం మూసి వేసిన తర్వాత ఇత్తడి గ్రిల్ గేటు తాళాలు వేస్తున్నారు. టీవీ5 శ్రీవారి ఆలయమా..టీవీ5 కార్యాలయమా?.బీఆర్ నాయుడు సైన్యంలో ఒకరు తాళం వేస్తున్నారు. ఇది దేనికి సంకేతం.ఇది చాలా తప్పిదం. బోర్డు సభ్యుడు మహాద్వారం వద్ద పెద్ద గొడవ జరిగింది.మీ సైన్యంలో ముఖ్యుడు శ్రీవారి ఆలయంలో కులశేఖర పడి వద్ద ఆలయ డిప్యూటి ఈవో పని చేస్తున్నాడనే ఫిర్యాదులందాయి. టీడీపీ కార్యకర్తగా టివీ5 ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బీఆర్ నాయుడు ఉన్నారనే ధైర్యంతో ఈ బరితెగింపు బయటపడింది. ఆలయం లోపల మరోముఖ్యుడు చేస్తున్నవి బయటకు రాలేదు.శ్రీవారి కల్యాణాలు జరపాలని తెలుగు అసోసియేషన్ జర్మనీ వాళ్ళు తరపున రవి కుమార్ వేమూరి కోరారు. సెప్టెంబర్ ఆరు నుంచి 16 చోట్ల శ్రీవారి కల్యాణాలు జరపాలని కోరారు. బీఆర్ నాయుడు తన బలంతో ఒకే చేశారు..ప్రొసీడింగ్స్ ఇచ్చారు. శ్రీవారి కల్యాణాలు మొట్ట మొదటిగా మా హయంలో సూళ్లూరుపేట దళితవాడలో ప్రారంభించాం. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాలు హాంబర్గ్‌లో కళ్యాణోత్సవాలుకు టికెట్ ధర 116 యూరోలు , జంటగా కల్యాణోత్సవం 81 యూరోలు, విశేష కళ్యాణానికి 515 యూరోలు పేరుతో టికెట్లు పెట్టడం జరిగింది. టీడీపీ ఎన్నికల ఫండ్స్ ఇచ్చిన వారికి సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారా..? టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు అనుమతితో జరుగుతోంది. ధనవంతులు ఇళ్లలో లక్ష్మి పూజలు మీ అనుగ్రహంతోనే జరుగుతున్నాయి. మీరు చేసిన బ్లాక్ మెయిల్ చేసినవి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నాం. మీరు చేస్తున్న అవినీతిపై మా పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు. -
Bhumana: పచ్చ మీడియానే బాబు అరాచకాలను బయటపెట్టింది
-
తిరుమల సన్నిదానం క్యాంటీన్ అక్రమాలపై భూమన సంచలన నిజాలు
-
సన్నిధానం క్యాంటీన్ పట్ల TTDకి ఎందుకంత ప్రేమ?: భూమన
కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తుల సేవ మరిచి, వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... అద్దె చెల్లించకుండా రూ.2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ ను ముఖ్యమంత్రి కార్యాయల ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.సాక్షి, తిరుపతి: తిరుమలలో వ్యాపారుల సేవలో పాలకమండలి తరిస్తోంది. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాపారమయంగా మార్చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా 201 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. టీటీడీ కంటి తుడుపు చర్యలు తీసుకుందని అన్నారాయన. ● అద్దె బకాయిలు - అయినా అడ్డగోలు ఉత్తర్వులునిబంధనల ప్రకారం అద్దె చెల్లించక పోవడంతో టీటీడీ రెవెన్యూ అధికారులు సన్నిధానం క్యాంటీన్ ను 21-12-2024న మూసివేశారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని 30-12-2024 నాడు సన్నిధానం క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించడంతో పాటు రెగ్యులరైజేషన్ చేయాలని ఉత్తర్యులు జారీ చేసింది. వాస్తవానికి టీటీడీ ఇచ్చిన నోటీసులు ప్రకారం సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులు 26-05-2025 నాటికి రూ.2,85,7,106 నగదు చెల్లించాలి. అందులో నిర్వాహకులు నాలుగు దఫాలుగా కేవలం రూ.1,00,24,400 మాత్రమే చెల్లించారు. అయినా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీటీడీ వారికి తలుపులు బార్లా తెరిచి సేవ చేసింది. మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు 201 చదరపు మీటర్ల స్ధలాన్ని నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించారు. దీనిపై అధికారులు తనిఖీ చేసి నివేదిక కూడా ఇచ్చారు. మరోవైపు 16-09-2024 నాడు టీటీడీ ఎగ్జిక్యూటవ్ ఇంజనీర్ కూడా వీళ్ల ఆక్రమణపై లేఖ రాస్తూ... క్యాంటీన్ నిర్వాహకులు ఆక్రమించిన స్ధలంలో కట్టడాలు చేపట్టిన మాట వాస్తవమే, మేం తనిఖీలు చేసినప్పుడు నిర్మాణం ఆపి మరలా ప్రారంభించారు అని కూడా రిపోర్ట్ ఇచ్చారు. టీటీడీ లైసెన్స్ నిబంధనలు ప్రకారం రెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఆఖరు నెల రెంట్ కట్టకపోతే క్యాంటీన్ మూసివేయాలి. ఈ నిబంధన టీటీడీ ప్రొసీడింగ్స్ లో ఉన్న సన్నిధానం క్యాంటీన్ పట్ల టీటీడీకి ఎందుకింత ప్రేమ ?● ప్రభుత్వ పెద్దల ఒత్తిడి- తప్పుడు నివేదిక.. నిబంధనలు పాటించని క్యాంటీన్‌ను మూసివేసి రెంట్ బకాయిలు ఉన్నారని తెలిసినా మరలా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. ఒకవైపు దేవస్థానం భూమి ఆక్రమణలు చేయడమే కాకుండా ఆ స్ధలంలో 15 పెద్ద చెట్లను కూడా తొలగించారు. సన్నిధానం క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగానే అటవీశాఖ అధికారులు కూడా అక్కడ కేవలం నాలుగు అకేషియా చెట్లను మాత్రమే తొలగించారని తప్పుడు నివేదిక ఇచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ రాగానే జనవరిలోనే క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించగా.. టీటీడీ అధికారులు మాత్రం ఏప్రిల్ 1, 2025న రీఓపెన్ చేసినట్లు రాసుకున్నారు. ఆ మూడు నెలల కరెంటు బిల్లులు తనిఖీ చేస్తే వాస్తవాలు కచ్చితంగా బయటపడతాయి. మరోవైపు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులకు కేవలం నెలకు రూ.50వేలు ఫీజు నిర్ణయించింది. అంటే టీటీడీ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే... ఇలా ఫైన్లు వేసి వదిలేస్తే తిరుమలలో ఇంచు స్థలం కూడా మిగలదు. ఒక వ్యాపార సంస్థ 201 చదరపు మీటర్ల స్థలం ఆక్రమిస్తే... దాన్ని రెగ్యులరైజ్ చేయమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం. అక్కడితో ఆగకుండా... టీటీడీ పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు దాదాపు రూ.2 కోట్ల అద్దె కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు క్యాంటీన్ జనవరి నుంచి నడిచినా కూడా రన్ చేయలేదని చూపిస్తూ... 3 నెలల అద్దెను మినహాయించడం దారుణం. భక్తులకు సేవ చేయాల్సిన చైర్మన్, టీటీడీ బోర్డు ఇలా క్యాంటీన్ నిర్వాహకుల సేవలో మునిగిపోవడం దుర్మార్గం. దీనిపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి అక్రమాలపై కచ్చితంగా పోరాటం చేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. -
కేసులతో వేధింపులు.. కూటమిని ప్రశ్నించడం ఆపేదిలేదు: భూమన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ పోలీసులు 15 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలనే లక్ష్యాన్ని మరిచిపోయారని అన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో లేని లిక్కర్ స్కాంను సృష్టించి.. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసిందని మండిపడ్డారు.రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్‌లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కలిశారు. అనంతరం, భూమన మీడియాతో మాట్లాడుతూ.. ఏదో ఒక నెపంతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులను కేసులతో వేధిస్తున్నారు. మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా వైఎస్ జగన్ నైతికతను దెబ్బతీయ వచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైఎస్సార్సీపీ నేతలను, అధికారులను అరెస్టు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రశ్నించడంలో ఏమాత్రం వెనకడుగు వేయం. మిథున్ రెడ్డి మానసికంగా ధైర్యంగా ఉన్నారు. కార్యకర్తలందరినీ జైల్లో పెట్టినా ఏమాత్రం భయపడేది లేదు. ఎన్ని రోజులు జైల్లో పెట్టిన మా మనో నిబ్బరాన్ని దెబ్బ తీయలేరు’ అని అన్నారు.మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని జైలు పాలు చేస్తోంది. మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా జైలుకు పంపించింది. మిథున్ రెడ్డి కూడా ధైర్యంగా ఉన్నారు. న్యాయం కోసం పోరాడుదామని చెప్పారు’ అని తెలిపారు. -
టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారు?
-
అది హిందువుల దురదృష్టం.. BR నాయుడికి భూమన కౌంటర్
తిరుపతి, సాక్షి: అత్యంత విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి నిలదీశారు. గురువారం తిరుపతిలో మీడియాతో భూమన మాట్లాడారు. టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు బదలాయిస్తున్నారు?. అత్యంత విలువైన భూములను ఎందుకు ఇస్తున్నారు?. నా ప్రశ్నలకు బీఆర్ నాయుడు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. పైగా అడినందుకు బూతులు తిడుతున్నారు. బీఆర్ నాయుడి వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయి. అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావడం హిందువుల దురదృష్టం అని భూమన అన్నారు. అలాగే తనపై బీఆర్ నాయుడు చేస్తున్న ఆరోపణలపైనా భూమన స్పందించారు. బీఆర్ నాయుడు.. తప్పుడు ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్. ఆయనో దోపిడీదారుడు.. పైరవీకారుడు. అలాంటి వ్యక్తి బెదిరింపులకు భయపడం. నాపై చేసే ఆరోపణలకు సీబీఐ విచారణకైనా సిద్ధం. జూబ్లీహిల్స్ సొసైటీలో బీఆర్ నాయుడు అనేక అక్రమాలు చేశారు. అతని అరాచకాలపై పోరాటం చేస్తూనే ఉంటాం అని భూమన అన్నారు. ‘‘బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై నిరంతరం దూషణలకు దిగుతున్నారు. క్విడ్‌ప్రో కింద బీఆర్ నాయుడికి ఆ పదవి వచ్చింది. ఆ పదవి శాశ్వతం కాదనే విషయం బీఆర్ నాయుడు గుర్తుంచుకోవాలి’’ అని భూమన హెచ్చరించారు. -
25 ఏళ్ళగా టీడీపీలో ఉండి ఈ రోజు YSRCP లో చేరడానికి ప్రధాన కారణం ఇదే
-
వైఎస్ జగన్‌పై బీఆర్ నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తోంది: భూమన
సాక్షి,తిరుపతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బీఆర్ నాయుడు ఛానల్ విషప్రచారం చేస్తోందని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం కంటే వైఎస్సార్,జగన్ పాలనలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. జగన్ ఐదేళ్లు సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం జగన్ పాలనలోనే ప్రారంభమైంది’ అని స్పష్టం చేశారు. -
Bhumana: మీరు మాట్లాడిన మాట చాలా దారుణం వెంటనే వెనక్కి తీసుకోండి.. లేకపోతే..
-
తిరుపతిలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారు
-
భూమన గిరి ప్రదక్షిణ
-
రాసలీలల మంత్రి ఎవరు అనగా..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలోని ఒక టీడీపీ మంత్రి తిరుపతిలో తరచూ రాసలీలు సాగిస్తుండటంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సదరు మంత్రి కామకలాపాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ లీలలను బయట పెట్టింది ఆ పార్టీకి చెందిన నేత కాబట్టే. అదీ ఎల్లో చానల్ వేదికగా. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డి సదరు మంత్రిపై చేసిన సంచలన ఆరోపణలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తూ ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఓ ఎల్లో మీడియా చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టడంతో ‘ఇంతకూ ఆ మంత్రి ఎవరు అనగా..’ అంటూ సర్వత్రా చర్చ మొదలైంది. హైదరాబాద్‌లోనూ మంత్రి నీచపు పనులు ‘‘ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తారు. ఆయన వస్తే ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలోనే బస చేస్తారు. ఆయన పక్క గదినే ఓ మహిళకు కేటాయిస్తారు. ఆమె చెబితేనే మంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది. నాకు కూడా ఆ మంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆయన ఉన్నన్ని రోజులూ మహిళలతో రాసలీలలు సాగిస్తారు. ఆ మంత్రి గురించి టీడీపీలో అందరికీ తెలుసు. పేరు చెప్పను. ఆ మంత్రి తీరు చూస్తూ ఊరుకోలేక కడుపు మండి ఈ విషయాలు చెప్పాల్సి వస్తోంది’ అంటూ సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కూడా స్పందించారు. టీడీపీ అధికార ప్రతినిధి చెబుతున్న ఆ మంత్రి హైదరాబాద్‌లోని ఖరీదైన హోటళ్లలో నికృష్టపు చేష్టలు చేస్తుంటాడని విమర్శించారు. అతనే పవిత్ర ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోనూ రాసలీలలు సాగిస్తున్నాడని, పదవులు ఇప్పిస్తానని చెప్పి మహిళలను ప్రలోభ పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈయన హైదరాబాద్‌లో సాగించే ఘన కార్యాలపై గతంలోనూ ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. అటువంటి మంత్రిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు. మంత్రులే ఇలా బరితెగిస్తే, ఇక ఎమ్మెల్యేలు మరీ పేట్రేగిపోరా అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సన్నిహితులు పిలిచే పేరు డార్లింగ్ మంత్రి టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డి చెబుతున్న ఆ మంత్రిపై మరిన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏపీ మంత్రిగా ఉంటూ.. శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో ఆయన గడుపుతారట. సన్నిహితుల కోసం గదులు బుక్ చేస్తారట. తెలంగాణ, ఏపీకి చెందిన వారితో అక్కడే సెటిల్మెంట్లు చేస్తారట. ఫైళ్లపై సంతకాలూ అక్కడేనట. వారంలో మూడు రోజులు రాసలీలలు, గానా బజానాలతో కాలం గడుపుతారట. తెలంగాణాలో ఏపీ మంత్రి సెటిల్మెంట్ల వ్యవహారం శ్రుతిమించుతోందని అక్కడి ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ కూడా రాసినట్లు గతంలో ఓ పచ్చపత్రిక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ మంత్రే ఇప్పుడు విజయవాడ, తిరుపతిల్లోనూ రాసలీలలు సాగిస్తున్నట్టు సమాచారం. ఆయన సొంత నియోజకవర్గానికి వారంలో ఒక రోజు మాత్రమే వెళతారట. అక్కడ మాత్రం బుద్దిమంతుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో అనుచరుల ద్వారా మంత్రి పేకాట స్థావరాలూ నడిపిస్తున్నట్టు భారీ విమర్శలు ఉన్నాయి. ఈ మంత్రిని ఆయన అనుచరులు, సన్నిహితులు ‘డార్లింగ్ మంత్రి’ అని పిలుచుకుంటుండడం కొసమెరుపు.సీఎం గారూ మీ మంత్రిపై చర్యలు తీసుకోండి పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్, తిరుపతిల్లోని ఖరీదైన హోటళ్లలో వారితో రాసలీలలకు పాల్పడుతున్నమంత్రిపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఎందుకు చోద్యం చూస్తున్నారు? టీడీపీ నేతే మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. ఈ మంత్రి హైదరాబాద్‌లో సాగించే ఘన కార్యాలపై గతంలో ఎల్లో మీడియా పత్రికలోనే కథనం ప్రచురితమైంది. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి. కూటమి నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బట్టబయలు » రాష్ట్రంలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల రాసలీలలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను ఓ మహిళ బయటపెట్టి సంచలనం రేపింది. » ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో ఓ మహిళతో మాట్లాడుతూ ముద్దులు పెట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. » శ్రీకాకుళం జిల్లా ఆమదాలవస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అదే జిల్లాకు చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులను రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి రావాలని అనుచరుల ద్వారా ఒత్తిళ్లు చేయించడం వెలుగులోకి వచ్చింది. » పలు చోట్ల వివిధ పనుల కోసం వస్తున్న మహిళల బలహీనతలు, పేదరికాన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లోబరుచుకునే యత్నాలు పలు జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. రాత్రిళ్లు ఫోన్ చేయడం, ఒత్తిడికి గురి చేయడం ద్వారా లొంగదీసుకునే యత్నాలు దారుణమని ప్రజల్లో చర్చ జరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని, సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘సొంతపార్టీ అధికార ప్రతినిధి ఆవేదనపై చంద్రబాబు స్పందించాలి’
తిరుపతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రివర్యులు చేస్తున్న చీకటి బాగోతాలపై తెలుగదేశం అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్‌రెడ్డి బయటపెట్టిన సంచలన నిజాలపై సీఎం స్పందించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్ లోని ఖరీదైన హోటళ్ళలో వారితో రాసలీలలకు పాల్పడుతున్న సదరు మంత్రిపై చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే, వారిపై చర్య తీసుకునేందుకు చంద్రబాబు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ చానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. పెద్దపెద్ద హోటళ్ళలో బస చేసే సదరు మంత్రి, తన పక్క రూంలను బుక్ చేసుకుంటూ, ఆ గదుల్లో మద్యం సేవించి, మహిళలతో రాసలీలలు సాగిస్తున్నారని సంచలన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశాలపై తెలుగుదేశం, జనసేన పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్న అంశంను సుధాకర్ రెడ్డి బహిరంగ పరిచారు. ఎమ్మెల్యేలు చేసే పొరపాట్లను సరిచేయాలంటూ మంత్రులకు ఒకవైపు సీఎం చంద్రబాబు చెబుతుంటే, మరోవైపు ఆయన సహచర మంత్రులే హైదరాబాద్‌లో రాసలీలలకు పాల్పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి వంతపాడే ఒక పత్రికలోనే దీనిపై పెద్ద ఎత్తున కథనం కూడా ప్రచురితం అయ్యింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తిరుపతికి తరచుగా వస్తుంటారు. వచ్చిన ప్రతిసారీ వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం, నైతిక అంశాలను మాట్లాడి వెడుతుంటాడు. అలాంటి మంత్రి గురించే టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి మాట్లాడారు. తిరుపతిలో అత్యంత ప్రముఖమైన పోస్ట్ ఇప్పిస్తానని, తనను నమ్ముకుంటే కీలకమైన పదవులు ఇప్పిస్తామంటూ మహిళలను నమ్మించి మోసం చేస్తున్నాడని కూడా ఆయనపై ఆరోపణలు చేశారు. ఆయన టీడీపీ, జనసేనకు చెందిన వారందరికీ తెలుసునని ఎన్బీ సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా ఇటువంటి అరాచకానికి సదరు మంత్రివర్యులు ఒడిగట్టడం దారుణం. అదే మంత్రి తిరుపతి పవిత్రతను కాపాడతానంటూ మాట్లాడుతుంటారు. అటువంటి మచ్చపడిన మంత్రివర్యులపైన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
BR నాయుడు ని ఇమిటేట్ చేసి ఏకిపారేసిన భూమన..
-
సాక్షి మీడియా హైందవ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంది: భూమన
-
టీవీ5 అబద్ధాలకు పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి: భూమన
సాక్షి, తిరుపతి: తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్సీపీ భయపడదు అంటూ హెచ్చరించారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘బొల్లినేని రాజగోపాల్ నాయుడు(బీఆర్ నాయుడు) ఆధ్వర్యంలో టీటీడీ ప్రతిష్ట దిగజారుతోంది. బీఆర్ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోంది. భక్తుల అవస్థలను బీఆర్ నాయుడు పట్టించుకోవడం లేదు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకుని వేధిస్తున్నారు. టీవీ-5 ప్రసారం చేసే అబద్ధాలకు వేల సంఖ్యలో పరువు నష్టం నోటీసులు ఇవ్వాలి. బీఆర్ నాయుడు రూ.10వేల కోట్ల పరువు నష్టం ఇవ్వాల్సి ఉంటుంది.బీఆర్ నాయుడు, చంద్రబాబు ప్రజస్వామ్య ద్రోహం చేస్తున్నారు. తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారు. ఆయన అరాచకాలు ప్రజలందరికీ తెలుసు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులను వైకుంఠం పంపించారు. టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా తొక్కిసలాట జరిగింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని అంటే మీకు అహం అడ్డు వచ్చింది. బాలాజీ నగర్ కాలనీలో బెల్ట్ షాప్ ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాలు చేయలేదా?. ఢిల్లీలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ ప్రతిష్ఠలపై విజిలెన్స్ విచారణ జరగలేదా?. ఏ నీళ్లతో చేస్తే పాప పరిహారం అవుతుంది అనుకుంటామో.. పాప వినాశనంలో బోట్లు షికారు చేయించారు. మీ హయంలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. టీవీ5 చానల్ ద్వారా ఈ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా వైఎస్సార్సీపీ నాయకులపై మీ చానెల్లో చూపిస్తున్నారు. దీనికి మీపై పదికోట్ల రూపాయలు పరువు నష్టం వేయాలి. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నది మీరు కాదా?. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటమా?. మీ చానెల్ ప్రతినిధిని పెట్టుకుని మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఎవరు బిల్లులు ఇవ్వాలో మీరే చెప్తున్నారు. టీటీడీ చైర్మన్‌ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. రెండు గంటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్శనం అన్నారు.. అది ఏమైంది?. మీ సిఫార్సులతో అడిషనల్ ఈవో కార్యాలయంలో టికెట్స్ పొందడం లేదా?. వీఐపీ తగ్గిస్తామని చెప్పి అత్యధికంగా టికెట్లు ఇస్తూ ఉన్నారు. శ్రీవాణి రద్దు చేస్తాము అని చెప్పి, ఈరోజు ఎక్కువ టిక్కెట్లు ఇస్తున్నారు. రద్దు చేసే దమ్ము మీకు ఉందా?. మాపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి. ఒక సాధారణ వ్యక్తి బీఆర్ నాయుడు.. ఇన్ని లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు?. టీవీ5 చానెల్ ఎలా పెట్టాడు’ అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు ఉడత బెదిరింపులకు ఎవరూ భయపడరు. బీఆర్ నాయుడును చూసి వైఎస్సార్సీపీ భయపడదు. హిందూ ధర్మాన్ని రక్షించడంలో సాక్షి మీడియా ముందుంది’ అని చెప్పారు. -
బీఆర్ నాయుడు డైరెక్షన్.. తిరుమలలో మఠాలపై బాబు, పవన్ దాడి: భూమన
సాక్షి, తిరుపతి: హైందవ ధర్మ పరిరక్షణకు పాటు పడే మఠాలపై కూటమి సర్కార్ దాడి చేస్తోందని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలపై హిందూ సంస్థలు స్పందించాల్సి ఉందన్నారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో విశిష్ట అద్వైత మఠం, శృంగేరి, పెజావర్ పీఠం, వైఖానస మఠం, అహోబిల మఠం, చినజీయర్ మఠం, మంత్రాలయం మఠం నెలకొల్పారు. హైందవ పరిరక్షణ కోసమే మఠాలు ఉన్నాయి. సంప్రదాయాలు, మఠాల నిర్వహణ సత్ సంకల్పంతో నిర్వహించాలని, శ్రీ మహావిష్ణువు వెలసిన దివ్య క్షేత్రంలో స్వామి వారి వైభవం విశ్వవ్యాప్తం చేయడానికి ఉన్నాయి. అటువంటి మఠాలకు చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. పీఠాధిపతులను కూటమి ప్రభుత్వం అవమానిస్తోంది. హైందవ మఠాలపై కూటమి దాడి సరికాదు.కూటమి ప్రభుత్వం దాదాపు 32 మఠాలకు నోటీసులు జారీ చేసింది. పీఠాధిపతులకు అవమానకరమైన రీతిలో పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటి?. పవిత్రమైన మఠాధిపతుల అధీనంలో ఉన్న మఠాలకు ఏవిధమైన నోటీసులు ఇచ్చారో చెప్పాలి. హైందవ మఠాలపై చేస్తున్న దాడి ఇది. హిందూ సంస్థలు వెంటనే స్పందించాల్సి ఉంది. ఇదంతా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోనే జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి మూల మూర్తి దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టేలా ఉన్నారు. విద్వేష పూరితమైన ఆలోచన ఇది. మఠాధిపతులు మేల్కొవాలి. మఠాలపై దాడిని ఖండించాలి. సనాతన ధర్మం పట్ల గొడ్డలి వేటు ఇది. సనాతన ధర్మం కావడమే నా లక్ష్యం అంటున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా నెల్లూరులో ఆంక్షలు పెట్టడం దారుణం
-
జనం కోసమే జగన్.. జగన్ కోసమే జనం.. నెల్లూరులో జన సునామి ఖాయం
-
జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు: భూమన
-
Bhumana Karunakar: ఆయన తలచుకుంటే 10 మందిని పెట్టుకుంటాడు..
-
ఎస్పీ మణికంఠపై భూమన కరుణాకరరెడ్డి ఫైర్
-
వివాదాస్పదంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యవహార శైలి.. భూమన ఆగ్రహం
సాక్షి, తిరుపతి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మెన్ కాలేశా తొలగింపుపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఎస్పీ మణికంఠ ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘రెండు నెలలు క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయికి ఫ్యాక్చర్ అయ్యింది. చేయి గాయం కారణంగా గన్ మెన్ కాలేశా ఔదార్యపూరితమైన పెద్దిరెడ్డికి సహాయం చేశాడు. జైలు పరిసర ప్రాంతాల్లో ఇతరులను ఎవరిని అనుమతించరు. అందుకే పెద్దిరెడ్డితో పాటుగా గన్‌మెన్.. మిథున్ రెడ్డి ఉన్న జైలుకు వెళ్లారు. మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును పెద్దిరెడ్డి మోయలేకపోవడంతో.. దాన్ని గన్‌మేన్ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ మణికంఠ.. కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇలా చేయడం సరికాదు.ఎస్పీ ఆఫీసు, బంగ్లాలో అనధికారికంగా ఎంతో మంది పని చేస్తున్నారు. తప్పు చేసిన వారిని క్షమించనని చెప్పిన ఎస్పీ మణికంఠ.. ఆదర్శంగా నిలవాలి. అనాధికారికంగా కానిస్టేబుల్స్‌తో ఎస్పీ కార్యాలయం, బంగ్లాతో పనిచేయిస్తున్నారు. ఎస్పీ వెంటనే వారిని తొలగించి ఆదర్శంగా ఉండాలి. ఆత్మ న్యూనత భావంతో పనిచేయకండి. కాలేశా సస్పెండ్ కరెక్ట్ అయినప్పుడు.. మిగతా వారిని కూడా సస్పెండ్ చేస్తారా?.ఇదిలా ఉండగా.. చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యవహారశైలి మరోమారు వివాదస్పదమయ్యింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ రూట్ మ్యాప్ అప్పటికప్పుడు మారుస్తూ, ఆంక్షలు విధించిన ఎస్పీ.. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి గన్‌మేన్ కాలేషాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రాజమండ్రి జైల్లో ఉండగా, రెండు రోజుల క్రితం ఆయనను పరామర్శించడానికి రామచంద్రారెడ్డి వెళ్లారు.ఇటీవల పెద్దిరెడ్డి చేయి విరగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును ఆయన మోయలేకపోవడంతో.. దాన్ని గన్‌మేన్ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ, కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. మానవతాదృక్పథంతో బ్యాగు తీసుకున్నందుకు తనను సస్పెండ్ చేయడం తగదని కాలేషా వేడుకున్నా.. అధికారులు పట్టించుకోలేదని సమాచారం. ఇక గతేడాది జూలైలో ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు పర్యటన సందర్భంలో అక్కడ టీడీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడి, కార్లకు నిప్పంటించారు. మిథున్‌రెడ్డిపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటడంతో మిథున్‌రెడ్డి గన్‌మేన్ గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ నాడు మిథున్‌రెడ్డి గన్‌మేన్‌ను సైతం సస్పెండ్ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, పెద్దిరెడ్డి కుటుంబమే లక్ష్యంగా ఎస్పీ మణికంఠ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. -
చిరుద్యోగులను బలిచ్చారు తిరుపతి తొక్కిసలాట కేసుపై భూమన
-
తిరుమల తొక్కిసలాట ఘటన.. అసలు దోషులెక్కడా చంద్రబాబు
సాక్షి,తిరుపతి: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘‘ శ్రీరంగ పట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాము. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8 న జరిగిన జరిగిన తొక్కిసలాట పై కంటి తుడుపు చర్యలు కు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది.సంఘటన జరిగిన తర్వత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన పై ఈవో ఛైర్మన్ల మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆరోజు గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు.చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తమకు కావాల్సిన వారితో సాక్షులు ఇప్పించారు హరినాథ్ రెడ్డి, రమణ కుమార్‌లను బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. ఆరు మంది చనిపోయి, 50 మందికి పైగా తీవ్ర గాయాలు ఐతే పాక్షికంగా నివేదిక ఇచ్చారుఆ నివేదికను దురుద్దేశ పూర్వకంగా ఇచ్చిన నివేదికగా వైఎస్సార్సీపీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదికలు బట్టి చూస్తే.. చంద్రబాబు నియమించిన ఏ విచారణ అయిన ఒక కేస్ స్టడీగా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే విచారణ కమిషన్ ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ.హరినాధ రెడ్డికు 21.12.24 నా జరిగిన సమావేశంలో సూర్య ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు సమాన బాధ్యత ఇచ్చారులా అండ్ ఆర్డర్, విజిలెన్స్ వాళ్లకు క్యూ లైన్ బాధ్యతలు ఇచ్చారు. అండ్ ఆర్డర్ బాధ్యత ఎస్పీ, సీవీ అండ్ ఎస్వో ది కూడా బాధ్యత. వైఎస్సార్సీపీ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగలేదు.జనవరి 10, 11, 12 తేదీలు మాత్రమే ఎస్ఎస్డీ టోకెన్లు ఇస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు కారణం, దీనికి సమాధానం లేదు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందన ఖాన్ ఒక నివేదిక ఇచ్చారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారు? క్యూ లైన్లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు.తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమీషన్ నివేదిక సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. మా పాలనలో వైకుంఠ ఏకాదశికు పదిలక్షలు మందికి దర్శనం చేయించాము. 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం పదిరోజుల దర్శనం జరిగింది.పీఠాధిపతులు ఆలోచనలను పక్కన పడేస్తారా.. కేసులు పెట్టాలనే , జైలుకు తరలించాలని చూస్తున్నారు.నా గొంతు కోస్తే తప్ప నేను పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు. -
కూటమి కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు: భూమన
-
మేము కూడా పేర్లు నోట్ చేశాం బియ్యపు మధుసూదన్ రెడ్డి వార్నింగ్
-
లోకేష్ డైరెక్షన్లోనే మిథున్‌రెడ్డి ఎపిసోడ్
కక్ష సాధింపు రాజకీయాలతో చంద్రబాబు, నారా లోకేష్‌లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంపై శనివారం ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడారు. సాక్షి, తిరుపతి: కక్ష సాధింపు రాజకీయాలతో చంద్రబాబు, నారా లోకేష్‌లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి లిక్కర్ కేసు వ్యవహారంపై శనివారం ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీలో కీలక నేత మాత్రమే కాదు.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితుడు కూడా. అందుకే ఆయన్ని అరెస్ట్ చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంలో కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్ర దాగుంది. అందుకే ఎలాంటి సంబంధం లేని మిథున్‌రెడ్డి ఈ స్కామ్‌ను అంటగట్టాలని చూస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ జరిగింది అనే ఓ అబూతకల్పన మాత్రమే. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు అదే తరహాలో మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇదంతా నారా లోకేష్ డైరెక్షన్లోనే జరుగుతోంది.కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చెయ్యడం.. కొట్టడం చేస్తున్నారు. రాజకీయాలలో ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు మారుతుంటాయి. ఆ ఇంగితజ్ఞానం కూడా లేకపోతే ఎలా?.అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చెయ్యాలని, ప్రతిదాడులు చెయ్యడానికి కాదు. రాష్ట్రంలో ప్రజలు అన్నీ చూస్తున్నారు, జగన్ పర్యటనలను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిపై అతి పెద్దనేరం మోపి తప్పు చేశారు. మీకు ఇది ప్రస్తుతానికి ఆనందాన్ని కలిగొచ్చవచ్చు. కానీ, భవిష్యత్తులో మీకు ఆవేదన మాత్రమే మిగులుస్తుంది. పోలీసు వ్యవస్థ వాడుకొని అక్రమ అరెస్టు చేస్తున్న మీకు ప్రజలు నుండి తిరుగుబాటు తప్పదు. మేము మళ్లీ అధికారంలోకి వచ్చాక మీరు నేర్పిన పాఠాలే మీకు అప్పచెప్పాల్సివస్తుంది అని భూమన హెచ్చరికలు జారీ చేశారు. -
తిరుమలపై ఇంత పెద్ద నింద వేస్తారా?
టీటీడీలో అన్యమతస్తుల అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది శ్రీవారి ఆలయంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని అన్నారాయన. టీటీడీ సభ్యుడి సమక్షంలోనే బండి సంజయ్ అలా ఎలా ప్రకటించారని.. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ఉందని భూమన డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులైన ఉద్యోగుల వ్యవహారం తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఇంత పెద్ద నింద వేసినా.. కూటమి ప్రభుత్వం, టీటీడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణమని అన్నారాయన. టీటీడీలో 1,000 మంది అన్య మతస్తులు ఉన్నారని, వాళ్లను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే ఆయన వద్ద ఏమైనా నివేదిక ఉందా?. ఆయన అలా ప్రకటన చేసిన టైంలో పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు దీనిపై వివరణ ఇవ్వాల్సిన భాద్యత కూటమి ప్రభుత్వం, టీటీడీపైన కచ్చితంగా ఉందిటీటీడీ బోర్డులో 22 మంది అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు గతంలో ఈవో, చైర్మన్లు ప్రకటించారు. అలాంటప్పుడు బండి సంజయ్ 1,000 మంది అని ఎలా అంటారు?. రెండింటిలో ఏది నిజం? ఆయన(బండి సంజయ్) లెక్క ప్రకారం.. 20 శాతం మంది అన్యమతస్తులే ఉన్నట్లా?. అసలు తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు?. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే. కచ్చితంగా టీటీడీని, ఉద్యోగస్తులను అవమానించడమే.అధికారంలోకి రాగానే.. తిరుమలను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాంటప్పుడు తిరుపతి ప్రజలను నొప్పించిన బండి సంజయ్ ప్రకటన పట్ల ఎందుకు స్పందించరు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు, టీటీడీలు కనీసం స్పందించలేదు.. ఖండించలేదు అని భూమన అన్నారు. -
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన సక్సెస్.. కడుపు మంటతో ఎల్లో మీడియా..
సాక్షి,తిరుపతి: కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. రైతన్నకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చేపట్టిన బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన విజయవంతమైందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగన్ చేసిన బంగారుపాళెం పర్యటన విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఈటీవీలు విషపు రాతలతో ఆయనపై ఉన్న ద్వేషాన్ని మరోసారి చాటుకున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ కోసం వచ్చిన మామిడి రైతులను క్రూరమైన దొంగలు, అసాంఘిక శక్తులు, దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఉచ్ఛం, నీచం మరిచి పతాకశీర్షికల్లో దూషించడం ద్వారా తమ కడుపుమంటను ఎల్లో మీడియా బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును మోసేందుకు, నిత్యం భజన చేసేందుకు ఆ ప్రతికలు, మీడియా ఇంతగా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ..వైఎస్ జగన్ పర్యటనకు చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తమ కష్టాలను చెప్పుకోవాలని తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం రెండు వేల మంది పోలీసులతో భద్రత పేరుతో అనేక ఆటంకాలు కల్పించింది. లాఠీచార్జీతో అభిమానులు, రైతులపై విరుచుకుపడింది. రహదారులను బారికెట్లతో మూసివేశారు. అయినా కూడా రైతులు గుట్టలు, పుట్టలు, కాలువలు, పొలాలు, తోటలను దాటుకుంటూ జగన్‌ను కలిసేందుకు వచ్చారు. ఇటువంటి అశేష జనవాహినిని చూసి కూటమి ప్రభుత్వానికి చెమటలు పట్టాయి. ..ఈ పర్యటన విజయవంతం అవ్వడంతో తట్టుకోలేక చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీన్, ఈటీవీలు మామిడి రైతులపై ఇష్టారీతిగా ద్వేషాన్ని, విషాన్ని కుమ్మరించాయి. రైతులను రౌడీలు, దోపిడీదారులు, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ పతాక శీర్షికల్లో రాతలు రాశారు. ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో 'బంగారుపాళెంలో దండుపాళ్యం' అంటూ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అభిమానులను, రైతులు అరాచకం సృష్టించడానికి ప్రయత్నించారంటూ ఒక విషపు కథనాన్ని అచ్చేశారు. ..అదే పత్రికలో జగన్ పర్యటనకు అసలు జనాలే రాలేదంటూ మరో ఏడుపుగొట్టు కథనాని రాశారు. హెలిప్యాడ్ వద్దకు మూడువేల మంది జనం తోసుకువచ్చారంటూ అదే పచ్చ పత్రిక ఆంధ్రజ్యోతి మరో కథనం రాసింది. ఇలా ఏ రాస్తున్నారో కనీస స్పృహ కూడా లేకుండా ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలను ప్రచురించారు.గిట్టుబాటు రేటు ఇస్తే రైతులు రోడ్డుపై పంట పారేస్తారా?.. బంగారుపాళెంకు వచ్చింది రైతులే కాదు, ఎవరో రైతులకు చెందిన మామిడి కాయలను రోడ్డుపైన పారేశారంటూ ఇదే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. వైయస్ జగన్ వస్తున్నారని కాదు, కనీసం కోత ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడం, ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి వేచిఉన్నా కొనుగోలు చేసేవారు లేక, మామిడి కాయలు కుళ్ళిపోతుండటంతో కడుపుమండిన రైతులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు మామిడి కాయలను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయిన ఘటనలు అనేక ఉన్నాయి. రైతులను ఆదుకోవడంతో, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవ్వడం వల్లే రైతులు తమ పంటను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయారు. దీనిని ఈనాడు పత్రిక తనకి నచ్చినట్లుగా వక్రీకరణ కథనాలు రాశారు. అలాగే రైతులు కానీ కొందరితో జగన్మోహన్రెడ్డి ఎందుకు వచ్చారో మాకు అర్థం కాలేదంటూ కూడా మరో విషపు కథనాన్ని రాశారు.ఎల్లో మీడియాలో దుర్మార్గమైన థంబ్‌నెయిల్స్.. వైఎస్ జగన్‌ను ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను అణువంతైనా తగ్గించలేరు. ఇక టీవీ5, ఏబీఎన్ చానెల్స్‌లో అయితే 'పోలీసులా...నరికేయండ్రా', 'డీఎస్సీని నరికేయండ్రా...' జగన్ పబ్లిక్‌గా దొరికాడు అంటూ థంబ్‌నెయిల్స్ పెట్టి మరీ దుర్మార్గమైన వీడియో కథనాలను ప్రసారం చేశారు. ..ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన నాయకుడు ఎక్కడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇలా కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆదేశాలు ఇస్తారా? 'పోలీసులపై రప్పా...రప్పా.. అంటూ రెచ్చిపోయిన జగన్', 'పరామర్శా... పొలిటికల్ ఈవెంటా?' 'పోలీసులను నరికేస్తారా...సర్కార్ ఏం చేస్తోంది' ఇలాంటి థంబ్ నెయిల్స్‌తో ఎల్లో మీడియా తన కడుపుమంటను, జగన్‌పై ఉన్న ధ్వేషాన్ని చాటుకునేందుకు సిగ్గూ,శరం లేకుండా దిగజారుడు కథనాలను ప్రచురించింది. ..గతంలో కశ్యప, భృగు, అత్రి, బృహస్పతి వంటి రుషులు లోకకళ్యాణం కోసం ప్రజలకు, పాలకులకు మంచిని బోధించేవారు. కానీ నేడు ఎల్లో మీడియా ఈ రుషులుగా భావించుకుని చంద్రబాబుకు తప్పుడు సలహాలు, విషపు కథనాలను ప్రచారం చేస్తూ అశాంతిని ఎలా రగిలించవచ్చో బోధిస్తున్నాయి. అలాగే ఈ ఎల్లో మీడియాకు టీడీపీ, జనసేన వారంతా సత్పురుషులు, వేదపండితులుగా కనిపిస్తున్నారు. వీరి నుంచి మాత్రమే ప్రజలు ఆశీస్సులను పొందాలని ఈ ఎల్లో మీడియా రుషులు చెబుతున్నారు. మిగిలిన వారంతా వారికి రాక్షసులతో సమానం.కూటమి ప్రభుత్వ సూచనల మేరకే పోలీస్ కేసులు..కూటమి ప్రభుత్వ నిర్భందాలు బద్దలు కొడుతూ రైతులు వైఎస్ జగన్ రాకను స్వాగతించారు. ఈ రైతులను మేం తీసుకురాలేదు, జన సమీకరణ అసలే చేయలేదు. పోలీసులు చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారమే పర్యటన సాగినా కూడా మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. రైతులు తమ మామిడి పంటను రోడ్డుపైన పారేస్తే, దానికి కూడా వైఎస్ జగన్ కారణమని పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు. ..వైఎస్ జగన్‌పై కక్షసాధించాలనే తలంపుతోనే ఇలా చేస్తున్నారు. చివరికి వైఎస్ జగన్‌ను కలిసేందుకు వస్తే రౌడీషీట్లు కూడా తెరుస్తామని కూడా బెదిరించారు. మామిడి రైతులను కలుసుకునేందుకు వైయస్ జగన్ వస్తున్నారని తెలియగానే చంద్రబాబు హుటాహుటిన పల్ప్ ఫ్యాక్టరీ యజమానులుతో సమావేశం నిర్వహించారు. కేజీ రూ.6 కి కొనుగోలు చేయాల్సిందేనని ఒత్తిడి చేశారు. ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుందని ప్రకటించింది. ..అప్పటి వరకు బయట ఉన్న వందల లారీలకు స్పీడ్‌గా టోకెన్లు జారీ చేసింది. ఇవ్వన్నీ వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసిన తరువాత చేసినవే. గత ఏడాది వైఎస్ జగన్ హయాంలో మామిడికి మద్దతుధర కేజీకి రూ.29 రూపాయలు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో వస్తున్న ధర రూ.2 మాత్రమే. పొరుగురాష్ట్రం కర్ణాటకలో రెండున్నల లక్షల టన్నుల మామిడిని కేజీ రూ.16కి కొనుగోలు చేస్తామని కేంద్రాన్ని ఒప్పించుకోగలిగితే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అలా చేయలేక పోయారు? గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించే పొగాకు, మిర్చి, ధాన్యం రైతులు కూడా ఈ ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వ దృష్టిలో సంఘ విద్రోహులేనా? ఆఖరి అరగంట తరువాత జగన్‌కు భద్రతను లేకుండా చేశారు..వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఆఖరి అరగంట వరకు సెక్యూరిటీని టైట్ చేసి, తరువాత భద్రతను ఎందుకు పూర్తిగా వదిలేశారు. అంటే వైఎస్ జగన్‌ను ఏమైనా చేయాలనే కుట్ర దీనిలో దాగుందా? ఎక్కడా వైఎస్ జగన్‌కు పోలీస్ రక్షణ లేకుండా చేసేశారు. జెడ్‌ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకుడి విషయంలో ఇలాగేనా చేసేది? రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉంటే, మార్కెట్ యార్డ్‌లో మూడు వందల మంది పోలీసులను మోహరింపచేశారు. కానీ ఆఖరి క్షణంలో ఆయన పక్కన ఎవరూ లేకుండా పోవడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. -
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన దిగ్విజయమైంది: భూమన
-
అచ్చెన్నా.. జగన్‌కు జనామోదం, మీకు జనాగ్రహమే
జగన్ బంగారుపాళ్యం పర్యటన ఒక సినిమా సెట్టింగ్లా ఉందంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఈ పర్యటనకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించినా.. జనం తండోపతండాలుగా తరలి వచ్చారని, ఇది ప్రభుత్వంపైన జనాలకు ఉన్న ఆగ్రహమేనని భూమన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన విజయవంతం కావడం పట్ల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి.. కార్యకర్తలకు, మామిడి రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపైనా భూమన మండిపడ్డారు. ‘‘మద్దతు ధర పేరిట మీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జగన్ పర్యటన ఖరారు కావడంతో.. కిలో రూ.6 ఇచ్చిన అగ్రిమెంట్లు ఉన్నాయి. మంత్రిగారూ(అచ్చెన్నను ఉద్దేశించి..) ఒక్కసారి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు దగ్గరికి రండి. యాభై శాతం మామిడి తోటల్లో మామిడి పంట కోయలేదు. లక్ష యాభై వేల టన్నుల మామిడి ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయి. లక్ష డెబ్భై వేల టన్నులు తోటల్లో ఉందని స్వయానా ఫుడ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి చెప్పారు. మామిడి రైతులు కడుపు మండి రోడ్డు పక్కనే మామిడి కాయలు పారాబోశారు.. అది గమనించండి ముందు.. మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి వైఎస్ జగన్ వచ్చారు. ఈ పర్యటనకు అడుగడుగునా అవాంతరాలు సృష్టించారు. మా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. చాలామందిని గృహ నిర్బంధం చేశారు. సుమారు 1,600 మంది పోలీసులను మోహరించారు. ఎస్పీ స్థాయి అధికారి రౌడీ షీట్ తెరుస్తామని బెదిరించారు. భయానక వాతావరణం సృష్టించారు. ఇంకోపక్క.. జగన్ పర్యటనలో పాల్గొనవద్దని రైతులను అడ్డుకున్నారు. బంగారుపాళ్యంలో ఇవాళ హిట్లర్ పాలన తరహా ఛాయలు కనిపించాయి. జిల్లా ఎస్పీ అనుమతి మేరకే హెలిప్యాడ్, రూట్ మ్యాప్ ఇచ్చి మీరు అడ్డుకున్నారు. పోలీసు వ్యవస్థను ప్రయోగించినా.. జగన్ కోసం జనం ప్రాణాలను పణంగా పెట్టి మరీ భారీగా తరలి వచ్చారు. దారి పొడవునా భయపెట్టిన గుట్టలు, కొండలు, తుప్పలు దాటుకుని వచ్చారు. వీళ్లంతా దగా పడ్డ వారే. మా కార్యకర్తలు, మామిడి రైతులను పోలీసులు అడ్డుకుని లాఠీ చార్జి చేశారు. ‘నా కళ్ల ముందే కొడుతున్నారు..’ అని జగన్ కూడా అన్నారు. ఇది చూసి.. స్వాతంత్ర్య పోరాట స్పూర్తితో వీళ్లంతా ముందుకు కదిలారా? అని నాకనిపించింది. పోలీసులకు ధన్యవాదాలు చెప్తున్నా.. మీ నిర్బంధాలనే కోట గోడల్ని పగలగొట్టి రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలి వచ్చారుజగన్ ఇవాళ రోడ్ షో చేయలేదు. జగన్ వెంట వచ్చింది అభిమాన గణం. ఆ అభిమానంతో బంగారుపాళ్యం వెళ్లే దారులు అన్ని కిక్కిరిసి పోయాయి. అంచనాలకు మించి రైతులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ పర్యటనతో దేశంలోనే మా నాయకుడు(వైఎస్ జగన్).. అత్యంత ప్రజాదరణ నాయకుడు అని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం అణచివేత చర్యతో జనాగ్రహం.. జగన్‌కు జనామోదం అని స్పష్టమైంది. కూటమి ప్రభుత్వ నియంతృత్వ చర్యల్ని ప్రజలు చూస్తున్నారు. మీ రాజకీయ గోతి మీరే త్రవ్వుకుంటున్నారు అనేది గ్రహించక పోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. చంద్రబాబు కూటమిని కూకటి వేళ్ళతో పీకేస్తారని జగన్ బంగారుపాళ్యం పర్యటన నిరూపించింది. ఇవాళ్టి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసేసింది అని భూమన అన్నారు. -
‘ఎస్పీ రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణం’
తిరుపతి: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కోసం వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను భగ్నం చేయాలనే చంద్రబాబు కుట్రలకు అనుగుణంగా జిల్లా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనపై శాంతిభద్రతల అంశాన్ని అడ్డం పెట్టుకుని జిల్లా ఎస్పీ మణికంఠ రాజకీయ వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రైతులు తమ పంటలను లారీల్లో మార్కెట్ యార్డ్‌కు తీసుకురాకూడదని, వారు వాటిని రోడ్డుపై పారవేసి రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోమంటూ జిల్లా ఎస్పీ రాజకీయంగా మాట్లాడటం వెనుక చంద్రబాబు డైరెక్షన్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను కలిస్తే రౌడీషీట్లు తెరుస్తామంటూ రైతులను, పార్టీ శ్రేణులను బెదిరించడం చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు బుధవారం ప్రతిపక్షనేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళెం మామిడి మార్కెట్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు ఇస్తున్నామని ఒకవైపు చెబుతూనే, మరోవైపు పోలీసులు అనేక ఆంక్షలును విధిస్తున్నారు. ఎక్కడికక్కడవైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులు ఇస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన కూడదంటూ ముందస్తు అరెస్ట్‌లతో భయోత్పాతానికి గురి చేస్తున్నారు. బస్తర్ అడవుల్లో నక్సల్స్‌ను వేటాడుతున్నట్లుగా చిత్తూరు జిల్లాలోవైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వెంటాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ మీద, పోలీస్ అధికారుల మీదవైఎస్సార్సీపీకి మంచి గౌరవం ఉంది. కానీ దానికి భిన్నంగా వైఎస్ జగన్ పర్యటనను దెబ్బతీసేలా అదే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది. జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడుతూ జన సమీకరణ చేస్తున్న వారిని గుర్తిస్తున్నాం, వారిని అరెస్ట్ చేసి, రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ కోసం వచ్చే రైతులు ఆటోలు, మోటార్ సైకిళ్ళపై వస్తుంటే, వారి వాహనాలకు పెట్రలో, డీజిల్ పోయవద్దంటూ పోలీసులే పెట్రలో బంక్ నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. ఆటోల్లో వైఎస్ జగన్ కోసం వచ్చే రైతులు ఎక్కించుకోవద్దని, అలా చేస్తే కేసులు పెడతామంటూ వారిని కూడా బెదిరిస్తున్నారు.పదిమంది రైతులు మాత్రమే మాట్లాడాలని ఆంక్షలుతమ అభిమాన నాయకుడిని చూడాలని రైతులతో పాటువైఎస్సార్సీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు కూడా వస్తుంటే, వారిని కూడా శాంతిభద్రతల సమస్యను ముందు పెట్టి అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు.వైఎస్సార్సీపీ అభిమానులు, పార్టీ శ్రేణులను గూండాలు, రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం సమంజసం కాదు. ప్రజల హక్కులను కూడా కాలరాయాలని అనుకోవడం రాజ్యాంగ విరుద్దం. మార్కెట్ యార్డ్‌లో వైఎస్ జగన్‌ను కలిసేందుకు గరిష్టంగా పదిమందిని మాత్రమే అనుమతిస్తామని జిల్లా ఎస్పీ చెప్పడం దారుణం. ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మామిడి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల అప్పులపాలై, తమను ఎవరు ఆదుకుంటారా అని ఆక్రోశిస్తున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు వస్తున్న వైఎస్ జగన్‌ను రైతులు కలవడానికి కూడా ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామికమా? ఇప్పటి వరకు మామిడి రైతులు కనీసం తమకు జరిగిన నష్టాన్ని కష్టాన్ని గొంతువిప్పి బయటకు చెప్పుకోలేని నిర్భందంలో ఉన్నారు. అలాంటి వారికి వైఎస్ జగన్ అండగా నిలిచేందుకు వస్తుంటే సహించలేక పోతున్నారు.పోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయంపోలీసులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. జిల్లా ఎస్పీతో మాట్లాడించిన మాటలు చూస్తే శాంతిభద్రతలను కాపాడే అధికారులు మాట్లాడే మాటలు కావు అవి. జగన్‌ను కలిసేందుకు వచ్చే వారిపై రౌడీషీటర్లు తెరుస్తామని ఎలా బెదిరిస్తారు? వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకుంటాం, ఆయనను నిలదీస్తాం, ఆయనతో వాగ్వివాదంకు దిగుతామని హెచ్చరిస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకు మాత్రం పోలీసులు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలా మాట్లాడకూడదంటూ కనీసం వారిని వారించే ప్రయత్నం కూడా జిల్లా పోలీస్ అధికారులు చేయలేదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు హెచ్చరిస్తుంటే పోలీసులకు వినిపించడం లేదా? జిల్లా ఎస్పీతో ఇలా మాట్లాడిస్తున్నది కూటమి ప్రభుత్వం కాదా, సీఎం చంద్రబాబు కాదా? రైతులను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. రైతులకు శిక్షణ కూడా ఇచ్చారంటూ మాట్లాడటం దారుణం’ అని ధ్వజమెత్తారు -
భూమన కామెంట్స్ పై రోజా షాకింగ్ రియాక్షన్
-
వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు
-
అదంతా కూటమి కుట్రే.. జగన్ రైతులను కలవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి ప్రభుత్వం మామిడి రైతులతో చలగాటం ఆడుతుందని ఆరోపించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరులో కుమార్ అనే రైతును ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. బిన్ లాడెన్‌పై అమెరికా దాడిచేసినట్లు.. మారుమూల గ్రామంలో ఉన్న రైతును కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు. రైతుల కోసం వైఎస్ జగన్ తప్పకుండా వస్తారు.. వారిని కలిసి కష్టాలను తెలుసుకుంటారు అని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల కోసమే బంగారుపాల్యం గ్రామానికి వైఎస్ జగన్ వస్తున్నారు. అందుకే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారు. జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం.. అందుకే రైతులను రాకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క వైఎస్సార్సీపీ నాయకులను భయపెడుతున్నారు. జనసేన, టీడీపీ వారు జగన్ పర్యటన రద్దు అయిందని అంటున్నారు. జగన్ రావడం.. రైతులను కలవడం ఖాయం.కర్ణాటకలో మామిడికి ప్రభుత్వం మంచి ధర కల్పించింది. కానీ, చిత్తూరులో కుమార్ అనే రైతు నష్టాలకు భరించలేక, చెట్లు నరికేశాడు. దానికి ఫారెస్టు అధికారులు.. కుమార్‌ను నా ఇబ్బందులకు గురి చేశారు. అటవీశాఖ పవన్ కళ్యాణ్ అధీనంలో ఉంది. ఓ మామిడి రైతును ఎర్ర చందనం స్మాగ్లర్ గా చూపించారు. తన తోటలో తోతాపురి మామిడి కుళ్లిపోయే పరిస్థితి వచ్చింది. మామిడి రైతులతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతుంది. వైఎస్సార్సీపీ నాయకులు నిజాలు చెబితే తట్టుకోలేకపోతున్నారు.వైఎస్ జగన్ పర్యటనపై నిర్బంధాలను విధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ప్రజా సముద్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు. వైఎస్ జగన్ రాష్ట్రంలోనే అత్యధిక, అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. జగన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టే పద్దతి మారాలి. హెలికాప్టర్ అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరాము’ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాటలను మేము పట్టించుకోము. ఎవరో చెప్పారు. నేను లేస్తే మనిషి కాదని బెదించేవాడంటా.. ప్రజలు కూడా అతనికి భయపడేవారు.. వాస్తవానికి అతనికి కాళ్లే లేవు.. పవన్ కళ్యాణ్ మాటలు కూడా అలా ఉంటాయ్.. వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ ఎద్దేవా చేశారు. -
తిరుపతి మద్యం షాప్స్ వద్ద ప్రస్తుత పరిస్థితి..
-
‘ ఇలాంటి చర్యలు సహించేది లేదు’
తిరుపతి: తిరుపతిలో మళ్ళీ యధేచ్ఛంగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తెల్లవారుజాము నుంచే మద్యం దుకాణాలు బార్లా తెరుస్తున్నారని, 24 గంటల పాటు మద్యం దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్సైజ్ అధికారుల ప్రోత్సాహంతోనే ఇది జరుగుతోందని, ఇలాంటి చర్యలు సహించేది లేదని హెచ్చరించారు భూమన.తిరుపతిలో ఈ తరహా చర్యలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎక్సైజ్ ఎస్పీలకు విజ్ఞప్తి చేస్తున్నానని, రూల్స్‌కు విరుద్ధంగా సాగుతున్న మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. వీటిపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు భూమన. -
కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. సాంప్రదాయానికి తూట్లు పొడవటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నిస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.వేద పారాయణానికి తూట్లు పొడవటానికి సిద్ధమవుతున్నారు. వేదమంటే బ్రహ్మదేవుని వాక్కు. కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు. వేద పారాయణదారుల మీద వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారు. వేదం ఎవరికి అర్థం కాదని ప్రచారం చేస్తున్నారు. వేదాలను వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. కూటమి పాలనలో మన పూర్వీకులను అధికారులు అవమానిస్తున్నారు’’ అని భూమన ధ్వజమెతారు.‘‘శాసనాలు చెదిరినా వాక్కు ద్వారా వచ్చిన వేదం మరిచిపోలేదు. వేద పండితులు మన సనాతన, వేద వారసత్వాన్ని కాపాడుతున్నారు. వేదమంటే మన భారతీయ సంస్కృతి. ఓ అధికారి అధికార గర్వంతో వేదాలను అవమానిస్తున్నారు. ఆ అధికారి అధికార గర్వాన్ని అడ్డుకోవాలి. మన హిందూ జాతి మేల్కోవాలి. వేదాలను కాపాడుకోవాలి. నేను రాజకీయం చేయడం లేదు.. మన వేదాలను కాపాడుకోవాలి’’ అని భూమన పిలుపునిచ్చారు.‘‘ఏడు యజర్వేదాలు ఏడు కొండలయ్యాయని వేదాలు చెబుతున్నాయి. శ్రీవారి కొలువులో నాలుగు వేద పఠనాలు సాగుతుంటాయి. చతుర్ముఖ బ్రహ్మ నాలుగు వేదాలు స్వామి వారి కోసం పారాయణం చేస్తారు. స్వామివారి సేవలో వేదాలు పఠిస్తుంటారు. వేల సంవత్సరాలుగా వేద పఠనం జరుగుతోంది. టీటీడీ చాలా చోట్ల వేద పాఠశాలలు నిర్వహిస్తుంది...వైఎస్సార్ వేద విశ్వ విద్యాలయాన్న నెలకొల్పారు. పీవీఆర్కే ప్రసాద్ రాసిన పుస్తకాన్ని ఆ అధికారి చదవాలి. వేద పారాయణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 700 పోస్టులు సృష్టించింది. మేం ఓడిన తర్వాత ఆ పోస్ట్‌లు ఏమయ్యాయో తెలియదు. వేదాలపై కామెంట్ ఆ అధికారి స్కంద పురాణం చదవాలి. చంద్రబాబు అనుమతి లేకుండా ఆ అధికారి మాట్లాడుతారా అనే అనుమానం ఉంది’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
చెవిరెడ్డి అరెస్ట్ ను ఖండించిన భూమన కరుణాకర్‌రెడ్డి
-
జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం: భూమన
సాక్షి, తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులందరిపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమన్న భూమన.. తప్పుడు కేసులు బనాయించడంలో చంద్రబాబు ప్రభుత్వం రాటుదేలిపోయిందన్నారు.చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. నిన్న పల్నాడులో ఏం జరిగింది ప్రత్యక్షంగా చూశారు. వైఎస్ జగన్ బయటకు వస్తే ప్రజలు కడలి వలె ఉప్పొంగి తరలి వస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు అండగా ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది పాటు వైఎస్సార్సీపీపై విష ప్రచారం చేయడానికే వెచ్చించారు’’ అంటూ చంద్రబాబు సర్కార్‌పై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఏడాదంతా మోసమే.. అంతా అభూత కల్పనే’
తిరుపతి: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిస్తూనే ఉందని విమర్శించారు తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుడ భూమన కరుణాకర్‌రెడ్డి. తమ నాయకుడు వైఎస్ జగన్.. రూ. 2 లక్షల 80 కోట్లు డీబీటీ రూపంలో ప్రజలకు నేరుగా అందిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. ఈరోజు(ఆదివారం, జూన్ 15వ తేదీ) ‘జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని భూమన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు సిఫాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యే సునీల్, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా భూమన మాట్లాడుతూ.. 2 కోట్ల 7 లక్షల మంది మహిళలకు నెలకు రూ. 1500 ఇవ్వకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన వ్యక్తి.. ఈ రోజు మోసం చేసిన విషయం కళ్లకు కనపడుతోందన్నారు. 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం మోసం. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని మోసం. తల్లికి వందనపై ప్రశ్నించే వాళ్లకు బెదిరింపులు. ఈ ఏడాది మొత్తం మోసాలు చేశాడు.. ఒక అభూత కల్పనతో మోసగించాడు. వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేయించి కేసులు పెట్టి జైల్లో పెట్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు’ అని భూమన ధ్వజమెత్తారు. -
విమాన ప్రమాద ఘటనపై YSRCP క్యాండిల్ ర్యాలీ..
-
ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం మొదలైంది: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోకు ఆయన కూటమి ప్రభుత్వ హామీల వినతి పత్రం సమర్పించారు. వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు. వైఎస్సార్సీపీ నేతలపై ఇప్పటిదాకా 2,466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయం పై పేద ప్రజలు పక్షనా పోరాటాలు కొనసాగిస్తాం.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పూరించిన సమరశంఖంలో ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం అయ్యింది అని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట
సాక్షి, అమరావతి/సాక్షి,నెట్వర్క్: ఎన్నికల హామీలు అమలుచేయకపోవడం.. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు మరోసారి తెరతీశారని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్టని.. దాని అమలులో భాగంగానే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా కక్ష సాధిస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి, సాకే శైలజానాథ్, అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, వరుదు కళ్యాణి, మార్గాని భరత్‌రాం శనివారం వేర్వేరుచోట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని వారు హెచ్చరించారు. ఎవరెవరు ఏమన్నారంటే..ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిటైర్డ్ అధికారులను అక్రమంగా అరెస్టుచేసింది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలనే దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా అసలు జరగని మద్యం స్కాంలో రిటైర్డ్ అధికారులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్టుచేయడం విడ్డూరం. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపిన చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – భూమన కరుణాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి లిక్కర్ స్కాంలో అసలు దోషి బాబే..లిక్కర్ స్కాంలో అసలు దోషి చంద్రబాబే. ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన, సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టుచేశారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కాం జరిగింది. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుచేసి, వాటి యజమానులకు దాదాపు రూ.1,300 కోట్ల లాభం చేకూర్చారు.2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కాం జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కాంలో ఇలాంటిది ఉందా? ఇక మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆదాయం వస్తుందో టీడీపీ నేతలు చెప్పాలి. ఏపీలో ఉన్న అన్ని డిస్టిలరీలకు అనుమతులిచ్చింది చంద్రబాబే. అంతేకాక.. 69 శాతానికి పైగా ఆర్డర్లు నాలుగైదు డిస్టిలరీలకే ఇచ్చారు. ఇదంతా స్కాం కాదా? పైగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నడిపే మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి జైలు అధికారుల మార్పులో బాబు కుట్ర..విజయవాడ జైలు అధికారులను హఠాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు భారీ కుట్ర ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్టయిన వారంతా విజయవాడ జైలులో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారు. ఒకవైపు సంబంధంలేని అంశాల్లో కొందరు ప్రభుత్వాధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులతో వారిని జైలులో హింసించాలన్నదే చంద్రబాబు కుతంత్రంగా కనిపిస్తోంది. 2018–19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.16,900 కోట్లు అయితే.. 2023–24లో అది రూ.24,700 కోట్లు. నిజంగా, చంద్రబాబు చెబుతున్నట్లుగా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఎలా పెరిగింది? వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గి ఆదాయం పెరిగింది. అదే ఇప్పుడు బాబు హయాంలో లిక్కర్ సేల్స్ పెరిగి ఆదాయం తగ్గింది. దీని మతలబు ఏమిటో చంద్రబాబే చెప్పాలి. ఈ తగ్గిన ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఇది స్కాం కాదా? – మార్గాని భరత్, వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అణిచివేయాలనుకుంటే మరింత బలోపేతమవుతాం..వైఎస్సార్సీపీని అణిచివేయాలని చూస్తే మరింత బలోపేతమవుతాం. గతంలో ఒకసారి వైఎస్సార్సీపీని అణగదొక్కాలని కాంగ్రెస్‌తో చంద్రబాబు జట్టు కట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చిఏడాదైనా ఎన్నికల హామీలను అమలుచేయడంపై చంద్రబాబు దృష్టిపెట్టలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమయ్యారు. వైఎస్ జగన్ బలహీనపరిచేందుకు లిక్కర్ స్కామ్ సృష్టించారు. – అంబటి రాంబాబు, మాజీ మంత్రిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు..చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోవడంతోపాటు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దుచేసి, మద్యం షాపులు, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకి దమ్ముంటే ఆయనపై నమోదైన ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలి.– ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజకీయ అరాచకం ఎక్కువైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకులపైనే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. కొందరు అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. సర్వీస్‌లో ఉన్న వారినే కాకుండా రిటైర్డ్ అధికారులనూ అరెస్టు చేస్తున్నారు. ఒక్క ఆధారం లేకపోయినా లిక్కర్ స్కాం జరిగిందంటూ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చివరకు హైకోర్టు న్యాయమూర్తులు అక్షింతలు వేసినా సిగ్గులేకుండా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది. వైఎస్ జగన్‌ను నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు లిక్కర్ స్కాం రూ.10వేల కోట్లు..మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందంటూ అనవసర యాగీ చేస్తున్న టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్‌స్టేషన్‌కు, ఎక్సైజ్ స్టేషన్‌కు మామూళ్లు అందుతున్నాయని, తమ ప్రభుత్వంలో మామూళ్ల ప్రస్తావనే లేదన్నారు. ప్రస్తుతం ప్రతి మద్యం షాపు యజమాని ఎక్సైజ్ శాఖకు రూ.70 వేలు, పోలీస్‌స్టేషన్‌కు రూ.30 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా చెల్లిస్తున్నారని, కిందిస్థాయి నుంచి అమరావతి వరకు ఎవరి వాటా వారికి చేరుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తద్వారా నెలకు సుమారు రూ.100 కోట్ల వరకు మద్యం మామూళ్లు యువరాజు లోకేశ్‌కు అందుతున్నాయని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,200 కోట్ల అవినీతి జరుగుతోందన్నారు. ఇక డిస్టలరీల నుంచి నేరుగా చంద్రబాబుకు ఏడాదికి రూ.1,000 కోట్లు అందుతోందన్నారు. నక్కలు, తోడేళ్లు కలిసి రూ.1,000 కోట్లు తింటే.. సింహం ఏకంగా రూ.1,000 కోట్లు ఆర్జిస్తోందన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి రూ.10వేల కోట్లకు పైగా అవినీతి జరుగుతుంటే.. జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారన్నారు.ఇదే అత్త కోడలికి సుద్దులు చెప్పడం అని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఆరు పథకాలను అమలుచేయలేని చంద్రబాబు 60 కేసులు పెట్టి 60 మందిని జైలుకు పంపాడని, ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నాడన్నారు. మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానిది అంతా దోపిడీ అని, ఐదేళ్లలో రూ.10వేల కోట్ల అవినీతి జరుగుతుందని, టీడీపీ నేతలకు దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. – మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి..అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయి. రాజ«దాని పేరుతో కూటమి ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటోంది. హామీల అమలును విస్మరించి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. – ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేరాష్ట్రంలో శాంతిలేదు..రాష్ట్రంలో ఎక్కడా శాంతి లేదు.. ప్రజలకు భద్రత అసలు లేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. శనివారం అనంతపురం జిల్లా రాప్తాడులో దంపతులను టీడీపీ రౌడీమూకలు చంపినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయి. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ -
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది
-
చంద్రబాబు కుట్ర ఇదే: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్‌లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీని నాశనం చేయాలని, వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్సార్సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు...గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్‌లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాదించుకున్నారు...తప్పుడు ఆరోపణలతో వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారి చిత్తశుద్దితో పనిచేస్తారు? ఎక్కడా జరగని మద్యం కుంభకోణంను సృష్టించి, దీనిలో వైఎస్ జగన్‌ను ఇరికించి, అరెస్ట్ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు...ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి, ఇదే తరహాలో పాలన సాగించాలని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు చేస్తున్న తప్పులను కృష్ణుడి మాదిరిగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రయోగిస్తూ, గత వైయస్ఆర్సీపీపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలను చూసి రేపు మన భవిష్యత్తు ఏమిటీ అనే ఆత్మ మథనం అధికారుల్లో ప్రారంభమైంది’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
తిరుపతి రుయాలో అనిల్ ను పరామర్శించిన భూమన కరుణాకర్ రెడ్డి
-
అమానుషం.. అమానవీయం
తిరుపతి మంగళం/నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)/ సాలూరు/ బద్వేలుఅర్బన్/సాక్షి, నరస రావుపేట/ పెదకూరపా డు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విడదల రజని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సైతం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ మెప్పు పొందేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు.చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు.. మాజీ మంత్రి, బీసీ నేత అని కూడా చూడకుండా విడదల రజని పట్ల ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీఐ గారూ.. సీఐ గారూ.. అని ఆమె పదే పదే గౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమెను కారు నుంచి కిందకు లాగేయడం ఎంత దుర్మార్గం.. అని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలి పట్ల కూడా అర్ధరాత్రి పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల బెదిరింపులకు, కక్ష సాధింపులకు, కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నా భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నంబూరు శంకరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన కీచకపర్వాన్ని తలపిస్తోందని వైఎస్సారీసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మహిళా నేతలతో కలసి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేలా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మహిళ మంత్రి విడదల రజని పట్ల పోలీసుల తీరు సరికాదని ఖండించారు.కొందరు పోలీసు అధికారులు సభ్యత, సంస్కారాలు మరచి వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ అన్న కనీస గౌరవ మర్యాద లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరుపతి : గంగమ్మా..కరుణించమ్మా సారె సమర్పించిన భూమన (ఫొటోలు)
-
ముంతాజ్ హోటల్‌కు రూ.వేల కోట్ల విలువైన టీటీడీ భూములు: భూమన
తిరుపతి: పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్‌కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు అలిపిరి సమీపంలోని టీటీడీ భూమిని ఏపీ టూరిజంకు బదలాయించేందుకు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించిందన్నారు. టీటీడీ బోర్డ్ చరిత్రలోనే ఇలా ఒకే ఎజెండా కోసం అత్యవసర సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. శ్రీవారి పాదాల మంటపం అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై సాధుపుంగవులు, హిందూ సమాజం స్పందించాలని కోరారు. ఇంకా ఆయనేమన్నారంటే...ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది. భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు. కానీ ఈ పాలకమండలి సమావేశంలో అలిపిరికి అంటే శ్రీవారి పాదాల మంటపంకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో టీటీడీకి చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ఏపీ టూరిజంకు బదలాయించాలనే ఎజెండా అంశాన్ని అంగీకరిస్తూ తీర్మానం చేశారు.తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ 588ఏ లో టీటీడీకి ఉన్న 24.68 ఎకరాలు, అలాగే ఇదే సర్వే నెంబర్ లో ఉన్న మరో 10.32 ఎకరాల భూమిని ఏపీ టూరిజం అథారిటీకి ఇవ్వాలని, దానికి బదులుగా ఏపీ టూరిజంకు తిరుపతి రూరల్ మండలం పేరూరులో సర్వే నెంబర్ 604 లో ఉన్న 24.68 ఎకరాలు, మరో 10.32 ఎకరాలను టీటీడీ తీసుకోవాలనే అంశంపై తీర్మానం చేశారు.గతంలో ఓబెరాయ్ సంస్థకు హోటల్ నిర్మాణం కోసం వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, శ్రీవారి పవిత్రతకు దెబ్బతీస్తోందంటూ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పెద్ద ఎత్తున హంగామా సృష్టించి, మాపైన బుదరచల్లారు. సాధుపుంగవులు కూడా దీనిని వ్యతిరేకించారు. ఇదే క్రమంలో చంద్రబాబు తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి వచ్చినప్పుడు ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాని, ప్రత్యామ్నాయంగా సమీపంలోనే మరో స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు.ఇప్పుడు శ్రీవారి అలిపిరికి సమీపంలోనే టూరిజం అథారిటీకి టీటీడీ భూములను కట్టబెట్టడం ద్వారా ముంతాజ్ హోటల్‌ను అక్కడ నిర్మించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అత్యవసర బోర్డ్ అత్యవసర సమావేశం నిర్వహించి తీర్మానం చేసి, వెంటనే ఈ భూబదలాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదేనా శ్రీవారి పవిత్రను కాపాడే విధానం? ఆనాడు ముంతాజ్ హోటల్ ను వ్యతిరేకిస్తూ హిందూసమాజం ఆందోళనలు చేస్తే, దానిని సమర్థించిన చంద్రబాబు ఇప్పుడు అదే సంస్థకు ఏకంగా టీటీడీ స్థలానే ఎలా కేటాయిస్తున్నారు? దీనిపై హిందూ సమాజం, సాధుపుంగవులు స్పందించాలి. ఓబెరాయ్ హోటల్ కు ప్రత్యమ్నాయ స్థలాన్ని చూపించాల్సి ఉంటే, ఎయిర్ పోర్ట్ ఏరియాలో ప్రభుత్వ స్థలాలా ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఇవ్వాలే తప్ప టీటీడీ స్థలంను ఎలా కట్టబెడతారు?ప్రభుత్వ తప్పిదాల మీద, అవకతవకలపై నేను పెద్ద ఎత్తున స్పందిస్తున్నాను కాబట్టే నాపైన కూటమి ప్రభుత్వం వేధింపులు ప్రారంభించింది. ఎల్లో మీడియా ద్వారా అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారు. 2004లో నక్సల్స్‌తో ప్రభుత్వ చర్చల సందర్భంగా నక్సల్స్ ప్రధాన ఎజెండాలో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రభుత్వానికి చెందిన చెరువులు, పోరంబోకు స్థలాలు, కుంటలను రామోజీరావు ఆక్రమించారని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆనాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఈరోజు రామోజీ కుమారుడు కిరణ్ నేతృత్వంలో నడుస్తున్న ఈనాడు పత్రిక నాపైన భూకబ్జా ఆరోపణల చేస్తుండటం విడ్డూరంగా ఉంది. నిజంగా నేను ఎక్కడైనా భూ ఆక్రమణలకు పాల్పడితే నిరూపించమని సవాల్ చేస్తున్నాను. నాలుగేళ్ల పాటు కూటమి ప్రభుత్వం నాపైన వేధింపులకు, అక్రమ కేసుల బనాయింపులకు పాల్పడుతుందని చాలా స్పష్టంగా తెలుసు. అయినా కూడా ఈ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం కొనసాగిస్తూనే ఉంటాను. హైదరాబాద్ కోహినూరు హోటల్లో రాసలీలలు చేసి, ప్రభుత్వ భూములు కబ్జాలు చేయాలనుకున్న ఒక పెద్ద నేత నాపైన విచారణకు ఆదేశించారంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. వీటికి భయపడేది లేదు. -
మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. కేసులు పై భూమన రియాక్షన్
-
‘100 కేసులు పెట్టినా భయపడను.. ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటా’
సాక్షి, తిరుపతి: వ్యక్తిత్వ హననం చేస్తే భయపడతాం అనుకుంటే మీ భ్రమే అంటూ కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. న్యాయం మా వైపు ఉంది. నాపై 100 కేసులు పెట్టినా భయపడను. ఏ తప్పు జరిగినా నేను నిలదీస్తూనే ఉంటా. మీ పాలనలో జరిగే అరాచకాలు ప్రశ్నించకపోతే పాపం అవుతుంది. దేవుడిని అడ్డుపెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు’’ అంటూ భూమన ధ్వజమెత్తారు.తప్పుడు కేసులు.. భూమన పోరాటాలను ఆపలేవు: ఎంపీ గురుమూర్తితిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, భూమన కరుణాకర్‌రెడ్డిపై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. 30 వేల మహిళలు కనిపించడం లేదని.. వాలంటీర్లు వ్యవస్థ వలనే జరిగిందని పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తే మేము కేసు పెట్టలేదు. ఇవాళ వాస్తవంగా గోశాలలో జరిగిన గోవుల మృతిపై ప్రశ్నించిన భూమనపై కేసు నమోదు చేస్తారా..?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘విద్యార్థి దశ నుంచి పోరాటాలతో ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడిన వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి. ఇలాంటి తప్పుడు కేసులు ఆయన పోరాటాలను ఆపలేవు. గోవుల మృతిపై రాజకీయం చేసి కూటమి నేతలు వివాదం చేస్తున్నారు’’ అని గురమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
KSR Live Show: ఛాలెంజ్ చేసి దొరికిపోయారు.. బయటపడ్డ గోశాల నిజం
-
చంద్రబాబు, పవన్ లు నాకు శత్రువులు కాదు
-
YSRCP నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు
-
తొడగొట్టి.. తోక ముడిచారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గోవుల మరణాలను నిరూపించాలంటూ సవాల్ విసిరిన టీడీపీ సత్తా లేక తోక ముడిచింది. సవాల్‌ను స్వీకరించే ధైర్యం లేక వైఎస్సార్సీపీ నేతలను పోలీసుల ద్వారా అడుగడుగునా అడ్డుకుని గృహ నిర్బంధంలోకి తీసుకుంది. ఒకపక్క వారిని పోలీసులతో అడ్డుకుంటూ మరోపక్క గోశాల వద్దకు రావడం లేదంటూ కూటమి నేతలు పథకం ప్రకారం అ నుకూల మీడియాలో దుష్ప్రచారం చేయించారు. రోజంతా పోలీసుల ద్వారా హైడ్రామా నడిపించారు. గురువారం తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించి బయటకు రాకుండా అడ్డుకున్నారు. గోశాల వద్దకు వెళ్లిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయరెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. భూమన కరుణాకరరెడ్డిపైనా కేసు నమోదు చేశారు. వైఎస్సార్ సీపీపై బురద చల్లాలని యత్నించిన కూటమి పార్టీల నేతలు అభాసుపాలయ్యారని తిరుపతిలో వారం నుంచి జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తున్న స్థానికులు చర్చించుకుంటున్నారు. కునుకు లేని కూటమి నేతలు.. టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి బయటపెట్టిన సంచలన నిజాలు కూటమి నేతలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుకునేందుకు వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. దమ్ముంటే గోశాలకు వచ్చి నిరూపించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ‘ఎక్స్’ వేదికగా సవాల్ విసరడంతో వెంటనే స్పందించిన భూమన గురువారం ఉదయం 10 గంటలకు వస్తానని ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఉలిక్కిపడ్డ కూటమి నేతలు రాత్రికి రాత్రే పోలీసులను ఉసిగొల్పారు. వైఎస్సార్సీపీ నేతలెవరూ గోశాల వద్దకు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సవాల్ విసిరిన పల్లా శ్రీనివాసరావు పత్తా లేకుండా పోయారు. మీడియా ఎదుటే ఆయనకు భూమన ఐదుసార్లు ఫోన్ చేసినా స్పందించలేదుఅర్ధరాత్రి దిగ్బంధం.. కూటమి నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటాక 1.10 గంటల సమయంలో తిరుపతి తుమ్మలగుంటలో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల నివాసాల వద్దకు చేరుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్‌బ్యాంక్ అధ్యక్షుడు రామారావుతో పాటు సుమారు 18 మంది వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి భూమన నివాసానికి చేరుకునే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో భూమన నివాసంలోకి వెళ్లిన పోలీసులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వచ్చి, వెళ్లే వరకు గోశాలకు వెళ్లడానికి వీల్లేదని తెలిపారు. సవాల్ విసిరాక తాను వెళ్లక తప్పదని భూమన వారికి చెప్పారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భూమన క్యాంపు కార్యాలయం నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చంద్రగిరి నియోజక వర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు టీటీడీ గోశాలకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మూడు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుకు నిరసనగా భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నారాయణస్వామి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మంత్రి ఆర్కే రోజా, సత్యవేడు సమన్వయకర్త రాజేష్ తదితరులు భూమన క్యాంపు కార్యాలయానికి చేరుకుని నిరసనకు దిగారు. గంటపాటు రోడ్డుపై పడుకుని నిరనస తెలిపినా పోలీసులు వారిని అనుమతించలేదు. గోశాలలోకి కూటమి నేతలకు అనుమతి భూమన క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున టీటీడీ గోశాలలోకి ప్రవేశించారు. పోలీసులు వారిని గుంపులు గుంపులుగా లోపలకు పంపారు. తాము సవాల్ స్వీకరించామని, భూమన రాలేదంటూ కూటమి నేతలు గోశాలలో కూర్చొని అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం సాగించారు. దీన్ని రక్తి కట్టించేందుకు చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సు«దీర్‌రెడ్డి గోశాల నుంచి భూమనకు ఫోన్ చేశారు. తాము రావడానికి సిద్ధంగా ఉన్నా పోలీసులు ముందుకు కదలనివ్వడం లేదని, ఎస్కార్ట్ పంపితే వస్తానని భూమన వారితో పేర్కొన్నారు. అయితే ఎస్కార్ట్ పంపకుండా పోలీసులతో పాటు స్పెషల్ ఫోర్స్‌ని రంగంలోకి దింపి వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్నారు. ఎంపీ గురుమూర్తి ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. పోలీసుల నుంచి తప్పించుకుని గోశాల వద్దకు చేరుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన అభినయరెడ్డిని మరోసారి అడ్డుకోగా ఎంపీ గురుమూర్తి మరో గేటు ద్వారా లోపలకు వెళ్లారు. అక్కడ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా కూటమి నేతలంతా కలసి ఎదురు దాడికి దిగారు. ఎంపీ వెనక్కి తగ్గకుండా వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో పరిస్థితి గమనించిన ఏఎస్పీ రవి మనోహరాచారి ఆయన్ను బలవంతంగా నెట్టుకుంటూ వచ్చి కారులో ఎక్కించారు. భూమన అభినయరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి వాహనంలోకి ఎక్కించారు. కాగా, తిరుపతిలో ఎవరిని నిర్బంధించలేదని హోంమంత్రి అనిత చెప్పారు.భూమనపై కేసు నమోదుతిరుపతి క్రైమ్: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలలో గోవులు మృతిచెందాయని భూమన అసత్య ప్రచారాలు చేసినట్లుగా ఈనెల 15వ తేదీన టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి, భూమన కరుణాకరరెడ్డీ.. మీకు దమ్ముంటే 17న గోశాలకు వచ్చి గోవులు మృతి చెందినట్లు నిరూపించండి’ - బుధవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ట్వీట్‘మీ సవాల్‌ని స్వీకరిస్తున్నా.. 17న ఉదయం 10 గంటలకు టీటీడీ గోశాలకు కచ్చితంగా వస్తున్నా. మీరూ రండి...’- టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి రీ ట్వీట్. -
Bhumana: భయం అనేది నా బ్లడ్ లోనే లేదు టీడీపీ ఎమ్మెల్యేలకు లైవ్ లో కౌంటర్
-
భూమనకు టీడీపీ ఎమ్మెల్యేలు ఫోన్.. ఏమన్నారంటే?
-
భూమన అభినయ్‌రెడ్డి అరెస్ట్
తిరుపతి,సాక్షి: టీటీడీ గోశాల వద్ద భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోశాలలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించిన అభినయ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా.. భూమని అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించి గోశాలకు వచ్చాం. కానీ టీడీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమని అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు స్వీకరించినప్పుడు పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి. ఫోన్ చేసి రమ్మంటారు. వస్తే పోలీసులతో అడ్డుకుంటారు. ఇదే మీ సంస్కారం’అని దుయ్యబట్టారు. భూమన ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్‌రెడ్డిలను కూటమి నేతల నిర్భంద కాండకు పాల్పడ్డారు.ఓవైపు పోలీసులతో కూటమి నేతలు నిర్భందించారు. మరో వైపు గోశాలకు రావాలంటూ భూమనకు కూటమి నేతలు ఫోన్లు చేస్తున్నారు. గోశాలకు బయల్దేరిన భూమనను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కూటమి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. గోశాలకు రాకుండా భూమనను కూటమి నేతలు అడ్డుకున్నారు. వేరే దారిలో గోశాలకు వచ్చా. నిజాల్ని నిరూపించేందుకు మేం సిద్ధం’అని వ్యాఖ్యానించారు. -
టీడీపీ అధ్యక్షుడు పల్లాకు ఫోన్ చేసిన భూమన
-
పోలీసుల వైఖరిపై భూమన కరుణాకర్ రెడ్డి నిరసన
-
గోశాల వద్ద ఘోరాల్ని వెలికితీస్తామనే.. కూటమి నేతలకు భయం పట్టుకుంది
తిరుపతి,సాక్షి: గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని కూటమి నేతల్లో భయం పట్టుకుందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.గోశాల మరణాలపై టీడీపీ ఎక్స్ వేదికగా ఛాలెంజ్ చేసింది. టీడీపీ సవాలును మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించారు. ఛాలెంజ్‌లో భాగంగా ఉదయం 10 గంటలకు గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి , వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..‘గోశాలకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడం అన్యాయం. గోవుల మృతిపై కూటమి నేతలో తలో మాట మాట్లాడుతున్నారు. నన్ను రమ్మన్న వాళ్లే అడ్డుకోవడం అన్యాయం. నేను ఒక్కడినే రావడానికి సిద్ధం. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇస్తే ఏం లాభం. టీడీపీ నేతల ఛాలెంజ్ మీద స్పందించా. గోశాలకు రమ్మనమని పల్లా నాగేశ్వర్ రావు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించా. గోశాల వద్ద ఘోరాలను వెలకితీస్తామని కూటమి నేతల్లో భయం పట్టుకుంది. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలి’ అని డిమాండ్ చేశారు. -
గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై పడుకొని భూమన నిరసన
-
భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. భూమన అభినయ్ రెడ్డి రియాక్షన్
-
వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్‌ను స్వీకరించిన భూమన
సాక్షి, తిరుపతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ను వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్వీకరించారు. రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు ఎస్వీ గోశాల వద్దకు వస్తున్నా, అక్కడ కలుద్దాం’’ అంటూ భూమన ప్రతిసవాల్ విసిరారు. టీటీడీ ఈవోనే 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రండి.. చనిపోయిన గోవులు లెక్కలు చెప్తాం. టీటీడీ గోశాల గురించి కనీస అవగాహన లేకుండా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు’’ అని భూమన మండిపడ్డారు.కాగా, ఆధ్యాత్మిక రాజధానిగా గుర్తింపు పొందిన పవిత్ర పుణ్యక్షేత్రంలో గత 10 నెలలుగా అన్నీ అపచారాలే జరుగుతున్నాయి. శ్రీవారి క్షేత్రంలో మద్యం బాటి ళ్లు, బిర్యానీలు, మాంసం, మందుబాబుల వికృత చేష్టలు, పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించే యత్నం, డ్రోన్ కెమెరాల హల్చల్, పాపవినాశం తీర్థంలో బోట్ల విహారం, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో గోవుల మరణ మృదంగం, ముంతాజ్ హోటల్ అనుమతులు తదితర సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సాక్షాత్తు స్వామిజీలు మండిపడి, టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ధర్నాలు చేసిన ఘటనలు సామాన్య భక్తులతో పాటు స్థానికులను కలవరపెట్టాయి.వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, టీటీడీ అధికారులు లోపాలను ఎత్తి చూపుతున్న సామాన్యులపైనా, భక్తులపై కక్ష్య సాధింపు చర్యలు దిగడం దారుణమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రపుణ్యక్షేత్రంలో జరిగే అపచారాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ కోణంలో చూస్తూ అధికారులు వ్యవహరించడం సమజసం కాదంటూ స్థానికులు, భక్తులు, ప్రజాసంఘాలు, మేధావులు హితవు పలుకుతున్నారు. -
పులివర్తి నాని వ్యాఖ్యలకు మోహిత్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్
-
గోవుల మృతిపై చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన కౌంటర్
తిరుపతి: టీటీడీ గోశాలలో అధిక సంఖ్యలో గోవులు చనిపోతే వాటిని తాను బయటపెడితే అవి మార్ఫింగ్ ఫోటోలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి తాను చూపిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవి కాదని, తాను ఏవైతే వ్యాఖ్యలు చేశానో ఏమైతే చూపానో వాటికి కట్టుబడి ఉన్నానన్నారు. తాను చెప్పింది అబద్ధమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని భూమన చాలెంజ్ చేశారు. గోవుల మృతిపై ఎట్టకేలకు టీటీడీ ఈవో, చైర్మన్ లు నిజాన్ని ఒప్పుకున్నారని, వెంటనే ఈవోను సస్పెండ్ చేసి, చైర్మన్ ను తొలగించాలని భూమన డిమాండ్ చేశారు. తిరుపతి నుంచి ఈరోజు(సోమవారం) భూమున ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..‘మీ పాలనలో దళారీలకు కొదవే లేదు. ఇప్పటికి దర్శనం టిక్కెట్లు బ్లాక్ లో అమ్మకాలు చేస్తున్నారు. మీ పాలనలో కొండపై బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్లను ఇవ్వొద్దు, టిడిపి నాయకులకు కోరినన్ని టికెట్ల ఇవ్వడమే మీ పని. స్వామీజీలు, పీఠాధిపతులు తో వెళ్ళి గోశాలలో పాతిపెట్టినవి వెలికి తీద్దాం. 50 ఏళ్లకు ముందే నేను జైలుకు వెళ్లిన వాడ్నిగతంలో కొండపై చర్చి కడుతున్నారు అంటూ విష ప్రచారం చేశారు, నెయ్యి కల్తీ అని ఎక్కడ నిర్ధారణ కాలేదు.. కల్తీ జరిగింది అని విష ప్రచారం చేశారు. అడుగు అడుగునా విష ప్రచారం చేశారు మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా గోవులు చనిపోయాయి, మీరు అంగీకరించారు. 1500 లీటర్లు పాలు మా పాలనలో కొండకు వెళ్తే ఇప్పుడు 500 లీటర్లు. అసలు సమస్యను పక్కదారి పెట్టొద్దు. దళిత గోవిందం అనే కార్యక్రమం నేను ఛైర్మన్ గా ఉన్నపుడు చేశాను. శ్రీవారి కళ్యాణోత్సవాలు దేశం, ప్రపంచం వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది మేము. 36వేల మందికి కళ్యాణోత్సవం ద్వారా పెళ్ళిళ్లు చేయించాం.వేద విశ్వ విద్యాలయం తీసుకు వచ్చింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగింది. హైందవ మతం ప్రచారం కోసం 4 వాహనాలు దేశం నలుమూలల చేసేలా చర్యలు తీసుకున్నాం. సాధువులతో, పీఠాధిపతిలతో తిరుపతి మహాతీలో సదస్సు నిర్వహించాము. వందే గోమాతరం కార్యక్రమం చేసిన ఘనత మాది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని తీర్మానం చేశాం. హిందూ ధర్మం అంటున్న టిటిడి బి.ఆర్ నాయుడు కనీసం నాలుగు పద్యాలు పలుకగలరా’ అని భూమన నిలదీశారు. -
గోశాల గోవుల ఘటనపై బాబు వ్యాఖ్యలు భూమన కరుణాకర్ ఛాలెంజ్
-
గోశాల ఘటనపై టీటీడీ ఛైర్మన్ చులకన వ్యాఖ్యలు!
సాక్షి, తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. గోశాలలో గోవుల మృతిని టీటీడీ చైర్మన్ అంగీకరించారు. టీటీడీ గోశాలలో ఇప్పటివరకు 22 గోవులు చనిపోయాయాన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఇంట్లో మనుషులు చనిపోరా అంటూ చులకనగా వ్యాఖ్యానించారు. మరో వైపు, గోశాలలో 40 ఆవులు చనిపోయాయని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. గోవుల మరణాలపై కూటమి నేతల తలోమాట మాట్లాడుతున్నారు.గోశాలలో గోవుల మరణాలపై మాట్లాడిన వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ బీఆర్ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. అన్నిచోట్ల కేసులు నమోదు చేయిస్తాం.. ఇప్పటికే కొందరు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళి ఉద్దేశించి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించారు. గోశాలలో డాక్టర్లు తక్కువగా ఉన్నారంటున్న టీటీడీ ఛైర్మన్.. అదనపు వైద్యులను నియమిస్తామని తెలిపారు. -
మీడియాను తీసుకురండి వెళ్దాం.. టీడీపీకి భూమన సవాల్
-
తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడింది: భూమన
-
గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం దాచిపెట్టింది
-
తిరుమల ప్రతిష్టతను కూటమి సర్కార్ దెబ్బతీస్తోంది
-
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
తిరుపతి, సాక్షి: తిరుమల ప్రతిష్టతను దెబ్బ తీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్న ఆయన.. గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ సంగతిని బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది. కానీ, ఇవాళ జరుగుతోంది ఏంటి?. టీటీడీ గోశాల(TTD Goshala)లో అమ్మకంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తారు. కానీ, తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి. మూగజీవాలు దిక్కుమొక్కు లేకుండా మరణిస్తున్నాయి. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదు... మా పాలనలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించాం. గతంలో వందే గో మాతరం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో చేపట్టాం. అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై విషం చిమ్మారు. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోవుల పట్ల కూటమి సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. లేగదూడలను పట్టించుకునేవాడు లేడు. చెత్తకు వేసినట్లుగా ఆవులకు గ్రాసం వేస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి గోశాలకు ఓ డైరెక్టర్ అంటూ లేడు. డీఎఫ్‌వో స్థాయి అధికారిని గోశాలకు ఇన్చార్జిగా నియమించారు. సాహివాల్ ఆవు గోశాలనుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని చెప్పేందుకు చెవులు కట్ చేశారు. గోశాల.. గోవధశాలగా మారింది.. భగవంతుడితో సమానమైన గోవులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈ మహా పాపం కూటమి సర్కార్, టీటీడీ అధికారులదే. ఇంత జరుగుతున్నా.. పవనానంద స్వామి(Pawan Kalyan) ఎక్కడ? ఏం చేస్తున్నారు?. గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందన్న భూమన.. గోవుల మృతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలని కోరారాయన. -
‘రియల్ ఎస్టేట్ వెంచర్లో శ్రీవారి ఆలయమా?’
తిరుపతి: ఓ రియల్ ఎస్టేట్ సంస్ధలో టీటీడీ ఆలయాలు కట్టాలనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చూస్తుంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామిని, టీటీడీని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రమోటర్లుగా వాడుకోవడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.‘రియల్’ వెంచర్ లో శ్రీవారి ఆలయమా?రోజూ తిరుమల ప్రక్షాళన గురించి మాట్లాడే చంద్రబాబు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన జీ స్వ్కేర్ వెంచర్ లో టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తే తప్పేంటి అని అనడం దారుణం. కూటమి పాలనలో శ్రీవారి పేరు మీద భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని భయాందోళనలు కలుగుతున్నాయి.దేశంలో ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలున్నాయి. వారంతా తమ సొంత ఖర్చుతో ఆలయాలు నిర్మిస్తే వాటిని టీటీడీ తీసుకుంటుందా? ఆ వెంఛర్లకు టీటీడీ ప్రమోటర్‌గా ఉంటుందా? శ్రీ వేంకటేశ్వరస్వామిని వెంచర్లకు ప్రమోటర్‌గా చేయడం కాదా ఇది? వెంచర్ల ఆదాయం పెంచడానికి శ్రీవారిని వాడుకోవడం దుర్మార్గం కాదా? దీనికి ఆగమశాస్త్ర పండితులు సలహాలు సూచనలు ఇవ్వాలనడం ఇంకెంత దారుణమైన విషయం?తిరుమలలో వరుస దారుణాలు👉కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ఆలయ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతుందని నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి.👉శ్రీవారి లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం నుంచి మొదలుపెడితే ఆనాటి నుంచి అనేక ఘటనల్లో కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది.👉చంద్రబాబు అనుమతించిన హోటల్‌కి స్వామీజీలు ధర్నాలు చేస్తే వారిని పోలీసులతో మెడపట్టి గెంటేయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గి అనుమతులు రద్దు చేయాల్సి వచ్చింది.👉తిరుమలలో జోరుగా మద్యం, మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కొండపై బిర్యానీలు తింటున్నారు. గంజాయి, మద్యం మత్తులో భక్తుల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు కాదు. తిరుమల పోలీసులే ఆధారాలతో సహా పట్టుకున్నట్టు అన్ని మీడియాల్లో ఫొటోలతో సహా ప్రచురితం అయ్యాయి. 👉ఇటీవల ఒక అన్యమతస్తుడు బైకుపై తిరుమలకు వెళితే మానసిక వికలాంగుడు అని ప్రభుత్వం కవర్ చేసుకుంది. పాపవినాశనం జలపాతంలో జరిగిన బోట్ షికారు ఎందుకునే దానిపై ప్రభుత్వ శాఖల నుంచే భిన్నమైన అభిప్రాయాలు చెప్పినా, వాస్తవం ఏంటనేది ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన వివరణ రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అడుగడుగునా విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నా ప్రభుత్వం కళ్లుండీ చూసీచూడనట్టు వదిలేస్తుంది.తేడాను ప్రజలే గుర్తించారుతన చేతకానితనాన్ని ఒప్పుకోలేని ప్రభుత్వం భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ తమకుతామే కితాబిచ్చుకోవాల్సి దుస్థితి నెలకొంది. లడ్డూ నాణ్యత పెరిగిందని, అన్న ప్రసాదం బాగుందని తమకు తామే చెప్పుకోవడం తప్పించి, లోపాలు ఆధారాలతో సహా బహిర్గతం అవుతున్నా నష్టనివారణ చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వానికి చేతకావడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల వైభవానికి ఇప్పుడు జరుగుతున్న అరాచకాలకు తేడాను పది నెలల్లోనే భక్తులు గుర్తించారు. గత మా ప్రభుత్వంపై బురదజల్లేందుకు తిరుమల కేంద్రంగా జనసేన-టీడీపీ కలిసి చేయించిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. లోకేష్ పీఏ 12 లెటర్లు పంపుతున్నాడు👉కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలను వీఐపీల అడ్డాగా మార్చేశారు. గత మా ప్రభుత్వ హయాంలో వీఐపీలకు రోజుకు 4 వేలు వీఐపీ టికెట్లు ఇస్తే, ఇప్పుడు రోజుకు 7500 టికెట్లు ఇచ్చి దర్శనం కోసం వస్తున్న సామాన్య భక్తులను గంటలపాటు క్యూ లైన్లలో మగ్గేలా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సమీక్షలో మాత్రం సామాన్యులకు పెద్ద పీట వేస్తామని పచ్చి అబద్ధాలు మాయమాటలు చెప్పుకుంటున్నారు.👉మంత్రికి వీఐపీ బ్రేక్ కోసం రోజుకు ఒక లెటర్ చొప్పున ఆమోదిస్తుంటే, మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు రోజుకు 12 వీఐపీ లెటర్లు పంపుతున్నాడు. అది కూడా పీఎస్ టూ సీఎంఓ పేరుతో సాంబశివరావు పంపుతున్నాడు.👉అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకు ఎస్వీబీసీ చైర్మన్‌ను, తిరుమల జేఈవోను, సీవీఎస్వోను, బర్డ్ డైరెక్టర్‌ను నియమించలేకపోయారు. కొండ మీద పాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల పవిత్రత కాపాడాంభక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో అలిపిరి వద్ద ధర్మశాలను కట్టాలనే నిర్ణయం కూడా వైఎస్సార్సీపీ హాయాంలో జరిగిందే. అదేదో తామే చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.రాయలసీమకు తలమానికంగా ఉన్న స్విమ్స్ ఆస్పత్రిని కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు.ఏ విషయంలోనూ వైఎస్సార్సీపీ కన్నా మిన్నగా కూటమి పాలనలో తిరుమలలో ప్రక్షాళన చేశారో చంద్రబాబు చెప్పాలి.ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్, ఇంకెప్పుడు మాట్లాడతారు? కొండమీద జరుగుతున్న అపవిత్రత గురించి ప్రశ్నించలేరా?చంద్రబాబుకి ఇదే నా సవాల్. టీడీపీ నుంచి ఏ నాయకుడిని పంపినా తిరుమల పవిత్రతపై వారితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా.తిరుమల కొండ మీద ఏం జరిగిందో తెలుసుకోవాలని కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశిస్తే వారి కాళ్లూ వేళ్లూ పట్టుకుని అడ్డుకున్న సంఘటన కూటమి పాలనలో జరిగిందా? లేదా? ఇలాంటి ఘటనలు ఏనాడైనా వైఎస్సార్సీపీ పాలనలో జరిగినట్టు నిరూపించగలరా?ఏ మతస్తుడైనా హిందువుగా మారడానికి తిరుమలలో ఒక వేదిక ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నది కూడా మా హయాంలోనే అనేది గర్వంగా చెబుతున్నా.గోవింద కోటి రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. వేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం కూడా మేం తీసుకున్న నిర్ణయమే.లడ్డూ నాణ్యత మా హయాంలో ఎలా ఉన్నదో ఇప్పుడూ అలాగే ఉన్నది. గడిచిన పది నెలల కూటమి పాలనలో ఒక్క విషయంలోనైనా ప్రక్షాళన జరిగి ఉంటే చూపించాలి. వేంకటేశ్వరుని స్వామిని రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశం ఇప్పటికైనా విడనాడాలి. -
లోకేష్ పీఏ తిరుమలలో సిఫార్సు లేఖల దందా చేస్తున్నారు: భూమన
-
Bhumana Karunakar: కూటమి పాలనలో తిరుమల కొండపై అరాచకాలు కొనసాగుతున్నాయి
-
‘వాటిని అపవిత్రం చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నాడు?
తిరుపతి: తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పాప ప్రదాయినిగా బావించే పాపవినాశనంలో ప్రవిత్ర జలాలను అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు భూమన. ఈరోజు తిరుపతి నుంచి ప్రెస్ మీట్ లో భూమన మాట్లాడుతూ.. ‘తిరుమల పాపవినాశనంలో బోటు షికారు ట్రయిల్ రన్ చేశారు. కూబింగ్ కోసమని బోట్లు తిప్పామని అన్నారు. అటవీశాఖ ట్రయల్ రన్ నిరతవహిస్తున్నామను అని అన్నారు. అనితర మేము వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గోరంతను కొండంత చేసిన కూటమి ప్రభ/త్వం.. నేడు పాప ప్రదాయినిగా భావించే పాప వినాశనంలో పవిత్ర జలాలను అపవిత్రం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందుకే బోట్లు సర్వే చేశామని అన్నారు. ఇప్పటికి ఐదు రోజులైంది. కానీ టీటీడీ అధికారులు ఎవ్వరూ ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు.పవన్ ఏం చేస్తున్నాడు..?నడుం బిగించానని చెప్పిన పవన్ కు నడుం నొప్పి ప్రారంభమైంది. అటవీశాఖ పవన్ పరిధిలో ఉంటుంది, అలాంటిది పవిత్ర జలాలకు అపవిత్రం చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నాడు?, ఎందుకు స్పందించలేదు?, నిన్న బాలాజీ నగర్ లో పోలీసులు మద్యం పట్టుకొన్నారు. కొండపై మధ్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. తిరుమల కొండపై మద్యం నిషేధించి దశాబ్దాలు అయినా అక్కడ మద్యం ఏరులై పారుతోంది. తిరుమల కొండపై ఎక్సైజ్ శాఖ ఉంది. పది రోజులకు ముందు గంజాయి, మద్యం మత్తులో భక్తులపై దాడి చేశారు. వీరిని పట్టుకోవడానికి భద్రత సిబ్బంది కష్టపడాల్సివచ్చింద15 రోజులకు ముందు ఆలయం సమీపంలో మద్యం మత్తలో ఓ యువకుడు హాల్ చల్ చేశాడు. ఆలయ సమీపంలో ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారు?, . ఆలయం సమీపంలో ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారుతిరుమలను బోట్లు ద్వారా పర్యాటక కేంద్రంగా మార్చాలని చూడలేదా?, .సీఎం చంద్రబాబు అన్నిదేవాలయాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేస్తామని అన్నారు. టీటీడీ ప్రక్షాళన చెయ్యడానికే ఈఓ శ్యామలా రావు నియమించానన్నారు సీఎం చంద్రబాబు. ఇదేనా ప్రక్షాళన అంటే చంద్రబాబుకూటమి ప్రభుత్వంలో రోజుకో అరాచకంవైఎస్సార్‌సీపీ పాలనలో అన్నీ అరాచకలే అన్న మీరు.. ఒక్కటి కూడా నిరూపించలేదు. కానీ నేడు కూటమి ప్రభ/త్వంలో రోజుకో అరాచకం జరుగుతుంది. ముంతాజ్ హోటల్ అనుమతి ఇచ్చిందే చంద్రబాబు, అలాంటి ముంతాజ్ హోటల్ పై పెద్దఎత్తున స్వామీజీలు నిరసనలు చేశారు. అనంతరం వెనక్కి తగ్గారు. కూటమి ప్రభుత్వం చేసే మోసాలు, అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. తిరుమలలో వరుస ఘటనలు ఎవరు జవాబు చెప్తారు’ అని ప్రశ్నించారు భూమన -
Bhumana Karunakar Reddy: టీడీపీ పాలనలో తిరుమలకి మరొక ఘోర అపచారం
-
మరో అపచారం.. పవనానంద స్వామి ఎక్కడ?
తిరుపతి, సాక్షి: తిరుమల క్షేత్రంలో మరో ఘోర అపచారం జరిగిందని.. సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవనానంద స్వామి(డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్) ఎక్కడ? అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ వ్యవహారంపై బుధవారం భూమన మీడియాతో మాట్లాడారు. నిన్న పాప వినాశనం డ్యామ్‌లో బోటింగ్ చేశారు. ఆ నీటిని భక్తులు పవిత్రంగా చూస్తారు.అలాంటి డ్యామ్‌లో టూరిజం పేరుతో బోటింగ్ చేయడం ఏంటి?. టూరిజం వేరు.. అధ్యాత్మికం వేరు. టీటీడీ పరిధిలోనే పాప వినాశనం డ్యామ్ ఉంది. బోటింగ్‌పై ఈవో, అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలి అని భూమన డిమాండ్ చేశారు.అటవీ శాఖ పవన్ కల్యాణ్ దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. ఆ శాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో మంగళవారం బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుండగా.. ఈ ప్రాంతంలోనే పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉన్నాయి. ఈ క్రమంలో బోటింగ్ వ్యవహారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


