మీ దౌర్జన్యాలకు నేను భయపడను.. వెనక్కి తగ్గను: భూమన | YSRCP Leader Bhumana Karunakar Reddy Slams Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

మీ దౌర్జన్యాలకు నేను భయపడను.. వెనక్కి తగ్గను: భూమన

Jul 23 2026 3:37 PM | Updated on Jul 23 2026 3:45 PM

YSRCP Leader Bhumana Karunakar Reddy Slams Chandrababu Sarkar

తిరుపతి:  సీమ జిల్లాల్లో ముఠా కక్షదారులు శత్రువులు ఆస్తులు ధ్వంసం చేసి సంతప్తి చెందిన మాదిరిగా తమ కుటుంబ ఆస్తులపై చంద్రబాబు దాడి చేసి తృప్తి పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబును వ్యతిరేకించేవారిని  టార్గెట్‌ చేసి వారి కుటుంబ ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమాలకు కూటమి నేతలు దిగారని భూమన ధ్వజమెత్తారు. 

కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపుతున్న కారణంగా  ద్వేషంతో, ప్రతీకార పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. తన ఆస్తులు విధ్వంసం చేసినంత మాత్రాన తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు భూమన. 

‘21 ఏళ్ల క్రితం ఈ ఆస్తులు కొనుగోలు చేశాం.. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, మీరు సీఎం గా ఉన్నప్పుడు కనిపించలేదా?, నా వాణి బలంగా వినిపిస్తున్నందుకే ఈ కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు. నేను అవినీతి మోసాలు చేసినవాడ్ని కాదు.

తిరుపతిలో రౌడీ రాజకీయాలు  ఏనాడు అవకాశం ఇవ్వలేదు. జీవితం అంతా విలువలతో రాజకీయాలు చేసిన వాడ్ని. నా ఆస్తులు విధ్వంసం చేసినంత మాత్రాన నేను వెనక్కి తగ్గను.  నేను ఆశయాలతో బ్రతికేవాడ్ని, ఆశలతో బ్రతికే వాడిని కాదు. నేను అన్నిటికి సిద్ధం..మా కుటుంబ ఆస్తులు ధ్వంసం చేసినా నీ తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటా. 1991 లో ప్రారంభించిన హెరిటేజ్ కూడా నది పోరంబోకు స్థలంలోనే ఉంది. నా కుటుంబ ఆస్తులు దాడి చేయడం ద్వారా నాకు మరింత ఉత్సాహంగా మీ తప్పులను ఎత్తి చూపిస్తా’ అని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement