breaking news
Tirupati
-
గుండుతో దర్శనం.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ వైరల్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకున్న పాండ్యా క్లీన్ హెడ్షేవ్ (గుండు)తో కనిపించాడు. దీంతో పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తిరుమల పర్యటనలో హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మొక్కుబడి తీర్చుకునే భాగంగానే తలనీలాలు సమర్పించారా.? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనేది తెలియాలి. ఇక ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయానికి గురైన పాండ్యా స్వదేశంలో అప్గానిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లో పాండ్యా రీహాబిలిటేషన్‌లో గడుపుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం పాండ్యాను జాగ్రత్తగా కాపాడుకోవడంపై బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగానే పరిమితంగానే పాండ్యా సేవలు ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరోవైపు పాండ్యా కూడా 2027 వన్డే ప్రపంచకప్ వరకు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పటికీ.. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పాండ్యా కెప్టెన్‌గా వచ్చిన తర్వాత కూడా ముంబై గత మూడు సీజన్లలో నిరాశాజనక ఫలితాలే అందుకుంది. దీంతో పాండ్యాను ముంబై ఇండియన్స్ వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు పాండ్యా వేరే జట్టులో దర్శనమిచ్చే అవకాశముంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ట్రేడ్ లేదా ఒప్పందం ఖరారు కాలేదు. మొత్తంగా 2027 సీజన్లో హార్దిక్ ఏ జట్టు జెర్సీలో కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.Indian cricketer Hardik Pandya visited the Sri Venkateswara Swamy Temple in Tirumala today with Mahika Sharma.Hardik offered his hair as part of a religious vow and was seen in a new bald look. The two also took part in the early morning Suprabhatha Seva. 🙏 pic.twitter.com/mdkQlecKLv— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) August 2, 2026 Hardik Pandya with Mahieka at the Tirumala Temple. pic.twitter.com/3FjJ33ltw8— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2026Read: అభిషేక్ శర్మ ఊచకోత.. 91 బంతుల్లో 233 పరుగులు -
టీడీపీ మూకల దాష్టీకం
తిరుపతి రూరల్: తిరుపతిలో అంబేడ్కరిస్టులు, దళితులపై టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వారి చేతుల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్ చూడగానే చెలరేగిపోయారు. ‘‘మీరు ఏమైనా అంబేద్కర్‌కు పుట్టినోళ్లా..? బొమ్మ పట్టుకుని వస్తే వదిలేస్తామా..? అంటూ తిట్లదండకం అందుకున్నారు. బ్యానర్‌ను చించివేసి ఇక్కడి నుంచి వెళ్లకుంటే మీ అందరి అంతు చూస్తాం’’ అంటూ హూంకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటాడి దొరికిన వారిని దొరికినట్టు పిడిగుద్దులు కురిపిస్తూ చితకబాదారు. కొందరిని గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. మహిళలపైనా దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన దళితులను స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అసలు ఏం జరిగిందంటే.. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 145లో ఉన్న మఠం భూములను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీవాసుల దాహార్తిని తీర్చేందుకు గతంలో ఏర్పాటుచేసుకున్న బోరునూ ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్ వెంకటరమణతోపాటు దళితవాడ వాసులు, అంబేడ్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేడ్కర్ ఫొటోతో కూడిన బ్యానర్‌ను ముద్రించుకుని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరుకుని దళితులపై రెచ్చిపోయారు. బూతుపంచాంగం లంకించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేడ్కర్ చిత్రపటంతో కూడిన బ్యానర్‌ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణభయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు. గాయపడిన వారికి రుయాలో చికిత్స టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్ వెంకటరమణ, కౌసల్య, విజయనిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు. టీడీపీ గూండాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌చేశారు. దాడికి పాల్పడిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులుగా చెప్పుకునే నవీన్ నాయుడు, సునీల్, శంకర్ యాదవ్, బాలసుబ్రమణ్యం నాయుడు, పృధ్వీ ఉన్నారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. -
తొలి తిరుపతి 9000 వేలు సంవత్సరాల అతి పురాతన దేవాలయం (ఫొటోలు)
-
ఆహారం కలుషితం.. 78 మందికి పైగా వైద్య విద్యార్థులకు అస్వస్థత
తిరుపతి తుడా: తిరుపతిలో మూడు వైద్యకళాశాల్లో ఆహారం కలు షితం కావడంతో 78 మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, శ్రీవేంకటేశ్వర వైద్యకళాశాల (స్విమ్స్), శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థులయ్యారు. ఈ మూడు కాలేజీల్లోని విద్యార్థులకు స్విమ్స్‌లోని సెంట్రల్ క్యాంటీన్ నుంచి ఆహారం సరఫరా అవుతుంది. సోమవారం మధ్యాహ్నం ఆకుకూర పప్పు వడ్డించిన క్యాంటీన్ నిర్వాహకులు రాత్రిపూట కూడా అదే వడ్డించారు. ఆకుకూరను సరిగా శుభ్రపరచకుండా వండారని, మధ్యాహ్నం వండినదాన్నే రాత్రికి కూడా పెట్టటంతో అప్పటికే కలుషితమైన దాన్ని తిని తమకు వాంతులు, విరేచనాలు అయ్యాయని పలువురు విద్యార్థులు తెలిపారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో 20 మంది విద్యారి్థనులు, ఎనిమిది మంది విద్యార్థులు.. మొత్తం 28 మంది అస్వస్థులయ్యారు. స్విమ్స్, శ్రీ పద్మావతి కళాశాలల్లో 50 మందికిపైగా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు.ఆయుర్వేద విద్యార్థుల్లో 17 మందిని అంబులెన్స్‌లో టీటీడీ సెంట్రల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. చికిత్స పొందుతున్నవారిని టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అవడంతో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో తిరిగి వసతిగృహాలకు పంపించినట్లు తెలిపారు. స్విమ్స్, పద్మావతి కాలేజీల్లో అస్వస్థులైనవారికి పద్మావతి ఆస్పత్రిలో గోప్యంగా వైద్యం అందించినట్లు తెలిసింది.అబ్బే అదేం లేదు.. ముగ్గురే అస్వస్థులయ్యారు.. స్విమ్స్, పద్మావతి విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు నిరాధారమని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్విమ్స్ హాస్టల్లో మొత్తం 1,147 మంది వైద్యవిద్యార్థులు ఉన్నారని తెలిపారు. 27వ తేదీ రాత్రి సమయంలో ఎంబీబీఎస్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులు అస్వస్థులయ్యారని అంగీకరిస్తూనే.. ఫుడ్ పాయిజనింగ్ అయిందనటం సరికాదని ఆయన పేర్కొనడం గమనార్హం. మరోవైపు స్విమ్స్, పద్మావతి కాలేజీల్లో 70 మందికి పైనే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని స్విమ్స్ వర్గాలు తెలిపాయి. -
షేవింగ్ బ్లేడ్‌తో భర్తను చంపిన భార్య రేవతి..!
తిరుపతి: ప్రియుడు ప్రేరేపించడంతోనే భార్య తన భర్త గొంతు కోసినట్లు అంగీకరించిందని ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం స్థానిక పోలీసు స్టేషన్లో ముద్దాయిలను అరెస్టు చేసి, విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని నీర్పాకోటలోని పల్లం దళితవాడకు చెందిన భీమయ్య (42), రేవతి (29)కి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భీమయ్య బెల్దూరి మేస్త్రీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. భార్య రేవతి గతంలో శ్రీసిటీలోని అపాచీ కంపెనీలో పనిచేసేది. ఆ సమయంలో తొట్టంబేడు మండలం, పొయ్యి గ్రామానికి చెందిన నాగరాజుతో ఆమెకు పరిచయమై, వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి భీమయ్య భార్యపై అనుమానం పెంచుకుని కంపెనీకి వెళ్లకుండా పని మాని్పంచాడు. ఆరు నెలలుగా రేవతి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 24వ తేదీ భీమయ్య మద్యం మత్తులో భార్యతో గొడవపడగా బంధువులు సర్దిచెప్పారు. ఆ సమయంలో ప్రియుడు నాగరాజుకు రేవతి ఫోన్ చేసి తన భర్తను చంపాలని నిర్ణయింది. అతని సలహా మేరకు రాత్రికి భీమయ్య గొంతు బ్లేడుతో కోసేయాలని రేవతిని ప్రేరేంపించాడు. భీమయ్య నిద్రపోతుండగా అర్ధరాత్రి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో భార్య రేవతి షేవింగ్ బ్లేడ్‌తో భర్త భీమయ్య గొంతు కోసింది. ఆ తర్వాత బంధువులకు ఫోన్ చేసి ఎవరో తన భర్త గొంతు కోశారని నమ్మబలికింది. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం తేలింది. భర్తను తానే బ్లేడుతో కోశానని అంగీకరించింది. ప్రస్తుతం భీమయ్య రేణిగుంట సమీపంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ మేరకు 307 సేక్షన్ కింద రేవతి, ఆమె ప్రియుడు నాగరాజుపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు. -
నేను వితంతువుని కాదు సర్!
నా పేరు వెంకటరామరాజు. మాది రైల్వే కోడూరు. రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుడిగా మారాను. 69 శాతం వికలత్వం ఉండడంతో నాకు పింఛన్ మంజూరు చేయాలని కోరడంతో పింఛన్ మంజూరు చేశారు. అయితే దివ్యాంగుడుగా ఉన్నప్పటికీ వితంతువు పింఛన్ మంజూరు చేశారు. ఆ విషయం ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలవడంతో వితంతువు పింఛన్ రూ.4 వేలు.. దివ్యాంగుడి పింఛన్‌గా మార్పు చేయాలని క్షేత్ర స్థాయి అధికారుల నుంచి మండల, డివిజన్ చివరికి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అర్జీలిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. – తిరుపతి అర్బన్ -
రామచంద్రాపురం రాయలచెరువులో విషాదం
తిరుపతి: జిల్లాలోని రామచంద్రాపురం మండలం రాయలచెరువులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి దగ్గర తగాదాతో సుబ్రహ్మణ్యంపై హరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డటమే ఆందోళన రేకెత్తిస్తోంది. స్టేషన్లో సుబ్రహ్మణ్యంపై పోలీసులే దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల వైఖరి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తిరుపతిలో జనసేన నాయకుడు ఆత్మహత్య
-
మీ దౌర్జన్యాలకు నేను భయపడను.. వెనక్కి తగ్గను: భూమన
తిరుపతి: సీమ జిల్లాల్లో ముఠా కక్షదారులు శత్రువులు ఆస్తులు ధ్వంసం చేసి సంతప్తి చెందిన మాదిరిగా తమ కుటుంబ ఆస్తులపై చంద్రబాబు దాడి చేసి తృప్తి పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబును వ్యతిరేకించేవారిని టార్గెట్ చేసి వారి కుటుంబ ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమాలకు కూటమి నేతలు దిగారని భూమన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపుతున్న కారణంగా ద్వేషంతో, ప్రతీకార పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. తన ఆస్తులు విధ్వంసం చేసినంత మాత్రాన తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు భూమన. ‘21 ఏళ్ల క్రితం ఈ ఆస్తులు కొనుగోలు చేశాం.. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, మీరు సీఎం గా ఉన్నప్పుడు కనిపించలేదా?, నా వాణి బలంగా వినిపిస్తున్నందుకే ఈ కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు. నేను అవినీతి మోసాలు చేసినవాడ్ని కాదు.తిరుపతిలో రౌడీ రాజకీయాలు ఏనాడు అవకాశం ఇవ్వలేదు. జీవితం అంతా విలువలతో రాజకీయాలు చేసిన వాడ్ని. నా ఆస్తులు విధ్వంసం చేసినంత మాత్రాన నేను వెనక్కి తగ్గను. నేను ఆశయాలతో బ్రతికేవాడ్ని, ఆశలతో బ్రతికే వాడిని కాదు. నేను అన్నిటికి సిద్ధం..మా కుటుంబ ఆస్తులు ధ్వంసం చేసినా నీ తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటా. 1991 లో ప్రారంభించిన హెరిటేజ్ కూడా నది పోరంబోకు స్థలంలోనే ఉంది. నా కుటుంబ ఆస్తులు దాడి చేయడం ద్వారా నాకు మరింత ఉత్సాహంగా మీ తప్పులను ఎత్తి చూపిస్తా’ అని హెచ్చరించారు. -
తిరుపతిలో మరో భూ కబ్జా
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతిలో వృద్ధ దంపతుల భూమిని టీడీపీ నేత కబ్జా చేసిన వ్యవహారం మరువక ముందే.. మరో టీడీపీ నేత భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దనున్న తమ స్థలాన్ని తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ కబ్జా చేశారని చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్‌రెడ్డి భార్య, టీడీపీ మహిళా కార్యకర్త, మునిరాజమ్మ ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వద్దకు ఐదుసార్లు వెళ్లినా స్పందనలేదంటూ బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. భూ కబ్జా నుంచి తమకు న్యాయం చేయాలంటూ రెండు చేతులు జోడించి కన్నీటితో వేడుకున్నారు.ఆమె ఇంకా ఏమన్నారంటే.. 2017లో తిరుచానూరు రోడ్డు మార్కెట్ యార్డు సమీపంలోని సర్వే నెంబరు 252/2ఏ లోని 80 సెంట్ల భూమిని రూ.మూడున్నర కోట్లకు కోనుగోలు చేశాం. ఆన్లైన్ రికార్డుల్లో మా పేరు ఉంది. అనంతరం కొద్దిరోజుల పాటు విదేశాల్లోని మా కుమార్తె వద్దకు వెళ్లాం. ఆ సమయంలో స్థలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకుని మేము అడ్డుకునే ప్రయత్నం చేశాం. అయితే, స్థలం వద్ద జేబీ శ్రీనివాస్ మనుషులు వచ్చి మాపై దాడులు చేయడంతో పాటు ‘ముసలామెను గోతిలో పూడ్చిపెట్టండి.. చంపేయండి’.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా పట్టించుకోవడంలేదు. 40 ఏళ్లుగా టీడీపీలో ఉంటున్న మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మా స్థలంలోని కరెంట్ మీటర్‌ను దౌర్జన్యంగా తొలగించారు. జేబీ శ్రీనివాస్ వద్దకెళ్లి మా స్థలాన్ని ఇవ్వాలని ప్రాథేయపడినా పట్టించుకోలేదు. -
‘చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదని.. తిరుమలలో 60 ఏళ్ల చరిత్ర ఉన్న విగ్రహం చోరీకి గురైందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.‘‘బీఆర్ నాయుడు రావటంతోనే గోవులు చనిపోయాయి. ఇక అప్పట్నుంచి తరచూ ఏదోక అపచారం జరుగుతూనే ఉంది. మద్యం, గంజాయి, మాంసాహారం కొండ మీద వస్తుంది. బీఆర్ నాయుడు టీటీడీని ఛైర్మన్‌గా కాకుండా ఒక టీవీ ఛానల్ నడిపినట్టు నడుపుతున్నారు. దందాలు, సెటిల్మెంట్లు, అక్రమాలు భారీగా జరుగుతున్నాయి..విగ్రహం చోరీ జరిగితే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. మెట్లు కడిగిన నాయకులు ఏమయ్యారు?. చంద్రబాబు పాలనలో ఆలయాలు కూల్చేయడం, విగ్రహాల చోరీలు జరుగుతున్నాయి. బీఆర్ నాయుడు రాకతో తిరుమల క్షేత్రంలో అపచారం జరిగింది’’ అని శ్యామల మండిపడ్డారు. -
ఎన్టీఆర్ మా స్పూర్తి.. 100 కోట్లతో ప్రజా సేవ చేస్తాం
-
రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్.. భద్రతా కల్పించాలని వినతి
టాలీవుడ్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న వార్తలతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. రా ఎన్టీఆర్ పేరుతో జరుగుతోన్న కార్యక్రమాలకు ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన టీమ్ స్పష్టం చేసింది.ఈ వివాదం నేపథ్యంలో రా ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. తిరుపతిలోనే తాజ్ హోటల్లో జరగనున్న ఈవెంట్‌కు భద్రతా కల్పించాలని యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఉదయం తాజ్ హోటల్లో ప్రెస్ మీట్ జరగనుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్, రా ఎన్టీఆర్ మధ్య వివాదంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పించాలంటూ తిరుపతి రూరల్ పోలీసులను కోరింది.ఎలాంటి సంబంధం లేదు..'రా ఎన్టీఆర్' అనే సంస్థకు గానీ, దాని కార్యకలాపాలకు గానీ.. జూ.ఎన్టీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆయన అధికారిక బృందం స్పష్టం చేసింది. ఎలాంటి సేవా కార్యక్రమాలకైనా, ప్రకటనలకైనా ఎన్టీఆర్ టీమ్ లేదా ఆయన మాత్రమే అధికారికంగా మాట్లాడుతారని, రూమర్స్ నమ్మవద్దని మీడియాను కోరింది. -
ప్రూప్స్ తో బయటపెట్టిన భూమన.. టీటీడీలో ఉద్యోగాల మాయాజాలం
-
స్విమ్స్‌లో ఉద్యోగాల భర్తీపై భూమన సంచలన ఆరోపణలు..
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని స్విమ్స్‌లో 303 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నియామకాలను "మరో డీఎస్సీ స్కామ్"గా అభివర్ణిస్తూ, మొత్తం ప్రక్రియలో నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకత కోల్పోయిందని మండిపడ్డారు.భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘స్విమ్స్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే విద్యార్హతల్లో మార్పులు చేశారు. అనుభవ ప్రమాణాలను కొందరికి అనుకూలంగా మార్చారు. నిపుణుల కమిటీ లేకుండానే సిలబస్ రూపొందించారు. ముందే ఎంపిక చేసిన అభ్యర్థుల కోసమే నోటిఫికేషన్ రూపొందించారు. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో కూడా పక్షపాతం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు బంధువు ఆదిశేషయ్య స్విమ్స్‌లో చక్రం తిప్పుతున్నారు. స్విమ్స్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. బర్డ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియామక కమిటీ ఏర్పాటు చేశారు.గత డాక్టర్ల నియామకాల్లోనూ భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 100 మంది డాక్టర్ల నియామకాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు 303 పోస్టుల భర్తీపైనా అదే తరహా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డు అనుమతి లేకుండానే కొన్ని పోస్టుల వేతనాలు పెంచారు. కొందరికి ఉద్యోగాలు కల్పించేందుకే వేతనాల్లో మార్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ లేదా స్వతంత్ర సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించలేదు. ఎయిమ్స్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ నిపుణులను పక్కన పెట్టారు.ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల నిపుణుల సలహా తీసుకోలేదు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూతో ఉద్యోగాలు నిర్ణయించే విధానం తీసుకొచ్చారు. ఇంటర్వ్యూల పేరుతో మెరిట్‌కు తూట్లు పొడిచారు. ఇంజినీరింగ్ నియామకాలలోనూ భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన రోజే ఉద్యోగాలు అమ్ముడయ్యాయనే చర్చ జరుగుతోంది. టీటీడీ వంటి పవిత్ర సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా కొరవడింది. స్విమ్స్ 303 ఉద్యోగాల భర్తీపై విచారణ చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
ఆరేళ్ల పరిచయం.. రూ.46 లక్షల అప్పు.. చివరకు..!
తిరుపతి: తిరుపతి నగర శివారులో పట్టపగలే ఓ మహిళపై హత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ముత్యాలరెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీఓ కార్యాలయాని సమీపంలోనే ఈ ఘటన జరగింది. ఎస్వీ యూనివర్సిటీ సీఐ నరేష్ కథనం మేరకు.. వైకుంఠపురం ఆర్చి సమీపంలో హిమబిందు (38) అనే మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త మహమ్మద్ షరీఫ్ ప్రస్తుతం ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో హిమబిందు ఆటోలో వైకుంఠపురం నుంచి జీవకోనకు వెళుతుంగా, చెర్లోపల్లెకు చెందిన ఆకాష్ కారులో వచ్చి ఎంపీడీవో కార్యాలయం వద్ద అడ్డగించి కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తప్పించుకునేందుకు ఆమె రెండు చేతులను అడ్డుగా పెట్టుకోవడంతో వేళ్లతోపాటు మెడ, వీపుపై తీవ్రమైన గాయాలయ్యాయి. భయాందోళనకు గురైన హిమబిందు ఆటో నుంచి దిగి సమీపంలోని హోటల్లోకి పరుగెత్తింది. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో నిందితుడు ఆకాష్ తన కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు హిమబిందును తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో హిమబిందు, ఆకాష్‌కు సుమారు ఆరేళ్లుగా పరిచయం ఉన్నట్లు వెల్లడైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆకాష్ కు హిమబిందు వివిధ దఫాల్లో మొత్తం రూ.46 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిసింది. కొంతకాలంగా ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని ఆమె కోరుతుండడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే హిమబిందును హత్య చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదనే దురాలోచనతోనే ఆకాష్ ముందస్తు ప్రణాళిక ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రుయాలో చికిత్స పొందుతున్న హిమబిందును సీఐ నరేష్ విచారించి వివరాలు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి, పరారీలోని నిందితుడు ఆకాష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. -
శంకర్ యాదవ్ ను యాదవు ఇన్ఛార్జిగా చేసేందుకు... తంబళ్లపల్లె టీడీపీలో రచ్చ...రచ్చ
-
తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం
సాక్షి, తిరుపతి: జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాల వ్యవహారం కలకలం రేపింది. కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు బీటెక్ విద్యార్థి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టైన నిందితులు తెల్ల గుణశేఖర్ (శెట్టిపల్లి గ్రామం), ఎస్. అశ్విన్ కుమార్ (కొర్లగుంట, తిరుపతి), పడమల రాహుల్ యాదవ్ (కొర్లగుంట, తిరుపతి)గా గుర్తించారు. వీరు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ఎండీఎంఏ (మెత్) డ్రగ్స్‌ను కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.నిందితుల నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన 62 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు, నాలుగు సెల్ఫోన్లు, రెండు డిజిటల్ వెయింగ్ మెషీన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
జీతం 26 వేలు ఇవ్వాల్సిందే.. రోడ్డెక్కిన అంగన్వాడీలు
-
ఒక ప్రశ్న.. రెండు నిండు ప్రాణాలు బలి!
సాక్షి, తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఓ వివాహ వేడుకకు వచ్చిన వ్యక్తిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఇద్దరు వ్యక్తులు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగు చూసింది.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ జంట హత్యల వెనుక కుటుంబ వివాదమే కారణమని తెలుస్తోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్.. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీళ్ల వివాహానికి మునిరత్నం, మణికంఠలు దగ్గరుండి సహకరించారు. అయితే.. కొన్ని నెలలుగా సునీల్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కారణం ఏంటో చెప్పడం లేదని.. ఎంత బతిమాలినా సునీల్ వినలేదని తెలుస్తోంది. ఈ విషయంలో పెద్దలు సర్దిచెప్పాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో.. బుధవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఓ వివాహానికి అతను హాజరైన విషయం సంపూర్ణమ్మకు తెలిసింది. దీంతో తన కుమార్తెకు అండగా ఉన్న మునిరత్నం, మణికంఠలకు ఆమె సమాచారం ఇచ్చింది. వాల్లిద్దరూ వివాహ మండపానికి చేరుకుని సునీల్‌ను నిలదీశారు. నీ భార్యను ఎందుకు వదిలేశావు? అని ప్రశ్నించారు. దానికి సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో సునీల్‌తో పాటు అతడి తమ్ముడు, అక్క, మరో బంధువు అక్కడికి చేరుకున్నారు. ఆ నలుగురూ కలిసి మునిరత్నం, మణికంఠలపై కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న మణికంఠను తిరుపతి.. రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీళ్లిద్దరూ జీవకోనకు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సీఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. నిందితులు అదుపులోకి.. విచారణ కొనసాగింపుభార్యాభర్తల గొడవ.. పెళ్లి వేదికలో మొదలైన వివాదం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన తిరుపతిలో సంచలనంగా మారింది. జంట హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సునీల్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు పూర్తి కారణాలు, దాడిలో పాల్గొన్న వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. -
తిరుపతిలో జంట హత్యలు
తిరుపతి క్రైం: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపం సముదాయంలో బుధవారం రాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. ఒక మహిళతో పాటు నలుగురు వ్యక్తులు వెంటాడి వేటాడి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో జీవకోన ప్రాంతానికి చెందిన మునిరత్నం(50) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన మణికంఠ(41)ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మావతి కళ్యాణ మండపం సముదాయంలో నాలుగు కళ్యాణ మండపాలున్నాయి. బుధవారం రాత్రి ఒక మండపంలో వివాహం జరుగుతోంది. రాత్రి 9.30 గంటల సమయంలో కొందరు దుండగులు రెండు బైక్‌లపై అక్కడికి చేరుకున్నారు. కల్యాణ మండపం సముదాయంలోని నిర్మానుష్య ప్రాంతంలో మునిరత్నం, మణికంఠపై వారు దాడి చేశారు. మునిరత్నం, మణికంఠ చిరువ్యాపారులు. మునిరత్నం రెండు నెలల కిందట ఓ వివాహం జరిపించాడు. దాని నేపథ్యంలో ఏర్పడిన వివాదమే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఘటనలోని కొన్ని దృశ్యాలను పద్మావతి కళ్యాణ మండపంలో విధులు నిర్వర్తిస్తున్న వాచ్‌మన్ తన సెల్ఫోన్లో చిత్రీకరించినట్టు తెలిసింది. -
తిరుపతి టీడీపీలో అసమ్మతి జ్వాల
-
తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సులు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లు మంగళవారం తిరుపతి అలిపిరి డిపోలో ఆందోళనకు దిగారు. దీంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తం 100 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుండగా.. తిరుమలకు 67 బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ఒక్కో డ్రైవర్ తన డ్యూటీలో తప్పనిసరిగా ఐదు ట్రిప్పులు వేయాల్సి ఉంటుంది. కానీ బస్సు కండీషన్, బ్యాటరీ చార్జింగ్ సమస్యలు, ఇతర కారణాలతో మూడు నుంచి నాలుగు ట్రిప్పులు మాత్రమే పూర్తవుతున్నాయి. దీనిని సాకు చూపించి నెల వేతనాన్ని తగ్గిస్తామనడంపై ఏజెన్సీ మేనేజర్‌ను డ్రైవర్లు నిలదీశారు. కానీ సరైన సమాధానం రాకపోవడంతో మంగళవారం విధులు బహిష్కరించి.. అలిపిరి డిపోలో ఆందోళనకు దిగారు. రైలు ప్రయాణికుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో పాటు బస్సు కండీషన్, బ్యాటరీ చార్జింగ్ సమస్యలు, ఇతర కారణాల వల్ల తిరుమలకు రోజుకు మూడు నుంచి నాలుగు ట్రిప్పులే పూర్తవుతున్నాయని డ్రైవర్లు చెప్పారు. ఒక్కో ట్రిప్పుకు రూ.375 చొప్పున రోజుకు ఐదు ట్రిప్పులు పూర్తి చేస్తే రూ.1,875 చెల్లిస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు డ్రైవర్ల సంఘ ప్రతినిధులతో రవాణా శాఖ డిప్యూటీ సీటీఎం విశ్వనా«థ్, అలిపిరి డిపో మేనేజర్ హరిబాబు చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో.. డ్రైవర్లు విధులకు హాజరయ్యారు. -
తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
తిరుపతి జిల్లా: బూతు ఎమ్మెల్యే మాకొద్దని పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. పులివర్తి నాని బూతు మాటలు, రోత పనులపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారు. నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వైఖరి నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణకు డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం మెయిన్ గేట్ ఎదుట వైఎస్సార్సీపీ చంద్రగిరి ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడును బూతులు తిట్టిన ఎమ్మెల్యే నానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గోధుమ రంగు గుట్ట కాదు.. బంగారు గుట్ట అని పిలుస్తాం!
తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే దారిలో ఒక గుట్టపైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పాదం ఉంది. స్వామివారు నారాయణవనంలో పద్మావతిని పెళ్ళాడి స్థిర నివాసం కోసం బయలుదేరాడు. దారిలో పుత్తూరు పట్టణం పక్కనున్న గుట్టమీద కాలు పెట్టాడని, అది స్వామిని మోయలేక కదిలిందని చెబుతారు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు స్వామి. మరికొన్ని చోట్ల కూడా పాదం మోపి చివరిగా శేషాచలం కొండలపైన కొలువైనాడని భక్తుల నమ్మకం.ఆ గుట్ట మీదున్న స్వామిపాదాన్ని చూద్దామని తమిళనాడుకు చెందిన కొందరు యువతీ యువకులు జట్టుగా బయలుదేరారు. ఆ బృందానికి ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. గుట్టపైకి వెళ్ళే దారి చూపడానికి ఒక స్థానికుడిని మాట్లాడుకున్నారు. నామం పెట్టుకుని, చేతిలో కర్ర, తలకి టోపీ, చలువ కళ్ళద్దాలు తొడిగి చెప్పులు లేకుండా ఆ బృందం బయలుదేరింది. గుట్ట ఎక్కుతున్న వారిని చూసి అక్కడి గ్రామాల ప్రజలు ‘ఈ పిల్లోళ్ళకి ఎంత భక్తి, ఎంత భక్తి’ అని పొగడ్తల వర్షం కురిపించారు.కొద్దిదూరం నడిచాక గుట్ట మీద ఉన్న గడ్డిని చూసి ఒక మెడికో అమ్మాయి ‘‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాము, కానీ ఇక్కడేమిటి, అంతా గోధుమ రంగులో ఉంది’’ అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె చూసింది పూరికప్పు వేసుకోవడానికి ఉపయోగించే బోద గడ్డి అది. ఎండకి బాగా ఎండి అది గోధుమ రంగులోకి మారి ఉంది.దారి చూపే స్థానికుడు ఆమె మాటలకు చిన్న నవ్వు నవ్వాడు. ‘‘మేము దీన్ని గోధుమ రంగు గుట్ట అని పిలవం, బంగారు గుట్ట అని పిలుస్తాం’’ అని చెప్పాడు. పక్కనే ఉన్న బృందనాయకుడు మనం ఈ గుట్టమీదున్న గడ్డిని చూసి గోధుమ రంగు గుట్ట అనుకుంటున్నాము, దాన్నే భక్తి భావంతో, ఆశావాద దృక్పథంతో ఉన్న ఇక్కడి వారు బంగారు గుట్టగా భావిస్తున్నారు. మన దృక్పథాన్ని పునః పరిశీలించుకోవాల్సి ఉందని వివరించాడు.మాటల్లోనే గుట్ట మీదకు చేరుకున్నారు. అక్కడున్న ఏనుగు పాదాలు, గుర్రపు పాదాల అడుగులు చూసి ఆశ్చర్యపోయారు. స్వామి పాదం పక్కనే ఉన్న దొనలో కాళ్ళు చేతులు కడుక్కుని పూజలు చేసి గోవిందలు పలుకుతూ వెనుదిరిగారు.దిగుతూ ఉంటే భక్తి పారవశ్యంతో ఉన్న ఆ మెడికో అమ్మాయికి గుట్ట మీదున్న గడ్డి అందంగా, బంగారు రంగులో కనిపించింది. ఏదైనా చూసే మనసును బట్టి ఉంటుంది ఈ ప్రపంచం అని తెలుసుకుంది ఆ అమ్మాయి. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
రిటైర్డ్ జడ్జిపై పులివర్తి నాని బూతు పురాణం.. తిరుపతి అడ్వకేట్స్ స్ట్రాంగ్ రియాక్షన్
-
తిరుపతిలో కిలాడీ లేడి.. బయటకొస్తున్న ఉషారాణి లీలలు
-
ఉషారాణి నా జీవితాన్ని నాశనం చేసింది..!
తిరుపతి అన్నమయ్యసర్కిల్: జిల్లాలో హనీ ట్రాప్ ఉషారాణి అక్రమ సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మీడియా, పోలీసులను బాధితులు ఆశ్రయిస్తున్నారు. గురువారం వడమాలపేట మండలం, పాదిరేడు గ్రామ మాజీ సర్పంచ్ చుక్కా శేఖర్ తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. రైల్వే ఉద్యోగి కిల్లి రవి అత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాయ లేడీ ఉషారాణి అరెస్టు అయిన విషయం తెలిసిందేనన్నారు. ఈ సందర్భంగా ఆమె చేత తీవ్రంగా నష్టపోయిన ఒక బాధితుడిగా మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. తన కష్టకాలంలో మానవత్వంతో తాను అందించిన సహాయాన్ని ఆసరాగా చేసుకొని, ఉషారాణి తనను తీవ్రమైన మానసిక వేధింపులకు గురిచేసి, రూ.90 లక్షలకు పైగా బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసిందని ఆరోపించారు. ఆమె చేసిన మోసాల చరిత్రను వివరిస్తూ ఇలాంటి ఉచ్చులో ఎవ్వరూ పడవద్దు అని చెబుతూ ఉషారాణిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. 2008 –09 మధ్య ఉషారాణితో పరిచయం ఏర్పడిందన్నారు. మరొక వ్యక్తి సుబ్రమణ్యంతో అక్రమ సంబంధం పెట్టుకుని తిరుపతి సుందరయ్య నగర్లో నివాసం పెట్టిందన్నారు. తనను మానసికంగా వేధింపులు గురి చేసి రూ.కోటి వరకు లాక్కొందన్నారు. భూములు సైతం ఆమె పేరున రాయించుకుంటూ పత్రాలపై సంతకాలు తీసుకుని కోర్టులో దావా వేసిందని వాపోయారు. కోటి రూపాయల ఇల్లు కూడా తీసి ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిందన్నారు. పరువు పోకూడదు అనే భయంతో పెళ్లయిన తన కూతురు నగలు అమ్మి రూ.6 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ఆమె మొదటి భర్త విశ్వనాథంను కాదని గాజులమండ్యం ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న విషయం తెలిసి ప్రశ్నించడంతో అతనితో కలవడం మానేశానంటూ నమ్మబలికిందన్నారు. ఆమె మరో ఇద్దరితో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే రేణిగుంట రైల్వే ఉద్యోగి కిల్లి రవితో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ తరువాత రవి కూడా ఆమె బ్లాక్‌మెయిలింగ్‌ను తట్టుకోలేక మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిపారు. -
MLA పులివర్తి నాని బూతు పురాణం.. సంచలన ఆడియో లీక్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు)
-
29న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: వేసవి సెలవులు ముగిసిపోవడంతో పాటు వారాంతం రావడంతో తిరుమలలో అనూహ్య రద్దీ నెలకొన్న కారణంగా అధిక మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.. ఈ నేపథ్యంలో ఆదివారం సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదు. ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ లో ఏరోజుకారోజు జారీ చేసే 800 శ్రీవాణి దర్శనాలను కూడా ఆరోజు రద్దు చేశారు. అదేవిధంగా తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, బయట క్యూలైన్లు నిండి బాలాజీ నగర్ ప్రాంతం వరకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంకా వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ సీనియర్ అధికారులందరూ భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. -
రూ. 100 కోట్ల విలువైన భూమి రాత్రికి రాత్రే తారుమారు..
-
టీటీడీ ఆన్లైన్ టికెట్ల బుకింగ్.. సాంకేతిక లోపాలపై భక్తుల అసంతృప్తి
సాక్షి,తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎదురుచూసే సామాన్య భక్తులకు ఆన్లైన్ టికెట్ల బుకింగ్ ఒక పెద్ద ప్రహసనంగా మారింది. టీటీడీ అధికారిక పోర్టల్ ద్వారా ప్రతి నెల విడుదలయ్యే వివిధ రకాల దర్శన కోటాలు, ఆర్జిత సేవా టిక్కెట్ల బుకింగ్ సమయంలో ఎదురవుతున్న సాంకేతిక లోపాలపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల ఓ శ్రీవారి భక్తుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆన్లైన్ టికెట్లు విడుదలయ్యే సమయానికి ముందే వెబ్సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి, కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నామని వాపోయారు. స్లాట్లు ఓపెన్ అయిన మరుక్షణమే ‘వర్చువల్ క్యూ’లోకి పంపుతున్నారని, అక్కడ నిమిషాల తరబడి నిలబడి మొబైల్ నంబర్ ఓటీపీలు ఎంటర్ చేసి, భక్తుల వివరాలు నమోదు చేసే లోపే పరిస్థితి మారిపోతోందని ఆవేదన చెందుతున్నారు.చివరకు పేమెంట్ ఆప్షన్‌కు వెళ్లేసరికి ‘స్లాట్ ఆల్రెడీ బుక్డ్’ అనే సందేహం మాత్రమే స్క్రీన్‌పై దర్శనమిస్తోందని భక్తులు వాపోతున్నారు. సామాన్యుడికి అందని ద్రాక్షేనా?ఈ టికెట్ల కేటాయింపు ప్రక్రియపై భక్తులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ ఆన్లైన్ టికెట్లు సామాన్య భక్తులకు నిజంగానే దొరుకుతున్నాయా? లేక కేవలం హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నవారికి, వ్యవస్థ వేగాన్ని అందుకోగల సాంకేతిక నిపుణులకు మాత్రమే లభిస్తున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.భక్తి, అదృష్టం, ఇంటర్నెట్ స్పీడ్ ఈ మూడింటిలో ఏది ఉంటే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో భక్తులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా కోటా విడుదలైన 20 నుండి 30 నిమిషాల్లోనే లక్షలాది టికెట్లు మాయమవ్వడం వెనుక కారణాలను విశ్లేషించాలని, సాధారణ భక్తుడి సమయానికి, శ్రమకు కనీస విలువ ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.దళారుల ప్రమేయం లేకుండా, అందరికీ సమానమైన, పారదర్శకమైన రీతిలో దర్శన అవకాశాలు కల్పించే నూతన విధానాన్ని టీటీడీ ఎందుకు ప్రవేశపెట్టడం లేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. స్వామివారి సన్నిధికి రావాలని కోరుకునే ప్రతి భక్తుడికి న్యాయం జరిగేలా గోవిందా అని పిలిచే భక్తుల బాధ ఆలయ బోర్డు అధికారుల వరకు వినబడేలా టీటీడీ తక్షణమే స్పందించి ఈ ఆన్లైన్ సర్వర్ సమస్యలను, బుకింగ్ లోపాలను సరిదిద్దాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు -
ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి.. కేంద్రం సానుకూలం
ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తిరుపతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్ ఏర్పాటు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వకంగా ఎంపీ గురుమూర్తికి సమాధానమిచ్చారు.ఈ ఏడాది మే నెలలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయడంతో పాటు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నెలకొల్పాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దశలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. భూమి కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని నైలెట్‌కు సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్ అందిన వెంటనే కేంద్ర మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.అదే విధంగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి అందిందని, ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతిని సమాచార సాంకేతిక, సైబర్ భద్రతా విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. తిరుపతిలో నైలెట్ ఏర్పాటు కోసం ఎనలేని కృషి చేసిన ఎంపీ, ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే తిరుపతి యువతకు ఉన్నత స్థాయి సాంకేతిక విద్య, శిక్షణ అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉషారాణి మామూలు లేడీ కాదు.. రైల్వే ఉద్యోగి ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజాలు..!
-
తిరుపతి రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: తిరుపతి జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యస్విత మృతి చెందడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.చిన్న వయసులోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. పుల్లంపేట మండలంలోని కడప-చెన్నై ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడాది బాలుడు, శ్రీకాళహస్తి కి చెందిన యస్విత అనే విద్యార్థి మృతి చెందారు. ప్రమాదం కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. -
మామిడి పంటకు గిట్టుబాటు ధర.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ సంఘీభావం తెలిపింది. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మామిడి రైతులతో కలిసి పార్టీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున మామిడి రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, గత ఏడాది మామిడి పంటకు కిలో 12 రూపాయలు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించింది. ఈ ఏడాది మామిడి పంటను తక్కువ ధరకే కిలో 4 నుంచి 5 రూపాయలకు మించి జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయడం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీల యజమాన్యాలు సిండికేట్‌గా మారి మామిడి రైతులను నిలువు దోపిడి చేస్తున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తోతాపురి మామిడి పంటకు కిలో 15-20 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మామిడి రైతులకు మద్దతుగా నిలవడంతో ముందుగా మామిడి లోడు ట్రాక్టర్లను పోలీసులు లోపలికి పంపించారు. జైన్ ఫ్యాక్టరీ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక, మూడు నుంచి నాలుగు రోజుల పాటు మామిడి రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. -
సాయి కృష్ణ ది హత్యే, హోం మంత్రిగా వెంటనే రాజీనామా చేయాలి
-
హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!
సాక్షి, తిరుపతి: తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. స్వామివారి ఆలయంపై నుంచి హెలికాఫ్టర్ వెళ్లింది. దీంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ఆలయ పవిత్రత దెబ్బ తింటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చోద్యం చూస్తుందా? అని మండిపడుతున్నారు. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం.. ఆలయ గర్భగుడి మీదుపై డ్రోన్లతో సహా ఎలాంటివి సంచరించకూడదు. కానీ, విమానాల సంచారం తరచూ జరుగుతోంది. ఈ విషయంలో భక్తులు ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని టీటీడీ చెబుతూ వస్తోంది. అయితే చాలాకాలం తర్వాత ఏకంగా హెలికాఫ్టర్ సంచరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “తిరుమలలో సాధారణంగా విమానాలు వెళ్తున్నాయి… కానీ ఈసారి ఏకంగా హెలికాప్టర్ ఆలయంపైకి వచ్చింది. పవిత్రతను కాపాడాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉండటం సరైందేనా?’’ అని కొందరు వాపోతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన నియంత్రణలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు.ఈ పరిణామం రాజకీయ చర్చలకు కూడా దారి తీసింది. ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ బాధ్యతల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. దీంతో తిరుమలలో విమాన రాకపోకల నియంత్రణపై సమన్వయం ఎంతవరకు ఉందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. -
ఓరి నీ శ్రీనుగా.. ఒకసారి నా ముందుకు రా! నన్ను తిరుపతి నుంచి తరుముతావా?!
-
అంతన్నాడు ఇంతన్నాడే చంద్రబాబు.. బాబు పై అద్భుతమైన పాటపాడిన మహిళలు
-
వామ్మో.. ఇదేమి ఘోరం!
తిరుపతి తుడా: తిరుపతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్ద ఎత్తున కుళ్లిన మాంసం చూసి జనం వామ్మో... ఇదేమి ఘోరం.. అంటూ నివ్వెరపోయారు. నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం నగరంలోని పలు దుకాణాల్లో సోదాలు చేశారు. ఫ్రిజ్‌లు, వెలుపల పెద్ద ఎత్తున నిల్వ చేసిన మాంసాన్ని గుర్తించారు. పలుచోట్ల కుళ్లిపోయి, పాచిపట్టి, పురుగులు ఉండడంతో అధికారులు ఖంగుతిన్నారు. పీర్ల చావిడి స్లాటర్ హౌస్‌పై మెరుపు దాడి నగరంలో కుళ్లిన మాంసం నిల్వ చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణాపురం పోలీస్‌స్టేషన్ సమీపంలోని పీర్ల చావడి స్లాటర్ హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఐదారు షాపుల్లో పొట్టేలు, మేకల తలకాయలు, కాళ్లు, ఇతర అవయవాలు నిల్వలను గుర్తించారు. ఇవన్నీ రోజుల తరబడి అపరిశుభ్రమైన ప్రదేశంలో డంప్ చేయడంతోపాటు ప్రీజర్లలో నిల్వ ఉంచడాన్ని గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. కుళ్లిపోయి, పురుగులు పట్టి దుర్వాసన వస్తున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి తిరుపతిలోని కొందరు మాంసం విక్రయించే వ్యాపారులకు చెన్నై, హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మెట్రో నగరాల్లో నిల్వ ఉంచిన, గడువు ముగిసిన మాంసాన్ని రసాయనాలు చల్లి తిరుపతి మార్కెట్‌కు దిగుమతి చేసుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. లేబుళ్లు, తయారీ తేదీలు లేకుండా కుళ్లిపోయి, రంగు మారిన స్థితిలో ఉన్న తలలు, కాళ్లను పలు హోటళ్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తేల్చారు.నిల్వ ఉంచిన మాంసం విక్రయిస్తే చర్యలు: హెల్త్ ఆఫీసర్ కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడంతోపాటు వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని తిరుపతి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ చెప్పారు. పలు షాపుల్లో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా, అర టన్ను మేర నిల్వ ఉంచిన పొట్టేళ్లు, మేకల తలకాయలు, కాళ్లు, ఇతర భాగాల మాంసం గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ఫ్రీజర్‌లో కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న మాంసాన్ని ఇనుప చువ్వలతో లాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పరిసరాలు కూడా అపరిశుభ్రతతో దారుణంగా ఉందని వివరించారు. కాగా, అధికారులు చెప్పిన దానికన్నా మరింత ఎక్కువగానే కుళ్లిన మాంసం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. -
చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధం: భూమన
సాక్షి, తిరుపతి: రెండేళ్ల కూటమి పాలనపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని, విధ్వంస పాలన ఎవరిదో ఆధారాలతో సహా రుజువు చేస్తానని తిరుపతి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు దీటుగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి బదులిచ్చారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సభకు అపనమ్మకపు సభ, సంక్షోభ సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేదని, ఈ సభ ద్వారా మరోసారి చంద్రబాబు ప్రజలకు మాయా బజార్ సినిమా చూపించాడని ఆరోపించారు.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా విజన్ 2047 పేరుతో ప్రజలను మరోసారి భ్రమల ప్రిజన్లో బంధించాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి పాదాల చెంత మరోసారి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారని, "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో కూటమి నిర్వహించిన సభను నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాన్‌ల చెక్క భజన సభ అని ఎద్దేవా చేశారు. రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేక కేవలం జగన్ ని తిట్టడానికి రూ.20 కోట్లు ఖర్చు చేశారని భూమన ధ్వజమెత్తారు.చంద్రబాబు అరాచక రాక్షస పాలనకు, వెన్నుపోటు, అంతులేని అవినీతికి రెండేళ్లు పూర్తయ్యానని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, చెప్పుకున్న చంద్రబాబు.. తన తప్పు లేకుంటే సీఐడీతో కేసులు ఎందుకు కొట్టేయించుకున్నాడని ప్రశ్నించారు. శ్రీవాణి టికెట్ల అమ్మకాలు, పరకామణి వ్యవహారం, డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...అందుకే జగన్‌పై అక్కసు వెళ్లగక్కారుచంద్రబాబు పరిపాలనా దక్షుడు కాదు.. వెన్నుపోటు వీరుడు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, ఈనే తేడా లేకుండా తప్పించుకోలేని విధంగా తన రెండేళ్ల పాలనలో అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచాడు. "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో కూటమి నాయకులు వైయస్ జగన్ గారిని తిట్టడానికే పరిమితమయ్యారు తప్ప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు గురించి మాత్రం స్పష్టంగా సమాధానం చెప్పడం లేదు.మరోసారి పచ్చి అబద్ధాలు..ఆఖరుకి తిరుమల శ్రీవారి పాదాల చెంత మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన వైఫల్యాలకు జగనే కారణమని ఊదరగొడుతున్నాడు. "రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి సంక్షేమం" పేరుతో నిర్వహించిన ఈ సభకి అపనమ్మకపు సభ, అబద్ధపు సభ, సంక్షోభ సభ, అనాగకరిక సభ అనే పేర్లు పెట్టుకుంటే బాగుండేది. 10 వేల మంది కూడా పట్టని ఆ ప్రాంతంలో 50 వేల మందితో సభ నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేసుకుని పదుల కోట్ల రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేశారు.మరోసారి మాయా బజార్ సినిమాని చూపించారువైఎస్ జగన్ పట్ల ఉన్న అక్కసు తీర్చుకోవడానికే ఈ సభను నిర్వహించారు. చంద్రబాబు అరాచక రాక్షస పాలనకు, వెన్నుపోటుకి, అన్యాయానికి, అంతులేని అవినీతి, దోపిడీ దౌర్జన్యాలకు మాత్రమే రెండేళ్లు పూర్తయ్యాయి. రెండేళ్ల పాలనలో ఆద్యంతం జగన్ పట్ల ద్వేషమే చూపించారు. ఈ సభ ద్వారా మరోసారి మాయా బజార్ సినిమాని చూపించారు. ఎర్ర బుక్కు పేరుతో చేసిన వెర్రి చేష్టలు తప్ప చేసిందేమీ లేదు. నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాన్లు.. చరకుడి వారసులమని చెప్పుకున్న చెక్క భజన సభ ఇది. వైఎస్ జగన్ గురించి అవాకులు చవాకులు పేలుతున్న చంద్రబాబు కొడుకు పేరు లోకేష్ కాదు.. పాపేష్, ఎర్ర బుక్కు ఎల్లేష్. తాను పప్పు అనే సంగతి లోకేష్ మరిచిపోయినా రెండు దశాబ్దాలుగా చూస్తున్న గూగుల్ మరిచిపోదు. రాబోయే రోజుల్లో తన తల్లిదండ్రులనే మర్చిపోతాడేమో.ఓటేసిన ప్రజలను నట్టేట ముంచేశారుతెలుగుదేశం అంటేనే వెన్నుపోటు పార్టీ. హంతకుల పార్టీ అని ఆనాడు గద్దర్ అన్నదే నిజమైంది. రెండేళ్ల పాలనలో చేసిందేమీ లేకపోయినా అన్ని చేసేశామని సిగ్గులేకుండా చెప్పుకున్నాడు. ఇద్దర్ని పిలిపించి భజన చేయించుకున్నాడు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల గురించి రాష్ట్రమంతా గగ్గోలు పెడుతోంది. 23 లక్షల పెట్టుబడులు, ఉద్యోగాలు అన్ని ఉత్తమాటలే. రెండేళ్లలో చేసిన రూ.3.60 లక్షల కోట్ల అప్పులే నిజం. వైఎస్ జగన్ డీబీటీ ద్వారానే నేరుగా రూ.2.73 లక్షల కోట్లు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేశాడు. కానీ చంద్రబాబు జగన్ ఇచ్చిన హామీలతో పాటు సూపర్ సిక్స్ అమలు చేస్తానని నమ్మించి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచేశాడు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాడు. విద్యా వ్యవస్థ నాశనం చేశాడు. మహిళలకు ఉచిత బస్సు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను కూడా 20 శాతం కూడా అమలు చేయలేదు. అయినా 2047 పేరుతో ప్రజలను భ్రమల ప్రిజన్లో ఉంచుతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎవరికీ అర్థం కాలేదు. ఏదో మీటింగ్ కోసం రాసుకున్న ప్రసంగాన్ని ఇక్కడ చదివినట్టుంది. పవన్ కళ్యాన్ తన స్వార్థం చూసుకుంటున్నాడని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఆయనకు దూరంగా జరిగింది. వారిప్పుడు ఆయన మాటలను నమ్మడం లేదు.సీబీఐ విచారణ కోరే దమ్ముందా?చంద్రబాబు నియమించిన సిట్ నివేదికే తిరుమల లడ్డూ విషయంలో మా తప్పేమీ లేదని తేల్చింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ చంద్రబాబుకి మొట్టికాయలు వేసింది. అయినా ఇంకా లడ్డూని అపవిత్రం చేశామని మాపై నిందలు వేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తప్పతాగి కొంతమంది రౌడీలు గూండాల మాదరిగా తన్నుకున్నారు. స్త్రీ లోలుడైన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన చంద్రబాబే ఆలయ ప్రతిష్టను దిగజార్చేస్తున్నాడు.గతంలో ప్రతి సభలో కనిపించిన బీఆర్ నాయుడు ఇప్పుడెందుకు చంద్రబాబు పక్కన కనిపించడం లేదు? కొండ మీద మందు బాటిళ్లు కూడా కూటమి పాలనలో దొరికాయి. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చడమే కాకుండా గంజాయి, ఎర్రచందనం స్మగ్మర్లను తిరుపతిలో పెంచి పోషిస్తున్నది చంద్రబాబే. తిరుపతిలో అరాచకం రాజ్యమేలుతోంది.కేసులను ఎదుర్కోకుండా ఎందుకు కొట్టేయించుకున్నారు? డీఎస్సీ 2025కింద టీచర్ ఉద్యోగాల భర్తీ పేరుతో ఒక్కో ఉద్యోగం రూ. 15 నుంచి రూ. 20 లక్షలకు అమ్మేసుకున్నాడు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా వైయస్ జగన్ గారు వెలికితీస్తే ప్రభుత్వం నుంచి ఇంతవరకు సరైన సమాధానం లేదు. శాప్ చైర్మన్ స్పోర్ట్స్ కోటా సీట్లను అమ్మేసుకుంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదు? నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్టు చేశారని చెప్పుకున్న చంద్రబాబు.. ఆ కేసులను ఎత్తివేయించడానికి సీఐడీని ప్రలోభ పెట్టకుండా ఉండాల్సింది. అవి తప్పుడు కేసులైతే న్యాయస్థానాల్లో ఎందుకు పోరాడలేదు? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కోరే దమ్ముందా? పరాకామణి విషయంలో, కొండ మీద జరిగే అక్రమాలపై, శ్రీవాణి టికెట్ల గోల్‌మాల్‌పై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? చంద్రబాబు కోరినట్టు బహిరంగ చర్చకు నేను సిద్దమే. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తా.కూటమి దుష్ట పాలనపై పోరాటం ఆపే ప్రసక్తే లేదుచంద్రబాబు దుర్మార్గ, దుష్ట, పాపపు పాలన అంతం చేయడానికి వైయస్సార్సీపీ నిర్వహించిన నిరసనలకు మహిళలు సహా ప్రజలు పోటెత్తారు. పోలీసుల ఆంక్షలను కూడా పట్టించుకోకుండా ప్రజలు కదం తొక్కారు. చంద్రబాబు మోసపు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారు. కనీసం 5 వేల మందికిపైగా వైయస్సార్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చిన్నపోస్టు పెడితే చాలు పోలీస్ స్టేషన్లు తిప్పిస్తున్నారు. ఇలాంటి వారు వైయస్సార్సీపీ విధ్వంస పాలన అని మాట్లాడటం హేయం. ఎన్ని అణచివేతలకైనా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదు. వెన్నుపోటు పాలనకు చరమ గీతం పాడే వరకు పోరాటం ఆపేది లేదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
‘టీటీడీ ఛైర్మన్ ఆ పోస్టులను అమ్ముకున్నారు’
సాక్షి, తిరుపతి: టీటీడీలో మరో కొత్త వివాదం తెరపైకి రాగా, 60 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలపై విచారణ జరగాలని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు నిలిపేసిన పోస్టులపై నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. లీగల్ సమస్యలపై వస్తాయనే కోర్టు తాతాల్కికంగా నిలిపేసిందన్న భూమన.. టీటీడీ ఛైర్మన్ ఒక్కో పోస్ట్‌ను రూ.30-40 లక్షలకు అమ్ముకున్నారంటూ ఆరోపించారు.‘‘రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా నోటిఫికేషన్ నిలిపివేశాం. ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిలిపివేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన ఏడాదిన్నర తర్వాత గత మే నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు...టీటీడీ చైర్మన్, ఆయనకు కొమ్ముకాసే ఇద్దరు సభ్యులు సహకారంతో ఒక్కో పోస్ట్‌ను 30-40లక్షలకు అమ్ముకున్నారనే చర్చ జరుగుతోంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. 2024-25 ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదు. రాష్ట్రం మొత్తం ఒకే జోన్‌గా పరిగణించారు, రాయలసీమ ప్రాంతం వారికి అన్యాయం జరిగింది. రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఆ రోజు నోటిఫికేషన్ రద్దు చేశాం...రాష్ట్రం మొత్తం ఒకే జోన్ కిందకు తీసుకు వచ్చారు. ఒక్కో పోస్ట్ లక్షలాది రూపాయలకు పోస్ట్‌లు అమ్ముకుంటున్నారు. 60 పోస్టుల భర్తీకి మద్రాస్ ఐఐటీ వాళ్లకు బాధ్యత అప్పగించాం. పారదర్శకంగా ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం.. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నోటిఫికేషన్ నిలిపివేశాము’’ అని భూమన వివరించారు. -
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ‘సర్’ ప్రభావంతోనే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రంలో సీఎంలుగా ఉన్న మమత బెనర్జీ, స్టాలిన్లు ఓడిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్న రోజా.. సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘రాష్ట్రంలో జగనన్న పాలన దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అందడం లేదు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 30 లక్షలు తల్లులకు అమ్మఒడి దూరం చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రంగాకు టీ ఇచ్చాను.. గద్దర్‌కు కారు కొనిచ్చా అని చెప్పుకుంటున్నాడు...మంత్రి నారా లోకేష్ లీకేజీ స్టార్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేతలను జైల్లో పెట్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం పట్టించుకోలేదు’’ అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. -
శ్రీ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక వైభవం.
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ నెలలో పలు విశేష ఆర్జిత, మాసోత్సవాలు భక్తి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందాలని ఆలయ అధికారులు కోరారు.ప్రతి శనివారం అభిషేకం.జూన్ 6, 13, 20, 27 తేదీలలో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణుల మూలవర్లకు పవిత్ర అభిషేకం నిర్వహిస్తారు.అమావాస్యనాడు సహస్ర కలశాభిషేకం – హనుమంత వాహనసేవ.జూన్ 15న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్రునికి పరమభక్తుడైన ఆంజనేయస్వామి సేవను స్మరింపజేసే హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనుంది.పునర్వసు నక్షత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం.జూన్ 17న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకువెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు.పౌర్ణమినాడు అష్టోత్తర శతకలశాభిషేకం.జూన్ 29న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం ఆలయ నాలుగు మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు సాగుతుంది. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం నిర్వహించనున్నారు. భక్తులు ఈ విశేష ఉత్సవాలలో పాల్గొని శ్రీ సీతారామచంద్రుల అనుగ్రహాన్ని పొందాలని ఆలయ అధికారులు కోరారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది -
కూటమి నేతల భూ ఆక్రమణలపై స్వామీజీలు ఆగ్రహం
-
తిరుపతిలో మద్యం మత్తులో ASI హల్ చల్..
-
మధుసూదన్ సార్.. మంచి పనిచేశారు!
నాయుడుపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమానప్రయాణం చేయించి హెచ్ఎం మధుసూదన్ ఆదర్శంగా నిలిచారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని అన్నమేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్.మధుసూదన్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను విమాన ప్రయాణం చేయిస్తామని హెచ్ఎం ముందుగా హామీ ఇచ్చారు.దీంతో పదో తరగతిలో అన్నమేడుకు చెందిన చెంబేటి శశి (588) మార్కులు, అన్నమేటి యమున (577), కాంపాలం భవిత (568) మార్కులు సాధించారు. దీంతో ఈ ముగ్గురు విద్యార్థినులను హెచ్ఎం సోమవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ విమానంలో రేణిగుంటకు తీసుకువచ్చారు. అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేలా హెచ్ఎం ఆదర్శంగా నిలవడంతో ఎంఈఓ బాణాల మునిరత్నంతో పాటు స్కూల్ ఉపాధ్యాయులు హెచ్ఎంకు అభినందనలు తెలిపారు.చదవండి: ట్రాఫిక్ చలానా ఉంటే పిల్లనివ్వను -
తిరుమలలో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం
-
ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం
విజయవాడ: ఏపీలో ఒకవైపు తీవ్రమైన ఎండలు.. మరొకవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండతో కాసింత ఉపశమనం పొందామనుకునే లోపే పిడుగులతో కూడిన వర్ష బీభత్సంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ రోజు(మంగళవారం, మే 26వ తేదీ) చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. మండల పరిధిలోని కారుమంచివారి కండ్రిగ గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతిచెందాడు. - గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడు కారుమంచి వారు కండ్రిగ గ్రామానికి చెందిన తోప్పని యశ్వంత్(22) గా గుర్తింంచారు. అదేవిధంగా పట్టణంలోని ఎల్ ఏ సాగరం గిరిజన కాలనీలోని పాఠశాల ఆవరణంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు పడి ఆ చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అయితే సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
కూటమిలో చీలికలు.. ఎమ్మెల్యే నానికి చెప్పు చూపించిన జనసేన నేత
-
దళిత రైతుల భూములపై టీడీపీ నేతల కన్ను
తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుర్ర కాలువలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దళిత రైతుల భూములపై టీడీపీ నేతలు కన్నేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుర్ర కాలువ గ్రామంలో దళిత రైతులు సుబ్రహ్మణ్యానికి చెందిన 3.39 ఎకరాల భూమిపై టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. సొంత భూమిలో నీటి బోరు వేసుకుంటుంటే టిడిపి నేత మోహన్ నాయుడు అడ్డుకున్నారు. దౌర్జన్యంగా బోర్వెల్ లారీని వెనక్కు పంపించేశారు. దాంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందని బాధిత సుబ్రహ్మణ్యం ఆరోపించారు. పంటలను కాపాడుకునేందుకు సూత్రాలు తెచ్చి బోరు వేస్తుంటే అడ్డుకున్నారని సుబ్రహ్మణ్యం భార్య ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా
సాక్షి, తిరుపతి: ప్రభుత్వ విప్ పదవికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు వేస్ట్ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 24 గంటల గడవక ముందే విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పంచాయితీలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కళంకిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కి విప్ పదవి తొలగింపుతో సరిపెట్టారు.బాధిత మహిళ ఆరోపణలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఫ్యామిలీ పంచాయితీకి 4 వారాల గడువు ఇచ్చిన పవన్.. చట్టపరమైన చర్యలు లేకుండా సెటిల్ చేసుకోవాలని బాలరాజును ఆదేశించారు. కుటుంబ సభ్యుల నుంచే బాలరాజు వ్యవహార శైలిపై ఆరోపణలు ఉన్నాయి. పవన్ ఫ్యామిలీ సెటిల్మెంట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్‌కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది. ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్’ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా సంచలనంగా మారింది. -
బాలికపై బాబాయి లైంగిక దాడి
తిరుపతి క్రైం: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని పిన్ని, బాబాయి ఇంటికి వచ్చిన బాలిక (16)కు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. తండ్రి వరుసయ్యే బాబాయి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడికి అతని భార్యే సహకరించడంతో బాలిక నిస్సహాయురాలిగా మారింది. ఆ దంపతులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి గురువారం తిరుపతి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది.తెలంగాణ రాష్ట్రం జగద్గిరిగుట్టకు చెందిన బాలిక (16) ఇంటర్ పరీక్షలు పూర్తవడంతో వేసవి సెలవులకు తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. జీఎస్టీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బాలిక బాబాయి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలితో ఫోన్, చాట్ యాప్స్ ద్వారా జరిపిన సంభాషణలు, కలిసి దిగిన ఫొటోలను తన వద్ద ఉంచుకుని, తాను పిలిచినప్పుడు రాకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.కొద్దిరోజుల తరువాత జగద్గిరిగుట్టకు వచ్చిన బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీచేశారు. నిందితుడిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం పర్యవేక్షణలో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.దర్యాప్తులో ప్రధాన నిందితుడితో పాటు అతని భార్య పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. ఆమె తిరుపతి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తూ, కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరినీ 21వ తేదీ సాయంత్రం అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.దళిత బాలికపై లైంగిక దాడికి యత్నంపోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదుపాయకరావుపేట: హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి ప్రయతి్నంచారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి బాధితురాలి తల్లి తెలిపిన వివరాలు... పాయకరావుపేటలోని తల్లితో కలసి 11 ఏళ్ల దళిత బాలిక నివాసం ఉంటోంది. తన కుమార్తె సెల్‌ఫోన్ దొంగిలించిందని ఆరోపిస్తూ ఈ నెల 17న ఇద్దరు వ్యక్తులు సమీపంలోని కొబ్బరితోటలోకి తీసుకెళ్లి ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ గోర్లతో రక్కి అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలి తల్లి తెలిపింది.ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారని పేర్కొంది. ఇంటికి వచ్చిన తన కుమార్తె శరీరంపై గాయాలు చూసి అడిగితే జరిగిన దారుణాన్ని తెలియజేసిందని చెప్పింది. తన కుమార్తెపై లైంగిక దాడికి ప్రయతి్నంచినవారిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించింది. కాగా, హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొంతనలేని పోలీసుల ప్రకటనలు ఈ విషయంలో పోలీసు అధికారుల ప్రకటనలకు పొంతనలేకపోవడం పలు అనుమానాలకు దారిస్తోంది. ‘బాలికపై లైంగిక దాడికి ప్రయత్నం జరగలేదు. బాలికకు ఇచ్చిన సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వకపోవడంతో బలవంతంగా తీసుకున్నందున లైంగిక దాడికి ప్రయత్నించారంటూ ఆమె కుటుంబ సభ్యులు తప్పుడు ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది’ అని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఒక వీడియో విడుదల చేశారు.అయితే, సెల్‌ఫోన్ దొంగిలించిందన్న నెపంతో కంటోన్మెంటుకు చెందిన 11 ఏళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు ఈ నెల17వ తేదీన కొబ్బరితోటలోకి తీసుకెళ్లి కొట్టడంతోపాటు ప్రైవేటు పార్ట్‌లను తాకినట్టు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిందని సీఐ శంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై క్రైమ్ నంబరు137/26/ సెక్షన్ 74, 79, 351 ఆర్/డబ్ల్యూ 3, 7 ఆర్/డబ్ల్యూ8ఆర్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. -
‘చంద్రబాబు వేస్ట్’ అన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్!
తిరుపతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఇప్పటికే అరవ శ్రీధర్‌కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది.ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్’ అంటూ అరవ శ్రీధర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వేస్ట్ అని, ఆయన చెప్పింది.. ఏనాడు చేయలేదని శ్రీధర్ వ్యాఖ్యానించిన వీడియోను బయటపెట్టింది. ఆ వీడియోలో చంద్రబాబును అరవ శ్రీధర్ ఏకవచనంతో సంబోధించినట్లు తెలుస్తోంది. -
మా అంత శుద్ధపూసలు లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు సిగ్గుగా లేదా..
-
ప్రేమించి పెళ్లి చేసుకుని రోడ్డుపై వదిలేసిన భర్త..
-
ఎంపీ గురుమూర్తి వినతి.. రైతులకు కేంద్రం తీపి కబురు
సాక్షి, తిరుపతి: తిరుపతి ఎంపీ గురుమూర్తి వినతిపై రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. గాజులమండ్యం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్రం సానుకూల స్పందించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడంతో పాటు ఆధునీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఎంపీ గురుమూర్తి తీసుకెళ్లారు.ఈ అంశంపై స్పందించిన కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ), షుగర్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) సహకారంతో ఈ కర్మాగార పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. దేశవ్యాప్తంగా మూతపడిన సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లేఖలో పేర్కొన్నారు. -
సైకిల్ తొక్కిన భూమన
-
సౌదీలో పునబాక మహిళ ఆత్మహత్య
తిరుపతి: మండలంలోని పునబాక గ్రామానికి చెందిన ఉయ్యాల భాస్కరయ్య, తయారమ్మ దంపతుల కుమార్తె కోనేటి మమత(36) బుధవారం సౌదీలోని జుబేల్ ప్రాంతంలో ఉంటూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో తిరుపతికి చెందిన కోనేటి చెంగయ్య (విశ్రాంత ఎస్ఐ) చిన్న కుమారుడు కోనేటి కృష్ణకి మమతను ఇచ్చి వివాహం చేశారు. వీరు శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్‌లో నివాసం ఉండేవారు.వీరికి కోనేటి రూపేష్ కోనేటి లోహిత్ కుమారులు ఉన్నారు. 2012లో కృష్ణకి సౌదీలోని సాట్రాప్ పెట్రో కెమికల్ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం రావడంతో భార్యభర్తలిద్దరు సౌదీలో నివాసం ఉంటున్నారు. తిరుపతిలో ఉన్న కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి వివాదం నెలకొనడంతో మమత మనస్తాపానికి గురై భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చి తమకు అప్పగించేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చిత్తూరు గంగజాతర... కనులపండువగా అమ్మవారి దివ్యరూపం (ఫొటోలు)
-
గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)
-
రూ.10 కోట్లు విలువైన పార్క్ స్థలం కబ్జా..!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గుడి, బడి, ప్రభుత్వ స్థలాలు.. ఇలా దేన్నీ వదలకుండా ఆక్రమించేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీకి కేటాయించిన రూ.10 కోట్ల విలువజేసే 1.57 ఎకరాల పార్క్ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు ఆక్రమించి పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్క్ స్థలం కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టిస్తున్న వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకి సమీప బంధువునని చెబుతుండడం వల్ల సదరు ఎమ్మెల్యే స్పందించి నిర్మాణ పనులను నిలిపివేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పుదిపట్ల గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 558లో ఉన్న దరఖాస్తు పట్టా భూమిని గతంలో ఓ ప్రైవేట్ వెంచర్ సంస్థ అభివృద్ధి చేసి పార్క్‌కు కేటాయించినట్టు సమాచారం. ఆ స్థలంపై చాలాకాలం నుంచి కన్నేసిన స్థానిక టీడీపీ నేత ఇప్పుడు అధికార బలంతో స్వా«దీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో స్థానికులు తిరుపతి కోర్టును ఆశ్రయించగా, అది పార్కు స్థలమేనని కోర్టు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా రికార్డులు మార్చి ఆక్రమణదారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని, ఆ స్థలంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తున్నందున కింది కోర్టు ఆదేశాలు ధిక్కరణ కింద చర్యలు కోరతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
తిరుపతిలో భూ వివాదం
సాక్షి టాస్క్ ఫోర్స్: తిరుపతి నగర నడిబొడ్డులోని ఎర్రమిట్టలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న భూమిలోకి టీడీపీ గూండాలు ప్రవేశించారు. దౌర్జన్యంగా జేసీబీలతో చదును చేసి గందరగోళం సృష్టించారు. మహిళలు, స్థానికుల కథనం మేరకు.. తిరుపతి అర్బన్ మండలం, అక్కారంపల్లి సర్వే నం.101/3లో రూ.కోట్ల విలువచేసే 1.05 ఎకరరాల భూమి ఉంది. ఈ భూమి తమదేనని వృద్ధురాలు తులశమ్మ, మరి కొందరు కొంత కాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏడాది క్రితం కొందరు యత్నించి విఫలమయ్యారు. అసలే ఆదివారం, కోర్టులకూ సెలవులు ఉండడంతో పథకం ప్రకారం ఆ భూమిలో ఉదయం రెండు జేసీబీలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ వృద్ధురాలు తులశమ్మ నిరి్మంచుకున్న రేకుల షెడ్డును, దాని చుట్టూ ఉన్న చెట్లను తొలగించడం ప్రారంభించారు. దీంతో తులశమ్మ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత సమయానికి మరికొందరు మహిళలు అక్కడికి చేరుకుని జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందస్తు పథకం ప్రకారం అక్కడే ఉన్న టీడీపీ గూండాలు మహిళలను అడ్డుకోవడం ఇబ్బంది అవుతుందని భావించి.. టీడీపీ సానుభూతి పరులైన కొందరు మహిళలను పిలిపించారు. ఎంతకూ పనులు ఆపకపోవడంతో బాధిత మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మరి కొందరు జేసీబీలకు అడ్డుపడ్డారు. తిరుపతి ఎర్రమిట్టలో టీడీపీ దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి తీవ్రంగా స్పందించారు. జర్నలిస్టుల ముసుగులో టీడీపీ చేస్తున్న భూ కబ్జా అని మండిపడ్డారు. తిరుపతి నగరంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని బాధితులతో కలిసి సీపీఐ నేతలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. -
జనసేన నేతలపై తిరుగుబాటు బావుటా!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనసేన నాయకులపై ఆ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు మాకొద్దంటూ డిమాండ్ చేశారు. నాయకులు సొంత వ్యాపారాలు, పనుల్లో బిజీగా ఉంటూ.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు తమకు వద్దంటూ సీనియర్ నాయకుల సమక్షంలోనే నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంపై ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మరి కొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు. కొద్ది సేపటికి జిల్లా అధ్యక్షుల నియామకంపై చర్చ ప్రారంభమైంది. వెంటనే వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాము ఫోన్‌చేసినా, ఏదైనా చెప్పుకునేందుకు వెళ్లినా స్పందించరని మండిపడ్డారు. ఆ వెంటనే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నాయకత్వం పైనా నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేని నాయకులు, స్పందించని జిల్లా అధ్యక్షులు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపాదిత పేర్లపైనా అభ్యంతరం ప్రస్తుతం సూచించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో డాక్టర్ హరిప్రసాద్, కిరణ్‌రాయల్, విజయ్ పేర్లు ప్రస్తావించడంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, విజయ్‌కి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో జిల్లా అధ్యక్షుల వర్గీయులు, కార్యకర్తలు ఒకానొక సమయంలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా కార్యకర్తలంతా లేచి.. జిల్లా అధ్యక్షుల ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తామని తేల్చిచెప్పారు. అప్పటి వరకు జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగటానికి వీల్లేదని పట్టబట్టారు. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక వాయిదా వేయాల్సి వచ్చింది. -
జనసేన పార్టీ సర్వసభ సమావేశంలో గందరగోళం
-
తిరుపతి గంగజాతర: వారు మాత్రమే ఆ వేషాలు వేస్తారు!
‘తిరుపతి కొండంత కొండ, పేరూరు గుట్టంత గుట్ట, తిరుపతి గంగజాతరంత జాతర’ లేవని తిరుపతి ప్రాంతీయుల నమ్మకం. నేడు తిరుపతి గంగజాతర రాష్ట్ర స్థాయి జాతర. ఇందులో 20 దున్న పోతుల్ని, 400 మేకపోతుల్ని, 700 కోళ్లని బలి ఇచ్చే సంప్రదాయం ఉన్నట్టు 1881 నాటి ఆర్కాట్ మాన్యువల్‌లో ఆర్థర్ ఎఫ్ కాక్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం దున్నపోతు బలి నిషేధితం. జాతరకి చిత్రి మాసంతో కత్రి కార్తెతో సంబంధం ఉంది. తిరుపతి గంగజాతర చాటింపు చిత్రి నెల నాలుగో మంగళవారం (మే 5, 2026). జాతర ముగింపు తర్వాతి మంగళవారం రాత్రి.చాటింపునకు ముందు అవిలాల గ్రామం (Avilala Village) నుంచి ఆడబిడ్డ సాంగ్యం తేవడం ఆనవాయితీ. ఇచ్చేది ముళ్లపూడి పెదరెడ్డి కుటుంబీకులు. తెచ్చేది తాళ్లపాక గంగమ్మ గుడి పూజారులైన కైకాల కుటుంబీకులు. అవిలాల ఆడబిడ్డ సాంగ్యంలో భాగంగా అమృతపళ్లెం, గండదీపం, పసుపు కుంకుమ, వేపాకు, నిమ్మకాయలు, ఆకు వక్కలు, పానకం, ఒడిబియ్యం, పచ్చిపిండి (బియ్యపుపిండి) తప్ప నిసరి. చాటింపులో పానకం దుత్త, పసుపు ముంతకు ప్రాధాన్యం ఉంది. చాటింపుకు ముందు అందరికీ నానబియ్యంతో పాటు పానకం ఇస్తారు, ఆడవారికి పసుపు పంచుతారు. వేపాకు, తమల పాకు, అరటి పండు దోసిట్లో పట్టుకొని పోతురాజు ముందు ఎర్నీళ్లు లేదా వసంతం నీళ్లు పూజారి పోస్తుండగా వదిలి, వెనక్కి చూడకుండా వెళ్తారు. కైకాల, తోటివారు పంబ పలకలు అనుసరిస్తుండగా చాటింపు వేసే ప్రాంతానికి వెళ్తారు.వేషాల వరుసచాటింపు మర్నాడు నుంచి గుడి తరపున మిరాశీ దారులు వేసే వేషాలు... వేషాలమ్మ గుడి నుంచి ప్రారంభమై మిరాశి ఉన్న ఇళ్లకు వెళ్లి చాటు దాటకుండా తిరిగి వేషాలమ్మ గుడికి చేరుకుంటాయి. బుధవారం పొద్దున వచ్చే బైరాగి వేషం మొదటిది. సాయంత్రం పాముల వేషం, బేస్తవారం పొద్దున గొల్ల, సాయంత్రం బండ వేషాలు ఉంటాయి. శుక్రవారం పొద్దున కోమటి, సాయంత్రం తోటి వేషాలు. శనివారం పొద్దున్నే ఒకప్పుడు జంగం వేషం వచ్చేది కాని ఇపుడు రావడం లేదు. సాయంత్రం దొర లేదా రాజు వేషం, బంటు వేషాలు. రాజు పాళెగాణ్ణి వధించి ‘బండిపీనుగు’ అని పాళెగాని శవాన్ని ఊరేగిస్తారు.ఆదివారం మాతంగి, పోతురాజు వేషాలు కాని ఇపుడు పోతురాజు వేషం రావడం లేదు. సోమవారం రెండు పసుపు కుండల వేషాలు. మంగళవారం పేరంటాలు వేషం ఊరు తిరుగు కుంటూ బుధవారం తెల్లవారు జామున గుడిలో ప్రత్యేకంగా తయారు చేసిన గంగమ్మ బొమ్మ చెంప నరుకుతుంది. తోటి వేషం నుంచి వేపాకు తప్పనిసరి. భక్తులు ఎక్కువ ఇష్టపడే వేషం తోటి వేషం. పాళెగాణ్ణి పట్టుకోవడానికి గంగమ్మ వేషాలు వేస్తుందనీ, దొర వేషంలో పట్టుకొని చంపివేస్తుందనీ కొన్ని కథలు చెప్తాయి.బైరాగి వేషం గొడుగు, పాముల వేషం కావడి, గొల్ల వేషం మజ్జిగ దుత్తతో వస్తే; బండ, తోటి వేషాలు కొత్త చేటతో వస్తాయి. దొర చేతిలో కత్తి, పేరంటాలు చేతిలో గంగమ్మ అద్దం, కోమటి వేషం మెడలో కరవాళ్ల జందెం ఉంటాయి. వేషాలు ఇంటి గుమ్మం తొక్కి ఆశీర్వదించడంలో కూడా ఒక వ్యవస్థ ఉంది. మాతంగి హారతి పళ్లెంలో ఒడిబాల బియ్యం వేసి, సున్నపుకుండలు, పసుపు ఇచ్చి, పేరంటాలు పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదిస్తే; తోటి వేషం చేటతో, పొరకతో కొట్టి ఆశీర్వదిస్తుంది.చదవండి: భవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు?గంగజాతరలో గుడి తరపు వేసే వేషాల్ని కైకాల వారు, మేకల తూరి, మంగపతి ఇంటిపేరు కల్గిన చాకలి వారు మాత్రమే వేస్తారు. చాకలి వారు బైరాగి నుంచి రాజు వేషం దాకా వేస్తే... మాతంగి, పసుపుకుండలు, పేరంటాలు వేషాలు కైకాలవారు వేస్తారు. ప్రస్తుతం ప్రతి వేషంతో పాటు ఆడవేషం కూడా వస్తోంది. వేషాల్లో చాకలి వారు వేసేవి ఒక వర్గంగా, కైకాలవారు వేసేవి మరో వర్గంగా విభజించి చూసినపుడు వాటి మధ్య ఒక అడ్డురేఖ ఉన్న విషయం గుర్తించవచ్చు. మగ వేషాలు మిరాశీ లేదా పూర్వం నుంచి పోతున్న కుటుంబాల దగ్గరికే పోతాయి. ఆడవేషాలు ప్రతి ఇంటి గడప తొక్కు తాయి. వేషధారణ, దీవెనలో కూడా తేడా ఉంది. మగ వేషాలకు ప్రత్యేక పాటలున్నాయి, బూతు పాటలున్నాయి. మగ వేషాలు గంగమ్మ గుడి దగ్గరకు పోతాయి కాని గుడిలోకి పోవు. రాజు మంత్రి వేషాలు వేశాలమ్మ గుడి దగ్గరకు పోతాయి గాని గుడిలోకి పోవు.- ప్రొఫెసర్ నాగపట్ల భక్తవత్సల రెడ్డి జానపద విజ్ఞాన పరిశోధకులు -
తిరుపతి గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)
-
సొంత ఇలాకాలో ఆ ఫలితాలేంటి బాబూ..?
చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్ర వ్యాప్తంగా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ప్రచారం చేసుకుంటూ గొప్పలుపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన సొంత జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పది, ఇంటర్ ఫలితాలు షాకిచ్చాయి. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం చిత్తూరు జిల్లా పరిధిలో ఉండగా.. ఆయన పుట్టి పెరిగిన చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉంది. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు పది, ఇంటర్ ఫలితాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర సగటుతో పోల్చితే ఈ రెండు జిల్లాల్లో ఫలితాలు అట్టడుగు స్థాయిలో నిలవడం దీనికి కారణం. చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను గాలికి వదిలేయడం వల్ల పేద విద్యార్థులు బలి అవుతున్నారనే విమర్శలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. వంద రోజుల డ్రామా...ఫలితం జీరో! విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేశ్ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అంటూ హడావిడి చేశారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల కొరతను తీర్చకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం గాలిలో మేడలు కట్టిన ఫలితం. పది, ఇంటర్ ఫలితాల్లో కనబడిందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించామని, అధికారులతో సమీక్షలు చేశామని చెప్పిన మాటలన్నీ నీటి మూటలే అని ఫలితాలు నిరూపించాయి. టీచర్లపై రాజకీయ ఒత్తిళ్లు, విద్యా వ్యతిరేక విధానాల వల్ల క్షేత్రస్థాయిలో బోధన కుంటుపడుతోంది. ప్రపంచ స్థాయి రాజధాని, హైటెక్ విద్య అంటూ ప్రగల్భాలు పలికే సీఎంకు తన సొంత జిల్లాల విద్యార్థుల భవిష్యత్ పట్టడం లేదని విద్యావేత్తలు మండిపడుతున్నారు. విద్యావ్యవస్థ కుప్పకూలడం వెనుక అధికారుల పర్యవేక్షణ లోపం కంటే, ప్రభుత్వ విధానపరమైన వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోందని, ఇది భవిష్యత్ తరాలను దెబ్బతీసే అంశమని విమర్శలు వినిపిస్తున్నారు. ఫలితాలు విడుదలైన ప్రతిసారి ఫలితాలు తగ్గాయని పేర్కొనడమే తప్ప.. ఆ పతనానికి బాధ్యులెవరన్న ప్రశ్నను పాలకులు విస్మరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అట్టడుగు ఫలితాల తీరిది10వ తరగతి ⇒ చిత్తూరు జిల్లా ఫలితాల్లో గత ఏడాదిలో సాధించిన 24వ స్థానమే మళ్లీ దక్కింది. కేవలం 76.69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో అట్టడుగున 24 వ స్థానంలో నిలిచింది. 4,872 మంది ఫెయిల్ అయ్యారు. ⇒ తిరుపతి జిల్లా ఫలితాల్లో గత ఏడాది 19 వ స్థానంలో ఉండగా, ఈసారి ఏకంగా 20వ స్థానానికి దిగజారింది. 4,257 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.ఇంటర్మిడియట్ ⇒ చిత్తూరు జిల్లా ఇంటర్మిడియట్ ఫస్ట్ ఇయర్లో 22వ స్థానంలో నిలబడగా, సెకండ్ ఇయర్లో 24వ స్థానంలో ఉంది. రెండు సంవత్సరాలు కలిపి 7,247 మంది ఫెయిల్ అయ్యారు. ⇒ తిరుపతి జిల్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 8, సెకండ్ ఇయర్లో 11 వ స్థానంలో నిలిచింది. రెండు సంవత్సరాలు కలిపి 11,813 మంది ఫెయిల్ అయ్యారు. ⇒ కుప్పం నియోజకవర్గంలోని చాలా కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 25 శాతం నుంచి 40 శాతంగా ఉంది. -
బైక్ పై వెళుతుంటే..రాడ్డుతో TDP గూండాల దాడి
-
తిరుమలలో కొత్త జంట సందడి
-
చెత్త సీఎం.. జగన్ దగ్గర నువ్వు జీరో.. బాబుని ఏకిపారేసిన తిరుపతి మహిళలు
-
తిరుపతి జిల్లాలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మరణం
-
తిరుపతి విషాదం కేసులో ట్విస్ట్
తిరుపతి విషాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న మోహన్.. భార్య, తల్లిని చంపి, ఆపై ఇద్దరు బిడ్డలతో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. అయితే అసలు విషయం అది కాదని బంధువులు, స్థానికులు చెబుతున్నారు. రైల్వే మెయిల్ సర్వీసులో ఉద్యోగం చేసుకుంటున్న పెద్దబ్బ, చంద్రకళ దంపతుల కుమార్తె రేఖ, కుమారుడు మోహన్ ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో వారసుడని మోహన్‌ను గారాబంగా పెంచారు. పెద్దబ్బ విధుల్లో ఉంటూ మృతి చెందాడు. నిరుద్యోగి అయిన మోహన్ తండ్రి ఉద్యోగంపై ఆశలు పెంచుకున్నాడు. కాగా నారాయణవనంలో క్లినిక్‌ను ప్రారంభించిన కోడూరుకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కుమార్ అక్క కుమార్తె హరితను మోహన్ 15 ఏళ్ల కిందట ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మొదటి నుంచి గారాబంగా పెరిగిన మోహన్ ఏ పనిపై శ్రద్ధ చూపక సోమరితనానికి అలవాటు పడ్డాడు. తండ్రి ఉద్యోగం వచ్చినా.. కొన్నాళ్లకే దానిని మానేశాడు. దీంతో భార్య హరిత టైలరింగ్ షాపును నడుపుతూ కుటుంబానికి అండగా నిలిచింది. కష్టపడి హరిత టైలరింగ్ షాపుతో పాటు బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించి మరో ఐదుగురికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగింది. పనిపై శ్రద్ధ చూపని మోహన్ క్రమంగా స్మార్ట్ ఫోన్‌కు బానిసైపోయాడు. కబళించిన ఆన్లైన్ గేమింగ్స్మార్ట్ ఫోన్‌తో గడుపుతూ ఆన్లైన్ రమ్మీకి అలవాటయ్యాడు మోహన్. క్రమంగా గేమింగ్‌లో నష్టపోతూ ఆన్లైన్లో అప్పులు చేశాడు. అధిక వడ్డీలతో పెరిగిన అప్పును చెల్లించమని ఒత్తిడి పెరిగినట్టు తెలిసింది. అప్పులను తీర్చడానికి పుత్తూరులోని ఇంటి స్థలాలను, ఆస్తులతో పాటు భార్య, తల్లి, పిల్లల నగలను తనఖా పెట్టి చెల్లించినా అప్పులు తీరలేదని తెలిసింది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్‌పై నిలదీసిన తల్లిని, భార్యను చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మను, భార్యను కడతేర్చిన నేరంపై జైలుకు వెళితే పిల్లలు ఒంటరైపోతారని భావించిన మోహన్ రైలు కింద పడి బలవర్మణానికి గురై ఉంటాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మోహన్, హరితల ఫోన్ల లాక్‌ను తీసి పరిశీలిస్తే గాని పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.పిల్లలు ఇంటికి వెళ్లి ఉంటే..?బుధవారం ఉదయం 11 గంటల సమయంలో స్కూల్ నుంచి పిల్లలను ఉన్నపళంగా ఇంటికి తీసుకు వచ్చిన తండ్రి మోహన్‌తో పాటు కౌశిక్, హిమనిలు ఇంటికి వెళ్లి ఉంటే బతికి ఉండేవారు. తల్లి చంద్రకళ, ఆ తర్వాత భార్య హరితను చంపిన మోహన్ బ్యాంకు నుంచి నగదును డ్రా చేసుకున్నాడు. నగదును పక్కింటి రాధకు ఇచ్చిన మోహన్ తర్వాత తీసుకుంటానని చెప్పి, పుత్తూరులోని స్కూల్‌కు వెళ్లి మేనమామ చావుకు వెళ్లాలని చెప్పి కౌశిక్, హిమనిను ఇంటికి తీసుకు వచ్చాడు. ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఇద్దరిని ఉండమని, స్కూల్ బ్యాగులను ఇంట్లో ఉంచడానికి వెళ్లాడు. తండ్రితో పాటు పిల్లలిద్దరూ ఇంటికి వెళ్లి.. తల్లి, నాన్నమ్మల మృతదేహాలను చూసి, అరుపులు వేసి ఉంటే మోహన్‌తో పాటు ఇద్దరూ బతికి ఉండే వారు. స్కూల్ వద్ద ఆడుకుంటున్న పిల్లలతో మాటలు కలవడం, తండ్రితో పాటు ఇంటికి వెళ్లకపోవడం పిల్లలకు శాపంగా మారింది. తండ్రితో కలిసి రైలు కింద పడి బలవర్మరణం పొందేవారు కారు. -
ఇంకా పోలీసుల నిర్బంధంలోనే పూడి శ్రీహరి
తిరుపతి: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించి కుప్పం పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడమే కాకుండా, ఇంకా కోర్టులో హాజరు పరచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పూడి శ్రీహరిని అరెస్టు చేసి 30 గంటలకు పైగా దాటినా ఇంకా పోలీసుల నిర్బంధంలోనే ఉంచారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 16వ తేదీ) ఉదయమే పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు చేసినా కోర్టులో మాత్రం హాజరుపరచలేదు పోలీసులు. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించిన పోలీసులు,.. ఇంకా తప్పుడు కేసులు బనాయించడానికి కుట్ర చేస్తున్నట్లు తాజా పరిణమాలను బట్టి తెలుస్తోంది. పూడి శ్రీహరిని ఇంకా కోర్టులో హాజరుపరచకపోవడంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ ఇంకా ఆ పని చేయలేదు పోలీసులు. -
టీటీడీ బోర్డులో అన్యమతస్తులు
-
ఫీజు చెల్లించలేదని విద్యార్థినితో బాత్రూంలు కడిగించిన యాజమాన్యం
-
తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)
-
చెప్పుతీసి కొడతా... ABN రాధా కృష్ణపై రెచ్చిపోయిన తిరుపతి YSRCP మహిళా నేత
-
మహిళలని చూడకుండా... దురుసుగా ప్రవర్తించిన పోలీసులు
-
RK రోజాపై దురుసుగా ప్రవర్తించిన పోలీస్
-
నెత్తురోడిన రోడ్లు
గంగవరం/రేణిగుంట: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, సోమవారం సాయంత్రం జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. తిరుపతి థర్డ్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న యుగంధర్(47), హరీష్(35)తోపాటు రజని, గురుమూర్తి, కిరణ్‌కుమార్, డ్రైవర్ జగదీష్ మొత్తం ఆరుగురు కలసి బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ చూసి ఆదివారం స్కార్పియో కారులో తిరుపతికి వస్తుండగా మార్గమధ్యలో చిత్తూరు జిల్లా గంగవరం బైపాస్ రహదారిపై ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న చంద్రగిరి మండలానికి చెందిన యుగంధర్, తిరుపతికి చెందిన హరీష్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగతా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంలో బావ, బామ్మర్ది మృతి తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంటకు చెందిన వంశీ(30), మునిరాజ (30) బావబామ్మర్ది. వీరు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి శెట్టిగుంటకు వెళ్తుండగా రేణిగుంట–కడప రహదారిపై మామండూరు సమీపంలో కోడూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.కాలువలోకి కారు దూసుకెళ్లి దంపతుల మృతిశుభకార్యానికి వెళ్లి వస్తుండగా అదుపు తప్పిన కారు కాలువలో కారు ముందు భాగం ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే మృతి మండపేట రూరల్ మండలంలో విషాద ఘటనకపిలేశ్వరపురం (మండపేట): శుభకార్యానికి వెళ్లి అందరితో సరదాగా గడిపిన ఆ దంపతులు తమ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తరువాత చీకటి కావడంతో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. దీంతో కారు ముందుభాగంలో కూర్చున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మండపేట రూరల్ మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటి పాకల వద్ద జరిగింది. వివరాలు.. బోగిళ్ల వీర వెంకట సతీష్ (40), బోగిళ్ల కిరణ్మయి (36) తమ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి కాకినాడలో శుభకార్యానికి హాజరై స్వగ్రామం మండపేట మండలం వెలగతోడుకు బయలుదేరాడు. సతీష్ కారు నడుపుతుండగా పక్క సీటులో భార్య కిరణ్మయి కూర్చున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చీకట్లో కారు అదుపు తప్పడంతో ముందు భాగం కాలువలో కూరుకుపోయింది. సతీష్, కిరణ్మయి అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లలో కూర్చున్న సతీష్ కొడుకులు మోక్షజ్ఞ, జితేష్.. అతని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మను స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి కాపాడారు. సతీష్ రాజమహేంద్రవరంలోని పేపర్‌మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మకు సతీష్ ఒకడే కొడుకు. అన్యోన్యంగా జీవిస్తున్న కొడుకూ కోడలు ఒకేసారి మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు మండపేట సీఐ పి.దొరరాజు తెలిపారు. -
అడ్డుకున్న పోలీసులు.. లైవ్ లో కౌంటర్ ఇచ్చిన అభినయ్ రెడ్డి
-
చావడానికైనా సిద్దం.. శ్రీధర్ ప్లాన్‌తోనే దాడి: హర్ష వీణ
సాక్షి, తిరుపతి: జనసేన నేతల దాడి ఘటన నేపథ్యంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తాజాగా స్పందించారు. పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందన్నారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ.. తన పోరాటం మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నారు.జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సహకారం లేదు. మాపై దాడి జరిగినప్పుడు అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారు. నేను ఎందుకు అని అడిగినందుకు నాపై దాడి చేశారు. తాతంశెట్టి నాగేంద్ర నాపై రెండు దెబ్బలు వేశారు. పది మంది వచ్చి చావు దెబ్బలు కొట్టారు. ప్లాన్ ప్రకారమే మాపై దాడి చేశారు. శ్రీధరే జనసేన వాళ్లను నాపైకి ఉసిగొల్పాడు.నేను చావడానికైనా సిద్ధమే. కానీ, పోరాటం ఆపను. అరవ శ్రీధర్ వ్యవహారం పవన్ కల్యాణ్‌కు తెలియకుండా ఉంటుందా?. పోలీసుల విచారణకు నేను సహకరిస్తున్నా. తాతంశెట్టి దాడి చేసేలా ప్రేరేపించింది శ్రీధరే. నన్ను నమ్మించి శ్రీధర్ నట్టేట ముంచాడు. జనసేన నేతలే నాపై దాడి చేసి చంపేందుకు చూశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ నాకు న్యాయం చేయాలి. అరవ శ్రీధర్‌కు శిక్ష పడాల్సిందే.. అందుకే నా పోరాటం’ అని చెప్పుకొచ్చారు.అసలేం జరిగిందంటే.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమెపైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా రక్తమొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు.అరవపై చర్యలు తీసుకోండిఅంతకు ముందు అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించినా అరవ పాల్గొంటున్నారని, ఇది పవన్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్గేట్ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. -
తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో
-
తిరుపతి : స్వర్ణరథంపై శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)
-
రీల్స్ పిచ్చి... 5వ అంతస్తు నుంచి పడిపోయిన నేపాలీ యువతి
-
తిరుపతిలో భూ దందాకు సూత్రధారి, పాత్రధారి లోకేష్: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రూ.1000 కోట్ల భూమిని కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ దందాకు సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ అని చెప్పుకొచ్చారు.టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘కారు చౌకగా అమ్మడమే కాకుండా 15 ఏళ్ల పాటు జీఎస్టీ రియింబర్స్ చేస్తారట. స్టాండ్ డ్యూటీ కూడా రియింబర్స్‌మెంట్ చేస్తారట. ఎటువంటి ప్రకటన లేకుండానే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల్లో నారా లోకేష్ భాగస్వామిగా ఉన్నారా?. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి అప్పనంగా కారు చౌకగా 22 ఎకరాలు 94 కోట్లుకు కూటమి ప్రభుత్వం అమ్మేస్తోంది. వందల కోట్లు దోపిడికి శ్రీకారం చుట్టారు.టూరిజం స్థలాలు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వాలి అంటే పీపీపీ విధానంలో ఇస్తున్నారు, దీనికి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ విధానంలో ఇవ్వడం దారుణం. దివ్య శ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ బెంగళూరు, సైబర్ సిటీ డెవలపర్ సంస్థ హైదరాబాద్ వ్యాపారాలు చేసే సంస్థలకు అమ్మేశారు. వ్యాపార ఒప్పందాలలో 15 ఏళ్ల పాటు ఏపీ జీ.ఎస్.టి ప్రోత్సాహం, స్టాంప్ డ్యూటీ ఫీజు రీయింబర్స్మెంట్ చేసే విధంగా చర్యలు. ఐదేళ్ల పాటు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు ఇవ్వడం దారుణంప్రభుత్వం ప్రకటన ఎక్కడా లేకుండా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు దోచి పెడుతోంది. లోకేష్ ఈ రెండు సంస్థల బినామీనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాలు దోచిపెట్టడం దారుణం. లాభదాయకం కానీ పక్షంలో ఎలాంటి చర్యలు ఉంటాయో జీవోలో స్పష్టం చేయలేదు. 300-400 కోట్లు డబ్బులు తీసుకుని 22 ఎకరాలు స్థలం మంత్రి లోకేష్‌కు ఇచ్చారని సమాచారం. ఎలాంటి అనుభవం లేని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇలాంటివి కేటాయించడం మతలబు ఏంటి?. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి. -
తిరుపతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ దందా..
-
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. సీసీటీవీ వీడియో
-
మహాదేవుని మహిమ… ఆకాశంలో వెలిగిన లింగరూపం!
తిరుపతి: నగరంలో వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పరమేశ్వరుని మహిమాన్విత రూపం దర్శనమిచ్చింది. దేదీపంగా ప్రకాశిస్తూ మహాలింగరూపం సాక్షాత్కరించింది. కట్టెదుట కనిపించిన దివ్యతేజస్సును వీక్షించి భక్తజనం పులకించింది. అపురూపంగోవిందనామస్మరణతో మార్మోగే తిరునగరిలో ఓ అపురూపం దర్శనమిచ్చింది. పవిత్ర తిరునామం స్పురించేలా ఓ సీతాకోకచిలుక భక్తులను ఆకట్టుకుంది. శ్రీవారి నుదుటిన వెలుగొందే మూడు నామాల తరహాలో కనిపించిన ఈ అద్భుతానికి ప్రజానీకం ప్రణమిల్లింది. ఉదయం ఉక్కపోత.. సాయంత్రం వడగళ్ల కుండపోతశ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత, మండుటెండ ఇబ్బంది పెట్టింది. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని చాలావేగంగా గాలులు వీచాయి. మండలంలోని జాడుపల్లి, బాణాపురం పంచాయతీల పరిధిలోని వడగళ్లతో కూడిన భారీ వాన కురిసింది. – మెళియాపుట్టి -
ఇప్పుడు రండి.. గేటు మీద చేయి వేసి చూడండి
-
తిరుపతి చంద్రగిరిలో దారుణం..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు కళ్ల ఎదుటే మహిళపై టీడీపీ కార్యకర్త దాడి చేస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రేక్షక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేస్తూ టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు రెచ్చిపోయాడు. భూ వివాదంలో విశ్వేశ్వరి అనే మహిళపై నాగరాజ నాయుడు దాడికి పాల్పడ్డాడు. సర్వే నెంబర్ 445/1A లోని 38 సెంట్ల స్థలం విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా బేఖాతరు చేస్తూ నాగరాజ నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే బాధితురాలిపై విచక్షణా రహితంగా నాగరాజు నాయుడు.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు.అనంతరం, బాధితురాలు మాట్లాడుతూ..‘టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, హేమ కుమార్, వంశీ ఒత్తిళ్లు వల్లే మాపై దాడి చేస్తున్నారు. మా భూమిని కబ్జా చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి నన్ను రాజీ చేసుకోమని బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు ఈ విషయమై 12 సార్లు ఫిర్యాదు చేశాను. అయినా నాకు న్యాయం జరగలేదు. నన్ను చంపేస్తారని భయంగా ఉంది. నాకు న్యాయం చేయండి’ అని వేడుకుంది. -
కామ నాయుడుని కాపాడుతున్న చంద్రబాబుపై ఫైర్
-
తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతల నిరసన..
వైఎస్సార్సీపీ నేతల నిరసనలు అప్డేట్స్..అనంతపురం..అనంతపురం అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసనటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసు పెట్టడంపై ఆగ్రహంచంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులునంద్యాల జిల్లా...నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నేతల నిరసనలు.కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన.టీటీడీ పవిత్రతను బీఆర్ నాయుడు, చంద్రబాబు అభాసు పాలు చేస్తున్నారని ఆగ్రహంబీఆర్ నాయుడుని పదవి నుండి తొలగించి డిమాండ్. ఏపీలో కూటమి ప్రభుత్వంలో తప్పుడు కేసులకు నిరసనగా తిరుపతిలో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.తిరుపతితో పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కొనసాగుతున్న తప్పుడు కేసులకు నిరసనగా పార్టీ నేతలు నిరసనలకు దిగారు. కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు, తప్పుడు కేసులు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు భూమన అభినయ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, నూకతోటి రాజేష్, సుధాకర్ రెడ్డి.. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ శ్రేణులు 13 మందిపై అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారు.. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేశారు. అట్రాసిటీ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలి అంటే బీఆర్ నాయుడు పదవికి రాజీనామా చేయాలి అని కామెంట్స్ చేశారు. -
రేపు తిరుమల జూన్ నెల దర్శన కోటా విడుదల
తిరుమల: తిరుమలలో జూన్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాల, గదుల కోటాను 18న టీటీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎల్రక్టానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్లే టికెట్లు మంజూరవుతాయి. 21న ఆర్జి సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా, 23న అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. -
తిరుపతిలో ఉద్రిక్తత.. బీఆర్ నాయుడు రాజీనామాకు డిమాండ్..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఉన్నారు. ఈ సందర్బంగా బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహంతో వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఉన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం నిరసనలకు దిగారు. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు గీత యాదవ్, సాయి కుమారి, పద్మజ, విజయ లక్ష్మీలను తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు.అంతకుముందు హోటల్ ఎదుట నిరసనల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేత జేబీ అనుచరులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్బంగా తిరుపతి వైఎస్సార్సీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్‌పై దాడి చేయడంతో అతను గాయపడినట్టు సమాచారం. -
YSRCP లీడర్లకు భూమన సన్మానం
-
ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఇంటికొచ్చి చెప్పుతీసి కొడతాం..
-
రాసలీలలతో అడ్డంగా దొరికిపోయి కన్పించకుండా పోయిన బిఆర్ నాయుడు
-
IWD ప్రతీ అడుగు కన్నీటి మడుగు
ఇంట్లో ఆడ, మగ తేడా చూపని తల్లిదండ్రులు.. ఉన్నత ఉద్యోగాల్లో కొలువుదీరుతున్న మహిళలు.. మహిళా దినోత్సవం రోజున మహోన్నత సత్కారాలు.. ఇది నాణేనికి ఓ వైపు కాగా.. నాణేనికి ఇంకో వైపు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిన ప్రతిక్షణం.. అడుగడుగునా ఆకతాయిల ఆగడాలు.. కామాంధుల కర్కశత్వం.. మోసం చేయాలనే కేటుగాళ్లు.. రోజుకో లైంగికదాడి.. సమాజంలో తప్పని లైంగిక వేధింపులు.. ఎన్ని కఠిన చట్టాలున్నా.. మహిళ నేటికీ సభ్యసమాజంలో వివక్షకు గురవుతూనే ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత క్షేమంగా ఇల్లు చేరతామన్న ధీమా లేకపోయింది.తిరుపతి సిటీ: ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నవసమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. తెల్లవారకముందే దినచర్య మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఇటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే అటు ఉద్యోగాల్లోనూ తమ సత్తా చాటుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి తరణంలోనూ సమాజంలో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సమాజం అనుమానపు చూపులతో చంపుతోంది. కొందరి మానవమృగాల నుంచి మహిళాలోకానికి నేటికీ ముప్పుతప్పడం లేదు. ఇంట్లో ఆడ, మగ అనే వివక్ష ప్రస్తుతం చాలా వరకు తగ్గినా, బయట సమాజంలో ఎటువంటి మార్పు కనబడలేదు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున నేటి సమాజంలో మహిళల రక్షణ, వివక్ష అనే అంశంపై సాక్షి మహిళా సంఘాల నేతలతో, విద్యార్థినులతో మాట్లాడగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఇంట్లో పరిస్థితి మెరుగుపడినా.. బయటే భయం ఆధునిక యుగంలో కుటుంబంలో ఆడ, మగ వివక్షణ చాలా వరకు తగ్గింది. ఇద్దరీ సమానంగా చూడాలనే అవగాహన తల్లిదండ్రులకు కలిగింది. కానీ బయట కాలు పెడితే చాలు మళ్లీ ఇంటికి చేరినంతవరకు క్షణక్షణం భయంగానే బతకాల్సి వస్తోంది. పోలీసులు ఎంత అభయమిస్తున్నా, కఠిన చట్టాలున్నా సమాజంలో పరిస్థితి మారలేదు. మా తల్లిదండ్రులు నేను కళాశాలకు బయలు దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కనీసం ఐదు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతారు. మహిళలకు బయట రక్షణ ప్రశ్నార్థకంగానే ఉంది. – సరళ, ఎంబీఏ విద్యార్థిని, తిరుపతి గౌరవించకపోయినా.. హాని కలిగించకుంటే చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా అత్యాచారాలు, మానుభంగాలు, వేధింపులు తగ్గకపోవడం దారుణం. మ రిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మహిళలను గౌరవించకపోయినా పర్వా లేదు. కనీసం వారికి హాని కలిగించకుంటే చాలు. పదేళ్ల చిన్నారులను సైతం బయటకు ఒంటరిగా పంపాలంటే తల్లిదండ్రులకు వణుకుపట్టే పరిస్థితి ఉంది. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన చట్టాలను తీసుకురావాలి. – పుష్పావతి, ప్రైవేటు కళాశాల ఉపాధ్యాయురాలు, తిరుపతి రూరల్పరిస్థితుల్లో మార్పు రాలేదు మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకువస్తున్నాం..అవగాహన కార్యక్రమాలు నిర్వస్తున్నామంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడలేదు. ఇంటి నుంచి కాలు బయటపెడితే ప్రతి క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఏమిజరుగతుందో తెలియని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. కళాశాలలోనూ, విధులు నిర్వహించే ప్రాంతాలలోనూ వేధింపులకు గురవుతున్న మహిళలు బయటకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. మహిళా దినోత్సవం అంటూ హంగామా చేయడం కాదు..మహిళ రక్షణ కల్పించాలి. – డాక్టర్ సాయిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి, తిరుపతిఒంటరిగా వెళ్లాలంటే భయం పాఠశాలకు, కళాశాలలకు విద్యార్థినులు ఒంటరిగా నేటి వెళ్లలేకపోతున్నారు. తల్లిదండ్రులు వెన్నంటి ఉంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. విద్యాసంస్థల వద్ద, బస్టాండుల వద్ద భద్రత లేదు. ఓ మహిళా ఒంటరిగా నడిచి వెళుతుంటే సమాజం వింతగా అదోలా కన్నెత్తి చూస్తుంది. దారిన వెళ్లే పోకిరీలు అసభ్యమాటలతో వేధింపులకు గురికాక తప్పడం లేదు. తల్లిదండ్రుల అండ లేని విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బయట కాలుపెట్టాలంటే వణికిపోతున్నారు. కుటుంబంలో వివక్షణను తప్పించు కున్నా బయట ప్రపంచం వివక్షతో పాటు వేధింపులకు ఎంతో మంది మహిళలు గురవుతూనే ఉన్నారు. – ఆర్ ఆషా, పీడీఎస్ఓ,జిల్లా కార్యదర్శి, తిరుపతి (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్ గైడ్)ఆ రోజు ఆర్భాటాలు.. తర్వాత షరా మామూలే.. ప్రస్తుతం సమాజం ఎలా తయారైందంటే మహిళా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు పెట్టి మహిళలను పొగుడుతూ సన్మానాలు చేయడం..మరుసటి రోజు నుంచి షరా మామూలుగా వివక్ష చూపడం ఇది నేటి సమాజం మహిళలకు ఇచ్చే గౌరవం. కుటుంబంలోని…కుటుంబంలోని మహిళలపై వివక్ష కాస్త తగ్గినప్పటికీ బయట కళాశాలల్లోనూ, బస్టాప్‌ల్లోనూ, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనూ నేటికీ వందకు 80శాతం మంది మహిళలు వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ సంస్కృతిలో మార్పు రావాలంటే కుటుంబంలోని ప్రతి పురుషుడు పర స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి.– పవిత్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు, తిరుపతి వివక్షకు గురవుతున్నారు ఉన్నత లక్ష్యంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివిన మహిళలు నేడు వివక్షకు గురవుతుండడం దారుణం. విధులు నిర్వహిస్తున్న ఎంతో మంది ఉద్యోగినులు వివక్షతో పాటు వేధింపులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను యావత్ సమాజం గమనిస్తూనే ఉంది. కానీ వాటి అరికట్టేందుకు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా కారి్మకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. – లక్ష్మమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్, తిరుపతి -
‘దేవుడికి దాతలు భూములిస్తారు.. మీరు దేవుడికి భూములు అమ్ముతారు’
తిరుపతి: తిరుమల శ్రీవారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీటీడీ చరిత్రలో ఆలయాలకు భూమి కొన్నది లేదని, కానీ అమరావతి వెంకటాయపాలెంలో టీటీడీ ఆలయానికి భూమి కొన్నారని మండిపడ్డారు. వెంకటాయపాలెంలో దేవాలయ నిర్మాణానికి స్థలాన్ని దాతలు కానీ, సంస్థలు కానీ ఇస్తాయని, మరి దాన్ని పక్కనపెట్టి భూమి కొనడం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వతేదీ) తిరుపతి నుంచి మాట్లాడిన భూమన.. ‘ దేవుడికి దాతలు భూములిస్తారు.. మీరు దేవుడికి భూములు అమ్ముతారు.ఉచితంగా టీటీడీ భూమి కోరితే సవాలక్ష నిబంధనలు పెట్టారు. వివిధ సంస్థలకు మాత్రం ఉచితంగా భూములు కేటాయించారు. టీటీడీ రూ. 12 కోట్ల సొమ్మును సీఆర్డీఏ వెనక్కి ఇవ్వాలి. మహిళల జోలికొచ్చిన టీటీడీ చైర్మన్‌ను చూస్తే అసహ్యించుకుంటున్నారు’ అని విమర్శించారు.ఎవరూ ఈ సాహసం చేయలేదు..నవీ ముంబైలో అప్పటి సీఎం ఏక్ నాథ్ షిండే వెంకటేశ్వర స్వామి ఆలయంకు ఉచితంగా స్థలం కేటాయించారు. జమ్మూకశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూలో ఉచితంగా శ్రీవారి ఆలయం నిర్మాణంకు ఉచితంగా స్థలం కేటాయించారు. పల్లవ మహారాణి సమవాయి, చోళ రాణి పరాంతక మణి, యాదవ రాజులు, విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కౌనకాలు, ఆస్తులు ఇచ్చారు. టీటీడీ చరిత్రలో ఏ ఒక్క చోట దేవాలయాలకు స్థలం కొన్నది లేదు. సీఎం చంద్రబాబు అమరావతి వెంకటాయ పాలెంలో 25 ఎకరాలు వెంకటేశ్వర స్వామి ఆలయంకు స్థలం కొనుగోలు చేశారు. ఎకరా 50 లక్షలకు అమ్మారు. రూ. 12 .50 కోట్లు ధర చెల్లించారు. ప్రపంచంలో ఏ ఒక్కరు ఇలాంటి సాహసం చేయలేదు. ఆర్థికంగా వివిధ సంస్థలకు ఏపీ ప్రభుత్వం భూములు కేటాయింపు ఉచితంగా చేసింది. ఏపీ హ్యూమన్ రిసోర్స్ సంస్థకు ఉచితంగా స్థలాలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూటల్ డిజైన్ ఉచితంగా భూమి కేటాయింపు చేసింది. మరి అమరావతిలో టీటీడీ ఆలయం నిర్మాణంకు రూ. 12.50 కోట్లతో కొనుగోలు చేశారు. వ్యాపార రాజధాని కు వెంకటేశ్వర స్వామి వాణిజ్య అవసరాలకు వాడుకున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. తమిళనాడు చెన్నై జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థ స్థలంలో వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేస్తున్నారు. చెన్నై ఆలయం విస్తరణకు టీటీడీ దాతలు సహాయంతో చేశారు. నటి కాంచన ఇచ్చిన స్థలంలో అమ్మవారు ఆలయం నిర్మాణం చేశారు. బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..గత ఏడాది కాలంగా మీరు చేస్తున్న అరాచకాలతో, హిందువులను అపహాస్యం చేస్తున్నారు.. భగవద్గీత పై రూ. 50 కోట్లు ఖర్చు అని బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కోటి పుస్తకాలకు 52 లక్షలు పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, భగవద్గీతకు ఇప్పటివరకు మూడున్నర కోట్లు ఖర్చు చేశారు. పుస్తకానికి .3 రూపాయలు 71 పైసలు ఖర్చు అయ్యింది. బీఆర్ నాయుడు బుకాయిస్తే సరిపోదు..పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు బంధువుల కబ్జా.. నాశనం అయిపోతారు సార్.. ఏడ్చేసిన బాధితుడు
-
ఇస్రో ప్రయోగాలకు 3 నెలల పాటు బ్రేక్!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో..ఒకే రకమైన సాంకేతిక లోపంతో రెండు ప్రయోగాలు విఫలం కావడంతో 3 నెలల పాటు ప్రయోగాలకు ఇస్రో బ్రేక్ వేసింది. గతేడాది మే నెలలో పీఎస్ఎల్వీ సీ61, ఈ ఏడాది జనవరిలో పీఎస్ఎల్వీ సీ62 రాకెట్లు విఫలమైన తరువాత మళ్లీ ప్రయోగాల జోలికి పోలేదు. ఈ రెండు రాకెట్లు ఒకే తరహా సాంకేతికపరమైన లోపంతో విఫలమయ్యాయి. పీఎస్ఎల్వీ సీ61 ప్రయోగం విఫలమైనప్పుడు శాస్త్రవేత్తలు ఏమరుపాటుగానే ఉండిపోయారు. అదే తరహాలోనే మరో ప్రయోగం కూడా విఫలం కావడంతో కేంద్రం తీవ్రంగా పరిగణించి విచారణ కమిటీని నియమించింది.ఈ కమిటీ ఇటీవల శ్రీహరికోటలో విచారణ జరిపింది. రెండు రాకెట్లకు మూడో దశలోనే సాంకేతిక లోపం తలెత్తింది. మూడో దశ అంటే ఘన ఇంధన దశ. ఘన ఇంధన మోటార్లు షార్ కేంద్రంలోనే తయారు చేస్తారు. అందుకే ఈ కమిటీ సాలిడ్ మోటార్ దశలోనే ఎందుకు ఇబ్బంది వచి్చందనే దానిపై తనిఖీలు చేపట్టి దానికి సంబం«ధించిన ఇంజినీర్లను విచారించింది. ఇలా అన్ని సెంటర్లకు కమిటీ వెళ్లి విచారిస్తుంది. దీంతో 3 నెలల పాటు ప్రయోగాలు ఉండకపోవచ్చునని షార్ వర్గాల సమాచారం. దీంతో ఈ ఏడాది అనుకున్న గగన్‌యాన్ ప్రాజెక్టు ప్రయోగాలు కూడా ఆలస్యమయ్యే అవకాశముంది. చంద్రయాన్–4 ప్రయోగం కూడా కొంత ఆలస్యం కావచ్చనే చర్చ ఇస్రో వర్గాల్లో నడుస్తోంది. -
నగల కోసం వృద్ధురాలి హత్య
తిరుపతి క్రైం: తిరుపతిలో ఆదివారం రాత్రి నగల కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నగరంలోని అరవపల్లె వీధిలో నివాసం ఉంటున్న కె.లక్ష్మమ్మ (67) టీటీడీలో పనిచేసి రిటైరయ్యారు. సోమవారం ఉదయం ఆమె మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం రాత్రి లక్ష్మమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఆమె గొంతు నులిమి, అనంతరం దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.అనంతరం ఆమె వద్ద ఉన్న 100 గ్రాములకుపైగా బంగారు నగలను దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. వెస్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. మృతురాలి చిన్న కుమారుడు వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో మృతురాలి సొంత మనవడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరుపతి ఐఐటీలో ఉత్సాహంగా తిరుత్సవ్–2026 (ఫొటోలు)
-
నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు..
నన్నెందుకు చంపావమ్మా? నాన్నను కాదనుకున్నావు.. అందర్నీ దూరంగా ఉంచావు.. ఒంటరిగానే నన్ను పెంచావు.. నీ సుఖం చూసుకుని ఊహాలోకంలో విహరించావు.. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించావు.. మాయాలోకంలో పడి నన్ను వదిలించుకోవాలనుకున్నావు.. నీ కడుపుచించుకుపుట్టిన నన్ను కర్కశంగా గొంతు నులిమి చంపేశావు.. నీకు తోడుగా నిలిచిన వాడితో కలిసి స్వర్ణమ్మలో కలిపేశావు.. నేనేం తప్పు చేశానమ్మా.. నాకెందుకీ శిక్ష వేశావమ్మా..?.. అన్నట్టు ఉంది కదూ ఈ చిత్రం.ఓ కసాయి తల్లి ప్రియుడి మోజులో పడి రెండున్నరేళ్ల పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. తిరుపతి: ‘11 నెలల చిన్నారి ‘పునర్విక’ ప్రాణం నిలబెట్టేందుకు అవసరమైన రూ.16 కోట్లు సమకూర్చేందుకు ఏ సంబంధం లేని లక్షల మంది ఒక్కటయ్యారు. తమవంతు సాయమందించి సమాజంలో మానవత్వం సజీవంగా ఉందని నిరూపించారు. ఈ కసాయి తల్లి కామాంధకారంతో కళ్లు మూసుకుపోయి కడుపుచించుకుని పుట్టిన అపురూప పాపాయిని అత్యంత పాశవికంగా చిదిమేసింది. ఆపై స్వర్ణమ్మ ఒడిలో పాతిపెట్టేసి చేతులు దులుపుకుంది. పోలీసులు తమదైన విచారణలో అసలు విషయం బయటపడింది. ఏ‘పాప’ం చేసిందని? తిరుపతికి చెందిన ఆశాలత భర్త రాజేష్‌తో విడిపోయి తిరుపతి పోస్టల్ కాలనీలో రెండున్నరేళ్ల కుమార్తె దుర్గతో కలిసి ఉంటోంది. ఈమెకు ఏర్పేడు మండలం, చెన్నంపల్లి దళితవాడకు చెందిన రెడ్డికుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రెడ్డికుమార్‌ను పెళ్లి చేసుకోవాలని, ఇందుకోసం అడ్డుగా ఉన్న తన కుమార్తె దుర్గను అంతమొందించాలని భావించింది. ఈ నెల 19వ తేదీన దుర్గను అతికిరాతకంగా చంపేసింది. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రియుడు రెడ్డికుమార్ సహాయంతో చిన్నారి మృతదేహాన్ని బైక్‌పై తీసుకుని ప్రియుడి గ్రామానికి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో గొయ్యిని తవ్వి పాతిపెట్టింది. చిన్నారి కనిపించకపోవడంతో అవ్వ ప్రశ్నించింది. తల్లి సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన గురించి తెలిసిన ప్రతి హృదయం ద్రవించింది. ఏ పాపం చేసిందని పాప ప్రాణం తీశావంటూ ప్రతి గొంతు ఘోషించింది.గుండెలవిసేలా రోదించిన అవ్వ ఆశాలత తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆశాలత, రెడ్డికుమార్‌తోపాటు వారికి సహకరించిన మరికొందరిని పోలీ సులు తమదైన శైలిలో విచారించారు. దీంతో కళ్లు బైర్లు కమ్మేలాంటి చిన్నారి హత్యోదంతాన్ని వారు బయటపెట్టారు. బుధవారం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పోలీసులు, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి పాపానాయుడుపేట సమీపంలో పాపను పూడ్చిపెట్టిన స్వర్ణముఖి నదిలోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాప మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని చూసి వారి వెంట వచ్చిన చిన్నారి దుర్గ అమ్మమ్మ నాగరత్నమ్మ బోరున విలపించింది. నువ్వేం పాపం చేశావమ్మా.. అంటూ గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కదిలించింది. -
ప్రియుడి కోసం.. కన్న కూతురినే చంపేసిన తల్లి
-
ప్రియుడి మోజులో పడి.. 9 నెలల బిడ్డను హత్యచేసి పూడ్చి పెట్టింది
తిరుపతి: తిరుపతిలోని పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత (19) అనే యువతి తన 9 నెలల బిడ్డను హత్యచేసి, దేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆశాలతకి గతంలో వివాహం అవ్వగా భర్తతో గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త నుండి విడిపోయి కొంతకాలం తన తల్లి వద్దే ఉంది. అయితే ఈ క్రమంలో ఆమెకు ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.ఆ ఇద్దరూ సహజీవనంలో ఉంటూ పెళ్లి చేసుకోవాలని సైతం నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లికి చిన్నారి అడ్డుగా ఉందని కన్నతల్లే హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చి పెట్టింది. కాగా తన బిడ్డ, మనవరాలు ఈ నెల 19వ తేదీ నుండి కనిపించడంలేదు అంటూ ఆశాలత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. ఆశాలత తన బిడ్డను హత్య చేసినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీమకు తలమానికం తిరునగరి
చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్తును నిర్ణయించు కోవడం. గతం లేనిదే వర్తమానం ఉండదు, వర్తమానం లేని భవిష్యత్తును ఊహించుకోలేము. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి నగరానికి ఘనమైన నేపథ్యం ఉన్నది. అలాంటి తిరుపతికి అంకురార్పణ జరిగి నేటికి 896 సంవత్సరాలు. తిరుపతి నగరానికి అనుకుని ఉన్న ప్రస్తుత తిరుచానూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, పార్థసారథి ఆలయం చోళుల కాలంలో రూపొందితే, అటుపిమ్మట పద్మావతి అమ్మవారి ఆలయం వెలసింది. శ్రీ శుకమహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకుని తపస్సు చేసిన కారణంగా తిరుశుకనూరుగా పిలిచే వారనీ, అటుపిమ్మట కాలక్రమంలో తిరుచానూరుగా మారిందనీ అంటారు. నారాయణవనం కేంద్రంగా పాలన సాగించిన ఆకాశ రాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం 6 నెలల దీక్షా కాలాన్ని శ్రీనివాస మంగాపురంలో గడిపారు. దీక్షా కాలం తర్వాత శ్రీనివాసుడు తిరుమల వెళ్ళారు. ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి కాలంలో శ్రీనివాస మంగాపురం ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక అనుబంధమే పునాదిచారిత్రక ఆధారాల ప్రకారం, 1130 ఫిబ్రవరి 24న రామా నుజాచార్యుల నిర్ణయం మేరకు గోవింద రాజపురం ఆగ్రహారం నిర్మాణానికి పునాది వేశారు. అంటే నేటి తిరుపతి... గోవింద రాజపురంగా పునాది వేసుకుంది. అటు పిమ్మట గోవిందరాజ ఆలయం, దాని చుట్టూ అగ్రహారం నిర్మాణం నారాయణవనం రాజ్య పాలకుడు గట్టురాజు చేపట్టారు. తర్వాత 100 సంవత్సరాలకు ఇది తిరుపతిగా రూపాంతరం చెందింది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురం, శ్రీనివాస మంగాపురంతో సహా అనేక ఆలయాలకు గోపురాలు, అభివృద్ధి పనులు యాదవ రాజుల కాలంలో జరిగాయి. అందుకే టీటీడీ ఆలయాలలో యాదవులకు తొలి దర్శన అవకాశం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.తిరుపతి రూపుదిద్దుకుంటున్న ప్రారంభంలో తాళ్ళపాక వాసుల కృషి మరువలేనిది. శ్రీవారి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో అన్నమయ్య కీర్తనలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే తాళ్ళపాకకు చెందిన తాతయ్య తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలిసిన గంగమ్మ ఆలయానికి ఆద్యులు. అందుకే ఈ ఆలయాన్ని తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయం అని అంటారు. తాళ్ళపాక వాసులు శ్రీనివాస మంగాపురం ఆలయ అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నట్లు చెపుతారు. తాతాచార్య వంశస్థులు తాతయ్య గుంట గంగమ్మ ఆల యానికి ఆద్యులు. వీరికి తొలి తీర్థం ఇస్తారు. తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు ఏడుసార్లు తిరుపతి పర్యటన చేశారు. తిరుపతి, తిరుమల, తాను పర్యటించిన నాగలాపురం, నారాయణవనంలో ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం ఆలయాన్ని నిర్మించారు.మహానగరంగా మార్చే అవకాశంతిరుపతి, తిరుమల అంటూ ప్రస్తుతం పిలుచుకుంటున్నాం. కానీ చరిత్రను పరిశీలిస్తే రెండూ వేరు వేరు కాదని అర్థం చేసు కోవచ్చు. తిరుపతి నగరం స్వతంత్రం వచ్చే వరకు నార్త్ ఆర్కాట్ జిల్లా పరిధిలో ఉన్నది. నేటి కొండను పురాణాలలో వెంగడం అని పిలిచేవారు. పులికాట్ పరిసరాలను పాలించిన ప్రాంతానికి వెంగో రాష్ట్రం అన్న పేరు కూడా ఉంది. తిరుపతి, తిరుమలపై తమిళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తిరుపతి గానే పిలిచేవారు. తిరు అంటే శ్రీ అని అర్థం. పతి అంటే శ్రీనివాసుడు యజమాని అని. ఆ రకంగా శ్రీనివాసుడి అజమాయిషీలో తిరుపతి ఉంటుంది. ఎంత బాగుంది ఈ పిలుపు! చాలా కాలం వరకు తమిళంలో మేల్ తిరుపతి, కీల్ తిరుపతి (కింద తిరుపతి, పైన తిరుపతి) అని పిలిచే వారు. క్రమేణా కొండ అర్థం వచ్చేలా తిరుమలగా మారింది. తిరుపతిని అభివృద్ధి చేయడం అంటే శ్రీనివాసుడి అజమాయిషీలో ఉన్న ఆధ్యాత్మిక నగరాన్ని అభివృద్ధి చేయడమే. చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం తెలియనివారు తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వెచ్చిస్తే అనవసర వివాదం చేస్తుంటారు. ఏపీ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన పరిశీలనలో రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు, ఉన్నవన్నీ గ్రామీణ పరిధి దాటని పట్టణాలు అని పేర్కొంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతోంది అనడానికి మంచి నగరాలుండటం ఒక కొలమానం. వెనుకబడిన రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం కూడా లేకపోతే ఇక అభివృద్ధికి ఆస్కారం ఎక్కడిది? ఈ వెలితిని తీర్చి మహానగరంగా మార్చగలిగే అవకాశం తిరుపతికి ఉన్నది. తిరుపతి నగరానికి అనుకుని చెన్నై, బెంగళూరు మహా నగరాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, భూమి సమస్య ఆ రెండు నగరాలకు ప్రతిబంధకంగా మారింది. ఆ ప్రతిబంధకమే తిరుపతి నగర అభివృద్ధికి అవకాశంగా మారుతుంది. తిరుపతి చుట్టూ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పాటు... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు ఉన్నాయి. చెన్నై నగరానికి సమీపంలో మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీసిటీ ప్రత్యేక అర్థిక మండలి ఆసియా ఖండంలోనే అత్యంత విజయవంతం అయిన సెజ్‌గా మారింది. వాతావరణ సమతుల్యత అదనపు అనుకూలత. అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తిరుపతిని అత్యంత సౌకర్యవంతమైన నివాస యోగ్య నగరంగా గుర్తించాయి. తిరుపతి నగర పాలక సంస్థ తీర్మానం చేసినట్లు... చంద్రగిరి, కళ్యాణి డ్యామ్, వడమాల పేట, రాయలచెరువు, ఐఐటీ వరకు తిరుపతిని గ్రేటర్‌గా మార్చి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే అనతి కాలంలోనే మరో హైదరాబాద్‌గా మారుతుంది.తొలి దర్శనం నుంచి ప్రథమ పౌరురాలి వరకు...వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను ప్రస్తావించడానికి ఇది సరైన సమయం. విజయనగర రాజుల తర్వాత యాదవ రాయలు తిరుపతి ఆలయాల అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించారు. శ్రీవారి ఆలయం ముందు భాగాన గొల్లమండపం నిర్మించి, గోవుల పెంప కంతో శ్రీవారి నైవేద్యానికి ఆ పాలను వినియోగించే వారని అంటారు. వివిధ కొలనులను వారి హయాంలోనే నిర్మించినట్లు ఆధారాలు కనిపిస్తాయి. దైవ దర్శనంలో కోనేటి స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. అందుకే శ్రీవారి ఆలయాలలో తొలి దర్శనం యాదవ వంశస్థులకు ఇస్తారు. అయితే ఈ సంప్ర దాయానికి సాధికారత ఇచ్చింది మాత్రం జగన్ గారే. అదే సామాజిక వర్గానికి చెందిన శిరీష యాదవ్‌ను తిరుపతి నగరానికి తొలి మేయర్‌గా చేసిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుంది. అది కూడా జనరల్ మేయర్ స్థానంలో బీసీలకు ఇవ్వాలనే నిర్ణయమూ, తిరు పతి అంకురార్పణలో కీలక భూమిక పోషించిన యాదవ సామాజిక వర్గానికి రాజకీయ గుర్తింపు ఇవ్వడమూ సముచిత నిర్ణయం. ఎంతో స్ఫూర్తినిచ్చే తిరుపతి నగర ఆవిర్భావ చారిత్రక సత్యాన్ని తన అధ్యయనం ద్వారా అందించిన చరిత్రకారుడు దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించి ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించిన నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అభినందనీయులు. మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
తిరుమలలో భక్తురాలిని కరిచిన పాము
-
తిరుమలలో కలకలం.. దర్శనం క్యూలైన్లో మహిళను కాటేసిన పాము
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తిరుమల క్యూలైన్ వద్ద పాము కలకలం రేగింది. ఈ క్రమంలో క్యూలైన్లో ఉన్న ఓ భక్తురాలిని పాము కాటు వేసింది. దీంతో, ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. తిరుమలలో రూ.300 టికెట్ క్యూలైన్లో నిలుచున్న ఓ భక్తురాలిని పాము కాటు వేసింది. దీంతో, ఆమెను స్థానిక స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం సదరు మహిళా భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. బాధితురాలిని తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన మౌనిక(27)గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
లొంగిపోయిన దేవ్‌జీ!
కోరుట్ల/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ అగ్రనేత, నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఎట్టకేలకు అజ్ఞాతం వీడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐబీ పోలీసుల ఎదుట లొంగిపోయారని విశ్వసనీయ సమాచారం. ఆయనతోపాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ సహా 16 మంది సహచరులు లొంగిపోయినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర హోంమంత్రి విజయ్‌శర్మ ఆదివారం రాయ్‌పూర్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు. దేవ్‌జీ, సంగ్రామ్ లొంగిపోయినట్లు తమకు సమాచారం ఉందన్నారు. అయితే ఈ వార్తలను తెలంగాణ పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. కాగా, దేవ్‌జీ లొంగుబాటు వార్తల నేపథ్యంలో కేంద్రం సాగిస్తున్న ఆపరేషన్ కగార్–2 లక్ష్యం ఇక నెరవేరినట్లేనన్న చర్చ నడుస్తోంది. తిప్పిరి తిరుపతి స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల కాగా, రాజిరెడ్డి పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవారు. మా ప్రభుత్వానికి భారీ విజయం ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా రణనీతి, ఛత్తీస్‌గఢ్ సీఎం అవలంబించిన విధానాల కారణంగా మావోయిస్టు పార్టీ మనుగడ అంతిమ దశకు చేరుకుంది. దేవ్‌జీ, సంగ్రామ్‌లు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, అబూజ్మడ్ అడవుల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరు అగ్రనేతల లొంగుబాటు మా ప్రభుత్వానికి భారీ విజయం. కానీ వారిద్దరి కంటే మరో సీనియర్ నేత (ముప్పాళ్ల లక్మణరావు) ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఆయన వయోభారంతో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారనే అంశంపై మాకు స్పష్టత లేదు. అగ్ర నాయకత్వంలో మరో నేత (మిసిర్ బెహ్రా) జార్ఖండ్‌లో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న ఇంకొందరు సాయుధ మావోయిస్టుల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే కర్రెగుట్టల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్‌తో మాకు సత్ఫఫలితాలు వస్తున్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన 89 ఐఈడీలను నిరీ్వర్యం చేశాం. మారిన పరిస్థితులను గుర్తించి మిగిలిన వారు కూడా లొంగిపోతే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం’అని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ చెప్పారు. మా కల నిజమైంది: తిరుపతి సోదరుడి కుమార్తె సుమ తిరుపతి లొంగుబాటు వార్త తెలియగానే ఆయన సోదరుడు గంగాధర్, ఆయన కుమార్తె సుమ, ఇతర బంధువులు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ‘పెద్దనాన్న లొంగిపోవాలని ఎన్నో లేఖలు రాశాను. మా ఆవేదనను పెద్దనాన్న అర్థం చేసుకున్నారు. ఏళ్ల తరబడి అడవుల్లో ఉండి అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేసిన ఆయన.. మా కోసం ఉద్యమాన్ని వీడి లొంగిపోయి వస్తున్నారన్న విషయం తెలియడంతో మా కల నిజమైందని సంబరపడుతున్నాం’అని సుమ చెప్పారు. అలాగే తిరుపతితో కలిసి కోరుట్ల జూనియర్ కళాశాలలో చదువుకున్న బక్కయ్య సైతం హర్షం వ్యక్తం చేశారు. -
చంద్రబాబూ.. ప్రజలు గమనిస్తున్నారు: అంబటి రాంబాబు
సాక్షి, తిరుపతి: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేశారు. 5 గంటలు నుంచి 12 గంటలు వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు’’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయి. పోలీసులను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో చంద్రబాబు ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నా.. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు సరికాదు. బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీ నాయకులు స్పందించారు. పార్టీలకు అతీతంగా నా అరెస్ట్‌పై స్పందించారు. జనసేన పార్టీ అధినేత స్పందించలేదు.లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఛార్జిషీట్ ఫైల్ చేశాక మీకు తొందర ఎందుకు? వాస్తవాలు చెప్పారు కదా.. భగవంతుడ్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు’’ అని అంబటి పేర్కొన్నారు. -
రేణిగుంట నారాయణ కాలేజీలో దాష్టీకం విద్యార్థిని చితకబాదిన లెక్చరర్
-
స్వామి వారికి పట్టువస్త్రాలతో కాలినడకన శ్రీనివాసమంగాపురంకు చెవిరెడ్డి
-
పాప అని ఒక్కసారి పిలువు అన్న ప్లీజ్.. గుండెల్ని పిండేస్తున్న పద్మ లెటర్
-
నిజం చెప్పిన తిరుపతి ఎమ్మెల్యే
-
‘ప్రభుత్వం కమ్మగానే ఉంది.. పాలన కూడా ఇంకా కమ్మగానే ఉంది’
తిరుపతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆదినారాయణరెడ్డి కూటమి ప్రభుత్వంలోని పదవుల కేటాయింపులపై వ్యంగ్యంగా స్పందించారు. ‘ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది. పాలన కమ్మగా ఉంది అంటే అందరికీ అర్థమై ఉంటుంది. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి పాలన కమ్మగానే ఉందని చెప్పారు. అదే విషయాన్ని మళ్లీ నేను చెబుతున్నా. ఎన్టీఆర్ పాలనపై గజ్జల మల్లారెడ్డి చెప్పిందే నేను చెబుతున్నా. కూటమి పాలన ఇంకా కమ్మగానే ఉంది. ఒక కులం కాకుండా.. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కమ్మతో పాటు అందరం ఉన్నాం. కులాలకు సంబంధంలేకుండా అందరినీ సమానంగా చూడాలి. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేదు. కూటమిలో బీజేపీనే ప్రధానం..ఆ తర్వాతే టీడీపీ, జనసేన’ అంటూ వ్యాఖ్యానించారు. -
కన్న బిడ్డలను చంపుకున్న ఇద్దరమ్మల కన్నీటి కథ..
-
ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య
-
కూటమి కోరల్లో కాలకూటం!
‘‘ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ’’. చిత్తం శివుడి మీద – భక్తి చెప్పుల మీద నిలుపుకొనే దొంగ భక్తుల ముసుగుల్ని మహాకవి వేమన ఏనాడో తొలగించాడు. ఇప్పుడు సమస్య కొందరు వ్యక్తులు, కొందరు భక్తులు వేసుకునే ముసుగుల గురించి కాదు. ఏకంగా ప్రభుత్వ వ్యవస్థే వేసుకున్న ప్రమాదకరమైన ముసుగు గురించి! ముసుగులు వేసుకున్న ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం కంటే దారుణమైన చెత్తబుద్ధి తాపంతో బుసకొడుతున్నది. రాజకీయంగా స్థిరపడటానికి మతాన్ని అస్త్రంగా మలుచుకోవాలనే నిశ్చయానికి కూటమి వచ్చేసిందని మొన్నటి కూటమి ప్రెస్‌మీట్, అందులో ముఖ్య నేత మాటలు రుజువు చేస్తున్నాయి. ఎన్నికల హామీలు వెక్కిరిస్తున్నాయి. పాలనా వైఫల్యం వెన్నాడుతున్నది. అప్పుల పర్వతం పెరిగిపోతున్నది. అభివృద్ధి పేరుతో జపిస్తున్న తూతూమంత్రానికి తుప్పిళ్లు తప్ప చింత కాయలు రాలడం లేదు. అదానీ – గూగుల్ డేటా సెంటర్‌కు మనం ఇరవై వేల కోట్లు రాయితీలిస్తే గూగుల్ వాళ్లు బెంగ ళూరులో 20 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఒకటి రెండు పెద్ద కంపెనీల పేర్లు చెప్పి అదే వరసలో ఊరూ పేరూ లేని ‘ఉర్సా’లకు భూసంతర్పణ చేస్తున్నాం. దానివల్ల సాధించబోయే అభివృద్ధి దృశ్యం త్వరలోనే ముందుకు రాబోతున్నది. అమరావతి పేరుతో తలపెట్టిన లక్షల కోట్ల జూదం ఒక ‘మాన్యుమెంటల్ ఫెయిల్యూర్’గా అల్లంత దూరంలో భయపెడుతున్నది. ఈ పరిస్థితుల్లో కూటమి సర్కార్‌కు కిం కర్తవ్యం? ‘‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె.... రావే ఈశ్వరా కావవే వరద’’. ఇక దేవుడే దిక్కని కూటమి నిర్ణయానికి రావడంలో ఆశ్చర్యమేమున్నది!‘పరిత్రాణాయ సా«ధూనాం... సంభవామి యుగేయుగే’ అన్నాడు కృష్ణపరమాత్ముడు. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మా ర్గులను శిక్షించడానికీ తాను వస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని సన్మార్గులూ విశ్వసిస్తారు. దుర్మార్గులూ నమ్ముతారు. కూటమి సర్కార్‌కు ఇక్కడ దేవుడు దిగిరావలసిన అవసరం లేదు. దేవదేవుని పేరు, ఆ పేరు చుట్టూ ఉండే మతవిశ్వాసాలను కబ్జా చేసుకుంటే చాలు! కూటమి సర్కార్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నది. తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా చంద్రబాబు వ్యాఖ్యానాలు చేశారు. పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేశారని మొదట ఆరోపించారు. ఆయన ఆరోపణపై అప్పట్లోనే సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ఒకవైపు ‘సిట్’ను ఏర్పాటు చేసి, దాని దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. కోట్లాదిమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఇలా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మంచిది కాదని మందలించింది.ముఖ్యమంత్రి రాజకీయ ఉద్దేశాలను గ్రహించిన సర్వోన్నత న్యాయస్థానం నిష్పాక్షిక దర్యాప్తునకు స్వతంత్ర బృందమే మేలని భావించింది. సీబీఐ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతి నిధులు కూడా ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియ మించింది. ఈ బృందం దర్యాప్తు చేసి ఈమధ్యనే అభియోగ పత్రాన్ని (ఛార్జిషీట్) న్యాయస్థానం ముందుంచింది. చంద్ర బాబు, ఇతర కూటమి పెద్దలు, యెల్లో మీడియా కలిసి భువన భువనాంతరాల్లో చాటింపు వేయించినట్టుగా జంతు కొవ్వు కలవలేదని తమ దర్యాప్తులో తేలినట్టు ‘సిట్’ స్పష్టం చేసింది. అయినా సరే, జంతు కొవ్వు కలిసినట్టు తేలిందనే ప్రచారాన్ని కూటమి ఆపలేదు. పైగా ఊరూరా, వాడవాడనా ఫ్లెక్సీలు కూడా వేసింది. ఇది నూటికి నూరుపాళ్లు కోర్టు ధిక్కరణ! వేంకటేశ్వర స్వామినే రాజకీయాల్లోకి లాగడానికి భయపడనివాళ్లు కోర్టు ధిక్కరణకు భయపడతారా? తాజాగా ఆ నెయ్యిని బాత్ రూమ్‌లు కడిగే కెమికల్‌తో తయారు చేశారనే ప్రచారాన్ని చంద్ర బాబు ప్రారంభించారు. ఆ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడే పద్ధతి ఈ విధంగానే ఉంటుందా?సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ తన ఆకాంక్షల మేరకు ఛార్జిషీట్ వేయలేదు కనుక ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం మరో కమిషన్ వేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు, దాంతోపాటు బాత్రూమ్లు కడిగే కెమికల్ కలిసిందనే రిపోర్టు వచ్చేవరకు చంద్రబాబు కమిషన్లను, కమిటీలను నియమిస్తూనే ఉంటారన్న మాట! అయితే ఇప్పుడు వివాదానికి కారణమైన నెయ్యి శాంపిల్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసు కున్నదే! అదే విచిత్రం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన నెయ్యి శాంపిల్‌ను పరీక్షిస్తే జగన్ కాలంలో జరిగిన కల్తీ కనిపించాలని కూటమి సర్కార్, యెల్లో మీడియా కోరుకుంటున్నాయి.వివాదానికి కేంద్ర బిందువైన భోలేబాబా డెయిరీ వాళ్లు అంతకుముందు చంద్రబాబు సర్కార్ ఉన్నప్పటి నుంచే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో (ఇతర డెయిరీల ద్వారా) తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఇది ఆన్ రికార్డ్! చంద్రబాబు కాలంలో కిలో నెయ్యికి రూ. 297 వసూలు చేసే వాళ్లు. ప్రభుత్వం మారిన తర్వాత 319 నుంచి 348 రూపాయల వరకు ధర పెరిగింది. ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. నెయ్యి ట్యాంకర్లు తొలుత తిరుమలకు వెళ్లకుండా తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్‌కు చేరుకుంటాయి. మార్కెటింగ్, విజిలెన్స్, ప్రొక్యూర్మెంట్ అధికారుల సమక్షంలో శాంపిల్ తీస్తారు. ఈ శాంపిల్‌ను తిరుమలలోని నాణ్యతా పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. వారు ఓకే అన్న తర్వా తనే నెయ్యి ట్యాంకర్ తిరుమలకు బయల్దేరుతుంది. నాణ్యత లేదని తేలితే ట్యాంకర్‌ను వెనక్కు పంపిస్తారు. చాలాకాలంగా ఇటువంటి పకడ్బందీ విధానం అక్కడ అమల్లో ఉన్నది.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి ట్యాంకర్లను నాణ్యత లేని కారణంగా 16 సార్లు వెనక్కు పంపి నట్టు రికార్డులు చెబుతున్నాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓ నాలుగు ట్యాంకర్లను తిరస్కరించి వెనక్కు పంపారు. దర్యాప్తులో తేలిన ఆందోళనకరమైన విషయం ఏమిటంటే – ఇలా వెనక్కు వెళ్లిన నాలుగు ట్యాంకర్లు ఒకచోట మాటువేసి ఉండి, కంపెనీ పేరు మార్చుకొని ‘పరీక్షలు’ నెగ్గి తిరుమలకు చేరుకున్నాయి. ఈ ట్యాంకర్లలో తీసిన శాంపిల్సే ఇప్పుడు దేశవ్యాప్త సంచలనాలకు కారణమయ్యాయి. చంద్రబాబు తొలిదఫా అధికారంలో ఉన్న సమయంలోనే బోలేబాబా టెండర్‌ను అనిల్ సింఘాల్ అనే ఐఏఎస్ అధికారి ఖాయం చేసుకొచ్చారు. అయనప్పుడు టీటీడీ ఈవోగా పని చేశారు. ఈ శాంపిల్స్ వివాదాస్పదమైన నేపథ్యంలో కూడా మరోసారి ఆయన్నే ఈవోగా నియమించారు. దీని భావమేమి తిరుమలేశా? వైసీపీ సర్కార్ హయాంలో తిరస్కరించిన 16 ట్యాంకర్లలో ఏ ఒక్కటీ తిరిగి కంపెనీ పేరు మార్చుకొని వచ్చిందనే దాఖలా లేదు. అప్పుడు లడ్డూల్లో వాడిన నెయ్యి శాంపి ల్స్‌ను పరీక్షించకుండానే మరి ఆ కాలమంతా కల్తీ జరిగిందని ఎలా చెబుతారు?చంద్రబాబు హయాంలో భోలేబాబా టెండర్ ఖరారైంది. ఈ టెండర్‌ను ఖరారు చేసిన అధికారి అప్పుడు ఈవోగా పని చేశారు. అప్పుడు కేవలం 297 రూపాయలకే ఆ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వైసీపీ హయాంలో 16 సార్లు వెనక్కు పంపించారు. చంద్రబాబు హయాంలో శాంపిల్ తీసి వెనక్కి పంపిన ట్యాంకర్లు మళ్లీ వచ్చి తిరుమలకు వెళ్లాయి. దాని శాంపిల్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన తర్వాత అప్పుడు టెండర్ ఖరారు చేసిన అధికారే మళ్లీ ఈవోగా వచ్చారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఏమర్థమవుతుంది? చూపుడు వేలు ఏ వైపు తిరుగుతుంది? తిరుమల లడ్డూను వివాదాస్పదం చేయడం ద్వారా ప్రతిపక్షానికి బురద పూయాలనే సంకల్పం తప్ప మరోటి కన్పించడం లేదు. మొన్న గురువారం నాటి ఓ శుభముహూర్తాన, కూటమి నేతలంతా కొలువుదీరిన మీడియా సమావేశంలో ఎటువంటి దాపరికం లేకుండా ఈ సంకల్పాన్ని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.తిరుమల క్షేత్రం పవిత్రతను దెబ్బతీయడానికి ఒక మహాకుట్ర జరిగిందని, అందులో భాగంగానే లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ చేశారని తాను కనిపెట్టినట్టుగా ఆయన చెప్పుకున్నారు. దీన్ని హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిగా ఆయన భావించారు. తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యతను స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామే తనకు అప్పగించారని ఆయన చెప్పారు. ఖతమ్. బారా ఖూన్ మాఫ్. అఖిలాంధ్ర జనులారా... చంద్రబాబు నుంచి ఇంకేమీ ఆశించకండి. ఆయన స్వామివారి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే పనిలో నిమగ్నమై ఉంటారు. హిందూ ధర్మాన్ని ప్రస్తావిస్తూ ఈ సమావేశంలో ఆయన ఒకే ఒక్క నిర్వచనాన్ని ప్రవచించారు. ‘‘మన ధర్మం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో జరుగు తాయి. మనకు కుటుంబ విలువలుంటాయి. పెళ్లయిన తర్వాత విడాకులివ్వడం మన ధర్మం ప్రకారం సరైంది కాదు’’ అంటూ మాట్లాడారు. ఈ నిర్వచనానికి కూటమిలో ఏకాభిప్రాయం ఉన్నదో లేదో తెలియదు.తిరుమల పవిత్రతపై, హిందూ ధర్మంపై ప్రతిపక్ష పార్టీ కుట్ర చేస్తున్నదని ఆయన సారాంశం. దానికి వ్యతిరేకంగా కూటమి తోడ్పాటుతో పోరాటం చేస్తారట! ఎనభై ఐదు శాతం మంది హిందువులున్న రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే, హిందూ దేవుళ్ల పవిత్రతను దెబ్బతీయడానికి పనిచేస్తుందా? ఇంగిత జ్ఞానమున్నవాళ్లెవరైనా ఇలా మాట్లాడతారా? మాట్లాడితే నమ్ము తారా? ప్రతిపక్ష నేతకు లభిస్తున్న జనాదరణను తట్టుకోలేక నిస్పృహతో కూడిన మాటలుగానే వాటిని భావించాలి. ఈ నిస్పృహలో ఆయన ప్రజాస్వామిక విలువల్నీ, రాజ్యాంగ ధర్మాన్నీ తుంగలో తొక్కుతున్నారు.విజయవాడ నగరంలో డజన్లకొద్దీ ఆలయాలను చంద్ర బాబు కూల్చివేస్తే వాటిని పునర్నిర్మించిన ధార్మికుడు, దేశ వ్యాప్తంగా వందలాది శ్రీవారి ఆలయాలను నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి. వేలాది గోవుల్ని అక్రమ రవాణా చేస్తుంటే, వాటిని వధించి గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే, ఈ వ్యాపారంలో ఆయన పార్టీ వారే భాగస్థులుగా ఉన్నా కఠిన చర్యలకు పూనుకోని వ్యక్తి చంద్రబాబు. వివిధ ప్రాంతాల నుంచి దేశవాళీ గోసంపదను సమీకరించి తిరుమ లలో గోశాలను ఏర్పాటు చేసి, స్వయంగా తన నివాసంలోనే గోవుల్ని పోషించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఆలయ రథం కాలిపోతే పట్టించుకోని పాలకుడు చంద్రబాబు. అంతర్వేదిలో ఓ రథాన్ని ఎవరో దుండగులు తగలబెడితే, వెంటనే సరికొత్త రథాన్ని తయారు చేయించడమే కాక, ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాసిన పారదర్శక పాలన జగన్‌ది. ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మం విషయంలో జగన్ చిత్తశుద్ధిపై డజన్కిపైగా ఉదాహరణలివ్వవచ్చు. చంద్రబాబు పోటీయే కాదు.ఒక దేవుడిని విశ్వసించేవాడు, నమ్మేవాడు అందరు దేవుళ్లనూ ఆరాధిస్తాడు. ఇది ప్రాథమిక సూత్రం. అన్యమత స్థులెవరూ ఇతరుల ఆరాధనా స్థలాలపై దాడులు చేయరు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కరుండే ఉన్మాదులు తప్ప! ఆకతాయిలు తప్ప! దొంగలు తప్ప!! ఇటువంటి వాళ్లు అన్ని చోట్లా, అన్ని మతాల్లో, అన్ని సమూహాల్లో ఉండవచ్చు. వాళ్లు చేసే చెదురుమదురు ఘటనల్ని గుదిగుచ్చి మతంపై దాడిగా ప్రచారం చేయడం దుర్మార్గమైన రాజకీయం. ప్రజల్ని రెచ్చగొట్టి లాభం పొందాలనే ఎత్తుగడ. రాజకీయ మనుగడ కోసం విసిరే ఆఖరి పాచిక. ఇటువంటి ఎత్తులకు ఆంధ్ర ప్రజలు పడిపోతా రనుకోవడం అవివేకం.అన్యమతస్థుల ఆలయ ప్రవేశానికి ఆంక్షలుండాలనీ, షరతులుండాలనీ, అన్య మతస్థులెవరూ అక్కడ పనిచేయకుండా చూస్తామనీ కూడా చంద్రబాబు చెప్పారు. ఇదేం గొప్ప విషయమా? సుప్రసిద్ధ షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్‌కు కాశీ విశ్వేశ్వరునితో ఉన్న అనుబంధం లోకానికి తెలిసిందే కదా! ‘అమెరికాలో స్థిరపడితే జీవితాంతం సకల సౌక ర్యాలు కల్పిస్తాన’ని ఓ సంపన్నుడు బిస్మిల్లా ఖాన్‌ను అడిగాడట! ‘సరే, గంగానదిని, విశ్వనాథుడినీ కూడా ఇక్కడికి తేగలవా? అలా అయితే ఇక్కడే ఉంటా’నని చెప్పాడట! సిరిసంపదల కంటే విశ్వనాథుడే మిన్నగా ఆయన భావించాడు. మన తెలుగు వాడు నాదస్వర బ్రహ్మ షేక్ చిన మౌలానాను శ్రీరంగం దేవ స్థానం ఆస్థాన విద్వాంసుడిగా గౌరవించిన సంగతి మరిచి పోదామా? గంధర్వ గాయకుడు యేసుదాసు ‘హరివరాసనం స్వామి విశ్వమోహనం’ అని పాడుతుంటే తన్మయత్వానికి లోనుకాని హిందూ భక్తులుంటారా? గంగా – యమునా తెహ జీబ్... భారతీయ సంస్కృతి. దాన్ని కాపాడుకోవడంలోనే దేశ పురోగతి దాగి ఉన్నది. దీన్ని ధ్వంసం చేయడానికి స్వయంగా పాలకులే ప్రయత్నిస్తే అది క్షమించరాని నేరమే అవుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్సులో మంటలు
తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని విన్నమాల క్రాస్ రోడ్ వద్ద గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి వినుకొండకు వెళుతున్న ఈ బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
తప్పించుకోలేరు.. సతీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
Tirupati : అంబటి రాంబాబుపై కేసు నమోదు
-
కూటమి అపచారం.. YSRCP పరిహార హోమం
-
వివాదాస్పద ఫ్లెక్సీలపై YSRCP ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: వివాదాస్పద ఫ్లెక్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ అంటూ పలుచోట్ల టీడీపీ.. ఫ్లెక్సీలు పెట్టించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలను కూడా కూటమి నేతలు బేఖాతరు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. రాష్ట్రవాప్తంగా పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నిజం.. మహా పాపం నిజం.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలను వైఎస్సార్సీపీ శ్రేణులు తొలగించగా.. ఆ పార్టీ కార్యకర్తలపై ఎస్ఐ మురళి దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు.తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్‌లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్‌లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం. -
Arava Sreedhar: వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం
సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో జనసేన నేతల కీచక పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులు గురి చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నారని మీడియా ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ దారుణాల్ని బయటపెట్టింది. ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేత అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందినందుకు అరవ శ్రీధర్‌కు ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బాధిత మహిళ ఫేస్బుక్లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్‌కు అరవ శ్రీధర్ రిప్లయి ఇచ్చారు. అంతే నాటి నుంచి శ్రీధర్ తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. మాట్లాడాలి. కలవాలి అంటూ పలు మార్లు ఆమెకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. ఎమ్మెల్యే ఏంటి ఇలా అంటున్నారంటూ సమాధానం ధాటవేసింది. అసలే ఎమ్మెల్యే. తనకున్న అధికారంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎవరు? .ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?. పెళ్లైయ్యిందా?. భర్త ఏం చేస్తుంటాడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారి వయస్సు ఎంత. ఆమె ఇంటి అడ్రస్ ఎక్కడ. ఇలా అన్నీ వివరాలు సేకరించాడు. బాధితురాలికి తల్లిదండ్రులు లేరని, భర్త ఐటీ ఉద్యోగిగా హైదరాబాద్‌లో పనిచేస్తుంటారని తెలుసుకున్నాడు. అంతే ఓ రోజు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. పలానా ప్రాంతానికి వెళ్లాలంటూ కారులో ఎక్కించుకున్నాడు. భర్త ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మూడేళ్ల కుమారుడు చేసేది లేక ఎమ్మెల్యే కారు ఎక్కింది. ఓ ప్రాంతానికి వెళ్లాలంటూ కారు ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో ఓ గ్రామ సమీపంలో కారులోనే ఆమెపై బలవంతం చేయబోయాడు. చేస్తుంది తప్పని, వద్దని వారించింది. కారు దిగిపారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో బాధితురాల్ని అరవ శ్రీధర్ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. కారులోనే దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. జనసేన ఎమ్మెల్యే శశ్రీధర్ ఆగడాలు అంతటితో ఆగలేదు. ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబడట్టాడు. లేదంటే బాధిత మహిళ మూడేళ్ల కుమారుణ్ని ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా, వీడియోలు, వాట్సాప్ చాట్లతో సహా పలు ఆధారాల్ని బయట పెట్టడం కలకలం రేపుతోంది. -
ఒంటరితనం తట్టుకోలేక..
తిరుపతి క్రైమ్ : స్థానిక తిమ్మినాయుడుపాళెంలో నివసిస్తున్న ప్రియాంక (30) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.వివరాల ప్రకారం.. ప్రియాంక ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులు గతంలో మృతి చెందడంతో కొంతకాలంగా ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ ప్రేమ వ్యవహారం విఫలమైన నేపథ్యంలోనే ఈ ఘోర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం రాత్రి ఆమె తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దళిత యువతిపై లైంగికదాడి
తిరుపతి క్రైమ్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి మాయ మాటలు చెప్పి దళిత యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలంలో నివాసముంటున్న 19 ఏళ్ల దళిత యువతికి కడపకు చెందిన యశ్వంత్రాజ అనే వ్యక్తి కొద్దికాలం కిందట ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 21న ఆ యువకుడు తిరుపతికి వస్తున్నానని యువతికి తెలిపాడు.ఇదే క్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్లోని ఓ హోటల్ రూమ్‌కి తీసుకువెళ్లి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన యువతి డీలాగా ఉండడంతో తల్లి గమనించి ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 24వ తేదీ రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
హోటల్ రూమ్ 114.. యువతిని రప్పించి రేప్
-
అర్థరాత్రి దొంగల బీభత్సం.. CCTV ఫ్యూటేజ్ లో భయంకర దృశ్యాలు
-
పావలా నాణేలతో జాతీయ జెండా!
మనిషన్నాక కాసుంత కళాపోషణ ఉండాల అన్నట్టు ఈ హెడ్ కానిస్టేబుల్ వినూత్న ఆలోచనలతో నాణేలతో కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు. అందరిచేత ఔరా అనిపించుకుంటున్నారు.తిరుపతి వెస్ట్ పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేష్‌రెడ్డి తన భార్య సుమతి సహకారంతో 2001 నుంచి 1.60 లక్షల 25 పైసల (పావలా) నాణేలను సేకరించి 12 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో భారీ జాతీయ జెండాను (National Flag) రూపొందించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు కోసం తాను ఉండే పోలీస్ క్వార్టర్స్ మిద్దెపైన ఈ జెండాను ప్రదర్శించారు. పోలీసు అధికారులతోపాటు ఔత్సాహికులు ఈ నాణేల పతాకాన్ని వీక్షించి అబ్బురపడుతున్నారు.సురేష్‌రెడ్డి గతంలో 25 పైసల నాణేలతో చార్మినార్, తంజావూరు బృహదీశ్వరాలయం, గేట్ వే ఆఫ్ ఇండియా, కేరళలోని ఆనంద నిలయం (Ananda Nilayam) వంటి పుణ్యక్షేత్రాలతోపాటు చారిత్రాత్మక ఘట్టాల ఆకృతులనూ రూపొందించారు. రిటైరయ్యేలోపు ఐదు లక్షల నాణేలతో భారీ జాతీయ పతాకాన్ని రూపొందించాలనే ఆలోచనతో ఉన్నట్టు సురేష్‌రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే సురేష్‌రెడ్డి తాతముత్తాతల నుంచి అందరూ పోలీసు శాఖలోనే పనిచేయడం మరో విశేషం. చదవండి: తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు.. ఒకటి మాత్రమే అమ్ముతారు! -
కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)
-
CPM Leaders: అయ్యా బాబు .. ఎడ్జోలము కాదు .. ఎదురుతిరుగుతాము
-
విమాన ప్రయాణం హామీని నెరవేర్చిన హ్యాట్రిక్ సర్పంచ్
జోగులాంబ గద్వాల జిల్లా: ముచ్చట గా మూడోసారి సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తి గ్రామంలోని 200 మందిని విమానంలో తిరుపతి తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నా యి.. వికారాబాద్ జిల్లా రాకంచర్ల గ్రామ సర్పంచ్ కమ్లీబాయి, పెంటయ్య దంపతులు తాము ఎన్నికల్లో గెలిస్తే విమానంలో తిరుపతి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సోమవారం సర్పంచ్ భర్త పెంటయ్య పుట్టినరోజు కావడంతో నాలుగు బస్సుల్లో హైదరాబాద్ బయలుదేరారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతి చేరుకోనున్నార -
చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎస్వీయూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న ఆర్డీవో ఆఫీస్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి.విద్యార్థి సంఘాలపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు ఎత్తేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ధర్నాకు మద్దతు తెలిపిన హర్షిత్ రెడ్డితో పాటు 14 మంది విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. -
మద్యం మత్తుకు ఇద్దరు యువకులు బలి
-
చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలంలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఇంటి వద్ద ఓ వృద్ధుడి ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేస్తామని చెప్పి ఏడాది గడిచినా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని.. పైగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వాపోతూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆ పెద్దాయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నాగి రాజయ్య గారిపల్లికి చెందిన గోవిందరెడ్డి(65) తనకున్న భూసమస్యపై సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు బుధవారం ఉదయం నారావారిపల్లికి వచ్చాడు. అయితే.. సీఎం పండుగ వేడుకల్లో బిజీగా ఉన్నారని చెబుతూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు హుటాహుటిన నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రుయాకు తరలించారు. ఏడాది గడిచినా.. గోవిందరెడ్డికి తన అన్నదమ్ములతో భూ పంచాయితీ నడుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే లక్షలు ఖర్చు చేశాడు. అయితే.. గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబును నారావారిపల్లెలోనే కలిసి న్యాయం చేయమని బతిమాలాడాడు. ఆ సమయంలో.. తాము చూసుకుంటామంటూ తండ్రీకొడుకులు మాట ఇచ్చారు. అయితే ఏడాది అవుతున్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. గోవిందరెడ్డితో వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి మాట్లాడుతూ.. నేను బైక్ పార్కింగ్ చేస్తుండగా ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందరెడ్డి వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కలెక్టర్, ఎమ్మార్వోలను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు పంచాయితీల పేరుతో లక్షలు నష్టపోయాడు. డబ్బులు ఖర్చు చేసినా న్యాయం జరగలేదు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యాయం కోసం గత ఏడాది నారావారిపల్లెలో మంత్రి లోకేష్‌ను కలిశాం. న్యాయం కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గోవిందరెడ్డికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
పండుగ వేళ విషాదం
మహబూబ్ నగర్ జిల్లా: సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకొందామని గ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కళ్లముందే భార్య దుర్మరణం చెందగా.. మూడేళ్ల కూతురు చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రితోపాటు మరో కూతురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం భూత్పూర్ వద్ద బ్రిడ్జిపై కారు ప్రమాదంలో సంక్రాంతి పండగకని కూతురు వద్దకు తిరుపతి వెళ్తుండగా భార్యాభర్తలు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన వాహనదారులను కలిచివేసింది. వివరాలిలా.. ఏపీలోని నంద్యాల జిల్లా పగిడియాల మండలం మచ్చుమర్రికి చెందిన సూర్య తిరుపతయ్య, భార్య భాగమణి (25) చిన్న కూతరు యస్న(3), మరో కూతరు ప్రియాంచితో కలిసి హైదారాబాద్‌లోని అల్వాల్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండగకని స్వగ్రామానికి బైక్‌పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని గాజులపేట స్టేజీ జాతీయ రహదారిపై మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న రేలింగ్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య నాగమణి (25) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చిన్నకూతురు యస్న (3) జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపతయ్యతోపాటు మరో కూతురు ప్రియాంచి గాయాలతో చికిత్స పొందుతున్నారు. నాగమణి తల్లి ఉస్సేనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. రెండ్రోజుల్లో రెండో ప్రమాదం భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడి వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఏపీ వాసులు భార్యాభర్తలు మృతిచెందారు. పండగవేళ తిరుపతిలోని కూతురు వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
సాక్షి, తిరుపతి: టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. బాలాజీనగర్ ఫ్లాట్ నంబర్ 2 రద్దు విషయంలో కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన రాజీనామా చేశారు.ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాలు.. మనస్తాపానికి గురిచేశాయన్న కృష్ణమూర్తి.. కనీసం తనను సంప్రదించకుండా కథనాలు రాయడం బాధాకరమన్నారు. స్వామి వారికి సేవ చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నందుకు ఆ భగవంతుని క్షమించమని కోరుకుంటున్నానంటూ జంగా కృష్ణమూర్తి లేఖలో పేర్కొన్నారు. -
మొత్తం ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పాలనలో నిత్యం అపచారాలు జరుగుతున్నాయన్నారు. తిరుమలలో మద్యం బాటిళ్ల వెనుక వైఎస్సార్సీపీ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు‘‘తప్పుడు కేసు బనాయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యమే కొండపై తిష్ట వేసింది. ఖాళీ మద్యం బాటిళ్లను కవర్ చేసినవారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ సీసీ ఫుటేజ్ బయటపెట్టమని సవాల్ చేస్తున్నా. 25 గోనె సంచులు నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయట పడింది నిజం కాదా?. చంద్రబాబు, బీఆర్ నాయుడు ఒత్తిళ్లతో కోటిని బలవంతంగా కొట్టారు. తిరుమల టు టౌన్ సీఐ శ్రీరాములు..వైఎస్సార్సీపీ కార్యకర్త మణిని కొట్టారు.బీఎన్.ఎస్ సెక్షన్ 152 పెట్టడం అత్యంత దారుణం. న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి మేము బతికి బట్టకడుతున్నాం. లేదంటే మాకు జైళ్లే అవాసకేంద్రాలుగా మారేవి. మా సవాల్ ను స్వీకరించాలి.. మొత్తం ఆ సీసీ పుటేజ్ బయట పెట్టాలి. అలిపిరి వద్ద నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ ఏం చేస్తోంది?. బీఆర్ నాయుడి ప్రైవేట్ సైన్యం తాగి పడేసి బాటిల్స్ అవి. నీకు లక్షలు, వేల కోట్లు ఎలా వచ్చాయి? కోటి అనే వ్యక్తి మద్యం బాటిల్స్ పెట్టినట్లు సాక్ష్యం చూపించమని సవాల్ విసురుతున్నా.. మేము హైందవ ధర్మ పరిరక్షణ కు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము మీరు చర్చకు సిద్ధం’’ అని భూమన తేల్చి చెప్పారు.‘‘మీరు అరెస్ట్ చేసినా నా గొంతు ఆగదు.. తిరుమలపై ఏది జరిగినా ప్రశ్నిస్తాము. మీరు చేస్తున్నా ఘోరాలు, నేరాలు ప్రజలకు తెలియజేస్తాం. పోలీసులు బలి పశువులయ్యారు. సీఐ శ్రీరాములు చేసినది తప్పు.. తీవ్రవాది పట్ల ప్రవర్తించేలా ఉంది. సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ ఇంటికి 40 మంది పోలీసులను పంపించి భయభ్రాంతులు చేశారు’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కోడిని కోశారని కేసు.. పోలీసులకు కోర్టు చీవాట్లు
-
తిరుమలలో చిరుత కలకలం
సాక్షి,తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం రేపింది. శ్రీవారి 450వ మెట్టు మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత ప్రత్యక్షమవడంతో భక్తుల్లో కలకలం రేగింది. భక్తులకు చిరుత కనిపించడంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.భక్తులు మెట్లు ఎక్కుతున్న సమయంలో అకస్మాత్తుగా చిరుత ప్రత్యక్షమైంది. వెంటనే భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు తక్షణమే స్పందించి, భక్తులను ఆ మార్గంలో అనుమతించడం నిలిపివేశారు. అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని శబ్దాలు చేసి చిరుతను దారి మళ్లించారు. అనంతరం ఆ ప్రాంతంలో గస్తీ పెంచి, చిరుతను అడవిలోకి తరలించే ప్రయత్నం చేశారు. టీటీడీ అధికారులు భక్తుల భద్రత దృష్ట్యా మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసి, క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే భక్తులను గుంపులుగా అనుమతిస్తామని ప్రకటించారు.చిరుత ప్రత్యక్షమవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే, అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భక్తులు అధికారులు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. తిరుపతి శ్రీవారి మెట్లు మార్గంలో చిరుత సంచారం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న మార్గాల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. అధికారులు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. -
సాక్షి ఫోటోగ్రాఫర్ పై తప్పుడు కేసు.. బుద్ధి చెప్పిన కోర్ట్


