సాక్షి, తిరుపతి: సిట్ విచారణకు సహకరించానని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్పానన్నారు. గతంలొ టీటీడీలో పనిచేసిన అధికారులను ప్రశ్నించినట్టే తానను కూడా విచారించారన్నారు. కొత్త ప్రసార మాధ్యమాల్లో అవాస్తవాలు వేస్తున్నారని.. విచారణకు సంబంధించిన అవాస్తవాల ప్రసారంతో ప్రజలను పక్కదారి పట్టించవద్దన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని ధర్మారెడ్డి అన్నారు.
టీటీడీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ నేతృత్వంలోని సిట్ టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డిని నిన్న (మంగళవారం, నవంబర్ 11) కూడా విచారణ చేశారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లోలోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు ధర్మారెడ్డి హాజరయ్యారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లోని సీబీఐ కార్యాలయంలో జరిగిన విచారణకు మంగళవారం ఉదయం 10:58 గంటలకు ధర్మారెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం ఇచ్చారు.
భోజన విరామ సమయంలో మీడియా సిబ్బంది మాట్లాడండి.. అని కోరగా ధర్మారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఫొటోలు వీడియోలు తీసుకోమని చెప్పారు. ఇదే సమయంలో జనసేన పార్టీ బహిష్కృత నేత కిరణ్ రాయల్ సిట్ కార్యాలయం వద్ద ఓవర్ యాక్షన్ చేశారు. ఎవరో తెచ్చిన లడ్డూలను తానే తిరుమల నుంచి తెచ్చా.. ధర్మారెడ్డికి ఇస్తా అంటూ హల్‌చల్ చేశారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే కిరణ్ రాయల్ అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ధర్మారెడ్డి భోజనానికి వెళ్లి.. 3.10 గంటలకు తిరిగి విచారణకు హాజరయ్యారు. రాత్రి 9.15 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇవాళ కూడా ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు.


