dharma reddy
-
Fact check: రామోజీ శాసిస్తే... టీటీడీ శిరసావహించాలట!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఈనాడు రామోజీ తన బూటకపు కథనాలతో శాసిస్తున్నారు. తిరుమల కొండపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఆ దేవస్థానానికి పెరిగిన ఆదాయం, భక్తులకు సమకూరిన సౌకర్యాలు, సామాన్య భక్తులకు శీఘ్రంగా సర్వదర్శనం చేయించడంలోనూ వచ్చిన విశేష మార్పులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా లభిస్తున్న ఆదాయంతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి... వంటివాటిని పక్కనబెట్టి లేనిపోని వక్రభాష్యాలతో మంగళవారం ‘వడ్డీకాసుల వాడికి వంచన సేవ’ ...శీర్షికన ఈనాడులో ఓ దౌర్భాగ్య కథనాన్ని అచ్చేశారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగింపు గురించి, సేవా టికెట్లలో అక్రమాలు జరిగిపోతున్నాయని, టీటీడీ సభ్యుల్లో నేరచరితులున్నారని, శ్రీ వాణి ట్రస్టులో పారదర్శకత లేదని... ఇలా మతిలేని గ్రాఫిక్స్ జోడించి మరీ పైత్యాన్ని రంగరించి కథనాన్ని రాశారు. ఈ అబద్ధాల కథనం వెనుక రామోజీ దురాలోచనను బట్టబయలు చేయడానికే ఈ ఫ్యాక్ట్‌చెక్.రామోజీ తాపత్రయమంతా టీడీపీ కోసమే... తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హిందువుల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చేయాలని రామోజీరావు తెగతాపత్రయపడిపోతున్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ మీద రాజకీయ దాడి ప్రారంభించిన ఈ అక్షర అష్టావక్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈనాడులో పనికిమాలిన, అవాస్తవ కథనాలను రాయడం... టీడీపీ నాయకులు దాన్నే మళ్లీ ప్రెస్మీట్లో చర్విత చరణంగా చెప్పడం, రెండు మూడు రోజుల పాటు ఈ డ్రామా నడపడం ఈ పత్రికకు నిత్యకృత్యమైంది. ఎన్నికలు దగ్గర పడటంతో గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై రాజకీయ ఆరోపణలు చేస్తూ, లేనిది ఉన్నట్లు అభూత కల్పనల కథనాలను రాసిందే రాస్తున్నారు. బాబు హయాంలో ఇద్దరిని సుదీర్ఘంగా కొనసాగిస్తే రామోజీకి కనిపించలేదా?...చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల జేఈవోగా పి.బాలసుబ్రమణ్యం తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మొదలు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పదే పదే మొర పెట్టుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎందుకు బదిలీ చేయలేదో ఈనాడు బదులివ్వగలదా? పైగా బాలసుబ్రమణ్యం తిరుమల జేఈవోగానే రిటైరయ్యేలా చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారో రామోజీ చెప్పగలరా? టీటీడీపై అంత ప్రేమ ఉంటే ఈ విషయాన్ని ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? అంతేకాదు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తిరుమల జేఈవోగా నియమితులైన మరో అధికారి శ్రీనివాసరాజు. ఆయన లాబీయింగ్, అధికార పారీ్టకి వీరవిధేయత వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు తిరుమల జేఈవోగా శ్రీనివాసరాజు పనిచేశారు. అప్పుడూ చంద్రబాబును ఈనాడు ప్రశి్నంచలేదు. శ్రీనివాసరాజు అధికార పారీ్టకి అనుకూలంగా దేశ, విదేశాల్లో సైతం లాబీయింగ్ చేస్తున్నారని రామోజీరావు ఎందుకు నిలదీయలేదో చెప్పగలరా?ధర్మారెడ్డి కొనసాగింపు కేవలం భక్తుల సౌకర్యార్థమే ప్రస్తుత టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరాజుల్లాగా వరుసగా తొమ్మిదేళ్లు పని చేయలేదు. వేసవిలో వరుస సెలవుల కారణంగా తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి సమర్థుడైన అధికారి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డికి మరో 8 వారాల పొడిగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదేదో మహా అపచారమన్నట్లు ఈనాడు రాసింది. కథనం రాశాం కాబట్టి ధర్మారెడ్డికి పొడిగింపు రాదని భ్రమపడింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, తిరుమలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి మరో 8 వారాలు టీటీడీలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘వారికి నో.. వీరికి ఎస్’ అంటూ తన కడుపుమంట కథనాన్ని ప్రచురించారు. ధర్మారెడ్డికి డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఆక్రోశం, ఆందోళన, కోపం, బాధ కలగలిపి పనికిమాలిన కథనాన్ని అచ్చేశారు.బోర్డు సభ్యుల నియామకాలపైనా వక్రపూరిత రాతలుతన రాజకీయ, ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాల కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచిందే చంద్రబాబు. ఈ నిజాన్ని ఈనాడు పొరపాటున రాయదు. తన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు ఈ పనిచేస్తే రామోజీరావు దృష్టిలో తప్పుకాదు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో మొదట నియమించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనను చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్‌గా నియమిస్తే దాన్ని ఘోరంగా అభివర్ణిస్తూ ఆ కథనంలో ఈనాడు పేర్కొందిశ్రీవాణి ట్రస్టు ఆదాయమంతా ఆలయాల అభివృద్ధికే... శ్రీవాణి ట్రస్టు ఆదాయ, వ్యయాల గురించి సుమారు ఏడాది కిందటే టీటీడీ శ్వేత పత్రం ప్రకటించింది. ఈనాడు ఈ విషయాన్నీ గతంలో ప్రచురించింది. ఈ ట్రస్టుపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మతాంతీకరణలను నిరోధించడానికి టీటీడీ సుమారు 3 వేల ఆలయాలను నిర్మించింది. అనేక పురాతన ఆలయాల జీర్ణిద్ధరణకు నిధులు ఇచ్చింది. కేవలం వైఎస్సార్సీపీ నేతలున్న గ్రామాల్లోనే ఈ ఆలయాలు నిర్మించారని ఈనాడు ఆ కథనంలో అసత్యాలను రాసేసింది. ఈ ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం టీటీడీ ప్రతినెలా రూ. 5 వేలను అందిస్తున్న వాస్తవాన్ని ఈనాడు దాచి పెట్టింది. సేవా టికెట్లపైనా అవాస్తవాలు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉండగా, సిఫారసు లేఖల మీద జారీచేసే సేవా టికెట్ల ధరలు పెంచి తద్వారా వీటి డిమాండ్ తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో సేవా టికెట్లు జారీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఈనాడు దీన్నీ వక్రీకరించి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలు, వేల సంఖ్యలో టికెట్లు హోల్‌సేల్‌గా విక్రయించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. వసతి సముదాయాల నిర్మాణాలపై అభూతకల్పనలుతిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి భావించింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో ఆ భవనాల పటుత్వంపై అధ్యయనం చేయించింది. యాత్రికుల వసతికి ఎక్కువ కాలం ఈ భవనాలు పనికి రావని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే అచ్యుతం, శ్రీ పథం పేర్లతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వసతి సముదాయంలో 1,800 మందికి మాత్రమే ఉన్న వసతి 8,200 మందికి పెంచి అధునాతన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.600 కోట్లుగా ఉన్న ఈ నిర్మాణాల అంచనాలను రూ.460 కోట్లకు కుదించి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. టెండర్ల ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జ్యుడీషియల్ కమిషన్ అనుమతీ తీసుకుంది. ఈనాడు తన కథనంలో ఈ వాస్తవాలను దాచి 10% కమీషన్లు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీద ఆరోపణలు చేసింది. మూడేళ్లలో పూర్తయ్యే పనికి ముందే కమీషన్లు తీసుకునే విద్య రామోజీరావుకు మాత్రమే తెలిసినట్లు ఉంది. -
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఫొటోలు)
-
టీటీడీ ఈవో లేఖ.. ఎట్టకేలకు స్పందించిన పురావస్తుశాఖ
సాక్షి, తిరుపతి: అలిపిరి పాదాల మండపం శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండపం వెనుకభాగం కూలిపోయింది. దీంతో ఇనుప రాడ్లుతో మండపానికి సపోర్ట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు,.. కానీ ఏ సమయంలో కూలిపోతుందో తెలియని ఈ మండపం ద్వారా భక్తులకు ప్రాణహాని ఉందని.. టీటీడీ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోగా.. దీనిపై రాజకీయ రంగు పులిమి మండప నిర్మాణాన్ని అడ్డుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి రాసిన లేఖపై ఎట్టకేలకు పురావస్తుశాఖ స్పందించింది. ఢిల్లీ ఎఎస్ఏ నుంచి పురావస్తు బృందాన్ని పంపారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించారు. బెంగుళూరు నుంచి జి.శ్రీనివాసులు, చెన్నై నుంచి ఏ. సత్యం, హైదరాబాద్ నుంచి కే.కృష్ణ చైతన్య బృందం మరిన్ని పురాతన మండపాలను పరిశీలించనున్నారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మండపం మరమ్మత్తుపై ఆర్కియాలజీ బృందం నివేదిక సమర్పించనున్నారు. -
‘జనవరి15న తిరుపతిలో గోదాదేవి కల్యాణం’
సాక్షి, తిరుమల: తిరుమనలో జనవరి 25న రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాటాట్లాడుతూ.. ధర్మ ప్రచారంలో భాగంగా మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 60 నుంచి 70 మంది స్వామీజిలను సదస్సుకు ఆహ్వానిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అన్నప్రసాదంలో వినియోగించే బియ్యాన్ని మిల్లర్లు ద్వారా కోనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. జనవరి15న తిరుపతిలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తాని చెప్పారు. 16న తిరుమలలో పార్వేటీ ఉత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమల: 2023 డిసెంబర్ నెలలో లక్షలాది మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం, లడ్డులా విక్రయాలు, తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు.. దర్శనం: శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య.. 19.16 లక్షలు. హుండీ : హుండీ కానుకలు.. రూ.116.73 కోట్లు. లడ్డూలు : విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య .. ఒక కోటి 46 వేలు. అన్నప్రసాదం : అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య .. 40.77 లక్షలు. కల్యాణకట్ట : తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.. 6.87 లక్షలు. చదవండి: రామాయపట్నం 'రెడీ' -
అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశాం: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: అలిపిరి మండపాల పునఃనిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదాల మండపం ఆర్కియాలజీ పరిధిలో లేదన్నారు. ఎప్పుడైనా కూలే పరిస్థితి ఉందని.. అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశామని ఈవో పేర్కొన్నారు. అనేకమార్లు ఆర్కియాలజీ సంప్రదింపు చేసిన స్పందించలేదు. అలిపిరి పాదాల మండపం కూడా శిథిలావస్థలో ఉన్నా.. వాటిపై రాజకీయాలు చేస్తూ, భక్తులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు. టీటీడీ వద్ద శిల్పకళా, ఆలయాల నిర్మాణం సంబంధించిన అన్ని వింగ్స్ ఉన్నాయని ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని ఈవో అన్నారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 10 రోజుల్లో 40.20 కోట్ల ఆదాయం కానుకలుగా సమర్పించారు. గత ఏడాది రూ. 39.40 కోట్లు, 2022లో రూ.26.61 కోట్ల ఆదాయం వచ్చింది. 10 రోజుల్లో 35.60 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని ఈవో వెల్లడించారు. -
తిరుపతిలో 2 వసతి సముదాయాలు
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో రెండు వసతి సముదాయాలను నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం జీఎస్టీ కాకుండా రూ.419.30 కోట్లతో టెండర్లను టీటీడీ పాలకమండలి ఆమోదించినట్లు తెలిపారు. తిరుమలలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి సత్రం (రెండోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం (మూడోసత్రం) స్థానంలో జీఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లను ఆమోదించినట్లు వివరించారు. రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు పాలకమండలి తీసుకున్న ముఖ్య నిర్ణయాలు.. ♦ టీటీడీ ఉద్యోగులకు సంబంధించి మొదటిదఫా డిసెంబరు 28న 3,518 మందికి, రెండోదఫా జనవరి మొదటి వారంలో 1,500 మందికి ఇళ్లస్థలాల పంపిణీ. ♦ మూడోదఫా ఫిబ్రవరిలో 5 వేల మందికి లబ్ధి చేకూరేలా ఏర్పేడు సమీపంలోని పాగాలి వద్ద 350 ఎకరాల భూమి సేకరణకు కలెక్టర్‌కు ప్రతిపాదన. ♦ ఇళ్లస్థలాలను ప్రభుత్వం నుంచి టీటీడీ కొనుగోలు చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. æ శ్రీవారి పోటు కార్మికులకు వేతనం మరో రూ.10 వేలు పెంపు ♦ వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి తగిన వేతనం పెంపు. ♦ టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంపు. ♦ ఇప్పటికే స్కిల్డ్ కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.18,500 , సెమీస్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు, అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ.10,340 నుంచి రూ.15 వేలకు పెంపు. ♦ కల్యాణకట్టలో విధులు నిర్వర్తిస్తున్న పీస్‌రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేల కనీస వేతనం. ♦ ఫిబ్రవరిలో తిరుమలలో పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సు ♦ వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయ అర్చక కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న పెద్దజీయర్ మఠానికి రూ.60 లక్షలు, చిన్నజీయర్ మఠానికి రూ.40 లక్షల ఆర్థిక సహకారం పెంపు. భగవద్గీత, గోవింద కోటి పుస్తకాల ఆవిష్కరణ శ్రీ భగవద్గీత, స్థానిక ఆలయాల క్యాలెండర్లు, గోవింద కోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సనాతన ధర్మం పట్ల, మానవీయ, నైతిక విలువల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సరళమైన భాషలో సులభంగా అర్థమయ్యేలా 20 పేజీలతో కూడిన భగవద్గీత లక్ష పుస్తకాలను టీటీడీ ముద్రించింది. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లిష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 20 వేల పుస్తకాల వంతున ముద్రించిన భగవద్గీతను ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వనున్నారు. -
10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని డిసెంబర్ 23 నుంచి జనవరి 1 (10 రోజులు) వరకు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో డిసెంబర్ 22 నుంచి 4,23,500 టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లి, జీవకోనలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలు, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద టోకె¯న్లు ఇవ్వనున్నట్లు వివరించారు. టోకెన్లు ఉన్నవారిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు, డిసెంబర్ 31, జనవరి 1న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9–11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని స్వర్ణ రథంపై మాడ వీధుల్లో ఊరేగిస్తామని తెలిపారు. వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారికి ఉదయం 4.30 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనాన్ని నిర్వహిస్తామని చెప్పారు. తిరుమలలో గదులు పొందిన భక్తులు కాష¯Œన్ డిపాజిట్ స్థితిని తెలుసుకునేందుకు టీటీడీ వెబ్సైట్లో కాషన్న్డిపాజిట్ రీఫండ్ ట్రాకర్‌ను పొందుపరిచినట్లు చెప్పారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
సాక్షి, తిరుపతి: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రధాని మోదీ ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి సోమవారం ఉదయం 9 గంటలకు మహాద్వారం వద్దకు చేరుకోగా, అర్చకులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వేదపండితులు ఆలయ మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశించిన ప్రధాని ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం బంగారు వాకిలి ద్వారా గర్భగుడిలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వైభవం, ప్రాశస్త్యం గురించి ప్రధానికి ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ఆలయ జీయర్లు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం వకుళామాతను ప్రధాని దర్శించుకున్నారు. అక్కడి నుంచి విమాన ప్రాకారం మీదుగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత వెండివాకిలి మీదుగా వెలుపలకు వచ్చిన ప్రధాని ధ్వజస్తంభాన్ని మొక్కారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా, భూమన కరుణాకరరెడ్డి, ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, టీటీడీ 2024 క్యాలెండర్, డైరీ, పంచగవ్యాలను అందజేశారు. అక్కడి నుంచి అతిథి గృహానికి చేరుకున్న ప్రధాని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోదీ శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి. కాగా, తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రార్థించానని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. ప్రధానికి సాదర వీడ్కోలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో మోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి వీడ్కోలు పలికారు. -
తిరుమలలో కార్తీక దీపోత్సవం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయ్యాక ఈ దీపోత్సవాన్ని కన్నుల పండువగా చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం ప్రారంభమైంది. మొదట శ్రీయోగనరసింహస్వామి ఆలయం పక్కన ఉన్న పరిమళం అర దగ్గర 100 కొత్త మూకుళ్లలో నేతి ఒత్తులతో దీపాలు వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభేరా, తాళ్లపాక వారి అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా 100 నేతి జ్యోతులను మంగళవాయిద్యాల నడుమ ఏర్పాటు చేశారు. ఈ కార్తీక దీపోత్సవంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, ఈవో ఏవీ.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో 2,030 గుండె శస్త్రచికిత్సలు
తిరుపతి తుడా/తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో రెండేళ్ల కాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2,030 మందికి గుండె శస్త్ర చికిత్సలు చేశారని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అలాగే ఎనిమిది మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా, ఏడు విజయవంతమయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డితో కలిసి ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లల కోసం ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో ఈ ఆస్పత్రిని ప్రారంభించారని తెలిపారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి నేతృత్వంలో 15 మంది వైద్య బృందం శస్త్రచికిత్సల్లో 95 శాతం సక్సెస్ రేట్ సాధించడం అభినందనీయమన్నారు. ఇటీవల రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు అందుకోవడం అందుకు నిదర్శనమన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో 350 పడకలతో సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. అనంతరం గుండె మార్పిడి చేసుకున్న గుంటూరుకు చెందిన సుమతి(31), కైకలూరుకు చెందిన కరుణాకర్(39)ను డిశ్చార్జి చేశారు. కాగా, అలిపిరి నడకమార్గం ప్రారంభంలో పాదాల మండపం వద్ద ఉన్న ఒక విశ్రాంతి మండపం కూలిపోయే స్థితిలో ఉందని, మరమ్మతులు చేయడానికి వీలు లేకపోవడం వల్ల పునర్నిర్మాణం తప్పనిసరి అని సాంకేతిక నిపుణులు నివేదిక సమర్పించారని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మండపం నిర్మాణం విషయమై కొందరు వ్యక్తులు పురావస్తు శాఖ అనుమతి తీసుకుని నిర్మించాలని వ్యక్తీకరించారని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని, పురావస్తు శాఖ అనుమతి అవసరమా లేదా తెలియజేయాలని కోరామని తెలియజేశారు. -
భానుప్రకాష్ రెడ్డిపై టీటీడీ ఈవో ఫైర్..
-
10న ఆన్లైన్లో 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు
తిరుమల: డిసెంబర్ 23–జనవరి1 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను (రోజుకు 2 వేల టికెట్లు) నవంబర్ 10న ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో చెప్పారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 100 కౌంటర్లలో డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకుగాను 4.25 లక్షల టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని వివరించారు. డిసెంబర్ 23–జనవరి 1 వరకు చంటి పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, ఎన్ఆర్ఐ కోటా దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టికెట్ కొనుగోలు చేయాలని, ఈ టికెట్లను పొందిన వారికి మహా లఘు దర్శనం (జయ విజయుల వద్ద నుంచి) ఉంటుందని చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 10–18 వరకు నిర్వహిస్తామని చెప్పారు. నవంబర్ 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని, 24న చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌లో 21.75 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా..హుండీ ఆదాయం రూ.108.65 కోట్లు లభించిందన్నారు. తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గది పొందిన వారికి అది ఖాళీ చేసిన గంటలోపు, క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి 3–7 పని దినాల్లోపు కాషన్ డిపాజిట్‌ను జమ చేస్తామని చెప్పారు. స్వామి వారి సేవలో ప్రముఖులు శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అక్టోపస్ అడిషనల్ డీజీ (ఆపరేషన్) ఆర్కే మీనన్ శుక్రవారం దర్శించుకున్నారు. -
స్వర్ణరథంపై శ్రీనివాసుడి వైభవం
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించాడు. మంగళవాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం సాగింది. రాత్రి మలయప్ప స్వామి అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులను పరవశింపజేశారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, తిరుమల చిన్న జీయర్‌స్వామి, చైర్మన్ భూమన దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, బోర్డు సభ్యులు, జేఈవో సదా భార్గవి ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు సోమవారం ఉదయం 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం స్నపన తిరుమంజనం వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఇది ముగిశాక శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి చక్రస్నానం చేపడతారు. రాత్రి ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, టీటీడీ ముద్రించిన 6 పేజీల ప్రత్యేక కేలండర్‌ను చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి అశ్వ వాహనం ఎదుట ఆవిష్కరించారు. రూ.450 విలువైన ఈ కేలండర్‌ను 50 వేల కాపీలను టీటీడీ ముద్రించింది. -
తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి తిరుమల: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇక, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేక దర్శనాలు రద్దు.. ►నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ►అక్టోబరు 19న గరుడసేవ, ►20న పుష్పక విమానం, ►22న స్వర్ణరథం, ►అక్టోబర్ 23న చక్రస్నానం ►అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతి లేదు. ►3,500 మంది పోలీసులు, 1500 విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ►గడ్డ వాహనానికి అదనపు భద్రత ►భక్తులందరికి గరుడోత్సవం దర్శనానికి టీటీడీ ప్రత్యేక కార్యాచరణ ►రెండు లక్షలమంది గ్యాలరీలో వాహనా సేవలు వీక్షించేలా చర్యలు ►నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటలు వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఊరేగింపు ►నవరాత్రి బ్రహ్మోత్సవాలలో రథోత్సవానికి బదులుగా బంగారు తేరు ►ధ్వజారోహణ ఉండదు సర్వ దర్శనానికి 8 గంటలు.. ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 72,230 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామి వారికి తలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య 27,388. బుధవారం స్వామి వారి హుండీ అధాయం 3.74 కోట్లుగా ఉంది. -
అంగరంగ వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమల: అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయన్నారు. అక్టోబరు 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో చెప్పారు. అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరన్నారు. జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవీ ముంబయిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం.. నవీ ముంబయిలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమలలోని సింఘానియా గ్రూప్‌తో టీటీడీ ఎంఓయూ కుదుర్చుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, రేమాండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈవో మాట్లాడుతూ.. ముంబయి ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిరి్మంచేందుకు ఓ దాత ముందుకొచ్చారని తెలిపారు. -
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమల: అక్టోబర్ 15–23 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 14న అంకురార్పణ చేయనున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల తేదీల్లో అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశామన్నారు. తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15వ తేదీల్లో ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబోమని చెప్పారు. 29న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి తిరిగి 29న తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తామని చెప్పారు. గ్రహణం కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి 29న ఉదయం 9 గంటలకు తెరుస్తామన్నారు. తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేస్తున్నట్లు చెప్పారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వారికి ఖాళీ చేసిన గంటలోనే రీఫండ్ ప్రక్రియను మొదలుపెడతామని, అయితే ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరడానికి 3–7 పనిదినాలు పడుతుందన్నారు. సెపె్టంబర్లో శ్రీవారిని 21.01 లక్షలు మంది దర్శించుకున్నారని, హుండీలో రూ.111.65 కోట్లు వేశారని చెప్పారు. -
తిరుమల: అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు
సాక్షి, తిరుపతి: తిరుమల అలిపిరి మెట్లమార్గంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ఏ.వీ. ధర్మారెడ్డి తెలిపారు. కుడి వైపు ఉన్న రాతి మండపం రిపేరు చేయడానికి కూడా వీలు లేకుండా శిథిలావస్థకు చేరుకుందని వెల్లడించారు. రాతి మండపం రాళ్ళు పునర్నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. ఇదే కాకుండా శిథిలావస్థకు చేరిన తిరుమలలోని పార్వేట మండపాన్ని కూల్చి పునర్నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన రాతి మండపాలపై సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. 16వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు నిర్మాణం చేసిన.. రాతి మండపాలను యథావిధిగా రూ.1.36 లక్షలు వెచ్చించి 20 పిల్లర్లతో పునర్ నిర్మాణం చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నడక మార్గంలో చిరుతలు సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నామని వెల్లడించారు. కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదని అన్నారు. అటవి జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, సి.సి కెమెరాలుతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు -
కొండంత భక్తి!
తిరుమల: తమిళనాడు వాసులకు పవిత్రమైన పెరటాసి మాసం ఓ వైపు, మరోవైపు అక్టోబర్ 2 వరకు వరుస సెలవులు రావడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వీ వేద వర్సిటీ వరకు తమిళనాడు నుంచి వచ్చిన బస్సులు నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రోడ్డుకిరువైపులా బస్సులు బారులు తీరాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి షెడ్లలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి 5 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తోన్న సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. క్యూల్లో ఉన్నవారికి అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. 2,500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందిస్తున్నారు. సెపె్టంబర్ 30 నాటికి శ్రీవారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు 48 గంటల సమయం పడుతోంది. టీటీడీ రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ఈ విషయమై పలు భాషల్లో ప్రకటనలు చేస్తోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఎస్ఎస్డీ టోకెన్ల రద్దు పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా అధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు చేసింది. తిరుపతిలో అక్టోబర్ 1, 7, 8, 14, 15వ తేదీల్లో ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయబోమని టీటీడీ తెలిపింది. -
తిరుమల ఘాట్ రోడ్లలో ఆంక్షల సడలింపు
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. అక్టోబర్ 14న అంకురార్పణ, అక్టోబర్ 15–23 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సంసిద్ధతపై శాఖల వారీగా అధికారులతో ఈవో సమీక్షించారు. వైభవంగా పౌర్ణమి గరుడసేవ తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారిఆలయ సమీపంలో విమానాలు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో పైనుంచి విమానం మరోమారి వెళ్లిన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఉదయం 6.30, 8.15 గంటల సమయంలో విమానాలు ఆలయం పైభాగాన సమీపంలో వెళ్లాయి. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమలపై ఎటువంటి విమానాలు వెళ్ళకూడదు. అయితే తరచూ తిరుమల పైభాగంలో పలు విమానాలు వెళుతున్నాయి. ప్రస్తుతం విమానాలు తిరుమలపై వెళ్లడంపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు. -
తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల: తిరుమల తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఆహారం, పాలు, కాఫీ, టీ, తాగునీరు అందుతున్నాయా లేదా..? అని గ్యాలరీల్లోని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కాసేపు ముచ్చటించారు. గ్యాలరీలో వేచి ఉండే ప్రతి భక్తుడికి గరుడ వాహనంపై ఉన్న మలప్ప స్వామి వారి దర్శనం చేయిస్తామని ఈ సందర్భంగా ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అన్నారు. గ్యాలరీల్లో లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నప్పటికీ వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 'నేను చాలామందితో మాట్లాడాను. అందరు కూడా టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు' అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాారు. ఇదీ చదవండి: ‘చంద్రయాన్–3’ ఓ అద్భుతం -
చంద్రగిరిలో 1,060 భారీ వినాయక విగ్రహాల పంపిణీ
తిరుపతి రూరల్: వినాయక చవితిని పురస్కరించుకుని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో పేపర్, బంకమట్టితో తయారు చేసిన 1,060 భారీ వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని తిరుచానూరు మార్కెట్ యార్డులో శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు చేసి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని పల్లెలకు చెందిన యువకులు స్థానికులతో కలిసి వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు సంకల్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇలా విగ్రహాల కోసం 1,060 వినతులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దృష్టికొచ్చాయి. దాదాపు 25 వేల మంది యువత ఇందులో భాగస్వాములవుతున్నారు. పల్లెల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించడంతో పాటు యువతను ఆధ్యాత్మికత వైపు నడిపించాలని గత 15 ఏళ్లుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి.. వినాయక విగ్రహాలను సొంత నిధులతో తయారు చేయించి ఉచితంగా అందిస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు చెందిన నిపుణులైన 160 మంది కార్మికులు ఏడు నెలలుగా నిర్విరామంగా శ్రమించి వీటిని తయారు చేశారు. ప్రతి సచివాలయానికి పది చొప్పున పల్లెలకు పంపించేందుకు సిద్ధం చేసిన విగ్రహాలతో కూడిన వాహనాలను ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్ మోహిత్‌రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. వీటిని తీసుకెళ్లేందుకు నియోజకవర్గంవ్యాప్తంగా దాదాపు 25 వేల మంది యువకులు విగ్రహాల పంపిణీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సాటి మరెవరూ లేరని కొనియాడారు. హిందూ ధర్మాన్ని పెంపొందించేలా చెవిరెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. కాగా, మట్టి విగ్రహాలను ఆదివారం నియోజకవర్గంలో ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. -
తిరుమలలో బ్రహ్మోత్సవం సందడి
తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు అవుతోంది. తిరుమల జీఎన్సీ టోల్ గేట్ నుంచి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలోని పార్కులు, ఆస్థాన మండపాలు, అన్నదాన సత్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, మాడవీధులు విద్యుద్దీపాలంకరణతో కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రధాన సర్కిళ్లలో ఎటు చూసినా దేవతామూర్తుల భారీ కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా ఎల్ఈడీ విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కల్యాణ వేదిక వద్ద భక్తులకు కనువిందు చేసేలా స్వామివారి పాదాలను ఏర్పాటు చేశారు. అనంతపద్మనాభ స్వామి నమూనా ఆలయాన్ని కళ్లు చెదిరేలా ఏర్పాటు చేశారు. ఇసుకతో స్వామివారి ముఖచిత్రాలను కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. గరుడ సేవ రోజున సంతృప్తికర దర్శనం: ఈవో ధర్మారెడ్డి తిరుమలలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తులందరూ సంతృప్తికరంగా వాహన సేవను దర్శించుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల మొదటిరోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారని తెలిపారు. గరుడసేవ నాడు దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని చెప్పారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి రెండు గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని వివరించారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వాహనసేవ వీక్షణకు టీటీడీ చర్యలు
సాక్షి, తిరుమల: తిరుమలలో బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. భక్తులు వాహనసేవ వీక్షించడానికి మాడవీధులను పరిశీలించినట్టు చెప్పారు. కాగా, ఈవో ధర్మారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 18వ తేదీన రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గరుడోత్సవం రోజు దగ్గరంగా వాహనసేవను వీక్షించడానికి మాడవీధులను పరిశీలించామన్నారు. గ్యాలరీలలో 2 లక్షల మంది భక్తులు వాహనసేవలు వీక్షిస్తారు. అందరూ వాహనసేవలు వీక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. మరోవైపు.. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల నిమిత్తం అదనంగా మరో 100 ఎకరాల భూమి కేటాయింపుపై మంత్రి రోజాతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చర్చించారు. పాధిరేడు అరణ్యం వద్ద గతంలో 300 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో నగరిలోని తన నివాసం వద్ద భూమనను మంత్రి రోజా సత్కరించారు. ఇది కూడా చదవండి: ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ -
బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అష్టవినాయక అతిథిగృహంలో గదులను సాధారణ భక్తులకు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నాం. వాహనసేవలతో పాటు సంతృప్తికరంగా శ్రీవారి దర్శన టికెట్లు. అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. త్వరలో తిరుచానూరులో మహా వరుణయాగం ఉంటుంది. అష్ట వినాయక అతిథిగృహాంలో గదులను సాధారణ భక్తులకు కేటాయిస్తాం. వికాస్ నిలయంను ఆధునీకరించి భక్తులకు అందుబాటులోకి తెస్తాం. స్వామివారి అభిషేకానికి కావాల్సిన నెయ్యి తిరుపతి గోశాల నుంచే వస్తోంది. వచ్చే ఏడాదికి గోశాలలో నెయ్యి ప్లాంట్ సిద్ధం చేస్తాం. ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 22.25 లక్షలు. ఆగస్టు నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.085కోట్లు. ఆగస్టు నెలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 9.07లక్షలు. ఆగస్టు నెలలో లడ్డూ విక్రయాలు 1.09కోట్లు. అన్న ప్రసాదం స్వీకరించిన భక్తులు 43.07లక్షలు అని తెలిపారు. ఇది కూడా చదవండి: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్