టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సీఎం జగన్‌ పరామర్శ

CM YS Jagan Console TTD EO Dharma Reddy Family - Sakshi

సాక్షి, నంద్యాల:  టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి  కుమారుడు ఏవీ చంద్రమౌళి రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. చంద్రమౌళి హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురికావడంతో.. ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించినా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.

అయితే, చంద్రమౌళి మృతిపై ధర్మారెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ నంద్యాల జిల్లాలోని పారుమంచాల గ్రామానికి వెళ్లి.. ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా చంద్రమౌళి రెడ్డి అకాల మరణంపై సీఎం జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమౌళి రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

మరోవైపు.. చంద్రమౌళి రెడ్డి హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి, కుటుంబ సభ్యులకు గవర్నర్  హరిచందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top