ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు

Everything is Ready for Elections Says Collector Dharma Reddy - Sakshi

దివ్యాంగులను తరలించేందుకు ప్రత్యేక వాహనాలు

ఓటర్లు ప్రలోభాలు, బెదిరింపులకు లోనుకావద్దు

48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాలి

బూత్‌స్థాయి అధికారుల 

సమావేశంలో కలెక్టర్‌ ధర్మారెడ్డి

సాక్షి, నర్సాపూర్‌రూరల్‌:  పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. నర్సాపూర్‌లోని ఆనంద్‌ గార్డెన్‌లో ఎన్నికల బూత్‌స్థాయి అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ యూనిట్, కంట్రోల్‌ యూనిట్, వీవీప్యాట్లను కేటాయించినట్లు తెలిపారు. దివ్యాంగులను వాహనాల్లో తరలించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్‌ మెటీరియల్‌ను తరలించేందుకు రూట్‌మ్యాప్‌ను రూపొందించుకొని అదే విధంగా ఎన్నికల సమయంలో అన్ని పోలింగ్‌ కేంద్రాలకు మెటీరియల్‌ చేరే విధంగా అధికారులు సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికల అధికారులందరూ తమకు కేటాయించిన వాహనాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓటర్ల జాబితాను అందించాలని సూచించారు. దివ్యాంగులకు, గర్భిణులకు ర్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. స్వేచ్ఛగా ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.  ప్రలోభాలు, బెదిరింపులకు లోనుకావద్దని సూచించారు.  సువిధ వెబ్‌సైట్‌ ద్వారా సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌లో కనీసం 48గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికలకు 48గంటల ముందు కాని ప్రచారాన్ని ముగించాలన్నారు. డిసెంబర్‌7న జరిగే ఎన్నికలకు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే పోలింగ్‌ కేంద్రాలకు  ఓటర్లను అనుమతిస్తారని సమయం ముగిసిన తర్వాత ఎవరు వచ్చిన ఓటువేసే అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, బీఎల్‌లో సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top