అస్సాంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హిమాంత్ బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గం తనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయరన్నారు. వారికి ఓటుకు రూ.లక్ష ఇచ్చినా తనను ఎన్నుకోవడానికి మెుగ్గుచూపరన్నారు. ఈ మేరకు జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శుక్రవారం జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు ఇటీవల బిహార్‌లో ఓటర్లను ఆకర్షించడానికి అక్కడి సీఎం నితీశ్ కుమార్ ప్రవేశ్ పెట్టిన విధంగా మీరెమైనా అస్సాంలో పథకాలు తీసుకొస్తారా అని సీఎంను ప్రశ్ని్ంచారు. దానికి సీఎం బదులిస్తూ "నేను రూ.10 వేలు కాదు రూ.లక్ష ఇచ్చినా ఆ రాష్ట్ర ముస్లింలు నాకు ఓటెయ్యరు. వారు కావాలంటే నా కిడ్నీని దానంగా ఇస్తా కానీ వారు నాకు ఓటెయ్యరు" అని అన్నారు. ప్రస్తుతం ఓట్లనేవి పథకాలు, అభివృద్ధి బట్టి కాకుండా ఐడీయాలజీ ప్రకారం వేస్తున్నారని హిమంత్ అన్నారు.
అస్సాంలోకి చాలా మంది అక్రమంగా ప్రవేశిస్తున్నారని హిమంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో 38 శాతం ఉన్న ముస్లింల జనాభా 2027 వరకూ 40 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. 1961 నుంచి ఆ కమ్యూనిటీ దశాబ్ధ జనాభా వృద్ధిరేటు 4-5శాతం నిరంతరాయంగా పెరుగుతూ ఉందని అన్నారు. ఒకవేళ ముస్లింల జనాభా రాష్ట్రంలో 50శాతం దాటితే వేరే మతాల ప్రజలు రాష్ట్రంలో నివసించలేరని హిమంత్ బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ముస్లిం ప్రజలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. వారు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం అక్కడ విజయం సాధించిందన్నారు.


