కాంగ్రెస్ ఎంపీ ఎంపీ శశిథరూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయనకు ప్రకటించిన వీర్ సావర్కర్ అవార్డును తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అసలు ఆ పురస్కారాన్ని ఎందుకు ప్రదానం చేస్తారో తనకు తెలియదని దాని గురించి ఎటువంటి సమాచారం లేదని మీడియాతో అన్నారు.
వీర్ సావర్కర్ అవార్డు ప్రకటించడంపై ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ "మీడియా ప్రతినిధుల ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. నేను నిన్న కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు నన్ను ఈ విషయం అడిగారు. అప్పుడు ఈ అవార్డు నాకు ప్రకటించారని, ఢిల్లీలో ఈ రోజు దానిని అందుకోవాలని తెలిసింది. అవార్డు ఇచ్చే సంస్థ కనీసం నన్ను సంప్రదించకుండా నాకు అవార్డు ప్రకటించడం మంచి పద్దతి కాదు. ఇది చాలా నిర్లక్షమైన చర్య" అని శశి థరూర్ అన్నారు.
అసలు ఆ అవార్డు యెుక్క ఉద్దేశం ఏమిటో? దానిని ఎందుకు ఇస్తారో తెలియకుండా.. పురస్కారం తీసుకునే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతోంది అర్ధం కావడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నలనుద్దేశించి శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. వీర్ సావర్కర్ ఇంపాక్ట్ అవార్డు-2025 ను హైరేంజ్ రూరల్ సొసైటీ అనే ఎన్జీవో సంస్థ అందిస్తుంది. ఈ పురస్కారాన్ని సమాజాన్నిప్రభావితం సాంస్కృతిక కృషి చేసిన వ్యక్తులకు అందిస్తారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు.
కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్ తీరుపై ఆ పార్టీ అధిష్ఠానం కొంత అసహానంతో ఉంది. ఈ మధ్య కొన్ని సార్లు కేంద్రానికి మద్దతుగా శశిథరూర్ మాట్లాడారు. దీంతో ఆయన వ్యవహారంపై కాంగ్రెస్ కొంత కోపంగా ఉంది.


