సాక్షి సూరత్: గుజరాత్ సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ స్తానికంగా ఉన్నరాజ్ టెక్స్‌టైల్స్ మిల్లులో భారీగా మంటలు చెలరేగాయి. కంపెనీ ఏడవ అంతస్తులో భారీగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


