టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం | Massive Fire Accident in Toli Chowki | Sakshi
Sakshi News home page

టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం

Mar 14 2026 7:07 AM | Updated on Mar 14 2026 10:35 AM

Massive Fire Accident in Toli Chowki

సాక్షి,హైదరాబాద్ : టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చారిత్రక కుతుబ్‌షాహీ సమాదులైన సెవెన్‌టూంబ్స్ సబ్‌స్టేషన్ పక్కనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో వాణిజ్య సముదాయాల్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పాయి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే మసీదు ఉంది రంజాన్ మాసం కావడంతో వందల సంఖ్యలో ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement