భారీ ‘కల్తీ ముఠా’ గుట్టురట్టు (ఫోటోలు) | Hyderabad Fake Ghee Network Busted, Officials Crack Down On Adulterated Ghee Racket, Check Out Photos Inside | Sakshi
Sakshi News home page

భారీ ‘కల్తీ ముఠా’ గుట్టురట్టు (ఫోటోలు)

Aug 19 2026 8:17 AM | Updated on Aug 19 2026 11:09 AM

Major Adulteration Racket Busted Photos1
1/15

హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ కల్తీ నెయ్యి నెట్‌వర్క్‌పై హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగం హెచ్‌–ఫాస్ట్, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు.

Major Adulteration Racket Busted Photos2
2/15

హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఒకేసారి 130 ప్రాంగణాల్లో (39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ దుకాణాలు) ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కల్తీ నెయ్యి దందాను బట్టబయలు చేశారు.

Major Adulteration Racket Busted Photos3
3/15

ఈ దాడుల్లో దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యి, దానికి ఉపయోగించే ముడి పదార్థాలు, హానికర రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Major Adulteration Racket Busted Photos4
4/15

కల్తీ నెయ్యితో శరీరంలో బ్యాడ్‌ కొలె్రస్టాల్, ట్రాన్స్‌ఫ్యాట్స్‌ పెరిగిపోయి గుండెపోటు, జీర్ణక్రియ సమస్యలు, లివర్, కిడ్నీల వైఫల్యం, చర్మ అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Major Adulteration Racket Busted Photos5
5/15

Major Adulteration Racket Busted Photos6
6/15

పాలు, వెన్న లేకుండానే పాల ఘనపదార్థాలకు పామాయిల్, గంజి పౌడర్, వనస్పతి, కృత్రిమ సువాసన రసాయనాలను కలిపి ఈ ముఠా నకిలీ నెయ్యిని తయారు చేస్తోంది.

Major Adulteration Racket Busted Photos7
7/15

కల్తీకి వాడే మిల్క్‌ క్రీమ్‌ను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి తెప్పిస్తున్నారు.

Major Adulteration Racket Busted Photos8
8/15

ఈ నెయ్యిని ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసి 100 శాతం ప్యూర్‌ నెయ్యి అంటూ మార్కెట్లోకి వదులుతున్నారు.

Major Adulteration Racket Busted Photos9
9/15

వీటిపై ఎలాంటి ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ నంబర్, బ్యాచ్‌ నంబర్, తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు లేవు.

Major Adulteration Racket Busted Photos10
10/15

ఈ ప్యాకెట్లను పూజా స్టోర్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, స్వీట్‌ షాపులు, బేకరీలు, ఆయుర్వేద మందుల దుకాణాలు, డెయిరీ షాపులు, స్టార్‌ హోటళ్లు, కేటరర్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

Major Adulteration Racket Busted Photos11
11/15

కెమికల్‌ ల్యాబ్‌ టెస్టుల్లో దొరక్కుండా ఉండేందుకు బీటా కెరోటిన్, ఎసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్, లాక్టిక్‌ యాసిడ్‌లని ఈ కల్తీ నెయ్యిలో కలిపి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Major Adulteration Racket Busted Photos12
12/15

Major Adulteration Racket Busted Photos13
13/15

Major Adulteration Racket Busted Photos14
14/15

Major Adulteration Racket Busted Photos15
15/15

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement