విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఆదివారం సాయంత్రం అరుదైన సన్నివేశం కనిపించింది.
సముద్రం దాదాపుగా 400 మీటర్లు దూరం వెనక్కి వెళ్లింది. సాధారణంగా ఆర్కే బీచ్ వద్ద అలలు ఎగసిపడుతూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తుంటాయి.
దీంతో సముద్రం లోపల ఉండే శిలలు బయటపడ్డాయి. దీంతో బీచ్ చూడ్డానికి వచ్చిన పర్యాటకులు.. వాటిపై నిలబడి సెల్ఫీలు దిగారు.
అయితే విశాఖపట్నంలో సముద్రం ఇలా వెనక్కి వెళ్లడం ఇదేమీ కొత్త కాదు.


