శబరిమల: హైకోర్టు పర్యవేక్షణలో పూజారుల ఎంపిక | Sabarimala Selection of priests under the supervision of the High Court | Sakshi
Sakshi News home page

శబరిమల: హైకోర్టు పర్యవేక్షణలో పూజారుల ఎంపిక

Oct 3 2026 9:05 AM | Updated on Oct 3 2026 9:05 AM

Sabarimala Selection of priests under the supervision of the High Court

తిరువనంతపురం: రాబోయే యాత్రా కాలానికి శబరిమల  అయ్యప్ప స్వామి ఆలయం, మలికప్పురం ఆలయానికి ప్రధాన పూజారి ఎంపిక ప్రక్రియను ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి)వేగవంతం చేస్తోంది. ఇప్పటివరకు అందిన 78 దరఖాస్తుల (శబరిమలకు 48 , మాలికపురానికి 30) పరిశీలన అనంతరం శబరిమలకు ఐదుగురు అభ్యర్థులను, మలిక్కాప్పురానికి ముగ్గురిని ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేశారు. కొంతమంది అభ్యర్థులు రెండు జాబితాలలోనూ ఉండటంతో, ప్రస్తుత షార్ట్ లిస్ట్‌లో ఐదుగురు అభ్యర్థులు మిగిలారు.

ఎంపిక ప్రక్రియలో భాగంగా దేవస్థానం విజిలెన్స్ ఎస్పీ అభ్యర్థుల అనుభవ ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోజువారీ పూజలు నిర్వహించేందుకు అభ్యర్థులకు కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలని నిర్దేశించారు. వీరి ఎంపిక కమిటీలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు, ఇద్దరు బోర్డు సభ్యులు, దేవస్వం కమిషనర్, తాళమోన్ మఠానికి చెందిన సీనియర్, జూనియర్ అధి​కారులు ఉంటారు. హైకోర్టు నియమించిన పరిశీలకుడు, కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.జి. అరుణ్ కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల అర్హత, అనుభవం ధృవీకరించేందుకు ఎంపిక ప్రక్రియ నిశిత పర్యవేక్షణలో సాగనుంది. ఈ ఇంటర్వ్యూలను అక్టోబర్ 5న తిరువనంతపురంలోని టీడీబీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించాలని, అనంతరం సన్నిధానంలో లాటరీ ద్వారా తుది ఎంపిక జరగాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ ఇంటర్వ్యూలో 90 మార్కులు ఉంటాయి. సాధారణ పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసానికి 30 మార్కులు, సంస్కృతం, పూజ,తాంత్రిక కర్మకాండలకు 60 మార్కులు ఉంటాయి.

ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డ్ చేస్తారు. కోర్టు నియమించిన పరిశీలకుడు ఇంటర్వ్యూలను, తదనంతరం జరిగే లాటరీని పర్యవేక్షిస్తారు. తుది డ్రా కోసం పండలం ప్యాలెస్ నామినేట్ చేసిన 10 సంవత్సరాల లోపు బాలుడు శబరిమల డ్రాను నిర్వహిస్తాడు. అదే ప్యాలెస్ నామినేట్ చేసిన 10 సంవత్సరాల లోపు బాలిక మలిక్కాప్పురం డ్రాను నిర్వహిస్తుంది. రికార్డింగ్‌లు, మార్కుల జాబితాలను అక్టోబర్ 15 లోగా సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించాలని టిడిబిని ఆదేశించారు.

ఇదీ చదవండి: చికిత్సకు తెచ్చిన తోపుడు బండిపైనే మృతదేహాన్ని తోసుకుంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement