పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు.. ప్రభుత్వ నిర్ణయం | Small Savings Scheme Interest Rates Unchanged PPF Sukanya Samriddhi Rates Same | Sakshi
Sakshi News home page

పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు.. ప్రభుత్వ నిర్ణయం

Oct 1 2026 5:18 AM | Updated on Oct 1 2026 5:29 AM

Small Savings Scheme Interest Rates Unchanged PPF Sukanya Samriddhi Rates Same

న్యూఢిల్లీ: వరుసగా పదో త్రైమాసికంలోనూ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా కేంద్రం యథాతథంగా కొనసాగించింది. అక్టోబర్‌ 1 నుంచి మొదలై డిసెంబర్‌ 30తో ముగిసే త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.

దీని ప్రకారం వడ్డీ రేట్లు సుకన్య సమృద్ధి పథకంపై 8.2 శాతంగా, మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై 7.1 శాతంగా, పీపీఎఫ్‌పై 7.1 శాతంగా, పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ పథకాలపై 4 శాతంగా, కిసాన్‌ వికాస్‌ పత్రాలపై 7.5 శాతంగా ఉంటాయి. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటు 7.7 శాతంగా కొనసాగుతుంది. కేంద్రం చివరిసారిగా 2023–24 నాలుగో త్రైమాసికంలో కొన్ని స్కీములపై రేట్లను సవరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement