సంచలనం రేపిన మీరట్ బ్లూ డ్రమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2025 మార్చిలో హత్యకు గురైన మర్చంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో ముస్కాన్, సాహిల్‌లను మీరట్ జిల్లా కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది.ఈ హత్య ముందుగా ప్లాన్ చేసుకుని జరిగిందని, నేరం చేయడానికి ముందు నిందితుడు ఒక కత్తి, రేజర్, సిమెంట్, ఇసుక, ఒక పెద్ద నీలిరంగు డ్రమ్‌ను కొనుగోలు చేశాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ప్రాసిక్యూషన్ మరణశిక్ష విధించాలని కోరుతోంది. అయితే పదిహేను రోజుల తర్వాత శిక్ష ఖరారు కానుంది.
మీరట్‌లో జరిగిన ఒక హత్య కేసులో కాంక్రీటుతో నింపిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ ప్రధాన ఆధారంగా, అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారిన పదమూడు నెలల తర్వాత, స్థానిక న్యాయస్థానం బుధవారం అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలను దోషులుగా నిర్ధారించింది. 126 విచారణలు, 22 మంది సాక్షుల వాంగ్మూలాల తర్వాత, జిల్లా జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా, రస్తోగి శుక్లాలు 29 ఏళ్ల మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేయడానికి కుట్ర పన్ని, అతని శరీర భాగాలను కాంక్రీటు, ఇసుక ఉపయోగించి ఒక నీలిరంగు పారిశ్రామిక డ్రమ్‌లో దాచిపెట్టారని తేల్చి చెప్పారు.
District Judge Arvind Kumar Mishra of Meerut District Court has convicted Sahil and Muskan in the sensational 'blue drum' murder case, involving the gruesome killing of Merchant Navy worker Saurabh Rajput.
Court recorded the statements of more than 22 witnesses over the course… pic.twitter.com/HZxyKEt9Ay— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) September 30, 2026
హత్య జరిగిన తీరు
మార్చి 3, 2025న ముస్కన్ రస్తోగి మందుస్తు ప్లాన్ ప్రకారం భర్త సౌరభ్ రాజ్‌పుత్‌కు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. దుర్వాసన రాకుండా ఉండటానికి మృతదేహాన్ని బాత్రూమ్‌లో ముక్కలుగా నరికి, ఒక పెద్ద నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో కుక్కారు. ఆపై ఇసుక, సిమెంట్ కలిపి డ్రమ్‌లో పోసి సీలు చేశారు.
హత్య తర్వాత వారు హిమాచల్ ప్రదేశ్‌కు పారిపోయారు. సౌరభ్ బతికే ఉన్నట్లు నమ్మించడానికి ఆయన ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపారు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులతో కలిసి మార్చి 17న ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా, ఆ డ్రమ్‌లో శవం బయటపడింది. రెండు రోజుల తర్వాత పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. షాపు యజమానులు డ్రమ్, సిమెంట్ విక్రయించినట్లు సాక్ష్యాలు ఇవ్వడం, కాల్ డీటెయిల్ రికార్డులు (CDR), టవర్ లొకేషన్లు ఈ కేసులో కీలక ఆధారాలుగా నిలిచాయి. 13 నెలల తరువాత, 126 విచారణలు, 22 మంది సాక్ష్యాలను పరిశీలించిన డిస్ట్రిక్ట్ జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా వీరిద్దరిని దోషులుగా నిర్ధారించారు. అరెస్ట్ తర్వాత జైలులో ఉండగానే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఇదీ చదవండి: అక్రమ ఆస్తుల పుట్ట : కోట్ల ఆస్తి, నగలు, నగదు, 48 లగ్జరీ వాచెస్


