92 ఏళ్ల వయసులోనూ ప్రసవాలు చేస్తున్న బామ్మ..! | Dr Suri Srimathi is still delivering babies six decades | Sakshi
Sakshi News home page

92 ఏళ్ల వయసులోనూ ప్రసవాలు చేస్తున్న బామ్మ..!

Sep 30 2026 5:44 PM | Updated on Sep 30 2026 6:03 PM

Dr Suri Srimathi is still delivering babies six decades

ఆ బామ్మే డాక్టర్ సూరి శ్రీమతి(Dr Suri Srimathi). 92 ఏళ్ల వయసులోనూ.. ఇప్పటికీ ప్రసవాలు చేస్తూనే ఉన్నారు. అరవై ఏళ్లకు పైగా ఆమె ఇదేవిధంగా చేస్తూ వస్తున్నారు. అవసరమైతే సిజేరియన్లు కూడా చేస్తారామె. ఇంత వయసులోనూ ఆమెనే స్వయంగా వాహనం నడుపుకుంటూ పనికి వెళ్తారు. ఆమె తోటి వైద్యుల అంచనా ప్రకారం..సుమారు రెండు లక్షల మంది శిశువులను ఈ భూమ్మీదకు తీసుకొచ్చారామె.

ఆమె ప్రస్థానం మొదలైందిలా..
1958లో శ్రీమతి వైద్య విద్యలో అర్హత సాధించారు. ఆ రోజుల్లో డాక్టర్‌ వృత్తిని ఎంచుకుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తుండేవారు. ఆ తర్వాత ఏడాదే సంగారెడ్డిలో ఆమె స్వయంగా తన మొదటి ప్రసవం చేశారు. ఆమె 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రశూతి, స్త్రీల వ్యాధుల విభాగంలో ఎండీ పట్టా పొందారు. 1999లో తన సొంత గృహ క్లినిక్‌ను ప్రారంభించడానికి ముందు, తెలంగాణ జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేశారు

భారతలో మాతృ సంరక్షణ ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఆమె వృత్తి జీవితం ఒక సజీవ నిదర్శనం. ఆమె వైద్య వృత్తిని ప్రారంభించిన రోజులకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఇప్పటిలా ఆధునిక పరికరాలు, వెసులబాటు తదితరాలేమి ఆనాడు లేవు ఆమెకు. అలాగే ఒక జిల్లా ఆసుపత్రిలోని వైద్యుడు ఒకేసారి అనేక నిపుణులుగా సేవలందించాల్సి వచ్చేది. 

ఎందుకంటే ఆ టైంలో తానే అనస్థీషియాలజిస్ట్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్‌గా ఉండేదాన్ని అని 1960ల నాటి రోజులను గుర్తుచేసుకుంది శ్రీమతి. ముఖ్యంగా బాల్య వివాహాలు తగ్గడం, తల్లి, శిశు మరణాలు గణనీయంగా పడిపోవడం ప్రత్యక్ష్యంగా చూశానన్నారు. అలాగే గ్రామీణ కుటుంబాలకు తగిన  సంరక్షణ అందిస్తున్న ఆశా కార్యకర్తలు, సహాయక నర్సు మిడ్‌వైఫ్‌లకే సేవలను కొనియాడారామె. 

మూడు తరాలు, ఒకే జత చేతులు
తన పిల్లలకు, వారి కుమార్తెలకు ఆపై మనవరాళ్లకు ప్రసవాలు చేయించిన ఘటన ఈ డాక్టర్‌ శ్రీమతిదే. మొత్త మూడు తరాలవారు ఆమె చేతుల మీదుగా నమ్మకమైన ప్రసవాలను చూశారు. అలాగే తన వృత్తి ప్రారంభ రోజుల్లో ఒక జంటకే పదమూడవ ప్రసవం కూడా చేశారట. 

అయితే ఇది ఇప్పుడు దాదాపు అసాధ్యం అని నవ్వుతూ చెబుతున్నారు. విశేషం ఏంటంటే 92 ఏళ్ల వయసులో కూడా ఆమె ఆపరేషన్లు కొనసాగిస్తుండటం. ఇటీవల ఆమె చేసిన ప్రసవాల్లో ఒకటి ఒకే కాన్పులో ముగ్గురి పిల్లల ప్రసవం కూడా ఒకటి.

ఈ వయసులోనూ ఎందుకంటే..
పదవీ విరమణపై ఆమెకు ఆసక్తి లేదట.ఎందుకంటే ప్రజలు సహాయం కోసం తన ఇంటి తలుపు తడుతూనే ఉంటారని, అదే ఈ పని కొనసాగించడానికి ప్రధాన కారణమని అన్నారామె. తనను కదిలించేది క్షేమంగా ఈ లోకంలోకి శిశువుని తీసుకురావడం, అలాగే తల్లిబిడ్డ నవ్వుతూ ఇంటికి తిరిగి వెళ్లడం అని అంటుందామె. ఇలాంటి ఆమె మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఉండటం నిజంగా గర్వ కారణం కదూ..!

ఇదీ చదవండి: Ravi Kishan: నటడు రవి కిషన్ డబుల్ చిన్ తగ్గించే చిట్కా..! ఇది నిజంగానే హెల్ప్‌ అవుతుందా?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement