ఫాం హౌస్‌లో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దారుణ హత్య, | Retired IAS found dead at Bhopal farmhouse caretaker emerges as prime suspect | Sakshi
Sakshi News home page

ఫాం హౌస్‌లో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దారుణ హత్య,

Sep 30 2026 3:47 PM | Updated on Sep 30 2026 3:57 PM

Retired IAS found dead at Bhopal farmhouse caretaker emerges as prime suspect

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ శివార్లలోని సూరజ్ నగర్‌లో 70 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేష్ అగర్వాల్‌ దారుణ హత్య కలకలం రేపింది.  ఫామ్‌హౌస్‌లోనే ఆయనను గొంతు కోసి హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడ దోపిడీకి ప్రయత్నించడంతోపాటు, ఇంటికి నిప్పు పెట్టాలని కూడా ప్రయత్నించినట్టు తెలుస్తోంది.

బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చిన అగర్వాల్,  తనకి సపర్యలు చేసేందుకు ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మూడు రోజుల క్రితమే వరుణ్ కుమార్ అనే మేల్ నర్స్'ను నియమించుకున్నారు. ఘటన జరిగినప్పటి నుండి అతను కనిపించకుండా పోవడంతో అతడే ప్రధాన అనుమానితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.  బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో నిద్రలేచిన ఆయన భార్య, తన గదికి బయటి నుంచి గడియ వేసి ఉండటాన్ని గమనించారు. వెంటనే సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉండే డొమెస్టిక్ హెల్ప్ రాజన్ థాపాకు ఫోన్ చేసి విషయం తెలిపారు. రాకేష్ అగర్వాల్ పడుకున్న గదికి కూడా బయటి నుంచి తాళం వేసి ఉంది. తాళం తెరిచి చూడగా ఆయన మృతి చెంది ఉన్నారు.

మరోవైపు ఇంట్లోని అల్మారాలు చిందరవందరగా పడి ఉన్నాయి, దీన్ని బట్టి దొంగతనం కోసం వెతికినట్లు తెలుస్తోంది. అలాగే ఇంటికి నిప్పు పెట్టే ఉద్దేశంతో కిచెన్‌లోని ఎల్పీజీ సిలిండర్ రబ్బరు పైప్‌ను కోసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పరారీలో ఉన్న మేల్ నర్స్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

 ఇదీ చదవండి: షాకింగ్‌ : నాలుగేళ్లుగా ప్రీజర్‌లోనే వృద్ధుడి మృతదేహం

కాగా రాకేష్ అగర్వాల్ (1982 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్) ఆర్సీవీపీ నరోన్హా అడ్మినిస్ట్రేషన్ అకాడమీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. భార్యతో కలిసి ఈ ఫామ్‌హౌస్‌‌లో ఉంటున్నారు. వీరి కుమారుడు అమెరికాలో స్థిరపడ్డారు.

ఇదీ చదవండి: తల్లి, ఆమె బోయ్‌ఫ్రెండ్‌ హత్య: 18 ఏళ్ల యువతికి 50 ఏళ్ల జైలు శిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement