ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి ఆత్మహత్య | Nidhi Tiwari, a social media influencer from Madhya Pradesh, died at the age of 30 | Sakshi
Sakshi News home page

ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి ఆత్మహత్య

Sep 28 2026 2:53 PM | Updated on Sep 28 2026 3:14 PM

Nidhi Tiwari, a social media influencer from Madhya Pradesh, died at the age of 30

భోపాల్‌ : ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి అగర్వాల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. తన కంటెంట్‌తో లక్షల మంది ఫాలోవర్స్‌,మిలియన్ల వ్యూస్‌తో ఆకట్టుకున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్యని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. 

డైమండ్‌ స్టేట్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సింగ్రౌలీ జిల్లాలోని భుసా మోడ్ ప్రాంతానికి చెందిన నిధి తివారీ. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సుపరిచితురాలు. ఆమెను సోషల్‌ మీడియాలో 16లక్షల మందికిపైగా ఫాలో అవుతుంటారు. వారిలో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు 7లక్షల మంది  ఉండగా.. 9లక్షల మంది మెటా ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఇక ఆమె సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసే వీడియోలకు మిలియన్ల వ్యూస్‌తో పాటు కామెంట్లతో ఆడియెన్స్‌కు దగ్గరవుతుంటారు. 2024 మిస్‌ ప్రెటీ ఇండియా అవార్డును సైతం దక్కించుకున్నారు. ఆ అవార్డే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. మోడలింగ్‌లో, యాక్టర్‌గా రాణించాలనే కలలు కన్నారు. ఆ దిశగా అడుగులు కూడా వేశారు. వెండితెర మినహాయించి మోడల్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా,సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరియర్‌ను కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నారని నిధి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిధి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిధి ఆత్మహత్యకు ముందు ఆమె మాట్లాడినఫోన్‌ సంభాషణలు,మరణానికి దారి తీసిన కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న మార్వా పోలిస్‌స్టేషన్‌ ఇన్‌ ఛార్జ్‌ జ్ఞానేంద్ర సింగ్‌ తెలిపారు.

నిధి అగర్వాల్‌ మరణానికి గల కారణాల్ని విశ్లేషించేందుకు ఫోన్‌ కాల్‌ రికార్డ్స్‌ను, కుటుంబ సభ్యుల నుంచి సమాచారం,సేకరించిన ఇతర ఆధారాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇక నిధి మరణ వార్తపై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణ వార్త సోషల్ మీడియాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకప్పుడు ఆమె రూపం, ఆత్మవిశ్వాసం, విజయాలను ప్రశంసిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

ఇదీ చదవండి : సింగం పోలీస్‌.. నిందితుల కోసం 40 కిలోమీటర్లు వేటాడాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement