"పరోటా వ్యాపారం: కూలీ నుంచి లక్షాధికారి"..! | Assam Man Left Security Guard Job To Build Paratha Brand Earns 50 Lakh | Sakshi
Sakshi News home page

"సెక్యూరిటీ గార్డు నుంచి పరాటా కింగ్‌ వరకు"

Sep 28 2026 11:42 AM | Updated on Sep 28 2026 11:53 AM

Assam Man Left Security Guard Job To Build Paratha Brand Earns 50 Lakh

ఓ వ్యక్తి రోజువారీ కూలీగా, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ..ఓ పెద్ద ఫుడ్‌ బ్రాండ్‌ని నిర్మించి వ్యవస్థాపకుడిగా మారాడు. అంతేగాదు నెలకు రూ. 50 లక్షలు ఆర్జించే స్థాయికి చేరుకుని యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ రేంజ్‌లో సక్సెస్‌ని అందుకునే క్రమంలో ఆ వ్యక్తి ఎన్ని ఒడిదొడుకులు ఎదర్కొన్నాడంటే..ఏకంగా కరెంట్‌ షాక్‌ బారిన పడి పక్షపాతానికి గురై కూడా లేచి నిలబడే ప్రయత్నం చేసి ఆకాశమంత సక్సెస్‌ అందుకున్నాడు. 

అతడే అస్సాంకు చెందిన పారిశ్రామిక వేత్త దిగంత దాస్‌. అతడ 2001లో పది పూర్తి అయిన వెంటనే అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు సమీపంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌ఓ)లో నిర్మాణ కార్మికుడిగా పనిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలోనే అతడు నెలకు సుమారు రూ. 1200లు సంపాదించేవాడు. ఆ తర్వాత సిక్కిం వెళ్లి అక్కడ కూడా నిర్మాణ కార్మికుడిగా పని కొనసాగించాడు. 

2011లో బెంగళూరుకి మారి అక్కడ నెలకు సుమారు రూ. 4500 జీతంతో సెక్యూరిటీగార్డుగా పనిచేశాడు. అక్కడే హోటల్‌ రూమ్‌ సర్వీస్‌ అటెండెంట్‌గా కూడా పనిచేశాడు. అయితే తక్కువ జీతాలు, ఆలస్యంగా చెల్లింపులుతో విసిగిపోయి ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు.

పరాటాల చేయడం ఎలా నేర్చుకున్నాడంటే..
2012లో దాస్‌ బెంగళూరులోని హోస్కోట్‌ ఉన్న ఐడీ ఫ్రెష్‌ఫుడ్‌లో చేరి వంటవాడిగా పనిచేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఆహార పరిశ్రమలో అనుభవం అతనికి పెద్ద ఎత్తున్న ఆహార ఉత్పత్తిని పరిచయం చేసింది. అలా అక్కడే బహుళ పొరలతో ఉండే పరోటాలను ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత దాస్‌కి పరోటా తయారీదారాడిగా పనిచేసే అవకాశం లభించింది. అలా పరాటాలు చేసే పాకనిపుణుడి చక్కటి అనుభవం గడించాడు. 

సరిగ్గా ఆటైంలో 2017లో హైవోల్టేజ్‌ విద్యుత్‌ కేబుల్‌ పడటంతో అతని ప్రయాణానికి సడెన్‌ బ్రేక్‌పడింది. పాపం దాస్‌ పక్షవాతానికి గురై కోలుకోవడానికే రెండేళ్లు పట్టింది. ఇక పూర్తిగా కోలుకున్నాక అప్పటికే పరోటా వ్యాపారంలో ఉన్న ఒక స్నేహితుడుని అస్సాంలో ఒక తయారీ యూనిట్‌ని స్థాపించడంలో తనకు సహాయం చేయమని కోరాడు. అలా 2022లో అస్సాంలో డీఎఫ్‌ఎఫ్‌(డైలీ ఫ్రెష్ ఫుడ్) అనే పేరుతో ఫ్రోజెన్‌ మలబార్‌ పరోటా వ్యాపారాన్ని ప్రారంభించాడు. అతని స్నేహితుడు యంత్రసామాగ్రిని ఏర్పాటు చేయడంలో సహాయం చేయగా, తన జీవిత పొదుపు నుంచి రూ. 7 లక్షలను వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు. 

అతను తన పరోటాలను సమీపంలోని దుకాణాలను సరఫరా చేయడం ప్రారంభించాడు. అలాగే స్థిరమైన రుచి, పరిశుభ్రత ప్రమాణాల విషయంలో రాజీపడకుండా  అందించేవాడు. చివరికి అతని కృషి ఫలించి మృదువైన కరకరలాడే పరోటాలకు తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ లభించింది. 

దాంతో ఒక్క ఏడాదిలోనే తన వ్యాపారాన్ని చాల సునాయాసంగా విస్తరించాడు. ప్రస్తుతం, డిఎఫ్‌ఎఫ్-(డైలీ ఫ్రెష్ ఫుడ్) ప్రతిరోజూ 20,వేలకు పైగా పరోటాలను ఉత్పత్తి చేస్తూ.. అస్సాంలోనే ప్రముఖ ఫ్రోజెన్ ఫుడ్ వ్యాపారాలలో ఒకటిగా నిలిచింది. అంతేగాదు ఈ వ్యాపారంతో దాస్‌ నెలకు రూ. 50 లక్షలకు పైగా సంపాదిస్తుండటం విశేషం.

ఇదీ చదవండి: దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement