యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్‌ జిహాద్‌ ఆరోపణలు కలకలం | They Will Mom Woman 22 Found Dead At Guwahati Homestay Male Friend Arrest | Sakshi
Sakshi News home page

యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్‌ జిహాద్‌ ఆరోపణలు కలకలం

Sep 26 2026 5:15 PM | Updated on Sep 26 2026 5:33 PM

They Will Mom Woman 22 Found Dead At Guwahati Homestay Male Friend Arrest

గౌహతి విశ్వవిద్యాలయానికి చెందిన సోషియాలజీ విద్యార్థిని నిమిషా ఠాకురియా అనుమానాస్పద  పరిస్థితుల్లో మరణించింది. సెప్టెంబర్ 25వ తేదీ శనివారం ఉదయం అస్సాంలోని గువాహటి, గరాల్ ప్రాంతంలోని ఒక హోమ్‌స్టేలో   శవమై తేలిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.  'లవ్ జిహాద్'  అరోపణలు మరింత తీవ్ర కలకలం రేపాయి.

నిమిషా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిందితుడు ఆసిఫ్ అలీ  (26)పోలీసులకు తెలిపాడు. అయితే, పోలీసులు ఈ వాదనను పూర్తిగా కొట్టిపారేశారు. ఇది హత్య అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నిమిషా ముఖం, తల, చేతులు, మర్మాంగాలపై గాయాల గుర్తులు ఉన్నట్లు మేజిస్ట్రేట్ విచారణలో ప్రాథమికంగా తేలిన నివేదికల నేపథ్యంలో  ఆందోళన నెలకొంది. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

చివరి కాల్‌, సంచలన ఆరోపణలు

ధారాపూర్‌కు చెందిన  నిమిషా, తన స్నేహితుడు ఆసిఫ్ అలీతో కలిసి శుక్రవారం సాయంత్రం 'రుద్రాస్ కిచెన్ హోమ్‌స్టే'కి వెళ్ళినట్టు తెలుస్తోంది. మృతురాలి కుటుంబ స్నేహితుడు గౌతమ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. అర్ధరాత్రి దాటాక సుమారు 2:00 గంటల ప్రాంతంలో నిమిషా తన తల్లికి ఫోన్ చేసి  "వాళ్ళు నన్ను చంపేస్తారు అమ్మ"  ఏడుస్తూ అని చెప్పిందని, ఆ తర్వాత ఆమె ఫోన్‌ను లాక్కుని ఉంటారని  అనుమానాన్ని  వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించేలోపే, ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మరోవైపు  హాస్టల్‌ యజమాని మాటలు  కూడా హత్య అనే అనుమానాలకు మరింత   ఊతమిస్తున్నాయి.

 

ఇదీ చదవండి : మమ్మల్ని అడ్డుకుని, గృహనిర్బంధం : మమత సంచలన వ్యాఖ్యలు


 

హోమ్‌స్టే కేర్‌టేకర్‌ వాంగ్మూలం
రాత్రి సమయంలో ఒక మగ గొంతు గట్టిగా అరుస్తూ ఎవరో లేవాలని ("దదా, ఉఠో, ఉఠో") పిలుస్తున్న శబ్దం వినిపించిందని హోమ్‌స్టే కేర్‌టేకర్‌ బిపుల్ బైలుంగ్ తెలిపారు. ఆ తర్వాత శబ్దం వచ్చిన గదికి వెళ్లి చూడగా, ఒక అబ్బాయి నేలపై పడి ఉన్న అమ్మాయిని పట్టుకుని ఉన్నాడని, వెంటనే యజమానులకు సమాచారం అందించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

'లవ్ జిహాద్' ఆరోపణలు, నిరసనలు
మృతురాలు హిందూ మతానికి చెందిన విద్యార్థిని కాగా, అరెస్టయిన ప్రియుడు ముస్లిం కావడంతో ఈ ఘటన తీవ్ర  ఉద్రికత్తతను రాజేసింది. ఇది 'లవ్ జిహాద్' కుట్ర అంటూ కొన్ని సంస్థలు రహదారిపై నిరసనలు చేపట్టాయి.  నిందితుడిని ఎన్‌కౌంటర్‌  చేయాలంటూ డిమాండ్‌ చేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఆందోళనకారులను సముదాయించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

ఇదీ చదవండి: లవర్‌తో పెళ్లి : పోలీస్‌కానిస్టేబుల్‌ని మట్టుబెట్టిన కొడుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement