సాక్షి, సత్యసాయి జిల్లా: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో కొనుగోలు చేసిన అంబులెన్స్‌లకు స్టిక్కర్లు మార్చి.. కొత్త వాహనాల మాదిరిగా ఆర్భాటంగా మంత్రి సత్యకుమార్ కార్యక్రమం ప్రారంభించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధర్మవరం పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమం వివాదాస్పదంగా మారడంతో స్థానికంగా పలువురు నేతలు, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిపై సెటైర్లు వేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2023లో కొనుగోలు చేసిన 71 అంబులెన్స్‌లను మంత్రి సత్యకుమార్ కొత్తగా జెండా ఊపి మళ్లీ ప్రారంభించారు. అలాగే 104 వాహనాలకు కొత్త స్టిక్కర్లు మార్చి వాటిని ‘ఆరోగ్య రథాలు’గా బిల్డప్ ఇచ్చారంటూ విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే వినియోగంలో ఉన్న లేదా గతంలో కొనుగోలు చేసిన వాహనాలకు కేవలం స్టిక్కర్లు మార్చి కొత్తగా ప్రారంభించడం ద్వారా కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానిక ప్రజలు ఆరోపణ చేశారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ నిర్వహించిన కార్యక్రమం నేపథ్యంలో ఈ వ్యవహారం స్థానికంగా చర్చకు దారితీసింది.
స్టిక్కర్లు మార్చి.. పెయింటింగ్ వేసి.. కొత్తవిగా ప్రారంభం
వివాదంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
108 వాహనాలకు స్టిక్కర్లు మార్చి పాత వాహనాలను ఆర్భాటంగా ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
వైఎస్ జగన్ హయాంలో 2023లో కొనుగోలు చేసిన 71 అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించిన… pic.twitter.com/8IMnkPXTyk— Telugu Feed (@Telugufeedsite) September 26, 2026
ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి బిగ్ షాక్


