మధుబాల రూ. 500 కానుక.. పూజారి సీన్‌ వైరల్‌! | Actress Madhoo Visits Lalbaugcha Raja, Video Of Her ₹500 Offering Sparks Debate On Social Media, Watch Video Inside | Sakshi
Sakshi News home page

మధుబాల రూ. 500 కానుక.. పూజారి సీన్‌ వైరల్‌!

Sep 26 2026 11:45 AM | Updated on Sep 26 2026 12:42 PM

Madhoo Offers rs 500 at Lalbaugcha Raja Viral Video

ముంబై: ప్రముఖ నటి మధుబాల వినాయక చవితి వేళ ముంబైలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా గణపతి మండపాన్ని సందర్శించి గణపయ్య ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఆమె దర్శనానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మధు సమర్పించిన రూ.500 నోటును సమీపంలో ఉన్న ఓ వ్యక్తి తీసుకుని వస్త్రం కింద పెట్టినట్లు కనిపించడం చర్చకు దారితీసింది.

గణపతికి రూ.500 సమర్పించిన మధూ షా
వైరల్ వీడియోలో మధు లాల్‌బాగ్చా రాజా వద్దకు వెళ్లి రూ.500 నోటును సమర్పించినట్లు కనిపిస్తోంది. అనంతరం ఆమె అభిమానుల వైపు తిరిగి చేతులు ఊపారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ నోటును తీసుకుని, ఓ వస్త్రం కింద పెట్టినట్లు వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాన్ని ఎవరో కెమెరాలో చిత్రీకరించడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సోషల్ మీడియా యూజర్స్‌ దీనిపై స్పందించారు.

కొందరు ఈ ఘటనను విరాళాల విషయంలో జరుగుతున్న మోసాలతో పోల్చారు. మరికొందరు ఆలయాలు, దర్గాల్లో సమర్పించే కానుకలు ఎక్కడికి చేరుతున్నాయనే అంశంపై తమ అనుభవాలను పంచుకున్నారు. మరో నెటిజన్ ‘రామాలయంలోనే దోపిడీ జరిగింది.. ఇందులో పూజారి తప్పేముంది?’ అంటూ ప్రశ్నించారు. ఇలా వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా లాల్‌బాగ్చా రాజా దర్శనానికి సంబంధించిన ఫొటోలను మధు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 


ఇదీ చదవండి: వార్తల్లో మనోజ్ తివారీ రెండో భార్య.. ఏం చేస్తుంటారంటే..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement