చండీగడ్‌లో జరిగిన దారుణ ఘటన దిగ్భ్రాంతిరేపింది. మేజర్ కాకముందే పెళ్లి వద్దు అన్నందుకు కన్నతండ్రినే హతమర్చాడో ప్రబుధ్దుడు. పోలీసు హెడ్ క్వార్టర్స్‌లోని అకౌంట్స్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న నితిన్ సింగ్ (హెడ్ కానిస్టేబుల్) కన్న కొడుకు చేతిలోనే హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసు ప్రధాన కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న నితిన్ సింగ్, శుక్రవారం నాడు సెక్టార్ 22లోని తన ప్రభుత్వ నివాసంలో తలకు తగిలిన తుపాకీ గాయంతో మరణించి కనిపించారు. అంతకు ముందు రోజు తన 18 ఏళ్ల కుమారుడు అర్మాన్‌తో ఆయనకు వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలంలో నాటు తుపాకీ (country-made pistol) లభ్యమైంది.
నితిన్ సింగ్ కుమారుడు అర్మాన్ (18) తన ప్రేయసిని వెంటనే పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అయితే, చట్టపరంగా అబ్బాయికి కనీసం 21 ఏళ్లు నిండే వరకు ఆగాలని, ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించవచ్చని తల్లిదండ్రులు చెప్పారు.అంతేకాదు పెళ్లి ఖర్చుల కోసం తన తండ్రిని ఏకండా రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ అమ్మాయిని తక్షణమే ఇంటికి తీసుకురావాలని అర్మాన్ పట్టుబట్టాడు. ఈ విషయమై గురువారం రాత్రి తల్లిదండ్రులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అర్మాన్ తన తల్లి గొంతును కూడా నులిమి చంపడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రాణభయంతో మేడపైకి పరుగెత్తి చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. ఆ తర్వాత బయటి వ్యక్తులే తన తండ్రిని హత్య చేశారని నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా, తన చేసిన తప్పుపై ఏమాత్రం పశ్చాత్తాపం చూపలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: మమత ర్యాలీకిముందు, టీఎంసీ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి!
ఈ ఏడాది ప్రారంభంలో మణిమజ్రా ప్రాంతంలో స్నేహితుడి మహీంద్రా థార్ కారును నిర్లక్ష్యంగా నడిపి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములను ఢీకొట్టి హత్య చేసిన కేసులో అర్మాన్ ఇప్పటికే అరెస్టై, బెయిల్ మీద ఉన్నాడు.


