పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై శనివారం సంచలన ఆరోపణలు చేశారు. సెరాంపూర్‌లో జరగనున్న ర్యాలీకి హాజరుకాకుండా తనను, పలువురు పార్టీ నాయకులను గృహనిర్బంధంలో (House Arrest) ఉంచారని ఆరోపించారు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, కోర్టు అనుమతితోనే తాము తలపెట్టిన ర్యాలీ నిర్ణయించినప్పటికీ బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారని మండిపడ్డారు. ర్యాలీ జరిగే ప్రదేశానికి వెళ్లే మార్గాన్ని బీజేపీ కార్యకర్తలు తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్, కారుపై రాళ్ళదాడిచేసి కొంతమంది దుండగులు అడ్డుకున్న నేపథ్యంలో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు.
15 రోజులు కోర్టులో పోరాడి, అనుమతి పొందిన తర్వాతే ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశామనీ అయితే, బీజేపీ గూండాలు రౌడీలు రోడ్డు బ్లాక్ చేసి తమని కనీసం ఇంటి బయటకు కూడా అడుగు పెట్టనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిని తానె క్కడా చూడలేదని, ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఇలాంటివి జరగవని విమర్శించారు. ర్యాలీ మార్గాన్ని బీజేపీ కార్యకర్తలు తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ఎలాంటి పోలీసు భద్రత లేకుండా తమపై దాడులు జరుగుతున్నాయని మండి పడ్డారు. యూపీ, బిహార్‌లో కూడా లేని విధంగా బెంగాల్‌లో అరాచకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోర్టు అనుమతి పొందిన ఈ ర్యాలీ జరిపి తీరుతామని, సభలో ప్రసంగించి తీరుతామని ఆమె సవాల్ విసిరారు. ర్యాలీ సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మమత ర్యాలీకిముందు, టీఎంసీ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి!
Watch: Former CM Mamata Banerjee says, "I want to tell you one thing. Today's meeting was organized after fighting in court for 15 days, and permission was obtained from the court. We are not even being allowed to step out of our house. They have kept us almost under house… pic.twitter.com/nQ7snUnvwL
— IANS (@ians_india) September 26, 2026
ఇది ఇలా ఉంటే. ఈ ఉదయం సెరాంపూర్‌లో సభకు బయలుదేరిన టీఎంసీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ కారుపై హుగ్లీ జిల్లా ఉత్తరపారాలో కొందరు నల్ల జెండాలతో వచ్చి రాళ్లు, గుడ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: లవర్‌తో పెళ్లి : పోలీస్‌కానిస్టేబుల్‌ని మట్టుబెట్టిన కొడుకు


