మమత ర్యాలీకిముందు, టీఎంసీ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి! | TMC MLA Kunal Ghosh car allegedly attacked by BJP workers with on his way to Mamatas rally | Sakshi
Sakshi News home page

మమత ర్యాలీకిముందు, టీఎంసీ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి!

Sep 26 2026 3:39 PM | Updated on Sep 26 2026 3:42 PM

TMC MLA Kunal Ghosh car allegedly attacked by BJP workers with on his way to Mamatas rally

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా ఉత్తరపారాలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ కారుపై శనివారం దాడి జరిగింది. శ్రీరామ్‌పూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.   ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది బీజేపీ గూండాల పని అని కునాల్‌ ఆరోపించారు.

సెరంపూర్‌లో మమతా  ర్యాలీకి హాజరయ్యేందుకు వెళ్తుండగా, హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారా వద్ద ఆయన కారుపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు ఘోష్ వాహనాన్ని చుట్టుముట్టి నినాదాలు  చేశారు.  కొందరు కారును కొట్టారు, గుడ్లు విసిరారు,  వెనుక విండ్‌షీల్డ్‌ను పగలగొట్టారు. ఘోష్ కోల్‌కతాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది.  కర్రలు, రాడ్లు, నల్లటి పోస్టర్లతో వచ్చిన ఒక గుంపు తన కారును అడ్డగించి, రాళ్లు, గుడ్లతో దాడి చేసిందని కునాల్ ఘోష్ ఆరోపించారు.  ఈ దాడిలో కారు ముందు, వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయని ఆరోపించారు.  సంఘటనా స్థలంలో ఒక్క పోలీసు కూడా లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి (భవానీ భవన్) నేరుగా వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. 

 మరోవైపు ఈ దాడి వెనుక బీజేపీ కార్యకర్తలు ఉన్నారని కునాల్ ఘోష్ ఆరోపణలు బీజేపీ ఖండించింది. స్థానిక తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వర్గీయులపనే ఈ దాడి జరిగి ఉండొచ్చని బీజేపీ ప్రతినిధి దేబ్జిత్ సర్కార్ తిప్పికొట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement