సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతలు మొదలయ్యాయని.. యూరియా దొరకని రోజులు వచ్చాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారు. గణేష్ మండపాల దగ్గర కేసీఆర్ పాటలు మోత మోగాయి. కేసీఆర్‌ను మేనమామ తీరుగా ఆడపిల్లల తల్లులు యాది చేసుకుంటున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘‘రేవంత్‌రెడ్డి రైతు బంధు ఎగ్గొడుతున్నారు. పొలాల్లో మోటార్లు కాలిపోతున్నాయి. రైతు బంధు ఎగ్గొట్టిన ప్రతిసారి కేసీఆర్‌ను అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు దుష్పరిపాలన ఫలితాలు అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ అక్కర్లేదు కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పట్టు బిగిస్తున్న సీతక్క!


