‘ది ప్యారడైజ్‌’ కోసం ఈ రోజు థియేటర్‌కి వెళ్తున్నా: కేటీఆర్‌ | Ex Minister KTR Wants To Go The Paradise Movie After A Long Time | Sakshi
Sakshi News home page

‘ది ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ ఆసక్తికరమైన పోస్ట్‌

Sep 26 2026 3:32 PM | Updated on Sep 26 2026 4:17 PM

Ex Minister KTR Wants To Go The Paradise Movie After A Long Time

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం మంచి జోరు చూపిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలోని యాక్షన్‌ సన్నివేశాలకు మాస్‌ ఆడియన్స్‌ నుంచి స్పందన కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలోనూ ఈ మూవీకి సంబంధించిన చర్చ కొనసాగుతోంది. 

సినిమా చూడబోతున్నా..
తాజాగా ‘ది ప్యారడైజ్‌’పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. శనివారం రాత్రి థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడనున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు రాత్రి థియేటర్‌లో సినిమా చూడబోతున్నా. నా అభిమాన నటుడు నాని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కలిసి రూపొందించిన ‘ది ప్యారడైజ్‌’ చూడబోతున్నా’ అంటూ కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

ఇక ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకర్‌ పాత్రలో ఆయన నటించారు. సవారీ తెగకు, శంకర్‌ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ స్వయంగా ‘ది ప్యారడైజ్‌’ చూడబోతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ‘రామాయణ’ ప్రమోషన్స్‌లో మిస్టర్‌ బీస్ట్‌..! ఇదేం ట్విస్ట్‌ బాస్‌..

 After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement