టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి భారీ షాక్‌ | TDP Leader Serious Comments On MLA Madhavi Reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డికి భారీ షాక్‌

Sep 26 2026 10:33 AM | Updated on Sep 26 2026 11:59 AM

TDP Leader Serious Comments On MLA Madhavi Reddy

సాక్షి, కడప: కడపలో అధికార టీడీపీలో రాజకీయ అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ నేత చెన్నంశెట్టి మురళీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ సవాల్‌ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల బలంతో గెలిచారని, ఇప్పుడు అదే కార్యకర్తలను పక్కనపెట్టి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘దమ్ముంటే ఈ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మీరు నిలబెట్టే అభ్యర్థులను గెలిపించుకోండి’ అంటూ ఎమ్మెల్యేకు సవాల్‌ చేశారు. దీంతో, టీడీపీ నేతల రాజకీయం చర్చనీయాంశంగా మారింది. 

గత రెండేళ్లలో కడప టీడీపీని నాశనం చేశారని ఆరోపిస్తూ చెన్నంశెట్టి మురళీ ఆడియో విడుదల చేశారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులను విస్మరించి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వెంట అసలైన టీడీపీ కార్యకర్త ఒక్కరూ లేరని వ్యాఖ్యానించారు. కడప కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మాధవిరెడ్డి గెలుపు కోసం పోరాడి, కేసులు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలను సైతం విస్మరించారని మురళీ ఆరోపించారు. చివరకు సొంత పార్టీ కార్యకర్తలపైనే దాడులకు దిగుతూ కేసులు పెట్టించడం దారుణమని అన్నారు.

మంత్రులను తీసుకొచ్చి ప్రచారం చేసినా, పోలీసుల అండతో.. రౌడీషీటర్ల సహకారంతో ఎన్నికలకు వెళ్లినా ఓటమి తప్పదని మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా మీ ఓటమి ఖాయం. ప్రస్తుతం ఎమ్మెల్యే మాధవి రెడ్డి కంటే వ్యతిరేక వర్గానికే అధిక బలం ఉందని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే ఇప్పుడు మీ సొంత బలంతో గెలవండి చూద్దాం అంటూ సవాల్‌ విసిరారు. కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కడప టీడీపీలోని అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి.

ఇదీ చదవండి: వరదల్లో ప్రజలు.. ఫారిన్‌ టూర్‌లో చంద్రబాబు ఫ్యామిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement