ప్రేమ పెళ్లిపై పగ.. కత్తులతో దాడి | Love Marriage Sparks Violent Clash In Visakhapatnam As Relatives Attack Groom’s Side, Injure 4 And SB Head Constable | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లిపై పగ.. కత్తులతో దాడి

Sep 26 2026 11:11 AM | Updated on Sep 26 2026 11:36 AM

 Visakhapatnam Love Marriage Incident

విశాఖపట్నం: భీమిలి మండలంలో ప్రేమ వివాహం ఘర్షణకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కక్షతో యువతి బంధువులు యువకుడి తరఫు వారిపై కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. గొడవను ఆపబోయిన ఒక స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) హెడ్‌ కానిస్టేబుల్‌పై కూడా దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే.. భీమిలి మండలంలోని మజ్జిపేటకు చెందిన గంగరాజు, తగరపువలస బంగ్లామెట్టకు చెందిన నీలిమ కొంతకాలంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని యువతి తరఫు బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో వివాదం పోలీసు స్టేషన్‌కు చేరింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి సీఐ దివాకర్‌ యాదవ్‌ వారికి సర్దిచెప్పి, గొడవలకు దూరంగా ఉండాలని హెచ్చరించి పంపించారు. 

అడ్డుకుని మరీ దాడి.. : పోలీస్‌ స్టేషన్‌ నుంచి గంగరాజు, అతని వర్గీయులు వెళుతుండగా.. మార్గమధ్యలో వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో యువతి నీలిమ వర్గీయులైన ఇంటి సతీ‹Ù, లావేటి వెంకటేష్, ఇంటి నర్సింగ్‌ మరికొందరితో కలిసి వారిని అడ్డుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.  ఈ దాడిలో సంపంగి ముత్యాలమ్మ (22), నీలాపు అప్పారావు (43), మీసాల బంగారయ్య (45), నీలాపు లక్ష్మి (35) తీవ్రంగా గాయపడ్డారు. 

హెడ్‌ కానిస్టేబుల్‌పై కూడా..  : అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) హెడ్‌ కానిస్టేబుల్‌ ఊడికల ఆనంద్‌ గొడవను చూసి ఆగి, వారిని వారించేందుకు ప్రయతి్నంచారు. అయితే దుండగులు హెడ్‌ కానిస్టేబుల్‌ అని కూడా చూడకుండా ఆయనపై విరుచుకుపడి తీవ్రంగా కొట్టడంతో పాటు, ఆయన సెల్‌ఫోన్లను పగులగొట్టారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

ఇదీ చదవండి: భార్యను చంపేసి.. పరుపులో చుట్టేసి..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement